Food Safety Department
-
వంటగదిలో ఈగలు, బొద్దింకలు.. ‘నారాయణ’ సెంట్రల్ కిచెన్‌లో తనిఖీలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా కుంట్లూరులో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. నారాయణ విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్‌లో తనిఖీలు చేశారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. కుళ్లిపోయిన కూరగాయాలను వాడుతున్నట్లు గుర్తించారు. తప్పుపట్టిన కత్తులతో సిబ్బంది.. కూరగాయలను కట్ చేస్తున్నారు.కిచెన్‌లో ఈగలు, బొద్దింకలను అధికారులు గుర్తించారు. ఇక్కడి నుంచే సిబ్బంది.. ఫుడ్‌ను నారాయణ హాస్టల్‌కు సరఫరా చేస్తున్నారు. లైసెన్స్ లేకుండా ఫుడ్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నారాయణ సెంట్రల్ కిచెన్ నిర్వాహకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. -
ఏసీబీకి చిక్కిన ఫుడ్ సేఫ్టీ అధికారి కావ్యరెడ్డి..
ఏలూరు టౌన్: నాణ్యత లేని గోలి సోడాలు తయారు చేస్తున్నారనే ఆరోపణలతో యజమాని నుంచి లంచం డిమాండ్ చేసిన ఏలూరు ఫుడ్‌సేఫ్టీ అధికారి, ఆఫీస్ అటెండర్‌ను ఏలూరు అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏలూరు అభివృద్ధి నిరోధక శాఖ డీఎస్పీ వి.సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు మండలం కాట్లంపూడి గ్రామానికి చెందిన సాయి సుందర్ గోకుల్ అదే ప్రాంతంలో ఊప్స్ గోలీ సోడా కంపెనీ పేరుతో గోలీ సోడాను తయారు చేస్తున్నాడు. గోలి సోడా తయారీలో అధికంగా రసాయనాలు వినియోగిస్తున్నట్లు గుర్తించామనీ ఏలూరు ఫుడ్‌సేఫ్టీ అధికారి దొండపూడి కావ్యరెడ్డి, కార్యాలయ అటెండర్ పుల్లారావు గోకుల్‌కు ఫోన్ చేసి చెప్పారు. గోలీ సోడా విక్రయాలు సాఫీగా సాగాలంటే రూ.25 వేల లంచం డిమాండ్ చేశారు. ఎట్టకేలకు ఫుడ్‌సేఫ్టీ అధికారికి రూ.20 వేలు, సహాయకుడికి రూ.2 వేలు ఇచ్చేందుకు గోకుల్ సిద్ధపడ్డాడు. ఈ నేపథ్యంలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు డబ్బులు కోసం వేధించటంతో గోకుల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో లంచం సొమ్మును ఫుడ్‌సేఫ్టీ అధికారి డి.వెంకట కావ్య రెడ్డికి, అటెండర్ పులపా పుల్లారావుకు గోకుల్ కార్యాలయంలో అందించాడు. అప్పటికే అవినీతి నిరోధక శాఖ అధికారులు వల పన్ని ఉండటంతో వెంటనే వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఫుడ్‌సేఫ్టీ అధికారి కావ్యరెడ్డి, అటెండర్ పుల్లారావు నుంచి రూ.22 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫుడ్‌సేఫ్టీ అధికారి వినియోగిస్తున్న కారును తనిఖీ చేయగా లెక్కలు లేకుండా ఆరు కట్టలుగా కట్టి ఉన్న మరో రూ.87 వేల నగదును గుర్తించారు. మొత్తంగా రూ.లక్షా 9 వేల నగదును స్వా«దీనం చేసుకున్నారు. అలాగే ఫుడ్‌సేఫ్టీ అధికారి, అటెండర్ ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏలూరు ఏసీబీ డీఎస్పీ వీ.సుబ్బరాజు, సీఐలు ఎన్.బాలకృష్ణ, కే.శ్రీనివాస్, రాజమహేంద్రవరం ఏసీబీ అధికారి వాసుకృష్ణ ఉన్నారు. -
ఆ ఫుడ్.. సేఫ్టీనా?
‘హైదరాబాద్‌లోనే పేరున్న ఓ హోటల్ నుంచి తెచ్చిన చికెన్ బిర్యానీ పార్శిల్లో బొద్దింక.. మరో హోటల్లో బిర్యానీలో కనిపించిన జెర్రీ... ప్రసిద్ధి చెందిన ఓ హోటల్ కిచెన్‌లోని ఫ్రిజ్‌లో పాడైపోయిన చికెన్..సేంద్రియ పంటల నుంచి తయారు చేసే స్వీట్ల దుకాణంలో అపరిశుభ్ర వాతావరణం’... గత కొంతకాలంగా హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లోని హోటళ్లలో ఆహార ప్రియులకు వినిపిస్తున్న చేదు వార్తలు ఇవి.సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటవుతున్న హోటళ్లు, ఇతర ఫుడ్ సెంటర్లలో ఆహార తనిఖీలకు అవసరమైన సిబ్బంది లేకపోవడం, ఆహార పరీక్షలు జరిపే సదుపాయాలు మెరుగుపడకపోవడం వంటి కారణాలతో కొన్నేళ్లుగా ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు ఏమాత్రం శ్రద్ధ చూపలేదు.జీహెచ్ఎంసీతోపాటు అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు హోటళ్లకు ట్రేడ్ లైసెన్స్‌లు ఇవ్వడంపై చూపిన శ్రద్ధ ఆహార భద్రతపై పెట్టలేదు. రోడ్ల పక్కన గప్‌చుప్, మిర్చిబజ్జీలు, బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు ఇతర ఆహారం అందించే స్ట్రీట్ ఫుడ్ స్టాళ్లు హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాలు, నగరాల్లో విచ్చలవిడిగా వెలిశాయి. మధ్యాహ్నం, రాత్రి భోజనాలు కూడా రోడ్ల పక్కనే అందించే స్ట్రీట్ ఫుడ్ పాయింట్లు అయితే కోకొల్లలు. వీధుల్లోని ఫుడ్ సెంటర్లతోపాటు పేరున్న హోటళ్లలో సైతం నాణ్యత ప్రమాణాలతో ఆహారం అందించడం లేదని ఇటీవల తనిఖీలతో తేటతెల్లమైంది. ‘ఫుడ్ సేఫ్టీ ఆన్‌వీల్స్’ద్వారా రాష్ట్రవ్యాప్త తనిఖీలు ఆహార భద్రతపై వచ్చిన వందలాది ఫిర్యాదుల నేపథ్యంలో సీఎం రేవంత్, మంత్రి దామోదర రాజనర్సింహ ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్వీ.కర్ణన్‌ను ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌గా నియమించి ఆహార భద్రతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకొనే బాధ్యతను ఆయనకు అప్పగించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆహార తనిఖీ కోసం నాచారంలో ఒకే ల్యాబ్ ఉంది. అయితే కొత్తగా మూడింటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాచారం ల్యాబ్‌ను ఆధునీకికరించడంతోపాటు వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల కొత్తగా 24 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులకు వివిధ జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఐదు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటికి తోడు మరో పదింటిని రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నారు. ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’పేరిట ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏ) ప్రత్యేకంగా ఈ మొబైల్ యూనిట్లను అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వాహనాల్లో ఫుడ్ లే»ొరేటరీలను ఏర్పాటు చేసి, నగరం, పట్టణాల్లో రోజుకో ఏరియాలో మొబైల్ పరీక్షలు నిర్వహిస్తోంది. తద్వారా సంవత్సరానికి కనీసం 24 వేల ఆహార నమూనాలు పరీక్షించేలా లే»ొరేటరీలను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. దీనికోసం 10 మంది ల్యాబ్ టెక్నీíÙయన్లు, ఇతర సిబ్బందిని నియమించింది. జీహెచ్ఎంసీతోపాటు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండలో ఈ పది మంది ఇప్పటికే రంగంలోకి దిగారు. స్ట్రీట్ ఫుడ్స్, గప్‌చుప్ బండ్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల వద్ద ఎఫ్ఎస్ఎస్ఏ నిబంధనలకు అనుగుణంగా ఆహారం ఉందో లేదో పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
టీజీపీఎస్సీని భ్రష్టుపట్టించారు
సాక్షి, హైదరాబాద్: గత పాలకులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ను రాజ కీయ పునరావాస కేంద్రంగా మార్చి భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. అదే తాము ఉన్నత చదువులు చదివిన వారిని, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారిని టీజీపీఎస్సీలో నియమించామని చెప్పారు. ఏడాది ప్రజాపాలన విజయోత్స వాల్లో భాగంగా సోమవారం ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్ఎండీఏ మైదానంలో ఆరోగ్య ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో... సీఎం చేతుల మీదుగా 422 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్లకు, 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేశారు.16 నర్సింగ్ కళాశాలలను, 32 ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘గతంలో ఆర్ఎంపీ డాక్టర్‌ను, డిప్యూటీ తహసీల్దార్‌ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించారు. ఒక కలెక్టర్‌ను సెక్షన్ ఆఫీసర్, అటెండర్ నిర్ణయించలేరు కదా. అందుకే ఉన్నత చదువులు చదివిన వారిని, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారిని టీజీపీఎస్సీలో నియమించాం.టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలతో 563 మంది గ్రూప్–1 అధికారులు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు. టీజీపీఎస్సీ పనితీరుకు ఇది గీటురాయి. మహేందర్‌రెడ్డి పదవీ విరమణ చేస్తుంటే మూడున్నరేళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ సర్వేల్లో చదివిన సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను కమిషన్ చైర్మన్‌గా నియమించాం.రికార్డు స్థాయిలో నియామకాలు చేశాంఏడాదిలోనే 14 వేల మందిని వైద్యారోగ్య శాఖలో నియమించడం దేశంలోనే రికార్డు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది మెడికల్ కాలేజీలు ఇచ్చి ఎలాంటి వసతులూ కల్పించలేదు. కానీ మేం దేశంలోనే అత్యధిక డాక్టర్లను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. కొత్తగా 6,500 మందిని వైద్యారోగ్యశాఖలో నియమించాలని నిర్ణయించాం. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఒకే ఏడాది 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు.ఈ విషయంలో తెలంగాణ చరిత్ర సృష్టించింది. కేసీఆర్ ఇంట్లో వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తేనే తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చాయి. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్నపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్ముకునేవాళ్లు. డీఎస్సీ వాయిదా వేయాలని రాజకీయ ప్రేరేపిత ఆందోళన చేశారు. ఎవరు అడ్డుపడినా డీఎస్సీ పరీక్షలు నిర్వహించి 55 రోజుల్లో నియామక పత్రాలు అందించాం. తెలంగాణ యువత పట్ల మాకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేశారు2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి పేదలకు అపోలో, యశోదా వంటి కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించి ఆదుకున్నారు. అలాంటి ఆరోగ్యశ్రీని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచింది. గత ఏడాది కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.835 కోట్లను ప్రజలకు ఇచ్చి ఆదుకున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఇప్పటివరకు కోటీ 15 లక్షల సార్లు ఉచితంగా ప్రయాణం చేశారు. మేం 50లక్షల కుటంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా కచ్చితంగా ఇచ్చి తీరుతాం. మేం రుణమాఫీ పూర్తి చేయడంతో కొందరి గుండెల్లో పిడుగులు పడుతున్నాయి. కొందరు ఫాంహౌజ్‌లలో పడుకుని బాధపడుతున్నారు. మేం సన్నవడ్లకు ఇస్తున్న బోనస్‌తో కౌలు రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. వచ్చే పదేళ్లు మా ప్రభుత్వమే ఉంటుంది. బోనస్ కొనసాగిస్తుంది. సన్నాలు పండించండి. బోనస్ తీసుకోండి.ప్రభుత్వాన్ని మీరే కాపాడుకోండిసంక్రాంతి పండుగకు వచ్చే గంగిరెద్దులు, బసవన్నల్లా కొందరు ఇప్పుడే వస్తున్నారు. వాళ్లు ఎన్ని సన్నాయిలు ఊదినా.. అది సర్పంచి ఎన్నికల కోసమే. ఢిల్లీలో 11 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మాపై విమర్శలు చేస్తున్నాయి. ఈ 10 నెలల్లో అద్భుతాలు జరుగుతాయా? ప్రభుత్వాన్ని బదనాం చేసేవారికి కర్రు కాల్చి వాత పెట్టాలి. మీరు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీదే. ప్రభుత్వంపై జరుగుతున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలి..’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రజారోగ్యంపై మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది: భట్టిరాష్ట్రంలో పేదల ఆరోగ్యం కోసం చిత్తశుద్ధితో కృషి చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆరోగ్య ఉత్సవంలో ఆయన మాట్లాడారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందని.. ఆరోగ్యశ్రీని, ప్రభుత్వ ఆస్పత్రులను పట్టించుకోలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో పేదల వైద్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు.ఇక మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత వైద్య పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని.. అదనంగా రూ.487.29 కోట్లు నిధులు కేటాయించామని చెప్పారు. ట్రాన్స్జెండర్ల కోసం దేశంలోనే తొలిసారిగా మైత్రి క్లినిక్‌లను ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, షబ్బీర్ అలీ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
Telangana: ఇక ఫొటోలు తీసి తిన్నాకే.. పిల్లలకు వడ్డించాలి!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్‌పాయిజన్ ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అప్రమత్తమైంది. పాఠశాలలు, గురుకులాలు, అంగన్వాడీలలో.. ఆహార నాణ్యత పర్యవేక్షణ కోసం ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతకుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.సంక్షేమ హాస్టల్లో ఫుడ్ సేఫ్టీ పై ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ త్రీమెన్ కమిటీలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అడిషనల్ డైరెక్టర్, జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు ఉండనున్నారు. ఈ కమిటీలు తమ పరిధిల్లోని గురుకులాలు, వెల్ఫేర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ను పరిశీలిస్తారు. అలాగే.. విద్యా సంస్థల స్థాయిలో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ పేరిట కమిటీలను ఏర్పాటు చేశారు.ఈ కమిటీలో హెడ్మాస్టర్, స్కూల్ ప్రిన్సిపాల్స్‌తో పాటు మరో ఇద్దరు సిబ్బంది (టీచర్లు) సభ్యులుగా ఉంటారు. వీరు వంటకు ముందు స్టోర్ రూం, కిచెన్ పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే. ఎప్పటికప్పుడు వండిన పదార్థాలను ఫొటోలు తీసి ఉన్నతాధికారులకు పంపించాలి. వండిన ఆ పదార్థాలను వాళ్లు రుచి చూశాకే.. పిల్లలకు వడ్డించాలి. ఇకనుంచి.. పాఠశాలల్లో ఫుడ్ ఏర్పాట్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులు కచ్చితంగా సూపర్ వైజ్ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
HYD: హోటళ్లలో తనిఖీలు.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి
సాక్షి,హైదరాబాద్: హబ్సిగూడ, నాచారంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం(నవంబర్ 10) ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. హబ్సిగూడలోని సీసీఎంబీ క్యాంటీన్‌కు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేదని అధికారులు గుర్తించారు.కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు ఉన్నట్లు గుర్తించామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.ఎక్స్పైర్ అయిన పాడైన ఫుడ్ ఇంగ్రీడియెంట్స్‌తో వంట చేస్తున్నట్లు గుర్తించారు.దీంతో పాటు అపరిశుభ్రంగా ఉన్న నాచారంలోని మను కిచెన్ రెస్టారెంట్, శ్రీ సుప్రభాత హోటల్ కిచెన్లలోనూ తనిఖీలు చేశారు.కుళ్ళిపోయిన టమాటో, పొటాటోలను వంటకాల్లో ఉపయోగిస్తున్నారని తేలింది.వీటికి తోడు కాలం చెల్లిన పన్నీర్, మష్రూమ్‌లతో వంటల చేస్తున్నట్లు గుర్తించారు.ఇదీ చదవండి: HYD: హోటల్లో భారీ పేలుడు.. పక్కనున్న బస్తీలో ఎగిరిపడ్డ రాళ్లు -
స్వీటుతో చేటే!
సాక్షి,హైదరాబాద్: చిన్నాచితకా వాటి నుంచి పేరున్న బడా షాపుల దాకా ఒకటే తీరు. సాధారణ హోటల్ నుంచి స్టార్ హాటళ్ల వరకూ అదే వరస. ప్రజలు తినే తిండితో వ్యాపారం చేస్తున్న నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. చివరకు ప్రజలు శుభకార్యాల్లో, సంతోష సమయాల్లో తినే.. దీపావళి పండగ సందర్భంగా బంధుమిత్రులకు పంపిణీ చేసే స్వీట్స్ దాకా ఈ పరిస్థితిలో మార్పు లేదు. ప్రజలు ఎగబడి క్యూలు కట్టే దుకాణాల్లోనూ అదే పరిస్థితి. గత కొన్ని నెలలుగా ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నా, ఆయా దుకాణాల నిర్వాకాలు బట్టబయలవుతున్నా ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. ఒకసారి తనిఖీ చేసిన వాటిల్లోనూ తిరిగి అలాంటి ఘటనలే పునరావృతమవుతున్నాయంటే చర్యలపై వాటికి ఎంతటి లెక్కలేనితనం ఉందో అంచనా వేసుకోవచ్చు. డొల్లతనం వెల్లడైంది ఇలా.. 👉 జనసమ్మర్థం ఎక్కువగా ఉండే నగరంలోని అమీర్‌పేటలో కొన్ని స్వీటు ఫుడ్‌సేఫ్టీ అధికారులు బుధవారం నిర్వహించిన తనిఖీల్లో డొల్లతనం వెల్లడైంది. నిబంధనలు బేఖాతరు చేయడం దృష్టికొచ్చింది. కనీసం ట్రేడ్ లైసెన్సులు లేకుండా రిజి్రస్టేషన్లతోనే దర్జాగా వ్యాపారాలు నిర్వహిస్తుండటం తెలిసింది. ఆయా వివరాలను అధికారులు శుక్రవారం వెల్లడించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. 👉 నిబంధనల మేరకు ఆహార విక్రయ దుకాణాల్లో ప్రజలకు కనిపించేలా ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)సరి్టఫికెట్ ప్రదర్శించాల్సి ఉండగా, ‘ఆగ్రా స్వీట్స్’లో అది కనిపించలేదు. లైసెన్సు లేకుండానే కేవలం రిజి్రస్టేషన్ మాత్రం చేయించుకొని వ్యాపారం చేస్తుండటం దృష్టికొచ్చింది. డస్ట్బిన్లకు ఎలాంటి మూతలు లేకుండా కనిపించాయి. సిబ్బంది తలలకు క్యాప్, చేతులకు గ్లౌజ్‌లు, ఆప్రాన్స్ లేవు. 👉 సగం తయారైన వంటకాలు ఫ్రిజ్‌లో సవ్యంగా ఉంచకపోవడం, లేబుల్ లేకపోవడం కనిపించాయి. కొన్ని సరుకులు ఎక్స్పైర్ డేట్వి ఉండటం అధికారుల దృష్టికొచి్చంది. ‘ఢిల్లీ మిఠాయి వాలా’ దుకాణంలో సిబ్బంది మెడికల్ ఫిట్నెస్ సరి్టఫికెట్లు, నీటి విశ్లేషణ నివేదికలు లేవు. శిక్షణ పొందిన సూపర్వైజర్ లేకపోవడం గుర్తించారు. క్రిమి కీటకాలు చొరబడకుండా తలుపులు, కిటికీలకు ప్రూఫ్ స్క్రీన్స్ లేవు. నేలపై అడ్డదిడ్డంగా చక్కెర బ్యాగ్స్, స్టోర్‌రూమ్ ర్యాక్స్‌లో ఎలుక పెంటికలు, మూతలు లేని డస్ట్బిన్లు కనిపించాయి. హోమ్ ఫుడ్స్‌లోనూ అదే తంతు.. వాసిరెడ్డి హోమ్ ఫుడ్స్‌లో కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కనిపించలేదు. కేవలం రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకున్నట్లు గుర్తించారు. స్టోర్‌రూమ్‌లోని సిబ్బంది తలకు క్యాప్, చేతులకు గ్లౌజ్‌లు, ఆప్రాన్స్ లేకుండానే ఉండటాన్ని, సిబ్బంది మెడికల్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన సరి్టఫికెట్స్ కానీ, పెస్ట్ కంట్రోల్రికార్డులు కానీ లేకపోవడం అధికారుల దృష్టికొచి్చంది. తినడానికి సిద్ధంగా ఉన్న సేవరీలు, పచ్చళ్లకు, అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వాటికి లేబుళ్లు లేకపోవడాన్ని గుర్తించారు. ‘వినూత్న ఫుడ్స్’లోనూ దాదాపుగా అవే పరిస్థితులు. ఇక్కడ రిజిస్ట్రేషన్ సరి్టఫికెట్ సైతం గడువు ముగిసిపోయి ఉండటాన్ని గుర్తించారు. ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తున్నారో రికార్డులు లేవు. ఆహార పదార్థాలు నిల్వ ఉంచేందుకు తగిన స్టోరేజీ సదుపాయం కూడా లేకపోవడం గుర్తించారు. ఇలా.. ఎక్కడ తనిఖీలు జరిగినా లోపాలు బట్టబయలవుతున్నాయి. చర్యలు లేకే.. తగిన చర్యలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బయట తినే బదులు ఇంట్లో చేసుకునే చిక్కీ అయినా మేలని అంటున్నవారూ ఉన్నారు. ‘అయ్యో.. నేనెప్పుడు అక్కడే కొంటుంటాను. ఇకనుంచి మానేస్తాను’ అని సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తున్న వారూ ఉన్నారు. -
భారత్.. భూటాన్ మధ్య ఒప్పందం: ఎందుకంటే?
