టాలీవుడ్‌ హీరో హోటల్‌పై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కేసు నమోదు | GHMC Food Safety Officer Case File On Sundeep Kishan Hotel In Secunderabad, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌ హీరో హోటల్‌పై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కేసు నమోదు

Jul 10 2024 2:53 PM | Updated on Jul 10 2024 5:18 PM

GHMC Food Safety Officer Case File On Sundeep Kishan Hotel

జీహెచ్‌ఎంసీతో కలిసి రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లలో కొద్దిరోజులుగా తనిఖీలు జరుపుతున్నారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఇప్పటికే వందల సంఖ్యలో హెటల్స్‌ను పరిశీలించారు. పరిశుభ్రత, ఫుడ్‌ నాణ్యత లేని హోటల్స్‌కు జరిమానా విధించి నోటీసులు కూడా జారీ చేశారు.

ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్‌ హీరో సందీప్‌ కిషన్‌ రెస్టారెంట్‌ను ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. హైదరాబాద్‌లో ‘వివాహ భోజనంబు’ పేరుతో చాలా ఏళ్ల క్రితమే భాగస్వామ్యంతో ఒక రెస్టారెంట్‌ను సందీప్‌ ప్రారంభిచారు. సికింద్రాబాద్‌ బ్రాంచ్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా నాసిరకం పదార్ధాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో హోటల్‌పై అధికారులు కేసు నమోదు చేశారు.

హోటల్‌లో 2022 నాటికే గడువు ముగిసిన 25 కిలోల చిట్టి ముత్యాల రైస్ బ్యాగును  గుర్తించినట్లుఅధికారులు తెలిపారు.  సింథటిక్ ఫుడ్ కలర్స్‌ కలిపిన కొబ్బెరను కూడా వారు గుర్తించారు. ముందుగా తయారు చేసి ఉంచిన ఫుడ్‌ ఎక్స్‌పైరీ తేదీ లేకుండానే ఉంచారు. కిచెన్‌లో ఉన్న డస్ట్‌బిన్‌లకు ఎక్కడే కానీ మూతల లేవు. ఫుడ్‌ తయారు చేస్తున్న వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మెడికల్‌ రిపోర్ట్స్‌ లేవు. వంట తయారీ కోసం వారు ఏ నీరు ఉపయోగిస్తున్నారో తెలిపే రికార్డ్‌ అందుబాటులో లేదు. వంటపాత్రలను క్లీన్‌ చేసిన నీరు కూడా అక్కడే నిల్వ ఉండటం వంటి లోపాలను అధికారులు గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement