Masala
-
డబుల్ మసాలాతో.. నిద్రలేమి!
కొందరు పగటివేళ చురుగ్గా ఉండటానికి ఆహారం తక్కువగా తీసుకుంటూ, రాత్రి మాత్రం ఫుడ్ కాస్త గట్టిగానే తినేస్తుంటారు. రోజువారీ పనులన్నీ పూర్తయ్యాయనే రిలాక్సేషన్, మర్నాటి ఉదయం వరకు మరో పని ఉండదన్న హాయి ఫీలింగ్‌తో ఇలా చేస్తుంటారు. ఇంకొందరు రాత్రి డిన్నర్లలో ‘బిర్యానీ విత్ డబుల్ మసాలా’ అంటూ కాస్త ఎక్కువగానే ఆరగిస్తుంటారు.అయితే రాత్రిపూట తినే ఆహారంలో మసాలాలు ఎక్కువగా ఉన్నా, అదిప్రోటీన్ చాలా ఎక్కువగా ఉండే ఆహారమైనా తినేవాళ్లు నిద్రలేమికి గురయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు స్లీప్ స్పెషలిస్టులు. రాత్రి నిద్రకు ఉపక్రమించే కనీసం రెండుగంటల ముందుగానే లైట్ ఆహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.ఎక్కువ మసాలాలతో పాటు కొన్నిసార్లు కాఫీ, కొవ్వులు, చక్కెర మోతాదులు ఎక్కువగా ఉండే ఆహారాలతోనూ నిద్రపట్టకపోవచ్చనీ... హాయిగా నిద్రపట్టాలంటే గోరువెచ్చని పాలు, అరటిపండ్లు, బాదం, తేనె.. వీటిల్లో ఏదైనా తీసుకుంటే, అవి హాయిగా నిద్రపట్టేందుకు దోహదపడతాయన్నది స్లీప్ స్పెషలిస్టుల మాట.ఇవి చదవండి: ఈ యోగా.. సీతాకోక చిలుక రెక్కల్లా మన కాలి కదలికలు.. -
ఎండీహెచ్, ఎవరెస్ట్‌లకు క్లీన్ చిట్
భారత్‌కు చెందిన ప్రముఖ మసాలా బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్ సంస్థలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (fssai) క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ రెండు సంస్థల అమ్మకాలు జరుపుతున్న మసాలల పొడుల ఉత్పత్తుల్లోక్యాన్సర్‌కు కారకమయ్యే ఎథిలీన్ ఆక్సైడ్ (eto) రసాయనాలు లేవని నిర్ధారించింది.కొద్ది రోజుల క్రితం భారతీయ బ్రాండ్లయిన ఎవరెస్ట్, ఎండీహెచ్ అమ్మకాలు జరుపుతున్న మసాలల పొడుల ఉత్పత్తుల్లో పరిమితికి మించి ఎథిలీన్ ఆక్సైడ్ అనే పురుగుల మందు ఉన్నట్లు కనుగొన్నామని హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ (సీఎఫ్ఎస్) ఏప్రిల్ 5న ప్రకటించింది. ఈ ఉత్పత్తులను కొనొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సీఎఫ్ఎస్ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ బ్రాండ్ల ఉత్పత్తులను సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ రీకాల్ చేసింది.అందులో ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా, ఎమ్‌డీహెచ్‌కు చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా మిక్స్డ్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్ మిక్స్డ్ మసాలా పౌడర్ ఉన్నాయి.ఎఫ్ఎస్ఏఐ అప్రమత్తంఆ ఆరోపణల నేపథ్యంలో అప్రమత్తమైన ఎఫ్ఎస్ఎస్ఏఐ అన్నీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఫుడ్ సేప్టీ కమిషనర్లు, రిజినల్ డైరెక్టర్లను అప్రమత్తం చేసింది. వెంటనే ఎవరెస్ట్, ఎమ్‌డీహెచ్ మసాల పొడుల శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటిపై టెస్టులు చేయాలని ఆదేశించింది. దీంతో ఉన్నతాధికారులు మహరాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్‌లలో మసాల దినుసుల శాంపిల్స్‌ను కలెక్ట్ చేశారు.ఇథిలీన్ ఆక్సైడ్ గురించి అన్వేషణపలు నివేదికల ప్రకారం.. అధికారులు మసాల దినుసుల శాంపిల్స్‌ను పరీక్షించారు. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (NABL) గుర్తింపు పొందిన ప్రయోగశాలలలో ఇథిలీన్ ఆక్సైడ్ కోసం నమూనాలను పరీక్షించారు.28 ల్యాబ్ రిపోర్టులు అయితే ఇప్పటివరకు 28 ల్యాబ్ రిపోర్టులు అందాయి. ఫుడ్ రెగ్యులేటర్ సైంటిఫిక్ ప్యానెల్ శాంపిల్స్‌ను విశ్లేషించగా వాటిలో ఎలాంటి ప్రమాదకరమైన రసాయనం లేదని తేలింది.ఆ రెండు కంపెనీలకు క్లీన్ చిట్‌అంతేకాదు ఇతర బ్రాండ్లకు చెందిన మరో 300 మసాలా శాంపిల్స్ పరీక్ష నివేదికలను కూడా విశ్లేషించింది. అయితే భారతీయ ఉత్పత్తులు వినియోగానికి సురక్షితమైనవని చూపిస్తూ క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థం ఆనవాళ్లు లేవని ఎమ్‌డీహెచ్, ఎవరెస్ట్‌లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
నిబంధనల అమలులోనే అసలు చిక్కు!
భారతీయ మసాలాలపై హాంకాంగ్ ఈమధ్యే నిషేధం విధించింది. మూడు బ్రాండ్లపై ఈ నిషేధం వేటు పడింది. సింగపూర్‌లోనూ ఇంకో భారతీయ మసాలా కంపెనీపై ఇలాంటి క్రమశిక్షణ చర్యలే తీసుకున్నారు. ఎథిలీన్ ఆక్సైడ్ అనే కేన్సర్ కారక రసాయనం పరిమితికి మించి ఉన్నట్లు తేలడంతో ఆయా దేశాల నియంత్రణ సంస్థలు ఈ చర్యలకు పాల్పడ్డాయి. మాల్దీవులు చర్యలకు సిద్ధమవుతూండగా... అమెరికా, ఆస్ట్రేలియా ఆహార నియంత్రణ సంస్థలు కూడా మసాలాల్లో కలుషితాలపై నివేదికలను అధ్యయనం చేసే పనిలో ఉన్నాయి. నిజానికి ఇలాంటి చర్యలు భారతీయ కంపెనీలకు కొత్తేమీ కాదు. అమెరికా చేరుతున్న భారతీయ ఉత్పత్తుల్లో ఏటా కొన్ని వందలు నాణ్యత ప్రమాణాల లేమి కారణంగా తిరస్కరణకు గురవుతూనే ఉంటాయి. ఆయుర్వేద మందులపై కూడా ఎఫ్‌డీఏ తరచూ హెచ్చరికలు జారీ చేస్తూంటుంది. సీసం వంటి ప్రమాదకర భారలోహాలు, పదార్థాలు పరిమితికి మించి ఉంటాయన్నది వీరు తరచూ వ్యక్తం చేసే అభ్యంతరం. చిన్న పిల్లల ఆహారం విషయంలో ఇటీవలే అంతర్జాతీయ కంపెనీ నెస్లే భారత్‌లో మాత్రమే అధిక చక్కెరలు వాడుతున్న విషయం బయటపడ్డ సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు అన్నింటిలోనూ ఒక నిర్దిష్ట క్రమం కనిపిస్తుంది. కంపెనీ భారత్‌ది అయినా, విదేశీయులది అయినా సరే మా తప్పేమీ లేదని ప్రకటిస్తాయి. తయారు చేసిన దేశం లేదా ఎగుమతి చేస్తున్న దేశం నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తున్నామని కూడా చెబుతాయి. భారతీయ నియంత్రణ సంస్థలు ఇచ్చే సమాధానం కూడా పద్ధతిగా ఉంటుంది. ‘పరిస్థితిని అధ్యయనం చేస్తున్నాం’ అనేసి చేతులు దులిపేసుకుంటాయి. విదేశీ సంస్థలు సమచారం పంచుకోలేదన్న ఆరోపణ కూడా ఉంటుంది. ఎగుమతి ప్రోత్సాహక వ్యవస్థలు, కంపెనీలు రెండూ తాము బాధితులమని వాదిస్తూంటాయి. భారతీయ ఎగుమతులను మాత్రమే పాశ్చాత్య దేశాలు అడ్డుకుంటున్నాయని వాపోతాయి కూడా. ఈ మొత్తం వ్యవహారంలో నిస్సహాయంగా మిగిలిపోయేదెవరూ అంటే... వినియోగదారుడు మాత్రమే. కొంచెం సద్దుమణిగిన తరువాత అంతా షరా మామూలుగానే నడిచిపోతూంటుంది. కల్తీ, హానికారక, కాలుష్యాలతో కూడి ఆహార పదార్థాలు విదేశాలను చేరుతున్న విషయంలో అసలు సమస్య ఏమిటన్నది ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆహార నియంత్రణ వ్యవస్థ నిబంధనల్లోని లోటుపాట్లు సరి చేసే ప్రయత్నం జరగడం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం పరిశ్రమలను, ఎగుమతులను కాపాడుకోవాలనే నెపంతో ప్రభుత్వాలు చేసే ప్రయత్నాలు. తప్పు చేసినా వాటి ప్రభావం నుంచి తప్పించేందుకు ప్రయత్నించడం. ఈ క్రమంలోనే వీళ్లు ప్రజారోగ్యాన్నీ; వినియోగదారులు, పౌర సమాజ నిపుణుల అభిప్రాయాలనూ తోసిపుచ్చుతూంటారు. వివాదాల్లో చిక్కుకున్న కంపెనీలు భారత్‌లోని ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)’ నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తున్నట్లు చెప్పుకుని ఎలాగోలా తప్పించుకుంటాయి. నెస్లే విషయంలో ఈమధ్య జరిగింది ఇదే. కాబట్టి... ఆహార రంగంలో ఎగుమతులకు సంబంధించి ప్రమాణాలను స్పష్టంగా నిర్వచించడం చాలా అవసరం. ఎఫ్ఎస్ఎస్ఏఐలో ఆహార ఉత్పత్తుల (పానీయాల నుంచి సముద్ర ఉత్పత్తుల వరకూ) ప్రమాణాలపై సమాచారం ఇచ్చేందుకు, నిర్దేశించేందుకు 26 శాస్త్రీయ కమిటీలు ఉన్నాయి. 2008లో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏర్పాటు జరిగినప్పుడు ఏర్పాటైన ఈ ప్యానెల్స్‌లో భారతీయ, విదేశీ కంపెనీ ప్రతినిధులు ఉన్నారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో వీటి పునర్వ్యవస్థీకరణ జరిగినప్పటికీ ఆహార కంపెనీల ప్రతినిధుల పెత్తనమే ఇప్పటికీ కొనసాగుతోంది. కొన్నేళ్ల తరువాత ఇది కూడా మారింది. ప్రస్తుతం ఈ ప్యానెళ్లలో ఎక్కువగా శాస్త్రవేత్తలు, రిటైర్ అయిన వాళ్లు ఉంటున్నారు. అయినప్పటికీ నిబంధనల రూపకల్పనలో పరిశ్రమల ప్రభావం లేదని కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. ప్రస్తుతమున్న ప్యానెళ్ల కూర్పును మచ్చుకు తరచి చూస్తే చాలామందికి ఇప్పుడు, లేదంటే గతంలో... పరిశ్రమలతో ఏదో ఒక లింకు కచ్చితంగా కనిపిస్తుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ముందు ఈ ప్యానెళ్ల సభ్యుల పూర్వాపరాలను కచ్చితంగా బహిరంగపరచాలి. దీనివల్ల వినియోగదారుడికి తాను తినే ఆహారానికి సంబంధించి ఎవరు రూల్స్ తయారు చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. అలాగే సీఐఐ, హిందుస్థాన్ లీవర్ వంటి సంస్థలతో ఎఫ్ఎస్ఎస్ఏఐ భాగస్వామ్యం వంటి ఏర్పాటు పలు సమస్యలకు దారితీస్తున్న విషయాన్ని గుర్తించాలి. నిష్పాక్షిక, పారదర్శక సంస్థగా ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేయడం అవసరం, మేలు కూడా. చాలా ఏళ్లు వినియోగదారు సమూహాలు, ఆరోగ్య నిపుణులు ఉప్పు, చక్కెర, కొవ్వులు అధికంగా ఉన్న ఆహార పదార్థాలపై ప్రత్యేకమైన లేబుల్ ఒకటి వేయాలని కోరుతున్నాయి. అయితే ఫుడ్ సేఫ్టీ అథారిటీ, పరిశ్రమ వర్గాలు రెండూ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇంకోవైపు ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిశ్రమలు చేసే డిమాండ్లను నెరవేర్చడంలో చాలా చురుకుగానే ఉంటోంది. విటమిన్లు ఇతర పోషకాలను చేర్చిన ఆహారానికి ప్రత్యేకమైన లేబుల్ ఉండాలన్న పరిశ్రమ డిమాండ్‌ను ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆగమేఘాలపై ఒప్పేసుకోవడం ఒక ఉదాహరణ.ఆహార పదార్థాల విషయంలో నియంత్రణ అధ్వాన్నంగా ఉంటే... పరిశ్రమ వర్గాల నిబంధనల పాలన కూడా అంతే తక్కువ అని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్వయంగా గుర్తించిన విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. కాగ్ 2017 లోనే ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలను నిర్దేశించేందుకు సమయ బద్ధమైన ప్రణాళిక ఏదీ పాటించడం లేదని విమర్శించింది. అసంపూర్తిగా ఉన్న సమాచారం ఆధారంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ కంపెనీలకు లైసెన్సులు ఇచ్చింది, ఆహార పదార్థాలను పరిశీలించే ల్యాబొరేటరీలు 72లో 56 ల్యాబ్స్‌కు తగిన అక్రిడిషన్ సర్టిఫికెట్లు కూడా లేనవి ఎత్తి చూపింది. పార్లమెంటరీ కమిటీ ఒకటి కూడా ఆహార పదార్థాలకు సంబంధించిన నియమ నిబంధనల రూపకల్పన విషయంలో మరింత పారదర్శకత తీసుకు రావాల్సిన అవసరాన్ని తన నివేదిక రూపంలో స్పష్టం చేసిన విషయం గమనార్హం. ఆహార పదార్థాల విషయంలో కొంత జాగరూకతతో వ్యవహరించాలన్నది ఇప్పటికైనా గుర్తిస్తే అది ప్రజారోగ్యానికి మంచి చేయగలదని అర్థం చేసుకోవాలి. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
భారతీయ మసాల దినుసుల తయారీ సంస్థ ఎండీహెచ్, ఎవరెస్ట్ సంస్థలకు మరో ఎదురు దెబ్బ తగిలింది.ఇటీవల ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాల దినుసుల్లో క్యాన్సర్ కారక పెస్టిసైడ్, ఇథిలీన్ ఆక్సైడ్ అధిక స్థాయిలో ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సింగపూర్, హాంకాంగ్‌లు భారత్ మసాల దినుసుల్ని వినియోగించరాదంటూ ఆ రెండు దేశాలు అధికారంగా ప్రకటించారు.తాజాగా, నేపాల్ సైతం భారత్‌లో తయారయ్యే మసాల దినుసుల్ని వినియోగించడానికి వీలు లేదని, అందుకు నాణ్యతాపరమైన కారణాల్ని ఎత్తి చూపింది. ఇథిలీన్ ఆక్సైడ్ కారణంగానేపాల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ప్రకారం, అనుమానాస్పద ఇథిలీన్ ఆక్సైడ్ కారణంగా ఎండీహెచ్, ఎవరెస్ట్‌కు చెందిన నాలుగు మసాలా దినుసులపై నిషేధం విధించింది. నేపాల్ నిషేధం విధించిన మసాలలలో మద్రాస్ కర్రీ పౌడర్, సాంభార్ మిక్స్డ్ మసాలా పౌడర్, నేపాల్‌లో ఎండీహెచ్ మిక్స్డ్ మసాలా కర్రీ పౌడర్, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలు ఉన్నాయి. ఇథిలీన్ ఆక్సైడ్ పరిమితిని మించిఈ నాలుగు ఉత్పత్తులలో ఇథిలీన్ ఆక్సైడ్ పరిమితిని మించి ఉన్నట్లు గుర్తించామని, ఆహార నియంత్రణ 2027 బీఎస్ ఆర్టికల్ 19 ప్రకారం ఈ ఉత్పత్తుల దిగుమతి, అమ్మకం దేశంలో నిషేధిస్తూ అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది. మసాలా ఎగుమతులు దాదాపు 40 శాతం భారత్ ప్రపంచ సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ది ఇక్కడ తయారైన 200కు పైగా మసాలాలు దాదాపు 180 దేశాలకు ఎగుమతి అన్నాయి. వీటి విలువ రూ. 33 వేల కోట్లు అని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా తెలిపింది. దేశీయ మార్కెట్ రూ. 83 వేల కోట్లకు పైమాట. కానీ ఇప్పుడు మసాల దినుసలపై వెల్లువెత్తున్న ఆరోపణలతో భారత్ మసాలా మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. భారతదేశ మసాలా ఎగుమతులు దాదాపు 40 శాతం క్షీణించవచ్చని భారత సుగంధ ద్రవ్యాల వాటాదారుల సమాఖ్య (FISS) తెలిపింది. అదే సమయంలో ఈ ప్రఖ్యాత మసాల దినుసులు ఎంత వరకు సేఫ్ అన్న అంశంపై ఆందోళనలు తలెత్తుతున్నాయి. -
హోరు జల్లులు, వంకాయ ముంత మసాలా ఎపుడైనా తిన్నారా?
మండే ఎండలనుంచి ఉపశమనం కలిగేలా వర్షం పడితే భలే హాయిగాఉంటుంది కదా. మరి ఈ చల్లని వాతావరణానికి తగ్గట్టుగా ఏ మిర్చి బజ్జీనో, వేడి వేడిగా ఉల్లిపాయ పకోడీనో, లేదంటే కారం కారంగా మరమరాలతో చేసిన ముంత మసాలానో తింటే ఇంకా బావుంటుంది. అయితే వంకాయ ముంత మసాలా ఎపుడైనా తిన్నారా? దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాలో వైరల్‌గా మారింది. చక్కగా నవనవలాడే వంకాయలను నూనెలో వేయించి, ఆ తరువాత ముందుగానే మెత్తగా, చేతిజారుగా కలుపుకొని ఉంచుకున్న శనగపిండలో ముంచి నూనెలో బజ్జీలా వేయించాడు. తరువాత ఆ వంకాయ బజ్జీ పొట్ట చీల్చి కొద్దిగా మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కల్ని కూరాడు. పైన నిమ్మరసం చల్లి, దాన్ని మళ్లీ ముక్కలుగా కట్ చేసి, కొత్తిమీర, వేయించిన వేరు శనగపప్పు,మిక్సర్ యాడ్ చేసి అందించాడు. అయితే నెటిజన్లు భిన్నంగా స్పందించారు. భయ్యా, వంకాయల్లో పురుగులుంటాయిగా.. చూడకుండా వేయించేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు.అన్ని వంకాయలు తినడానికి శుభ్రంగా ఉండవు, ఎప్పుడూ కట్ చేసి, పురుగులో ఉన్నాయో లేదో చెక్ చేయాలి. వంకాయ క్యాలీఫ్లవర్లో ఉండే కీటకాలు కొన్నిసార్లు పైకి కనిపించవు.. శభ్రంగా కడగాలి కూడా అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Mehul Hingu (@streetfoodrecipe) నిజమే కదా... ఏ కూరలైనా వండుకునేముందుకు శభ్రంగా కడగాలి. లేదంటే పురుగు మందు అవశేషాలు మన కడుపులోకి చేరతాయి. అలాగే పురుగులను కూడా చెక్ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలను పాటిస్తూ, ఈ వంకాయ ముంత మసాలాను ఒకసారి ట్రై చేయండి! -
15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు
ఈశాన్య దిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతంలో కల్తీ మసాలా దినుసుల తయారీకి సంబంధించిన భారీ రాకెట్‌ను పోలీసులు కనుగొన్నారు. రెండు కర్మాగారాలపై దాడులు నిర్వహించి 15 టన్నుల నకిలీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీకి కారణమైన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసుకు సంబంధించి డీసీపీ పవేరియా మాట్లాడుతూ..‘మసాలా దినుసుల్లో కల్తీ జరుగుతోందనే సమాచారం మేరకు ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. దిల్లీ పరిసర ప్రాంతాల్లో సెర్చ్ నిర్వహించాం. ఆపరేషన్ సమయంలో దిలీప్ సింగ్ (46) అనే వ్యక్తికి చెందిన ఒక ప్రాసెసింగ్ యూనిట్లో పాడైపోయిన ఆకులు, నిషేధిత పదార్థాలను ఉపయోగించి కల్తీ పసుపును ఉత్పత్తి చేయడం గుర్తించాం. బియ్యం, మినుములు, కలప పొట్టు, మిరపకాయలు, ఆమ్లాలు, నూనెలను కలిపి వీటిని తయారుచేస్తున్నట్లు కనుగొన్నాం. సెర్చ్ సమయంలో సింగ్‌తోపాటు అక్కడే ఉన్న సర్ఫరాజ్(32) పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాం. ఈ కల్తీ మసాలా దినుసులు మార్కెటింగ్ చేసేది ఖుర్సీద్ మాలిక్ (42) అనే మరోవ్యక్తి అని తేలింది. దాంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నాం. సర్ఫరాజ్‌కు కరవాల్ నగర్‌లోని కాలీ ఖాతా రోడ్లో మరో ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. ఈ ముఠా 2019 నుంచి కల్తీ మసాలా దినుసుల వ్యాపారం చేస్తున్నారు. ఈ రెండు యూనిట్లలో నిలువ ఉన్న సుమారు 15 టన్నుల కల్తీ మసాలా దినుసులను సీజ్ చేశాం. చట్ట ప్రకారం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం’ అని వివరించారు.సీజ్చేసిన వాటిలో పసుపు, గరం మసాలా, దనియా పొడి కలిపి 7,105 కిలోలు ఉంది. కలపపొడి, బియ్యం, మినుములు, మిరపకాయలు, సిట్రిక్ యాసిడ్.. వంటి పదార్థాలు 7,215 కిలోలు ఉన్నాయి.ఇదీ చదవండి: మసాలాలో పురుగుమందులు.. నివేదికలను తోసిపుచ్చిన ప్రభుత్వ సంస్థభారత బ్రాండ్లైన ఎవరెస్ట్, ఎండీహెచ్ ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్యాన్సర్ కారకం ఉందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఈఎఫ్ఎస్ఏ) గుర్తించిన సంగతి తెలిసిందే. దాంతో హాంకాంగ్, సింగపూర్‌ల్లో వాటి ఉత్పత్తులపై నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే 2020 సెప్టెంబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్యకాలంలో ఇండియాలో తయారైన దాదాపు 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్‌కు దారితేసే కారకాలు ఉన్నట్లు రాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ (ఆర్‌ఏఎస్‌ఎఫ్‌ఎఫ్) డేటా ప్రకారం నిర్ధారణ అయినట్లు ఈఎఫ్ఎస్ఏ అధికారులు ఇటీవల తెలిపారు. -
ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాపై నిషేధం.. స్పందించిన కంపెనీ
ఎవరెస్ట్, ఎండీహెచ్ భారతీయ బ్రాండ్లకు చెందిన ప్రీ-ప్యాకేజ్డ్ స్పైస్ మిక్స్ ఉత్పత్తుల్లో పరిమితికి మించి ‘ఎథిలీన్ ఆక్సైడ్’ అనే పురుగుల మందు ఉన్నట్లు హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ (సీఎఫ్ఎస్) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ఎవరెస్ట్ కంపెనీ స్పందించింది. తమ కంపెనీ తయారుచేస్తోన్న ఉత్పత్తులు భద్రమైనవని, నాణ్యతా ప్రమాణాలను పాటించే వాటిని తయారుచేస్తున్నట్లు స్పష్టం చేసింది.సింగపూర్, హాంకాంగ్‌లో ఎవరెస్ట్, ఎండీహెచ్ కొన్నేళ్ల నుంచి వ్యాపారం సాగిస్తున్నాయి. ఏటా ఆయా కంపెనీల ఉత్పత్తులకు చెందిన శాంపిళ్లను అక్కడి ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ అయిన హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ (సీఎఫ్ఎస్) పరీక్షిస్తోంది. అయితే ఇటీవల చేసిన పరీక్షల్లో ఆయా కంపెనీలు తయారుచేసిన ఉత్పత్తుల్లో ‘ఎథిలీన్ ఆక్సైడ్’ అనే పురుగుమందు వాడుతున్నట్లు నిర్ధారణ అయిందని, వాటిని నిషేధించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దాంతో ఎవరెస్ట్ కంపెనీ వివరణ ఇచ్చింది. అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించి తాము ఉత్పత్తులు తయారుచేస్తామని చెప్పింది. తమ ప్రొడక్ట్‌లపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది.సింగపూర్, హాంకాంగ్‌లో ఎవరెస్ట్ ఉత్పత్తులు మొత్తం 60 ఉంటే, కేవలం ఒకదాన్నే పరీక్షించారని కంపెనీ వర్గాలు తెలిపాయి. అది కూడా ప్రామాణిక ప్రక్రియలోనే జరిగింది. కానీ ఎలాంటి నిషేధం మాత్రం విధించలేదని సంస్థ వివరించింది. ఈ అంశంపై కంపెనీ ప్రతినిధి ఒకరు స్పందించారు. ఆహార భద్రత కంపెనీకి అత్యంత ప్రాధాన్యమన్నారు. స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ల్యాబ్ అనుమతి లభించాకే ఎగుమతులు జరుగుతాయని చెప్పారు.హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ (సీఎఫ్ఎస్) సదరు కంపెనీల ఉత్పత్తులను కొనొద్దని ప్రజలకు ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. సీఎఫ్ఎస్ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ బ్రాండ్ల ఉత్పత్తులను సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ రీకాల్ చేసింది. అందులో ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా, ఎమ్‌డీహెచ్‌కు చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా మిక్స్డ్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్ మిక్స్‌డ్‌మసాలా పౌడర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: గగనవీధిలో పెరుగుతున్న ప్రయాణికులు.. ఒకే రోజు భారీ రికార్డు..ఆ రెండు తయారీ కంపెనీలపై చర్యలు తీసుకుందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది. ఇందులో భాగంగా ముందస్తుగా ఎండీహెచ్, ఎవరెస్ట్‌కు చెందిన అన్ని మసాలా దినుసుల తయారీ యూనిట్ల నుండి నమూనాలను సేకరించాలని ప్రభుత్వం ఫుడ్ కమిషనర్లను ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం. అధికారులు ఎండీహెచ్, ఎవరెస్ట్ మాత్రమే కాకుండా అన్ని మసాలా తయారీ కంపెనీల నుంచి నమూనాలను తీసుకుని టెస్ట్ చేయనున్నట్లు తెలిసింది. దాదాపు 20 రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామంటూ సంబంధిత అధికారులు వెల్లడించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. -
ఫిష్ మాసాలాలో పురుగుమందులు? సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ సీరియస్
ఎవరెస్ట్ బ్రాండ్ పేరుతో అనేక రకాల మసాలాలు, సుగంధ ద్రవ్యాలు మిశ్రమాలను విక్రయించే ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న కంపెనీ ఫిష్ కర్రీ మసాలాలో పరిమితికి మించి పురుగుమందులు ఉన్నట్లు గుర్తించింది సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ. దీంతో షిష్ మసాలా ప్యాకెట్లను రీకాల్ చేయాలని ఆదేశించింది. ఈమేరకు నిన్న (ఏప్రిల్ 18న) ఒక ప్రకటన విడుదల చేసింది. హాంకాంగ్‌లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ రీకాల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మానవ వినియోగానికి పనికిరాని స్థాయిలో పురుగుమందు ఇథిలీన్ ఆక్సైడ్ అవశేషాలను ఉన్నట్లు గుర్తించినట్టు ఏజెన్సీ పేర్కొంది. “ఇంప్లికేట్ చేయబడిన ఉత్పత్తులు సింగపూర్‌లోకి దిగుమతి అయినందున, సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ (SFA) ఉత్పత్తులను రీకాల్ చేయమని దిగుమతిదారు, ముత్తయ్య & సన్స్‌ని ఆదేశించింది. విషాదం: స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం) వ్యవసాయ ఉత్పత్తులో ఇథిలీన్ ఆక్సైడ్ వినియోగం, ఆహారంలో పురుగుమందు అనుమతి లేదని ఫుడ్ ఏజెన్సీ తెలిపింది. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించింది. ఇది వినియోగదారుల ఆరోగ్యానికి ప్రమాదమని ఎస్ఎఫ్ఏ పేర్కొంది. ఈ మసాలా ఉత్పత్తులను వినియోగించి, తమ ఆరోగ్యంపై ఆందోళనలున్నవారు వైద్య సలహాను పొందాలనీ, ఇతర సమాచారం నిమిత్తం వారి కొనుగోలు కేంద్రాలను సంప్రదించాలని కూడా సూచించింది. ఈ ఉదంతంపై ఎవరెస్ట్ కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయ లేదు. (యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!) -
మసాలా దినుసులు ఘాటు పోకూడదంటే..ఇలా స్టోర్ చేయండి!
మన వంటింట్లో పప్పు తాలింపులకు ఉపయోగించే ఆవాలు, జీలకర్ర దగ్గర నుంచి నాన్‌వెజ్ లేదా బిర్యానీలు చేసేటప్పుడు ఉపయోగించే మసాలలన్నింటిని నిల్వ చేయడం కాస్త ఇబ్బంది. అందులోనూ రకరకాల సీజన్లు ఉండే మన ప్రదేశాల్లో మరింత కష్టం. అలాంటప్పుడూ వాటి రుచి పాడవకుండా ఎక్కువ కాలం వచ్చేలా స్టోర్ చేయాలంటే ఈ అద్భుతమైన టెక్నిక్స్ ఫాలోకండి. రుచి పోదు, తాజగా వాడుకోవచ్చు కూడా. మసాలా దినుసులు సరిగా నిల్వ చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులు.. గాలి చొరబడిన కంటైనర్లు మీ సుగంధ ద్రవ్యాలను నిల్వ చేయడానికి గాలి చొరబడని కంటైనర్‌లో జాగ్రత్తగా నిల్వ చేయాలి. అలాగే సుగంధ ద్రవ్యాల్లో తేమ లేకుండా బాగా ఎండలో ఆరనిచ్చి జాగ్రత్తగా భద్రపర్చాలి. గాలి చొరబడి మూతలు ఉన్న జాడీ లేదా కంటైనర్లే మేలు. ఇలాంటివి అయితే సుగంధ ద్రవ్యాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. కూల్ స్టోరేజ్ గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయడం ఎంత ముఖ్యమో అలాగే చల్లటి ప్రదేశంలో ఉంచడం అంతే ప్రధానం. సుగంధ ద్రవ్యాలు చాలాకాలం పాటు తాజాగా రుచిగా ఉంచాలనుకుంటే వేడిపొయ్యిలు, ఓవెన్లు, సూర్యరశ్మీకి దూరంగా ఉంచడం వంటివి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో తేమ లేకుండా.. వర్షాకాలం లాంటి సీజన్లో వాటిని గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచినప్పటికీ అట్టలు కట్టనట్లు అయిపోతాయి. వాటి రుచిలో కూడా మార్పు వస్తుంది. అలాంటప్పుడూ తేమను పీల్చుకునే ప్యాకెట్లలో నిల్వ చేసేంఉదకు ప్రయత్నించాలి. ఈ మసాలా దినులు గాలి లేదా తేమను ఆకర్షించే గుణం ఉంది కాబట్టి నిల్వ చేసుకునేటప్పుడు కాస్త జాగుకతతో ఉండాలి. లేబుల్ ఈ మసాల దినులు స్టోర్ చేసుకునే కంటైనర్లపై అవి ఎప్పుడు కొన్నారనే దాన్ని లేబుల్ చేయండి. దీని వల్ల అవి ఎంతకాలం వరకు తాజగా ఉంటాయో మీకు తెలిసేందుకు ఉపయోగపడుతుంది. ఒకవేళ వాడే ముందు బాగున్నాయా లేదా అన్న సందేహం వచ్చినప్పుడే ముందుగా దాన్ని లేబుల్ చేసి రాసి ఉంటారు కాబట్టి అది చూస్తే సరిపోతుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదు. పరిమిత స్థలం లేదా తేమ వాతావరణం వంటగదిలో పరిమిత స్థలమే ఉండి నిల్వచేసుకోవడం ఇబ్బందిగా మారినా లేదా ఎప్పటికీ తేమ వాతావరణమే అయితే మసాల దినుసులు నిల్వ చేయడం అంత ఈజీ కాదు. అలాంటప్పుడు కొద్ది మొత్తంలో వాటిని స్టోర్ చేసి మిగతా వాటిని గ్రైండ్ చేసి నిల్వ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పొడి చేసుకుంటే కూరల్లో కూడా సులభంగా వాడుకోవచ్చు. ఇది మిస్ చేశాం అనే సమస్య కూడా ఉండదు. తేమ వాతావరణంలో ఉండే వారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. (చదవండి: అత్యంత ఖరీదైన కాఫీ! సర్వ్ చేసే విధానం చాలా వెరైటీగా ఉంటుంది!) -
షాజహాన్‌కు ‘మసాలా పిచ్చి’ ఎందుకు పట్టింది?
మొఘల్ చక్రవర్తులు అటు యుద్ధమైదానాలు, ఇటు అంతఃపురాలపై ప్రత్యేక దృష్టి సారించేవారు. దీనితో పాటు ఆహార విభాగంలోనూ వివిధ రకాల ప్రయోగాలు చేసేవారు. బాబర్‌కు పాలనాకాలం తక్కువగా ఉండడంతో ప్రత్యేక ప్రయోగాలేవీ చేయలేకపోయాడని చరిత్రకారులు చెబుతుంటారు. అయితే హుమాయున్ తన పాలనాకాలంలో చాలావరకూ తడబడుతూనే ఉన్నాడంటారు. అయితే అక్బర్‌కు తన పాలనలో తగినంత సమయం దొరకడంతో వివిధ రంగాలలో అనేక ప్రయోగాలు చేశాడంటారు. అక్బర్ తర్వాత జహంగీర్ కాలంలో, నూర్జహాన్ వివిధ రకాల మద్యాలను ప్రత్యేక పద్ధతిలో తయారు చేయించేవారు. వీటన్నింటిమధ్యలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తీరు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. జహంగీర్, అక్బర్‌లతో పోలిస్తే షాజహాన్ భార్యకు అత్యంత విధేయుడిగా ఉన్నాడని చెబుతారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు సుగంధ ద్రవ్యాలపై మోజు ఎందుకు పెరిగిందనే దాని వెనుక ఆసక్తికర కథనం వినిపిస్తుంటుంది. షాజహాన్ హయాంలో ఢిల్లీలో ఇన్ఫెక్షియస్ ఫ్లూ(అంటువ్యాధి) వ్యాపించింది. ఈ నేపధ్యంలో ప్రజల ఆహారంలో పెను మార్పు వచ్చింది. ఫ్లూ ప్రభావాన్ని తగ్గించేందుకు నాటి చెఫ్‌లు, రాజ వైద్యులు కలిసి ఆహారంలో పలు రకాల ప్రయోగాలు చేశారు. శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, వ్యాధులతో పోరాడడంలో సహాయపడటానికి మసాలా దినుసులను వంటలలో విరివిగా ఉపయోగించసాగారు. ఫ్లూ లాంటి వ్యాధులతో పోరాటానికి సుగంధ ద్రవ్యాలను తగినంతగా ఉపయోగించాలని రాజ వైద్యుడు స్వయంగా షాజహాన్‌కు సూచించాడట. ఈ మేరకు షాజహాన్ తాను తీసుకునే ఆహారంలో ఎక్కువమోతాదులో మసాలాలు ఉండేలా ఆదేశాలు జారీచేసేవాడు. అది అతని ఆరోగ్యానికి తగినది కాకపోయినా దానినే అనుసరించేవాడట. షాజహాన్ ఎప్పుడూ యమునా నది నీరు తాగేందుకు ఇష్టపడేవాడు. మామిడిపండ్లన్నా షాజహాన్‌కు ఎంతో ఇష్టం. ప్రత్యేక తోటల నుంచి తాజా కూరగాయలు, నిమ్మ, దానిమ్మ, రేగు, పుచ్చకాయలను తెప్పించేవాడట. అంతే కాదు కొత్తిమీర, జీలకర్ర, పసుపు మొదలైనవాటిని ఎక్కువగా వినియోగించాలని షాజహాన్ తన వంటవాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవాడు. దీని వెనుక అతనికి ఆరోగ్యంపైగల శ్రద్ధనే ప్రధాన కారణమని చరిత్రకారులు చెబుతున్నారు. ఆహారంలో సుగంధ ద్రవ్యాలు ఉపయోగించకపోతే ఆరోగ్యం మెరుగ్గా ఉండదని షాజహాన్ నమ్మేవాడు. ఇది కూడా చదవండి: అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్లు తెలుపు రంగులోనే ఎందుకుంటాయి? -
ఎవరెస్ట్ బ్రాండ్ సాంబార్ మసాలా అమ్మొద్దు: అమెరికా అధికారులు
గుజరాత్లో ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి ఉత్పత్తవుతున్న సాంబార్ మసాలా, గరమ్ మసాలాను అమెరికాలో విక్రయించొద్దని అక్కడి ప్రభుత్వం తేల్చిచెప్పింది. సల్మొనెల్లా టెస్టులో ఇవి పాజిటివ్‌గా తేలినట్టు వెల్లడించింది. సాల్మొనెల్లా అనేది.. చిన్నపిల్లలు లేదా వృద్ధులలో బలహీనమైన రోగనిరోధక వ్యవస్థతో ఉన్న ఇతరులలో తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి ఇది కొన్నిసార్లు ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లను కూడా కలిగిస్తుంది. సాల్మొనెల్లా సోకిన ఆరోగ్యవంతమైన వ్యక్తులు కూడా తరచుగా జ్వరం, అతిసారం (రక్తంతో కూడినది కావచ్చు), వికారం, వాంతులు , కడుపు నొప్పి వంటి వాటితో అనారోగ్యం బారిన పడుతుంటారు. అరుదైన పరిస్థితులలో, సాల్మొనెల్లాతో ఇన్ఫెక్షన్ జీవి రక్తప్రవాహంలోకి ప్రవేశించి, ధమనుల అంటువ్యాధులు (అనగా, సోకిన అనూరిజమ్స్), ఎండోకార్డిటిస్, ఆర్థరైటిస్ వంటి తీవ్రమైన అనారోగ్యానికి దారి తీస్తుంది. చదవండి: Viral Video: 600 ఏళ్ల నాటి నృత్యం..రెప్పవాల్చడం మర్చిపోవాల్సిందే! -
Recipe: రొటీన్‌గా కాకుండా.. ఇలా ఓట్స్ మసాలా దోసెలు ట్రై చేయండి!
ఓట్స్ మసాలా దోసెలు తయారు చేసుకోండిలా! కావలసినవి: ►మసాలా కర్రీ – 2 లేదా ఒకటిన్నర కప్పులు (దోసెలు పోసుకునే కాసేపు ముందు, వండి పెట్టుకోవాలి) ►బియ్యం – 4 కప్పులు ►ఓట్స్ – 2 కప్పులు ►మినప్పప్పు – 1 కప్పు ►మెంతులు – 1 టీ స్పూన్ (నానబెట్టుకున్నవి) ►ఉప్పు – సరిపడా తయారీ: ►బియ్యం, మినపప్పులను విడివిడిగా 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ►ముందుగా మిక్సీలో ఓట్స్, మెంతులు, బియ్యం, మినప్పప్పు.. కలిపి పేస్ట్‌లా గ్రాండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ►తగినంత ఉప్పు కలుపుకుని.. పెనంపై నెయ్యితో దోసెలు వేసుకోవాలి. ►ప్రతి దోసె మీద ఒక గరిటె మసాలా కర్రీని పెట్టి ఫోల్డ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Apple Egg Rings: ఆపిల్, మొక్కజొన్న పిండి, కోడిగుడ్లతో.. ఆపిల్ ఎగ్ రింగ్స్ తయారీ! Bread Garlic Soup: బ్రెడ్.. వెల్లుల్లి, గుడ్లు, కూరగాయలు... సూప్ చేసుకోండిలా! -
డాబర్ చేతికి బాద్షా మసాలా
న్యూఢిల్లీ: బాద్షా మసాలాలో మెజారిటీ వాటా(51 శాతం) కొనుగోలు చేసేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు దేశీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా తాజాగా పేర్కొంది. ఇందుకు దాదాపు రూ. 588 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. తద్వారా వేగవంత వృద్ధిలోనున్న మసాలా దినుసుల విభాగంలోకి ప్రవేశించేందుకు డాబర్‌కు వీలు చిక్కనుంది. డీల్ ప్రకారం రూ. 1,152 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో బాద్షా సొంతం చేసుకోనుంది. మిగిలిన 49 శాతం వాటాను సైతం ఐదేళ్ల తదుపరి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఆహార సంబంధ బిజినెస్‌ను మరింత విస్తరించే వ్యూహంలో భాగంగా బాద్షా కొనుగోలుకి తెరతీసినట్లు డాబర్ పేర్కొంది. వెరసి రూ. 25,000 కోట్ల విలువైన బ్రాండెడ్ మసాలా దినుసుల విభాగంలోకి ప్రవేశించనుంది. దీంతో రానున్న మూడేళ్లలో ఫుడ్ బిజినెస్ ఆదా యాన్ని రూ. 500 కోట్లకు చేర్చే వీలున్నట్లు డాబర్ తెలియజేసింది. 1958లో ఏర్పాటైన బాద్షా మసాలా 2021–22లో రూ. 189 కోట్ల టర్నోవర్ సాధించింది. రూ. 2.5 డివిడెండ్ ఈ ఆర్థిక సంవత్సరం (2022–23) రెండో త్రైమాసికంలో డాబర్ ఇండియా కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్పంగా 3 శాతం క్షీణించి రూ. 491 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2021–22) ఇదే కాలంలో లాభం రూ. 505 కోట్లుగా నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 2.5 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఈ కాలంలో మొత్తం ఆదాయం 6 శాతం పుంజుకుని రూ. 2,986 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 2,818 కోట్ల టర్నోవర్ సాధించింది. -
రూ. 10 ప్యాకెట్లో 5 చిప్స్! ఇక రూ.2 చేంజ్‌కి ఒక చిప్ ఇస్తారా?!
సాక్షి, ముంబై: చిరుతిండి, కాలక్షేపం అనగానే దాదాపు అందరి దృష్టి చిప్స్ వైపే మళ్లుతుంది. ఎంత పెద్ద చిప్స్ ప్యాకెట్ కొన్నా.. అందులో గ్యాస్ ఎక్కువ.. చిప్స్ తక్కువ ఇది అందరికి తెలిసిన సంగతే. తాజాగా మరో వింత సంగతి ఒకటి వెలుగులోకి వచ్చింది. 10రూపాయల చిప్స్ ప్యాకెట్ కొన్న వినియోగదారుడు అందులో కేవలం చిప్స్ ఉండటంతో తెల్లబోయాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు సెటైర్లతో సందడి చేస్తున్నారు. ఒక విద్యార్థి కాలేజీకి వెడుతూ పది రూపాయల చిప్స్ ప్యాకెట్ కొన్నాడు. కట్ చేస్తే.. అక్షరాలా ఐదు చిప్స్ మాత్రమే ఉన్నాయి. దీన్ని సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం రెడిట్‌లో షేర్ చేయగానే.. చిప్‌కు రెండు రూపాయలు భయ్యా.. ఇకపై రెండు రూపాయల చేంజ్ లేకపోతే ఒక చిప్ చేతిలో పెడతారేమో అని ఒక యూజర్ కమెంట్ చేశాడు. గత 27 ఏళ్లుగా టాప్ క్వాలీటీ మసాలా ఎయిర్ అమ్ముతూనే ఉన్నారు.. అది కాస్ట్లీ గ్యాస్... మనం తినే చిప్స్ జస్ట్ కాంప్లిమెంట్.. ఇలా రకరకాల కామెంట్లతో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. -
హిందూస్థాన్ యూనీలీవర్ చేతికి దిగ్గజ మసాలా కంపెనీ..! అదే జరిగితే పెనుమార్పులు..!
ప్రముఖ మసాలా ఉత్పత్తుల కంపెనీ మహాషియాన్ డి హట్టి (ఎండీహెచ్)లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వాటా కొనుగోలు లావాదేవీలో భాగంగా ఎండీహెచ్ మార్కెట్ విలువను రూ.10,000-15,000 కోట్లకు లెక్కగట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పెను మార్పులు..! దేశవ్యాప్తంగా ఎండీహెచ్ మసాలా ఉత్పత్తులు అత్యంత ఆదరణను పొందాయి. ఈ కంపెనీలో హెచ్‌యూఎల్ వాటాలను కొనుగోలు చేయడంతో మసాలా ఉత్పత్తుల సెగ్మెంట్లో పెనుమార్పులు వచ్చే అవకాశం లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా వాటాల విక్రయంపై హోచ్‌యూఎల్‌తో పాటుగా మరిన్ని కంపెనీలు ఎండీహెచ్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 2020 చివర్లో ఎండీహెచ్ వ్యవస్థాపకులు, పద్మ భూషన్ అవార్డు గ్రహీత ధరమ్ పాల్ గులాటీ మరణించిన విషయం తెలిసిందే. దీంతో కంపెనీ యాజమాన్యం వాటా విక్రయ ప్రయత్నాలు మొదలు పెట్టింది. దేశవ్యాప్తంగా ఎండీహెచ్ 60కి పైగా మసాలా ఉత్పత్తులు విక్రయిస్తోంది. కనీసం 1,000 మంది హోల్‌సేలర్లు, లక్షల కొద్ది రిటైల్ కేంద్రాలతో కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. చదవండి: జర్మనీ అతి పెద్ద సంస్థ ఇన్ఫోసిస్ కైవసం.. డీల్ విలువ ఎంతంటే? -
నడిరోడ్డు నుంచి కోటీశ్వరుడి దాకా.. అంచలంచెలుగా ఎదిగాడు
MDH Owner Mahashay Dharampal Gulati Biography And Inspirational Success Story: ‘కూర రుచికి ‘మసాలా’ తోడవ్వడం ఎంత అవసరమో.. లైఫ్‌లో సక్సెస్ టేస్ట్ చేయాలంటే ‘కష్టం’ అంతే ముఖ్యం’ అనేవాడు మహాశయ్ ధరమ్‌పాల్. ఎండీహెచ్ మసాలా ఓనర్‌గా ఈయన గురించి తెలిసింది చాలా తక్కువ మందికి. కానీ, అదే మసాలా యాడ్‌లో కనిపించే ఆయన ముఖం మాత్రం కోట్ల మందికి గుర్తు!. జీరో నుంచి మొదలుపెట్టి స్వయంకృషితో కోటీశ్వరుడిగా.. అంతకు మించి ‘మసాలా కింగ్’గా ఎదిగిన ధరమ్‌పాల్ జీవితం.. ఎంతోమంది చిరువ్యాపారులకు ఇన్స్పిరేషన్ కూడా. ‘‘అస్లీ మసాలె సచ్ సచ్.. ఎం డీ హెచ్.. ఎండీహెచ్’’ అనే యాడ్ గుర్తుందా? దూరదర్శన్ రోజుల నుంచి ఇప్పటిదాకా టీవీల్లో కనిపించే యాడ్ ఇది. ఈ యాడ్స్‌లో ‘దాదాజీగా, చాచాజీ’గా నవ్వుతూ కనిపించే పెద్దాయనే ఈ మహాశయ్ ధరమ్‌పాల్ గులాటి. సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ కోసం పెద్ద పెద్ద బ్రాండ్స్ ఎగబడుతున్న రోజుల్లో కూడా తన మసాలా బ్రాండ్‌ని తనే ప్రమోట్ చేసుకునేవాడు ధరమ్‌పాల్. అంతేకాదు ఈ పెద్దాయన తన ఫేస్ వాల్యూతోనే ఎండీహెచ్ కంపెనీని రెండువేల కోట్ల టర్నోవర్‌కి చేర్చాడు. అయితే మసాలా రారాజుగా ఎదిగే జర్నీలో ఆయన పడిన కష్టాలు.. సినిమా కష్టాలకేం తక్కువ కాదు. ఉత్త చేతులతో పాక్ నుంచి.. సియాల్కోట్(ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది)లోని ఓ బడా వ్యాపారి కుటుంబంలో పుట్టాడు(1923) ధరమ్‌పాల్. ఈయన తండ్రి మహాశయ్ చున్నీలాల్ గులాటి, ఎండు మిర్చి వ్యాపారి. సియాల్కోట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మహాశయ్ ఫ్యామిలీకి ‘డెగ్గీ మిర్చ్ వాలే’ అనే పేరుండేది. 1937లో తన పద్నాలుగేళ్ల వయసులోనే తండ్రితో కలిసి బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు ధరమ్‌పాల్. వారసత్వంగా వస్తున్న వ్యాపారంలో రాణిస్తున్న టైంలో ‘విభజన’ ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. విభజన టైంలో మహాశయ్ ఆస్తులన్నింటినీ పాక్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో ఉత్త చేతులతో మహాశయ్ కుటుంబం మన దేశానికి వచ్చింది. అమృత్‌సర్‌లో కొన్నాళ్లపాటు శరణార్థుల శిబిరంలో తలదాచుకుంది. ఆ తర్వాత ఢిల్లీకి మకాం మార్చింది. ఆ టైంలో మహాశయ్ పిల్లలు కూలీ పనుల్లో చేరారు. ధరమ్‌పాల్ మొదట్లో చెక్కమిల్లులో పని చేశాడు. అది నచ్చకపోవడంతో సోప్ ఫ్యాక్టరీలో, అక్కడి నుంచి రైస్ ఫ్యాక్టరీలో, అటు నుంచి ఫ్యాబ్రిక్ ఫ్యాక్టరీలో పని చేశాడు. ఏవీ నచ్చక కూడబెట్టిన డబ్బుతో జట్కా బండిని కొనుక్కున్నాడు. అందులోనూ ‘కిక్’ దొరక్కపోవడంతో ఇంట్లోని సామాన్లను, గుర్రపు బండిని అమ్మేశాడు. కరోల్‌బాగ్‌లోని అజ్మల్ ఖాన్ రోడ్డులో తొలి మసాలా దినుసుల షాప్ తెరిచాడు. అలా ఎండీహెచ్( మహాశియన్ డి హట్టి) మసాలా సామ్రాజ్యానికి బీజం పడింది. వాట్ యాన్ ఐడియా మొదట్లో బల్క్ మసాలా దినుసుల్ని తక్కువ లాభానికి చిరు వ్యాపారులకు అమ్మేవాడు ధరమ్‌పాల్. అది గుర్తించి చాలామంది ఆయన దగ్గరికి ‘క్యూ’ కట్టేవాళ్లు. ఆ తర్వాత చాందినీచౌక్‌లో 1953లో రెండో షాప్ తెరిచాడు. 1954లో ‘రూపక్ స్టోర్స్’ అనే మరో మసాలా స్టోర్‌ని స్టార్ట్ చేసి తమ్ముడు సత్‌పాల్‌కి అప్పజెప్పాడు. నమ్మకంగా వ్యాపారం చేయడం ఆయన సక్సెస్‌కి మెయిన్ రీజన్ అయ్యింది. ఆ వచ్చిన లాభాలతో 1959లో కీర్తి నగర్లో కొంత జాగా కొని.. ఎండీహెచ్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశాడు. మొత్తానికి ‘ప్యాకింగ్ మసాలా’ ఐడియా బాగా వర్కవుట్ అయ్యింది. ఏడాది తిరిగే సరికి ఢిల్లీ మొత్తంతో పాటు పంజాబ్‌లో ఎండీహెచ్ మసాలా పేరు మారుమోగింది. తన పేరు వల్లే బిజినెస్ నడుస్తోంది గనుక తన ఫొటోనే బ్రాండ్ సింబల్‌గా మార్చుకున్నాడు ధరమ్‌పాల్. ఆ తర్వాత ఎండీహెచ్ మసాలా ఘుమఘుమలు దేశం మొత్తం విస్తరించాయి. వయసులో ఉండగా పడిన కష్టాల్ని, తన బిజినెస్ సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్‌ని ఆత్మకథగా రాసుకున్నాడు ఈ మసాలా కింగ్. సుద్దమొద్దు ‘ఎండీహెచ్ అంకుల్, మసాలా కింగ్, కింగ్ ఆఫ్ స్పైసెస్(మసాలాలు)’.. ఇలా ఎన్నో ట్యాగ్ లైన్లు ఆయన సొంతం. కానీ, చదువులో మాత్రం ఆయన రాణించలేకపోయాడు. కొడుకును బాగా చదివించాలని మహాశయ్ ఆరాటపడితే.. ధరమ్‌పాల్ మాత్రం ఐదో తరగతితోనే ఆపేశాడు. కానీ, కష్టం విలువేంటో బాగా తెలిసిన మనిషి ఈయన. పొద్దున నాలుగున్నరకే లేవడం, ఫ్యాక్టరీకి స్వయంగా వెళ్లి ప్రొడక్ట్స్‌ని చెక్ చేయడం, ధరల వివరాల్ని డిసైడ్ చేయడం.. మొత్తం ఈయనే చూసుకునేవాడు. అప్పుడప్పుడు ఒక్కడే స్టోర్స్‌కి, గల్లీలోని కిరాణాషాపులకు వెళ్లి మసాలా ప్రొడక్ట్స్ అమ్మకాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునేవాడు. తన వ్యాపారాన్ని విస్తరించిన కరోల్ బాగ్ ఏరియా ధరమ్‌పాల్‌కి పవిత్రమైన స్థలం. అందుకే ఆ ఏరియాకి వెళ్తే ఆయన చెప్పులు వేసుకునేవాడు కాదు. వయసు పైబడినా బాధ్యతల నుంచి మాత్రం ఏనాడూ ఆయన రెస్ట్ తీసుకోలేదు. చనిపోయేదాకా ధరమ్‌పాల్ కంపెనీకి సీఈవోగా ఉన్నాడు. అందుకోసం ఏడాదికి రూ. 20 కోట్లకు పైగా జీతం అందుకున్నాడు. 2017లో ‘ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్’ సీఈవోలలో ఎక్కువ శాలరీ అందుకుంది ఈ పెద్దాయనే కావడం విశేషం. అయితే తన జీతంలో 90 శాతాన్ని ఆయన ట్రస్ట్ కార్యక్రమాలకే ఇస్తుంటాడు. ఢిల్లీలో 250 పడకల ఆస్పత్రితో పాటు 20 ఫ్రీ ఎడ్యుకేషన్ స్కూల్స్ కూడా రన్ చేస్తోంది ఈయన కుటుంబం. కరోనా టైంలోనూ స్వయంగా ఎందరికో సాయం అందించాడు ధరమ్‌పాల్. అంతేకాదు ఎండీహెచ్ కంపెనీ తరపున ‘సందేశ్’ అనే ఒక మ్యాగజైన్‌ను కూడా రన్ చేస్తున్నారు. మీమ్స్.. లైట్ ధరమ్‌పాల్‌కి 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే పెళ్లి అయ్యింది. ఇద్దరు కొడుకులు, ఆరుగురు కూతుళ్లు. 1992లో ఆయన భార్య లీలావతి చనిపోయింది. బయట ఎంతో క్యాజువల్‌గా, జోష్‌గా ఉంటాడు ఈ పెద్దాయన. అంతేకాదు బంధువుల పెళ్లిలలో ఈయన డాన్స్‌లు కూడా చేస్తుంటాడు. 2017లో ఆయన డాన్స్ చేసిన ఓ వీడియో ద్వారా ‘చాచాజీ మీమ్స్’ ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. అంతెందుకు ‘మీర్జాపూర్’ సిరీస్‌లోని చాచాజీ క్యారెక్టర్ మీద మీమ్స్ వైరల్ అయినప్పుడు.. చాలామంది ధరమ్‌పాల్‌తో పోలుస్తూ ‘మీమ్‌వాలే చాచాజీ’ అంటూ ట్రోల్ చేశారు. దానిని ఆయన ఎంత సరదాగా తీసుకున్నాడంటే.. తన బంధువులకు కూడా ఆ మీమ్స్‌ని ఫార్వర్డ్ చేశాడట. బిజినెస్‌లో హుందాగా.. బయట సరదాగా ఉండే మహాశయన్ ధరమ్‌పాల్ గులాటికి ఫుడ్ ప్రాసెసింగ్ ఫీల్డ్‌లో సేవలకుగానూ ‘పద్మభూషణ్’ పురస్కారం దక్కింది. ఇంతటి విజయం అందుకున్న ఈ పెద్దాయన.. అనారోగ్యంతో ది స్పైస్ కింగ్ ఆఫ్ ఇండియా 97 ఏళ్ల వయసులో డిసెంబర్ 3, 2020లో కన్నుమూశారు - మహాశయన్ ధరమ్‌పాల్ గులాటి ప్రథమ వర్థంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. -
మసాలా మహాశయ్ ఇక లేరు..
న్యూఢిల్లీ: మసాలా ఉత్పత్తుల దిగ్గజ సంస్థ ఎండీహెచ్ అధినేత, స్పైస్ కింగ్‌గా పేరొందిన మహాశయ్ ధరమ్‌పాల్ గులాటీ (97) గురువారం కన్నుమూశారు. మాతా చనన్ దేవీ హాస్పిటల్లో కోవిడ్ సంబంధ చికిత్స పొందుతుండగా, గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాదే ఆయన ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. గులాటీ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు వెల్లువెత్తాయి. ‘మహాశయన్ ది హట్టి (ఎండీహెచ్) అధినేత శ్రీ ధరమ్‌పాల్ గులాటీ కన్నుమూయడం విషాదకరం. భారతీయ పరిశ్రమలో ఆయన ఎంతో పేరొందారు. ఆయన చేపట్టిన అనేక సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం. ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ .. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. శరణార్థిగా వచ్చి.. స్పైస్ కింగ్‌గా ఎదిగి.. పాకిస్తాన్ నుంచి శరణార్థిగా వచ్చి రూ. 1,500 కోట్ల వ్యాపార సామ్రాజ్యాధినేతగా, మసాలా మహారాజాగా ఎదిగిన గులాటీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిల్చారు. గులాటీ 1923 మార్చి 27న సియాల్కోట్లో (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది) జన్మించారు. అక్కడ గులాటీ తండ్రికి ఎండీహెచ్ పేరిట మసాలా ఉత్పత్తుల దుకాణం ఉండేది. అయితే, దేశ విభజన తర్వాత సియాల్కోట్లోని ఆస్తులు అన్నీ వదిలేసి వారి కుటుంబం భారత్ వచ్చేసింది. ఢిల్లీలో స్థిరపడింది. అంతకుముందు 1933లోనే అయిదో క్లాస్ తర్వాత చదువును పక్కన పెట్టిన గులాటీ పలు ఉద్యోగాలు చేశారు. సబ్బుల ఫ్యాక్టరీలో, ఫ్యాబ్రిక్ ఫ్యాక్టరీలో, మిల్లుల్లో పనిచేశారు. ఎండీహెచ్ పోర్టల్‌లోని సమాచారం, ఒకానొక ఇంటర్వ్యూలో గులాటీ స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం .. దేశ విభజన అనంతరం 1947 సెప్టెంబర్‌లో చేతి లో రూ. 1,500తో ఆయన ఢిల్లీ వచ్చారు. అందులో రూ. 650 వెచ్చించి ఒక గుర్రపు బగ్గీని కొని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, కుతుబ్ రోడ్, కరోల్ బాగ్ తదితర మార్గాల్లో నడిపిస్తూ జీవనం సాగించారు. 1948లో కొత్త మలుపు.. గుర్రపు బగ్గీతో వచ్చే ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉండటం, మెల్లమెల్లగా తరలివస్తున్న కుటుంబసభ్యుల పోషణాభారం పెరిగిపోతుండటంతో చెరకు రసం బండి వంటి ఇతర వ్యాపారాలూ గులాటీ ప్రయత్నించారు. కానీ అవేవీ సానుకూలంగా కనిపించకపోవడంతో చివరికి తమ కుటుంబం గతంలో వదిలేసిన మసాలా ఉత్పత్తుల వ్యాపారం వైపు మళ్లీ దృష్టి సారించారు. 1948 అక్టోబర్‌లో గుర్రపు బగ్గీని అమ్మేసి ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో ఒక చిన్న మసాలా ఉత్పత్తుల షాపు తెరిచారు. అక్కణ్నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించారు. ఈ క్రమంలో ప్రకటనల్లో ప్రచారకర్తగా కూడా ఆయన కనిపించి .. ఇంటింటికీ సుపరిచితమయ్యారు. ప్రత్యేకంగా తయారీ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా 1959 నుంచి అధికారికంగా ఆయన ఎండీహెచ్ కంపెనీని నెలకొల్పారు. ఎండీహెచ్ ప్రస్తుతం కోట్ల రూపాయల విలువ చేసే 50కు పైగా మసాలా ఉత్పత్తులను దేశ, విదేశాల్లో విక్రయిస్తోంది. బ్రిటన్, కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తోంది. 1,000 మందికి పైగా స్టాకిస్టులు, 4 లక్షల మందికి పైగా రిటైల్ డీలర్లు ఉన్నారు. రోజుకు 30 టన్నుల మసాలాలను ప్రాసెస్ చేసే మెషీన్లు ఉన్నాయి. 2017లో రూ. 21 కోట్ల వార్షిక వేతనంతో ఎఫ్ఎంసీజీ రంగంలోనే అత్యధికంగా ప్యాకేజీ పొందిన అధినేతగా గులాటీ నిల్చారు. తన వేతనంలో 90 శాతం భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన మహాశయ్ చున్నీలాల్ చారిటబుల్ ట్రస్ట్‌కు ఆయన విరాళంగా ఇచ్చేవారు. 250 పడకల ఆస్పత్రి, 20కి పైగా పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2019లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. -
మీడియాకి మనమే ‘మసాలా’ ఇస్తున్నాం
న్యూఢిల్లీ: బాధ్యతారాహిత్యంగా, నోటికొచ్చింది మీడియా ముందు మాట్లాడవద్దని, మీడియాకు మనమే మసాలా ఇస్తున్నామని బీజేపీ చట్టసభ్యులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం హెచ్చరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ వ్యక్తులను ఉద్దేశించి మోదీ తన మొబైల్ యాప్ ద్వారా సంభాషించారు. ‘కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పార్టీ నేతలు మీడియాతో మాట్లాడటానికి తెగ ఉవ్విళ్లూరుతుంటారు. ఏదో ఒక వివాదంలో చిక్కుకుని చివరకు పార్టీకే కాకుండా తమకూ చెడ్డపేరు తెచ్చుకుంటారు. ఈ విషయంలో మీడియాను నిందించాల్సిన అవసరం లేదు.దాని పని అది చేస్తోంది. కెమెరా ముందు నిలబడి ప్రతి విషయంలోకి దూరి, దేశానికి మార్గదర్శనం చేయాల్సిన అవసరం మనకు లేదు. మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నవారే మీడియాతో మాట్లాడుతారు’ అని మోదీ అన్నారు. ‘మీడియా అది చేస్తోంది, ఇది చేస్తోందంటూ మన కార్యకర్తలు ఎన్నో మాటలంటుంటారు. కానీ మన తప్పులతో మనమే మీడియాకు వివాదాలను అందిస్తున్నామని ఎప్పుడైనా ఆలోచించారా? కెమెరా పట్టుకున్న వ్యక్తిని చూడగానే మనమేదో దేశంలోని ప్రతి సమస్యనూ విశ్లేషించగలిగే శాస్త్రవేత్తలమో, పరిశోధకులమో అని ఫీల్ అయిపోతాం. మనం మాట్లాడిన దాంట్లో నుంచి వారికి ఏది అవసరమో దానినే మీడియా ప్రతినిధులు తీసుకుంటారు. మనల్ని మనమే నియంత్రించుకోవాలి’ అని మోదీ హెచ్చరించారు. ‘అన్ని వర్గాల్లోనూ మన మద్దతుదారులు పెరుగుతున్నారు. బీజేపీలో అత్యధిక మంది చట్టసభ్యులు ఓబీసీలు, దళితులు, గిరిజనులే ఉన్నారు. వెనుకబడిన వర్గాల మద్దతు మనకు లభించిదనడానికి ఇది ఉదాహరణ’ అని మోదీ పేర్కొన్నారు. -
ఒంటరి తుంటరి
దేవదాసు జగడం కి రెడీ. ఎంత మస్కా కొట్టినా గణేశ్... రామరామ కృష్ణకృష్ణ అంటూ మసాలా హరి కథ లు చెప్పకుండా కందిరీగర కుట్టిన ఒంగోలు గిత్తరీ శివం ఎత్తినట్టు మనందర్నీ పండగ చేస్కో మంటున్నాడు. ఎందుకంటే ప్రేమంట!రి అంటున్నాడు ఈ ఒంటరి తుంటరి! తెరపై కనిపించి 18 నెలలయినట్లుంది? ‘మసాలా’ సినిమా సమయంలో కథలు వినడమే పనిగా పెట్టుకున్నా. అలా విన్న కథల్లో మూడు కథలు బాగా నచ్చాయి. ఆ కథలను డెవలప్ చేసి, ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టాం. వాటిలో ‘పండగ చేస్కో’ ఒకటి. వాస్తవానికి ‘పండగ చేస్కో’ గత ఏడాది ఆగస్ట్‌లో విడుదల కావాల్సి ఉంది. అలా జరగకపోవడంతో నేను స్క్రీన్‌పై కనిపించి 18 నెలలయ్యింది. మీ గత చిత్రాలు మూడూ (‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’) ఫెయిలయ్యాయి. మీ మీద ఆ ఎఫెక్టేమీ లేదా? ఇప్పుడో సినిమా వస్తోందంటే నెర్వస్‌గా...? (మధ్యలోనే అందుకుంటూ...) ఎందుకుండదు? ఫ్లాప్‌ల ఎఫెక్ట్ కచ్చితంగా బిజినెస్ మీద ఉంటుంది. (నవ్వులు...) వ్యక్తిగత విషయానికి వస్తే, నేనూ అందరి లాంటి మనిషినే కదా... కష్టపడి చేసిన సినిమా పోయినప్పుడు డిజప్పాయింట్ అవుతా. కాకపోతే, సర్దుకొని తరువాతి సినిమాలోకి దిగిపోతా. ‘మసాలా’ జరుగుతున్నప్పుడే సినిమాలకు స్క్రిప్ట్ బాగుండడం ముఖ్యమని గ్రహించి, స్క్రిప్టులు వినడం, కొనడం మొదలుపెట్టా. చాలా స్క్రిప్టులు కొని, సిద్ధం చేశారా? లైన్ బాగున్నాయని అనుకొన్నవన్నీ తీరా పూర్తి స్క్రిప్టుగా రెడీ చేసినప్పుడు బాగుండకపోవచ్చు. మొత్తానికి కొన్ని పూర్తి బౌండ్ స్క్రిప్టులు తయారయ్యాయి. తాజాగా ‘పండగ చేస్కో’, ఇప్పుడు సెట్స్ మీద ఉన్న ‘హరి (గాడి) కథ’, ‘శివమ్’ అలా కొని, తయారు చేసుకున్న కథలే. 2014 అంతా నేను ఖాళీగా ఉన్నట్లు కనిపించినా ఈ ఏడాది మూడు సినిమాల షూటింగ్‌లు, మూడు రిలీజ్‌లతో బిజీగా ఉండగలిగా. ఆ మధ్య కొంచెం సన్నబడినట్లున్నారు? ‘పండగ చేస్కో’ కోసం తొమ్మిది కిలోలు తగ్గాను. ఇంజక్షన్స్ ద్వారా అయితే సులువుగా తగ్గిపోవచ్చట? తగ్గొచ్చు కానీ అది మంచిది కాదు. బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా అది సహజంగానే జరగాలి. తొమ్మిది కిలోలు ఎలా తగ్గారు? ముందు ఈ చిత్రంలోని పాత్రకు తగ్గ కాస్ట్యూమ్స్ కొన్నాను. నా సైజ్కన్నా కొంచెం చిన్న సైజ్ డ్రెస్‌లు కొనుక్కున్నాను. వాటికి తగ్గట్టుగా తగ్గా. వర్కవుట్స్, డైట్.. ఈ రెంటినీ సక్రమంగా పాటించి బరువు తగ్గా. మరి.. మళ్లీ పెరగడానికి కారణం? {పస్తుతం ‘శివమ్’ సినిమా కోసం పెరగాల్సి వచ్చింది. నాలుగైదు కిలోలు పెరిగాను. మీరు సినిమాల్లో చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తారు. విడిగా కూడా హైపర్ యాక్టివా? ఇష్టమైన పని చేసేటప్పుడు తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది. నేను విడిగా కూడా చాలా యాక్టివ్. మీ అల్లరిని కంట్రోల్ చేయడానికి మీ అమ్మగారు చాలా ఇబ్బందిపడేవారేమో! మీ బ్రదర్, సిస్టర్ ఎలా ఉండేవారు? ఇద్దరూ సెలైంటే. నేనేమో బాగా అల్లరి. అన్నయ్య కోటా అల్లరి, నా కోటా అల్లరి కలిపి నేనే చేసేవాణ్ణి. కంట్రోల్ చేయడానికి అమ్మ కష్టపడేది. సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరూ లేరా? అందరితో పరిచయాలు ఉన్నాయి. కానీ, ఇంటికెళ్లిపోయి టైమ్ స్పెండ్ చేసేంత క్లోజ్ కాదు. నా సెకండ్ స్టాండర్డ్ ఫ్రెండ్సే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. పార్టీల్లో పెద్దగా పాల్గొనరట? అవును. ఆ సబ్జెక్ట్‌లో నేను బాగా వీక్. పార్టీలకు వెళ్లను. ఇండస్ట్రీలో ఉన్నవాళ్లతో క్లోజ్ కాకపోవడానికి అదొక కారణం అయ్యుండొచ్చు. పార్టీయింగ్ మీద సదభిప్రాయం లేదా? అలా ఏం లేదు. పార్టీలు చేసుకుంటే తప్పేం కాదు? కానీ, నాకు ఇష్టం ఉండదు. అందుకే వాటికి దూరంగా ఉంటాను. మామూలుగా రోజంతా కష్టపడ్డాక ఓ పార్టీకి వెళ్లి రిలాక్స్ అవ్వాలని కొంతమంది అనుకుంటారు. కానీ ‘అబ్బా.. పార్టీకి వెళ్లాలా?’ అని నేననుకుంటాను. నాకెందుకో అవి పెద్ద ఎంజాయబుల్‌గా అనిపించవు. మరి.. మీకు ఎంజాయబుల్‌గా అనిపించేది ఏంటి? పొద్దున్నే షూటింగ్కెళ్లి, మర్నాడు షూటింగ్కెళ్లి, ఆ మర్నాడూ షూటింగ్కెళితే అదే పెద్ద ఎంజాయ్మెంట్. ‘ప్యాకప్’ అనే పదం నాకిష్టం ఉండదు. సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా ‘తర్వాత సీన్ ఏంటి?’ అని అడుగుతుంటాను. ‘ఏం లేదు. ఇక ఇంటికెళ్లడమే’ అంటారు. అప్పుడు కదులుతాను. పెళ్లి గురించి ఆలోచించరా? ఈ మధ్యే 27లోకి అడుగుపెట్టా. పెళ్లికి ఇంకా వెయిట్ చేయొచ్చు. సినిమా రిలీజులే మన చేతుల్లో లేవు. ఇక, పెళ్లి మన చేతిలో ఎక్కడుంటుంది? (నవ్వులు). అది సరే... ఇంకొంచెం హైట్ ఉండి ఉంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా? నా హైట్ ఐదు అడుగుల తొమ్మిది అంగుళాలు. కానీ, అంత హైట్ కనిపించరే? ‘దేవదాసు’ సినిమా చేసినప్పుడు నాకు పదిహేడేళ్లు. 21 ఏళ్ల వయసు వరకూ ఎదుగుతారనే విషయం తెలిసిందే. ‘దేవదాసు’ అప్పుడు 5 అడుగుల 6 అంగుళాలు ఉండేవాణ్ణి. అప్పట్నుంచీ 21ఏళ్ల వరకూ మరో మూడు అంగుళాలు పెరిగాను. కెరీర్ పరంగా ఎదగడంతో పాటు హైట్ కూడా పెరిగాను. ‘దేవదాసు’ నుంచి నన్ను చూసినవాళ్లకి ఆ తేడా తెలియడంలేదు. స్కూల్ డేస్‌లో మీకు ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం? ఒక్క హిస్టరీ తప్ప అన్నీ ఇష్టమే. మ్యాథ్స్ బాగా ఇష్టం. లెక్కల గురించి మాట్లాడుకుందాం. మీ జీవితంలో మైనస్‌గా భావించే అంశాలు.. ప్లస్‌గా అనిపించేవి? జీవితం గురించి ఎప్పుడూ దీర్ఘంగా ఆలోచించలేదు. మైనస్‌లు ఉండే ఉంటాయి. ప్లస్‌లు కూడా ఉండే ఉంటాయి. ఆ ప్లస్సులే హీరోను చేసి ఉంటాయి. కెమిస్ట్రీ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే.. హీరోయిన్లతో కెమిస్ట్రీ వర్కవుట్ కావడానికి ఏం చేస్తారు? హీరో, హీరోయిన్ మధ్య ఫ్రెండ్లీనెస్ ఉంటే కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. నాతో వర్క్ చేసిన హీరోయిన్స్ అందరూ దాదాపు నాతో బాగుంటారు. ఫలానా హీరోయిన్‌తో రామ్ లవ్‌లో పడ్డాడు? లాంటి వార్తలెప్పుడూ రాలేదు.. ఆ కోణంలో ఎవర్నీ చూడలేదు. జెనీలియా, తమన్నా.. ఇలా అందరూ నాకు ఫ్రెండ్సే. విడిగా కూడా క్రష్ లాంటివి ఏవీ కలగలేదా? అవైతే చాలా! కాకపోతే మనసులోనే. టీచర్స్‌ను ఇష్టపడ్డామని కొంతమంది చెబుతుంటారు? నాకు మొదటి నుంచీ టీచర్ అంటే అమ్మలానే అనిపించేది. ఇంట్లో అల్లరి చేస్తే అమ్మ కోప్పడుతుంది.. స్కూల్లో అయితే టీచర్ కోప్పడుతుంది అనుకునేవాణ్ణి. మీ అమ్మగారితో మీ బాండింగ్? ఎవరి మీదా ఆధారపడకుండా మన జీవితాన్ని మనమే లీడ్ చేసుకోవాలని అమ్మ అంటుంది. ఆ మాటల ప్రభావం నా మీద చాలా ఉంది. తల్లితండ్రులంటే భయం ఉండకూడదు.. ప్రేమ ఉండాలని చెబుతుంది. అందుకే, ఏదైనా చేయకూడని పనులు చేయాలనుకున్నప్పుడు, అమ్మా నాన్న తిడతారేమో అని కాకుండా బాధపడతారేమో అనుకుని, చేయడం మానేస్తాను. కిచెన్‌లో హెల్ప్ చేస్తారా? చేయాలనే కిచెన్‌లోకి వెళతా. కానీ, అది అమ్మకి హెల్ప్ అవదు సరికదా... ఇంకొంచెం పని ఎక్కువైపోతుంది. మీరు చేసే సినిమా కథలన్నీ మీ పెదనాన్నగారు (‘స్రవంతి’ రవికిశోర్) కంపల్సరీగా వింటారా? ముందు ఆయన, ఆ తర్వాత ఇద్దరం కలిసి వింటాం. ‘స్రవంతి’ రవికిశోర్ అనే వ్యక్తి లేకపోతే ఈ స్థాయికి వచ్చేవాణ్ణని అనుకుంటున్నారా? కచ్చితంగా ఇండస్ట్రీకి అయితే వచ్చేవాణ్ణి. కానీ పెదనాన్నగారు ఉండటం పెద్ద ప్లస్. ఆయన అనుభవం బాగా ఉపయోగపడుతోంది. ఆయన పాతికేళ్లుగా పరిశ్రమలో ఉన్నారు. ఏ అడుగు వేస్తే ఏమవుతుందో? ఆయనకు తెలుసు. అది నాకు చెబుతారు. ఒకవేళ ఆ గెడైన్స్ లేకపోతే ఎలా పడితే అలా అడుగులు వేసి, కొన్ని చేదు అనుభవాలు ఎదురైన తర్వాత ఏ అడుగు సరో తెలుసుకునేవాణ్ణి. కానీ, ఇప్పుడా అవసరం లేదు. పెదనాన్నగారి గెడైన్స్ ఉంది కాబట్టి, టైమ్ సేవ్ అవుతోంది. చెన్నైలో పెరిగారు కదా.. మరి తమిళ సినిమాలు? నాకు ముందు అవకాశం వచ్చిందే తమిళ పరిశ్రమ నుంచి. అప్పటికే వైవీయస్ చౌదరిగారు ‘దేవదాసు’ గురించి చెప్పి, తెలుగు సినిమా ద్వారానే పరిచయం కావాలని ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పటికి తమిళంలో ఒక సినిమా కమిట్ అయ్యా. అది వదులుకుని ఇక్కడికొచ్చా. ఆ తర్వాత తమిళంలో చేద్దామనుకుంటే సరైన కథ దొరకలేదు. కానీ తమిళంలో ఒక షార్ట్ ఫిలిం చేశా. ఆ సినిమా వివరాలు? ఆ ఫిలిమ్ పేరు - ‘అడయాళమ్’. అంటే ‘గుర్తింపు’ అని అర్థం. నాకు బోల్డంత గుర్తింపు తెచ్చిందా చిత్రం. యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన దేశంతో కలిపి మొత్తం 60 దేశాల చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. అప్పుడు నా నటనకు ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. దాంతో పెద్ద హీరో అయిపోతాం అని కలలు కనడం మొదలుపెట్టాను. అయితే అప్పటికింకా హీరోగా చేసే వయసు రాలేదు కాబట్టి, చదువు మీద శ్రద్ధ పెట్టా. ఇక్కడ హీరోగా ఎదిగాక పెద్ద పెద్ద తమిళ దర్శకుల నుంచే పిలుపు వచ్చింది. చేస్తే, తమిళ - తెలుగు బైలింగువల్ ఫిల్మ్ చేయాలి. కానీ, తమిళంలో వర్కవుట్ అయ్యే సినిమా, తెలుగులో వర్కవుట్ అయ్యేలా లేదు. తమిళం కోసం తెలుగు వదులుకోవడం నాకిష్టం లేదు. పూర్తి తమిళ సినిమా అయితే చేస్తా. మీకంటూ ఓ సొంత బ్యానర్ ఉండడం చాలా ప్లస్సేమో? అవును. కానీ, హీరో కావాలనుకున్న తర్వాత పెదనాన్నగారు ఒకటే అన్నారు. ‘ముందు బయటి బ్యానర్స్‌లో చేసి, ఆ తర్వాత హోమ్ బ్యానర్లో చేయాలని! బయట పది అవకాశాలుంటే అవి వదులుకుని నా బ్యానర్లో సినిమా ఒప్పుకోవాలి’ అన్నారు. ఆ విధంగా ముందు బయటి బ్యానర్స్‌లోనే చేసి, ఆ తర్వాతే హోమ్ బ్యానర్లో చేశాను. ‘చంద్రముఖి’ చిత్రంలో రజనీకాంత్ చేసిన తరహా పాత్ర వస్తే చేస్తారా? అలాంటి పాత్రలకు నా వయసు సరిపోదేమో! అంటే.. ఆ చిత్రం కొంచెం ఫిమేల్ ఓరియంటెడ్లా ఉంటుంది. కానీ, రజనీ పాత్ర ఆ కేరెక్టర్‌కి భరోసాగా నిలుస్తుంది. అలాంటి రోల్ అయితే చేస్తారా? కథకు కీలకంగా నిలిచే ఆ తరహా పాత్ర అయితే చేస్తా. ‘ఎందుకంటే ప్రేమంట’ ఆశించిన ఫలితం సాధించలేదు కదా! దాంతో ప్రయోగాలకు దూరంగా ఉండాలని...? {పయోగాత్మక చిత్రాలు ట్రై చేస్తూనే ఉంటా. లేకపోతే ‘నైన్ టూ ఫైవ్’ రొటీన్ జాబ్‌లా అయిపోతుంది. ‘మసాలా’ తర్వాత మళ్లీ మల్టీస్టారర్ చిత్రాలు ఎందుకు చేయలేదు? మల్టీస్టారర్ చేయడానికి నాకేం ఇబ్బంది లేదు. ప్రాపర్ స్టోరీ కుదరకపోతే చేసినా వేస్ట్. మన తెలుగులో మల్టీస్టారర్స్ పెద్దగా వర్కవుట్ కావేమో అని ఫీలింగ్. పైగా, ఇద్దరు హీరోలకూ భారీగా రెమ్యూనరేషన్లిచ్చి తీస్తాం. తీరా బిజినెస్ ఆ స్థాయిలో అవుతున్నట్లు లేదు. హిందీలో పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. మీరేమో ‘నేను, నా సినిమాలు’ అన్నట్లుగా ఉంటారు. ఎవరితోనూ కలవరు కాబట్టి, మీకు ‘హెడ్ వెయిటే’మో అని చాలామంది అనుకుంటారు? అనుకుంటారు.. ఏం చేయగలను? నేనెక్కువగా ఇంట్లో ఉండడానికే ఇష్టపడతాను. నా పనేంటో నేనేంటో అన్నట్లు ఉంటా. మరి, విహారయాత్రలకు వెళుతుంటారా? ఒంటరిగా ఉండాలనిపించినప్పుడు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటా. అమెరికా, ఆస్ట్రేలియా... ఇలా ఎక్కడికంటే అక్కడికి వెళతాను. {పకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఓ స్టార్‌గా సమాజానికి ఏమైనా చేయాలనుకుంటారా? తప్పకుండా. కానీ, ప్రెస్‌మీట్ పెట్టి ఆ విషయం చెప్పను. హెల్ప్ చేసే విషయాలకు పబ్లిసిటీ కోరుకోను. నా అభిమాన సంఘాల నుంచి కూడా సమాజ సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. మూడు సినిమాల ప్రతికూల ఫలితాల తర్వాత కొత్త సినిమాతో సన్నద్ధమై ప్రేక్షకుల ముందుకు వస్తున్న రామ్. గమనిక: లీడ్‌లో వాడిన పదాలన్నీ రామ్ వరుస సంఖ్యలో నటించిన సినిమాల పేర్లు. - డి.జి. భవాని -
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో...
రామ్ అంటే ఎనర్జీ. ఎనర్జీ అంటే రామ్. సరైన ఎనర్జిటిక్ పాత్రలు దొరికితే రామ్ ఏ స్థాయిలో విజృంభిస్తాడనడానికి ‘రెడీ’ లాంటి సినిమాలే ఉదాహరణ. ఇటీవలే వెంకటేశ్‌తో కలిసి ‘మసాలా’ చేసిన రామ్, తాజాగా ఓ కొత్త ప్రాజెక్ట్‌కి పచ్చజెండా ఊపారు. గత ఏడాది రవితేజతో ‘బలుపు’ వంటి హిట్ సినిమా చేసిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేయబోతున్నారు. ‘సింహా’లాంటి సినిమా తీసిన యునెటైడ్ మూవీస్ పతాకంపై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. రామ్ ఎనర్జీకి తగిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇదని, కథ సిద్ధమైందని దర్శకుడు చెప్పారు. ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తామని, మిగతా తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. -
సినిమా రివ్యూ: వెంకటేశ్, రామ్ బ్రాండ్ 'మసాలా'
తెలుగు చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో మహానటులు ఎన్ టీఆర్, ఏఎన్నాఆర్, శోభన్ బాబులు కృష్ణ, కృష్టం రాజులతో కలిసి అనేక మల్టీ స్టారర్ చిత్రాలతో ప్రేక్షకులను ఆలరించారు. జనరేషన్ మారిన తర్వాత స్టార్ డమ్ ఇమేజ్ లో చిక్కుకుపోయిన ప్రస్తుత హీరోలు మల్టీస్టారర్ చిత్రాలవైపు చూడటానికి జంకారు, ఆలోచించడానికి వెనకడుగు వేశారు. టాలీవుడ్ తెరపై మల్టీ స్టారర్ చిత్రాల ఉనికి ప్రశ్నార్ధకమైన నేపథ్యంలో తాజాగా విక్టరీ వెంకటేశ్ ఓ సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. దాని ఫలితమే మహేశ్ తో కలిసి వెంకటేశ్ నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఆ చిత్రం అందించిన విజయోత్సహాంతో మళ్లీ రామ్ తో జతకట్టి 'మసాలా' చిత్రంలో నటించగా, రాంచరణ్ తో వెంకటేశ్ మరో చిత్రానికి పచ్చజెండా ఊపారు. టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ కు తెరతీస్తూ.. హిందీలో ఘనవిజయం సాధించిన 'బోల్ బచ్చన్' చిత్ర రీమేక్ గా 'మసాలా'తో వెంకటేశ్ గురువారం నవంబర్ 14 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రామ్ తో కలిసి నటించిన మసాలా చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్లొద్దాం! కోర్టు తీర్పుతో యావదాస్తిని కోల్పోయిన రహమాన్ (రామ్), సోనియా(అంజలీ)లను వారి తండ్రి స్నేహితుడు నారాయణ(ఎంఎస్ నారాయణ) చేరదీసి తన ఊరు భీమరాజపురంకి తీసుకెళుతాడు. భీమరాజపురంలో ధనవంతుడైన బలరాం వద్ద నారాయణ పనిచేస్తుంటాడు. బలరాం (వెంకటేశ్) దేనినైనా సహిస్తాడు కాని అబద్దం ఆడిన వాళ్ల ప్రాణలు తీయడానికైనా వెనుకాడడు. బలరాంకు మీనాక్షి అనే సోదరి ( షాజన్ పదాంసీ) ఉంటుంది. ఆ ఊరిలో బలరాంకు నాగరాజు (పోసాని) అనే దుష్టుడికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్ఠాయిలో విభేదాలు ఉంటాయి. వారిద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగా ఎన్నో ఏళ్లుగా ఓ ఆలయం మూతపడి ఉంటుంది. అయితే ఆ ఆలయ కొలనులో పడిన బాలుడిని రక్షించడానికి రెహమాన్ గుడి తాళం పగులగొట్టి, తలుపులు తెరుస్తాడు. దాంతో రహమాన్ పై నాగరాజు దాడికి పాల్పడుతున్న సమయంలో బలరాం వచ్చి కాపాడుతాడు. గుడి తలుపులు తెరిచిన రహమాన్ వివరాలు బలరాం అడుగుతాడు. ఆలయ తలుపులు తీసింది ఓ ముస్లిం అని చెబితే గొడవ అవుతుందనే ఉద్దేశంతో రహమాన్ పేరును రామ్ అని నారాయణ కుమారుడు (ఆలీ) అబద్దం ఆడుతాడు. రహమాన్ ఉరఫ్ రామ్ ప్రవర్తన నచ్చి బలరాం ఉద్యోగం ఇస్తాడు. ఒక అబద్దం ఆడిన రామ్.. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని అబద్దాలు ఆడాల్సి వస్తుంది. అంతేకాక రహమాన్, మీనాక్షిలు ఒకరికొకరు ప్రేమించుకుంటారు. అయితే అనేక అబద్దాలు ఆడిన రామ్.. బలరాంను ఎలా మెప్పించి, మీనాక్షితో పెళ్లిని ఎలా ఒప్పించాడు అనే సాదాసీదా కథతో 'మసాలా' చిత్రం రూపొందింది. వెంకటేష్ బ్రోకెన్ ఇంగ్లీష్ లో మాట్లాడటం బలరాం పాత్ర ప్రత్యేకత. కెరీర్ లో వెంకటేశ్ కు ఇది విభిన్నమైన పాత్ర. మల్టీస్టారర్ చిత్రాల్లో ఉండే పరిమితులు, ఇతర కారణాల వల్ల బలారాం పాత్ర కొంత మూసలో సాగినా.. పర్వాలేదనిపించింది. బలరాం పాత్ర చుట్టే ఇతర పాత్రలు తిరుగుతుంటాయి కాబట్టి వెంకటేశ్ ఈ చిత్రానికి వెన్నుముక అని చెప్పవచ్చు. ఇక రామ్, రహమన్ రెండు రకాల పాత్రలతో రామ్ ప్రేక్షకులను ఆలరించాడమే కాకుండా ఆకర్షించాడు కూడా. రామ్ పాత్ర కొంత అమాయకంగా ఉంటుంది. రహమాన్ గే (స్వలింగ సంపర్కుడు) రూపంతో నవ్వులు పూయించాడు. రామ్ లో ఉండే ఎనర్జీ గే పాత్రకు చాలా ప్లస్ అయింది. గే పాత్ర పోషించడానికి స్టార్స్ సహజంగానే వెనుకాడుతుంటారు. అయితే రామ్ ఇలాంటి పాత్రను చేయడమనేది ఓ సాహాసామే అని చెప్పవచ్చు. సోనియా పాత్రలో అంజలి తన పరిధి మేరకు ఓకే అనిపించింది కాని ఈ చిత్రంపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. మీనాక్షిగా పదాంసీ చిన్న చిన్న సీన్లలో కనిపించినా.. పాటలకు మాత్రమే పరిమితమైంది. మీనాక్షి పాత్రకు ఇంకెవర్నినైనా సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నారాయణ, ఆలీ బృందం గురించి. నారాయణ కొడుకుగా ఆలీ నటించాడు. ఆలీ మసాలా అనే డ్రామా కంపెనీని నడుపుతుంటాడు. కామెడి, డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆలీ ట్రాక్ ను తెలుగు వాతవరణానికి అనుగుణంగా చక్కగా డిజైన్ చేశారు. హిందీ 'బోల్ బచ్చన్' పోల్చకుంటే కృష్ణ, ఏఎన్నార్ కారెక్టర్లను బాగా ఇంప్రూవ్ చేసి ఆలీతో చేయించడం ఆకట్టుకుంది. అంతేకాక చింతామణి పాత్రలో కోవై సరళ తన మార్కును నిలబెట్టుకుంది. పాత సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్ కు కోవై సరళతో డ్యాన్సులు చేయించడం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. జయప్రకాశ్, పోసానిలకు రొటిన్ పాత్రలే దక్కాయి. మీనాక్షి పాట ఒక్కటే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తుండేలా ఉంది. ఎందుకంటే ప్రోమోలో ఎక్కువగా కనిపించడమేమో. తమన్ మళ్లీ అదే సంగీతం రొటిన్. తమన్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అని చెప్పడం చాలా కష్టం. అనిల్ డైలాగ్స్ అక్కడక్కడ పేలాయి. ఇక 'నువ్వే కావాలి', 'నువ్వు నాకు నచ్చావు', 'మన్మధుడు' 'మల్లీశ్వరి' లాంటి ఫ్యామీలీ ఎంటర్ టైనర్లతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నదర్శకుడు విజయ భాస్కర్ ను ఇటీవల కాలంలో ఫ్లాప్ లు వెంటాడుతున్నాయి. చాలా కాలం తర్వాత 'బోల్ బచ్చన్' రీమేక్ తో అక్కడక్కడా తన మార్కును చూపించినా.. ప్రయోగాలకు దూరంగానే ఉన్నట్టు కనిపించింది. బోల్ బచ్చన్ సినిమాను సీన్ టూ సీన్ ను కదపకుండా.. టాలీవుడ్ ట్రెండ్ కు తగినట్టుగా రూపొందించారు. ఈ చిత్ర సెకండాఫ్ లో కొంత గందరగోళం అనిపించానా.. రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ బ్యాలెన్స్ చేసింది. వెంకటేశ్ ఇంగ్లీష్ డైలాగ్స్ బీ, సీ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంపైనే 'మసాలా' చిత్ర విజయం కొంత ఆధారపడి ఉంటుంది. వెంకటేశ్, రామ్ అందించిన 'మసాలా' చిత్రంలో ఘాటు ఎక్కువైందనిపిస్తుంది. లాజిక్కులన్ని వదిలేసి.. వినోదాన్ని ఆశించే ప్రేక్షకులు 'మసాలా'ను ఎంజాయ్ చేయవచ్చు అనే రేంజ్ టాక్ ను సంపాదించుకుంది. వెంకట్రామ్ (వెంకటేశ్, రామ్) బ్రాండ్ మసాలాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచిచూద్దాం! -
‘మసాలా’ సినిమా స్టిల్స్
కె.విజయభాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్, రామ్ కథానాయకులుగా రూపొందిన చిత్రం ‘మసాలా’. డి.సురేష్‌బాబు సమర్పణలో... ‘స్రవంతి’రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రంలో అంజలి, షాజన్ పదమ్సీ కథానాయికలు. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. -
ఆ రూట్లో వెళ్లడం నాకిష్టం లేదు
అప్పుడే షోరూమ్ నుంచి తీసుకొచ్చిన రోల్స్‌రాయస్ కారులా ఉంటాడు రామ్. వేగం అతని శైలి. కెమెరా ముందుకొస్తే... చెలరేగిపోవడం అతని నైజం. అందుకే తక్కువ సినిమాలతోనే యువత కు అభిమానపాత్రుడు అయ్యాడు రామ్. విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఆయన నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘మసాలా’. కె.విజయభాస్కర్ దర్శకత్వంలో డి.సురేష్‌బాబు సమర్పణలో ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్ విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. నా దృష్టిలో ఆయన లివింగ్ లెజెండ్ తెలుగు సినిమాకు నాలుగు పిల్లర్లుగా నిలిచిన నలుగురు హీరోల్లో వెంకటేష్‌గారు ఒకరు. నా దృష్టిలో ఆయన లివింగ్ లెజెండ్. ఆయనతో కలిసి పనిచేయడం జీవితంలో మరిచిపోలేను. వెంకటేష్‌గారితో కలిసి నటించడానికి నేను టెన్షన్ పడలేదు. ఎందుకంటే... మా స్రవంతి సంస్థలో ఆయన రెండు సినిమాలు చేశారు. చిన్నప్పట్నుంచీ ఆయన్ను దగ్గరగా చూసిన వాణ్ణి. ‘నువ్వునాకు నచ్చావ్’ షూటింగ్ జరుగుతున్నప్పుడు దగ్గరుండి చూశాను. అందుకే... వెంకీగారితో కలిసి పనిచేస్తున్నప్పుడు నాకు కొత్తగా అనిపించలేదు. పైగా ఈ సినిమా సెట్స్‌కి వెళ్లడానికి కారణం కూడా వెంకటేష్‌గారే. ‘బోల్‌బచ్చన్’ సినిమా చూసి ఆయనే మా పెదనాన్నగారికి ఫోన్ చేసి సినిమా చూడమని చెప్పారట. ‘నేను, రామ్ కలిసి నటిస్తే బాగుంటుంది’ అని సలహా కూడా వెంకటేష్‌గారే ఇచ్చారట. ‘బోల్‌బచ్చన్’కి ఏ మాత్రం తగ్గదు ఇప్పటివరకూ ఓ పది సినిమాల్లో నటించాను. కథా పరంగా చూసుకుంటే అన్నీ కొత్తగా ఉంటాయి. ‘బోల్‌బచ్చన్’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కినా ఈ సినిమా కూడా ప్రేక్షకులకు కొత్తగానే ఉంటుంది. స్క్రిప్ట్ విషయంలో విజయభాస్కర్ అంకుల్ చాలా వర్క్ చేశారు. కథని, రైటర్ని ఇచ్చి వదిలేస్తే చాలు... పిండేస్తారాయన. వెంకటేష్‌గారి పాత్రను, నా పాత్రను చాలా బ్యాలెన్సింగ్‌గా డీల్ చేశారు. ‘బోల్‌బచ్చన్’కి ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని మలిచారు. భారతీయ సినీ చరిత్రలో తెలుగు సినిమా హాస్యానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ విలువలు, ఆ ప్రత్యేకత మిస్ కాకుండా ఈ సినిమా ఉంటుంది. జనాలను నవ్వించడానికి ఓ మంచి ప్రయత్నం చేశాం. ఈ సినిమా చేయకూడదనుకున్నా... ఈ సినిమా ప్రపోజల్ నా వద్దకు రాగానే.. ‘బోల్‌బచ్చన్’ సినిమా తెప్పించుకుని చూశాను. చాలా బాగా నచ్చింది. అయితే... నేను మాత్రం ఈ సినిమా చేయకూడదని అనుకున్నాను. దానికి కారణం అభిషేక్‌బచ్చన్ పాత్రలోని రెండోకోణం. ఆ యాంగిల్లో నన్ను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా? అనే మిమాంసలో పడిపోయా. రెండ్రోజులు ఆలోచించిన తర్వాత చేయాలని నిర్ణయం తీసుకున్నా. బాలీవుడ్లో పెద్ద పెద్ద హీరోలు కూడా ఇమేజ్‌ని పక్కన పెట్టి వైరైటీ పాత్రలు చేస్తున్నారు. మనం ఎందుకు చేయకూడదు అనిపించే ఈ పాత్ర ఒప్పుకున్నా. శివశంకర్ మాస్టార్ని ఫాలో అయిపోయా ఇందులో గే షేడ్స్ ఉన్న పాత్ర చేయడం విషయంలో నాకు ప్రేరణగా నిలిచిన వ్యక్తి శివశంకర్ మాస్టార్. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమే ఓ పాట జరిగింది. ఆ పాటకు శివశంకర్ మాస్టారే కొరియోగ్రాఫర్. ఆయన్ను అలాగే గమనించాను. చివరకు ఆయన్నే ప్రేరణగా తీసుకొని ఈ పాత్ర చేశాను. నేను ఎంతో కష్టపడి చేసిన పాత్ర ఇది. ఇప్పటికి మూడు కథలు కొన్నాను సరైన కథలు దొరికితే మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి నేను రెడీ. ఇక నుంచి సినిమాలు ఒప్పుకునే విషయంలో జాగ్రత్తగా ముందుకెళ్లాలనుకుంటున్నాను. తెలుగు సినిమా ప్రస్తుతం కాంబినేషన్లపై నడుస్తోంది. ఆ రూట్లో వెళ్లడం నాకిష్టం లేదు. ముందు కథ, తర్వాతే కాంబినేషన్లు. ఏదైనా కథ నచ్చితే వెంటనే కొనేస్తున్నాను. ఇప్పటికి మూడు కథలు కొన్నాను. తర్వాత దర్శకులను వెతుకుతాను. ఇలా చేయడం వల్ల కథలకోసం వేచివుండాల్సిన అవసరం ఉండదు. కథల్ని కొన్నంత మాత్రాన టైటిల్ కార్డ్ నాదే వేసుకుంటానని అనుకునేరు. అంతటి నీచమైన పని చేయను. కథ ఎవరిదో వారిదే టైటిల్ కార్డ్ కూడా ఉంటుంది. -
వెంకటేష్‌గారితో పనిచేయడం గొప్ప అనుభూతి - రామ్
‘‘ ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి విజయాల తర్వాత మళ్లీ విజయభాస్కర్‌తో ‘మసాలా’ లాంటి ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్లో నటించడం ఆనందంగా ఉంది. తమన్ పాటలు, నేపథ్యం సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’ అని వెంకటేష్ అన్నారు. కె.విజయభాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్, రామ్ కథానాయకులుగా రూపొందిన చిత్రం ‘మసాలా’. డి.సురేష్‌బాబు సమర్పణలో... ‘స్రవంతి’రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రంలో అంజలి, షాజన్ పదమ్సీ కథానాయికలు. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. రామ్ మాట్లాడుతూ -‘‘హీరోలుగా వెంకటేష్గారూ నేనూ పోటీపడి నటించామని అందరూ అంటున్నారు. దానికంటే ముఖ్యంగా సురేష్‌గారు, పెదనాన్న రవికిషోర్‌గారు పోటీపడి ఖర్చుపెట్టి ఈ సినిమా తీశారు. అందరూ ఇష్టపడి పనిచేసిన సినిమా ఇది. పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా వెంకటేష్‌గారితో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి’’ అన్నారు. అల్లు అరవింద్, దిల్ రాజు చేతుల మీదుగా డిస్క్‌ల ప్రదానం జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నవ్వుల మసాలా
టైమింగ్‌తో మెప్పించడం వెంకటేష్ స్టైల్. వేగంతో మెరిపించడం రామ్ స్టైల్. వీరికి తోడుగా అంజలి, షాజన్ పదమ్సీ లాంటి ఘాటైన దినుసులు తోడైతే.. ‘మసాలా’ టేస్ట్ అదరహో అనకుండా ఉంటుందా! దర్శకుడు కె.విజయభాస్కర్ ఛాలెంజ్‌గా తీసుకొని తెరకెక్కించిన ‘మసాలా’ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని నవ్వులలోకంలో విహరింపజేసేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత ‘స్రవంతి’రవికిషోర్ అంటున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ -‘‘నవ్వించడమే ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలకే అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా ప్రచార చిత్రాల్లో వెంకటేష్ చెబుతున్న డైలాగులు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్నాయి. తమన్ స్వరాలందించిన పాటలకు కూడా మంచి స్పందన వస్తోంది. సెన్సార్‌వారు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ చిత్రం అన్ని తరగతుల వారినీ అలరిస్తుందని నా నమ్మకం’’ అన్నారు. ఎమ్మెస్ నారాయణ, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ: రోహిత్‌శెట్టి, ఛాయాగ్రహణం: ఆండ్రూ, కళ: ఏ.ఎస్.ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కృష్ణ చైతన్య, సమర్పణ: డి.సురేష్‌బాబు, నిర్మాణం: శ్రీ స్రవంతి మూవీస్.