భారతీయ మసాల దినుసుల తయారీ సంస్థ ఎండీహెచ్, ఎవరెస్ట్ సంస్థలకు మరో ఎదురు దెబ్బ తగిలింది.
ఇటీవల ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాల దినుసుల్లో క్యాన్సర్ కారక పెస్టిసైడ్, ఇథిలీన్ ఆక్సైడ్ అధిక స్థాయిలో ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సింగపూర్, హాంకాంగ్‌లు భారత్ మసాల దినుసుల్ని వినియోగించరాదంటూ ఆ రెండు దేశాలు అధికారంగా ప్రకటించారు.
తాజాగా, నేపాల్ సైతం భారత్‌లో తయారయ్యే మసాల దినుసుల్ని వినియోగించడానికి వీలు లేదని, అందుకు నాణ్యతాపరమైన కారణాల్ని ఎత్తి చూపింది.
ఇథిలీన్ ఆక్సైడ్ కారణంగా
నేపాల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, అనుమానాస్పద ఇథిలీన్ ఆక్సైడ్ కారణంగా ఎండీహెచ్, ఎవరెస్ట్‌కు చెందిన నాలుగు మసాలా దినుసులపై నిషేధం విధించింది. నేపాల్ నిషేధం విధించిన మసాలలలో మద్రాస్ కర్రీ పౌడర్, సాంభార్ మిక్స్డ్ మసాలా పౌడర్, నేపాల్‌లో ఎండీహెచ్ మిక్స్‌డ్ మసాలా కర్రీ పౌడర్, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలు ఉన్నాయి.
ఇథిలీన్ ఆక్సైడ్ పరిమితిని మించి
ఈ నాలుగు ఉత్పత్తులలో ఇథిలీన్ ఆక్సైడ్ పరిమితిని మించి ఉన్నట్లు గుర్తించామని, ఆహార నియంత్రణ 2027 బీఎస్ ఆర్టికల్ 19 ప్రకారం ఈ ఉత్పత్తుల దిగుమతి, అమ్మకం దేశంలో నిషేధిస్తూ అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది.
మసాలా ఎగుమతులు దాదాపు 40 శాతం
భారత్ ప్రపంచ సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ది ఇక్కడ తయారైన 200కు పైగా మసాలాలు దాదాపు 180 దేశాలకు ఎగుమతి అన్నాయి. వీటి విలువ రూ. 33 వేల కోట్లు అని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా తెలిపింది. దేశీయ మార్కెట్ రూ. 83 వేల కోట్లకు పైమాట. కానీ ఇప్పుడు మసాల దినుసలపై వెల్లువెత్తున్న ఆరోపణలతో భారత్ మసాలా మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. భారతదేశ మసాలా ఎగుమతులు దాదాపు 40 శాతం క్షీణించవచ్చని భారత సుగంధ ద్రవ్యాల వాటాదారుల సమాఖ్య (FISS) తెలిపింది. అదే సమయంలో ఈ ప్రఖ్యాత మసాల దినుసులు ఎంత వరకు సేఫ్ అన్న అంశంపై ఆందోళనలు తలెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment