నేపాల్‌లో భారత న్యూస్‌ చానళ్ల నిలిపివేత | Nepal Bans All Indian News Channels Except DD | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో భారత న్యూస్‌ చానళ్ల నిలిపివేత

Published Thu, Jul 9 2020 8:43 PM | Last Updated on Thu, Jul 9 2020 8:43 PM

Nepal Bans All Indian News Channels Except DD - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌కు వ్యతిరేకంగా నేపాల్‌ వ్యవహరిస్తున్న తీరు ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు నేపాల్‌లోని రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందకు చైనా, పాకిస్తాన్‌ ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్‌ మరోసారి భారత్‌పై అక్కసు వెల్లగక్కింది. దూరదర్శన్‌ మినహా భారత్‌కు చెందిన అన్ని న్యూస్‌ చానళ్ల ప్రసారాలను గురువారం సాయంత్రం నుంచి కేబుల్‌ ఆపరేటర్లు నిలిపివేశారు. నేపాల్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రసారాలు చేస్తున్నారని ఆరోపిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.(నేపాల్‌ సంక్షోభం: చైనా, పాక్‌ కుట్రలు!)

‘నేపాల్‌ ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేకుండా చేస్తున్న ప్రచారం హద్దులు దాటంది. ఇది చాలా దారుణం. వెంటనే ఈ చెత్తను నిలిపివేయాలి’ అని మాజీ ఉప ప్రధానమంత్రి, అధికార నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ అధికార ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ట చెప్పారు.(ఓలి కోసం రంగంలోకి దిగిన చైనా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement