వెంకటేష్, రామ్‌ల మసాలా రెడీ
వెంకటేష్, రామ్‌ల మసాలా రెడీ
Published Thu, Sep 26 2013 1:01 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
ఎట్టకేలకూ టైటిల్ ఓకే అయ్యింది. వెంకటేష్, రామ్‌ల తొలి కాంబినేషన్‌లో భారీ ఎత్తున రూపొందుతోన్న చిత్రానికి ఇప్పటికే పలు టైటిళ్లు ప్రచారంలోకి వచ్చాయి. చివరకు ‘మసాలా’ టైటిల్ ఓకే అయ్యింది. కె.విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో డి.సురేష్‌బాబు సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నాయి. ఎస్.ఎస్.థమన్ స్వరపరిచిన పాటలను విజయ దశమికి విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ నెలాఖరున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇందులో అంజలి, షాజన్‌పదమ్‌సీ కథానాయికలు. అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్ కాంబినేషన్‌లో రూపొంది, హిందీలో ఘనవిజయం సాధించిన ‘బోల్ బచ్చన్’కి ఇది రీమేక్. ఈ చిత్రానికి కెమెరా: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, పాటలు: రామజోగయ్యశాస్త్రి.
Advertisement
Advertisement