మన వంటింట్లో పప్పు తాలింపులకు ఉపయోగించే ఆవాలు, జీలకర్ర దగ్గర నుంచి నాన్‌వెజ్ లేదా బిర్యానీలు చేసేటప్పుడు ఉపయోగించే మసాలలన్నింటిని నిల్వ చేయడం కాస్త ఇబ్బంది. అందులోనూ రకరకాల సీజన్‌లు ఉండే మన ప్రదేశాల్లో మరింత కష్టం. అలాంటప్పుడూ వాటి రుచి పాడవకుండా ఎక్కువ కాలం వచ్చేలా స్టోర్ చేయాలంటే ఈ అద్భుతమైన టెక్నిక్స్ ఫాలోకండి. రుచి పోదు, తాజగా వాడుకోవచ్చు కూడా.
మసాలా దినుసులు సరిగా నిల్వ చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులు..
గాలి చొరబడిన కంటైనర్లు
మీ సుగంధ ద్రవ్యాలను నిల్వ చేయడానికి గాలి చొరబడని కంటైనర్‌లో జాగ్రత్తగా నిల్వ చేయాలి. అలాగే సుగంధ ద్రవ్యాల్లో తేమ లేకుండా బాగా ఎండలో ఆరనిచ్చి జాగ్రత్తగా భద్రపర్చాలి. గాలి చొరబడి మూతలు ఉన్న జాడీ లేదా కంటైనర్‌లే మేలు. ఇలాంటివి అయితే సుగంధ ద్రవ్యాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
కూల్ స్టోరేజ్
గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయడం ఎంత ముఖ్యమో అలాగే చల్లటి ప్రదేశంలో ఉంచడం అంతే ప్రధానం. సుగంధ ద్రవ్యాలు చాలాకాలం పాటు తాజాగా రుచిగా ఉంచాలనుకుంటే వేడిపొయ్యిలు, ఓవెన్లు, సూర్యరశ్మీకి దూరంగా ఉంచడం వంటివి చేయాలి.
ఎట్టి పరిస్థితుల్లో తేమ లేకుండా..
వర్షాకాలం లాంటి సీజన్లో వాటిని గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచినప్పటికీ అట్టలు కట్టనట్లు అయిపోతాయి. వాటి రుచిలో కూడా మార్పు వస్తుంది. అలాంటప్పుడూ తేమను పీల్చుకునే ప్యాకెట్లలో నిల్వ చేసేంఉదకు ప్రయత్నించాలి. ఈ మసాలా దినులు గాలి లేదా తేమను ఆకర్షించే గుణం ఉంది కాబట్టి నిల్వ చేసుకునేటప్పుడు కాస్త జాగుకతతో ఉండాలి.
లేబుల్
ఈ మసాల దినులు స్టోర్ చేసుకునే కంటైనర్‌లపై అవి ఎప్పుడు కొన్నారనే దాన్ని లేబుల్ చేయండి. దీని వల్ల అవి ఎంతకాలం వరకు తాజగా ఉంటాయో మీకు తెలిసేందుకు ఉపయోగపడుతుంది. ఒకవేళ వాడే ముందు బాగున్నాయా లేదా అన్న సందేహం వచ్చినప్పుడే ముందుగా దాన్ని లేబుల్ చేసి రాసి ఉంటారు కాబట్టి అది చూస్తే సరిపోతుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదు.
పరిమిత స్థలం లేదా తేమ వాతావరణం
వంటగదిలో పరిమిత స్థలమే ఉండి నిల్వచేసుకోవడం ఇబ్బందిగా మారినా లేదా ఎప్పటికీ తేమ వాతావరణమే అయితే మసాల దినుసులు నిల్వ చేయడం అంత ఈజీ కాదు. అలాంటప్పుడు కొద్ది మొత్తంలో వాటిని స్టోర్ చేసి మిగతా వాటిని గ్రైండ్ చేసి నిల్వ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పొడి చేసుకుంటే కూరల్లో కూడా సులభంగా వాడుకోవచ్చు. ఇది మిస్ చేశాం అనే సమస్య కూడా ఉండదు. తేమ వాతావరణంలో ఉండే వారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.
(చదవండి: అత్యంత ఖరీదైన కాఫీ! సర్వ్ చేసే విధానం చాలా వెరైటీగా ఉంటుంది!)
Comments
Please login to add a commentAdd a comment