Most Expensive Spice In The World: సుగంధ ద్రవ్యాలు లేదా మసాలాదినుసుల్లో అత్యంత ఖరీదైనది ఏది? సందేహమెందుకు.. కుంకుమపువ్వు! ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్ ఉంది. ఏమిటి దీని ప్రత్యేకత అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ సంగతులు మీకోసం..
కుంకుమ పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు
ఎన్నో ఆరోగ్య రహస్యాలు కుంకుమ పువ్వులో దాగి ఉండటం వల్లనే అంత ధర పలుకుతోంది మరి..! చర్మం, జుట్టుకు మాత్రమేకాకుండా మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఔషధగుణాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. దీనిని ఆరోగ్యం, సుగంధ పరిమళం కోసం అధికంగా వినియోగిస్తారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా అడ్డుకోవడంలో, మెరుగైన కంటిచూపుకు, జ్ఞాపకశక్తి పెంపుకు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకంగా పనిచేస్తుంది. అందుకే అనేక మంది తమ రోజువారీ ఆహారంలో కుంకుమ పువ్వును చేర్చుతారు.
జీర్ణ సమస్యల నివారణలో
కుంకుమ పువ్వులోని పోషకాలు గ్యాస్ట్రిక్ ట్రబుల్‌కు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచి, ప్రేగుల్లో గ్యాస్ చేరకుండా నిరోధిస్తుంది. తద్వారా కడుపుపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా విరేచనాల లక్షణాలను తగ్గిస్తుంది. ఆకస్మికంగా సంభవించే కడుపునొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. కాలేయ సంబంధిత వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది.
చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు..
గుండె ఆరోగ్యానికి దివ్యౌషధం
కుంకుమపువ్వు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, తద్వారా రక్తపోటు అదుపులో ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా దీనిలోని ఔషధ గుణాలు హృదయ ఆరోగ్యాన్ని మరింతగా కాపాడుతాయి. ఆర్టరీస్ (ధమను) ల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుని, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది.
క్యాన్సర్‌తో పోరాడే లక్షణాలు
కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి పెద్దప్రేగు క్యాన్సర్ కణాల పెరుగుదలను అణిచివేసి, చంపుతాయి. దీనిలోని యాంటీకాన్సర్ కారకాలు చర్మం, ఎముక మజ్జ, ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయం, ప్రోస్టేట్ వంటి ఇతక క్యాన్సర్‌ల కణాలను కూడా ప్రభావితం చేస్తాయి.
చదవండి: టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!!
పీరియడ్స్ రుగ్మతలను తగ్గిస్తుంది
కుంకుమపువ్వు తినడం వల్ల స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే చిరాకు, తలనొప్పి, కడుపు నొప్పి, ఆందోళన వంటి సమస్యలు తలెత్తకుండా నివారిస్తుంది. కుంకుమపువ్వు వాసన కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
మూడ్ సమస్యలు
కుంకుమపువ్వుకు 'సన్‌షైన్ స్పైస్' అనే పేరు కూడ ఉంది. మానసిక స్థితిని మెరుగుపరిచే లక్షణం కలిగి ఉంటడమే అందుకు ప్రధాన కారణం.
చదవండి: Junk Food And Diabetes: డయాబెటిస్ రావడానికి జంక్ ఫుడ్ ఏ విధంగా కారణమౌతుందో తెలుసా!
Comments
Please login to add a commentAdd a comment