ఢిల్లీ : నేపాల్ (nepal), దాని సరిహద్దు ప్రాంతమైన టిబెట్‌లో భారీ భూకంపం(earthquake) సంభవించింది. మంగళవారం ఉదయం రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.1గా (7.1 magnitude earthquake) నమోదైంది. ఈరోజు పలు దేశాల్లో భూకంపంసంభవించింది. మొత్తం ఆరు చోట్ల భూకంపం వచ్చింది. టిబెట్, నేపాల్‌తో పాటు భారత్‌లోని కోల్‌కతా, బిహార్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది.
కాగా, టిబెట్ రీజియన్‌లోని పర్వత ప్రాంతాల్లో దాదాపు 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపంతో 53 మంది మృతి చెందగా, ఓవరాల్‌గా 62 మంది మృత్యువాత పడ్డారు.
యూనైటెడ్ జియోలాజికల్ సర్వే (usgs)ప్రకారం.. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 6:35 గంటలకు నేపాల్‌లో లుబోచికి 93 కిలోమీటర్ల దూరంలో ఈ భూమి కంపించింది. నేపాల్‌తో పాటు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో, బీహార్, కోల్‌కతాలోని కొన్ని జిల్లాల్లో భూమి కంపించినట్లు యూఎస్‌జీఎస్ అధికారులు తెలిపారు. భూకంప ప్రభావం తీవ్రతతో కొద్ది సేపు భూమి కంపించడంపై ప్రజలు ప్రాణ భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
#WATCH🚨 | Kathmandu | An earthquake with a magnitude of 7.1 on the Richter Scale hit 93 km North East of Lobuche, Nepal at 06:35:16 IST today: USGS Earthquakes#NepalEarthquake #Nepal pic.twitter.com/DMnTbHptTF
— MIDDLE EAST NEWS (@middleeastnevs) January 7, 2025
మరోవైపు భారత్,నేపాల్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో భూకంప తీవ్రతను గుర్తించి,సహాయక చర్యల చేపట్టేందుకు అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగింది. అధికారులు సైతం భూకంపంపై అప్రమత్త మయ్యారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
2015లో తొమ్మిదివేల మంది దుర్మరణం
ప్రపంచంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతాల్లో నేపాల్ ఒకటి. ఇక్కడ తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. చివరి సారిగా ఏప్రిల్ 25, 2015న నేపాల్‌లో 7.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం సుమారు 9వేలమందిని పొట్టన పెట్టుకుంది. 10లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి.దీన్ని బట్టి ఇవాళ సంభవించిన భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఖాట్మండ్ జనాభాలో మూడోవంతు
నేపాల్‌లో తొలిసారిగా అభయ మల్ల రాజు పాలనలో 7 జూన్ 1255లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రత నమోదైంది. నాడు సంభవించిన భూకంపం కారణంగా నేపాల్ రాజధాని ఖాట్మండ్ జనాభాలో మూడోవంతు మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో నేపాల్ రాజు అభయ మల్ల రాజు సైతం ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment