ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌లకు క్లీన్‌ చిట్‌ | Fssai Finds No Traces Of Eto From Mdh And Everest Masala Spice | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌కు కారణమయ్యే ఆనవాళ్లు లేవు.. ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌లకు క్లీన్‌ చిట్‌

Published Wed, May 22 2024 7:21 AM | Last Updated on Wed, May 22 2024 1:01 PM

Fssai Finds No Traces Of Eto From Mdh And Everest Masala Spice

భారత్‌కు చెందిన ప్రముఖ మసాలా బ్రాండ్‌లు ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌ సంస్థలకు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (fssai) క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఆ రెండు సంస్థల అమ్మకాలు జరుపుతున్న మసాలల పొడుల ఉత్పత్తుల్లోక్యాన్సర్‌కు కారకమయ్యే ఎథిలీన్‌ ఆక్సైడ్‌ (eto) రసాయనాలు లేవని నిర్ధారించింది.

కొద్ది రోజుల క్రితం భారతీయ బ్రాండ్లయిన ఎవరెస్ట్, ఎండీహెచ్‌ అమ్మకాలు జరుపుతున్న మసాలల పొడుల ఉత్పత్తుల్లో పరిమితికి మించి ఎథిలీన్‌ ఆక్సైడ్‌ అనే పురుగుల మందు ఉన్నట్లు కనుగొన్నామని హాంకాంగ్‌ సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేఫ్టీ (సీఎఫ్‌ఎస్‌) ఏప్రిల్‌ 5న ప్రకటించింది. ఈ ఉత్పత్తులను కొనొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సీఎఫ్‌ఎస్‌ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ బ్రాండ్ల ఉత్పత్తులను సింగపూర్‌ ఫుడ్‌ ఏజెన్సీ రీకాల్‌ చేసింది.

అందులో ఎవరెస్ట్‌ ఫిష్‌ కర్రీ మసాలా, ఎమ్‌డీహెచ్‌కు చెందిన మద్రాస్‌ కర్రీ పౌడర్, సాంబార్‌ మసాలా మిక్స్‌డ్‌ మసాలా పౌడర్, కర్రీ పౌడర్‌ మిక్స్‌డ్‌ మసాలా పౌడర్‌ ఉన్నాయి.

ఎఫ్‌ఎస్‌ఏఐ అప్రమత్తం
ఆ ఆరోపణల నేపథ్యంలో అప్రమత్తమైన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అన్నీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఫుడ్‌ సేప్టీ కమిషనర్లు, రిజినల్‌ డైరెక్టర్లను అప్రమత్తం చేసింది. వెంటనే ఎవరెస్ట్‌, ఎమ్‌డీహెచ్‌ మసాల పొడుల శాంపిల్స్‌ కలెక్ట్‌ చేసి వాటిపై టెస్టులు చేయాలని ఆదేశించింది. దీంతో ఉన్నతాధికారులు మహరాష్ట్ర, గుజరాత్‌, హర్యానా, రాజస్థాన్‌లలో మసాల దినుసుల శాంపిల్స్‌ను కలెక్ట్‌ చేశారు.

ఇథిలీన్ ఆక్సైడ్‌ గురించి అన్వేషణ
పలు నివేదికల ప్రకారం.. అధికారులు మసాల దినుసుల శాంపిల్స్‌ను పరీక్షించారు. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (NABL) గుర్తింపు పొందిన ప్రయోగశాలలలో ఇథిలీన్ ఆక్సైడ్ కోసం నమూనాలను పరీక్షించారు.

28 ల్యాబ్‌ రిపోర్టులు 
అయితే ఇప్పటివరకు 28 ల్యాబ్ రిపోర్టులు అందాయి. ఫుడ్ రెగ్యులేటర్‌ సైంటిఫిక్ ప్యానెల్ శాంపిల్స్‌ను విశ్లేషించగా వాటిలో ఎలాంటి ప్రమాదకరమైన రసాయనం లేదని తేలింది.

ఆ రెండు కంపెనీలకు క్లీన్‌ చిట్‌
అంతేకాదు ఇతర బ్రాండ్‌లకు చెందిన మరో 300 మసాలా శాంపిల్స్ పరీక్ష నివేదికలను కూడా విశ్లేషించింది. అయితే భారతీయ ఉత్పత్తులు వినియోగానికి సురక్షితమైనవని చూపిస్తూ క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థం ఆనవాళ్లు లేవని ఎమ్‌డీహెచ్‌, ఎవరెస్ట్‌లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement