Spices
-
వెల్లుల్లి కూరగాయ లేదా సుగంధ ద్రవ్యమా? హైకోర్టు ఏం చెప్పిందంటే..
వెల్లుల్లి మసాలాకు చెందిందా, కూరగాయనా అనే సందేహం ఎప్పుడైనా వచ్చింది. కానీ అది పెద్ద చర్చనీయాంశంగా మారి సుదీర్ఘ న్యాయ పోరాటానికి దారితీసింది. చివరికి హైకోర్టు తీర్పుతో ఆ న్యాయ పోరాటానికి తెరపడింది. వంటగదికి మసాలాకు చెందిన ఈ వెల్లుల్లి విషయంలో హైకోర్టు ఏం పేర్కొంది?. అసలు ఏం జరిగింది అంటే..భారతీయ వంటకాలలో ప్రధానమైన వెల్లుల్లి మధ్యప్రదేశ్‌లో కూరగాయ? లేదా మసాలాకు చెందిందా? అనే వర్గీకరణపై సుదీర్ఘ న్యాయపోరాటానికి కారణమయ్యింది. ఈ వివాదాన్ని ఇటీవలే మధ్యప్రదేశ్ హైకోర్టు పరిష్కరించింది. ఇది రైతులు, వ్యాపారుల పై గణనీయమైన ప్రభావాన్ని చూపించింది. 1972 వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ చట్టం కారణంగా ఈ వివాదం మొదలయ్యింది. ఇది వెల్లుల్లిని సుగంధ ద్రవ్యంగా వర్గీకరించింది. నిర్దిష్ట మార్కెట్లలో దాని అమ్మేలా పరిమితం చేసింది. ఇది రైతులను మరింత సమస్యల్లోకి నెట్టేసింది. వారు వ్యవసాయ మార్కెట్లలో అమ్ముకునే వీలులేక ఇబ్బందులు పడేవారు. దీంతో 2007లో మాంద్‌సౌర్‌కు చెందిన ఒక వెల్లుల్లి వ్యాపారి ఈ వర్గీకరణను సవాలు చేస్తూ, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లో వెల్లుల్లిని విక్రయించడానికి అనుమతి కోరడం జరిగింది. పొటాటో ఆనియన్ కమీషన్ అసోసియేషన్ నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, మండి బోర్డు మొదట్లో వెల్లుల్లి విక్రయానికి కొంత వెసులుబాటు కల్పించింది. ఐతే ఎప్పుడైతే వ్యవసాయ మార్కెట్లలో మాత్రమే వెల్లుల్లి విక్రయించాలని మధ్యప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఆదేశించారో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అసంతృప్తి చెందిన వ్యాపారులు హైకోర్టుని ఆశ్రయించగా చివరికి రైతులకు అనుకూలంగా తీర్పునిస్తూ..వెల్లులిని ఏ మార్కెట్లో అయినా విక్రయించేందుకు అనుమతిచ్చింది. ఈ నిర్ణయాన్ని హైకోర్టు డబుల్ బెంచ్ సమర్థించింది, వెల్లుల్లి వ్యవసాయ ఉత్పత్తి హోదాను పునరుద్ఘాటించింది. అయితే, పొటాటో ఆనియన్ కమీషన్ అసోసియేషన్ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. ధర్మాసనం దీన్ని తోసిపుచ్చి మరీ వ్యవసాయ లేదా కూరగాయల మార్కెట్లలో వెల్లుల్లిని విక్రయించడానికి రైతులకు వెసులుబాటును మంజూరు చేసింది. అంతలా వివాదం రేకెత్తించిన ఈ వెల్లుల్లితో చేసే వంటకాలేంటో చూద్దామా..వెల్లుల్లి చట్నీఇది ప్రధానంగా వెల్లుల్లి, ఎర్ర మిరపకాయలు, మసాలా దినుసుల మిశ్రమంతో తయారుచేసే ఘాటైన చట్నీ. వెల్లుల్లిని చూర్ణం చేసి, ఆపై మిరపకాయలతో కలిపి పేస్ట్ తయారు చేస్తారు. ఇది తరచుగా చింతపండు, నిమ్మరసం లేదా వెనిగర్‌తో కలిపి పుల్లటి రుచితో ఉంటుంది. ఈ చట్నీని సాధారణంగా పకోరాలు లేదా సమోసాల వంటి స్నాక్స్‌తో పాటుగా వడ్డిస్తారు.వెల్లుల్లి సూప్వెల్లుల్లి సూప్ అనేది ఓదార్పునిచ్చే సువాసనగల వంటకం. దీనిని తరచుగా వెల్లుల్లి రెబ్బలను వివిధ రకాల కూరగాయలు లేదా చికెన్ ఉడకబెట్టిన పులుసుతో మరిగించి తయారు చేస్తారు. రెసిపీని సిద్ధం చేయడానికి, వెల్లుల్లిని ముందుగా వేయించి, ఆపై ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి పదార్థాలతో కలుపుతారు. ఈ వేడెక్కడం సుగంధ సూప్ చల్లని సీజన్లో రోజులో ఏ సమయంలోనైనా ఆస్వాదించడానికి అనువైనది.వెల్లుల్లి ఊరగాయవెల్లుల్లి ఊరగాయ అనేది ఆవాల నూనె, సుగంధ ద్రవ్యాల మిశ్రమంలో మొత్తం వెల్లుల్లి రెబ్బలను మెరినేట్ చేయడం ద్వారా తయారు చేయబడిన స్పైసీ ఊరగాయ. కొన్నిసార్లు వెనిగర్ లేదా నిమ్మరసం కూడా ఉపయోగిస్తారు. వెల్లుల్లి, లవంగాల చూర్ణం కూడా జోడిస్తారు. ఇది అన్నం, రోటీ లేదా పరాఠాల్లో బాగుటుంది. వెల్లుల్లి బ్రెడ్గార్లిక్ బ్రెడ్ అనేది రొట్టెతో కూడిన ఒక ప్రియమైన ఆకలి లేదా సైడ్ డిష్. వెన్న, మెత్తగా తరిగిన వెల్లుల్లి, పార్స్లీ వంటి మూలికల మిశ్రమంతో దీన్ని తయారు చేస్తారు. దీనిలో బయట మంచిగా కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండేలా బ్రెడ్‌ని కాల్చుతారు. గార్లిక్ బ్రెడ్ సాధారణంగా పాస్తా లేదా సూప్‌లతో వడ్డిస్తారు.(చదవండి: 'అరంగేట్రం' చేసిన తొలి నర్తకిగా 13 ఏళ్ల చైనా విద్యార్థిని రికార్డు..!) -
15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు
ఈశాన్య దిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతంలో కల్తీ మసాలా దినుసుల తయారీకి సంబంధించిన భారీ రాకెట్‌ను పోలీసులు కనుగొన్నారు. రెండు కర్మాగారాలపై దాడులు నిర్వహించి 15 టన్నుల నకిలీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీకి కారణమైన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసుకు సంబంధించి డీసీపీ పవేరియా మాట్లాడుతూ..‘మసాలా దినుసుల్లో కల్తీ జరుగుతోందనే సమాచారం మేరకు ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. దిల్లీ పరిసర ప్రాంతాల్లో సెర్చ్ నిర్వహించాం. ఆపరేషన్ సమయంలో దిలీప్ సింగ్ (46) అనే వ్యక్తికి చెందిన ఒక ప్రాసెసింగ్ యూనిట్లో పాడైపోయిన ఆకులు, నిషేధిత పదార్థాలను ఉపయోగించి కల్తీ పసుపును ఉత్పత్తి చేయడం గుర్తించాం. బియ్యం, మినుములు, కలప పొట్టు, మిరపకాయలు, ఆమ్లాలు, నూనెలను కలిపి వీటిని తయారుచేస్తున్నట్లు కనుగొన్నాం. సెర్చ్ సమయంలో సింగ్‌తోపాటు అక్కడే ఉన్న సర్ఫరాజ్(32) పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాం. ఈ కల్తీ మసాలా దినుసులు మార్కెటింగ్ చేసేది ఖుర్సీద్ మాలిక్ (42) అనే మరోవ్యక్తి అని తేలింది. దాంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నాం. సర్ఫరాజ్‌కు కరవాల్ నగర్‌లోని కాలీ ఖాతా రోడ్లో మరో ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. ఈ ముఠా 2019 నుంచి కల్తీ మసాలా దినుసుల వ్యాపారం చేస్తున్నారు. ఈ రెండు యూనిట్లలో నిలువ ఉన్న సుమారు 15 టన్నుల కల్తీ మసాలా దినుసులను సీజ్ చేశాం. చట్ట ప్రకారం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం’ అని వివరించారు.సీజ్చేసిన వాటిలో పసుపు, గరం మసాలా, దనియా పొడి కలిపి 7,105 కిలోలు ఉంది. కలపపొడి, బియ్యం, మినుములు, మిరపకాయలు, సిట్రిక్ యాసిడ్.. వంటి పదార్థాలు 7,215 కిలోలు ఉన్నాయి.ఇదీ చదవండి: మసాలాలో పురుగుమందులు.. నివేదికలను తోసిపుచ్చిన ప్రభుత్వ సంస్థభారత బ్రాండ్లైన ఎవరెస్ట్, ఎండీహెచ్ ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్యాన్సర్ కారకం ఉందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఈఎఫ్ఎస్ఏ) గుర్తించిన సంగతి తెలిసిందే. దాంతో హాంకాంగ్, సింగపూర్‌ల్లో వాటి ఉత్పత్తులపై నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే 2020 సెప్టెంబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్యకాలంలో ఇండియాలో తయారైన దాదాపు 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్‌కు దారితేసే కారకాలు ఉన్నట్లు రాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ (ఆర్‌ఏఎస్‌ఎఫ్‌ఎఫ్) డేటా ప్రకారం నిర్ధారణ అయినట్లు ఈఎఫ్ఎస్ఏ అధికారులు ఇటీవల తెలిపారు. -
మసాలాలో పురుగుమందులు.. నివేదికలను తోసిపుచ్చిన ప్రభుత్వ సంస్థ
మసాలాలు, సుంగధద్రవ్యాల్లో 10 రెట్లకంటే అధికంగా పురుగుమందుల అవశేషాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతిస్తోందని తెలిపే నివేదికలను సంస్థ తోసిపుచ్చింది. ఆహార పదార్థాల విషయంలో ఇండియాలో కఠినమైన నియమాలు ఉన్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది.ఇటీవల రెండు ప్రముఖ భారతీయ బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్‌ల ఉత్పత్తుల్లో పురుగు మందు ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు ఆరోపిస్తూ హాంకాంగ్ ఆహార నియంత్రణ సంస్థ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దాంతో భారత్ ఉత్పత్తులను ముందుగా విదేశాలకు ఎగుమతి చేయాలంటే స్థానికంగా ఉన్న ఆహార నియంత్రణ సంస్థలు పూర్తి స్థాయిలో వాటిని పరీక్షించి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అయినప్పటికీ హాంకాంగ్ ఆహార నియంత్రణ సంస్థ చేసిన పరీక్షల్లో ఇథిలీన్ ఆక్సైడ్ ఉందని తేలడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాంతో సామాజిక మాధ్యమాల్లో భారత ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ పనితీరును ప్రశ్నిస్తూ వార్తలు వైరల్‌గా మారాయి. దాంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ దాని పనితీరుపై స్పష్టతనిచ్చింది.ఇదీ చదవండి: వివాదాస్పద భూభాగాలతో రూ.100 నోట్ ముద్రించాలని నిర్ణయంపురుగుమందుల అవశేషాలకు సంబంధించి గరిష్ట అవశేష స్థాయి (ఎంఆర్ఎల్) అత్యంత కఠినమైన ప్రమాణాల్లో ఒకటి. పురుగుమందుల ఎంఆర్‌ఎల్‌లు వివిధ ఆహార వస్తువులకు వాటి ప్రమాద అంచనాల ఆధారంగా వేర్వేరుగా నిర్ణయిస్తారు. అయితే భారత్‌లో మొత్తం 295 పురుగుమందులు నమోదయ్యాయి. వాటిలో 139 వాటిని మాత్రమే మసాలా దినుసుల ఉత్తత్తిలో వాడేందుకు అనుమతులున్నాయి. -
ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాపై నిషేధం.. స్పందించిన కంపెనీ
ఎవరెస్ట్, ఎండీహెచ్ భారతీయ బ్రాండ్లకు చెందిన ప్రీ-ప్యాకేజ్డ్ స్పైస్ మిక్స్ ఉత్పత్తుల్లో పరిమితికి మించి ‘ఎథిలీన్ ఆక్సైడ్’ అనే పురుగుల మందు ఉన్నట్లు హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ (సీఎఫ్ఎస్) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ఎవరెస్ట్ కంపెనీ స్పందించింది. తమ కంపెనీ తయారుచేస్తోన్న ఉత్పత్తులు భద్రమైనవని, నాణ్యతా ప్రమాణాలను పాటించే వాటిని తయారుచేస్తున్నట్లు స్పష్టం చేసింది.సింగపూర్, హాంకాంగ్‌లో ఎవరెస్ట్, ఎండీహెచ్ కొన్నేళ్ల నుంచి వ్యాపారం సాగిస్తున్నాయి. ఏటా ఆయా కంపెనీల ఉత్పత్తులకు చెందిన శాంపిళ్లను అక్కడి ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ అయిన హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ (సీఎఫ్ఎస్) పరీక్షిస్తోంది. అయితే ఇటీవల చేసిన పరీక్షల్లో ఆయా కంపెనీలు తయారుచేసిన ఉత్పత్తుల్లో ‘ఎథిలీన్ ఆక్సైడ్’ అనే పురుగుమందు వాడుతున్నట్లు నిర్ధారణ అయిందని, వాటిని నిషేధించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దాంతో ఎవరెస్ట్ కంపెనీ వివరణ ఇచ్చింది. అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించి తాము ఉత్పత్తులు తయారుచేస్తామని చెప్పింది. తమ ప్రొడక్ట్‌లపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది.సింగపూర్, హాంకాంగ్‌లో ఎవరెస్ట్ ఉత్పత్తులు మొత్తం 60 ఉంటే, కేవలం ఒకదాన్నే పరీక్షించారని కంపెనీ వర్గాలు తెలిపాయి. అది కూడా ప్రామాణిక ప్రక్రియలోనే జరిగింది. కానీ ఎలాంటి నిషేధం మాత్రం విధించలేదని సంస్థ వివరించింది. ఈ అంశంపై కంపెనీ ప్రతినిధి ఒకరు స్పందించారు. ఆహార భద్రత కంపెనీకి అత్యంత ప్రాధాన్యమన్నారు. స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ల్యాబ్ అనుమతి లభించాకే ఎగుమతులు జరుగుతాయని చెప్పారు.హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ (సీఎఫ్ఎస్) సదరు కంపెనీల ఉత్పత్తులను కొనొద్దని ప్రజలకు ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. సీఎఫ్ఎస్ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ బ్రాండ్ల ఉత్పత్తులను సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ రీకాల్ చేసింది. అందులో ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా, ఎమ్‌డీహెచ్‌కు చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా మిక్స్డ్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్ మిక్స్‌డ్‌మసాలా పౌడర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: గగనవీధిలో పెరుగుతున్న ప్రయాణికులు.. ఒకే రోజు భారీ రికార్డు..ఆ రెండు తయారీ కంపెనీలపై చర్యలు తీసుకుందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది. ఇందులో భాగంగా ముందస్తుగా ఎండీహెచ్, ఎవరెస్ట్‌కు చెందిన అన్ని మసాలా దినుసుల తయారీ యూనిట్ల నుండి నమూనాలను సేకరించాలని ప్రభుత్వం ఫుడ్ కమిషనర్లను ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం. అధికారులు ఎండీహెచ్, ఎవరెస్ట్ మాత్రమే కాకుండా అన్ని మసాలా తయారీ కంపెనీల నుంచి నమూనాలను తీసుకుని టెస్ట్ చేయనున్నట్లు తెలిసింది. దాదాపు 20 రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామంటూ సంబంధిత అధికారులు వెల్లడించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. -
‘భారత ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు..’
భారత బ్రాండ్లైన ఎవరెస్ట్, ఎండీహెచ్ ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్యాన్సర్ కారకం ఉందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఈఎఫ్ఎస్ఏ) గుర్తించింది. దాంతో హాంకాంగ్, సింగపూర్‌ల్లో వాటి ఉత్పత్తులపై నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే 2020 సెప్టెంబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్యకాలంలో ఇండియాలో తయారైన దాదాపు 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్‌కు దారితేసే కారకాలు ఉన్నట్లు రాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ (ఆర్‌ఏఎస్‌ఎఫ్‌ఎఫ్) డేటా ప్రకారం నిర్ధారణ అయినట్లు ఈఎఫ్ఎస్ఏ అధికారులు తెలిపారు.ఈ 527 ఉత్పత్తుల్లో ఇప్పటికే 87 సరుకులను ఇతర దేశాలు తిరస్కరించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే వీటిలో 332 ఉత్పత్తుల్లో భారత్‌లోనే తయారైన హానికర రసాయనాలను వినియోగించినల్లు తేలింది. కానీ మిగతావాటిలో వాడిన రసయనాలు ఎక్కడివో తెలియాల్సి ఉంది. ఇథిలీన్ ఆక్సైడ్ వాస్తవానికి వైద్య పరికరాలపై క్రిములను చంపడానికి, వాటిని శుభ్రం చేయడానికి వాడుతారు. పురుగుమందు, స్టెరిలైజింగ్ ఏజెంట్‌గా వినియోగిస్తారు. దీన్ని ఆహార ఉత్పత్తుల్లో వాడడంతో లింఫోమా, లుకేమియా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది.ఇదీ చదవండి: హార్లిక్స్ లేబుల్ తొలగింపు.. కారణం ఇదేనా..రామయ్య అడ్వాన్స్డ్ టెస్టింగ్ ల్యాబ్స్‌లోని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న జుబిన్ జార్జ్ జోసెఫ్ ఇథిలీన్ ఆక్సైడ్ ఉప ఉత్పత్తుల వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలిపారు. ఇథిలీన్ ఆక్సైడ్ ఉప ఉత్పత్తి అయిన ఇథిలీన్ గ్లైకాల్ చాలా ప్రమాదమని చెప్పారు. దీన్ని గతంలో దగ్గు సిరప్‌ల్లో వాడడం వల్ల ఆఫ్రికాలో మరణాలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికే ఇథిలీన్ ఆక్సైడ్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకున్న వారికి గామా కిరణాలతో చికిత్స అందించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థలు అధ్యయనాలు నిర్వహించాలని కోరారు. -
మసాలా ఎక్కువై కూర పాడవ్వకూడదంటే ఇలా చేయండి!
కూరల్లో ఒక్కోసారి మసాలాలు ఎక్కువై టేస్ట్ మారిపోద్ది. పైగా బాగా ఘాటుగా ఉంటుంది. ఎంతలా అంటే గొంతు పట్టేసినట్టు అనిపిస్తుంది. బాబోయ్ తినలేం అని పడేద్దామంటే మనసొప్పదు. అంత ఖరీదైన మసాలా దినుసులు వేసి పడేయ్యడం అంటే బాధ అనిపిస్తుంది ఎవ్వరికైనా. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే కూరపడేయాల్సిన బాధ తప్పుతుంది. పైగా రుచికి రచి ఉంటుంది. అవేంటో చూద్దామా!. కూరల్లో గరం మసాలా పొడులు మోతాదు మించితే కూర రుచి మారిపోతుంది, చేదు వస్తుంది. అలా చేదు వచ్చినప్పుడు కూరల్లో అర కప్పు చిక్కటి పాలు లేదా టేబుల్ స్పూన్ మీగడ కలపాలి. పాలు, పాల ఉత్పత్తులు ఇష్టపడని వాళ్లు జీడిపప్పు పొడి లేదా వేరుశనగపప్పు పొడి కూడా కలుపుకోవచ్చు. ఇలా చేస్తే చేదు తగ్గడంతోపాటు కూర రుచి ఇనుమడిస్తుంది కూడా. మార్కెట్లో కొన్న మసాలా పొడుల్లో ప్యాకెట్ సీలు విప్పినప్పుడు ఉన్నంత సువాసన ఆ తర్వాత ఉండదు. కాబట్టి చిన్న చిన్న ప్యాకెట్లు కొనుక్కుని తెరిచిన వెంటనే మొత్తం వాడేయడం ఒక పద్ధతి. పెద్ద ప్యాకెట్ కొన్నప్పుడు కొద్దిగా వాడిన తర్వాత ప్యాకెట్లోకి గాలి దూరకుండా క్లిప్ పెట్టాలి. గరం మసాలా పొడులను ఇంట్లోనే ఎక్కువ మోతాదులో చేసి నిల్వ ఉంచుకోవాలంటే... పొడిని తేమలేని సీసాలో పోసి గాలి చొరకుండా మూతపెట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేసిన పొడి ఏడాదంతా నిల్వ ఉంచినా తాజాదనం తగ్గదు. (చదవండి: వీధుల్లో కూరగాయలు అమ్మినట్లు మ్యాగీని అమ్మేస్తున్నాడు!) -
గరం మసాలా!
సాక్షి, హైదరాబాద్: సగటుజీవి నెలవారీ ఆదాయం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండగా.. నిత్యావసరాల ధరలు మాత్రం నింగినంటుతున్నాయి. వంటింట్లోకెళదామంటే కాసింత ధైర్యం కూడగట్టుకోవాల్సిన పరిస్థితి. కుటుంబాన్ని నెట్టుకురావాలంటే బడ్జెట్ ఏ మూలకూ సరిపోవడంలేదు. ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండడం లేదు. కిరాణా షాపులో వారం క్రితం కొన్న సామగ్రి రేటు మరో వారానికి మారిపోతోంది. ధరలు పెరగడమే తప్ప తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. పెరిగిన ధరలతో ఒక్కో కుటుంబంపై నెలకు రూ.1000 నుంచి రూ.1500 వరకు అదనపు భారం పడుతోంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఘాటెక్కి.. హీటెక్కి.. కొన్ని నెలలుగా గరం మసాలా ఘాటెక్కింది. కేరళలో వరదల ప్రభావంతో ఇలాచీతో పాటు విదేశాల నుంచి ఇతర మసాలాల దినుసుల దిగుమతులు తగ్గడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. గత మూడు నెలల్లో దాదాపు అన్ని మసాలాల ధరలు విపరితంగా పెరిగాయని హోల్‌సెల్ వ్యాపారులు అంటున్నారు. దీంతో యాలకుల ధర కేజీ రూ. 2,600కు చేరింది. మిరియాలు రూ. 800, లవంగాలు రూ.900, జీలకర్ర రూ.220కు చేరాయి. వామ్మో.. వెల్లుల్లి.. ♦ నగరంలో వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. నగర మార్కెట్లకు సరఫరా తగ్గడంతో ప్రస్తుతం కిలో వెల్లుల్లి రూ.480కి చేరుకుంది. హోల్‌సేల్ మార్కెట్‌కు వెల్లుల్లిని రవాణా చేసే ట్రక్కులు, టెంపోల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది, సుమారు 15 వాహనాలు మాత్రమే వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా మార్కెట్‌కు 24 నుంచి 30 వాహనాలు వస్తాయని హోల్‌సేల్ వ్యాపారులు తెలిపారు. పర్యవసానంగా దాదాపు 40 శాతం వెల్లుల్లి సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు ప్రాథమిక కారణమని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ♦ గతేడాది మే నెల తొలినాళ్లలో కిలో వెల్లుల్లి ధర రూ.30 నుంచి రూ.60 వరకు పలికింది. పోయిన నెల వరకు కూడా కేజీ రూ. 160 ఉందని వర్షాకాలంలో దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగినట్లు సమాచారం. అక్టోబర్, నవంబర్లలో కురిసిన అ కాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. ము ఖ్యంగా వెల్లుల్లి అధికంగా పండించే రాజస్థాన్‌లో వెల్లుల్లి ధర పెరిగింది. ఈ ప్రభావం దేశ వ్యాప్తంగా పడిందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో వెల్లుల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉంది. రైస్.. రైజ్.. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్లో బియ్యం ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. నాణ్యమైన సన్న బియ్యం కిలోకు రూ. 65 నుంచి రూ. 70కి పైగానే చెల్లించాల్సి వస్తోంది. డిమాండ్ కంటే ఎక్కువ బియ్యం మార్కెట్‌కు వచ్చినా ధరలు మాత్రం తగ్గడం లేదు. కూర‘గాయాలే’.. నగరంలో అన్ని కూరగాయలు (టమాటాలు మినహా) కిలోకు రూ.80– 120 వరకు రిటైల్ మార్కెట్లో ధరలు పలుకుతున్నాయి. ఆశించిన స్థాయిలో దిగుబడులు లేకపోవడంతో రాజధాని అవసరాలకు సరిపడా కాయగూరలు, ఆకు కూరలు రావడంలేదు. దీంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రధానంగా బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, ఎల్బీ నగర్, మాదన్నపేట, సికింద్రాబాద్ మోండా మార్కెట్లకు కూరగాయల సరఫరా 60 శాతానికి పడిపోయింది. కొన్ని రకాల కూరగాయలు మండీల జాబితా నుంచి కనుమరుగయ్యాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
మసాలాతో షుగర్ అదుపు, ఎలాగో తెలుసా?
షుగర్, బీపీ వంటి జీవనశైలికి సంబంధించిన రుగ్మతలు వస్తే జీవితాంతం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అసవరం. ఆహారంలో ఉప్పు, చక్కెరలు తగ్గించి తీసుకోవడంతోబాటు ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వీటితోపాటు మన వంటింట్లో దొరికే కొన్ని రకాల మసాలా దినుసులను తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను అదుపులో ఉంచవచ్చు. అవేమిటో తెలుసుకుందాం. అధికంగా దాహం వేయడం, ఆకలి, తరచు మూత్రవిసర్జన చేయవలసి రావడం, బరువు తగ్గడం, చూపు మసకబారడం, చేతులు, కాళ్ళు తిమ్మిరిగా ఉండడం, గాయాలైనప్పుడు త్వరగా మానకపోవడం వంటి కొన్ని లక్షణాలను బట్టి షుగర్‌ను గుర్తించవచ్చు. ఇది అదుపులో ఉండకపోతే కాలేయం, మూత్రపిండాలు, గుండె, మెదడు, కంటికి సంబంధించిన సమస్యలొస్తాయి. అయితే, బ్లడ్ షుగర్‌ని నియంత్రణలో ఉంచే కొన్ని మసాలా దినుసులున్నాయి. వాటిని సక్రమంగా వాడటం వల్ల ఎటువంటి ఇతర దుష్ఫలితాలూ లేకుండా షుగర్‌ను అదుపులో ఉంచవచ్చు. దాల్చిన చెక్క ఆహార పదార్థాలకు సువాసనను, రుచిని ఇచ్చే దాల్చిన చెక్క జీవక్రియల వేగాన్ని పెంచడానికి దోహద పడుతుంది. కొన్ని రకాల వ్యాధులకు ఆయుర్వేదంలో దీనిని విరివిగా వాడతారు. దాల్చిన చెక్క ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. దీనిని కషాయంలా చేసుకుని తాగడం మంచిది. మిరియాలు మిరియాలు, వాటి ఆకుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తం లో ఇన్సులిన్ సీరమ్‌ని పెంచుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను అదుపు చేయడంలో సహకరిస్తాయి. వీటిని ఏదో ఒక విధంగా ఆహారంలో చేర్చుకోవడం మంచిది. కుదరని పక్షంలో మిరియాల పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగొచ్చు. మెంతులు మధుమేహాన్ని అదుపు చేసి, బరువు తగ్గించడంలో మెంతులు బాగా పనిచేస్తాయి. వీటిని తీసుకోవడం జుట్టుకి కూడా మంచిది. ఉదయాన్నే పరగడపున మెంతులు నానబెట్టిన నీటిని తాగితే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. ఇందులోని పీచుపదార్థం, కర్కుమిన్లు రక్తంలో చక్కెరస్థాయులను తగ్గిస్తాయి. యాలకులు పరమాన్నానికి, ఇతర రకాల స్వీట్లకు యాలకుల పొడిని జత చేస్తే వచ్చే రుచే వేరు. పచ్చి యాలకులని మనం బిర్యానీ, టీలో కలిపి తాగొచ్చు. ఇందులో ఎక్కువగా ఔషధ గుణాలు ఉన్నాయి. యాలకులని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు తగ్గుతాయి. ఇది లివర్ పని తీరును మెరుగు పరుస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. జీలకర్ర డయాబెటిస్ లక్షణాలను, ప్రభావాలను జీలకర్ర తగ్గిస్తుంది. యాంటీడయాబెటిక్ ఔషధాల్లో కూడా దీనిని వినియోగిస్తారు. ఇన్సులిన్‌కు మీ శరీరం స్పందించే తీరును ప్రభావితం చేస్తే యూరియా స్థాయిని కూడా ఈ జీలకర్ర తగ్గిస్తుందని పరిశోధకులు తేల్చారు. అంతేకాకుండా రక్తంలో బ్లడ్ షుగర్ స్థాయి నార్మల్ రేంజ్లో ఉండేలా చేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అందువల్ల ఆహారం లో జీలకర్రను విరివిగా ఉపయోగించాలి. రోజూ ఒక స్పూను జీలకర్రను గ్లాసు నీటిలో నానబెట్టి ఆ నీటిని వడగట్టి తాగడం మధుమేహులకు మంచి మందులా పని చేస్తుంది. లవంగాలు షుగర్ వ్యాధిగ్రస్తులు లవంగాలను వాడటం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఆహారంలో లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు లవంగం నూనెను పై పూతగా రాయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. మధుమేహం ఉన్న వారు రోజు విడిచి రోజు లవంగాలతో చేసిన టీ తాగడం సత్ఫలితాలనిస్తుంది. పైన చెప్పుకున్న మసాలా దినుసులను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలూ లేకండా డయాబెటిస్ అదుపులో ఉంటుంది. -
మసాలా దినుసులు ఘాటు పోకూడదంటే..ఇలా స్టోర్ చేయండి!
మన వంటింట్లో పప్పు తాలింపులకు ఉపయోగించే ఆవాలు, జీలకర్ర దగ్గర నుంచి నాన్‌వెజ్ లేదా బిర్యానీలు చేసేటప్పుడు ఉపయోగించే మసాలలన్నింటిని నిల్వ చేయడం కాస్త ఇబ్బంది. అందులోనూ రకరకాల సీజన్లు ఉండే మన ప్రదేశాల్లో మరింత కష్టం. అలాంటప్పుడూ వాటి రుచి పాడవకుండా ఎక్కువ కాలం వచ్చేలా స్టోర్ చేయాలంటే ఈ అద్భుతమైన టెక్నిక్స్ ఫాలోకండి. రుచి పోదు, తాజగా వాడుకోవచ్చు కూడా. మసాలా దినుసులు సరిగా నిల్వ చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులు.. గాలి చొరబడిన కంటైనర్లు మీ సుగంధ ద్రవ్యాలను నిల్వ చేయడానికి గాలి చొరబడని కంటైనర్‌లో జాగ్రత్తగా నిల్వ చేయాలి. అలాగే సుగంధ ద్రవ్యాల్లో తేమ లేకుండా బాగా ఎండలో ఆరనిచ్చి జాగ్రత్తగా భద్రపర్చాలి. గాలి చొరబడి మూతలు ఉన్న జాడీ లేదా కంటైనర్లే మేలు. ఇలాంటివి అయితే సుగంధ ద్రవ్యాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. కూల్ స్టోరేజ్ గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయడం ఎంత ముఖ్యమో అలాగే చల్లటి ప్రదేశంలో ఉంచడం అంతే ప్రధానం. సుగంధ ద్రవ్యాలు చాలాకాలం పాటు తాజాగా రుచిగా ఉంచాలనుకుంటే వేడిపొయ్యిలు, ఓవెన్లు, సూర్యరశ్మీకి దూరంగా ఉంచడం వంటివి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో తేమ లేకుండా.. వర్షాకాలం లాంటి సీజన్లో వాటిని గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచినప్పటికీ అట్టలు కట్టనట్లు అయిపోతాయి. వాటి రుచిలో కూడా మార్పు వస్తుంది. అలాంటప్పుడూ తేమను పీల్చుకునే ప్యాకెట్లలో నిల్వ చేసేంఉదకు ప్రయత్నించాలి. ఈ మసాలా దినులు గాలి లేదా తేమను ఆకర్షించే గుణం ఉంది కాబట్టి నిల్వ చేసుకునేటప్పుడు కాస్త జాగుకతతో ఉండాలి. లేబుల్ ఈ మసాల దినులు స్టోర్ చేసుకునే కంటైనర్లపై అవి ఎప్పుడు కొన్నారనే దాన్ని లేబుల్ చేయండి. దీని వల్ల అవి ఎంతకాలం వరకు తాజగా ఉంటాయో మీకు తెలిసేందుకు ఉపయోగపడుతుంది. ఒకవేళ వాడే ముందు బాగున్నాయా లేదా అన్న సందేహం వచ్చినప్పుడే ముందుగా దాన్ని లేబుల్ చేసి రాసి ఉంటారు కాబట్టి అది చూస్తే సరిపోతుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదు. పరిమిత స్థలం లేదా తేమ వాతావరణం వంటగదిలో పరిమిత స్థలమే ఉండి నిల్వచేసుకోవడం ఇబ్బందిగా మారినా లేదా ఎప్పటికీ తేమ వాతావరణమే అయితే మసాల దినుసులు నిల్వ చేయడం అంత ఈజీ కాదు. అలాంటప్పుడు కొద్ది మొత్తంలో వాటిని స్టోర్ చేసి మిగతా వాటిని గ్రైండ్ చేసి నిల్వ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పొడి చేసుకుంటే కూరల్లో కూడా సులభంగా వాడుకోవచ్చు. ఇది మిస్ చేశాం అనే సమస్య కూడా ఉండదు. తేమ వాతావరణంలో ఉండే వారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. (చదవండి: అత్యంత ఖరీదైన కాఫీ! సర్వ్ చేసే విధానం చాలా వెరైటీగా ఉంటుంది!) -
జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు - నిపుణుల చర్చలు
హైదరాబాద్: 2023 ఆల్ ఇండియా స్పైసెస్ ఎక్స్‌పోర్టర్స్ ఫోరం (AISEF) వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ (WSO), 2వ ఎడిషన్ నేషనల్ స్పైసెస్ కాన్ఫరెన్స్ 2023 మొదటి రోజును విజయవంతంగా ముగించింది. ఈ సదస్సులో నిపుణులు, పరిశ్రమ నాయకులు సుగంధ ద్రవ్యాల భద్రత, స్థిరత్వానికి సంబంధించిన కీలకమైన సమస్యలపై చర్చించారు. ఈ సదస్సులో పాల్గొనేవారికి ఆత్మీయ స్వాగతం పలికిన వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ 'రామ్‌కుమార్ మీనన్' మాట్లాడుతూ.. సుగంధ ద్రవ్య పరిశ్రమ భద్రత దాని స్థిరత్వాన్ని నిర్ధారించడంలో సామూహిక ప్రయత్నాల ప్రాముఖ్యతను గురించి వ్యాఖ్యానించారు. సుగంధ ద్రవ్యాల భద్రత కేవలం బాధ్యత మాత్రమే కాదు, స్థిరమైన భవిష్యత్తును నిర్మించటానికి చూపాల్సిన నిబద్ధత అని వెల్లడించారు. ఈ పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ మంచి స్థిరమైన ఆదాయానికి అవకాశాలు వున్నాయని చెప్పారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ అఫ్ అరేకనట్ అండ్ స్పైస్ డెవలప్మెంట్ (DASD) డైరెక్టర్ డాక్టర్ హోమి చెరియన్, మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధికి సుగంధ ద్రవ్యాలు ఉత్తమమైన మార్గం, స్థిరమైన వృద్ధి, ఆహార భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తోందన్నారు. డాక్టర్ ఎబి రీమాశ్రీ, డైరెక్టర్ - రీసెర్చ్, స్పైసెస్ బోర్డ్ మాట్లాడుతూ.. మసాలా సాగును ప్రోత్సహించడానికి అవసరమైన పరిజ్ఞానం గురించి వివరిస్తూ.. ఆహార భద్రత పరంగా సుగంధ ద్రవ్యాల పరిశ్రమలో రాజీ పడటం జరగదు, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సురక్షితమైన, అధిక నాణ్యత గల సుగంధ ద్రవ్యాలను అందించడానికి మనం వ్యూహాలు ఖచ్చితంగా ప్రతిబింబించాలని వెల్లడించారు. NSC 2023 వ్యాపార కమిటీ చైర్మన్ చెరియన్ జేవియర్ మాట్లాడుతూ.. 'ఫుడ్ సేఫ్ స్పైసస్ - ది వే ఫార్వార్డ్ టూ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇన్కమ్' సదస్సు కేవలం ఒక సదస్సు మాత్రమే కాదు, మన భవిష్యత్తును బాధ్యతాయుతంగా, స్థిరంగా పరిశ్రమ తీర్చిదిద్దటానికి ఇది పిలుపు అని అన్నారు. సెషన్ రెండవ రోజు మెరుగైన ఇన్పుట్ నిర్వహణ, ఉత్పాదకత, వినూత్న ప్రక్రియలు, మార్కెట్ పోకడలు, సుగంధ ద్రవ్యాల వినూత్న ప్యాకేజింగ్ సవాళ్లు, అవకాశాలు వంటి అంశాలపై మరింత పరిజ్ఞానం ప్రదర్శిస్తుంది. ఈ సదస్సులో పాల్గొనేవారు ఆహార సురక్షిత పద్ధతులు, సుగంధ ద్రవ్యాలు రైతులకు స్థిరమైన, నిలకడతో కూడిన ఆదాయానికి దారితీసే భవిష్యత్తు కోసం ఆకర్షణీయమైన చర్చలు, నిపుణుల సూచనలు, క్రియాత్మక వ్యూహాలను ఆశించవచ్చు. నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ 2023 పరిశ్రమ నాయకులు, నిపుణులు, వాటాదారులకు చర్చలలో పాల్గొనడానికి, మొత్తం సుగంధ ద్రవ్యాల రంగాన్ని పెంచే లక్ష్యంతో వ్యూహాలను అమలు చేయడానికి ఒక వేదికను అందిస్తుంది. ఈ కార్యక్రమానికి వివిధ ఎఫ్పిఓలు, ఎన్జిఓలు హాజరయ్యారు. -
Rukhsar Saeed: టేస్ట్ ఆఫ్ కశ్మీర్
కశ్మీర్ పేరు చెప్తే అందమైన ప్రదేశాలే గుర్తొస్తాయి. కాని ఆ లోయలో దాగిన రుచులు అన్వేషిస్తే తప్ప తెలియదు. శాకాహారమైనా మాంసాహారమైనా స్వచ్ఛమైన దినుసులతో గుమ్మెత్తిస్తారు. ‘మేము ఎలా వండుతామో నా వంట చూసి తెలుసుకోండి’ అని కశ్మీర్ వంట చేసి చూపుతోంది రుక్సార్ సయీద్. కశ్మీర్ మహిళలు పెద్దగా పాల్గొనని ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ తాజా సిరీస్‌కు రుక్సార్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. పోటీని తట్టుకుని టాప్ 12లో నిలిచిన ఆమెను చూసి కశ్మీర్లో ఆడవాళ్లు గర్విస్తున్నారు. సోనీ లివ్‌లో ప్రసారమవుతున్న తాజా సీజన్ ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ కోసం రుక్సార్ సయీద్ (33) ‘షబ్ దేక్’ అనే కశ్మీరీ వంట చేసింది. ‘ఇది మా అమ్మమ్మ నుంచి మా అమ్మకు, మా అమ్మ నుంచి నాకు అందిన వంట. ముదురు గుమ్మడికాయ, నాటుకోడి, ఆల్‌బకారా ఎండుగుజ్జు వేసి చేస్తాం. చాలా బాగుంటుంది’ అంది. జడ్జీలుగా ఉన్న ప్రముఖ షెఫ్‌లు వికాస్ ఖన్నా, రణ్వీర్ బ్రార్, పూజా ధింగ్రా... కొద్దిగా రుచి చూసి ‘అద్భుతం’ అన్నారు. ఆమె ఇంకో ఎపిసోడ్లో ‘షికారా రైడ్’ అనే అల్పాహారం చేసింది. మటన్ కోఫ్తాను, పుదీనా మసాలాతో రంగరించి చేసింది. టేస్ట్ అదిరిందని వేరే చె΄్పాలా? ‘కశ్మీర్ లోయంతా రకరకాల మసాలా దినుసులు, మేం మాత్రమే తినే ఆకుకూరలు, కాయగూరలు ఉన్నాయి. వాటిని వండే పద్ధతి అందరికీ తెలియదు. మాస్టర్ షెఫ్ ద్వారా దేశమంతటికీ ఆ రుచులను తెలియజేయాలనుకుంటున్నాను’ అంటుంది రుక్సార్ సయీద్. ఆమె సంకల్పం గట్టిదిలాగుంది. తాజా సీజన్లో మహా మహా వంటగాళ్లు, వంటగత్తెలు పోటీ పడితే తుది జాబితాలో 22 మంది ఉంటే, వారిలో చాలామందిని అధిగ‘మించి’ టాప్ 12కు చేరింది రుక్సార్. దాంతో కశ్మీర్లో ఇప్పుడు ఈ షోను అక్కడి స్త్రీలు చూస్తున్నారు. రుక్సార్‌ను తమ ప్రతినిధిగా, తమ సామర్థ్యాలకు కొలమానంగా చూస్తున్నారు. ‘ఆ సంతోషం చాలు నాకు. నన్ను స్ఫూర్తిగా తీసుకుని స్త్రీలు ముందుకు రావాలి’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో డాక్టరేట్ రుక్సార్ సయీద్‌ది పుల్వామా జిల్లాలోని పామ్పోర్ అనే ్రపాంతం. నిత్యం మంచు కురిసే ఈ ్రపాంతంలో కవులు ఎక్కువ. ‘నేను కవిత్వం రాయను. కాని ప్లేట్లో పదార్థమే ఒక కవిత్వమంత అందంగా అమర్చగలను’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో పీహెచ్డీ చేసిన రుక్సార్ అందరిలా ఏ లెక్చరర్ పోస్ట్‌కో వెళ్లలేదు. ‘నాకు ఆహారం మీద సంపూర్ణ అవగాహన ఉంది. ముఖ్యంగా ఫ్రోజెన్ ఫుడ్‌ను సరిగా అమ్మగలిగితే తక్షణం వేడి చేసుకుని తినాలనుకునేవారికి మేలు జరుగుతుంది. కాని ఆహారంలో కల్తీ ఎక్కువ. ఈ కల్తీ విషంతో సమానం. అందుకే నేను ఏ కల్తీ లేని ఫ్రోజెన్ ఫుడ్‌ను అమ్మాలని ఖాలిస్ ఫుడ్స్ పేరుతో చిన్న సంస్థను మొదలుపెట్టాను. చికెన్ ఉత్పత్తులను కశ్మీర్లో అమ్ముతున్నాను. కశ్మీర్లో ఉద్యోగం చేయడం కన్నా ఉద్యోగాలు కల్పించడమే ఎక్కువ అవసరం అని నేను భావిస్తాను. నిరుద్యోగం పోవాలంటే ఇలాగే చేయాలి. నా సంస్థ బాగా నడుస్తోంది. కాని దేశవ్యాప్తంగా పంపాలంటే కొన్ని చిక్కులు ఉన్నాయి. ఈ లోపు నేను, నా బ్రాండ్ తెలియడానికి మాస్టర్ షెఫ్ ్రపోగ్రామ్‌కు వచ్చాను’ అని తెలిపింది రుక్సార్. అంతే తేడా ‘వంట అందరు ఆడవాళ్లూ చేస్తారు. కాని ఫుడ్ షోలలో ఆ వంటను శాస్త్రీయంగా చేయాలి. అంతే తేడా. కశ్మీర్లో వంట తెలిసిన యువతీ యువకులు బాగానే ఉన్నారు. నేను ఈ షో ద్వారా గడించిన అనుభవంతో వారికి సాయం చేయాలనుకుంటున్నాను. ఆహారం తయారు చేయడంలో మెళకువలు తెలిపి వారు ఫుడ్ జాయింట్లు ఏర్పాటు చేసుకుని తమ కాళ్ల మీద తాము నిలబడేలా చూడాలనుకుంటున్నాను. ఇందుకు కావాల్సిన సామాగ్రి నేనే సమకూరుస్తాను’ అంది. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న రుక్సార్ తన భర్త సాదిక్ అహ్మద్ సహకారం వల్లే ఇలా షోకు వచ్చినట్టుగా తెలిపింది. ‘ఆడవాళ్లూ.. ప్రయత్నించండి. ఓడిపోవద్దు’ అనేది రుక్సార్ సందేశం. -
చిరుతిళ్లను ఆరోగ్యంగా తినొచ్చు
రోజూ సాయంకాలం అయ్యిందంటే చాలు పిల్లలు, పెద్దలు ఏదో ఒక స్నాక్ ఐటమ్ తినాలనుకుంటారు. చిప్స్లాంటి జంక్ ఫుడ్‌ని బయట కొని తింటుంటారు. వాటిలో పోషకాల లేమి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితిని గమనించిన డాక్టర్ సౌమ్య మందరపు పోషకాలు పుష్కలంగా ఉండే చిరుతిళ్లను కూరగాయలు, చిరుధాన్యాలతో తయారుచేస్తున్నారు. ఉదయపు అల్పాహారంగానూ బ్రేక్‌ఫాస్ట్ బార్‌ను అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని గాజులరామారంలో ఉంటున్న ఈ పోషకాహార నిపుణురాలు చేస్తున్న కృషికి సర్వత్రా అభినందనలు అందుకుంటున్నారు. ‘వరి,గోధుమలకు బదులు చిరుధాన్యాలను రోజుకు ఒకసారి భోజనంగా తీసుకుంటూ.. చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్లు తింటే జీవనశైలి జబ్బులతో బాధపడేవారు నెలరోజుల్లోనే తమ ఆరోగ్యంలో మంచి మార్పును గమనించవచ్చు’ అంటున్నారు డాక్టర్ మందరపు సౌమ్య. ఆహార శుద్ధి రంగంలో ఉన్నత విద్యను అభ్యసించి, ఆహార సాంకేతిక నిపుణురాలిగా 16 ఏళ్ల అనుభవం కలిగిన సౌమ్య 120 రకాల ఆహారోత్పత్తుల ఫార్ములాలను రూపొందించారు. మూడేళ్ల క్రితం ‘మిల్లెనోవా ఫుడ్స్’ పేరిట స్టార్టప్ సంస్థను నెలకొల్పారు. ఐఐఎంఆర్‌లోని న్యూట్రిహబ్ ద్వారా ఇంక్యుబేషన్ సేవలు పొందారు. తన కృషిని సౌమ్య ఈ విధంగా వివరిస్తూ... ప్రకృతి దిశగా ఆలోచనలు ‘‘పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో. ఇంటర్మీడియెట్ తర్వాత ఇష్టంతో న్యూట్రీషియన్ విభాగంలోకి వచ్చాను. డిగ్రీ పూర్తవగానే మా జిల్లాలోనే కృషి విజ్ఞాన కేంద్రంలో వర్క్ చేశాను. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చాను. అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విభాగంలో చేరాను. గ్రామీణ ప్రాంతాల్లోనూ శిక్షణ మన దేశంలోని పల్లె ప్రాంతాల్లో పిల్లలు, గర్భవతులు, మహిళల్లో రక్తహీనత సమస్య ఉందనే విషయం తెలిసిందే. ఈ విషయంగా పల్లె ప్రాంతాల్లో క్యాంప్స్ నిర్వహించాం. అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. పిల్లలు, పెద్దలు ఎంత పోషకాహారం తీసుకోవాలనేది వయసులవారీగా ఉంటుంది. దాని ప్రకారం మనమేం ఆహారం తింటున్నాం, ఎలా ఉంటున్నామనేది పరిశోధనలో భాగంగానే గడిచింది. దీంతో ఎంతోమంది వారు తీసుకుంటున్న ఆహారం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో పల్లె నుంచి పట్టణ స్థాయి వరకు తెలుసుకున్నాను. చిరుధాన్యాలతో ప్రయోగాలు రోజువారీగా తినే ప్రధాన ఆహార పదార్థాలతోపాటు పౌష్టిక విలువలు లోపించిన చిరుతిళ్లు కూడా మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జీవన విధానం సరిగా లేకుండా వచ్చే మధుమేహం, రక్తపోటు, ఊబకాయం.. వంటి వాటి వల్ల అనారోగ్యం బారినపడుతుంటారు. వీటిలో ముఖ్యంగా ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, తృణధాన్యాలు.. ఇలా ఆరోగ్యాన్ని పెంచేవాటిని ఎలా సరైన విధంగా తీసుకోవాలో పరిశోధనలు చేశాను. దాదాపు పదహారేళ్లు్ల ఈ విభాగంలో చేసిన వర్క్ నాకు సరైన దిశను చూపింది. మూడేళ్లు చిరుధాన్యాలపైన చేసిన రీసెర్చ్ సంస్థ నెలకొల్పేలా చేసింది. ప్రొటీన్ బార్ ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ పోషకాహారంతో కూడుకున్నదై ఉంటే ఆ రోజంతా చురుగ్గా పనిచేయగలం. ఆ దిశలోనే.. చిరుధాన్యాలు, పండ్లు, పప్పుధాన్యాలు, కూరగాయలను కలిపి శాస్త్రీయ సమతులాహార ఫార్ములేషన్స్‌తో ప్రొటీన్ బార్, బ్రేక్‌ఫాస్ట్ బార్, ఇమ్యూనిటీ బూస్టర్ బార్, స్పోర్ట్స్ ఎనర్జీ బార్లను రూపొందించాను. రైతుల నుంచి నేరుగా చిరుధాన్యాలను కొనుగోలు చేసి.. పోషకాలు సులువుగా జీర్ణమయ్యేందుకు ఎక్స్‌ట్రూజన్ టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నాం. పోషకాల చిరుతిళ్ల తయారీ, సొంతంగా మార్కెటింగ్ చేసుకోవాలనుకునే వారికి ఉచితంగా శిక్షణా తరగతులను కూడా ఇస్తున్నామ’ని తెలియజేశారు ఈ పోషకాహార నిపుణురాలు. - నిర్మలారెడ్డి -
Diabetes: బ్లడ్ షుగర్, అధికబరువుకు చెక్ చెప్పండిలా!
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య మధుమేహం మరొకటి అధిక బరువు. ఇటీవలి కాలంలో ఇవి చాలా సాధారణ సమస్యలుగా మారిపోయాయి. మారిన జీవన శైలి, ఆహార నియమాలు, జంక్ఫుడ్స్, ఇతర అనారోగ్యకరమైన జీవన పద్ధతులు ఈ ముప్పును మరింత పెంచుతున్నాయి. అయితే మన కిచెన్‌లోని అతి సాధారణ మసాలా దినుసులు, మూలికలతో షుగర్‌ను, కొలెస్ట్రాల్‌ను అదుపులోకి తేవచ్చు. ఆ వివరాలేంటి ఒకసారి చూద్దాం. మధుమేహం దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటిగా మారిపోయింది. దీని వలన తీవ్రమైన సమస్యలు రావడంతో పాటు, ఒక్కోసారి శారీరక వైకల్యంతో బాడీపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా మనిషి సగటు ఆయుర్దాయం కూడా తగ్గిపోతుంది. అయితే షుగర్ వ్యాధి బారిన పడినంత మాత్రాన బెంబేలెత్తిపోవాల్సిన పనిలేదు. తమ రోజు వారీ ఆహారం, తేలికపాటి వ్యాయామాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడు తూనే, శరీరంలో షుగర్ లెవల్స్‌ను క్రమబద్ధీకరించుకునేందుకు చిట్కాలు పాటిస్తుండాలి. ముఖ్యంగా వంట ఇంట్లో మనకు అందుబాటులో ఉండే సుగంధ ద్రవ్యాలు, ఇతర ఆయుర్వేద విలువలు కలిగిన మూలికలతో షుగర్ వ్యాధికి చెక్ చెప్పవచ్చు. అలాంటి వాటిలో దాల్చిన చెక్క, పసుపు, మెంతులు, జీలకర్ర, సోంపు ప్రధానంగా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్‌కి రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థాయిలో ఉండటం చాలా ముఖ్యం. ఇందుకు నిత్యం మనం వాడే వస్తువులు దోహదం చేస్తాయి. ముఖ్యంగా పసుపును సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. వ్యాధులనుంచి తప్పించే సహజసిద్ధమైన యాంటిబయోటిక్‌గా పనిచేసే పసుపును ప్రతీ ఒక్కరు తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. మన బాడీలోకి ప్రవేశించే ఏ రకమైన వైరస్ లేదా బాక్టీరియాతోనైనా మనకు తెలియకుండానే ఇది ఫైట్ చేసుంది. ఇక మధుమేహం విషయంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే కేవలం మాసాలా దినుసుగా మాత్రమే కాదు దాల్చిన చెక్కలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దాల్చిన చెక్క టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. దీన్ని మన రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడంతోపాటు, షుగర్ బాధితులు దాల్చిన చెక్క టీని తీసుకోవచ్చు. అలాగే దాల్చిన చెక్క నీరు లేదా టీ స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతి గింజలు చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగం.ఒక టీస్పూన్ మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు వడకట్టి ఈ నీటిని తాగాలి. లేదా ఆ మెంతులతో పాటు తీసుకున్నా మంచిదే. మనం రోజు పోపు దినుసులా వాడే జీలకర్ర కూడా సుగర్ లెవల్స్‌ను, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తీసుకోవచ్చు. సోంపులో ఉండే అనిథాల్ శరీరంలోని అనేక ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లను నివారిస్తుంది. సోపు గింజల్లో ఆరోగ్యకరమైన ఎంజైమ్‌లు మధుమేహ బాధితులకు మేలు చేస్తాయి. -
షుగర్, అధికబరువుకు చెక్ చెప్పండిలా!
-
అక్కడ మట్టిని కూరల్లో మసాలాగా వాడతారు!
పర్యాటకులకు ప్రపంచవ్యాప్తంగా అహ్లాదాన్ని అందించే ఐలాండ్స్ చాలానే ఉన్నాయి. కానీ తినగలిగే ఐలాండ్ గురించి మీకు తెలుసా? అవును అక్కడ మట్టిని బ్రెడ్‌లో సాస్‌లా, కూరల్లో మసాలాగా వాడతారు. ఆశ్చర్యంగా ఉంది కదూ..? ఇరాన్ తీరానికి 8 కి.మీ. దూరంలో, పర్షియన్ గల్ఫ్ సముద్రానికి మధ్యలో కన్నీటి చుక్క ఆకారంలో ఉంటుందది.పేరు హోర్ముజ్ ద్వీపం. అగ్నిపర్వత శిలలతో, మట్టి, ఇనుముతో నిండిన ఈ ఐలాండ్ చూడటానికి.. పసుపు, ఎరుపు, నీలం వంటి పలు రంగుల్లో ఇంద్రధనస్సులా మెరుస్తుంది. అందుకే దీన్ని రెయిన్బో ఐలాండ్‌గా పిలుస్తారు స్థానికులు. మొత్తం 42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపంపై 70కి పైగా ఖనిజాలను గుర్తించారు పరిశోధకులు. హోర్ముజ్ ఐలాండ్.. ఎన్నో కోట్ల సంవత్సరాల కిందట పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉప్పు గుట్టల్లా పేరుకుపోయి.. అగ్నిపర్వత అవక్షేపాలతో కలసి రంగు రంగుల దిబ్బలుగా మారిందని వారి పరిశోధనల సారాంశం. ఈ రంగురంగుల గుట్టలు, ఎర్రటి బీచులు, అందమైన ఉప్పు గుహలకు అక్కడి భౌగోళిక పరిస్థితులే కారణమని తేల్చారు వాళ్లు. కాలక్రమేణా భూమిలోకి కిలోమీటర్ల మేర పాతుకుపోయిన ఈ గుట్టల్లోంచి తేలికైన ఉప్పు పొరలు పెల్లుబకడంతో గోపురాల్లా కనిపిస్తూ పర్యాటకుల్ని మరింతగా ఆకర్షిస్తున్నాయట. ఇక్కడ లభించే ‘గెలాక్’ అనే ఎర్రటి మట్టిని.. స్థానిక వంటకాల్లో వాడుతుంటారు. అగ్నిపర్వత శిలల నుంచి పుట్టుకొచ్చిన.. హేమటైట్ అనే ఐరన్ ఆక్సైడ్ వల్ల ఇది ఏర్పడిందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మట్టి నుంచే ‘సూరఖ్’ అనే సాస్ని కూడా తయారు చేస్తున్నారు. అది బ్రెడ్‌తో కలిపి తింటే భలే రుచిగా ఉంటుందట. అయితే ఈ మట్టిని వంటకాల్లోనే కాదు.. కాస్మెటిక్స్, డిజైనింగ్స్‌లో కూడా వాడుతున్నారు. (క్లిక్: 13.5 సెకన్లలో ఫుడ్ సర్వ్ చేసే హోటల్.. ఎక్కడో తెలుసా?) ఒక్కోవైపు ఒక్కో అందం ఈ ఐలాండ్‌కు నైరుతిలో బహుళవర్ణాలతో మెరిసే లోయ ఉంటుంది. దాన్నే రెయిన్బో వ్యాలీ అంటారు. మొత్తం ఐలాండ్ అంతా రంగురంగుల్లో మెరుస్తున్నప్పటికీ ఈ లోయ మరింత ప్రత్యేకం. సూర్య కిరణాల వెలుగుల్లోనే ఈ అందాలను చూడాలనేది పర్యాటకుల మాట. ఆ లోయ పక్కనే మరో లోయ.. శిల్పులు చెక్కిన శిల్పాల్లా ఎన్నో వింత ఆకారాలు దర్శనమిస్తాయి. అయితే వాటిని మనుషులు చెక్కలేదంటే నమ్మబుద్ధి కాదట. వ్యాలీ ఆఫ్ స్టాచ్యూస్ (విగ్రహాల లోయ)గా పేరున్న ఈ లోయలో.. బర్డ్స్‌లా, డ్రాగన్స్‌లా వింతవింత రూపాలు మనల్ని మైమరిపిస్తాయట. అవన్నీ వేలాది సంవత్సరాలుగా ప్రకృతి కోతతో ఏర్పడిన అద్భుతాలే. ఇక ఐలాండ్‌కి పశ్చిమ దిక్కున కిలోమీటర్ మేర విస్తరించిన ఈ లోయలోని ఉప్పు స్ఫటికాలకు వైద్య గుణాలున్నాయని, నెగెటివ్ ఎనర్జీని పారదోలే ఉప్పుదేవతని స్థానికులు విశ్వసిస్తారు. -
AP: సుగంధ పరిమళాలు.. ఎగుమతులకు భారీ డిమాండ్
సాక్షి, అమరావతి: మన రాష్ట్రం నుంచి వివిధ దేశాలకు సుగంధ ద్రవ్యాల ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలం నాటికి రాష్ట్రం నుంచి 15.16 కోట్ల కిలోల సుగంధ ద్రవ్యాలు ఎగుమతి అయినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. సుమారు 80కిపైగా దేశాలకు రూ.2,462.95 కోట్ల విలువైన సుగంధ ద్రవ్యాలను మనం రాష్ట్రం ఎగుమతి చేసింది. రాష్ట్రంలో సాగవుతున్న మిర్చి, పసుపు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలతోపాటు కాఫీ, జీడిపప్పు వంటి ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఏటా వీటి ఎగుమతులు పెరుగుతున్నాయి. ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, అమెరికా, చైనా వంటి దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. చదవండి: AP: అదుపులోనే అప్పులు.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే.. 71 దేశాలకు అరకు కాఫీ ఎగుమతులు విశాఖ మన్యంలో పండించే అరకు కాఫీకి ప్రచారం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో రాష్ట్రం నుంచి 1.49 కోట్ల కిలోల కాఫీ ఎగుమతి అయ్యింది. సుమారు 71 దేశాలకు మన రాష్ట్రం నుంచి ఏడు నెలల్లో రూ.659.62 కోట్ల విలువైన కాఫీ ఎగుమతులు జరిగాయి. ఇదే సమయంలో రాష్ట్రం నుంచి రూ. 2,202.22 కోట్ల విలువైన 9.7 కోట్ల కిలోల పొగాకు కూడా వివిధ దేశాలకు ఎగుమతి అయ్యింది. విదేశాల్లో మంచి డిమాండ్ రాష్ట్రంలో సాగయ్యే కొన్ని పంటలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. పొగాకు బోర్డు, సుగంధద్రవ్యాల బోర్డు, జీడిపప్పు ఎగుమతుల ప్రోత్సాహక సంస్థ వంటి వాటితో చర్చలు జరిపి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో జీడిపప్పు ఎగుమతులు రూ.3 కోట్లుగా ఉన్నాయి. వీటిని మరింత పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – జీఎస్ రావు, జాయింట్ డైరెక్టర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ -
Health Benefits Of Saffron: కుంకుమ పువ్వు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
Most Expensive Spice In The World: సుగంధ ద్రవ్యాలు లేదా మసాలాదినుసుల్లో అత్యంత ఖరీదైనది ఏది? సందేహమెందుకు.. కుంకుమపువ్వు! ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్ ఉంది. ఏమిటి దీని ప్రత్యేకత అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ సంగతులు మీకోసం.. కుంకుమ పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఆరోగ్య రహస్యాలు కుంకుమ పువ్వులో దాగి ఉండటం వల్లనే అంత ధర పలుకుతోంది మరి..! చర్మం, జుట్టుకు మాత్రమేకాకుండా మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఔషధగుణాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. దీనిని ఆరోగ్యం, సుగంధ పరిమళం కోసం అధికంగా వినియోగిస్తారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా అడ్డుకోవడంలో, మెరుగైన కంటిచూపుకు, జ్ఞాపకశక్తి పెంపుకు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకంగా పనిచేస్తుంది. అందుకే అనేక మంది తమ రోజువారీ ఆహారంలో కుంకుమ పువ్వును చేర్చుతారు. జీర్ణ సమస్యల నివారణలో కుంకుమ పువ్వులోని పోషకాలు గ్యాస్ట్రిక్ ట్రబుల్‌కు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచి, ప్రేగుల్లో గ్యాస్ చేరకుండా నిరోధిస్తుంది. తద్వారా కడుపుపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా విరేచనాల లక్షణాలను తగ్గిస్తుంది. ఆకస్మికంగా సంభవించే కడుపునొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. కాలేయ సంబంధిత వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది. చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు.. గుండె ఆరోగ్యానికి దివ్యౌషధం కుంకుమపువ్వు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, తద్వారా రక్తపోటు అదుపులో ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా దీనిలోని ఔషధ గుణాలు హృదయ ఆరోగ్యాన్ని మరింతగా కాపాడుతాయి. ఆర్టరీస్ (ధమను) ల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుని, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. క్యాన్సర్‌తో పోరాడే లక్షణాలు కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి పెద్దప్రేగు క్యాన్సర్ కణాల పెరుగుదలను అణిచివేసి, చంపుతాయి. దీనిలోని యాంటీకాన్సర్ కారకాలు చర్మం, ఎముక మజ్జ, ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయం, ప్రోస్టేట్ వంటి ఇతక క్యాన్సర్ల కణాలను కూడా ప్రభావితం చేస్తాయి. చదవండి: టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!! పీరియడ్స్ రుగ్మతలను తగ్గిస్తుంది కుంకుమపువ్వు తినడం వల్ల స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే చిరాకు, తలనొప్పి, కడుపు నొప్పి, ఆందోళన వంటి సమస్యలు తలెత్తకుండా నివారిస్తుంది. కుంకుమపువ్వు వాసన కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. మూడ్ సమస్యలు కుంకుమపువ్వుకు 'సన్‌షైన్ స్పైస్' అనే పేరు కూడ ఉంది. మానసిక స్థితిని మెరుగుపరిచే లక్షణం కలిగి ఉంటడమే అందుకు ప్రధాన కారణం. చదవండి: Junk Food And Diabetes: డయాబెటిస్ రావడానికి జంక్ ఫుడ్ ఏ విధంగా కారణమౌతుందో తెలుసా! -
ఉపమాకలో సుగంధ ద్రవ్యాల గుబాళింపు
నక్కపల్లి (పాయకరావుపేట): ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద తిరునాళ్లలో పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాల వ్యాపారం జోరుగా సాగుతోంది. స్వామివారి కల్యాణోత్సవాలు పురస్కరించుకుని ఈ ఆలయం వద్ద 20 రోజులపాటు పెద్ద ఎత్తున తీర్థం జరుగుతుంది. ఏటా కల్యాణోత్సవాల నెలరోజులు ఇక్కడ మసాలాదినుసులు, సుగంధద్రవ్యాల అమ్మకాలు జరుగుతాయి. ఫాల్గుణశుద్ధ ఏకాదశి నుంచి కొత్తఅమావాస్య వరకు వివిధ ప్రాంతాల వ్యాపారులు ఇక్కడ తాత్కాలికంగా షాపులు ఏర్పాటు చేసి మసాలా దినుసులు విక్రయిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల భక్తులు.. ఉత్తరాంధ్ర జిల్లాలనుంచి అధిక సంఖ్యలో ప్రజలు ఉపమాక వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు ఇక్కడకు వస్తారు. వారంతా సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేస్తుంటారు. పసుపు, కుంకుమ, జీలకర్ర, వెల్లుల్లి, లవంగాలు, యాలికలు, ఆవాలు, ఎండుద్రాక్ష తదితర సుగంధద్రవ్యాలు ఇక్కడ లభిస్తాయి. హోల్‌సేల్ ధరలకే వీటిని విక్రయిస్తుండంతో ఇక్కడ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కిలోకు రూ.50 నుంచి రూ.80 వరకు వ్యత్యాసం: ఇక్కడ దొరికే సరకులకు బయట కొనుగోలుచేసే సరకులకు మధ్య కిలోకు రూ.50 నుంచి రూ.80 వరకు వ్యత్యాసం ఉంటుందని కొనుగోలుదారులు చెబుతున్నారు. స్టీలు, ఇత్తడి, రాగి వస్తువుల వ్యాపారం కూడా జోరుగా జరుగుతోంది. కల్యాణోత్సవాల్లో ఐదురోజులపాటు జరిగే స్వామివారి ఉత్సవాలు ఆనంతరం ఈ తీర్థంలో సుగంధ ద్రవ్యాల కొనుగోలుకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఏటా రూ.70 లక్షల మేర వ్యాపారం ఏటా నెలరోజులపాటు జరిగే ఈ వాపారంలో సుమారు రూ.60 నుంచి రూ.70 లక్షల విలువైన సుగంధ ద్రవ్యాల విక్రయాలు జరుగుతాయి. దాదాపు 30 ఏళ్లగా ఇక్కడ వ్యాపారం జరుగుతోంది. స్వామి సన్నిధిలో లభించే పసుపు, కుంకుమ, మసాలా దినుసులు కొనుగోలు చేస్తే ఎటువంటి అనారోగ్యం కలగదని ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఈ నమ్మకంతోనే జిల్లానలుమూలలనుంచి సుగంధద్రవ్యాల కొనుగోలుకు ఇక్కడికి వస్తుంటారు. కలిసి వస్తుందని నమ్మకం ఇక్కడ ఏడాదికి ఒకమారు ఇక్కడ వ్యాపారం చేస్తే కలిసివస్తుందని వ్యాపారుల నమ్మకం. అలా చేసిన వారు ఆర్థికంగా లాభపడిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ లభించే వస్తువుల ధరలు బయట మార్కెట్లో కంటే తక్కువగా ఉంటాయి. ఇక్కడ కొనుగోలు చేయడం భక్తులు సెంటిమెంట్‌గా భావిస్తారు. ఏడాదికి సరిపడా సరకులు కొనుగోలు చేసి తీసుకువెళ్తుంటారు. – కక్కిరాల శ్రీను, వ్యాపారి, ఉపమాక చదవండి: హవ్వా.. ఇదేమి విచిత్ర ప్రచారం సినిమా తరహా పక్కా స్కెచ్: అనాథగా అవతారమెత్తి.. -
బెల్లీ ఫ్యాట్‌కు ఇలా చెక్ పెట్టండి..
అమ్మాయిలను ఎక్కువగా బాధించే విషయం బరువు, బెల్లీ ఫ్యాట్ (పొట్ట చూట్టు కొవ్వు పేరుకుపోవడం). దీంతో అధిక బరువుతో పాటు పొట్టను తగ్గించుకోవడానికి అమ్మాయిలు జిమ్‌లో గంటలు గంటలు కుస్తీ పడుతుంటారు. అయినప్పటికీ మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల పొట్ట చూట్టూ మళ్లీ కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీంతో ఎక్కువ సేపు కసరత్తులు చేయడం లేదా స్ట్రిక్ట్ డైట్‌తో నోరు కట్టేసుకుంటుంటారు అమ్మాయిలు. అయితే అలా చేయడం కూడా ఆరోగ్యానికి హానికరమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల జీవక్రియ, శరీరంలోని సమతుల్యతతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చిరిస్తున్నారు. అందుకని వర్కవుట్స్ చేయకుండానే మనకు వంటింట్లో అందుబాటులో ఉన్న సుగంధ ద్రవ్యాలతో మీ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇవి కొవ్వును తగ్గించమే కాకుండా జీవక్రియను కూడా మెరుగుపరుస్తాయి. అంతేకాదు శరీరంలో ఇన్సులిన్‌ను సమతుల్యం చేసి ఆరోగ్యంగా ఉంచడంతో పాటు పొట్ట చూట్టూ పేరుకున్న చెడు కొవ్వును కరిగిస్తాయి. ఇక అవేంటో చుద్దాం రండి . (పదే పదే శానిటైజర్ వాడుతున్నారా?) మిరియాలు: ఇది శరీరంలో థర్మోజెనిక్ ప్రభావాలను పెంచుతుందని పరిశోధనలో తెలినట్లు ప్రముఖ పోషకాహార నిపుణులు సుమయ డాల్మియా తెలిపాడు. అంటే ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెంచడంతో పాటు కొవ్వును కూడా కరిగించడంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతేగాక జీవక్రియ రేటును కూడా వేగవంతం చేస్తుంది. మీ ఆహారంలో మిరియాలతో పాటు నిమ్మకాయను కూడా చేర్చండి. ఎందుకంటే నిమ్మకాయలోని సిట్రస్ మీ సిస్టమ్‌ను ఆల్కలీన్గా చేస్తుంది. శరీరంపై కారపు థర్మోజెనిక్ ప్రభావాలను సమతుల్యం చేస్తుంది. సోంపు గింజలు: ఇవి జీర్ణక్రియకు సహాయపడతంతో పాటు ఉబ్బుసం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దాల్చిన చెక్క: ఇది మీ ఇన్సులిన్, చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల పేరుకుపోయిన కొవ్వును విచ్చిన్నం చేస్తుంది. ఇంగువ: ఇది శరీరంలో అపానవాయువును తగ్గిస్తుంది. అపానవాయువును సృష్టించే ఆహారాన్ని జీర్ణం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీనిని తరచూ మీ ఆహారపు అలవాట్లలో దీనిని చేర్చుకోండని నిపుణులు సూచిస్తున్నారు. . ఆవ పిండి(గింజలు): ఇవి మీ ఆహారానికి సుగంధాన్ని ఇవ్వడమే కాకుండా కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. మెంతులు: ఇది ఆకలిని నియంత్రిస్తుంది. జంక్ ఫుండ్ తినాలన్న మీ ఆహార కోరికలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే మీ ఆహారంలో మెంతులను జోడించండి. పసుపు: ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంలో సహయపడుతుంది. కొవ్వును కరిగించడంలో సహయపడే హార్మోన్ లెప్టిన్‌ను మరింత విడుదల చేయడానికి జీవక్రియ ప్రక్రియలో అనుమతిస్తుంది. యాలకులు: ఇది ఉబ్బరం, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేసే మెలటోనిన్‌ను కూడా ప్రాసెస్ చేస్తుంది. యాలకులు శరీరంలో పేరుకుపోయిన చెడును కొవ్వును మూత్రవిసర్జన ద్వారా బయటకు పంపిస్తుంది. -
చౌకగా ఎండబెట్టేద్దాం!
ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను రైతులు ఆ రోజుకారోజే తక్కువ ధరకు తెగనమ్మేసుకుంటూ నష్టపోతూ ఉంటారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలు, పుట్టగొడుగులను నిల్వ పెట్టుకునే సదుపాయాల్లేకపోవడమే ఇందుకు కారణం. అయితే, వీటిని పల్చటి ముక్కలుగా కోసి సోలార్ డ్రయ్యర్ల సాయంతో నాణ్యత, పోషకాల సాంద్రత ఏమాత్రం నష్టపోకుండా ఎండబెట్టి దాచుకోవచ్చు. ఎటువంటి రసాయనాలు కలపకుండానే ఏడాది వరకు నిశ్చింతగా గాలి చొరబడని డబ్బాల్లో నిల్వచేసుకోవచ్చు. వీలువెంబడి అమ్ముకోవచ్చు, ఏడాది పొడవునా తమ ఇంటి అవసరాలకూ వాడుకోవచ్చు.అయితే, సోలార్డ్రయ్యర్లు మార్కెట్లో చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ ఈ దిశగా రైతులు ఆకర్షితులు కావడం లేదు. సోలార్ డ్రయ్యర్ల ధరలు ఎక్కువగా ఉండటమే ఇందుకు ముఖ్య కారణం. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు, కింది మధ్యతరగతి ప్రజలకు ఇవి అందుబాటులో లేవు. అయితే, రోజులన్నీ ఒకేలా ఉండవు. 5 కిలోల డ్రయ్యర్ వెల రూ. 5,500 టన్నెల్ సోలార్ డ్రయ్యర్లు తక్కువ ధరలకే అందుబాటులోకి రావడం ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వరుణ్ రహేజా అనే యువ ఇంజినీర్ ఇందుకు శ్రీకారం చుట్టాడు. గృహస్తులు, చిన్న రైతులకు అందుబాటులో ఉండే ధరలకే సోలార్ డ్రయ్యర్లను అందిస్తున్నాడు. 5 కిలోల పండ్లు, కూరగాయలను రెండు రోజుల్లో నాణ్యత, పోషకాలు చెడకుండా ఎండబెట్టే చిన్న డ్రయ్యర్‌ను రూ. 5,500లకు, 20 కిలోల సామర్థ్యం ఉండే డ్రయ్యర్‌ను రూ. 14,500కు అందిస్తున్నాడు. అవసరాన్ని బట్టి పారిశ్రామిక అవసరాల కోసం ఎంత పెద్ద సోలార్ డ్రయ్యర్లనయినా తయారు చేసి ఇస్తానని చెబుతున్నాడు వరుణ్. గత ఏడాది నుంచి ఇప్పటికి 90 డ్రయ్యర్లను అందించానని తెలిపాడు. బీహార్‌లో గ్రామీణులకు పుట్టగొడుగుల ఒరుగులు తయారు చేయడానికి, ఉత్తరాఖండ్‌లో ఔషధ మొక్కలను నాణ్యత చెడకుండా ఎండబెట్టడానికి ప్రభుత్వాల సహకారంతో సరఫరా చేశామని వరుణ్ ‘సాగుబడి’ ప్రతినిధితో చెప్పారు. పొడవాటి గుడారం మాదిరిగా ఉండే డ్రయ్యర్లో గాలి ఎండ వల్ల వేడెక్కుతుంది. ఆ వేడి గాలి సోకడంతో పంట ఉత్పత్తుల ముక్కల్లోని తేమ త్వరగా ఆరిపోతుంది. చిన్న ఫ్యాన్ ఈ ఆవిరిని డ్రయ్యర్లో నుంచి బయటకు పంపుతుంది. లోకాస్ట్ డ్రయ్యర్ల ప్రత్యేకతలు కూరగాయలు, పండ్లు, ఉల్లి, వెల్లుల్లి.. ఏ వ్యవసాయోత్పత్తినైనా సోలార్ డ్రయ్యర్లతో పరిశుభ్రంగా, తక్కువ సమయంలో ఎండబెట్టవచ్చు. ఉదాహరణకు, టమాటాల ముక్కలను మామూలుగా ఎండలో పెడితే 7–8 రోజులకు గానీ పూర్తిగా ఎండవు. సోలార్ డ్రయ్యర్లో అయితే, కేవలం రెండు రోజులు చాలు. ఎండిన తర్వాత కూడా వీటిలో పోషక విలువలు, రుచి, రంగు, సువాసన ఉన్నవి ఉన్నట్టే ఉంటాయి. ఎండే క్రమంలో దుమ్ము ధూళి పడకుండా ఉంటుంది. పురుగులు, పక్షుల, జంతువులు వల్ల కూడా పాడుకావు. వర్షం, మంచులో తడిసినా కూడా ఇబ్బందేమీ ఉండదు. తమ డ్రయ్యర్లను సులువుగా బిగించుకోవచ్చని, సులువుగా విడదీసుకొని తీసుకువెళ్లవచ్చని వరుణ్ తెలిపారు. ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఏడాదిలో 300 రోజులు సౌర విద్యుత్తుతో పనిచేసేలా వీటిని రూపొందించామన్నారు. ఎండబెట్టిన ఉత్పత్తులకు మార్కెట్ ఉంది.. సోలార్ డ్రయ్యర్ల ద్వారా పరిశుభ్రమైన, నాణ్యమైన రీతిలో ఎండబెట్టిన ఒరుగులు, వాటి పొడులకు మార్కెట్లో డిమాండ్‌కు కొరత లేదని వరుణ్ చెబుతున్నారు. సోలార్ డ్రయ్యర్లతో తమ ఉత్పత్తులను ఎండబెట్టుకొని ఎటువంటి రసాయనాలను కలపకుండా భ్రదంగా నిల్వ చేసే చిన్న, సన్నకారు రైతులకు వీటిని కొనుగోలు చేసే ఆహార శుద్ధి కర్మాగారాలను పరిచయం చేస్తున్నామని వరుణ్ తెలిపారు. ఒకటి, రెండు డ్రయ్యర్లను కొనుగోలు చేసే వారికి దాన్ని ఎలా బిగించుకోవాలో తెలిపే మాన్యువల్‌ను, వీడియో సీడీని ఇస్తామని, ఫోన్ ద్వారా సూచనలిస్తామన్నారు. తమ డ్రయ్యర్లను ఒకే ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసే రైతులకు పంట దిగుబడులతో నాణ్యమైన ఎండు ఆహారోత్పత్తుల తయారీలో 3 రోజుల పాటు శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. పంట దిగుబడులను శుభ్రపరిచి ముక్కలు తరిగే పద్ధతి, నాణ్యత చెడిపోకుండా ఎండబెట్టుకోవడం, గాలి చొరబడని ప్లాస్టిక్/గాజు డబ్బాల్లో ఎండు ఉత్పత్తులను నిల్వ చేసుకోవడంలో శిక్షణ ఇస్తామన్నారు. దీనితోపాటు మార్కెట్ సమాచారాన్ని కూడా అందించడం ద్వారా చిన్న, సన్నకారు రైతుల ఉత్పత్తులు వృథాను అరికట్టడం, వారి ఆదాయాన్ని పెంపొందించడం సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన లక్ష్యమని వివేక్ అంటున్నారు. యు.ఎన్.ఈ.పి. ప్రశంస తక్కువ ఖర్చుతో వరుణ్ రూపొందించిన సోలార్ డ్రయ్యర్ల పనితనాన్ని ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం(యు.ఎన్.ఈ.పి.) మెచ్చుకోవడం విశేషం. ‘వరుణ్ తయారు చేసిన సోలార్ డ్రయ్యర్ల వంటి స్వల్పఖర్చుతో కూడిన ఆవిష్కరణలు రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా పెద్ద మార్పునకు దోహదపడతాయి. అంతేకాకుండా కోత అనంతర నష్టాలను గణనీయంగా తగ్గిస్తాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఇదెంతో అవసరం’ అని యు.ఎన్.ఈ.పి.లోని సుస్థిర వ్యవసాయ విభాగం ప్రోగ్రామ్ ఆఫీసర్ క్లెమెంటైన్ ఓ కాన్నర్ అన్నారు. వరుణ్‌ను ఈ–మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. solar.rsfp@gmail.com ‘నానబెట్టిన సిరిధాన్యాలు ఒక్క రోజులో ఎండుతున్నాయి’ వరుణ్ దగ్గర నుంచి 5 కిలోల సామర్థ్యం కలిగిన చిన్న సోలార్ డ్రయ్యర్(రూ.5,500)ను హైదరాబాద్‌కు చెందిన సూర్యప్రకాశ్‌రెడ్డి కొద్ది నెలల క్రితం కొరియర్లో తెప్పించుకున్నారు. సోలార్ డ్రయ్యర్ విడిభాగాలను వరుణ్ సూచించిన ప్రకారం తానే బిగించుకున్నారు. సిరిధాన్యాల బియ్యం నానబెట్టి ఎండబెట్టిన తర్వాత పిండి పట్టించి వినియోగదారులకు విక్రయిస్తూ ఉండే ఆయన సోలార్ డ్రయ్యర్ పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నానబెట్టిన సిరిధాన్యాలను సోలార్ డ్రయ్యర్లో ఒక్క రోజులోనే బాగా ఎండుతున్నాయని తెలిపారు. దుమ్ము, పక్షులు, మంచు, వర్షం బెడద లేకుండా కూరగాయలు, పండ్లు వంటివి ఏవైనా నాణ్యత, రంగు చెడకుండా ఎండబెట్టుకోవచ్చని చిరువ్యాపారి సూర్యప్రకాశ్‌రెడ్డి (72999 97993) చెబుతున్నారు. 5 కిలోల సామర్థ్యం గల లోకాస్ట్ సోలార్ డ్రయ్యర్ మామిడి ఒరుగులు, ఎండిన పుట్టగొడుగులు, ఎండిన ఆపిల్ ముక్కలు, అరటి ఒరుగులు -
ఆయన చనిపోలేదు.. అవన్నీ రూమర్లు!
సోషల్ మీడియా పుణ్యమాని ఏ వార్త నిజమో ఏది అబద్ధమో తేల్చుకోవడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా ప్రముఖులు, సెలబ్రిటీల గురించి నకిలీ వార్తలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. మొన్నా మధ్య బాలీవుడ్ నటి సొనాలీ బింద్రే మరణించారంటూ రూమర్లు ప్రచారమైన సంగతి తెలిసిందే. తాజాగా ఇండియా పాపులర్ స్పైసెస్ బ్రాండ్ మహాషియాన్ దీ హట్టి(ఎండీహెచ్) అధినేత మహాశయ్ ధరమ్‌పాల్ గులాటి(99) కన్నుమూశాంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో అవన్నీ పుకార్లేనని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రాజేంద్ర కుమార్ స్పష్టం చేశారు. మహాశయ్ జీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికీ కంపెనీ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ తమని నడిపిస్తున్నారని తెలిపారు. ఈ వార్తలు విన్న తర్వాత తన వయస్సు ఇంకాస్త తగ్గినట్లుగా భావిస్తున్నానంటూ మహాశయ్ తనతో చెప్పారన్నారు. అటువంటి వ్యక్తి గురించి దయచేసి ఇలాంటి వార్తలు ప్రచారం చేయొద్దని కోరారు. కాగా 1919లో సియల్కోట్(ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది)లో జన్మించిన మహాశయ్ మసాలా దినుసుల వ్యాపారంలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. 94 ఏళ్ల వయసులో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ విభాగంలో అత్యంత ఎక్కువ వేతనం పొందిన(రూ. 21 కోట్లు) భారత సీఈఓగా ఆయన రికార్డు సృష్టించారు. చిన్న కొట్టుతో ప్రారంభించిన మహాశయ్ 1953లో ఢిల్లీలోని చాందినీ చౌక్ కేంద్రంగా మసాలా దినుసుల వ్యాపారాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి కోట్లాది రూపాయలు ఆర్జించారు. కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా స్కూళ్లు, ఆస్పత్రులు కట్టించి సామాజిక సేవలో కూడా భాగమవుతున్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎండీహెచ్ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. ఇండియాలో రెండో బెస్ట్ సెల్లింగ్ స్పైసెస్ బ్రాండ్‌గా కూడా ఎండీహెచ్ గుర్తింపు పొందింది. -
కేరళ వరదలు: యూపీలో ఘాటెక్కిన ధరలు
లక్నో : గడిచిన వందేండ్లలో ఎన్నడూలేనంతగా వరదలు సృష్టించిన బీభత్సానికి కేరళ వాణిజ్య పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. కాఫీ, టీ, యాలకులు, మిరియాలు, రబ్బరు, అరటి తోటలన్నీ నేలకొరిగాయి. ఆరుగాలం కష్టించిన రైతన్నలకు ఇక కన్నీళ్లే మిగిలాయి. దీంతో ఒక్కసారిగా ధరల వాత కూడా మోగిపోతుంది. కేరళ వరదలతో ఉత్తరప్రదేశ్‌లో ధరలు హీటెక్కాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రముఖ మార్కెట్ అన్నింటిల్లోనూ మసాలా దినుసుల ధరలు ఘాటుఘాటుగా ఉన్నాయని తెలిసింది. కేరళ మసాలా దినుసుల ఉత్పత్తిలో అతిపెద్ద ఉత్పత్తిదారిగా ఉంది. కేరళ నుంచి సప్లై ఆగిపోవడంతో, తూర్పు యూపీలో అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్‌గా ఉంటున్న వారణాసిలోని దీననాథ్ మార్కెట్లో మసాలా దినుసుల ధరలు 20 శాతానికి పైగా పెరిగినట్టు తాజా గణాంకాల్లో వెల్లడైంది. కేరళను ముంచెత్తిన వరదలతో గత రెండు వారాల నుంచి దీననాథ్ మార్కెట్లోకి మసాలా దినుసుల సరఫరా తగ్గిపోయిందని ట్రేడర్ రామ్ జి గుప్తా తెలిపారు. ఈ కొరతతో ధరలు 20 శాతానికి పైగా పెరిగినట్టు చెప్పారు. నల్లమిరియాల ధరలు కేజీకి 315 రూపాయల నుంచి 400 రూపాయలకు పెరిగాయని, యాలుకల ధరలు కేజీకి 1300 రూపాయల నుంచి 1700 రూపాయలు పెరిగినట్టు మరో ట్రేడర్ అనిల్ కేసరి తెలిపారు. ఇక లవంగం ధరలు కేజీ 600 రూపాయలుంటే, ఇప్పుడు 700 రూపాయలున్నట్టు చెప్పారు. ఇతర మసాలాల ధరలు కూడా ఇదే విధంగా పెరిగాయని చెప్పారు. ఇక ఫతేపూర్ జిల్లా హోల్‌సేల్ మార్కెట్లో కూడా మసాలాల ధరలు దాదాపు 30 శాతానికి పైగా ఎగిసినట్టు తెలిసింది. ధరల పెంపుపై స్పందించిన స్థానిక వర్తకులు.. యాలుకల ధరలు కేజీకి 1200 రూపాయల నుంచి 1600 రూపాయలు పెరిగినట్టు చెప్పారు. ఒకవేళ మసాలాలు త్వరగా మార్కెట్‌కు రాకపోతే, వీటి ధరలు 50 శాతానికి పైగా పెరిగే అవకాశాలున్నాయని కూడా తెలుస్తోంది. బరేలి హోల్‌సేల్ మార్కెట్లో కూడా వీటి ధరలు 15 శాతం కాకపుట్టిస్తున్నాయి. కేరళలో సృష్టించిన ఈ ప్రకృతి విలయతాండవం దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో కూడా ప్రభావం చూపుతుంది. మసాలాలు మాత్రమే కాక, కొబ్బరి సప్లై కూడా నిలిచిపోయిందని అలహాబాద్ జిల్లా హోల్‌సేల్ మార్కెట్ చెబుతోంది. మార్కెట్లో వీటి కొరత ఎక్కువగా ఉండటంతో, ధరలు మరింత హీటెక్కుతున్నాయి. ద్రవ్యోల్బణం కూడా ఈసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
వైశాఖ పర్వం శుభప్రదం
భక్తులందరూ అత్యంత శుభప్రదమైనదిగా భావించే అక్షయ తదియ, పరశురామ జయంతి, సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం, బసవేశ్వర జయంతి, శంకర జయంతి, రామానుజ జయంతి, గంగోత్పత్తి, విద్యారణ్య జయంతి, హనుమజ్జయంతి, నారసింహ జయంతి తదితర పర్వదినాలన్నింటికీ ఆలవాలం వైశాఖ మాసం. చంద్రమానాన్ని అనుసరించే ప్రజలు చైత్రశుద్ధ పాడ్యమిని సంవత్సరారంభంగా ఏ విధంగా భావిస్తారో సౌరమానాన్ని ఆచరించే జనులు వైశాఖమాసం మొదలయ్యే రోజును అంటే వైశాఖశుద్ధ పాడ్యమిని సంవత్సరాదిగా భావిస్తారు. వైశాఖమాసంలో ప్రతిరోజూ పుణ్యతీర్థాల్లో స్నానం చేయటం విశేష ఫలితాన్నిస్తుందని పద్మ పురాణం చెబుతోంది. కార్తీక మాసంలో లాగే స్నానానికి, దానానికి, శుభకార్యాలకీ ఈ మాసం అత్యంత అనువైనది. వైశాఖ స్నానానికి పుణ్యతీర్థం, చెరువు, సరస్సు లేక బావి... వీటిల్లో ఏదైనా యోగ్యమైనదే! సంకల్ప పూర్వకంగా వైశాఖ స్నానాన్ని ఆచరించడం మంచిది. నెల పొడవునా స్నానం చేయలేకపోతే కనీసం శుక్లపక్ష త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ – ఈ మూడు తి«థుల్లో అయినా స్నానం చేయటం సకల పాప క్షయకరం. స్నానం తర్వాత అత్యంత భక్తి శ్రద్ధలతో తులసిదళాలతో విష్ణుపూజ చేయాలి. ఈ విధంగా త్రికాలపూజ చేసే వారికి పునర్జన్మ ఉండదని పద్మపురాణ వచనం. వైశాఖంలో సముద్రస్నానం ఎంతో ప్రశస్తమైనదని శాస్త్ర వచనం. ఈ మాసంలో ఏకభుక్త వ్రతాన్ని అంటే ఒక పూట భోజనం చేసి, మరోపూటఏదైనా అల్పాహారం తీసుకుంటూ, విష్ణుపూజ చేసేవారికి కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయని వామన పురాణం చెబుతుంది. పాడి ఆవును, పాదుకలు, చెప్పులు, గొడుగు, విసనకర్ర, శయ్య, దీపం, అద్దం– వంటి వాటిని దానంగా ఇవ్వాలి. వీలైనంత మందికి భోజనం పెట్టి నీటితో నింపిన కలశాలను, యవలను దక్షిణ సహితంగా దానం ఇవ్వాలి. అందుకు శక్తి లేనివారు సంకల్ప సహితంగా స్నానం చేసి, పులగం వండి పదిమందికి భోజనం పెట్టాలి. ఆచారాలపై విశ్వాసం లేకున్నా, వైశాఖంలో చలివేంద్రాలు నిర్వహించటం, బాటసారులకు చెరుకు రసం, మామిడి పండ్లు, దోసకాయలు, మజ్జిగ తేట, సుగంధ ద్రవ్యాలు దానం చేయడం, పేదలకు చెప్పులు, గొడుగు, పల్చని వస్త్రాలు, చందనం, పూలు, పండ్లు, నీటితో నింపిన కుండని దానం చేయటం వల్ల గుండె నిండుతుంది. -
తొలిసారిగా ఉద్యాన ‘మసాలాలు’
హైదరాబాద్: దేశంలోనే ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మొదటి మసాలా దినుసుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు తెలంగాణ ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామ్రెడ్డి తెలిపారు. బుధవారం సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలో ఈ ప్రాజెక్ట్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలువురు నిపుణులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామ్రెడ్డి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిపుణుల సూచనలు స్వీకరించారు. ఓల్డ్ జీడిమెట్ల పైపులైన్ రోడ్డులో ఉన్న 3.15 ఎకరాల్లో రూ.10.63 కోట్లతో ఈ యూనిట్‌ను నెలకొల్పనున్నారు. తెలంగాణలో 1.50 లక్షల ఎకరాల్లోని పంట కాలనీల్లో పండించిన పసుపు, మిరప, ధనియాలు, చింతపండు, అల్లం, వెల్లుల్లి దిగుబడులను తీసుకొచ్చి ఎనిమిది రకాల మసాలాలు తయారు చేయనున్నారు. పసుపు ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే మొదటి, మిరప సాగులో మూడో స్థానంలో ఉన్నదని, ఇలాంటి స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ వల్ల రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని వెంకట్రామ్రెడ్డి పేర్కొన్నారు. పురుగుమందులు వాడని ఉత్పత్తులుంటాయని, ఇంతవరకు మార్కెట్లో లేని చింతపండు పౌడర్‌ను వినియోగదారులకు అందించనున్నామని తెలిపారు. ఈ యూనిట్‌ను ఈ ఏడాది దసరా నాటికి ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఉత్పత్తి చేస్తున్న ఈ ఉత్పత్తులను ‘కాకతీయ ఫుడ్స్’ పేరిట మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. రైతులకు లాభదాయంగా వినియోగదారులకు సరసమైన ధరలకు అత్యంత నాణ్యంగా అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కమిషనర్ తెలిపారు. ధరలిలా ఉంటాయి.. మసాలా తయారీ కేంద్రంలోని ఉత్పత్తులకు ధరలను అధికారులు ప్రతిపాదించారు. మిరపపొడి కేజీ ధర రూ.137, పసుపుపొడి కిలో ధర రూ. 118, కొత్తిమీర పొడి రూ.115, చింతపండు పొడి కిలో రూ.142, అల్లం, వెల్లుల్లి మిశ్రమం కిలో రూ.108, అల్లం కిలో రూ.101, వెల్లుల్లి కిలో రూ.115, చింతపండు కిలో రూ.161 గా ప్రతిపాదనలు రూపొందించారు. -
విషాలను విసర్జించే ముల్లంగి
గుడ్ ఫుడ్ సాంబారులో కూర ముక్కలను వెతుక్కునే అలవాటు ఉన్నవారు ముల్లంగిని బాగా ఇష్టపడతారు. దుంపకూరల్లో ఒకటైన ముల్లంగి ముక్కలను సలాడ్‌గా కూడా తింటారు. ముల్లంగితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని... ముల్లంగి కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. అది ఒంటిలోని విషపదార్థాలను హరిస్తుంది. అలా కాలేయం మీద భారాన్ని తొలగిస్తుంది. కామెర్ల రోగుల్లో జరిగే ఎర్ర రక్త కణాల వినాశనాన్ని నివారిస్తుంది. అందుకే ముల్లంగిని కామెర్లు వచ్చిన రోగులకు సిఫార్సు చేస్తారు. ముల్లంగి జీర్ణవ్యవస్థను కూడా శుద్ధి చేస్తుంది. పేగులను శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూడటంతో పాటు పేగుల్లో తగినన్ని నీటిపాళ్లు ఉండేలా చేసి మలబద్దకాన్ని నివారిస్తుంది. తద్వారా మొలల (పైల్స్) సమస్య రాకుండా కాపాడుతుంది. ముల్లంగిలో విషాలను హరించడంతో పాటు, ఆ విషాలను బయటకు పంపించే గుణం వల్ల అది మూత్రవిసర్జక వ్యవస్థ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మూత్రపిండాలను శుభ్రపరచడంతో పాటు మూత్రవ్యవస్థను ప్రక్షాళన చేస్తుంది. ముల్లంగిలో ముడుచుకుపోయిన గాలి గొట్టాలను విప్పార్చే గుణం ఉంది. అందుకే బ్రాంకైటిస్, ఆస్తమా సమస్యలకు ముల్లంగి మంచి విరుగుడుగా పనిచేస్తుంది. అంతేకాదు... అనేక అలర్జీలు, జలుబు లేదా శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లకు స్వాభావికమైన మంచి మందుగా కూడా పనిచేస్తుంది. ముల్లంగిలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువ. అందుకే ఇది అధిక రక్తపోటును సమర్థంగా నివారిస్తుంది. రక్తనాళాలపై పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా రక్తప్రసరణ వ్యవస్థ సమర్థంగా పనిచేసేలా చూస్తుంది.