దేశ రాజధానిలో జరిగిన గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ సందర్భంగా.. భూటాన్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (BFDA)తో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో భారత్, భూటాన్ మధ్య ఆహార భద్రత అమలుకు సంబంధించిన ఒప్పందం జరిగిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం.. ఆహార భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా ఎఫ్ఎస్ఎస్ఏఐ, బీఎఫ్డీఏ మధ్య సాంకేతిక సహకారం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఆహార భద్రత, వాణిజ్య సౌలభ్యం విషయంలో భూటాన్‌తో మా భాగస్వామ్యంలో కీలకమైన అభివృద్ధిని సూచిస్తుందని.. ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈఓ జీ కమల వర్ధనరావు పేర్కొన్నారు. బీఎఫ్డీఏతో సన్నిహితంగా పనిచేయడం ద్వారా రెండు దేశాల ప్రయోజనాలకు ఉపయోగపడే బలమైన, సమర్థవంతమైన ఆహార భద్రత ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తున్నామని ఆయన అన్నారు.ప్రపంచ ఆహార భద్రతా ప్రమాణాలను నెలకొల్పడంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ నాయకత్వాన్ని అంగీకరించామని బీఎఫ్డీఏ డైరెక్టర్ జియెమ్ బిధా (Gyem Bidha) పేర్కొన్నారు. భారత్, భూటాన్ మధ్య సురక్షితమైన ఆహార వాణిజ్యాన్ని సులభతరం చేయడమే ఈ ఒప్పందం లక్ష్యమని అన్నారు.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!ఈ సమావేశానికి ఇరు దేశాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందులో భూటాన్ దేశానికీ చెందిన బీఎఫ్డీఏ డైరెక్టర్ జియెమ్ బిధా, బీఎఫ్డీఏ ఫుడ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ విభాగానికి చెందిన సీనియర్ అధికారులు ఉన్నారు. భారత్ నుంచి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా ఎఫ్ఎస్ఎస్ఏఐ సీనియర్ అధికారులు హాజరయ్యారు.India and Bhutan Deepen Cooperation on Food Safety and Regulatory StandardsThis Agreement underscores a mutual commitment to enhance food safety, aligning regulatory frameworks, simplifying the Food Import Procedure and fostering technical collaborationRead here:…— PIB India (@PIB_India) September 22, 2024 -
తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
-
ఆ ఫోటోలతో మాకు సంబంధం లేదు.. వాస్తవాలు తెలుసుకోండి: సందీప్ కిషన్
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్ ఫుడ్ సెప్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికారుల తనిఖీల్లో భాగంగా వివాహ భోజనంబు రెస్టారెంట్ నిబంధనలు పాటించలేదని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. గడువు ముగిసిన చిట్టిముత్యాలు రైస్ బ్యాగ్‌ను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే తమపై వస్తున్న దుష్ప్రచారాన్ని హీరో సందీప్ కిషన్ ఖండించారు. ఈ మేరకు ట్విటర్లో ఓ లేఖ విడుదల చేశారు. హెడ్‌లైన్స్ పెట్టేముందు వాస్తవాలు కూడా తెలుసుకోవాలని ఆయన సూచించారు.గత ఎనిమిదేళ్లుగా వివాహ భోజనంబు రెస్టారెంట్ పేరుతో మేము చాలా నమ్మకమైన సేవలు అందిస్తున్నామని సందీప్ కిషన్ రాసుకొచ్చారు. తమ హోటల్‌పై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవాలని అన్నారు. ముఖ్యంగా కొన్ని ఫోటోలు తమ కిచెన్‌కు సంబంధించినవి కావని అన్నారు. వేరే ఫోటోలు పెట్టి తమ కిచెన్ ఫోటోలుగా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.హోటల్లో 2022 నాటికే గడువు ముగిసిన 25 కిలోల చిట్టి ముత్యాల రైస్ బ్యాగ్ ఉన్నమాట నిజమే.. కానీ ఇప్పటివరకు సీల్ తీయలేదని సందీప్ కిషన్ తెలిపారు. అది కేవలం వెండర్ శాంపిల్ కోసం ఇచ్చిన రైస్ బ్యాగ్ అని వివరించారు. ఈ విషయాన్ని ఫుడ్ సెఫ్టీ అధికారులు ధ్రువీకరించారని అన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో వస్తున్న కిచెన్ ఫోటోలు మా రెస్టారెంట్‌కు సంబంధించినవి కాదని వెల్లడించారు. చిన్నచిన్న పొరపాట్లను గుర్తించి.. వాటిని సరిదిద్దుకోవాలని అధికారులు సూచించినట్లు వివరించారు. ఎప్పటిలాగే ఫుడ్ సేఫ్టీ, టేస్ట్ విషయంలో క్వాలిటీ ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని అన్నారు. Request my Dear Patrons to pls check facts before buying into the“Exaggerated Instant HeadLines Culture”We as Team #VivahaBhojanambu have built a Loyal clientele over 8 years with our Food & Sincerity,we would never take your love for granted ♥️*below facts can be verified pic.twitter.com/yiWt4UaDzL— Sundeep Kishan (@sundeepkishan) July 10, 2024 -
ఫుడ్ కల్తీ చేసే సంస్థల లైసెన్స్ రద్దు: మంత్రి దామోదర రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్జీవమైన ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను సమూల ప్రక్షాళన చేస్తున్నామని అన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. ఇదే సమయంలో దేశంలోనే ఫుడ్ సేఫ్టీ నిబంధనలను అమలు చేయడంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.కాగా, మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం 17 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించింది. దేశంలోనే ఫుడ్ సేఫ్టీ నిబంధనలను అమలు చేయడంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కొత్తగా 10 మొబైల్ ఫుడ్ లాబ్స్ లను త్వరలో ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. ఎంతో ఘన చరిత్ర ఉన్న నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబ్‌ను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. స్టేట్ ఫుడ్ ల్యాబ్‌ను బలోపేతం చేస్తున్నాం.రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ల్యాబ్స్ ద్వారా రోజువారీగా సుమారు 200 ఫుడ్ సేఫ్టీ టెస్టులను నిర్వహిస్తున్నాం. స్ట్రీట్ వెండర్లుకు ఫుడ్ సేఫ్టీ లైసెన్సు లు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. హోటల్స్, రెస్టారెంట్స్, ఆహార పదార్థాల తయారీ సంస్థల యాజమాన్యాల అసోసియేషన్ ప్రతినిధులతో ఫుడ్ సేఫ్టీపై రాష్ట్ర సచివాలయంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించాం. ఆహార పదార్థాలు సరఫరా చేసే సంస్థలు తప్పని సరిగా FSSAI లైసెన్స్‌ను తీసుకోవాలనే నిబంధనలను అమలు చేస్తున్నాం.ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో బోర్డింగ్ హాస్టల్స్, క్యాంటీన్లలను నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 387 హాస్టల్స్ పైన తనిఖీలు నిర్వహించి Fssai లైసెన్సులు విధిగా కలిగి ఉండాలని ఆదేశాలు జారీ చేశాం. ఫుడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి పరీక్షలు నిర్వహించి ఆహార నాణ్యత ప్రమాణాలు పెంచేలా చర్యలు తీసుకున్నాం. ఆహారం కల్తీ చేసే సంస్థల లైసెన్స్‌లను రద్దు చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. -
టాలీవుడ్ హీరో హోటల్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు
జీహెచ్ఎంసీతో కలిసి రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లలో కొద్దిరోజులుగా తనిఖీలు జరుపుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే వందల సంఖ్యలో హెటల్స్ను పరిశీలించారు. పరిశుభ్రత, ఫుడ్ నాణ్యత లేని హోటల్స్‌కు జరిమానా విధించి నోటీసులు కూడా జారీ చేశారు.ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. హైదరాబాద్‌లో ‘వివాహ భోజనంబు’ పేరుతో చాలా ఏళ్ల క్రితమే భాగస్వామ్యంతో ఒక రెస్టారెంట్‌ను సందీప్ ప్రారంభిచారు. సికింద్రాబాద్ బ్రాంచ్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా నాసిరకం పదార్ధాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో హోటల్‌పై అధికారులు కేసు నమోదు చేశారు.హోటల్లో 2022 నాటికే గడువు ముగిసిన 25 కిలోల చిట్టి ముత్యాల రైస్ బ్యాగును గుర్తించినట్లుఅధికారులు తెలిపారు. సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన కొబ్బెరను కూడా వారు గుర్తించారు. ముందుగా తయారు చేసి ఉంచిన ఫుడ్ ఎక్స్పైరీ తేదీ లేకుండానే ఉంచారు. కిచెన్‌లో ఉన్న డస్ట్బిన్లకు ఎక్కడే కానీ మూతల లేవు. ఫుడ్ తయారు చేస్తున్న వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ లేవు. వంట తయారీ కోసం వారు ఏ నీరు ఉపయోగిస్తున్నారో తెలిపే రికార్డ్ అందుబాటులో లేదు. వంటపాత్రలను క్లీన్ చేసిన నీరు కూడా అక్కడే నిల్వ ఉండటం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. 𝗩𝗶𝘃𝗮𝗵𝗮 𝗕𝗵𝗼𝗷𝗮𝗻𝗮𝗺𝗯𝘂, 𝗦𝗲𝗰𝘂𝗻𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱08.07.2024* FSSAI license true copy was displayed at the premises.* Chittimutyalu Rice (25kg) was found with Best Before date as 2022 and 500gms of Coconut Grates found with synthetic food colours. Stock has been… pic.twitter.com/yY5yWkknk1— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) July 10, 2024 -
పానీపూరి.. రోగాల దారి!
భాగ్యనగరంలో నిత్యం చిన్నారులు మొదలు విద్యార్థులు, పెద్దల దాకా లాగించే స్ట్రీట్ ఫుడ్ గోల్గప్పా. అదేనండి.. పానీపూరీ లేదా గప్‌చుప్. పానీపూరీలకు మధ్యలో చిల్లు పెట్టి.. ఉడికించిన ఆలూ, కాబూలీ చెనా దట్టించి.. ఆపై పుదీనా, చింతపండు, మసాలా కలగలిపిన నీటిలో ముంచి ఇస్తుంటే మనోళ్లు గుటుక్కుమనిపిస్తుంటారు. దాని రుచికి ఫిదా అవుతూ వహ్వా అంటుంటారు. గల్లీగల్లీలో కనిపించే పానీపూరీ బండ్ల వద్ద ఈ టేస్టీ ఎక్స్పీరియన్స్ కోసం క్యూలు కూడా కడుతుంటారు.కానీ కొందరు పుదీనా నీటిలో కలిపేకృత్రిమ రంగులు, పూరీల తయారీకి వాడే నూనెల వల్ల అనారోగ్యం పాలవుతారని వైద్యులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే ఇటీవల తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పానీపూరీ నమూనాలను పరీక్షించగా వాటిల్లో కేన్సర్కారక పదార్థాలు ఉన్నట్లు తేలింది. దీంతో పానీపూరీల వినియోగంపై నిషేధం విధించాలని ఆ రాష్ట్రాలు యోచిస్తున్నాయి.సాక్షి, హైదరాబాద్పానీపూరీల తయారీలో వాడే పదార్థాలు ఎలా ఉన్నా.. చాలా మంది పరిశుభ్రమైన వాతావరణంలో వాటిని తయారు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సైతం అప్పుడప్పుడూ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కలుషితమైన నీటినే కొందరు చిరువ్యాపారులు వినియోగిస్తున్నారు. అలాంటి నీటిలో ఈ–కొలి వంటి బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు, ఇతర రోగకారకాలు ఉంటాయి. అలాంటి నీటిని పానీపూరిలో వాడితే ఇక మన ఆరోగ్యం అంతే సంగతులు.ఎసిడిటీ.. అల్సర్లు..!పానీపూరీ అంటే ఎంత ఇష్టమైనా అతిగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తరచూ పానీపూరీ లాగించే వారిలో గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఎసిడిటీ, అల్సర్ వంటి జబ్బులు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వస్తున్నట్లు చెబుతున్నారు. దీనివల్ల టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు కూడా ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.వర్షాకాలంలో జాగ్రత్త..అసలే వర్షాకాలం.. ఇంట్లో తాగే నీటి విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కలరా, డయేరియా వంటి అనారోగ్యాలు చుట్టుముడతాయి. అలాంటిది ఏ నీటిని వాడారో తెలియని పానీపూరీ బండ్ల వద్ద తిని ఏరికోరి అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం ఎందుకని వైద్యులు ప్రశి్నస్తున్నారు. ఎందుకంటే.. సాధారణంగా చిరువ్యాపారులు ఎక్కడా చేతులకు గ్లౌజులు తొడుక్కోరు. ఒక చేత్తో పొయ్యిపై ఆలూ, శనగలను ఉడకబెడుతూనే అదే చేత్తో ఉప్పు, కారం, మసాలాలు చల్లుతూ పక్కనుండే ఓ నీటి గిన్నెలో చేతులు కడుగుతుంటారు. ఆపై అదే చేత్తో పానీపూరీలను మసాలా నీటిలో ముంచి అందిస్తుంటారు. టీబీ వచ్చే చాన్స్..అపరిశుభ్ర వాతావరణంలో తయారైన ఆçహార పదార్థాలు, పరిసరాల వల్ల క్షయ వ్యాధి వచ్చే ప్రమాదమూ ఉంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధకులు కూడా చెబుతున్నారు. అపరిశుభ్ర ప్రదేశాల్లో ఉండే బ్యాక్టీరియాలు శోషరస గ్రంథుల్లోకి (లింఫ్ ఎడినైటిస్) చేరితే క్షయ వ్యాధి (ఎక్స్ట్రా పల్మొనరీ) సోకే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. మెనింజైటిస్ వచ్చే ప్రమాదంపానీపూరీలో ఎలాంటి నీళ్లు వాడుతారో తెలియదు. కలుషితమైన నీటిలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఉండే అవకాశం ఉంది. ఇటీవల కేరళలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. దీంతో మెనింజైటిస్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువగా చిన్న పిల్లల్లో వస్తుంది. ఇది చాలా ప్రాణాంతక వ్యాధి. – డాక్టర్ నాజ్నీన్ తబస్సుమ్ఇంట్లో చేసుకుంటే మేలు.. పానీపూరీ అంటే ఇష్టమున్నా బయట తింటే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని బాధపడుతున్నారా? అయితే ఎంచక్కా ఇంట్లోనే రుచిగా, శుచిగా తయారు చేసుకోండి. ఇందుకు అవసరమయ్యే పదార్థాలన్నీ దుకాణాల్లో దొరుకుతాయి. వాటిని ఎలా తయారు చేయాలో యూట్యూబ్ వీడియోల్లో చూసి నేర్చుకొని ఇంట్లోనే ఎంచక్కా తయారు చేసుకుంటే చాలు. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. మార్కెట్లోకి ఆటోమేటిక్ పానీపూరి డిస్పెన్సర్లు.. ఇటీవల కాలంలో చాలా ప్రాంతాల్లో ఆటోమేటిక్ పానీపూరి డిస్పెన్సర్లు అందుబాటులోకి వచ్చాయి. వెండింగ్ మెషీన్ లాంటి ఈ డిస్పెన్సర్లలో మనం డబ్బు చెల్లిస్తే చాలు పానీపూరి ఆటోమేటిక్‌గా మనం తీసుకుని ఎంజాయ్ చేయొచ్చు. దీనివల్ల కొంతలో కొంత కలుíÙతం కాకుండా ఉంటుంది. కాకపోతే అందులో డిస్టిల్డ్ వాటర్ వాడితే ఎలాంటి సమస్యలు రావని చెబుతున్నారు. గోబీ మంచూరియాపై నిషేధం.. గోబీ మంచూరియాపై ఇప్పటికే దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాలు నిషేధం విధించాయి. గోబీ మంచూరియాను గోవా, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక బ్యాన్ చేశాయి. టార్ట్రజైన్, కార్మోసిన్, సన్‌సెట్ యెల్లో, రోడమైన్ అనే రసాయనాలను గోబీ మంచూరియా తయారీలో వాడుతున్నారని, అవి తీవ్ర అనారోగ్య సమస్యలు తీసుకొస్తాయని గుర్తించారు. గోబీ మంచూరియాతోపాటు పీచు మిఠాయిని కూడా ఆయా రాష్ట్రాలు నిషేధించాయి. వాటిల్లో వాడే రసాయనాలు చిన్నారుల్లో అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయని చెబుతున్నారు. రుచి కాదు.. శుచి ముఖ్యం.. పానీపూరి బండ్లు కొన్ని చోట్ల అపరిశుభ్రమైన వాతావరణంలో ఉంటాయి. చేతులు కడగకుండానే ఇస్తుంటారు. వాటినే చాలామంది రుచిగా తింటారు. అయితే రుచి కాదు.. శుచి ముఖ్యం.. ఈ మధ్య చిన్నపిల్లలు, కాలేజీ విద్యార్థులు ఇష్టంగా తినే మెనూలో పానీపూరి ఉండటం బాధాకరం. – వేణుగోపాల్, బ్యాంకు ఉద్యోగి, ఉప్పల్దుమ్ము, ధూళి వాటిపైనే..పానీపూరీ చాలామంది తింటుంటారు. అందులో వాడే నీరు ఎలాంటిదో ఎవ్వరికీ తెలియదు. పైగా.. ప్లాస్టిక్ ఫోమ్ ప్లేట్లు వాడుతుంటారు. వాటి మీద వేడి పదార్థాలు వేస్తే.. రసాయనాలు కరిగి.. ఆరోగ్య సమస్యలు తెస్తుంటాయి. ఆ బళ్లు కూడా రోడ్ల పక్కనే ఉంటాయి. దుమ్ము, ధూళి వాటిపై పడి కలుషితం చేస్తాయి. – సురేశ్ బొల్లేపల్లి, అంబర్‌పేట -
తెల్లనివన్నీ పాలు కాదు!
తెల్లనివన్నీ పాలు కాదు.. పాలు అనుకుని మనం తాగుతున్నవన్నీ అచ్చమైన పాలు కానే కాదు.. కుళాయి నీళ్ల నుంచి యూరియా, ఇతర రసాయనాల దాకా ఏవేవో కలిపిన కల్తీ పాలు.. నకిలీ పాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పెరిగిపోయి.. పాడి పశువుల పెంపకం తగ్గిపోయి.. పాల ఉత్పత్తి పడిపోతోంది. నగరంలో డిమాండ్‌కు, సరఫరాకు మధ్య భారీగా వ్యత్యాసం ఏర్పడుతోంది. దీనితో కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కి.. కల్తీ, నకిలీ పాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.సాక్షి, రంగారెడ్డి జిల్లా : గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాలకు కలిపి రోజుకు సగటున 28 లక్షల లీటర్ల పాలు అవసరమని అంచనా. ఇందులో 22 లక్షల లీటర్లు పాల ప్యాకెట్ల రూపంలో సరఫరా అవుతున్నాయి. డెయిరీ రైతులు, డబ్బావాలాలు, ఇతర వ్యాపారులు నేరుగా మరో ఆరు లక్షల లీటర్లు విక్రయిస్తున్నారు. ఇందులో పెద్ద సంఖ్యలో రెండు, మూడు లక్షల లీటర్ల మేర కల్తీ చేసినవో, కృత్రిమంగా తయారు చేసినవో ఉంటున్నాయని అంచనా. ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు ఇటీవల చేవెళ్ల, నందిగామ, ఆల్మాస్‌గూడ, నాదర్గుల్, ముచ్చింతల్, పసుమాములలోని పలు ప్రైవేటు డెయిరీల నుంచి నమూనాలు సేకరించి.. పరిశీలించగా అక్రమాలు వెలుగుచూశాయి. నిర్దేశించిన ప్రమాణాల మేరకు పాలు లేకపోవడంతో ఆయా డెయిరీల యజమాన్యాలకు నోటీసులు కూడా జారీ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు.. బీర్ దాణా » పాలకు డిమాండ్ నేపథ్యంలో కొందరు డెయిరీల నిర్వాహకులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు అడ్డగోలు మార్గం పడుతున్నారు. అధిక పాల దిగుబడి కోసం గేదెలు, ఆవులకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ప్రమాదకరమైన ‘బీర్ దాణా’ తాగిస్తున్నారు. దీనికితోడు పాలలో పాలపొడి, కుళాయి నీళ్లు, రసాయనాలు కలుపుతూ కల్తీ చేస్తున్నారు. ఆ పాలు నాసిరకంగా, రుచి లేకుండా ఉంటున్నాయి. పెరుగు తోడుకోకపోవడం, తోడుకున్న పెరుగు కూడా సాయంత్రానికే దుర్వాసన వెదజల్లుతుండటం వంటివి జరుగుతున్నాయి. ఇదీ పాడి లెక్క » ఒకప్పుడు సిటీలో వాడే పాలలో చాలా వరకు శివారు జిల్లాల్లోని వ్యక్తిగత డెయిరీల నుంచే సరఫరా అవుతుండేవి. ప్రస్తుతం వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఆవులు, గేదెల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం మేడ్చల్ జిల్లాలో 27,068 గోజాతి, 59,895 గేదె జాతి పశువులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 1,88,182 గోజాతి, 1,22,587 గేదె జాతి పశువులు ఉన్నాయి.వీటిలో 1,25,246 ఆవులు, గేదెలు మాత్రమే పాలు ఇస్తున్నట్టు గుర్తించారు. వాటి నుంచి రోజుకు సగటున 5,56,055 లీటర్ల పాల దిగుబడి వస్తుండగా.. అందులో 43,688 లీటర్లు రైతులు సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. 97,998 లీటర్లు ప్రభుత్వ డెయిరీలకు విక్రయిస్తున్నారు. మరో 1,80,382 లీటర్ల పాలను స్వయంగా ఔట్లెట్లు తెరిచి విక్రయిస్తున్నారు.ఇంటింటా తిరిగి పాలు పోసే డబ్బావాలాలు మరో 1,27,965 లీటర్ల మేర అమ్ముతున్నారు. ప్రైవేటు డెయిరీలు 1,60,556 లీటర్లు విక్రయిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ సరిహద్దు జిల్లాల నుంచి కూడా నగరానికి పాలు దిగుమతి అవుతున్నాయి.కృత్రిమంగా పాలు తయారు చేస్తూ.. »ఇటీవల రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తి మేడిపల్లికి చెందిన ఓ పాడి రైతు ఇంటిపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. కృత్రిమంగా తయారు చేసి, అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 120 లీటర్ల కృత్రిమ పాలు, పది పాల పౌడర్ ప్యాకెట్లను స్వా«దీనం చేసుకుని కేసు కూడా నమోదు చేశారు.» పాశమైలారానికి చెందిన ఓ వ్యాపారి.. స్థానికంగా మూతపడ్డ ఓ పరిశ్రమను అద్దెకు తీసుకుని, గుట్టుగా కల్తీ పాలు తయారు చేయడం మొదలుపెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఓ ప్రముఖ డెయిరీ లేబుళ్లతో కల్తీ పాలు, పెరుగు, ఇతర పాల పదార్థాలు విక్రయిస్తున్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. పాల స్వచ్ఛతను గుర్తించొచ్చు ఇలా..» స్వచ్ఛమైన పాలు 0.55 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గడ్డకడతాయి. ఒకవేళ అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద గడ్డకడితే అందులో నీళ్లు కలిశాయని అర్థం.» లాక్టోమీటర్ సాయంతో పాలలోని కొవ్వు, ఇతర ఘనపదార్థాలు ఎంత శాతం ఉన్నాయో గుర్తించవచ్చు.» పాలను వేడి చేసినప్పుడు వచ్చే ఆవిరి.. మూతపై నీటిలా ఏర్పడితే సరే. అలాకాకుండా స్పటికాల్లా ఏర్పడితే యూరియా కలిసి ఉండే చాన్స్ ఎక్కువ. » స్వచ్ఛమైన పాలను నున్నటి తలంపై వేస్తే.. అది పారినంత మేర తెల్లటి చార ఏర్పడుతుంది. అలా చార ఏర్పడకుంటే.. నీళ్లు ఎక్కువగా కలిసినట్టే.»వేడి చేసినప్పుడు పాలపై పసుపు రంగులో మీగడ ఏర్పడటం, పెరుగు సరిగా తోడుకోకపోవడం జరిగితే.. అందులో వనస్పతి కలిసి ఉన్నట్టే.»పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ కలుపుతుంటారు. అలాంటి పాలను మరిగించి, తోడు వేస్తే పెరుగు సరిగా ఏర్పడదు. అంతా నీళ్లలా కనిపిస్తుంది.పాలలో ఎన్నో రసాయనాలు కలుపుతున్నారు.. » పాడి పశువుల సంఖ్య తగ్గి, పాలలో కల్తీ పెరిగింది. నీళ్లు కలిపితే పెద్దగా నష్టం లేదు. కానీ పాలు చిక్కగా కనిపించేందుకు కార్న్‌ఫ్లోర్.. వెన్నశాతం కోసం యూరియా, వనస్పతి వంటివి కలుపుతున్నారు. పాలు విరిగిపోకుండా ఉండేందుకు డిటర్జెంట్స్, తినే సోడా, అమ్మోనియం సల్ఫేట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, రుచి మారకుండా ఉండేందుకు బోరిక్ యాసిడ్ కలుపుతున్నారు. అలాంటి పాలు తాగడం ప్రమాదకరం. అయోడిన్ సొల్యూషన్‌తో పాలను పరీక్షించడం ద్వారా పిండి పదార్థాలు కలిపారా? రెడ్ లిట్మస్ పేపర్ ద్వారా యూరియా కలిపారా గుర్తించొచ్చు. – ఎన్.రాజు, రసాయన శాస్త్రవేత్త ఆ పాలు తాగితే అనారోగ్యమే.. » కొందరు పాల విక్రేతలు, చిన్న డెయిరీల నిర్వాహకులు పాల కల్తీకి పాల్పడుతున్నారు. ప్యాకెట్ పాలను నమ్మకుండా.. బయట కొనేవారి బలహీనతను ఆసరాగా చేసుకుని అక్రమ మార్గం పడుతున్నారు. అపరిశుభ్ర పరిస్థితులతో.. వాటిలో ఈ–కొలి వంటి ప్రమాదకర బ్యాక్టీరియా చేరుతోంది. సరిగా మరిగించకుండా తాగితే రోగాల బారినపడటం ఖాయం. రసాయనాలు కలిపిన పాలు వాడితే అనారోగ్యమే. – డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి, సీనియర్ సర్జన్ (రిటైర్డ్) సబ్ స్టాండర్డ్ కేసులే.. » ప్రైవేటు డెయిరీల నిర్వాహకులు సరఫరా చేసే పాలు, ప్యాకెట్ పాల నాణ్యతా ప్రమాణాలను తరచూ పరిశీలిస్తున్నాం. చాలా వరకు సబ్ స్టాండర్డ్ (వెన్నశాతం, నాణ్యతలో తేడాలు)గా గుర్తించారు. ప్రమాదకర స్థాయిలో ఏమీ దొరకలేదు. ఇక కృత్రిమ పాల తయారీ కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి, కేసులు నమోదు చేస్తున్నారు. – ఉదయ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, రంగారెడ్డి జిల్లా -
వైద్య శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖతో పాటు అనుబంధ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పలు రకాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించిందని, ఇంకా అవసరమైన మేరకు అనుమతులు జారీ చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎంఐడీసీ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), బ్లడ్‌బ్యాంక్‌లు, ఎఫ్ఎస్ఎస్ఏఐ యాక్ట్ అమలు తదితరాలపై సంబంధిత అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫుడ్ సేఫ్టీపై నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించడం వల్ల నాణ్యమైన ఆహారం అందించడంలో దేశంలోనే తెలంగాణకు ఉత్తమ రాష్ట్రంగా గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని వసతి గృహాలు, క్యాంటీన్లతో పాటు అన్ని ఆసుపత్రులలో ఉన్న క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీపై నిరంతర పర్యవేక్షణ, నిఘా పెట్టాలని పేర్కొన్నారు. విద్యాసంస్థలతో పాటు ఆసుపత్రుల్లో ఉన్న క్యాంటీన్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌లు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహించాలని, ఫుడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు. నాచారంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను బలోపేతం చేయడంతో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల తదితరులు పాల్గొన్నారు. -
వెలుగులోకి అసలు నిజాలు..!
-
సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్: ‘టీ’తో పాటు పాడైపోయిన మటన్‌తో బిర్యానీ..
సాక్షి, సికింద్రాబాద్: నగరంలో పలు హోటల్స్‌లో టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్లో తనిఖీల్లో భాగంగా నాసిరకంగా ఉన్న ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో హోటల్‌పై కేసు నమోదు చేసి లక్ష రూపాయలు జరిమానా విధించారు అధికారులు.కాగా, ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం రాత్రి ఆల్ఫా హోటల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అపరిశుభ్రత, నాసిరకం ఆహార పదార్థాలను వాడుతున్నట్టు గుర్తించారు. కిచెన్‌లో దారుణ పరిస్థితులను(అపరిశుభ్రత) వెలుగులోకి తెచ్చారు. అలాగే, పాడైపోయిన మటన్‌తో బిర్యానీ తయారు చేస్తున్నట్టు తనిఖీల్లో గుర్తించారు. ఇక, తయారు చేసిన ఫుడ్‌ను ఫ్రిడ్జ్‌లో పెట్టి కస్టమర్లకు అందిస్తున్నట్టు తెలిపారు. Task force team has conducted inspections in Secunderabad area on 18.06.2024. 𝗔𝗹𝗽𝗵𝗮 𝗛𝗼𝘁𝗲𝗹, 𝗦𝗲𝗰𝘂𝗻𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱* Improper storage of raw meat & semi prepared food articles in refrigerator with possibility of cross-contamination. * Unhygienic conditions like… pic.twitter.com/E0wFyoHUGy— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) June 19, 2024 హోటల్లో తయారు చేసే బ్రెడ్‌తో పాటుగా ఐస్‌క్రీమ్, టీ పౌడర్ కూడా నాసిరకంగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో, ఆల్ఫా హోటల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు.. కేసు నమోదు చేసి లక్ష రూపాయల జరిమానా విధించారు. 𝗛𝗼𝘁𝗲𝗹 𝗦𝗮𝗻𝗱𝗮𝗿𝘀𝗵𝗶𝗻𝗶, 𝗦𝗲𝗰𝘂𝗻𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱18.06.2024* Improperly labelled Jaggery cubes (9kg), Paratha packets (10pkts), Expired Noodles packets (2pkts) were seized.* Food articles stored inside refrigerator were covered but not labelled properly.* FSSAI… pic.twitter.com/2aNO4o2ob3— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) June 19, 2024 మరోవైపు, సికింద్రాబాద్‌లోని సందర్శిని హోటల్లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎక్స్పైరీ అయిన నూడుల్ ప్యాకెట్స్, అపరిశుభ్రంగా ఉన్న పదార్థాలను గుర్తించారు. అలాగే, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్లో సోదాలు చేయగా అక్కడి కిచెన్‌లో దారుణ పరిస్థితులను గుర్తించారు. కిచెన్‌లో ఎలుకలు తిరుగుతున్న దృశ్యాలను చూసి అధికారులు విస్తుపోయారు. ఈ సందర్భంగా బార్ యాజమాన్యంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 𝗥𝗮𝗷 𝗕𝗮𝗿 & 𝗥𝗲𝘀𝘁𝗮𝘂𝗿𝗮𝗻𝘁, 𝗦𝗲𝗰𝘂𝗻𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱18.06.2024* The FSSAI license copy displayed at the premises was found to have expired on 05.06.2018 and no valid FSSAI l koicense available with the FBO.* Rat was observed near dustbin area. No rat traps… pic.twitter.com/BA7XLU4JjZ— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) June 19, 2024 -
ఆహార ప్రియులకు అలర్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లలో బయటపడ్డ లోపాలు
సాక్షి, ఖమ్మం: ఆహార ప్రియులకు, బిర్యానీ లవర్స్‌కు అలెర్ట్. వారం మొత్తం కష్టపడి వీకెండ్లో ఫ్యామిలితో రెస్టారెంట్లకు,హోటళ్ళకు వెళ్ళి తింటున్నారా.. ఐతే కొంచెం జాగర్తండోయ్.. కొందరికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం. మరికొందరికి చికెన్ కబాబ్స్ అంటే మరీ లొట్టలేసుకుంటూ లాగించేస్తుంటారు. కానీ అవే ఆహార పదార్ధాలు వారాల కొద్దీ నిల్వ ఉంచి మీకు పెడుతున్నారంటే నమ్ముతారా.. ఇది ముమ్మాటికీ నమ్మలేని నిజమే అని చెప్పాలి. కావాలంటే ఒక్కసారి ఖమ్మం జిల్లాకు వెళ్ళి చూసొద్దాం రండి. రెస్టారెంటుకు వెళ్ళి డిమ్ లైటింగ్‌లో కూర్చుని వేడి వేడి బిర్యాని, దానికి తగ్గట్టుగా చికెన్ లాలిపప్స్.. చికెన్ 65, చికెన్ కబాబ్స్ తింటుంటే ఉంటుంది. చెబుతుంటేనే నోరూరిపోతుంది కదా. చికెన్, మటన్, ప్రాన్స్, ఇలా ఎన్నోరకాల వంటలు రెస్టారెంట్లలో,హోటళ్ళలో దొరుకుతాయి. కానీ తస్మాత్ జాగ్రత్త.. అదే ఆహారం విషంగా మారితే మీ పరిస్థితి ఏంటి?. ఇంటికి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వచ్చినా మనం ఏం చేస్తుంటా అలా రెస్టారెంటుకు వెళ్ళి బిర్యానీ తినాలి అనుకుంటాం అలాంటప్పుడు ఎక్కువగా ఫేమస్ రెస్టారెంట్లవైపే మొగ్గు చూపుతుంటాం. ఎందుకంటే పది రూపాయలు ఎక్కువైన సరే ఫుడ్ రుచితో పాటు శుభ్రత, నాణ్యతా ప్రమాణాలు కూడా పాటిస్తారని.. అందులో తింటే ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం ఉండదన్న గట్టి నమ్మకంఅయితే ఆ గట్టి నమ్మకం కాస్త ఇప్పుడు గుడ్డి నమ్మకమని ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో తేలిపోయింది. రుచికి, శుభ్రతకు పెట్టింది పేరు అంటూ ఊదరగొట్టే పెద్ద పెద్ద పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్ల బండారాలు బయటపడుతున్నాయి. కుళ్లిపోయిన మాంసం, ఎక్స్పైరీ డేట్ దాటిన ప్రొడక్ట్స్, కల్తీ మసాలాలు, ఏమాత్రం నాణ్యత లేని పదార్థాలను వాడటమే కాక.. అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్టు సోదాల్లో అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించడం లేదని అధికారులు వెల్లడించారు. అయితే ఇలాంటి పరిస్థితులు ఒకటో రెండో రెస్టారెంట్లలో కాదండోయ్. నగరంలో ఫేమస్ అయిన చాలా రెస్టారెంట్లలో ఇదే సీన్ కనిపించటం ఆందోళనకరం.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పేరున్న రెస్టారెంట్లు, హోటళ్లలో ఫ్రీజర్‌లో దాచిన చికెన్ కబాబ్స్, ప్లాస్టిక్ బకెట్లలో మ్యారినేట్ చేసిన చికెన్, బ్యాచ్ నంబర్ లేని మసాలా ప్యాకెట్లు, మ్యానిఫ్యాక్చరింగ్ గడువు లేని పసుపు, ఎక్స్పైరీ డేట్ దాటిన సరుకులు, రూల్స్ అతిక్రమించి పామాయిల్ వినియోగం...ఇలా పలు లోపాలను, మోసాలను గుర్తించారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ఫుడ్‌సేఫ్టీ కంట్రోల్ ఆఫీసర్ జ్యోతిర్మయి టాస్క్‌ఫోర్స్ టీమ్‌తో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు.హోటల్లో తనిఖీల సందర్భంగా సిబ్బంది ఎవరికీ హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవని తెలుసుకున్నారు .నాణ్యత లేని ఆహార పదార్థాలు సీజ్ చేశారు. శాంపిల్స్‌ను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. ఓ హోటల్లో ఫ్రీజర్‌లో నిల్వ చేసిన 12 కిలోల చికెన్ కబాబ్స్‌ను గుర్తించిన అధికారులు, వాటిని రూల్స్ ప్రకారం మున్సిపల్ సిబ్బందికి అప్పగించాల్సి ఉండగా.. అక్కడే డ్రైనేజీలో పారబోయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిర్వాహకులు చపాతి, పరోటా పిండిని కలిపి ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచారు. చికెన్ ధమ్ బిర్యానీ కోసం మ్యారినేట్ చేసిన చికెన్‌ను ప్లాస్టిక్ బకెట్లో నిల్వ చేశారు. దీంతో మ్యారినేట్ చేసిన చికెన్‌ను కూడా బయటపడేయించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉంచడంపై అధికారులు ఫైర్ అయ్యారు. స్టోరూమ్స్ ఎక్స్పైరీ అయిన జీలకర్ర, బ్రాండెడ్ కాని జీడిపప్పు, గోధుమ పిండిని గుర్తించి సీజ్ చేశారు. ఫుడ్‌సేఫ్టీ నిబంధనలను పాటించకపోతే పర్మిషన్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆహార వస్తువులపై లేబుల్స్, బ్యాచ్ నంబర్లోకపోతే ఫైన్‌తో పాటు, జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 300 హోటళ్లు, 28 రెస్టారెంట్లు ఉండగా ఏడు నెలల్లో అధికారులు తనిఖీలు చేసి 14 కేసులు మాత్రమే నమోదు చేశారు. హైదరాబాద్ స్థాయిలో ఒత్తిళ్లు వస్తే తప్పా తనిఖీలు చేయరన్న విమర్శలున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు తప్పించి రెగ్యులర్‌గా సోదాలు చేయరనే ఆరోపణలున్నాయి. మామూళ్ల వ్యవహారం కారణంగా చూసి చూడనట్టు వదిలేస్తారనే విమర్శలున్నాయి.ఇప్పటికైనా ఆహార భధ్రత అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం నెలకో రెండు నెలలకో తనిఖీలు చేయడం కాకుండా నిత్యం రెస్టారెంట్లు హోటళ్ళపై నిఘా ఉంచాలని, ప్రజల ప్రాణాలకు హాని కలింగించే ఆహార పధార్దాలు ఇలాంటి రెస్టారెంట్లు,హోటళ్ళు వినియోగించకుండా తగు చర్యలు తీసుకోవాలని ఫుడ్ లవర్స్ కోరుతున్నారు. -
Magazine Story: తిన్నారో.. చచ్చారే! హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్
-
Hyderabad: బయటి ఫుడ్ అంటే భయపడుతున్న భోజన ప్రియులు!
వారాంతపు రోజుల్లో..నగరంలోని కొన్ని రెస్టారెంట్లలో సీట్ దొరకాలంటే కనీసం గంట నుంచి 2 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే అంతటి రద్దీ ఇప్పుడు లేదు. వేళా పాళా లేకుండా ఐస్‌క్రీములూ, పేస్త్రీలూ లాగించే నగర యువత తమ అలవాటును కొనసాగించడానికి జంకుతున్నారు. నగరవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అధికారులు రెస్టారెంట్లపై నిర్వహిస్తున్న దాడుల్లో బయటపడుతున్న విషయాలే దీనికి కారణం. సాక్షి హైదరాబాద్: పేరుగొప్ప రెస్టారెంట్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు, సూపర్ మార్కెట్లు...ఒకటేమిటి? కాదేదీ కల్తీ కనర్హం కాదేదీ ఆరోగ్య కారకం..అన్నట్టుగా నగరంలో పరిస్థితి దిగజారిందని తాజాగా అధికారుల దాడుల్లో వెల్లడైంది. నగరంలో ఫుడ్ లవర్స్‌కి ఫేవరెట్ బిర్యానీ సెంటర్లు, బ్రాండెడ్ ఐస్‌క్రీమ్ పార్లర్లు సైతం ప్రమాణాలు పాటించడంలో దారుణంగా వెనుకబడి ఉన్నాయని తేలింది. సోషల్ మీడియాలో హల్చల్... ఈ దాడులలో వెల్లడైన ఆహార వ్యాపారుల నిర్వాకాలు అటు ప్రధాన మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి. మరోవైపు సోషల్ మీడియాలో కల్తీ ఉత్పత్తులు, నిల్వ ఆహారపదార్ధాల కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడం సిటిజనులపై తీవ్ర ప్రభావాన్ని చూపి ంచింది. అదే సమయంలో లక్డీకాపూల్‌లోని ద్వారకా హోటల్లో క్యారెట్ హల్వా తిన్న కస్టమర్ తీవ్ర అనారోగ్యానికి లోనయ్యాడని వార్తలు సంచలనం సృష్టించాయి. ఒకదానికి ఒకటి తోడైనట్టుగా జరిగిన పరిణామాలతో సిటీలోని ఫుడ్ బిజినెస్ ఢమాల్ అయింది. 25 నుంచి 35 శాతం పడిపోయిన వ్యాపారం... ప్రస్తుతం బయటి ఆహారం అంటేనే నగర వాసుల్లో భయం ఏర్పడిందని, దీనికి గత 3 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలే కారణమని జూబ్లీహిల్స్‌లోని ఓ రెస్టారెంట్ యజమాని అంగీకరించారు. తమ రెగ్యులర్ గెస్ట్స్ సంఖ్యలో భారీగా తేడా వచి్చందనీ, వచ్చినవారు కూడా..ఫుడ్ ఆర్డర్ చేస్తూనే సందేహాస్పదంగా చూస్తున్నారని, తరచి తరచి అడుగుతున్నారని ఆయన చెప్పారు. నగరవ్యాప్తంగా ఈ పరిస్థితుల వల్ల కనీసం 25 నుంచి 35 శాతం వరకూ ఫుడ్ బిజినెస్ దెబ్బతిన్నదని రెస్టారెంట్ అసోసియేషన్ ప్రతినిధులు అంటున్నారు. కొందరు చేసిన తప్పుకి ఎందరో బలవుతున్నారని వీరు వాపోతున్నారు. మరోవైపు స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్ డెలివరీ యాప్స్‌కు వచ్చే ఆర్డర్లు సైతం గణనీయంగా తగ్గుముఖం పట్టినట్టు కొందరు డెలివరీ బాయ్స్ చెప్పారు. కొనసాగుతున్న దాడులు...వెల్లడవుతున్న నిర్వాకాలు... మరోవైపు జీహెచ్ఎంసీతో కలిసి రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు శనివారం కూడా రెస్టారెంట్లపై తమ దాడులు కొనసాగించారు. మసాబ్ ట్యాంక్‌లోని ప్యారడైజ్ బిర్యానీ సెంటర్, అస్లీ హైదరాబాదీ ఖానాలో నిర్వహించిన దాడుల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్, నిల్వ ఆహారాన్ని గుర్తించారు. కీటకాలు రాకుండా వంటగది కిటికీలకు మెష్ సైతం ఏర్పాటు చేయలేదని, పెస్ట్ కంట్రోల్ రికార్డ్స్ లేవు తదితర ఉల్లంఘనలు తేల్చారు. అలాగే ప్యారడైజ్ బిర్యానీ సెంటర్లో ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్‌లో సరైన ప్రమాణాలు లేవని గుర్తించారు. గత 4 రోజులుగా సాగుతున్న దాడుల్లో 100కిపైగా రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ జాయింట్స్, ఫుడ్ సప్లై యాప్స్..వంటివి తనిఖీలు చేసి దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగు చూశాయి. ఇదే ప్రస్తుతం నగరవాసుల్లో బయటి తిండి అంటే భయపడేట్టుగా చేసింది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్‌లకు క్లీన్ చిట్
భారత్‌కు చెందిన ప్రముఖ మసాలా బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్ సంస్థలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (fssai) క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ రెండు సంస్థల అమ్మకాలు జరుపుతున్న మసాలల పొడుల ఉత్పత్తుల్లోక్యాన్సర్‌కు కారకమయ్యే ఎథిలీన్ ఆక్సైడ్ (eto) రసాయనాలు లేవని నిర్ధారించింది.కొద్ది రోజుల క్రితం భారతీయ బ్రాండ్లయిన ఎవరెస్ట్, ఎండీహెచ్ అమ్మకాలు జరుపుతున్న మసాలల పొడుల ఉత్పత్తుల్లో పరిమితికి మించి ఎథిలీన్ ఆక్సైడ్ అనే పురుగుల మందు ఉన్నట్లు కనుగొన్నామని హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ (సీఎఫ్ఎస్) ఏప్రిల్ 5న ప్రకటించింది. ఈ ఉత్పత్తులను కొనొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సీఎఫ్ఎస్ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ బ్రాండ్ల ఉత్పత్తులను సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ రీకాల్ చేసింది.అందులో ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా, ఎమ్‌డీహెచ్‌కు చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా మిక్స్డ్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్ మిక్స్డ్ మసాలా పౌడర్ ఉన్నాయి.ఎఫ్ఎస్ఏఐ అప్రమత్తంఆ ఆరోపణల నేపథ్యంలో అప్రమత్తమైన ఎఫ్ఎస్ఎస్ఏఐ అన్నీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఫుడ్ సేప్టీ కమిషనర్లు, రిజినల్ డైరెక్టర్లను అప్రమత్తం చేసింది. వెంటనే ఎవరెస్ట్, ఎమ్‌డీహెచ్ మసాల పొడుల శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటిపై టెస్టులు చేయాలని ఆదేశించింది. దీంతో ఉన్నతాధికారులు మహరాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్‌లలో మసాల దినుసుల శాంపిల్స్‌ను కలెక్ట్ చేశారు.ఇథిలీన్ ఆక్సైడ్ గురించి అన్వేషణపలు నివేదికల ప్రకారం.. అధికారులు మసాల దినుసుల శాంపిల్స్‌ను పరీక్షించారు. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (NABL) గుర్తింపు పొందిన ప్రయోగశాలలలో ఇథిలీన్ ఆక్సైడ్ కోసం నమూనాలను పరీక్షించారు.28 ల్యాబ్ రిపోర్టులు అయితే ఇప్పటివరకు 28 ల్యాబ్ రిపోర్టులు అందాయి. ఫుడ్ రెగ్యులేటర్ సైంటిఫిక్ ప్యానెల్ శాంపిల్స్‌ను విశ్లేషించగా వాటిలో ఎలాంటి ప్రమాదకరమైన రసాయనం లేదని తేలింది.ఆ రెండు కంపెనీలకు క్లీన్ చిట్‌అంతేకాదు ఇతర బ్రాండ్లకు చెందిన మరో 300 మసాలా శాంపిల్స్ పరీక్ష నివేదికలను కూడా విశ్లేషించింది. అయితే భారతీయ ఉత్పత్తులు వినియోగానికి సురక్షితమైనవని చూపిస్తూ క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థం ఆనవాళ్లు లేవని ఎమ్‌డీహెచ్, ఎవరెస్ట్‌లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
డీఎల్ఎఫ్ ఫుడ్ కోర్టుల్లో తనిఖీలు.. విస్తుపోయే అంశాలు
కుళ్లిపోయిన పండ్లతో జ్యూసులు.. నాసిరకం పన్నీరుతో రకరకాల వంటకాలు.. కూరలు, గ్రేవీల్లో నాసిరకం మసాలాలు.. కలర్ కలిపిన టీ పొడితో ఛాయ్.. వంటనూనె నాణ్యతలోనూ లేని కనీస ప్రమాణాలు.. ఇక శుభ్రత సంగతి అంటారా? బాబోయ్.. ఇవీ హైదరాబాద్ డీఎల్ఎఫ్ ఫుడ్ కోర్టుల్లో తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ విషయాలు. అర్ధరాత్రి దాకా కూడా వేడి వేడి ఆహారం కోసం ఐటీ ఉద్యోగులు సహా ఆహార ప్రియుల సందడి కనిపిస్తుంటుందక్కడ. రేటు ఎంతైనా ఫర్వాలేదనుకునే జనాలే ఎక్కువ కనిపిస్తారక్కడ. వాళ్లకు తగ్గట్లే పుట్టగొడుగుల్లా ఫుడ్‌కోర్టులు వెలిశాయి. కానీ, ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు వెంపర్లాడుతున్న ఫుడ్ కోర్ట్ సెంటర్ నిర్వాహకులు, కనీస నాణ్యతా ప్రమాణాలు మాత్రం పాటించడం లేదు. న్యూస్ పేపర్లో ఫుడ్‌ను అందించొద్దనే నిబంధనల నుంచి.. కంప్లయింట్ కోసం ఉద్దేశించిన టోల్ ఫ్రీ నెంబర్‌ను సైతం ప్రస్తావించకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా.. డీఎల్ఎఫ్ ఫుడ్ కోర్టులలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కుళ్లిపోయిన పళ్లతో రసాలు చేసి విక్రయిస్తుండడం.. అలాగే నాసిరకం మసాలాలతో ఆహార పదార్థాల తయారీ, టీ పొడిలో కలర్ గ్రాన్యూల్స్ కలిపి టీ విక్రయాలు(ఇది క్యాన్సర్‌కు దారి తీయొచ్చని ప్రచారం నిపుణులు చెబుతుంటారు). డీఎల్ఎఫ్ సమీపంలో ఫుడ్ కోర్టుల్లో ఆహార నాణ్యతపై ట్విటర్లో అందించిన ఫిర్యాదు మేరకే ఈ తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది. డీఎల్ఎఫ్ వద్ద సుమారు 150 ఫుడ్ కోర్టులు ఉండగా.. అందులో చాలావాటికి అనుమతులు లేవు. దీంతో ఆయా యజమానులకు నోటీసులు జారీ చేశారు. -
ఎక్కడికైనా వస్తుంది.. కల్తీని పట్టేస్తుంది
సాక్షి, అమరావతి: ఆహార కల్తీ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దుకాణాలు, హోటళ్లు, ఇతర ప్రదేశాల్లో ఆహార కల్తీని సులభంగా గుర్తించేలా ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ పేరిట ల్యాబ్‌తో కూడిన మొబైల్ వాహనాలు త్వరలో రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి. వీటిద్వారా ఆహార కల్తీని అప్పటికప్పుడే కనిపెట్టే సౌకర్యం అందుబాటులోకి రాబోతుంది. రెండు దశల్లో 14 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. తొలి దశలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం రీజియన్లకు ఒక్కొక్కటి, స్టాండ్ బై కింద ఒక వాహనం చొప్పున మొత్తం నాలుగు కొనుగోలు చేస్తున్నారు. ఇక రెండో దశలో 10 వాహనాలను కొనుగోలు చేయనున్నారు. రెండు దశల్లో 14 వాహనాలు అందుబాటులోకి వచ్చాక ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన పాత జిల్లా కేంద్రంలో ఒక్కొక్క వాహనాన్ని అందుబాటులో ఉంచనున్నారు. ఒక్కో వాహనం కొనుగోలుకు రూ.45 లక్షల చొప్పున ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. తొలి దశలో 4 వాహనాల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్విసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎంఎస్ఐడీసీ) టెండర్లు ఆహా్వనించింది. ప్రతి వాహనంలో 80 రకాల పరీక్షలు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ వాహనంలో 80 రకాల పరీక్షలు చేసే సౌకర్యం ఉంటుంది. పాల కల్తీని నివారించడానికి యూరియా, డిటర్జెంట్, ఇతర రసాయనాలను కలిపారా? లేదంటే పాలల్లో కొవ్వు, సాలిడ్ నాట్ ఫ్యాట్ (ఘన పదార్థాలు) స్థాయిలను తెలుసుకోవడానికి మిల్క్ అనలైజర్ అందుబాటులో ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లలో వాడిన వంట నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారేమో తెలుసుకోవడానికి టీపీసీ, ఆహార పదార్థాల తయారీలో ఫుడ్ కలర్స్ ఆనవాళ్లు పసిగట్టడానికి, ఉప్పులో అయోడిన్ వంటి పరీక్షలు చేయడానికి మ్యాజిక్ బాక్స్, టిష్యూపేపర్ టెస్ట్‌లు మొబైల్ ల్యాబ్‌లో నిర్వహించవచ్చు. డిజిటల్ మల్టీ పారామీటర్, హ్యాండ్ మిల్లీమీటర్ (పీహెచ్ కండెక్టివిటీ, టీడీఎస్, టెంపరేచర్), డిజిటల్ రీ ఫ్యాక్టో మీటర్, డిజిటల్ బ్యాలెన్స్, హాట్ ప్లేట్, హాట్ ఎయిర్ ఓవెన్, రాపిడ్ మిల్క్ స్క్రీనింగ్ తదితర పరికరాలు ఉంటాయి. ఫుడ్ పాయిజన్, డయేరియా వంటి ఘటనల్లో నీటిలో బ్యాక్టీరియా ఆనవాళ్లను గుర్తించడానికి శాంపిళ్లను నిర్ధేశిత టెంపరేచర్లో భద్రపరిచి సెంట్రల్ ల్యాబ్‌కు తరలించడానికి వీలుంటుంది. కల్తీ నియంత్రణ చర్యల్లో భాగంగా.. ఆహార కల్తీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాం. కల్తీని తక్షణమే పసిగట్టి బాధ్యులపై చర్యలు తీసుకునే వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న విధానంలో శాంపిళ్లు సేకరించి ల్యాబ్స్‌కు పంపి పరీక్షించి ఫలితాలు రావడానికి సమయం పడుతోంది. ఈ కాలయాపనకు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్‌తో చెక్ పడుతుంది. పాఠశాలలు, హాస్టళ్లు, ఇతర ప్రదేశాల్లో ఫుడ్ పాయిజన్, డయేరియా కేసులు నమోదైనప్పుడు సత్వరమే స్పందించడానికి మొబైల్ ల్యాబ్స్ ఎంతగానో ఉపయోగపడుతాయి. – జె.నివాస్, కమిషనర్, రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ -
నూనె మళ్లీ మళ్లీ మరిగించొద్దు.. చెడు కొలెస్ట్రాల్‌తో గుండెకు ముప్పు.. ఇంకా..
సాక్షి, అమరావతి: వంద లీటర్ల నూనెను వినియోగించి వంట చేస్తే 25 లీటర్లు మిగులుతుంది. సాధారణంగా మిగిలిన నూనెను మళ్లీ మళ్లీ మరిగించి వంటకు వాడుతుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో హానికరం. ఈ అంశంపై హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులకు అవగాహన కల్పిస్తూ.. వాడిన వంట నూనెను బయోడీజిల్ తయారీ సంస్థలకు విక్రయించేలా రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం చర్యలు తీసుకుంటోంది. ఇలా గత ఏడాదిలో 1,00,257 లీటర్ల వాడిన వంట నూనెను బయో డీజిల్ తయారీ ఏజెన్సీలకు సరఫరా అయ్యేలా చేశారు. రోజుకు 50 లీటర్లకు మించి వంట నూనెను వినియోగించే హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాల తయారీ సంస్థలు జాతీయ ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ)లో రిజిస్టరై ఉన్నాయి. ఇలా రిజిస్టరైన సంస్థలన్నీ ఒకసారి వాడిన నూనెను బయోడీజిల్ తయారీ సంస్థలకు విక్రయించాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. టీపీసీ 25 శాతానికి మించితే ఆరోగ్యం హుష్ మార్కెట్లో నూనెలు ఎక్కువగా వాడే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇతర ఆహార పదార్థాలకు అధిక డిమాండ్ ఉంటోంది. సాధారణంగా కంపెనీ నుంచి తయారై వచ్చిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్ (టీపీసీ) 5 నుంచి 7 శాతం ఉంటుంది. ఆయిల్‌ను మరిగించే కొద్దీ టీపీసీ పెరుగుతూ ఉంటుంది. టీపీసీ మోతాదు 25 శాతానికి మించితే ఆరోగ్యానికి చాలా హానికరం. టీపీసీ మోతాదు పెరిగేకొద్దీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. దీనివల్ల రక్తనాళాలు గట్టిపడటం, అల్జీమర్స్, కాలేయ సంబంధ వ్యాధులు, హైపర్‌టెన్షన్ తదితర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తోంది. ఇలా వాడటం వల్ల స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏజెన్సీలే సేకరిస్తాయి రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ (రూకో) విభాగంలో బయోడీజిల్‌ను తయారు చేసే అనుమతులు ఉన్న ఏజెన్సీలు గుంటూరు, విశాఖ, కాకినాడ నగరాల్లో ఐదు ఉన్నాయి. ఈ ఏజెన్సీలు రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో వాడిన వంట నూనెను సేకరిస్తున్నాయి. ఏజెన్సీల నిర్వాహకులే హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద ఖాళీ డబ్బాలను అందుబాటులో ఉంచుతారు. ఆ డబ్బాల్లోకి వాడిన నూనెను నింపి సమాచారం ఇస్తే తీసుకునివెళతారు. మార్కెట్లో నూనె ధరలకు అనుగుణంగా సేకరించే వాడిన నూనెకు ఏజెన్సీలు డబ్బు చెల్లిస్తాయి. ప్రస్తుతం లీటర్‌కు రూ.40 నుంచి రూ.50 వరకూ చెల్లిస్తున్నారు. రెండోసారి వాడితే చెడు కొలెస్ట్రాల్ తప్పదు నూనెను ఒకసారి ఉపయోగిస్తే అందులోని పోషకాలు మొత్తం మనం వాడుకున్నట్టే. తిరిగి ఆ నూనెను వేడి చేస్తే అది చెడు కొలెస్ట్రాల్‌గా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి హాని చేస్తుంది. నూనెల్ని రెండోసారి వాడితే గుండె జబ్బులే కాకుండా ఉదరకోశ, అన్నవాహిక క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఒకసారి వాడిన నూనెను తిరిగి ఉపయోగిస్తే.. ఆహారం విషతుల్యమవుతుంది. దీనిని భుజిస్తే కడుపులో మంట, కడుపులో నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. -
ఆహారభద్రత కమిషనర్‌కు ఆ అధికారం లేదు
సాక్షి, అమరావతి: ఆహారభద్రత, ప్రమాణాల చట్టం (ఎఫ్ఎస్ఎస్ఏ) కింద గుట్కా, పాన్‌మసాలా తదితర పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, విక్రయం, సరఫరా, పంపిణీ తదితరాలను నిషేధించే అధికారం ఆహారభద్రత కమిషనర్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పొగాకు, పొగాకు ఉత్పత్తులు ‘ఆహారం’ నిర్వచన పరిధిలోకి రావని చెప్పింది. ఎఫ్ఎస్ఎస్ఏ కింద పొగాకు ఉత్పత్తుల తయారీ, అమ్మకాలు తదితరాలను నియంత్రించే అధికారం మాత్రమే కమిషనర్‌కు ఉందని, నిషేధం విధించే అధికారం లేదని తెలిపింది. కమిషనర్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజుల ధర్మాసనం శుక్రవారం తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పొగాకు ఉత్పత్తులు కేంద్రప్రభుత్వ చట్టపరిధిలోకి వస్తాయని, అందువల్ల ఆహారభద్రత కమిషనర్ జారీచేసిన నోటిఫికేషన్ చట్టవిరుద్ధమంటూ పలువురు వ్యాపారులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పొగాకు, పాన్‌మసాలా, గుట్కా తదితర పొగాకు ఆధార ఉత్పత్తుల సేవనం ఆహార నిర్వచన పరిధిలోకి వస్తుందా? రాదా? అన్న అంశాన్ని సింగిల్ జడ్జి ధర్మాసనానికి నివేదించారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై సీజే ధర్మాసనం విచారించి తీర్పు చెప్పింది. పిటిషనర్ల రోజువారీ చట్టబద్ధ కార్యకలాపాల్లో ఏ రకంగాను జోక్యం చేసుకోవద్దని, ఎఫ్ఎస్ఎస్ఏ కింద జప్తుచేసిన సరుకును తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. లైసెన్స్ తీసుకుని వ్యాపారం చేసేవారిపై ఎఫ్ఎస్ఎస్ఏ కింద ఎలాంటి కఠినచర్యలు తీసుకోవద్దని పేర్కొంది. -
జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయానికి ఫుడ్ లైసెన్స్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ అధికారి సుదర్శన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజు ఫుడ్ ఇన్స్పెక్టర్లతో కలిసి హైదరాబాద్‌లో గుర్తించిన ప్రముఖ ఆలయాలను సందర్శించడంతో పాటు కార్యనిర్వహణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంతో పాటు జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం సైతం ఎంపికైంది. సంబంధిత అధికారులు పెద్దమ్మ దేవాలయం ఈవో శ్రీనివాసరాజుతో ఇటీవల సమావేశమై చర్చించారు. ఫుడ్‌సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం దేవాలయాలకు జీహెచ్ఎంసీ జారీ చేసిన ఫుడ్ లైసెన్స్‌లను పెద్దమ్మ దేవాలయానికి సైతం అందజేయనున్నారు. ప్రఖ్యాత ఆలయాల్లో భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందించే లక్ష్యంతో, ప్రసాదాల నాణ్యతకు సంబంధించి ఐదు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫుడ్‌సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఎఫ్ఎస్ఏఐ) ప్రవేశ పెట్టిన బ్లిస్ ఫుల్ హైజనిక్ ఆఫరింగ్ టూ గాడ్(భోగ్) పథకంలో భాగంగా దేవాలయాలకు లైసెన్స్‌ల జారీ చేపట్టినట్లు జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజు, సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. నగరంలో సుమారుగా ఎనిమిది దేవాలయాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, ఉజ్జయినీ మహంకాళి దేవాలయానికి లైసెన్స్ అందజేసిన అధికారులు పెద్దమ్మ ఆలయానికి త్వరలోనే జారీ చేయనున్నారు. ఇప్పటికే ఫుడ్ ఇన్స్పెక్టర్లు స్వాతి, మౌనిక, లక్ష్మీకాంత్ తదితరుల ఆధ్వర్యంలో ఆయా దేవాలయాల్లో ఈవోలతో సమీక్ష సమావేశం నిర్వహించి నాణ్యమైన ప్రసాదాలపై చర్చలు జరిపారు. ఈ లైసెన్స్ జారీ చేయడం ద్వారా ఇప్పటికే పరిశుభ్రమైన, రుచికరమైన ప్రసాదాలు అందజేస్తున్న ఆలయాలు మరింత నాణ్యమైన ప్రసాదాలను అందజేసేందుకు వీలవుతుంది. ఈ నిర్ణయం పట్ల పెద్దమ్మ భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియకు ఆలయ అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే పెద్దమ్మ గుడి ప్రసాదానికి నగర వ్యాప్తంగా విశేషమైన ఆదరణ ఉన్న నేపథ్యంలో ఈ కొత్త నిబంధనతో భక్తులు మరిన్ని ప్రయోజనాలు పొందనున్నారు. చదవండి: బాలుడిపై దాష్టీకం.. బట్టలూడదీసి, చేతులు కాళ్లు కట్టేసి చిత్ర హింసలు -
ఆహార కల్తీకి చెక్! అధికారుల కొత్త రూల్స్.. లైసెన్స్ తీసుకుంటేనే సరి.. లేదంటే?
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఆహార పదార్థాల తయా రీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వందల సంఖ్యలో చిన్నచిన్న బండ్లపై, రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అధికంగా ఏర్పాటవుతున్నాయి. పెద్దపెద్ద హోటళ్ల నుంచి చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తున్న వ్యాపారులు కనీస నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల విక్రయాల్లో కనీస నాణ్యత పాటించడం లేదని ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఆహార పదార్థాలు కల్తీకి గురవుతున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ఆహార కల్తీని కట్టడి చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులు, భోజనం అందించేలా వ్యాపారులు నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ లేని టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు, హోటళ్లపై అధికారులు దృష్టి సారించారు. వాటిని నిర్వహించే వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండడంతో పాటు చిరు వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి శనివారం లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించేందుకు నిర్ణయించారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్లు లేనివే ఎక్కువ.. ఉమ్మడి జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం హోటళ్లు, బేకరీలు, టిఫిన్ సెంటర్లు, ఆహార పదార్థాల తయారీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, దాల్ మిల్లులు తదితర ఆహార ఉత్పత్తుల కేంద్రాలు 5 వేలకు పైగానే ఉన్నాయి. వాటిలో లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగిన హోటళ్లు, రెస్టారెంట్లు 886 వరకు ఉండగా, చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు, ఇతర ఫుడ్ కోర్టులు ఖమ్మం జిల్లాలో 1400, కొత్తగూడెంలో 700 ఉన్నాయి. మిగిలిన వాటికి లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వ్యాపారం చేసే టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఇతర ఫుడ్ కోర్టులు తప్పనిసరిగా తమ వ్యాపారాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఆపైన వ్యాపారం చేసే వారు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం లైసెన్స్ పొంది ఉండాలి. రిజిస్ట్రేషన్, లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహించే వారిపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. రిజిస్ట్రేషన్, లైసెన్స్ ఉండి నిబంధనలు పాటించకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులకు వీలుంటుంది. సిబ్బంది కొరత.. ఉమ్మడి జిల్లాలో వేల సంఖ్యలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఆహార పదార్థాల తయారీ సెంటర్లు ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో తనిఖీ చేసేందుకు అధికారులు, సిబ్బంది సరిపడా లేరు. ఉమ్మడి జిల్లాలో ఖమ్మంలో ఒక గెజిటెడ్ అధికారితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో మరో అధికారి మాత్రమే ఉన్నారు. దీంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ఆహార పదార్థాలు కల్తీ జరిగినా గుర్తించేందుకు సిబ్బంది లేక తనిఖీలు చేయలేకపోతున్నారు. రోజుకు ఒకటి రెండు హోటళ్లను కూడా అధికారులు తనిఖీ చేయలేని పరిస్థితి ఉంది. ప్రతి శనివారం మేళా.. లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ లేకుండా భోజన వ్యాపారం నిర్వహిస్తున్న వారికి చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి శనివారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో మేళా ద్వారా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఖరఖానాలు, దాల్ మిల్లులు, పిండి మిల్లులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఫుడ్ కోర్టులకు లైసెన్స్‌లు ఇవ్వడంతో పాటు రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించారు. వ్యాపారులకు అవగాహన కల్పించడంతో పాటు నాణ్యత పాటించకపోతే చట్టపరంగా తీసుకునే చర్యలను ఈ మేళా ద్వారా వివరిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన నిర్వహించిన తొలి మేళాలో 11 లైసెన్స్‌లు జారీ చేయగా, 20 మంది వ్యాపారులు తమ వ్యాపారాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. లైసెన్స్‌లు తప్పనిసరి.. ఉమ్మడి జిల్లాలో ఉన్న హోటళ్లు, దాల్ మిల్లులు, బేకరీలు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేయవద్దు. చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు, ఫుడ్ కోర్టులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు తమ వ్యాపారాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్, లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేస్తే చర్యలు తీసుకుంటాం. నాణ్యత లేకుండా, కల్తీ వ్యాపారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రతి శనివారం రిజిస్ట్రేషన్, లైసెన్స్ మేళా కేఎంసీలో ఉంటుంది. – కిరణ్‌కుమార్, జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఖమ్మం -
నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. వంద కిలోల కుళ్లిన మాంసం
సాక్షి, విజయవాడ: వన్‌టౌన్ కొత్తపేట హనుమంతరావు చేపల మార్కెట్లో సుమారు వంద కిలోల కుళ్లిన మాంసాన్ని నగరపాలక సంస్థ సిబ్బంది నిర్వీర్యం చేశారు. చేపల మార్కెట్లోని పలు దుకాణాలపై నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది ఆదివారం దాడులు నిర్వహించారు. పలు దుకాణాల్లో నిల్వ ఉంచిన మంసాన్ని గుర్తించారు. అందులో కుళ్లిన కోడిమాంసం, పొట్టేలు తలకాయ, చేపలను నిల్వ ఉంచినట్లుగా గుర్తించారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఎ.రవిచంద్, తన సిబ్బందితో కలసి దాడులు చేశారు. మార్కెట్లో ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకొని, దానిపై బ్లీచింగ్ చల్లి నిర్వీర్యం చేసి గోతిలో పూడ్చివేశారు. ఈ మాంసాన్ని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. మాంసంలో పేగులను తొలగించి శుభ్రపరచి పొట్టలో ఐస్ వేసి విజయవాడ ఫిష్ మార్కెట్లో తీసుకొచ్చారని, ఇది పూర్తిగా కుళ్లి రంగు మారిందని నిర్ధారించారు. దీనిని విక్రయిస్తున్న దుకాణాలకు ప్రజారోగ్య చట్టం కింద నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రవిచంద్ మాట్లాడుతూ.. నగరంలో ఎవరైనా నిల్వ చేసిన మాంసం విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కుళ్లిన మాంసాన్ని తినడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారని పేర్కొన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి సూక్ష్మంగా పరిశీలన చేసిన తరువాతే మాంసం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా సూచించారు. చదవండి: (ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్) -
ప్రసాదానికి త్వరలో ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని 11 ప్రముఖ ఆలయాల్లో భక్తులకు పంచిపెట్టే ప్రసాదాలకు కేంద్ర ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ సర్టిఫికెట్లు దక్కబోతున్నాయి. కేంద్ర ఫుడ్ సేఫ్టీ విభాగం ఇటీవల ప్రసాదాల నాణ్యత ఆధారంగా భోగ్(దేవునికి సమర్పించే పరిశుభ్రమైన నైవేద్యం) పేరుతో సర్టిఫికెట్లు జారీ చేసే విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, బెజవాడ దుర్గగుడి, సింహాచలం, కాణిపాకం, అన్నవరం, పెనుగంచిప్రోలు, విశాఖపట్నం కనకమహాలక్ష్మీ, కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి, మహానంది, ద్వారకా తిరుమల ఆలయాల్లోని ప్రసాదాలకు సర్టిఫికెట్ జారీ చేసేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో 11 ప్రధాన ఆలయాల ఈవోలు ప్రసాదాలకు భోగ్ సర్టిఫికెట్ కోసం వెంటనే ఫుడ్ సేఫ్టీ విభాగానికి దరఖాస్తు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ శనివారం ఆదేశాలిచ్చారు. -
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకులకు షాక్.. లైసెన్స్ లేకపోతే జైలుకే!
సాక్షి,విజయనగరం: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా లైసెన్స్‌లు లేకుండా ఆహార పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలు అతిక్రమిస్తూ వ్యాపారాలు కొనసాగించే వ్యాపారులపై జిల్లా ఆహార కల్తీ, నియంత్రణ అధికారులు కొరడా ఝుళిపించనున్నారు. ఇప్పటివరకు ఆహర పదార్థాల కల్తీపై ప్రత్యేక దృష్టి సారించిన అధికార యంత్రాంగం ఇకపై నుంచి లెసెన్స్‌లు కూడా ఉండాలని, అవి ఉన్న వారే ఆహార విక్రయాలకు అర్హులని చెబుతోంది. ఒకవేళ లైసెన్స్ లేకుండా అమ్మకాలకు పాల్పడిన వారికి రూ.5 లక్షల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధించనున్నామని అధికారులు పేర్కొంటున్నారు. పుట్టగొడుగుల్లా విక్రయ కేంద్రాలు.. జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా ఆహర పదార్థాల విక్రయ కేంద్రాలు వెలుస్తున్నాయి. చిన్నపాటి జంక్షన్లో కూడా నాలుగైదు తోపుడు బళ్లపై ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఒకింత పెద్ద జంక్షన్ అయితే ఏకంగా పదుల సంఖ్యలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నిర్వహణ కనిపిస్తుండడం గమనార్హం. అంతేకాకుండా చిన్నపాటి గదులను అద్దెకు తీసుకుని మరీ పకోడీ, టిఫిన్ షాపులు, నూడిల్స్, పానీపూరి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. పెద్దపెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు అయితే వేల సంఖ్యలోనే కనిపిస్తున్నాయి. ఏటా లైసెన్స్ రెన్యువల్.. ప్రభుత్వ నిబంధనల మేరకు ఏడాదిలో రూ.12 లక్షల ఆదాయం వచ్చే హోటళ్లు, రెస్టారెంట్లు రూ.2 వేలు చెల్లించి తమ లైసెన్స్‌లను ఏటా రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అధికారిక సమాచారం ప్రకారం జిల్లాలో 270 మంది మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, లెసెన్స్‌లను రెన్యువల్ చేసుకున్నారు. ఏడాదిలో రూ.12 లక్షల లోపు ఆదాయం సంపాదించే చిన్నపాటి దుకాణాలు నిర్వహించే వారు ఏడాదికి రూ.500 మాత్రమే చెల్లించి, లైసెన్స్‌లు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు జిల్లాలో 1,477 మంది మాత్రమే ఆ తరహా లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకున్నారు. ఈ లెక్కన అధికారికంగా నిర్వహించే దుకాణాల కన్నా అనధికారికంగా నిర్వహించే దుకాణాలే ఎక్కువన్న విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో వాటిపై సర్కారు ఆదేశాల మేరకు చర్యలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. 100 కేసుల నమోదు.. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న అక్రమ వ్యాపారులకు వ్యతిరేకంగా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుండగా, కోవిడ్ కారణంగా గడిచిన రెండేళ్లలో ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 కేసులు మాత్రమే నమోదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో కొన్నింటిని జేసీ కోర్టుకు, మరికొన్నింటిని జిల్లా కోర్టుకు నివేదించినట్లు సమాచారం. వీటితో ఇప్పటివరకు రూ.2.50 లక్షల ఆదాయం అపరాద రుసుం కింద వసూలైనట్లు అధికారులు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. ఆహార పదార్థాలు విక్రయించే వ్యాపారులకు లైసె న్స్ లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. పదార్థాలు కల్తీ చేసినా, అక్రమంగా అమ్మకాలు కొనసాగించినా జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తాం. – ఈశ్వరి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, విజయనగరం జిల్లా చదవండి: డామిట్.. కథ అడ్డం తిరిగింది -
Vijayawada: 100 కిలోల కుళ్లిన మాంసం స్వాధీనం
సాక్షి, పటమట (విజయవాడ తూర్పు): అక్రమంగా నిల్వ ఉంచిన మాంసాన్ని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలోని కృష్ణలంక తారకరామ నగర్‌కు చెందిన హరిమాణిక్యం రాము తన ఇంట్లో అక్రమంగా మాంసం నిల్వ ఉంచారని అధికారులకు ఫిర్యాదు అందింది. వీఎంసీ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రవిచంద్ సోమవారం తనిఖీ చేసి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. రవిచంద్ మాట్లాడుతూ హరిమాణిక్యం రాము చనిపోయిన మేకలు, గొర్రెలు తక్కువ ధరకు కొనుగోలు చేసి జంతువుల పొట్టలో పేగులు తొలగించి వాటిస్థానంలో ఐస్ ముక్కలు ఉంచి నగరానికి తరలిస్తారని తెలిపారు. ఆర్డర్లను బట్టి తెచ్చిన ఈ మాంసాన్ని రెస్టారెంట్లకు సరఫరా చేస్తారన్నారు. తారకరామానగర్‌లోని ఆయన ఇంటిలో నిల్వ ఉంచారని విషయం తెలుసుకుని దాడి చేయగా రాము వద్ద 100 కిలోలకు పైగా చనిపోయిన మేకలు, గొర్రెలు, వాటి తల, మాసం, కాళ్లు పురుగులు పట్టి ఉన్నాయని తెలిపారు. -
World Food Safety Day: సంపాదనే ముఖ్యం.. అందుకోసం ఏమైనా కల్తీ చేస్తారు
డబ్బు సంపాదనే వారికి ముఖ్యం. అందుకోసం ఆహారంలో ఏమైనా కల్తీ చేస్తారు. దీని వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినా ఏ మాత్రం చలించరు. కస్టమర్లను మళ్లీ మళ్లీ రప్పించుకోవడమే లక్ష్యంగా ఆహార పదార్థాల విక్రయ కేంద్రాల నిర్వాహకులు ప్రమాదకర రంగులు, పదార్థాలను కలిపేందుకే తెగబడుతున్నారు. అధికారులకు సైతం ఈ విషయం తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నేడు వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా ప్రత్యేక కథనం. కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలుజిల్లాలో చిన్నా పెద్దా హోటల్స్, రెస్టారెంట్స్, డాబాలు, చాట్, నూడల్స్ షాపులు అన్నీ కలుపుకుని దాదాపు 9 వేలకు పైగా ఉంటాయి. ఒక్క కర్నూలు నగరంలోనే 1500 దాకా హోటళ్లు, దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి 2006 చట్టం మేరకు లైసెన్స్ తీసుకుని, ఆ శాఖ నిబంధనల ప్రకారం ఆహారం తయారు చేయాలి. ఈ శాఖలోని అధికారులు ఏడాదికి 350 శ్యాంపిల్స్ సేకరించాల్సి ఉన్నా నామమాత్రంగా పనిచేస్తున్నారు. నెలకు ఐదు నుంచి ఆరు శ్యాంపిల్స్ తీసి చేతులు దులుపుకుంటున్నారు. గత మూడు నెలలుగా జిల్లాల పునర్విభజన పేరుతో ఒక్క శ్యాంపిల్ కూడా తీయలేదు. సిబ్బంది తక్కువగా ఉన్నారని, కోర్టు డ్యూటీల ఉన్నాయని పేర్కొంటూ తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి సేకరించి ప్రయోగశాలకు పంపిన శ్యాంపిల్స్ రెండు, మూడు నెలలకు గానీ నివేదికలు రావడం లేదు. దీంతో ఏ ఒక్కరిపైనా వీరు సరైన చర్యలు తీసుకోవడం లేదు. దీనికితోడు హోటల్, రెస్టారెంట్, ఇతర ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ జిల్లాలో ఇలా అనుమతి తీసుకుని వ్యాపారం చేసే సంస్థలు నూటికి పాతిక శాతానికి మించి ఉండటం లేదు. ఉత్పత్తి కేంద్రాలైతే ఏడాదికి రూ.3వేలు, విక్రయ కేంద్రాలు రూ.2వేలు, తోపుడు బండ్లు రూ.100లు చెల్లించి అనుమతులు పొందాల్సి ఉన్నా ఆ పనిచేయడం లేదు. కొన్ని పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు మినహా అధిక శాతం హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రోడ్డుసైడు హోటళ్లలో పరిశుభ్రత గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా రంగులు, టేస్టీ సాల్ట్ వాడకం జిల్లాలోని స్వీట్స్ తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో అనుమతిలేని రంగులను, టేస్టీసాల్ట్ (అజినోమోటో)ను వాడుతున్నారు. వాస్తవంగా ఆహార పదార్థాల్లో వాడే రంగు(బుష్‌పౌడర్)ను ఒక కిలోకు 0.001మి.గ్రా వాడాలి. పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించాలన్న దురుద్దేశంతో కిలోకు 10 నుంచి 20 మి.గ్రా కలుపుతున్నారు. దీంతో పాటు మెటాలిక్ ఎల్లోను సైతం వాడుతున్నారు. వీటిని తిన్న వారికి క్యాన్సర్ వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకునే వారు లేరు. చదవండి: (Nandyal TDP: టీడీపీలో వర్గ పోరు) అలాగే ప్రమాదకర అజినోమోటో(టేస్టీసాల్ట్)ను రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో విచ్చలవిడిగా వాడుతున్నారు. వీటిని తిన్న వారు క్యాన్సర్, జీర్ణకోశ సమస్యలతో పాటు సంతానలేమి సమస్యలు, సెక్స్ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఇటీవల అధికారులు కృష్ణానగర్, పార్కురోడ్డు, సెంట్రల్ప్లాజా సమీపాల్లోని పలు దుకాణాలు, హోటల్లలో దాడులు నిర్వహించి నోటీసులు జారీ చేసినా వ్యాపారుల్లో మార్పు రాలేదు. హోటళ్లు, బిర్యానీ సెంటర్లకు ఇవీ నిబంధనలు ►వ్యాపారులు ఫుడ్ సేఫ్టీ స్టాండర్స్ అథారిటీఆఫ్ ఇండియా లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. లైసెన్స్ లేకపోతే తనిఖీల్లో దొరికినప్పుడు సెక్షన్ 63 ప్రకారం ఫుడ్ సేఫ్టీ కమిషన్ ద్వారా క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తారు. నేరం రుజువైతే 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా విధిస్తారు. ►ఆహార పదార్థాలను తనిఖీ చేసేటప్పుడు నాలు గు భాగాలుగా విభజిస్తారు. అన్ సేఫ్, సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండెడ్, మిస్లీడింగ్ విభాగాల కింద అధికారులు శ్యాంపిల్స్ సేకరిస్తారు. ►వ్యాపార ప్రకటనల్లో సూచించినట్లుగా ఆహారంలో ప్రమాణాలు లేకపోతే దానిని మిస్లీడింగ్ గా పరిగణిస్తారు. ►ఆహార పదార్థాల రంగు కోసం ప్రకృతి సిద్ధమైన రంగులు వాడాలి. రసాయనాలు కలిపిన రంగులు వాడకూడదు. ►ఆహార పదార్థాల తయారీకి టేస్టింగ్ సాల్ట్స్ వాడకూడదు. రోజువారీ వాడే ఉప్పునే వాడాలి. ►అలాగే అన్ని రకాల హోటళ్లు, రెస్టారెంట్లలో లోపలి భాగం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. వంటగదిలో డ్రైనేజీ వసతి బాగుండాలి. అనుమతులు తప్పనిసరి తినుబండారాల వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ సి.క్యాంపులోని తమ కార్యాలయంలో తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. చట్టప్రకారం అనుమతి ఉన్న రంగులు, పదార్థాలనే ఆహార పదార్థాల్లో వాడాలి. రుచి కోసం చాలా మంది టేస్టీసాల్ట్ వాడుతున్నారని ఫిర్యాదులున్నాయి. ఇది చట్టరీత్యానేరం. ఇకపై జిల్లా లో ముమ్మర దాడులు నిర్వహించి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాము. –శేఖర్‌రెడ్డి, డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఉమ్మడి కర్నూలు జిల్లా కలర్స్‌తో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఆహార పదార్థాల్లో రంగు, రుచి కోసం వాడే కలర్స్(బుష్‌పౌడర్ ) వల్ల పాంక్రియాస్, లివర్, పిత్తాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. కొన్నిచోట్ల టేస్టీ సాల్ట్‌లో పందిమాసంతో తయారు చేసిన పదార్థాన్ని కల్తీ చేస్తున్నారు. దీంతో పాటు అజినోమోటో సాల్ట్‌ను వాడటంతో జీర్ణాశయ, సంతానలేమి, సెక్స్ సమస్యలు వస్తాయి. కాబట్టి బయటి ఆహార పదార్థాల వినియోగంలో ప్రజలు తగు జాగ్రత్త వహించాలి. –డాక్టర్ పి. అబ్దుల్ సమద్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, కర్నూలు -
ఆర్డర్ చేసిన ఫుడ్‌లో పాము చర్మం...షాక్‌లో కస్టమర్
Snake skin found in food: ఇటీవల కోవిడ్ -19 తర్వాత ప్రజలు నేరుగా రెస్టారెంట్‌కి వెళ్లి తినడాని కంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని తినడానికే ఇష్టపడుతున్నారు. అదీగాక జోమాటో, స్వీగ్గీ వంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ యూప్‌లు ప్రజలకు వెసులుబాటు కలిగించేలా మంచి డిస్కోంట్లు ఇచ్చి మరీ సేవలందింస్తుంది. వీకెండ్ సమయాల్లో మరింత ఆకర్షీణీయమైన పుడ్ ఆఫర్లతో భోజనప్రియులకు మరింత చేరువవుతోంది. దీంతో ప్రజలు కూడా ఆన్లైన్లో ఫుడ్‌ని ఆర్డర్ చేసుకుని తినడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే వారికి ఊహించని భయంకరమైన చేదు అనుభవం ఎదురైంది. అంతేకాదు ఆ ఘటన మళ్లీ ఇంకెప్పుడు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసి తినడానికి జంకేలా చేసింది. వివరాల్లోకెళ్తే...కేరళలోని తిరువనంతపురంలో ప్రియా అనే ఒక మహిళ నెడుమంగడు ప్రాంతంలోని ఒక రెస్టారెంట్ నుంచి రెండు పరోటాలను ఆర్డర్ చేసింది. పైగా ఆర్డర్ కూడా సకాలంలోనే డెలివరీ అయింది. ఐతే ఆమె మొదటగా తమ కుమార్తెకు పరోటా పెట్టింది. కానీ ఆ తర్వాత ఆ పరోటా పార్మిల్ని ఫ్యాకింగ్ చేసిన కవర్ మీద సుమారు అరవేలు పొడవు అంతా పాము చర్శం చూసి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. దీంతో ఆమె ఆగ్రహం చెంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐతే సదరు రెస్టారెంట్ ఆహారాన్ని ప్యాకింగ్ చేసిన పేపర్ పై పాము చర్మం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఫుడ్ సేఫ్టీ అధికారి అర్షిత బషీర్ తెలిపారు. అంతేకాదు వంటగదిలో తగినంత వెలుతురు కూడా లేదని సరైన పరిశుభ్రత పాటించకుండా ఆహారం తయారు చేసున్నారని అన్నారు. సదరు రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేయడం తోపాటు ఆ రెస్టారెంట్ యజమానికి షాకాజ్ నోటీసులు కూడా పంపించినట్లు వెల్లడించారు. (చదవండి: నిమ్మకాయలతో మామూలుగా ఉండదు.. జైలు అధికారి సస్పెండ్!) -
ప్చ్.. వీళ్లింతే.!
ఆహార తనిఖీ ప్రత్యేక బృందం తమ తనిఖీలింతేనని మరోసారి చాటుకుంది. మంగళవారం జిల్లా కేంద్రంలో ప్రత్యేక బృందం మొక్కుబడి తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంది. ఇప్పటికే జిల్లాలో సదరు విభాగం ఖాళీలతో కునారిల్లుతుండగా.. ప్రత్యేక తనిఖీ బృందం నామమాత్రంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో భాగంగా ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయగా జిల్లాలో జరిగిన తనిఖీలు మాత్రం తూతూమంత్రంగా ముగించడం విడ్డూరం. మీడియాకు సమాచారమివ్వకుండా మొత్తానికి అయ్యిందనిపించారు. – కరీంనగర్ అర్బన్ మొక్కుబడిగా శాంపిళ్ల సేకరణ ఆయిల్ ట్రేడర్లు, బేకరీలు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, పండ్ల దుకాణాలు, కేఫ్‌లు, కూల్‌డ్రింక్ షాపులు, చిరుతిళ్ల తయారీ కేంద్రాలు, ఇతర నిత్యావసర సరుకుల కల్తీకి ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక తనిఖీలకు శ్రీకారం చుట్టింది. కానీ.. జిల్లా కేంద్రంలో జరిగిన తనిఖీలు మాత్రం నవ్విపోదురు గాక.. అన్నట్లు సాగింది. ప్రత్యేక బృందం మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ వాహనంతో అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి కేసులు నమోదు చేయాల్సి ఉండగా సదరు వాహనం జాడే లేకపోవడం విచిత్రం. మొక్కుబడిగా పలు దుకాణాలను తనిఖీ చేసినట్లు చేసి శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. 15 రోజుల అనంతరం సదరు ఫలితాలు రానుండగా అప్పుడు కేసులు నమోదు చేయనున్నారు. కల్తీరాయుళ్ల వైపు కన్నెత్తని అధికారులు కాగా.. తనిఖీలు ఒకరిద్దరి కనుసన్నలో సాగినట్లు తెలుస్తోంది. ప్రకాశంగంజ్లోని పలువురు వ్యాపారులు, బొమ్మకల్, తీగలగుట్టపల్లి, అల్గునూరు, కోతిరాంపూర్, పద్మనగర్, విద్యానగర్, రేకుర్తి పలు ప్రాంతాల్లో కల్తీ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది. సన్ఫ్లయిర్ ఆయిల్‌కు కొరత ఏర్పడటంతో పెద్ద ఎత్తున సూపరోలిన్ ఆయిల్ కలుపుతున్నారు. లీటరు నూనెపై అదనంగా రూ.70–80 వరకు లాభం పొందుతున్నారు. ఇంత జరుగుతుంటే ప్రత్యేక టీమ్ మాత్రం తనిఖీలు చేశామన్నట్లు చేసి చేతులు దులుపుకున్నారు. సూపరోలిన్ ఆయిల్ అంటే పామాయిల్ బ్లెండింగ్ చేసి పామోలిన్ తయారు చేస్తారు. దీన్ని మరింత రిఫైన్ చేస్తే సూపరోలిన్ ఆ యిల్ వస్తుంది. ఇది చూడ్డానికి వాటర్ లాగే ఉంటుంది. సన్‌ఫ్లవర్ కంటే తక్కువ ధరకే లభిస్తుంది. పైగా అందులో కలిపినా ఎం తేడా కనిపించదు. విజృంభిస్తున్న కల్తీ మాఫియా శివారు ప్రాంతాల్లో గోడౌన్లను కేంద్రంగా చేసుకుని కల్తీకి పాల్పడుతున్నారు. పామాయిల్, తవుడు నూనెలను కలుపుతూ వేరుశనగ, పొద్దుతిరుగుడు నూనెల పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని పటిష్టం చేయడంలేదు. జిల్లా కేంద్రం జనాభా 3 లక్షలకు పైమాటే. జిల్లా జనాభా 10 లక్షలు కాగా.. ఆహార తనిఖీలో అన్ని పోస్టులూ ఖాళీగా ఉండటం ఆందోళనకర పరిణామం. అసలు తనిఖీలే లేవ్ ఆహార తనిఖీ విభాగం ప్రతీ నెలలో తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. ► గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఒక్కొక్కరికి నిర్ణీత లక్ష్యముంటుంది. ► ఆరు నెలలుగా అధికారే లేక కార్యాలయం వెలవెలబోతోంది. ► ఉన్న పోస్టులన్నీ ఖాళీయే కాగా ఇన్చార్జి అధికారితో నెట్టుకొస్తున్నారు. ► ఒక గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు ఇద్దరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, ఒక క్లర్క్, ఇద్దరు అటెండర్లు కార్యాలయంలో విధులు నిర్వహించాల్సి ఉంది. ► అయితే 1985లో అప్పటి జనాభా ప్రాతిపదికన పోస్టులు మంజూరు చేయగా నేడు జనాభా పదింతలు పెరిగినప్పటికి అదే విధానం కొనసాగడం విడ్డూరం. పోనీ అప్పటి మంజూరు పోస్టుల ప్రకారం అధికారులూ లేరు ► దీంతో ఆహార తనిఖీ ప్రక్రియ అటకెక్కడంతో కల్తీ మాఫియా ప్రజల ప్రాణాలతో రాజ్యమేలుతోంది. ► ఇన్చార్జి పాలనతో ఎప్పుడొస్తారో.. ఎప్పుడుంటారో తెలియని పరిస్థితి. ► ఫిర్యాదు చేసినా ఆహార తనిఖీ అధికారులు పట్టించుకోని క్రమంలో రాష్ట్రస్థాయిలో ఫిర్యాదు చేయొచ్చు ఫోన్ నంబర్ 9100105795 చదవండి: మొదటి సారి దొంగతనం, అంతా అనుకున్నట్లే జరిగింది.. కానీ చివరిలో.. -
ఆహార భద్రత విభాగంలో అవినీతి భాగోతం..
-
ఏమి'టీ' మోసం
బిక్కవోలు: గుట్టు చప్పుడు కాకుండా నాలుగేళ్లుగా నకిలీ టీపొడి తయారీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ఓ కేంద్రం నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని ఆర్ఎస్పేటలో మూతబడిన రైస్ మిల్లులో ఈ పొడి తయారు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో జిల్లా ఫుడ్‌సేఫ్టీ అసిస్టెంట్ అధికారి శ్రీనివాస్, ఎస్ఐ పి.వాసు శుక్రవారం ఆకస్మిక దాడి చేశారు. అనిల్ శేఖర్‌రెడ్డి అనే వ్యక్తి అరుణ్ ఎంటర్‌ప్రైజస్ పేరుతో వివిధ ప్రాంతాలకు నకిలీ టీపొడిని ఎగుమతి చేస్తున్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ కేంద్రంలో పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన ముత్తు వద్ద వివరాలు రాబట్టారు. టీపొడి తయారీకీ శుద్ధమట్టి, ఎర్రమట్టి, నిర్మాపొడరు, జీడీపిక్కలపైతొక్క పొడి వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 135 బస్తాల జీడి పిక్క పౌడరు, 33బస్తాల నకిలీటీ పొడి, 22 బస్తాల నిర్మా వాషింగ్ పౌడర్‌తో పాటు ఎర్రమట్టి, శుద్ధమట్టిని సీజ్ చేశారు. కాగా, ఉన్నతాధికారులకు నివేదికను అందించి తయారీ కేంద్రాన్ని సీజ్ చేస్తామని అధికారులు తెలిపారు. దాడిలో తహసీల్దార్ కె.వెంకటమాధవరావు, డీటీ కృష్ణ, ఫుడ్‌సేప్టీ అధికారులు పాల్గొన్నారు. -
పార్లమెంటు నియోజకవర్గానికో ఆహారశుద్ధి పరిశ్రమ
సాక్షి, అమరావతి: రానున్న రెండేళ్లలో ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికో ఆహారశుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని వాణిజ్యం, పరిశ్రమల శాఖ (ఆహారశుద్ధి) కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. సచివాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌తో భేటీ అయ్యారు. అనంతరం సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆహార శుద్ధి పరిశ్రమల రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యతనిస్తున్నారని, అందుకే ఈ శాఖకు ప్రత్యేకంగా కార్యదర్శిని నియమించారని చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చెయ్యాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. ఆయా జిల్లాల్లో పండే పంటల ఆధారంగా ఏ జిల్లాలో ఎలాంటిæ పరిశ్రమ రావాలన్న దానిపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాష్ట్ర ఆహారశుద్ధి సొసైటీ సీఈవో శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వారి టార్గెట్ యాత్రికులే.. మూడు పార్శిళ్లు ఆరు కర్రీలుగా దందా!
రద్దీ ప్రాంతాల్లోని బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో.. ఆకట్టుకునే రంగులతో మసాలాలు దట్టించిన ఆహారం.. నూనెల్లో వేయించిన పదార్థాలు.. చూస్తూనే నోరూరించేలా ఉండే కర్రీలు.. సర్వ సాధారణం. వీటి తయారీలో వాడే కృత్రిమ రంగులు, కల్తీ నూనెలు అత్యంత ప్రమాదకరమని అధికారులు ధ్రువీకరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పలు ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో సేకరించిన శాంపిల్స్‌లో కేన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు తేలడంతో.. ఇవి తింటే రోగాలు తప్పవని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాక్షి,చిత్తూరు: జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి. ఈ దందా.. రోజురోజుకూ శృతి మించుతుండడంతో జనం రోగాల బారిన పడుతున్నారు. చిత్తూరులోని పాతబస్టాండ్, హైరోడ్డు, కట్టమంచి, తిరుపతిలోని కొత్తబస్టాండ్, లీలామహాల్రోడ్డు, తుడారోడ్డు, పుత్తూరు బస్టాండ్ సమీపంలోని ప్రాంతాలు, మదనపల్లె, పలమనేరు, శ్రీకాళహస్తిలోని కొన్ని కూడళ్లలో జనం రద్దీ అధికంగా ఉంటుంది. ఇక్కడ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్లు, మాంసాహార ఉత్పత్తులు అధికంగా విక్రయిస్తుంటారు. వీటిలో వినియోగించే పదార్థాలు పలు వ్యాధులకు కారణమవుతున్నాయని అధికారులు గుర్తించారు. జిల్లాలోని 75 హోటల్స్‌లో అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించి, ప్రమాదకరమని భావిస్తున్న 17 శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపారు. వీటిలో 6 శాంపిల్స్ వినియోగానికి ఏమాత్రం తగవని తేలింది. అయినా ఈ కల్తీఫుడ్ దందా మాత్రం యథేచ్ఛగా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. యాత్రికులే టార్గెట్.. జిల్లాలో ఆలయాలు ఎక్కువగా ఉండడంతో నిత్యం లక్షలాది మంది యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు. తిరుపతి, తిరుచానూరు, కాణిపాకం, బోయకొండ, శ్రీకాళహస్తి వంటి రద్దీ ప్రాంతాల్లో ఫుడ్‌సెంటర్ల వ్యాపారం మూడు పార్శిళ్లు.. ఆరు కర్రీలు అన్న తరహాలో సాగుతోంది. దీనికితోడూ మాసం భోజన ప్రియులు గతంలో కంటే పెరగడంతో హోటల్స్, డాబా, ఫాస్ట్‌ఫుడ్, స్నాక్స్, బిర్యానీ దుకాణాలు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. లైసెన్సులుండవు ఆహార పదార్థాలు తయారుచేసేవారు, నిల్వ చేసే వ్యాపారులు, రవాణా చేసే సంస్థలు తప్పనిసరిగా లైసెన్స్‌లు పొందాలి. ఆహార భద్రతా నియామావళి ప్రకారం లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేసి రూ.5 లక్షల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. జిల్లా వ్యాప్తంగా లైసెన్స్ ఉన్న హోటళ్లు: 73, రెస్టారెంట్లు–395, క్యాంటీన్లు–98, డాబా లేదా ఫుడ్ వెండింగ్స్–56 మాత్రమే లైసెన్సులు కలిగి ఉన్నాయంటే అతిశయోక్తికాదు. వీటికి రెట్టింపు సంఖ్యలో దుకాణాలకు ఎలాంటి అనుమతులు లేవు. ప్రధాన సమస్య ఇదే.. ముఖ్యంగా మాంసాహార పదార్థాలు విక్రయింటే దుకాణాలు, బేకరీ, స్వీట్స్ తయారీలో ఎసెన్స్ సింథటిక్ రంగులు అధికంగా వినియోగిస్తుండడంతో కేన్సర్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వీటికితోడు హోటల్స్‌లో చికెన్, మటన్, రొయ్యలు ఎక్కువ రోజులు డీప్‌ఫ్రిజ్‌లో ఉంచి వాడుతున్నారు. ఇవి వినియోగదారుల శరీరాలను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా జీర్ణకోశ సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. -
4,000 కిలోల మామిడి పండ్లు ద్వంసం.. ఎందుకంటే?
చెన్నై: వేసవి కాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురుచూసే పండు మామిడి. పండ్లలో రారాజుగా పిలుచుకునే ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు అని ప్రతీతి. అయితే కొందరు వ్యాపారులు వాటిని పండించడానికి పెస్టిసైడ్స్ వినియోగంచడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. తాజాగా తమిళనాడులోని త్రిచి జిల్లాలో కృత్రిమంగా పండించిన ఓ నాలుగువేల కిలోల మామిడి పండ్లను ఆహార భద్రతా శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. శనివారం గాంధీ మార్కెట్లో రసాయనాలు పిచికారీ చేసి మామిడి పండ్లను పండించినట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో జిల్లాలోని ఆహార భద్రతా విభాగ బృందం ఆఫీసర్ ఆర్ రమేశ్ బాబు నేతృత్వంలో గాంధీ మార్కెట్లోని పది గోడౌన్లపై దాడి చేశారు. పండ్లను కృత్రిమంగా పండించడానికి మూడు గోడౌన్లలో ఇథిలీన్ వాడినట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం నేరస్థులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు విక్రేతలను హెచ్చరించారు. చదవండి: ప్రజలు మేకలా.. మంత్రులు తోడేళ్లా! -
మామిడి మార్కెట్లలో తనిఖీలు
సాక్షి, అమరావతి: ‘మధురఫలం.. చైనా హాలాహలం’ శీర్షిక న మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సంచలనం కలిగిం చింది. సీజనల్ ఫ్రూట్స్‌ను 24 గంటల్లో మగ్గపెట్టి సొమ్ము చేసుకునే లక్ష్యంతో కొంతమంది వ్యాపారులు నిషేధిత ఎథెఫాన్ పౌడర్‌ను మోతాదు కు మించి వినియోగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. పురుగుమందుల మాటున చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎథెఫాన్ పౌడర్‌ను ఇష్టానుసారం వినియోగిస్తున్న వ్యాపారులపై ఉక్కుపాదం మోపింది. ఆహార భద్రతా విభాగం, ఉద్యానశాఖ కమిషనర్లు కాటమనేని భాస్కర్, డాక్టర్ ఎస్. ఎస్.శ్రీధర్ ఆదేశాల మేరకు ఉద్యాన, రెవెన్యూ, పోలీస్‌శాఖలతో కలిసి ఆహార భద్రతా విభాగం అధికారులు బృందాలుగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన మార్కెట్లలో తనిఖీలకు శ్రీకారం చుట్టారు. కృష్ణాజిల్లాలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత ఆదేశాలతో జోనల్ ఫుడ్ కంట్రోలర్ ఎన్.పూర్ణచంద్రరావు నేతృత్వంలో ఉద్యానశాఖ ఏడీ దయాకరబాబు, ఫుడ్ సేఫ్టీ అధికారులు శేఖరరెడ్డి, గోపాలకృష్ణ, శ్రీకాంత్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మ్యాంగో మార్కెట్లను విస్తృతంగా తనిఖీ చేశా రు. రాష్ట్రంలోని ప్రధాన మ్యాంగో మార్కెట్లలో ఒకటైన నున్న మ్యాంగో మార్కెట్‌తో పాటు జిల్లాలోని ఇతర మార్కెట్లలో దాడులు నిర్వహించారు. దాదాపు అన్ని మార్కెట్లలోను ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనలకు విరుద్ధంగా ఎథెఫాన్‌ను విచ్చలవిడిగా విని యోగిస్తున్నట్టు గుర్తించారు. ఆ మార్కెట్లలో శాంపి ల్స్ సేకరించి కేసులు పెట్టారు. ఈదరలోని కేజీఎన్ మ్యాంగో కంపెనీ, చీమలపాడులోని రసాలు మ్యాంగో కంపెనీ, చీమలగూడెంలో శ్రీరామాంజనేయ ఫ్రూట్ మార్కెట్, ఎ.కొండూరులో కృష్ణ ఆగ్రోస్ (మ్యాంగో యార్డు), నున్న మార్కెట్లోని యశస్వినీప్రసన్నలక్ష్మి ఫ్రూట్ కంపెనీ, కోటేశ్వరరావు ఎస్బీఎఫ్ కంపెనీలపై 9 కేసులు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో ఈ దాడులు కొనసాగుతాయి. ఈరోజు కృష్ణాజిల్లాలో తనిఖీలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయి. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఈ తనిఖీలు మ్యాంగో సీజన్‌కు పరిమితం కాదు. బొప్పాయి, బత్తాయి, జామ, అరటి తదితర పండ్లను మాగబెట్టే విషయంలో ఎథెఫాన్ వంటి విషపూరిత రసాయనాలు వినియోగిస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేస్తాం. – స్వరూప్, జాయింట్ ఫుడ్ కంట్రోలర్ -
వాటర్ ప్లాంట్లపై విస్తృతంగా దాడులు
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో మినరల్ వాటర్ పేరిట అడ్డగోలుగా నడుస్తున్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై దాడుల పరంపర కొనసాగుతోంది. అనధికార వాటర్ ప్లాంట్లపై ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మాయాజలం’ కథనంపై స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసగా నాలుగో రోజు కూడా తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 17 వాటర్ ప్లాంట్లలో తనిఖీలు చేశారు. ఆయా ప్లాంట్లలో నిబంధనలకు విరుద్ధంగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు తయారుచేస్తున్నట్టు గుర్తించారు. పూర్తి స్థాయి అనుమతులు లేకుండా అవి నడుస్తున్నాయని తేల్చారు. ప్లాంట్లలో నిల్వ ఉన్న స్టాకును సీజ్ చేశారు. ఈ ప్లాంట్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్టు జాయింట్ ఫుడ్ కంట్రోలర్ స్వరూప్ ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
‘మాయా జలం’పై కదిలిన యంత్రాంగం
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘మాయా జలం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా, తగిన అనుమతులు లేకుండా నడుపుతున్న వాటర్ ప్లాంట్లను తనిఖీ చేయాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ మంజరి సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కృష్ణా జిల్లాలో అనధికార ప్లాంట్లపై ఫుడ్ సేఫ్టీ, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. విజయవాడ పటమటలోని బ్లూ వాటర్ ప్లాంట్, సూర్యారావుపేటలోని శ్రీగంగా వాటర్ ప్లాంట్లను జోనల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు నేతృత్వంలో అధికారులు తనిఖీ చేశారు. ప్లాంట్ల సీజ్: బ్లూ వాటర్ ప్లాంట్‌కు బీఐఎస్/ఐఎస్ఐ లైసెన్స్‌లతో పాటు ఇతర అనుమతులు లేవని, వాటర్ ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లలో అపరిశుభ్రత తాండవిస్తోందని అధికారులు గుర్తించారు. ఇంకా వివిధ కంపెనీల (బ్లూ, వేగా, శ్రీరాం) పేర్లతో లేబుళ్లను ముద్రించి పావు లీటరు, అర లీటరు, లీటరు బాటిళ్లకు అతికించి అక్రమంగా విక్రయిస్తున్నట్టు కనుగొన్నారు. సిబ్బంది కోవిడ్ జాగ్రత్తలు పాటించకపోవడాన్ని గుర్తించారు. రోజుకు 4 వేల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ ప్లాంట్‌ను ఎనిమిదేళ్ల క్రితం ఐఎస్ఐ గుర్తింపుతో ప్రారంభించి, ఆ తర్వాత నాలుగేళ్లుగా రెన్యువల్ చేయించకుండా, ఇతర అనుమతులు తీసుకోకుండా నడుపుతున్నట్టు తనిఖీల్లో తేలిందని జోనల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ‘సాక్షి’కి చెప్పారు. విజయవాడ పటమటలోని బ్లూ వాటర్ ప్లాంట్‌లో అధికారుల తనిఖీలు ఈ ప్లాంట్‌లో ఉన్న 6,125 సీల్డ్ వాటర్ బాటిళ్లను సీజ్ చేశామన్నారు. మరోవైపు అనుమతుల్లేకుండా నడుస్తున్న శ్రీగంగా వాటర్ ప్లాంట్‌లోనూ తనిఖీలు నిర్వహించామని, అక్కడ 90 ప్యాకెట్ల చొప్పున ఉండే 103 బ్యాగులను సీజ్ చేశామని చెప్పారు. ఈ రెండు ప్లాంట్లను సీజ్ చేసి నిర్వాహకులపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్టు చెప్పారు. తనిఖీల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు శేఖర్‌రెడ్డి శ్రీకాంత్, గోపాల్, విజిలెన్స్ సీఐ అశోక్‌రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. బుధవారం కూడా తనిఖీలు కొనసాగుతాయని జాయింట్ కలెక్టర్ మాధవీలత చెప్పారు. కాగా, బుధవారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అనధికార వాటర్ ప్లాంట్లపై నిరంతరాయంగా దాడులు నిర్వహిస్తామని జాయింట్ ఫుడ్ కంట్రోలర్ స్వరూప్ చెప్పారు. -
నూనె మిల్లులపై దాడులు
నరసరావుపేట/తెనాలి రూరల్/భవానీపురం (విజయవాడ పశ్చిమ)/గుంటూరు (మెడికల్): ఆహార పదార్థాల కల్తీలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ‘సాక్షి’ దినపత్రికలో ‘ఆహారం.. హాహాకారం’ శీర్షికన కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలోను, విజయవాడలోను ప్రత్యేక బృందాలు బుధవారం దాడులు జరిపాయి. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని నూనె మిల్లులపై ఆహార కల్తీ నియంత్రణ శాఖ, పౌర సరఫరాలు, తూనికల, కొలతల శాఖల అధికారులు బుధవారం దాడులు జరిపారు. కొబ్బరి, వేరుశనగ, సన్‌ప్లవర్ ఆయిల్స్‌ను రీ ప్యాకింగ్ చేస్తున్న మిల్లుల్లో రూ.4.51,665 విలువైన 3,152 లీటర్ల ఆయిల్ ప్యాకెట్లను సీజ్ చేసి, ఏడు శాంపిళ్లను సేకరించినట్టు ఆహార కల్తీ నియంత్రణ శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ షేక్ గౌస్‌మొహిద్దీన్ తెలిపారు. కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు ఆహార వివిధ శాఖల అధికారులతో ఆరు బృందాలుగా ఏర్పడి ఆయిల్ మిల్లులపై నిర్వహించామని ఆయన చెప్పారు. సత్తెనపల్లి రోడ్డులోని కనకదుర్గ ఇండస్ట్రీస్‌లో రూ.77,765 విలువ చేసే 480 లీటర్ల వేరుశనగ నూనె ప్యాకెట్లను, కోటప్పకొండ రోడ్డులోని వెంకటలక్ష్మి ట్రేడర్స్ మిల్లులో రూ.3,28,900 విలువైన 2,192 లీటర్ల సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లను, హోం గాయత్రి ఇండస్ట్రీస్‌లో హెల్దీ ఆయిల్ కమ్ హెల్దీ లైఫ్ అని రాసిన రూ.45 వేల విలువైన 480 లీటర్ల సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లను సీజ్ చేశామన్నారు. సత్తెనపల్లి రోడ్డులోని బొడ్డు నాగేశ్వరరావుకు చెందిన ధనలక్ష్మి నీమ్ ఆయిల్ మిల్లు, దివ్య నాగసాయి ఆయిల్ మిల్లులో వేరుశనగ నూనె, ఆంజనేయ ట్రేడింగ్ కంపెనీలో కొబ్బరినూనె శాంపిల్స్ సేకరించామన్నారు. నూనె తయారీ కేంద్రాలపై కేసులు ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తెనాలిలోని నూనె తయారీ కేంద్రాలపై బుధవారం దాడులు నిర్వహించారు. గంగానమ్మపేటలోని శ్రీనివాస ఆయిల్ అండ్ ప్రొవిజన్స్ సంస్థపైన, పూజ అండ్ నంది దీపారాధన తైలం తయారీ సంస్థపైనా కేసు నమోదు చేశారు. విజయవాడలో కొనసాగిన దాడులు విజయవాడ నగరంలో చేపట్టిన దాడులు బుధవారం కూడా కొనసాగాయి. భవానీపురం గాం«దీ»ొమ్మ రోడ్‌లోని వెంకటదుర్గ, మహేశ్వరి డాల్ మిల్స్‌పై ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు నేతృత్వంలో దాడులు నిర్వహించారు. రెండు మిల్లులలో రూ.3 లక్షల విలువైన పెసరపప్పు బస్తాలను సీజ్ చేసి నమూనాలను సేకరించారు. మహాత్మాగాంధీ హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని రాకేష్ ట్రేడర్స్ ఆయిల్ కంపెనీ రాయలసీమ నుంచి దిగుమతి చేసుకున్న విడి నూనెను, నూనె ప్యాకెట్ల నమూనాలను సేకరించారు. భవానీపురం ఐరన్ యార్డ్‌లో పప్పు ధాన్యాల నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. దాల్ మిల్స్‌లోని పెసరపప్పులో నిషేధిత రంగు కలుపుతున్నట్టు గుర్తించామన్నారు. కల్తీ చేసే వారిపై చర్యలు తప్పవు.. నిత్యావసర సరుకులు, ఆహార పదార్ధాలను కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘ఆహారం .. హాహాకారం’, ‘బయో మాయా’ శీర్షికలతో ప్రచురితమైన కథనాలపై స్పందించిన కలెక్టర్ సివిల్ సప్లైస్, ఫుడ్ సేఫ్టీ, తూనికలు, కొలతల శాఖ అధికారులు, మునిసిపల్ కమిషనర్లతో కలెక్టర్ వివేక్‌యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సివిల్ సప్లైస్, ఫుడ్ సేఫ్టీ, తూనికలు, కొలతలు, పట్టణాల్లో మునిసిపల్ కమిషనర్లు, మండలాల్లో తహసీల్దార్లతో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలన్నారు. రెస్టారెంట్లలో మాంసం కల్తీ ఎక్కువగా జరుగుతోందని, మునిసిపల్ కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కల్తీ పురుగు మందులు, విత్తనాలు విక్రయించకుండా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. -
మటన్ కొంటున్నారా.. అయితే జాగ్రత్త
-
మటన్ కొంటున్నారా.. అయితే జాగ్రత్త
సాక్షి, విజయవాడ : విజయవాడ పాతబస్తీలోని గొల్లపాలెం సెంటర్లో ఉన్న మాంసం దుకాణాలపై ఆదివారం ఫుడ్‌సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతులు లేకుండా మేకలను చంపడమే గాక కుళ్లిపోయిన మాంసం విక్రయాలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పలు షాపుల్లో నిల్వ ఉంచిన మాంసంను పరిశీలించగా అది కుళ్లిపోయి దాని నుంచి పురుగులు బయటికి వచ్చాయి. దీంతో వివిధ షాపుల్లో 10 రోజులకు పైబడిన 750 కిలోల మటన్‌తో పాటు నిల్వ ఉంచిన 70 మేక తలకాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సాయి, సాంబశివరావు అనే వ్యక్తులకు చెందిన మటన్ షాపులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మీడియాతో మాట్లాడారు. నిల్వ చేసి ఉన్న మటన్‌లో పురుగులు ఉన్నాయని.. ఇలాంటి మాంసం తింటే ప్రజలు అనారోగ్యానికి గురవుతారని సూచించారు. మటన్, చికెన్ ప్రియులు తాజా మాంసాన్నే కొనలాని తెలిపారు. కాగా షాపుల నుంచి స్వాధీనం చేసుకున్న మాంసం శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపించారు. ఇకపై నిల్వ ఉంచిన మాంసం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కాగా సాంపిల్స్ రిపోర్టు ఆధారంగా ఆయా షాపులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
బార్బెక్యూలో పాచిపోయిన మటన్, హల్వా
-
బార్బెక్యూలో పాచిపోయిన మటన్, హల్వా
సాక్షి, విజయవాడ: నగరంలోని బార్బెక్యూ నేషన్ రెస్టారెంట్లో పుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లో పలు నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. కనీసం కోవిడ్ నిబంధనలు పాటించకుండానే రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. దీనిపై విజిలెన్స్ ఎస్పీ కనకరాజు, పుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. 'నిల్వ ఉన్న 1,500 కిలోల మటన్‌ను గుర్తించాం. ఆహారంలో నిషిద్ధ రంగులు వాడుతున్నారు. ఎంతోకాలంగా నిల్వ ఉంచిన హల్వాను వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. హోటల్ లో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. దీనిపై జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. రెస్టారెంట్‌లోకొన్ని సాంపిల్స్ సేకరించాం. పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపి రిపోర్టుల ఆధారంగా రెస్టారెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. -
గ్రేటర్లోయథేచ్ఛగా కల్తీ ఆహారం తయారీ
సాక్షి, సిటీబ్యూరో: కరోనా (కోవిడ్–19) అలర్ట్‌తో గ్రేటర్ పరిధిలో ఆహార భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నోరూరించే పానీపూరీ.. హాట్..హాట్ ఛాట్.. కబాబ్.. బిర్యానీ.. పాయా.. ఇలా రకరకాల వంటకాలు నోరూరిస్తుంటాయి. వీటి టేస్ట్ అన్ని వర్గాలను విశేషంగా ఆకర్షించడం వరకు బాగానే ఉన్నా.. అపరిశుభ్ర వాతావరణంలో వీటిని తయారు చేస్తే జిహ్వా చాపల్యం తీరడం మాటేమో గాని.. వాంతులు, విరేచనాలతో మంచం పట్టడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మహా నగరంలో ప్రస్తుతం వైరస్ సంబంధిత జబ్బులు విజృంభిస్తున్న నేపథ్యంలో కల్తీ ఆహారం కేసులు సిటీజన్లను కలవరపెడుతున్నాయి. ఆహార కల్తీ నిరోధక చట్టాన్ని అమలు చేసేందుకు జీహెచ్ఎంసీ వద్ద అరకొరగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు మాత్రమే అందుబాటులో ఉండడంతో పరిస్థితి రోజురోజుకూ విషమిస్తోంది. వీరు రోజుకు ఐదు చొప్పున నెలకు సుమారు 150 ఆహార నమూనాలను మాత్రమే తనిఖీ చేస్తుండడం గమనార్హం. ఇక గ్రేటర్ పరిధిలో గత ఏడాది సుమారు మూడువేల ఆహార కల్తీ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మరో 978 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. బుక్ చేసిన కేసుల్లో 23 మందిపై మాత్రమే క్రిమినల్ కేసులున్నట్లు పేర్కొన్నారు. తప్పించుకుంటున్న అక్రమార్కులు.. ప్రస్తుతం ఆహార కల్తీకి పాల్పడిన అక్రమార్కులకు ఆహార కల్తీ నిరోధక చట్టం కింద వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడితే రూ.500– రూ.3000 వరకు మాత్రమే జరిమానాలు విధిస్తుండడంతో పలు హోటళ్లు, తినుబండారాలు, చిరుతిళ్ల దుకాణాల యజమానులు అపరిశుభ్ర పరిసరాల్లో వండి వినియోగదారులకు వడ్డిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ల తనిఖీల్లో అక్రమాలు బయటపడితే తక్కువ మొత్తంలో జరిమానాలను చెల్లించి చేతులు దులుపుకొంటుండడం గమనార్హం. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. సిబ్బంది కొరత కారణంగా నగర వ్యాప్తంగా తనిఖీలు చేయడం వీరికి వీలు కావడంలేదు. వీరి సంఖ్యను సైతం 50కి పెంచాల్సిన అవసరం ఉంది. జాడలేని మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్.. గ్రేటర్ పరిధిలో ఆహార కల్తీని నిరోధించేందుకు మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామన్న బల్దియా అధికారులు ఒక వాహనాన్ని నగరంలో ప్రవేశపెట్టినప్పటికీ ఇది అలంకారప్రాయంగా మారింది. గ్రేటర్ పరిధిలో ఆహార తనిఖీలు నిర్వహించే మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌లు సుమారు 50 వరకు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ల్యాబ్‌ల్లోనూ 54 రకాల ఆహార కల్తీ పరీక్షలు నిర్వహించేలా వసతులు ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం నాచారంలోని ఫుడ్‌సేఫ్టీ ల్యాబ్‌లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు తీసుకున్న ఆహార నమూనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో అక్రమార్కులు సులభంగా తప్పించుకుంటున్నారు. భారీ జరిమానాలు విధించే యోచనలో సర్కారు.. ప్రస్తుతం ఆహార కల్తీ నిరోధక చట్టం కింద విధిస్తున్న జరిమానాలు వందల్లో ఉండటంతో ఈ చట్టానికి మరింత పదును పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేబినెట్ ఆమోదంతో ఈ చట్టాన్ని త్వరలో అమల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. నూతన చట్టంలో ఆహార కల్తీకి పాల్పడేవారిపై జరిమానాలు ప్రస్తుతం ఉన్న మొత్తానికి పది రెట్లు పెంచనున్నట్లు తెలిసింది. తద్వారా అక్రమార్కులు దారికి వస్తారని.. కల్తీ శ్రుతి మించితే సదరు వ్యక్తులపై క్రిమినల్ కేసుల నమోదుకు అవకాశం కల్పించేలా చట్టానికి పదునుపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. కల్తీ ఆహారంతోరోగాలు తథ్యం కల్తీ ఆహారంతో వాంతులు, విరేచనాలు, డయేరియా, జీర్ణకోశ వ్యాధులు, టైఫాయిడ్, హెపటైటిస్, కామెర్లు తదితర వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచిఉంది. అపరిశుభ్ర వాతావరణంలో తయారుచేసిన ఆహార పదార్థాలను తినకపోవడమే మంచిది. రుచికోసం శుచి లేని ఆహారం తీసుకొని ఇబ్బందులపాలు కావద్దు. ప్రస్తుతం వైరల్ ఫీవర్స్ పంజా విసురుతున్న నేపథ్యంలో సదా అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ బీరప్ప, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, నిమ్స్ -
ఆహారానికి సిటీ బెస్ట్.. ఫుడ్ సేఫ్టీ మిస్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఎక్కడి వారైనా లొట్టలేసుకుంటూ తింటారు. అంతేకాదు హైదరాబాద్‌లోని ఆహార పరిశ్రమపై ఆధారపడి లక్ష కుటుంబాలు బతుకుతున్నాయి. మూడు లక్షల మందికి పైగా ఈరంగంలో పనిచేస్తున్నారు. ప్రతిరోజూ 700 టన్నుల చికెన్, 291 టన్నుల మాంసం వినియోగమవుతోంది. ప్రత్యేక సందర్భాల్లో ఇంతకు రెండు మూడు రెట్లు వినియోగిస్తారు. ఫుట్‌పాత్ మీది బండ్ల నుంచిసెవెన్స్టార్ హోటళ్ల వరకున్నాయి. బిర్యానీతోపాటు ఇరానీ చాయ్, హలీంలతోనూ ఈ నగరం ఎంతో ప్రత్యేకతను సాధించుకుంది. వీటితో సహ వివిధ అంశాల ప్రాతిపదికగా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌కు అర్హత పొందింది. గ్యాస్రోనమీ(ఆహార సంబంధ) విభాగంలో నగరం ఇందుకు ఎంపికైంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఘనత వహించిన మహానగరంలో ఆహారం రుచికరమే కానీ.. ఫుడ్‌సేఫ్టీ మాత్రం కరువైంది. తనిఖీలు నిల్ నిబంధనల మేరకు హోటళ్లతో సహ ఆహార పరిశ్రమల్లో నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు జరగాల్సి ఉండగా జరగడం లేవు. ప్రతినెలా శాంపిళ్లను తీసి పరీక్షలు చేయించాల్సి ఉండగా, అది జరుగుతుందో లేదో తెలియదు. నిర్ణీత వ్యవధిలో ల్యాబ్‌కు పంపేందుకు సరిపడా యంత్రాంగం కూడా లేదు. ఎక్కడ పడితే అక్కడ దొరికే ఆహారంతోపాటు స్టార్ హోటళ్లలోనూ శుచిశుభ్రతకు పూచీ లేదు. దాదాపు ఏడాదిన్నర క్రితం జీహెచ్ఎంసీ హోటళ్ల తనిఖీల స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. శుభ్రత కనిపించని వంటగదులు, కుళ్లిన మాంసాన్నే వినియోగించడం, తినడానికి యోగ్యం కాని ఆహారాన్ని వడ్డించడం వంటివి గుర్తించారు. జరిమానాలు విధించారు. ఇకపై సహించబోమని హెచ్చరించారు. ఆ తర్వాత కూలబడ్డారు. కారణం జీహెచ్ఎంసీలో ఉండాల్సినంతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు లేరు. నగరంలో రిజిస్టరైన రెస్టారెంట్లు 2200 కాగా, టిఫిన్ బండ్ల నుంచి పెద్ద హోటళ్ల వరకు దాదాపు 80 వేలు ఉంటాయని అంచనా. యంత్రాంగం లేదు.. ♦ జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లలో 30 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఆరు జోన్లకు ఆరుగురు డిజిగ్నేటెడ్ ఆఫీసర్లు, జీహెచ్ఎంసీ మొత్తానికి ఒక అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఉండాలి. కానీ ప్రస్తుతం ముగ్గురు గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెండ్ ఫుడ్ కంట్రోలర్ మాత్రం ఉన్నారు. గ్రేటర్ నగరంలోని అన్ని హోటళ్లతో పాటు తినుబండారాల దుకాణాల తనిఖీలు తదితరమైన బాధ్యతలు వీరివే. ఇక కోర్టు కేసులూ తదితరమైనవి సరేసరి. ♦ 2011లో ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ వచ్చినప్పటికీ,నగరంలో ఇది అమలవుతున్న దాఖలాల్లేవు. దీని మేరకు ప్రతి తినుబండారాల దుకాణం వివరాలతో కూడిన ఆన్లైన్ జాబితా ఉండాలి. నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు.. తగినన్ని కల్తీపరీక్షల కేంద్రాలు.. కల్తీని బట్టి కఠినచర్యలు ఉండాలి. జీహెచ్ఎంసీలో ఏఎంఓహెచ్లున్నా వారు ఫుడ్‌సేఫ్టీ గురించి పట్టించుకోవడం లేరు. అప్పుడు హడావుడి.. తర్వాత కూలబడి.. 2017 ఏప్రిల్‌లో దాదాపు నెల రోజుల పాటు హోటళ్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. దాదాపు 400 హోటళ్లు తనిఖీలు చేసి 200కు పైగా హోటళ్లకు దాదాపు రూ. 17 లక్షల జరిమానాలు విధించారు. ఆతర్వాత మరచిపోయారు. 2015లో 413 శాంపిళ్లు సేకరించి 42 కేసులు, 2016లో 461 శాంపిళ్లు సేకరించి 63కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదు. ♦ హోటళ్ల తనిఖీలకు ప్రత్యేక యాప్‌ను తెస్తున్నామన్నారు. హోటళ్లలో ఏవి లోపిస్తే ఎంత జరిమానా విధించాలో అందులో ఉంటుందని, విస్తృతంగా తనిఖీలు చేసి ప్రజారోగ్యానికి భరోసాగా ఉంటామన్నారు. అనంతరం ఏంచేశారో అధికారులకే తెలియాలి. ఉక్కుపాదం కాదు.. ఉత్తిమాటలు.. హోటళ్లలో కల్తీపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు అప్పట్లో ప్రకటించారు. జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలని భావించారు. ప్రజలకు ఆరోగ్యభద్రత కల్పించేందుకు హోటళ్ల నిర్వహణ సక్రమంగా లేకుంటే పెనాల్టీలునిర్ణయించారు. రిపోర్టుల కోసం .. బేగంపేట మానససరోవర్ హోటల్లోని ఆహారం వల్లే రెండేళ్ల బాలుడు తీవ్ర వాంతులతో మృతి చెందాడనే ఆరోపణలు వెల్లువెత్తడం తెలిసిందే. హోటల్లోని ఆహారం శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపిన అధికారులు రిపోర్టుల కోసం వేచి చూస్తున్నారు. మరోమారు తనిఖీల హడావుడి చేస్తున్నారు. పెనాల్టీలు ఇలా... దేనికి ఎంత (రూ.లు) ♦ కిచెన్ శుభ్రంగా లేకుంటే: 500 ♦ సిబ్బంది దుస్తులు శుభ్రంగా లేకుంటే,చేతులకు గ్లవ్స్ లేకుంటే: 500 ♦ అపరిశుభ్ర, పగిలిన పాత్రలు వినియోగిస్తే : 500 ♦ కిచెన్‌లో వెంటిలేషన్,లైటింగ్ లేకుంటే: 500 ♦ వెజ్,నాన్‌వెజ్ పదార్థాలు కలిపి నిల్వచేస్తే: 500 ♦ తాగునీరు లేకుంటే: 1000 ♦ టాయ్లెట్లు లేకుంటే 2000 ♦ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకుంటే : 2000 ♦ ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు,ఎగ్జిట్ లేకుంటే :10000 ♦ ట్రేడ్‌లైసెన్స్ ప్రదర్శింకుంటే: 520 ♦ వీటితోపాటు ఇంకా పలు అంశాలకు నిర్ణీత జరిమానాలను నిర్ణయించారు. యాప్‌ద్వారా ఆయా ఉల్టంఘనలకు ఆటోమేటిక్‌గా జరిమానాలు పడతాయన్నారు. అధికారుల విచక్షణతో జరిమానాల్లో వ్యత్యాసాలుండవన్నారు. కానీ.. ఏం చేస్తున్నారోవారికే తెలియాలి. ♦ కొన్ని హోటళ్లతో నెలనెలా మామూళ్లకు లాలూచీ పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారుల తీరు చూసి దిగువ ఉద్యోగులు సైతం ఆయా హోటళ్లనుంచి పార్సిళ్లు తెప్పించుకుంటారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి హోటళ్లపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. ♦ ఏటా కల్తీ ఆహారంతో అనారోగ్యం బారిన పడుతున్నవారు దాదాపు: 40,000 ♦ టీఎస్పీఎస్సీ త్వరలో భర్తీ చేయనున్న ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ల పోస్టులు :26 -
‘మాసినేని’ బిర్యానీ తింటే ‘రంగు’పడుద్ది!
అనంతపురం న్యూసిటీ: ‘మాసినేని గ్రాండ్’ నగరం నడిబొడ్డున ఉన్న త్రీస్టార్ హోటల్.. ఇక్కడ పొరపాటున సామాన్యుడు భోజనం చేశాడంటే బిల్లు చుక్కలు చూడాల్సిందే. పోనీ నాణ్యమైన ఆహారం పెడుతున్నారంటే అదీ లేదు. రంగుల మిశ్రమంతో చేసిన ఆహార పదార్థాలు వడ్డిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు మాసినేనిలో తనిఖీలు నిర్వహించగా.. ఈ బాగోతం బయటపడింది. నగరంలోని కొన్ని హోటళ్ల నిర్వహణపై కలెక్టర్ గంధం చంద్రుడుకు ఇటీవల ఫిర్యాదులందాయి. దీంతో ఆయన హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీ చేయలని ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాసరెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ నగరంలోని మాసినేని, హ్యాంగౌంట్స్, హరియాణా జిలేబీ సెంటర్లను తనిఖీ చేశారు. మాసినేని గ్రాండ్లో బిరియాని, చికెన్ తందూరిలో అధికంగా రంగులు కలిపినట్లు అధికారులు గుర్తించారు. ఇలా రంగులు కలపడం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. మాసినేనిలోని ఆహార పదార్థాల శాంపిల్స్ తీసుకున్నారు. గతంలోనూ మాసినేని గ్రాండ్లో కుళ్లిన మాంసం, బూజు పట్టిన తినుబండారులు ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలో తేలిన విషయం విదితమే. కానీ అప్పట్లో టీడీపీ అండంతో ఎలాంటి కేసు నమోదు కాకుండా యాజమాన్యం తప్పించుకుంది. శాంపిల్స్ సేకరణ అనంతరం అధికారులు హ్యాంగౌట్స్‌లో తనిఖీ చేశారు. ఫ్రీజర్‌లో ఉంచి పలు ఆహార పదార్థాలను సేకరించారు. రంగులు అధికంగా వేసినట్లు గుర్తించారు. హర్యానా జిలేబీ నిర్వాహకులు నిబంధనలు పాటించకుండా టమాట సాస్ చేస్తుండగా.. అధికారులు శాంపిల్స్ సేకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి, కరీముల్లా మాట్లాడుతూ, సేకరించిన ఆహార పదార్థాలను ల్యాబ్‌కు పంపుతామన్నారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
హీరోయిన్ అంజలిపై ఫిర్యాదు
సినిమా: నటి అంజలిపై చర్యలు తీసుకోవాలంటూ కోవై ఆహార భద్రతా శాఖాధికారికి ఫిర్యాదు చేశారు. వివరాలు.. దక్షిణాదిలో హీరోయిన్ అంజలి పేరు సుపరిచయం. చట్ట నిబంధనలను పాటించకుండా తయారు చేస్తున్న ఒక వంట నూనె కంపెనీకి అంజలి ప్రచారం చేస్తున్నారంటూ కోవైకి చెందిన కోవై సుడర్‌పార్వై మక్కళ్ ఇయక్కం అధ్యక్షుడు సత్యగాంధీ గురువారం కోవై ఆహార భద్రత శాఖ అధికారికి ఒక ఫిర్యాదు చేశారు.ఈ–రోడ్డు ప్రధాన కార్యాలయంగా సదరు నూనె కంపెనీ నడుస్తోందన్నారు. వారు తయారు చేస్తున్న వంట నూనెను కొని పరిశోధనలకు పంపామని తెలిపారు. ఆ పరిశోధనలో తయారీదారులు నిభంధనలను పాటించడం లేదని తెలిసిందన్నారు. ఆ వంటనూనెతో ప్రజలకు హానికరం అని తెలిసిందన్నారు. అయినా వంటనూనెను కోవై జిల్లాలో పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు ఆ వంటనూనెను స్వాధీనం చేసుకుని, తయారీ దారుడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఈ వంటనూనె కంపెనీకి చెందిన వాణిజ్య ప్రకటనల్లో నటి అంజలి నటించి ప్రజలను మోసపుచ్చుతున్నారని, ఈ కారనంగా ఆమెపై నమోదు చేసి, విచారించాలని ఆ పిర్యాదులో పేర్కొన్నారు. -
రెచ్చిపోతున్న చికెన్ మాఫియా
హోటళ్లలో రకరకాల చికెన్ ముక్కలు నోరూరిస్తున్నాయని లాగించారో అంతే.. ఆస్పత్రిలో బెడ్ ఎక్కాల్సిందే. మాంసం దుకాణం నుంచి కొని తెచ్చుకుని వండుకు తిన్నా అదే పరిస్థితి.. జిల్లాలో చికెన్ మాఫియా రెచ్చిపోతోంది. పొరుగు రాష్ట్రాల్లో నిల్వ ఉంచిన, చెడిపోయిన మాంసాన్ని తీసుకువచ్చి చెలగాటమాడుతోంది. నెలరోజులుగా అధికారులు దాడులు చేస్తున్నారు. రోజుకో మోసం వెలుగుచూస్తోంది. చెన్నై, బెంగళూరు నగరాల్లో డంపింగ్ యార్డుకు వెళ్లాల్సిన వేల కేజీల చికెన్ జిల్లాకు తీసుకువచ్చి విక్రయిస్తుండటాన్ని తాజాగా గుర్తించిన అధికారులు విస్తుపోయారు. ప్రజలు మాంసం దుకాణాలకు, హోటళ్లకు వెళ్లాలన్నా భయపడుతున్నారు. జిల్లాలో జరుగుతున్న నయా చికెన్ దందాపై ప్రత్యేక కథనం. సాక్షి, నెల్లూరు: జిల్లాలో నయా చికెన్ దందా వెలుగుచూసింది. ఇతర రాష్ట్రాల్లో పనికి రాకుండా డంపింగ్ యార్డుకు వెళ్లే చికెన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసి విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లా మార్కెట్లోకి రోజూ ఏకంగా వెయ్యి కిలోలకు పైగా పనికిరాని చికెన్‌ను దిగుమతి చేస్తోంది. నగరంలోని అనేక బార్లు, హోటళ్లకు వీటినే సరఫరా చేస్తోంది. నెల్లూరు నగరపాలక సంస్థ అధికారుల దాడులతో చెన్నై చికెన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నగరంతో పాటు సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, తదితర ప్రాంతాలకు నిత్యం చెన్నై మార్కెట్ నుంచి నాసిరకం చికెన్ దిగుమతవుతోంది. బెంగళూరు నుంచి వారంలో రెండుసార్లు జిల్లా మార్కెట్‌కు చికెన్ దిగుమతవుతోంది. చెన్నై, బెంగళూరుల్లో చికెన్ లివర్‌ను, కందనకాయలు, కోడి వెనుక భాగాన్ని వేస్ట్‌గా తీసేసి డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు. దీన్ని స్థానిక వ్యాపారులు ఆదాయవనరుగా మార్చుకున్నారు. మార్కెట్లో సగటున చికెన్ ధర నాణ్యతను బట్టి రూ.140 నుంచి రూ.170 వరకు ఉంటుంది. ఈ క్రమంలో స్థానిక వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన చెన్నై చికెన్ భారీగా లాభాల ఆర్జనకు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి నాసిరకం మాంసంతో కల్తీకి పాల్పడుతున్నారు. కొద్ది నెలలుగా నగరంలో ఇదే తంతు జరుగుతున్నా అధికారులు దృష్టి సారించకపోవడంతో వాస్తవాలు వెలుగులోకి రాలేదు. ఈ క్రమంలో కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలతో ఫుడ్ కంట్రోల్ విభాగాధికారులు నెల్లూరు నగరంలో నగరపాలక సంస్థ అధికారులు, మున్సిపాల్టీల్లో స్థానిక అధికారులు వరుస దాడులు నిర్వహిస్తుండడంతో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. కొద్ది రోజులుగా హోటళ్లలో నిల్వ ఉంచిన చికెన్, ఇతర మాంసంతో వంటలు చేస్తున్నట్లు గుర్తించి పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశారు. కొనసాగింపుగా చికెన్ స్టాళ్లపై దృష్టి సారించారు. దీంతో చికెన్ స్టాళ్లలో దిగుమతి చికెన్‌ను ఫ్రిజ్‌లలో ఉంచి మూడు, నాలుగు రోజులు గడిచాక కూడా విక్రయిస్తున్నారు. దిగుమతి చికెన్ కిలో రూ.30 నుంచి రూ.40 చెన్నై, బెంగళూరు చికెన్ మార్కెట్లో నిత్యం విక్రయాలు వేల కిలోల్లో జరుగుతుంటాయి. అక్కడ నాసిరక చికెన్‌ను స్థానిక చికెన్ స్టాల్ నిర్వాహకులు కిలో సగటున రూ.30 నుంచి రూ.40కు రవాణా ఖర్చులతో కలిపి కొనుగోలు చేసి ఇక్కడి స్టాళ్లలో రోజువారీ చికెన్‌తో కలిపి విక్రయిస్తుంటారు. వినియోగదారుడే కాకుండా నిర్వాహకుడు సైతం గుర్తుపట్టలేని విధంగా కలిపేస్తారు. నగరంలో ప్రతి వారం సగటున 60 శాతం మంది చికెన్‌ను కొనుగోలు చేస్తుంటారు. ఒక్క ఆదివారం రోజే నగరంలో సగటున 16 వేల కిలోల చికెన్ విక్రయాలు జరగుతుంటాయి. ఇక రోజువారీగా హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లకు వెయ్యి కిలోలపైనే సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో అక్రమంగా తెచ్చి కల్తీ చేసిన చికెన్‌ను ఎక్కువగా బార్ అండ్ రెస్టారెంట్లకు, నగర, శివార్లలోని దాబాలకు ఎక్కువగా విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే చికెన్‌ను సరఫరా చేస్తుండటంతో నాణ్యత గురించి ఎవరూ పట్టించుకోని పరిస్థితి. వారానికి మూడు నుంచి నాలుగు వేల కిలోల చికెన్ ఎక్కువగా చెన్నై నుంచి వస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ప్రజారోగ్యం గాలికి కల్తీ, నిల్వ ఉంచిన చికెన్‌ను విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ, నిల్వ ఉంచిన చికెన్‌లో బ్యాక్టీరియా సాధారణ స్థాయి కంటే ఐదు వందల రెట్లు అధికంగా ఉంటుంది. దీర్ఘకాలంలతో మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రధానంగా కడుపునొప్పి, విరేచనాలు, నరాల సంబంధిత జబ్బులతో పాటు నిల్వ ఉంచి మాంసంలో ఎలాంటి పోషక గుణాలు ఉండవు. దీని వల్ల టైఫాయిడ్ జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. మెగ్డీలో నిల్వ చికెన్ గుర్తింపు నెల్లూరు సిటీ: దర్గామిట్టలోని రిలయన్స్ సూపర్ ఎదురుగా ఉండే మెగ్డీలో నగరపాలక సంస్థ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ మంగళవారం తనిఖీలు చేశారు. ఈ క్రమంలో నిల్వ ఉండే చికెన్, ఎక్స్పైరీ డేట్ పూర్తయిన బ్రెడ్, తదితర ఆహార పదార్థాలను గుర్తించారు. యజమానికి రూ.50 వేల జరిమానా విధించారు. వెటర్నరీ డాక్టర్ మదన్మోహన్, శానిటరీ సూపర్వైజర్ సాయీపీరా, ఇన్స్పెక్టర్ శేషయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఫ్రీజర్లలో కిలోల కొద్దీ మురిగిపోయిన మాంసం..
చికెన్ – 65.. తందూరీ చికెన్.. చికెన్ టిక్కా..లాలిపప్.. పెప్పర్ చికెన్.. మొఘలాయ్ చికెన్.. చికెన్ మంచూరియా.. ధమ్ బిరియానీ.. రొయ్యల ఫ్రై, చేపల పులుసు .. హోటళ్లలో మెనూ చూస్తే నోరూరాల్సిందే. అయితే వీటిని తింటే మాత్రం మంచమెక్కాల్సిందే. రంగురంగుల్లో ఉన్న చికెన్ ముక్కను తిన్నారంటే రోగాన్ని కొనితెచ్చుకున్నట్టే. వారం రోజులుగా జిల్లాలో అధికారులు చేస్తున్న తనిఖీల్లో ఫ్రీజర్లలో కిలోల కొద్దీ నిల్వ ఉంచి మురిగిపోయిన మాంసం వెలుగు చూస్తోంది. ఫలితంగా హోటళ్లకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. చిన్న హోటళ్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకూ ఎందులో చూసినా అంతా కల్తీనే. కల్తీరాయుళ్లపై కలెక్టర్ శేషగిరిబాబు కన్నెర్ర చేశారు. నాణ్యత పెరిగే వరకు అధికారులు దాడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: హైదరాబాద్ తర్వాత నాన్‌వెజ్‌ను అమితంగా ఇష్టపడే ప్రాంతాల్లో నెల్లూరు ఒకటి. జాతీయ రహదారిని ఆనుకొని నగరం ఉండటంతో నిత్యం నగరంలోని వినియోగదారులతో పాటు ఇతర జిల్లాల వాసులు పెద్ద సంఖ్యలో ఇక్కడి హోటళ్లకు వస్తుంటారు. అయితే అన్నిట్లో నాసిరక మాంసాహారం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నగరంలో నాణ్యతను పాటించడంలేదని ప్రాథమికంగా నిర్ధారించుకొని ఐస్‌క్రీమ్ షాపుల మొదలుకొని బార్ల వరకు తనిఖీలు నిర్వహించి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలతో ఫుడ్ కంట్రోల్ విభాగాధికారులు, మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి వరుస తనిఖీలు నిర్వహించి భారీగా కేసులు నమోదు చేసి హోటళ్ల నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడుతున్న యజమానులు కొందరు హోటళ్ల యజమానులు కాసులకు కక్కుర్తిపడి చెడిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. వేడిపై మాంసం తినడంతో చెడిపోయిందా లేదాననేది గుర్తించడం కష్టమే. దీన్ని అదునుగా చేసుకొని కొందరు హోటళ్ల యజమానులు వారాల తరబడి నిల్వచేసిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. నగరంలో దాదాపు 80 హోటళ్ల వరకు ఉండగా, ప్రధానమైన హోటళ్లు 20 నుంచి 30 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 1100 హోటళ్లు ఉన్నాయి. చాలా మంది యజమానులు అధిక మొత్తంలో మాంసాహారం కొనుగోలు చేస్తే ధర తగ్గుతుందనే ఉద్దేశంతో భారీగా కొనుగోలు చేస్తున్నారు. విక్రయాల్లో ఆలస్యమైతే మాంసాహారాన్ని ఫ్రీజర్లలో నిల్వ చేస్తారు. వారాల తరబడి ఫ్రీజర్లలో నిల్వ ఉండటంతో అప్పటికే మాంసం మురిగిపోతోంది. నగరంతో పాటు కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, ఆత్మకూరు, తదితర పట్టణాల్లో నిర్వహించిన వరుస దాడుల్లో ఫ్రీజర్లలో మురుగుతున్న కిలోల కొద్దీ మాంసాన్ని గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో కళ్లిపోయి.. దుర్వాసన వస్తున్న మాంసాన్ని కూడా కనుగొన్నారు. హోటళ్ల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసి జరిమానాలు విధించారు. ఇలా చేసే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడంతో పాటు గుర్తించిన మాంసాన్ని వెంటనే ధ్వంసం చేయించారు. కలెక్టర్ ఆదేశాలతో దాడులు ఈ నెల 25న కలెక్టర్ శేషగిరిరావు కార్పొరేషన్, ఫుడ్ కంట్రోల్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నెల్లూరులో ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారం అందజేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. కార్పొరేషన్ హెల్త్, ఫుడ్ కంట్రోల్ శాఖలు సంయుక్తంగా దాడులు చేపట్టాలని ఆదేశించారు. నిల్వ చేసిన ఆహారాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, ముందుగా జరిమానాలు విధించి హెచ్చరికలు జారీ చేయాలన్నారు. హోటళ్ల యజమానుల్లో మార్పు రాకపోతే సీజ్ చేసేందుకు కూడా వెనుకాడొద్దని హెచ్చరించారు. నాణ్యత పెరిగేంత వరకూ దాడులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించాలని ట్రెయినీ కలెక్టర్లను ఆదేశించారు. రూ.ఐదు లక్షలకు పైగా జరిమానా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు ఈ నెల 26న పది హోటళ్లపై దాడులు చేశారు. మద్రాస్ బస్టాండ్ వద్ద ఓ హోటల్లో చెడిపోయిన మాంసాన్ని భారీగా గుర్తించారు. దాడుల నేపథ్యంలో నగరంలోని హోటళ్ల యజమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శుక్రవారం ఒక్కరోజే రూ.1.7 లక్షల జరిమానాలు విధించారు. పరిశుభ్రత పాటించని కొన్ని హోటళ్లకు జరిమానాలు వేశారు. సోమవారం మూడు బార్ అండ్ రెస్టారెంట్లు, ఆరు హోటళ్లపై దాడులు చేసి రూ.2.5 లక్షల జరిమానా విధించారు. గూడూరు, కావలి, ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట మునిసిపాలిటీల్లోనూ హోటళ్లపై దాడులు ముమ్మరం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దశలవారీగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ల దుకాణాలు, ఇతర తినుబండారాల విక్రయాలు జరిపే హోటళ్లపై కూడా దాడులు జరపాలన్నారు. హోటళ్లపై నిరంతర తనిఖీలు నెల్లూరు(పొగతోట): జిల్లాలోని హోటళ్లు, దుకాణాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు, వస్తువులను అందించాలని కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశించారు. తన క్యాంప్ కార్యాలయం నుంచి మునిసిపల్ అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. నగరంలోని అనేక హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణంలో వంటశాలలు, ఆహారపదార్థాలు తనిఖీల్లో బయటపడ్డాయన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, దుకాణాలపై అపరాధ రుసుమును విధించాలని సూచించారు. ఆర్ఓ ప్లాంట్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి సరఫరా అవసరమైన ప్రాంతాలకు సంబంధించి ప్రతిపాదనలను పంపించాలని సూచించారు. కార్పొరేషన్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు. అధికారులపై ఆగ్రహం సూళ్లూరుపేట: సూళ్లూరుపేట పట్టణంలో ట్రయినీ కలెక్టర్ కల్పనాకుమారి మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై చివాట్లు పెట్టారు. తొలుత ఆలె చేపల మార్కెట్లో అక్కడే కోయడం, అక్కడే చెత్తా చెదారం వేయడంతో వస్తున్న దుర్వాసన దారుణంగా ఉన్న విషయం మీకు కనిపించలేదా? అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికోన్నత పాఠశాలలోకి వెళ్లి సమస్యలేమైనా వున్నాయా అని విద్యార్థులను అడగడంతో స్కూల్ ముందే పెద్ద మురుగునీటి కాలువ వుంది. అక్కడే అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుండడంతో దుర్వాసన భరించలేకపోతున్నామని విద్యార్థులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం బాపూజీ వీధిలోని గోమతి స్వీట్‌స్టాల్‌లో తినుబండారాలను పరిశీలించి అక్కడ ప్లాస్టిక్ కవర్లు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్న భవనానికి అనుమతి ఉందా? అని ప్రశ్నించారు. లేదని చెప్పడంతో అనుమతి తీసుకోకుండా భవనాన్ని నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారు.. నోటీలు ఇవ్వలేదా అని అధికారులను నిలదీశారు. పట్టణంలో అనుమతి లేని భవనాలు ఎన్ని ఉన్నాయో చెప్పాలని ఆదేశించారు. అనంతరం రాజధాన్ని హోటల్లోకి వెళ్లి అక్కడ మురిగిపోయిన చికెన్, రొయ్యలను గుర్తించి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. రహదారికి పక్కనే చెత్తడంపింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పట్టణంలోని పరిస్థితిపై నివేదికను కలెక్టర్ శేషగిరిబాబుకు అందజేస్తానని చెప్పారు. ఆమెతో పాటు కమిషనర్ నరేంద్ర, ఇతర సిబ్బంది వున్నారు. హోటళ్లలో కొనసాగుతున్న తనిఖీలు నెల్లూరు(సెంట్రల్): నగరంలోని హోటళ్లు, సినిమా థియేటర్లలో ఫుడ్ కంట్రోల్ అధికారులు, కార్పొరేషన్ హెల్త్ అధికారులు మంగళవారం దాడులు కొనసాగించారు. నగరంలోని సిరి మల్టీప్లెక్స్, అమరావతి బార్ అండ్ రెస్టారెంట్, ఎస్ – 2 సినిమా హాల్లో ఆహారం తయారు చేసే ప్రాంతాలు, రామలింగాపురం వద్ద ఉన్న పంజాబీ దాబాను పరిశీలించారు. అమరావతి బార్ అండ్ రెస్టారెంట్లో కొంత మేర లోపాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఎస్ – 2లో అన్ని లైసెన్స్‌లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ కంట్రోల్ గెజిటెడ్ అధికారి శ్రీనివాస్ మాట్లాడారు. కొన్ని రోజులుగా ఆహార తయారీ కేంద్రాలపై దాడులు చేస్తున్నామని, ప్రస్తుతం కొంత మార్పు కనిపిస్తోందని చెప్పారు. ఎక్కడైనా ఫుడ్ లైసెన్స్‌లు లేకుండా, నిల్వ చేసిన ఆహారాన్ని ఉంచితే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కార్పొరేషన్ హెల్త్ అధికారి వెంకటరమణ మాట్లాడారు. హోటళ్లలో అపరిశుభ్రత, నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగిస్తే జరిమానాలు విధిస్తామని, అప్పటికీ తీరులో మార్పు రాకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
ఐస్‌క్రీం ఫ్యాక్టరీలపై దాడులు
విజయవాడ: నగరంలోని భవానీపురం, గొల్లపూడి పరిసర ప్రాంతాల్లో ఐస్‌క్రీం తయారీ ఫ్యాక్టరీలపై ఫుడ్‌సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీలు రన్ చేస్తున్నట్లు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణలో ఐస్‌క్రీంలు, చాకోబార్, క్యాండీలు తయారు చేస్తున్నట్లు, రంగు, రుచి కోసం నిషిద్ధ రసాయనాలు వాడుతున్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఐస్‌క్రీం తయారీ కోసం వినియోగిస్తున్న నీటిని చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు. కలుషిత నీటితోనే ఐస్‌క్రీంలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఐస్క్రీంల తయారీకి ఊరు, పేరు లేని పాలపొడి, ముడిపదార్ధాలను నిర్వాహకులు వాడుతున్నారు. తయారీ తేదీ, ఎక్స్పైర్ డేట్లు ఐస్‌క్రీం డబ్బాలపై ముద్రించడం లేదని గుర్తించారు. ఐస్‌క్రీం తయారీలో ఎటువంటి సేఫ్టీ మెజర్స్ యాజమాన్యాలు పాటించడం లేదని అధికారులు తెలిపారు. ఇలాంటి ఐస్‌క్రీంలు తింటే పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు పాటించకుండా, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఐస్‌క్రీం తయారీ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. -
ప్యారడైజ్, కామత్‌లలో రంగుల మాంసాహారం..
విశాఖపట్నం :మాంసాహార పదార్థాలకు ఇష్టారాజ్యంగా రంగులు కలిపేయడం... రోజుల తరబడి నిల్వ చేసిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లలో భద్రపరచడం... ఓ సారి వాడిన వంట నూనెనే మళ్లీ మళ్లీ వినియోగించేందుకు నిల్వ చేయడం... నేలపైనే ఆహారం ఉంచడం... వంటశాలలు, ఆ పరిసరాల్లో వెగటు పుట్టించే వాతావరణం... నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో కనిపించిన ఈ దృశ్యాలు చూసి విజిలెన్స్ అధికారులే విస్తుపోయారు. సోమవారం పలు హాటళ్లలో విజిలెన్స్ అధికారులు కొరడా ఝుళిపించారు. గాజువాకలోని డైమండ్ ఆల్ఫా, ఆలిఫ్, కారు షెడ్ కూడలిలోని ప్రిన్స్ దాబా, ఆనందపురం మండలంలోని జాతీయ రహదారి పక్కన పెద్దిపాలెం వద్ద ఉన్న ప్యారడైజ్, కామత్ హోటళ్లు, అల్లిపురం జ్యోతి థియేటర్ పక్కనున్న మానస హోటల్లో, రుషికొండ వద్ద రాజు గారి దాబాగా ప్రసిద్ధి చెందిన సీ ఇన్ దాబాలో అధికారులు దాడులు చేపట్టారు. వీటి నిర్వహణను చూసి అధికారులు ముక్కున వేలేసుకున్నారు. చాలా చోట్ల ముందురోజు మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లలో నిల్వ చేసి మళ్లీ వేడి చేసి వినియోగదారులకు వడ్డిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా పలు ఆహార పదార్థాల నమూనాలు సేకరించారు. వాటిని పరీక్షల కోసం హైదరాబాద్ పంపించి నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ప్యారడైజ్, కామత్‌లలో రంగుల మాంసాహారం ఆనందపురం మండలంలోని జాతీయ రహదారి పక్కన పెద్దిపాలెం వద్ద ఉన్న ప్యారడైజ్, కామత్ హోటళ్లపై సోమవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏక కాలంలో దాడులు జరిపారు. ఈ మేరకు హోటళ్లలో ఆహార పధార్థాలను, శుభ్రతను పరిశీలించారు. విజిలెన్స్ సీఐ బి.నారీమణి, ఫుడ్ సేప్టీ అధికారి కె.వెంకట రత్నం, విజిలెన్స్ జియాలజిస్ట్ భైరాగి నాయుడు దాడులలో పాల్గొన్నారు. తాజాగా వండిన ఆహార పదార్థాలతో పాటు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పదార్థాలను పరిశీలించారు. హోటళ్లలో ఉన్న మాంసాహారాన్ని పరిశీలించి రంగులు కలిపినట్టు గుర్తించారు. ఈ మేరకు రెండు హోటళ్ల నుంచి మాంసాహార పదార్థాల నమూనాలను పరిశీలన నిమిత్తం సేకరించారు. ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించి భూమిలో పాతి పెట్టించారు. రెండు హోటళ్లలోనూ వంట శాలలతో పాటు పరిసర ప్రాంతాలు అధ్వాన్నంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు మొత్తం వివరాలను సేకరించి నివేదికను రూపొందించారు. పరిశీలన అనంతరం కేసులు నమోదు చేస్తామని అధికారులు చెప్పారు. ఇదీ ప్రిన్స్ దాబాలో తీరు, ఎప్పుడో వండిన బిర్యానీ, చికెన్ కారుషెడ్ కూడలికి సమీపంలోని ప్రిన్స్ దాబాపై విజిలెన్స్ డీఎస్పీ కె.శ్రావణి ఆదేశాల మేరకు అధికారులు సామవారం దాడులు నిర్వహించారు. వంటశాలలో గతంలో తయారు చేసిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వ చేసినట్లు గుర్తించారు. సుమారు 23 రకాల నిల్వ ఆహార పదార్థాలను వెలుపలకు తీయించారు. వాటిలో వాడిన నూనె, ఎప్పుడో వండిన అన్నం, బిర్యానీ, పలు మాంసాహార పదార్థాలు, పన్నీరు తీయించి మధురవాడ జోన్–1 ఆహార భద్రత అధికారి ఎస్.జనార్దన్ పరిశీలించారు. పరీక్ష నిమిత్తం పదార్థాల నమూనాలు సేకరించారు. దాబా నిర్వహణకు సంబంధించి లోపాలను పరిశీలించారు. తదుపరి చర్యగా దాబా యజమానికి నోటీసులు పంపించి ఆహార భద్రతా చట్టం – 32 కింద కేసు న మోదు చేస్తామన్నారు. పట్టుబడిన నాణ్యత లేని నిల్వ ఆహార పదార్థాలను పారవేయించారు. దాడుల్లో వి జిలెన్స్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, డీఈఈ పార్థసారథి, ఏఈఈ సీహెచ్ రామ్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. గాజువాకలో బూజు పట్టిన ఆహారం గాజువాకలోని రెస్టారెంట్లలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు, విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. కల్తీ ఆహారం, బూజు పట్టిన ఆహార పదార్థాలను గుర్తించారు. విజిలెన్స్ డీఎస్పీ కె.శ్రావణి ఆధ్వర్యంలో సిబ్బంది స్థానిక డైమండ్ ఆల్ఫా, ఆలిఫ్ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల్లో నాణ్యత లేకపోవడంతోరెస్టారెంట్ల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డీఎస్పీ కె.శ్రావణి మాట్లాడుతూ నగరంలో వివిధ ప్రాంతాల్లోని పలు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించామని చెప్పారు. చాలాచోట్ల నిల్వ ఉంచిన పదార్థాలు, బూజు పట్టిన ఆహారాన్ని విక్రయిస్తున్నారన్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. తనిఖీల్లో సీఐ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మో.. మానస హోటల్ అల్లిపురం జ్యోతి థియేటర్ పక్కనున్న మానస హోటల్లో పరిస్థితి చూసి విజిలెన్స్ అధికారులు అవాక్కయ్యారు. విజిలెన్స్ డీఎస్సీ పర్యవేక్షణలో సీఐ శ్రీనివాసరావు, సిబ్బంది సోమవారం దాడులు చేశారు. దుర్గందభరితమైన కిచెన్, పరిసర ప్రాంతాలు, బురద, నాచుపట్టిన ప్రదేశాల్లో వంట చేస్తుండడతో విజిలెన్స్ సీఐ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత దారుణంగా ఉన్న ఈ హోటల్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం జీవీఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్ అప్పారావు ఆహార పదార్థాలను ల్యాబ్‌కు పంపించారు. విజిలెన్స్ డీఎస్పీ శ్రావణి పర్వవేక్షణలో జరిగిన దాడుల్లో ఎస్ఐ సత్యకుమార్ పాల్గొన్నారు. ఆహార భద్రతపాటించకుంటే చర్యలు ఆహార పదార్థాలు తయారు చేసే హోటళ్ల నిర్వాహకులు నాణ్యత పాటించకుంటే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. నిబంధనల మేరకు కేసులు నమోదు చేస్తాం. లైసెన్సులు రద్దు చేస్తాం. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించం. పారిశుధ్యం పాటించాలి. ఏ రోజు తయారు చేసిన పదార్థాలు ఆ రోజే సరఫరా చేయాలి. నిల్వ చేసిన పాచిపట్టిన పదార్థాలు సరఫరా చేస్తే నేరంగా భావించి చర్యలు తీసుకుంటాం.– జనార్దన్, ఆహార భద్రత అధికారి,మధురవాడ జోన్ – 1 రాజుగారి దాబాలోనిల్వ పదార్థాలే రుషికొండ వద్ద రాజు గారి దాబాగా ప్రసిద్ధి చెందిన సీ ఇన్ దాబాలో సోమవారం విజిలెన్స్ దాడులు జరిగాయి. కస్టమర్ల ఫిర్యాదుతో విజిలెన్స్ డీఎస్పీ శ్రావణి ఆదేశాల మేరకు ఆ శాఖ అధికారులు, ఫుడ్ నియంత్ర శాక అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. ఇక్కడ నిల్వ ఉన్న ఆహార పదార్థాలు బయటపడటంతో అధికారులు కంగుతిన్నారు. మటన్, చికెన్, పీతలు, రొయ్యలు, అన్నం, పప్పు, బిరియాణి, సాంబారు అన్నీ నిల్వ ఉన్నట్లు గుర్తించారు. ముందు రోజు మిగిలినవి ఫ్రిజ్‌లో పెట్టి వాటిని మళ్లీ వేడిచేసి కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. దీంతోపాటు సాగర్‌నగర్ నుంచి రుషికొండ వరకు ఉన్న దాబాలలో ఇలాంటి ఫుడ్ విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. వాటిపైనా దాడులు జరుపుతామన్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషన్ రేవతి, ఫుడ్ ఇన్స్పెక్టర్ జనార్దన్, సిబ్బంది పాల్గొన్నారు. -
చిరుతిళ్ల పరిశ్రమలపై విజిలెన్స్ దాడులు
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): టేనర్‌పేటలో ఎటువంటి అనుమతులు లేకుండా చాక్లెట్లు, బిస్కెట్లు తయారు చేస్తున్న కంపెనీలపై విజిలెన్స్, ఫుడ్‌సేఫ్టీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఆయా కంపెనీలపై దాడులు చేసిన క్రమంలో అపరిశుభ్ర వాతావరణంలో, చాక్లెట్లు తయారీకి ఉపయోగించే ముడిసరుకులు చీమలు పట్టి, ఈగలు ముసురుతూ కనిపించాయి. చాక్లెట్లు, బిస్కట్ల శాంపిల్స్‌ను సేకరించిన అధికారులు, రవాణాకు సిద్ధంగా ఉన్న సరుకుతో పాటు కంపెనీలను సీజ్ చేశారు. టేనర్‌పేట అడ్డరోడ్డు, మసీదు ప్రాంతాలలో రేలంగి జ్యోతిశ్వరరావు రాధా ప్రొడక్ట్ పేరిట నిమ్మతొనలు, పిప్పర్మెంట్ చాక్లెట్లు తయారు చేస్తుంటాడు. మహాలక్ష్మి ప్రొడక్ట్ పేరిట మరుపిళ్ల రామకృష్ణ, ఎం.దుర్గారావు ప్రభుత్వ శాఖల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా కంపెనీలను నిర్వహిస్తున్నారు. దీనిపై విజిలెన్స్, ఫుడ్‌సేఫ్టీ అధికారులకు సమాచారం అందింది. విజిలెన్స్ సీఐ పి.వెంకటేశ్వర్లు, ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ ఎన్.పూర్ణచంద్రరావు సిబ్బంది ఆయా కంపెనీలపై దాడులు నిర్వహించారు. చాక్లెట్లు, బిస్కట్ల తయారీకి ఎటువంటి అనుమతులు లేకపోవడమే కాకుండా అపరిశుభ్ర వాతావరణంలో తయారీ, ప్యాకింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. కంపెనీలను సీజ్ చేయడమే కాకుండా సరుకు స్వాధీనం చేసుకున్నారు. విద్యాధరపురంలో... భవానీపురం(విజయవాడ పశ్చిమం): విద్యాధరపురం కబేళా ప్రాంతంలో ఎటువంటి లైసెన్స్ లేకుండా చిన్నపిల్లల తినుబండారాలు తయారుచేసే ఫ్యాక్టరీలో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ఫరీదా ఫుడ్ప్రొడక్టŠస్ పేరుతో షేక్ పర్వీన్ సుల్తానా అనే మహిళ తన భర్త రఫీతో కలిసి చిన్నపిల్లలు తినే తిమ్మిరి బిళ్లలు తయారు చేస్తున్నారు. అందుకు కావల్సిన లైసెన్స్‌లు తీసుకోకపోవడంతో సమాచారం అందుకున్న అధికారులు ఫ్యాక్టరీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నూతలపాటి పూర్ణచంద్రరావు, విజిలెన్స్ సీఐ పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విజిలెన్స్ ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టామని తెలిపారు. ఈ కంపెనీకి ఫుడ్ సేఫ్టీ, ప్యాకేజీ, లేబర్ లైసెన్సలు లేవని తమ తనిఖీలో బయటపడిందని చెప్పారు. ముఖ్యంగా అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. కొన్ని శ్యాంపిల్స్ సేకరించామని, వాటిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపి, వచ్చిన రిపోర్ట్నుబట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనిఖీలలో విజిలెన్స్ ఎస్ఐ సత్యనారాయణ, ఇనస్పెక్టర్స్ రమేష్‌బాబు, వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
పన్నీర్లో ప్లాస్టిక్.. జొమాటో క్షమాపణలు!
ముంబై : జొమాటో డెలివరీ చేసిన పన్నీర్ చిల్లీలో ప్లాస్టిక్ ఫైబర్‌ను గుర్తించిన ఓ వినియోగదారుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో చోటుచేసుకుంది. గత శుక్రవారం ఔరంగాబాద్‌కు చెందిన సచిన్ జామ్‌దారే జొమాటోలో పన్నీర్ చిల్లీ, పన్నీర్ మసాలా’ను ఆర్డర్ చేశాడు. దాన్ని కుటుంబ సభ్యులతో కలిసి తింటుండగా.. సచిన్ కుమార్తె అది తన పళ్లకు అంటుకుంటోందని, గట్టిగా చూయింగం ఉందని, పేర్కొంది. దీంతో దానిని పరీక్షించిన సచిన్ అందులో ఫైబర్ ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే ఆ ఆహారం సరఫరా చేసిన రెస్టారెంట్‌కు వెళ్లి ఫిర్యాదు చేసాడు. వారు పట్టించుకోకపోగా, జొమాటో డెలివరీ బాయ్ ఏదో చేసి ఉంటాడని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంతో కంగుతిన్న సచిన్ వెంటనే పోలీసుకు ఫిర్యాదు చేశాడు. రెస్టారెంట్ సరఫరా చేసిన ఆహారం తినడానికి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రూ.150 ఆహారంలోనే కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఇలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ తరహా మోసంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సచిన్ డిమాండ్ చేశాడు. ఇక ఈ ఆహారాన్ని పరీక్షలకు పంపించామని, నివేదిక అనంతరం దానిని సరఫరా చేసిన రెస్టారెంట్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఆ వినియోగదారుడికి క్షమాపణలు తెలిపింది. ఆ ఆహారాన్ని అందించిన రెస్టారెంట్‌ను తమ ప్లాట్‌ఫాం నుంచి తొలగించినట్టు ప్రకటించింది. గతంలో కూడా ఓ జొమాటో డెలివరీ బాయ్ కస్టమర్ ఆర్డ్‌ర్ చేసిన ఫుడ్‌ని కొద్దిగా కొద్దిగా తిని.. తిరిగి ప్యాక్ చేసి డెలివరీ చేయడం వివాదస్పదమైన విషయం తెలిసిందే. -
ఆహార భద్రత విభాగంలో 130 కొత్త పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార కల్తీని నివారించడం, ఎక్కడికక్కడ ఆహార పదార్థాల నాణ్యతపై తనిఖీలు నిర్వహించడం కోసం కొత్తగా 130 పోస్టులను మంజూరు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఫుడ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితర పోస్టులు ఇందులో ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఫైలును ఆ శాఖ ఇప్పటికే రూపొందించింది. త్వరలోనే సీఎం ఆమోదానికి పంపనున్నారు. సీఎం ఆమోదించాక పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడతారు.