Cancer cells
-
క్యాన్సర్ నుంచి బయటపడొచ్చు.. సైంటిస్టులు కనిపెట్టిన కొత్త రీసెర్చ్
క్యాన్సర్.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఇదో ప్రాణాంతక వ్యాధి. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాణాలు పోతాయి.అయితే క్యాన్సర్ నుంచి బయట పడేందుకు సైంటిస్టులు ఇప్పుడో కొత్త మార్గాన్ని ఆవిష్కరించారు. క్యాన్సర్ కణాల ఎదుగుదలకు, వ్యాప్తికి సాయపడే పోషకాల స్థానంలో ఉత్తుత్తి పోషకాలను అందిస్తే వ్యాధి వ్యాప్తి నిలిచిపోతుందని, కణితి సైజు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ బర్న్‌హామ్ ప్రీబిస్ మెడికల్ డిస్కవరీ ఇన్స్టిట్యూట్ జరిపిన ప్రయోగం ప్రకారం..ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కణితి ఎదుగుదలకు, వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే పోషకాల స్థానంలో డమ్మీ పోషకాలు ఇవ్వడం ద్వారా క్యాన్సర్‌ను నియంత్రించవచ్చు. క్యాన్సర్లలో ఎన్నో రకాలుంటాయన్నది తెలిసిందే. క్లోమగ్రంథి (పాంక్రియాటిక్)కి వచ్చే క్యాన్సర్ కొంచెం ముదురుటైపు. దీని బారిన పడ్డవారు కోలుకోవడం అసాధారణమే. ఏటా దాదాపు 14 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సాధారణంగా 35-39, 85-89 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ క్యాన్సర్ ఎక్కువ. క్లోమ గ్రంథి క్యాన్సర్ వచ్చిన వారిలో మూడు-మూడున్నరేళ్లకు మించి జీవించి ఉండేవారు పది శాతానికి మించి లేరని పరిశోధనలో వెల్లడైంది. జన్యు కారకాలు, వయస్సు, జీవనశైలి కారణంగా ఈ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో అదే కీలకం క్లోమగ్రంథి క్యాన్సర్ సాధారణంగా గ్లుటామైన్ అనే పోషకంపై ఎక్కువగా అధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని అందకుండా చేస్తే క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. గ్లుటమైన్ అందుబాటులో లేనప్పుడు క్యాన్సర్ కణాలు ఆస్పరాజైన్‌తో సహా ఇతర పోషకాలపై కాబట్టి ఈ రెండు పోషకాలు అందకుండా చేస్తే వ్యాధిని కట్టడి చేయవచ్చు. ఇందుకోసం శాస్త్రవేత్తలు అచ్చం గ్లుటమైన్ మాదిరిగానే ఉండే 6-డయాజో-5-ఆక్సో-ఎల్-నార్లూసిన్ (DON)ను, ఇప్పటికే ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తున్న L-ఆస్పరాగినేస్లను కలిపి ఎలుకలపై ప్రయోగాలు చేశారు. L-ఆస్పరాగినేస్ అనేది ఆస్పరాజైన్ను విచ్ఛిన్నం చేసే కీమోథెరపీ ఔషధం. ఇది క్యాన్సర్ కణాలను వృద్ది చెందకుండా అడ్డుకుంటుంది. రెండింటినీ కలిపి వాడినప్పుడు ఎలుకల్లోని క్యాన్సర్ కణితి సైజు తగ్గిపోయినట్లు.. వ్యాధి వ్యాప్తి కూడా ఎక్కువ జరగనట్లు తేలింది. క్యాన్సర్ కణాల ప్రొటీన్ ఉత్పత్తికి, కొత్త కణాల తయారీకి ఆస్పరాజైన్ అవసరం. DONను ఇప్పటికే ఊపరితిత్తుల క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగిస్తున్నారు కానీ... రెండింటినీ కలిపి వాడటం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఇదే పద్ధతిని అంటే రెండు రకాల డమ్మీ పోషకాలను కలిపి వాడటం క్లోమగ్రంథి క్యాన్సర్ చికిత్సకూ వాడవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైలంట్ కిల్లర్... ప్యాంక్రియాటిక్ క్యాన్సర్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్న క్యాన్సర్లలో ఇది కూడా ఒకటి.అలసట, ఆకలి లేకపోవడం,ఉబ్బినట్లు అనిపించడం వంటి అజీర్ణం లక్షణాలు,అకస్మాత్తుగా బరువు తగ్గడం, శరీరంలో రక్తం గడ్డ కట్టడం వెన్ను నొప్పి, కామెర్లు, విపరీతంగా కడుపునొప్పి వంటివన్నీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు. ధూమపానం, మధుమేహం ఎక్కువగా సేవించడం, కుటుంబంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇతర క్యాన్సర్ల మాదిరిగానే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ క్లోమ గ్రంథిలో కణాల అసాధారణ పెరుగుదల వల్ల వస్తుంది. ప్యాంక్రియాస్ (క్లోమం) కడుపులో ముఖ్యమైన భాగం. ఇది చిన్న పేగు దగ్గర ఉండే పొడవైన గ్రంథి.ఇది జీర్ణక్రియకు సహాయపడే పదార్థాలు లేదా ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడంలో సహాయపడటమే కాకుండా, రక్తప్రవాహంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించే హార్మోన్లను విడుదల చేయడంలో కూడా సహాయపడుతుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను సైలెంట్ కిల్లర్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది వ్యాధి తీవ్రం అయ్యేవరకు ఎలాంటి లక్షణాలను చూపించదు. ఈ రకమైన క్యాన్సర్ చాలా తొందరగా శరీరంలోని ఇతర అవయవాలకి వ్యాపిస్తుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు తరచుగా పొత్తికడుపు, కాలేయానికి వ్యాప్తి చెందుతాయి. అంతేకాకుండా ఊపిరితిత్తులు, ఎముకలు, మెదడుతో పాటి ఇతర అవయవాలకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. -
క్యాన్సర్ కణాలకు చెక్!
న్యూఢిల్లీ: మహమ్మారి క్యాన్సర్ కణాల అంతానికి నడుం బిగించిన భారతీయ శాస్త్రవేత్తల బృందం ఆ క్రతువులో విజయవంతమైంది. అతి సూక్ష్మ బంగారు, రాగి సలై్ఫడ్ రేణువులను శాస్త్రవేత్తలు సృష్టించారు. రోగి శరీరంలో క్యాన్సర్ సోకిన చోట ఈ రేణువులను ప్రవేశపెట్టి వీటిని ఫొటో థర్మల్, ఆక్సీకరణ ఒత్తిడికి గురిచేసినపుడు ఇవి క్యాన్సర్ కణాలను విజయవంతంగా వధించాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)కి చెందిన అధ్యయన బృందం సాధించిన ఈ ఘనత తాలూకు వివరాలు ఏసీఎస్ అప్లయిడ్ నానో మెటీరియల్స్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. గోల్డ్, కాపర్ సలై్ఫడ్ రేణువులు క్యాన్సర్ కణాలను అత్యంత సులభంగా గుర్తించగలవు కూడా. రేణువులను రోగమున్న చోట ప్రవేశపెట్టాక అక్కడ కాంతిని ప్రసరింపజేయాలి. కాంతిని శోషించుకున్న రేణువులు ఉష్ణాన్ని జనింపజేస్తాయి. వేడితోపాటే విషపూరిత స్వేచ్ఛాయుత ఆక్సిజన్ అణువులను ఇవి విడుదలచేస్తాయి. ఇవి క్యాన్సర్ కణాలను ఖతంచేస్తాయి. గోల్డ్, కాపర్ సల్ఫైడ్ రేణువులు వ్యాధి నిర్ధారణ కారకాలుగా పనిచేస్తాయి. కాంతిని సంగ్రహించి అల్ట్రాసౌండ్ తరంగాలను విడుదలచేస్తాయి. దీంతో ఏ దిశలో ఎన్ని క్యాన్సర్ కణాలు ఉన్నాయో స్పష్టంగా తెల్సుకోవచ్చు. ఈ విధానం క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ ప్రక్రియను మరింత మెరుగుపరచనుంది. క్యాన్సర్ కణజాలం గుండా ఈ అ్రల్టాసౌండ్ తరంగాలు ప్రసరించినపుడు క్యాన్సర్ కణతులపై ఆక్సిజన్ ఆనవాళ్లు, వాటి ఆకృతులు అత్యంత స్పష్టంగా కనిపించనున్నాయి. గతంలో ఈ రేణవులను పెద్ద పరిమాణంలో తయారుచేయగా ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు ఈసారి అత్యంత సూక్ష్మ స్థాయిలో అంటే 8 నానోమీటర్ల పరిమాణంలో తయారుచేయగలిగారు. కాపర్ సలై్ఫడ్ ఉపరితలంపై అత్యంత సూక్ష్మమైన పుత్తడి రేణువులను చల్లి ఈ గోల్డ్, కాపర్ మిశ్రమధాతు రేణువులను సృష్టించారు. ఇవి ఇంత చిన్న పరిమాణంలో ఉండటంతో సులువుగా క్యాన్సర్ కణజాలంలోకి చొచ్చుకుపోగలవు. ఊపిరితిత్తులు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కణాలపై ఈ రేణువులను ప్రయోగించి చక్కని ఫలితాలను సాధించారు. -
మేనరికంతో ముప్పు.. రొమ్ము క్యాన్సర్‌ను ఇలా గుర్తించవచ్చు
ఈమధ్యకాలంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండెజబ్బులది కాగా, రెండోది క్యాన్సర్‌దే. ప్రపంచ వ్యాప్తంగా, ఏటా కోటి మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు.కొన్ని పరిశోధనల ప్రకారం ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకసారి వ్యాధి సోకిందంటే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చికిత్స తర్వాత కోలుకొని తిరిగి ఆరోగ్యంగా మారాలంటే ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేం. మరి ఈ మహమ్మారిని గుర్తించడం ఎలా? క్యాన్సర్ వారసత్వంగా వస్తుందా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. డీఎన్ఏలో మార్పులే కారణం మనిషి శరీరం మొత్తం కణజాలాలతో నిండి ఉంటుంది. అయితే కణజాలం అనవసరంగా విపరీతంగా పెరిగిపోవడమే క్యాన్సర్. శరీరంలో సాధారణంగా కణాల విభజన నిత్యం జరుగుతూనే ఉంటుంది. కణాలు పుడుతూ, చనిపోతూ ఉంటాయి. డీఎన్ఏ మార్పుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కారణంగానే తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వస్తుంటాయి. ఈ క్రమంలోనే క్యాన్సర్ కూడా వారసత్వంగా వచ్చే అవకాశముంది. అలాగే పొగ తాగడం, మద్యం సేవించడం, ఇతర ఆహారపు అలవాటుల, రేడియేషన్ తదితర కారణాలతో డీఎన్ఏలో మార్పులు వస్తుంటాయి. దీంతో కొన్ని కణాలు చనిపోకుండా శరీరంలో అలాగే ఉండిపోతాయి. శరీరానికి అవసరమైన కణాల కంటే ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఇలా పెరిగిన కణాలు ట్యూమర్ (కణితి)గా ఏర్పడడానే క్యాన్సర్‌గా పేర్కొంటారు. వ్యాధి కట్టడికి చర్యలు క్యాన్సర్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. క్యాన్సర్ బాధితులను గుర్తించేందుకు ప్రభుత్వం నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) సర్వేను ప్రారంభించింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సర్వే శరవేగంగా జరుగుతోంది. ఎన్సీడీ సర్వే ద్వారా మూడు రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పెద్దసంఖ్యలో బాధితులను గుర్తించారు. సర్వే పూర్తయితే మరిన్ని కేసులు బయటపడవచ్చని వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.చాలా మంది వ్యాధి ఫైనల్ స్టేజ్ వచ్చే వరకు గుర్తించకపోవడంతోనే పరిస్థితి ప్రాణాల మీదకు వస్తోంది. ఈ క్రమంలో క్యాన్సర్‌పై గ్రామీణ స్థాయి నుంచే ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది. అందులో భాగంగా వారంలో ఐదు రోజులపాటు ఆశ వర్కర్లు, ఏఎన్ఎం, కార్యకర్తల ఆధ్వర్యంలో ఎన్సీడీ సర్వేకి శ్రీకారం చుట్టింది. ఈ సర్వేలో స్క్రీనింగ్ పూర్తయ్యాక విండ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ద్వారా నిత్యం పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ లక్షణాలున్న వారిని గుర్తించి పీహెచ్‌సీల స్థాయిలోనే నిర్ధారిస్తున్నారు. అనంతరం ఆరోగ్య శ్రీలో భాగంగా ఉచితంగా పరీక్షలు చేయిస్తున్నారు. అనంతరం పూర్తిస్థాయి చికిత్సకు ఆస్పత్రులకు పంపుతున్నారు. క్యాన్సర్ రకాలు ఇవీ.. మూత్రాశయ క్యాన్సర్ : దీన్ని ప్రోస్టేట్ అంటే వీర్య గ్రంధి క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఇది పురుషులకు తక్కువగా వస్తుంది. ఈ క్యాన్సర్ బాధితుల్లో మూత్ర విసర్జన కష్టంగా ఉంటుంది. మూత్రం, వీర్యంలో రక్తం పడుతుంది. బ్లడ్ క్యాన్సర్: రక్త కణాలు నియంత్రణ తప్పడం ద్వారా ఏర్పడుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, తరచూ జ్వరం, నోరు, చర్మం, ఊపిరితిత్తులు, గొంతు ఇన్ఫెక్షన్ తదితర లక్షణాలు ఉంటాయి. ముక్కు, చిగుళ్లు నుంచి రక్తస్రావమవుతుంది. రొమ్ము కాన్సర్ : రొమ్ములో వాపు, నొప్పి, రొమ్ముపై గడ్డలు, చనుమొనల నుంచి అసాధారణ స్రవాలు, చంకలో గడ్డలు ఆధారంగా ఈ వ్యాధిని గుర్తిస్తారు. ఊపిరితిత్తుల క్యాన్సర్: ఈ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించడం కష్టం. వ్యాధి శరీరంలోని ఇతర భాగాలకు పాకినప్పుడే నిర్ధారించగలరు. అయితే మాటలో అసాధారణ మార్పులు.. ఛాతీ నొప్పి, వేగంగా బరువు కోల్పోవడం, గురక, విపరీతమైన దగ్గు ఈ వ్యాధి లక్షణాలు. పెద్ద పేగు క్యాన్సర్ : కొలోన్, రెక్టమ్ క్యాన్సర్లను కలిపి కాలో రెక్టల్ క్యాన్సర్ అని పిలుస్తారు. మద్యం సేవించడం, పాగతాగడం, ఆహారపు అలవాట్ల వల్ల ఈ క్యాన్సర్ సోకుతుంది. పురుషుల్లోనే ఈ క్యాన్సర్ అధికం. ముందస్తు జాగ్రత్తలు.. పరీక్షలు ►పుట్టిన వెంటనే శిశువుకు హెపటైటిస్– బి వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి. ► గర్భాశయ ముఖద్వారం (సర్వైకల్ క్యాన్సర్) రాకుండా అమ్మాయిలకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. ► 35 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏటా ఒకసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. మహిళల్లో క్యాన్సర్ అరికట్టేందుకు ఇది చాలా అవసరం. ► కొలోరెక్టల్ క్యాన్సర్ (పెద్దపేగు) పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. 40 ఏళ్లు పైబడిన వారు తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ► రొమ్ము క్యాన్సర్ నిర్ధారణలో ప్రస్తుతం 3డీ మామోటెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ సాంకేతికత ద్వారా అత్యంత సూక్ష్మస్థాయిలో క్యాన్సర్ కణాలను గుర్తించవచ్చు. ► మేనరికాలు, జన్యుపరమైన కారణాలతో వచ్చే సమస్యలకు అత్యాధునిక బీఆర్ఏసీ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా గుర్తిస్తున్నారు. ► గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను గుర్తించేందుకు లిక్విడ్ బేస్డ్ పాప్‌స్మియర్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ► ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నిర్ధారించేందుకు సీఎస్ వంటి అత్యాధునిక టెకాల్నజీ వినియోగిస్తున్నారు. ► క్యాన్సర్ దశాబ్దాలుగా మానవాళిని వణికిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ► జీవనశైలిలో మార్పుల కారణంగా బాధితుల సంఖ్య గణనీయంగాపెరుగుతోంది. పకడ్బందీగా సర్వే క్యాన్సర్ నివారణే ధ్యేయంగా ప్రస్తుతం జిల్లాలో ఇంటింటా సర్వే చేపట్టాం. గత ఏడాది అక్టోబర్ నుంచి ఎన్సీడీ సర్వేలో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. గ్రామీణ స్థాయి నుంచి ప్రజలకు క్యాన్సర్ లక్షణాలపై అవగాహన కల్పిస్తున్నాం. వ్యాధిని తొలిదశలో గుర్తిస్తే నయం చేయడం సులభతరమని వివరిస్తున్నాం. – ప్రభావతీదేవి, డీఎంహెచ్ఓ, చిత్తూరు -
కేన్సర్‌ను చంపే రోబోలు!
4డీ ప్రింటింగ్‌తో మొదలు...: కేన్సర్ చికిత్సకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న కీమోథెరపీతో ఫలితాలు మెరుగ్గానే ఉన్నా దుష్ప్రభావాలు మాత్రం చాలా ఎక్కువ. వేలికి గాయమైతే చేయి తీసేయాలనేలా ఉంటుంది కీమో చికిత్స. కాకపోతే మరో ప్రత్యామ్నాయం లేని నేపథ్యంలో కీమోథెరపీని కొనసాగిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు అమెరికన్ కెమికల్ సొసైటీ శాస్త్రవేత్తలు 4డీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో బుల్లి రోబోలను తయారు చేశారు. వాటి ద్వారా కేన్సర్ కణితులకు నేరుగా కీమో మందులు అందించే చేయగలిగారు. రక్త నాళాల్లో ఇమిడిపోగల ఈ మైక్రో రోబోలను అయస్కాంతాల సాయంతో మనకు కావాల్సిన అవయవం వద్దకు తీసుకెళ్లవచ్చు. కేన్సర్ కణితుల పరిసరాల్లోని ఆమ్లయుత వాతావరణానికి స్పందించి ఈ రోబోలు తమలోని కీమో మందులను అక్కడ కక్కేస్తాయి! కృత్రిమ రక్తనాళాల్లో పరీక్షలు...: అమెరికన్ కెమికల్ సొసైటీ సిద్ధం చేసిన మైక్రో రోబోలను రక్తనాళాల్లాంటి నిర్మాణాల్లో పరీక్షించారు. నిర్దేశిత లక్ష్యం వద్దకు ఇవి వెళ్లేలా చేసేందుకు బయటి నుంచి అయస్కాంతాలను ఉపయోగించారు. కేన్సర్ కణాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి చేరిన వెంటనే ఆమ్లతకు అనుగుణంగా మైక్రో రోబోల్లోని మందు విడుదలైంది. ఆ వెంటనే అక్కడి కేన్సర్ కణాలు మరణించాయి. ఇప్పుడు తయారు చేసిన వాటి కంటే తక్కువ సైజులో ఉండే మైక్రోబోట్లను తయారు చేయడం ద్వారా త్వరలోనే వీటిని మానవ ప్రయోగాలకు సిద్ధం చేసే అవకాశం ఉంది. ఇవి శరీరంలో తిరిగేటప్పుడు ఫొటోలు తీసేందుకు, ప్రయాణాన్ని పరిశీలించేందుకు మార్గాలను సిద్ధం చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ మత్స్యావతారం .. ఫొటోలో చూశారుగా.. అమెరికన్ కెమికల్ సొసైటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన మైక్రోరోబో అలా చేప ఆకారంలో ఉంటుంది. హైడ్రోజెల్‌తో తయారయ్యే వాటిని మనకు నచ్చిన ఆకారంలోనూ తయారు చేసుకోవచ్చు. శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల కోసం చేపలు, పీతలు, సీతాకోక చిలుకల వంటి భిన్న ఆకారాల్లో మైక్రో రోబోలను సిద్ధం చేశారు. ఆయా ఆకారాల్లో మందులు నింపేందుకు వీలుగా అక్కడకక్కడా వాటిలో కొన్ని ఖాళీలలను ఏర్పాటు చేశారు. పీతల చేతి కొక్కేల దగ్గర, చేప నోటి వద్ద హైడ్రోజెల్ మందాన్ని తగ్గించడం ద్వారా అవి ఆమ్లయుత వాతావరణానికి తగ్గట్టుగా స్పందించి తెరుచుకునేలా లేదా మూసుకునేలా తయారు చేశారు. చివరగా ఈ మైక్రో రోబోలను ఐరన్ ఆక్సైడ్ నానో కణాలు ఉన్న ద్రావణంలో ఉంచడం ద్వారా వాటికి అయస్కాంతానికి స్పందించే లక్షణాన్ని అందించారు. -
Health Benefits Of Saffron: కుంకుమ పువ్వు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
Most Expensive Spice In The World: సుగంధ ద్రవ్యాలు లేదా మసాలాదినుసుల్లో అత్యంత ఖరీదైనది ఏది? సందేహమెందుకు.. కుంకుమపువ్వు! ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్ ఉంది. ఏమిటి దీని ప్రత్యేకత అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ సంగతులు మీకోసం.. కుంకుమ పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఆరోగ్య రహస్యాలు కుంకుమ పువ్వులో దాగి ఉండటం వల్లనే అంత ధర పలుకుతోంది మరి..! చర్మం, జుట్టుకు మాత్రమేకాకుండా మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఔషధగుణాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. దీనిని ఆరోగ్యం, సుగంధ పరిమళం కోసం అధికంగా వినియోగిస్తారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా అడ్డుకోవడంలో, మెరుగైన కంటిచూపుకు, జ్ఞాపకశక్తి పెంపుకు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకంగా పనిచేస్తుంది. అందుకే అనేక మంది తమ రోజువారీ ఆహారంలో కుంకుమ పువ్వును చేర్చుతారు. జీర్ణ సమస్యల నివారణలో కుంకుమ పువ్వులోని పోషకాలు గ్యాస్ట్రిక్ ట్రబుల్‌కు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచి, ప్రేగుల్లో గ్యాస్ చేరకుండా నిరోధిస్తుంది. తద్వారా కడుపుపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా విరేచనాల లక్షణాలను తగ్గిస్తుంది. ఆకస్మికంగా సంభవించే కడుపునొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. కాలేయ సంబంధిత వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది. చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు.. గుండె ఆరోగ్యానికి దివ్యౌషధం కుంకుమపువ్వు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, తద్వారా రక్తపోటు అదుపులో ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా దీనిలోని ఔషధ గుణాలు హృదయ ఆరోగ్యాన్ని మరింతగా కాపాడుతాయి. ఆర్టరీస్ (ధమను) ల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుని, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. క్యాన్సర్‌తో పోరాడే లక్షణాలు కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి పెద్దప్రేగు క్యాన్సర్ కణాల పెరుగుదలను అణిచివేసి, చంపుతాయి. దీనిలోని యాంటీకాన్సర్ కారకాలు చర్మం, ఎముక మజ్జ, ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయం, ప్రోస్టేట్ వంటి ఇతక క్యాన్సర్ల కణాలను కూడా ప్రభావితం చేస్తాయి. చదవండి: టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!! పీరియడ్స్ రుగ్మతలను తగ్గిస్తుంది కుంకుమపువ్వు తినడం వల్ల స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే చిరాకు, తలనొప్పి, కడుపు నొప్పి, ఆందోళన వంటి సమస్యలు తలెత్తకుండా నివారిస్తుంది. కుంకుమపువ్వు వాసన కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. మూడ్ సమస్యలు కుంకుమపువ్వుకు 'సన్‌షైన్ స్పైస్' అనే పేరు కూడ ఉంది. మానసిక స్థితిని మెరుగుపరిచే లక్షణం కలిగి ఉంటడమే అందుకు ప్రధాన కారణం. చదవండి: Junk Food And Diabetes: డయాబెటిస్ రావడానికి జంక్ ఫుడ్ ఏ విధంగా కారణమౌతుందో తెలుసా! -
చైనా పెను సంచలనం
సంచలనానికి చైనా సిద్ధపడింది. సొంత స్పేస్ స్టేషన్ ‘టియాన్‌గోంగ్’ ద్వారా అరుదైన ప్రయత్నానికి సిద్ధపడింది. త్వరలో ప్రారంభం కానున్న(పూర్తి స్థాయిలో) ఈ స్పేస్ స్టేషన్ ద్వారా ఒకేసారి వెయ్యి ప్రయోగాలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇందులో క్యాన్సర్‌కి ‘స్పేస్ ట్రీట్మెంట్’ సంబంధిత ప్రయోగాలు కూడా ఉండడం విశేషం. బీజింగ్: మెడికల్ రీసెర్చ్, సాంకేతిక అధ్యయనాలతో పాటుగా వెయ్యి ప్రయోగాలను అదీ ఒకేసారి స్పేస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ స్టేషన్లో నిర్వహించాలని చూస్తోంది. భూమి నుంచి 388.9 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ఈ స్పేస్ ఏజెన్సీలోకి ఇంటర్నేషనల్ స్పేష్ ఏజెన్సీ(ఐఎస్ఎస్), రష్యా స్పేస్ ఏజెన్సీ మిర్ లాగా ఇతర దేశాల స్పేస్ సైంటిస్టులకు అనుమతి ఇవ్వకూడాదని నిర్ణయించుకుంది. మైక్రోగ్రావిటీ ప్రయోగాలు ఇక స్పేస్ స్టేషన్ ద్వారా ప్రయోగాలకు డిఫరెంట్ మాడ్యూల్స్‌ను(ఇప్పటికే మూడు ఉన్నాయి) ఏర్పాటు చేయబోతోంది డ్రాగన్ కంట్రీ. నేచర్ కథనం ప్రకారం.. హై ఎనర్జీ కాస్మిక్ రేడియేషన్‌ను గుర్తించడానికి 1-2బిలియన్ల యువాన్లను(దాదాపు 310 బిలియన్ డాలర్లు)దాకా ఖర్చు చేయబోతోంది. తద్వారా కాస్మిక్ కిరణాలు, చీకటి సంబంధిత అధ్యయనాలను సులువుగా కొనసాగించనుంది. అంతరిక్షంలో చికిత్స? స్పేస్ క్రోగ్రావిటీలో క్యాన్సర్ మీద కూడా అధ్యయనం చేపట్టాలని చైనా నిర్ణయించుకుంది. త్రీడీ బ్లాబ్స్ను పంపడం ద్వారా ఆరోగ్యవంతమైన వాటితో పాటు క్యాన్సర్ కణజాలాల మీద ఏకకాలంలో ప్రయోగాలు నిర్వహించనుంది. తద్వారా.. తక్కువ గ్రావిటీ వాతావరణంలో(అంతరిక్షంలో) క్యాన్సర్ కణాల పెరుగుదల నెమ్మదించడమో లేదంటే పూర్తిగా ఆగిపోవడమో నిర్ధారించుకునే దిశగా ప్రయోగాలు చేయనుంది. ఈ ప్రయోగాలు ఫలిస్తే.. The China Manned Space Agency ‘అంతరిక్ష వైద్యానికి బీజం వేయనుంది. అంటే క్యాన్సర్ పేషెంట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లి చికిత్స అందించడమో లేదంటే అక్కడ తయారు చేసిన మందుల్ని ఉపయోగించడమో(భూ వాతావరణానికి తగ్గట్లు పనిచేసే విధంగా) ద్వారా సంచలనానికి తెర తీయాలనుకుంటోంది. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా.. ‘వ్యోమగాముల ఆరోగ్యం కోసం’ అనే హింట్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తుల్లో క్యాన్సర్ పేషెంట్లకు స్పేస్ ట్రీట్మెంట్ అందించే ఆలోచన చేస్తున్నట్లు డ్రాగన్ కంట్రీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ మేరకు ఓ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు గ్లోబల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. రెండు స్పేస్ ల్యాబ్‌లు స్పేస్ స్టేషన్లో కొత్తగా రెండు ల్యాబ్‌లను ప్రారంభించాలని చైనా భావిస్తోంది. అయితే ఐఎస్ఎస్ లాగా కాకుండా.. ఒకేసారి వంద మంది చేరుకునే ప్రయోగానికి రెడీ అయ్యింది. ఇంకా చాలా ప్రయోగాలు అనుమతుల కోసం సిద్ధంగా ఉన్నాయని, చైనా ఆస్ట్రోఫిజిస్ట్ జాంగ్ షువాంగ్ నాన్ ‘నేచర్’తో వ్యాఖ్యానించాడు. వీటిలో చాలావరకు(తొమ్మిది ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు కలిపి) ఇతర దేశాల సహకారంతోనూ నిర్వహించనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు 40 దేశాల నుంచి అభ్యర్థనలు రాగా.. అమెరికా-రష్యాలతో పోటీపడి నిలబడేందుకు చైనాకు మంచి అవకాశమే దొరికినట్లయ్యింది. -
ఒమాక్సే పతనం- శిల్పా మెడి జూమ్
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసిక ఫలితాల విడుదలకు సోమవారం(29న) నిర్వహించవలసిన బోర్డు సమావేశాన్ని వాయిదా వేసినట్లు వెల్లడించడంతో రియల్టీ కంపెనీ ఒమాక్సే లిమిటెడ్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క కిడ్నీ క్యాన్సర్ చికిత్సకు జనరిక్ ఔషధాన్ని విడుదల చేసినట్లు వెల్లడించడంతో హెల్త్‌కేర్ కంపెనీ శిల్పా మెడికేర్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. వెరసి ఒమాక్సే లిమిటెడ్ వరుసగా రెండో రోజు లోయర్ సర్క్యూట్‌ను తాకగా.. శిల్పా మెడికేర్ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం.. ఒమాక్సే లిమిటెడ్ ఈ నెల 29న నిర్వహించవలసిన బోర్డు సమావేశాన్ని నెల రోజులపాటు వాయిదా వేసినట్లు రియల్టీ కంపెనీ ఒమాక్సే లిమిటెడ్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. బోర్డు సమావేశంలో భాగంగా కంపెనీ గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు ప్రకటించవలసి ఉంది. జులై 29న బోర్డును తిరిగి సమావేశపరచనున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు 20 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు అధికంకాగా.. కొనేవాళ్లు కరువుకావడంతో రూ. 35 పతనమై రూ. 141 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల కనిష్టంకాగా.. సోమవారం సైతం ఈ కౌంటర్ 20 శాతం కుప్పకూలడం గమనార్హం. కాగా.. గత రెండు నెలల్లో ఈ షేరు 44 శాతం ర్యాలీ చేసింది. ఏప్రిల్ 27న నమోదైన రూ. 153 నుంచి పెరుగుతూ వచ్చి రెండు రోజులుగా పతన బాట పట్టింది. శిల్పా మెడికేర్ కిడ్నీ క్యాన్సర్ చికిత్సకు వినియోగించగల జనరిక్ ఔషధం యాక్సిటినిబ్ను విడుదల చేసినట్లు ఫార్మా రంగ కంపెనీ శిల్పా మెడికేర్ తాజాగా పేర్కొంది. యాక్సిషిల్ బ్రాండుతో 1 ఎంజీ, 5 ఎంజీ డోసేజీలలో ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఒక బాటిల్లో 14 ట్యాబ్లెట్లను అందించనున్నట్లు వివరించింది. అడ్వాన్స్డ్ రేనల్ సెల్ కార్సినోమా(ఆర్సీసీ)తో బాధపడే రోగుల చికిత్సకు ఈ ఔషధాన్ని వినియోగించవచ్చని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శిల్పా మెడి షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 496 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 498 వరకూ ఎగసింది. -
నానో కణాలతో కేన్సర్ చికిత్స!
రాగి చెంబులో ఉంచిన నీటిని తాగితే హానికారక సూక్ష్మజీవులు నశిస్తాయని మనం చాలాసార్లు విని ఉంటాం. మరి.. అదే రాగిని నానోస్థాయిలో... అంటే అత్యంత సూక్ష్మస్థాయిలో ఉపయోగిస్తే ఏమవుతుంది? కేన్సర్ కణితుల్లోని కణాలు చచ్చిపోతాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో రాగి నానో కణాలు కణాలను నాశనం చేస్తాయని పలు యూనివర్శిటీల శాస్త్రవేత్తలు కలిసికట్టుగా చేసిన ప్రయోగాల ద్వారా స్పష్టమైంది. కేన్సర్ కణాలకు కొన్ని రకాల నానో కణాలకూ అస్సలు పడదని ఇటీవలే స్పష్టమైంది. దీంతో శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని పరిశోధనలు ప్రారంభించారు. రాగితోపాటు, ఆక్సిజన్‌తో తయారైన నానో కణాలు అత్యంత ప్రభావశీలంగా ఉన్నట్లు గుర్తించారు. కాపర్‌ఆక్సైడ్ నానోకణాలు ఒక్కసారి శరీరంలోకి ప్రవేశిస్తే.. అవి కరిగిపోయి విషపూరితంగా మారతాయి. కేన్సర్‌కణాలను మట్టుబెడతాయి. అయితే వీటిద్వారా సాధారణ కణాలకు నష్టం కలగకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు ఐరన్ ఆక్సైడ్‌ను జత చేయడం విశేషం. రోగ నిరోధక కణాలను ఉత్తేజితం చేయడం ద్వారా కేన్సర్ చికిత్స కల్పించే ఇమ్యూనోథెరపీని, కాపర్ ఆక్సైడ్ నానో కణాలను కలిపి ప్రయోగించినప్పుడు ఎలుకల్లో చాలా ఎక్కవ కాలంపాటు కేన్సర్ తిరగబెట్టలేదని ప్రొఫెసర్ స్టీఫాన్ సోనెన్ తెలిపారు. తాము ఎలుకల ఊపిరితిత్తులు, పేవు కేన్సర్లపై ప్రయోగాలు చేసి మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. -
ఓవరీలో సిస్ట్...సంతానం కలుగుతుందా?
నా వయసు 32 ఏళ్లు. పెళ్లయి ఎనిమిదేళ్లు అవుతోంది. ఇంతవరకు పిల్లలు లేరు. కొన్నాళ్ల క్రితం స్కానింగ్ తీయిచాం. ఓవరీలలో సిస్ట్ ఉందని తెలిసింది. భవిష్యత్తులో అది క్యాన్సర్‌గా మారే అవకాశం ఉందని మా ఫ్రెండ్స్ చెబుతుంటే నాకు చాలా ఆందోళనగా ఉంది. సిస్ట్ ఉన్నవారికి సంతానం పొందే అవకాశాలు ఎలా ఉంటాయి. ఈ విషయమై నాకు వివరంగా చెప్పండి. ఓవేరియన్ సిస్ట్ (అండాశయాల్లో నీటితిత్తులు) ఉండటం అన్నది చాలా సాధారణ సమస్య. ఇవి చాలామందిలో కనిపిస్తుంటాయి. ఈ నీటితిత్తులు క్యాన్సర్ కణాలుగా మారవు. చాలామందిలో అవి కొద్దికాలం పాటు కనిపించి, ఆ తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. కాబట్టి మీరు వీటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఒవేరియన్ సిస్ట్స్ ఉన్న మహిళలు డాక్టర్ల దగ్గరికి వచ్చినప్పుడు అవి ఏ తరహాకు చెందినవో గుర్తించేందుకు వైద్యులు ప్రయత్నిస్తారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా వాటి పరిమాణం, సంఖ్య, వాటిలోకి జరిగే రక్తసరఫరా వంటి అంశాలను తెలుసుకుంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని రక్తపరీక్షలు, ఎమ్మారై వంటి ఇతర పరీక్షలనూ చేయించాల్సి వస్తుంది. ఫ్యామిలీ హిస్టరీ గురించి తెలుసుకొని అలా వాళ్ల కుటుంబ చరిత్రలో క్యాన్సర్లు వచ్చి ఉంటే వారికి మరికొన్ని అదనపు పరీక్షలు సైతం చేయించాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఒవేరియన్ సిస్ట్లు వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే వాటి పరిమాణం పెరుగుపోతున్నా లేదా ట్విస్ట్ అవుతున్నా, అవి చీరుకుపోయి రక్తస్రావం అవుతున్నా, వాటి వల్ల నొప్పి కలుగుతుంటే మాత్రం వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. ఈ శస్త్రచికిత్స సైతం లాపరోస్కోపీ ప్రక్రియ ద్వారా చేయడం కూడా చాలామందిలో సాధ్యమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇలా సిస్ట్లు రావడం అన్నది ఎండోమెట్రియాసిస్ కారణంగా జరుగుతుంటుంది. అలాంటప్పుడు రుతుస్రావం, కలయిక సమయంలో నొప్పి, గర్భధారణకు అడ్డంకిగా ఉంటుంది. ఇక గర్భధారణ అవకాశాల విషయానికి వస్తే మీకు గర్భధారణ జరగకపోవడానికి ఇంకా ఏయే అంశాలు కారణమో పూర్తిగా విశ్లేషించాల్సి ఉంటుంది. దాంతోపాటు మీలో వస్తున్న సిస్ట్లు ఏ తరహాకు చెందినవి అని తెలుసుకోవడం కూడా అవసరమే. అంతేకాకుండా మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ గర్భధారణకు అవకాశాలు తగ్గిపోతాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా వైద్య నిపుణులను కలవండి. ఎండోమెట్రియాసిస్‌కు సర్జరీ అయ్యింది... పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందా? నా వయసు 35 ఏళ్లు. పెళ్లయి పదేళ్లు అవుతోంది. పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంటే ఇటీవలే డాక్టర్‌ను కలిశాను. అక్కడ నాకు ‘ఎండోమెట్రియాసిస్’ ఉందని వైద్యులు నిర్ధారణ చేసి, లాపరోస్కోపిక్ ఆపరేషన్ చేశారు. నాకు పిల్లలు పుట్టే అవకాశాలున్నాయా? నాకు పీరియడ్స్ సమయంలో మళ్లీ మళ్లీ నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎండోమెట్రియాసిస్ సమస్య రావడం అన్నది చాలామంది మహిళల్లో కనిపించ. సాధారణమైన విషయం. ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్స తర్వాత కొంతమందిలో ఈ నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. అయితే మరి కొంతమందిలో మాత్రం నొప్పి మళ్లీ రావచ్చు. నొప్పి తీవ్రత తక్కువగా ఉంటే జీవనశైలిలో చిన్న చిన్న మార్పులతో దాన్ని నియంత్రించవచ్చు. అంటే... తేలికపాటి వ్యాయామాలు చేయడంతో పాటు చాలా తక్కువ మోతాదుల్లో నొప్పినివారణమాత్రలు వాడుతూ నొప్పిని అదుపులో ఉంచవచ్చు. కానీ కొందరిలో మాత్రం నొప్పి తీవ్రత చాల ఎక్కువగా ఉంటుంది. అలాంటివారిలో వాళ్లు మళ్లీ గర్భధారణను కోరుకోకపోతే... వారికి హార్మోన్లలో మార్పులు తీసుకువచ్చే మందులను డాక్టర్లు సూచిస్తారు. అయితే నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే మాత్రం మళ్లీ శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు. అయితే దాదాపు 60 శాతం నుంచి 80 శాతం మందిలో మళ్లీ గర్భధారణ వచ్చేలాగే శస్త్రచికిత్స చేసి, నొప్పిని నియంత్రించవచ్చు. మీ లేఖను బట్టి మీరు గర్భధారణను కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ మీరు గర్భధారణను కోరుకుంటుంటే మాత్రం ‘ఫెర్టిలిటీ ఇవాల్యుయేషన్’ (అంటే గర్భధారణకు అవకాశాలను తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు) చేయించాల్సి ఉంటుంది. మీరు రాసినదాన్ని బట్టి మీకు మినిమల్/మైల్డ్ ఎండోమెట్రియాసిస్ ఉండటం వల్ల లాపరోస్కోపిక్ చికిత్స జరిగినట్లు తెలిపారు. కాబట్టి కొన్ని రకాల మందులతో మీలో అండం విడుదల (ఒవ్యులేషన్) అయ్యేలా చేసి, ఐయూఐ (ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్) వంటి ప్రక్రియలను అనుసరిస్తే... మీలో గర్భధారణకు కొంతవరకు అవకాశాలు ఉండవచ్చు. కాకపోతే తీవ్రమైన ఎండోమెట్రియాసిస్ (సివియర్ ఎండోమెట్రియాసిస్) కేసుల్లో మాత్రం ఐవీఎఫ్ వంటి ఆధునిక ప్రక్రియలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజుల్లో సంతాన సాఫల్యానికి తగిన ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మీరు సంబంధిత నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ ప్రీతిరెడ్డి సీనియర్ కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, బర్త్ రైట్ బై రెయిన్బో, హైదరాబాద్ -
కేన్సర్‌పై పోరాటానికి ప్రొటీన్ సిద్ధమైంది
దుష్ప్రభావాలు ఏమీ లేకుండానే కేన్సర్‌కు చికిత్స కల్పించాలన్న శాస్త్రవేత్తల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇందుకోసం ఒక ప్రొటీన్‌ను కృత్రిమంగా సిద్ధం చేశారు. రోగ నియంత్రణ వ్యవస్థలో కీలకమైన ఇంటర్‌ల్యూకిన్ –2 (ఐఎల్–2) కేన్సర్‌తోపాటు మధుమేహం, ఆర్థరైటిస్ వంటి అనేక ఆటోఇమ్యూన్ వ్యాధులకు చికిత్స కల్పించగలదు. అయితే దుష్ప్రభావాలు చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన ప్రొటీన్ డిజైన్ విభాగం కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా ఐఎల్–2 ను పోలిన కృత్రిమ ప్రొటీన్‌ను డిజైన్ చేశారు. జంతువుల్లో జరిగిన ప్రయోగాల్లో ఈ కృత్రిమ ప్రొటీన్ కేన్సర్ కణాలపై దాడి చేయగల టీ– కణాలను చైతన్యవంతం చేసినట్లు స్పష్టమైంది. అంతేకాదు.. నియో –2/15 అని పిలిచే ఈ కృత్రిమ ప్రొటీన్ ఇంటర్‌ల్యూకిన్ –15 ప్రొటీన్‌లా కూడా పనిచేస్తుంది. శాస్త్రవేత్తలు దాదాపు 30 ఏళ్లుగా ఐఎల్–2ను సురక్షితంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. నియో –2/15 ద్వారా ఇది సాధ్యమవుతోందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డేయిన్ అడ్రియానో సిల్వా తెలిపారు. అన్నీ సవ్యంగా సాగితే నియో –2/15 ద్వారా కేన్సర్‌కు మరింత మెరుగైన, దుష్ప్రభావాలు ఏవీ లేని చికిత్స అందుతుందని అంచనా -
కేన్సర్ కణాలను కొవ్వుగా మార్చేస్తారు
కేన్సర్ మహమ్మారిపై పోరులో స్విట్జర్లాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. కేన్సర్ కణాలను నిరపాయకరమైన కొవ్వు కణాలుగా మార్చేందుకు వీరు ఒక వినూత్నమైన పద్ధతిని కనుక్కున్నారు. కేన్సర్ కణాలు శరీరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే విధానాన్నే ఆసరాగా చేసుకుని తాము ఈ కొత్త పద్ధతిని ఆవిష్కరించామని గెర్హార్డ్ క్రిస్టోఫొరీ అంటున్నారు. ఈ కణాలు కొన్నిసార్లు ఎపిథీలియల్ మెసన్కైమల్ ట్రాన్సిషన్ అనే ప్రక్రియకు గురవుతూంటాయని ఈ దశలో అవి మూలకణాల మాదిరిగా ఉంటాయని ఆయన వివరించారు. శరీరంలోని ఏ రకమైన కణంగానైనా మారగలిగే సత్తా మూలకణాలదన్నది తెలిసిందే. ఎలుకల్లోకి రొమ్ము కేన్సర్ కణాలను జొప్పించి తాము ప్రయోగాలు చేశామని.. మధుమేహానికి వాడే రోసిగ్లిటాజోన్, కేన్సర్ చికిత్సకు ఉపయోగించే ట్రామిటినిబ్లను ఆ ఎలుకలపై వాడినప్పుడు కేన్సర్ కణాలు కొన్ని కొవ్వు కణాలుగా మారుతున్నట్లు తాము గుర్తించామని... అంతేకాకుండా ఈ మందుల ప్రయోగం తరువాత కేన్సర్ కణాల విస్తరణ కూడా లేకుండా పోయిందని క్రిస్టోఫొరీ తెలిపారు. ఈ పద్ధతిలో వాడిన మందులు రెండింటికీ ఇప్పటికే అనుమతులు ఉండటం వల్ల మానవ ప్రయోగాలు త్వరలో మొదలవుతాయని... కీమోథెరపీతోపాటు ఈ కొత్త పద్ధతిని వాడటం ద్వారా కేన్సర్‌కు మెరుగైన చికిత్స కల్పించవచ్చునని వివరించారు. -
కేన్సర్‌పై యుద్ధంలో మరో ముందడుగు
కేన్సర్ వ్యాధి చాలా తెలివైందంటారు. శరీరంలో కేన్సర్ కణాలు మొట్టమొదట చేసే పని రోగ నిరోధక వ్యవస్థను హైజాక్ చేయడం. ఫలితంగా ఈ వ్యవస్థ కాస్తా కేన్సర్ కణాలను కూడా తనవిగానే భావిస్తుంది. ఎంటువంటి దాడులూ చేయదు. దీనివల్ల వ్యాధి కాస్తా ముదిరిపోతుంది. అయితే కాలిఫోర్నియా, రష్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు ఈ సమస్యకు ఓ చక్కటి పరిష్కారం లభించింది. శరీరంలో రోగకారక వైరస్లు, బ్యాక్టీరియాలపై నిత్యం నిఘా పెట్టే కణాల్లో మైలాయిడ్ కణాలు రెండు రకాలు. ఒకరకమైన ఎం1 మాక్రోఫేజ్ కేన్సర్ కణితి పెరుగుదలను అడ్డుకుంటూంటే.. రెండోది తోడ్పడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ రెండు రకాల కణాలూ రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన కణాలను నాశనం చేస్తూంటాయి. రష్, కాలిఫోరియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ మైలాయిడ్ కణాలు ఎందుకు అలా రెండుగా విడిపోతాయో గుర్తించారు. సీడీ11బీ అనే ఒక ప్రొటీన్ ఉత్పత్తి ఎక్కువైతే ఎం1 రకం కణాలు.. తక్కువైతే ఎం2 రకానివి ఎక్కువవుతాయి. కణితి కణాలు ఈ ప్రొటీన్‌ను నియంత్రిస్తూ ఎం2 కణాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యేందుకు కారణమవుతూంటాయి. ఈ ప్రొటీన్‌ను మరింత సమర్థంగా నియంత్రించగలగడం.. తద్వారా ఎం1 కణాలు ఎక్కువయ్యేలా చేస్తే కేన్సర్‌కు మెరుగైన చికిత్స లభిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో ఈ ఫలితాలు కనిపించాయని వినీత్ గుప్తా అనే శాస్త్రవేత్త తెలిపార -
జుట్టు జన్యువుతో కేన్సర్ కణాలు మటాష్!
జుట్టు రాలేందుకు కారణమైన ఓ జన్యువు.. శరీరంలోని కేన్సర్ కణాలను వెతికి వెతికి చంపేయగలదు అంటున్నారు కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. రోగనిరోధక శక్తి స్వయంగా కేన్సర్ కణాలను చంపేసేలా చేసే ఇమ్యునోథెరపీ గురించి మనం వినే ఉంటాం. ఈ పద్ధతి అందరికీ ఒకేలా పనిచేయదు. కేన్సర్ కణాలపై దాడి చేసేందుకు రోగనిరోధక కణాలకు ప్రత్యేకమైన బయో మార్కర్ల అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో జుట్టు రాలిపోవడంతో పాటు పలు ఇతర ఆటోఇమ్యూన్ వ్యాధులు కేన్సర్‌ను ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయన్న ప్రతిపాదనను పరిశీలించేందుకు కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. జుట్టు రాలిపోయేందుకు కారణమవుతున్న ఓ జన్యువు చాలా చురుకుగా ఉన్నట్లు గుర్తించారు. ఐకేజెడ్ఎఫ్1 అనే ఈ జన్యువు రోగనిరోధక కణాలు అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తున్నట్లు తెలుసుకున్నారు. కేన్సర్ కణాల్లోనూ కనిపించిన ఈ జన్యువును ఎలుకల్లో చైతన్యవంతం చేశారు. ఫలితంగా అధిక మొత్తంలో ఉత్పత్తి అయిన టీ–సెల్స్ కణితిపై సమర్థంగా దాడిచేశాయి. అయితే ఈ జన్యువు కొన్ని రకాల కేన్సర్లలో మాత్రమే పనిచేస్తుంది కాబట్టి.. ఆయా కేన్సర్లకు మాత్రమే కొత్త చికిత్స పద్ధతి అనుకూలంగా ఉండవచ్చునని అంచనా. -
ఆ లోహంతో కేన్సర్ కణాలు మటాష్
ఇరిడియం అనే లోహం కేన్సర్ కణాలను కూడా మట్టుబెట్టగలదని శాస్త్రవేత్తలు తేల్చారు. చైనా, బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తల ప్రయోగాల ద్వారా ఈ విషయం తెలిసింది. ఆరోగ్యకరమైన కణజాలానికి హాని కలిగించకుండానే ఇరిడియం, ప్రత్యేక రకమైన ఆక్సిజన్లతో కూడిన పదార్థం లేజర్ కిరణాలకు ఉత్తేజితమై కేన్సర్ కణాలను చంపేస్తున్నట్లు తెలిసింది. పరిశోధన శాలలో కృత్తిమ ఊపిరితిత్తుల కేన్సర్ కణితిపై ఈ ప్రయెగం జరిగింది. లేజర్ కిరణాలు పడ్డప్పుడు ఇరిడియంలోని ఆక్సిజన్ సింగల్టన్ ఆక్సిజన్‌గా మారిపోయిందని.. ఇది కేన్సర్ కణాలకు విషంలా పరిణమించిందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త కూక్సన్ ఛూ తెలిపారు. అల్ట్రా హైరెజుల్యూషన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ ద్వారా తాము పరిశీలించగా చక్కెరలను జీర్ణం చేసుకునేందుకు, ఒత్తిడి నిర్వహణకు ఉపయోగపడే ప్రోటీన్లపై ఇరీడియం ప్రభావం చూపుతున్నట్టు తెలిసిందని వివరించారు. -
కేన్సర్ కణాల కాళ్లు విరగొట్టారు!
కేన్సర్ ప్రాణాంతకమే అయినప్పటికీ అది ఏ ఒక్క అవయవానికో పరిమితమైతే ప్రాణాపాయం తక్కువ. ఎప్పుడైతే అది ఒకచోటి నుంచి ఇతర అవయవాలకు విస్తరించడం మొదలవుతుందో అప్పుడే సమస్య. మెటాస్టాసిస్ అని పిలిచే ఈ దశను అడ్డుకునేందుకు జార్జియా టెక్ శాస్త్రవేత్తలు బంగారు నానో కడ్డీలతో ఓ ప్రయోగం చేశారు. మానవ కేన్సర్ కణాలపైకి ఈ నానో బంగారు కడ్డీలను ప్రయోగించి, వాటిని లేజర్ కిరణాల సాయంతో వేడిచేశారు. ఈ వేడికి కేన్సర్ కణాలకు ఉండే కాళ్లలాంటి నిర్మాణాలు ధ్వంసమై పోయాయి. దీనివల్ల ఈ కణాలు ఇతర ప్రాం తాలకు విస్తరించే సామర్థ్యాన్ని కోల్పోతాయి. తాము అభివృద్ధి చేసిన ఈ పద్ధతి భవిష్యత్తులో కేన్సర్ మెటాస్టాసిస్ దశను అడ్డుకునేందుకు.. తద్వారా కేన్సర్ కణితులే లక్ష్యంగా మరింత మెరుగైన చికిత్స పద్ధతులను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడతాయని ఈ ప్రయోగాలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ముస్తఫా ఎల్.సయీద్ అంటున్నారు. -
కేన్సర్ వ్యాప్తి గుట్టు తెలిసింది
కేన్సర్ వ్యాధి ప్రాణాలు తీసే స్థాయికి చేరకుండా నిరోధించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త మార్గాన్ని గుర్తించారు. శరీరంలో కేన్సర్ కణాలు దశల వారీగా ఒక కణితి స్థాయి నుంచి మొదలై ఇతర అవయవాలకు విస్తరించి ప్రాణాలు తీస్తుందన్న సంగతి తెలిసిందే. ఇలా రక్తం ద్వారా ఇతర అవయవాలకు విస్తరించే ‘మెటాస్టాసిస్’ ఎలా జరుగుతుందన్న విషయం ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎలాంటి అవగాహనకు రాలేదు. అయితే జర్మనీలోని గోథె విశ్వవిద్యాలయం, మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఈ గుట్లు రట్టయింది. కేన్సర్ కణాలు చిన్న చిన్న రక్త నాళాల గోడల్లో ఉండే ‘డెత్ రిసెప్టార్ 6, (డీఆర్6)’ ను నిర్వీర్యం చేయడం ద్వారా రక్తనాళాలను నాశనం చేసి రక్తంలో కలసిపోతాయని, ఆ తర్వాత ఇతర అవయవాలకు విస్తరిస్తున్నాయని గుర్తించారు. ‘డీఆర్ 6’ను ముందుగా నిర్వీర్యం చేసిన జన్యుమార్పిడి ఎలుకల్లో మెటాస్టాసిస్ తక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలిందని స్టెఫాన్ ఒఫర్మాన్స్ వివరించారు. డీఆర్6ను నిర్వీర్యం చేయడం ద్వారా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయా అన్నది పరిశీలించాల్సి ఉందని అంటున్నారు. ఈ పరిశోధన ద్వారా అనేక కేన్సర్ కారక మరణాలను తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. -
బ్లడ్ క్యాన్సర్‌ను నయంచేసే అద్భుత మాత్ర
మెల్బోర్న్: అత్యంత ప్రమాదకరమైన బ్లడ్ క్యాన్సర్ (లింఫోటిక్ లుకేమియా) నయం చేయడానికి అద్భుతమైన మాత్ర త్వరలోనే ప్రపంచ మార్కెట్లోకి రానుంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో వున్న ‘వాల్టర్ అండ్ ఎలిజా హాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ సంస్థ ఈ అద్భుతమైన మాత్రను రూపొందించి దానికి వెనెటోక్లాక్స్ అని పేరు పెట్టింది. ఈ మాత్రను డోసేజ్ ప్రకారం వాడడం వల్ల క్యాన్సర్ కణాలు కరగిపోతాయి. వాస్తవానికి ఈ మందును మెల్బోర్న్ సంస్థ 1980 దశకంలోనే కనిపెట్టింది. ముందుగా జంతువులపై ప్రయోగాలు జరిపి, అనంతరం క్యాన్సర్ రోగులపై కూడా ప్రయోగాలు నిర్వహించి విజయం సాధించడానికి ఇంతకాలం పట్టింది. క్యాన్సర్ కణాలను ప్రోత్సహించే ‘బీసీఎల్ 2’ ప్రోటీన్‌ను నాశనం చేయడం త్వారా తమ డ్రగ్ క్యాన్సర్ కణాలను కరగిపోయేలా చేస్తుందని సంస్థకు చెందిన నిపుణులు తెలిపారు. ఎలాంటి మందులతో కూడా క్యాన్సర్ నయంకాని లింపోటిక్ లుకేమియాతో బాధపడుతున్న 116 మంది రోగులను తాము ఎంపికచేసుకొని వారికి వెనెటోక్లాక్స్ మాత్రలను రెండేళ్లపాటు ఇచ్చి చూశామని, దాదాపు 80 శాతం మందికి క్యాన్సర్ తగ్గిపోయిందని పరిశోధకులు వెల్లడించారు. వారిలో ఎక్కువ మందికి బ్లడ్ క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోగా కొంత మందిలో ఎక్కువ మందికి తగ్గిపోయిందని, వారందిరిలోనూ జీవితకాలం పెరిగిందని వారు వివరించారు. ‘నేను ఎన్నో మందులు వాడి చూశాను. దేనీకి నా క్యాన్సర్ జబ్బు నయం కాలేదు. రోజుకు 20 గంటలపాటు పడక మీదనే పడుకొని ఉండేవాడిని. ఏ పని చేయడానికి శక్తి ఉండేది కాదు. గత రెండేళ్లుగా వెనెటోక్లాక్స్ మాత్రలను వాడాను. ఇప్పుడు పూర్తిగా క్యాన్సర్ నయం అయింది. ఇప్పుడు నేను నా వయస్సుకు తగ్గ ఏ పనైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని మెల్బోర్న్ రాయల్ ఆస్పత్రిలో పూర్తిగా కోలుకున్న 68 ఏళ్ల విక్ బ్యాక్‌వుడ్ మీడియాతో చెప్పారు. ఈ డ్రగ్‌ను త్వరలో అమెరికా మార్కెట్లోకి విడుదల చేసేందుకు ‘అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ మంగళవారం నాడు అనుమతి మంజూరు చేసింది. -
కేన్సర్ చికిత్సకు వ్యాక్సిన్లు!
లండన్: కేన్సర్‌ను నయం చేసేందుకు శాస్త్రవేత్తలు ఓ కొత్త ఆవిష్కరణ చేశారు. మానవుని సొంత వ్యాధినిరోధక శక్తితో కేన్సర్ కణాలను నాశనం చేసే విధానాన్ని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కేన్సర్ కణితిలోని ప్రత్యేకమైన కణాలను శరీరం గుర్తించేలా చేసి వాటిని నాశనం చేసే విధానాన్ని వారు కనుగొన్నారు. పరివర్తన చెందిన కణాలను లక్ష్యంగా చేసుకునేందుకు రెండు రకాల విధానాలున్నాయని పేర్కొన్నారు. అందులో ఒకటి కేన్సర్ సోకిన వ్యక్తికి చెందిన వ్యాక్సిన్లను అభివృద్ధిపరిచి కణితి కణాలను గుర్తించడం. రెండోది వ్యాధి నిరోధక కణాలను బయటకు తీసి ల్యాబ్‌లో వాటి సంఖ్యను పెంచి, తిరిగి శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా కేన్సర్ కణాలను టార్గెట్‌గా చేసుకోవడం. -
కేన్సర్‌కు ‘కత్తెర’
లండన్: మందులకు లొంగని భయంకరమైన కేన్సర్‌ను నయం చేసి పరిశోధకులు చరిత్ర సృష్టించారు. ఏడాది పాపకు సోకిన లుకేమియా(బ్లడ్‌కేన్సర్)ను పూర్తిగా నయం చేశారు. ‘పరమాణు కత్తెరలు’ ఉపయోగించి జన్యువుల్లో మార్పు చేసి కేన్సర్ కణాలను చంపేయడం వల్ల ఇది సాధ్యమైంది. ‘జన్యువుల్లో మార్పులు చేసి కేన్సర్ కణాలను చంపే వ్యాధి నిరోధక కణాలను సృష్టించాం. బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న లైలా రిచర్డ్స్ అనే చిన్నారిపై ప్రయోగించాం’ అని లండన్‌కు చెందిన గ్రేట్ ఒర్మాండ్ స్ట్రీట్ ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. లైలాకు గతంలో కీమోథెరపీ, ఎముకమజ్జ మార్పిడి చేసినా మిగిలిన కేన్సర్ కణాలను డాక్టర్లు నశింపచేయలేకపోయారన్నారు. ప్రస్తుత పద్ధతిలో దాతల నుంచి వ్యాధినిరోధక కణాలైన ‘టీ-కణాలను’ సేకరించి వాటి జన్యువుల్లో మార్పులు చేసి కేన్సర్ కణాలను గుర్తించేలా రూపొందిస్తారు. ఈ కణాలను రోగి శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా శరీరంలోని కేన్సర్ కణాలను అవి చంపేస్తాయి. -
కేన్సర్ కణాలను బంధించే మైక్రో రాకెట్లు!
ముంబై: రక్తంలో వందల కోట్ల కణాలుంటాయి. వాటి మధ్య చాలా స్వల్ప సంఖ్యలో ఉండే కేన్సర్ కణాలను గుర్తించడ కష్టం. కానీ ఇకపై ఈ పని సులభం కానుంది. వందల కోట్ల రక్తకణాల మధ్య 10-100 కేన్సర్ కణాలు ఉన్నా కూడా గుర్తించే మైక్రోరాకెట్లను భారత్, జర్మనీ శాస్త్రవేత్తలు సృష్టించారు. కేన్సర్ నిర్ధారణకు, చికిత్సకు కీలకం కానున్న ఈ మైక్రోరాకెట్లను పుణేలోని యాక్టోరియస్ ఇన్నోవేషన్స్ అండ్ రీసెర్చ్, మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, జర్మనీలోని ఫ్రెయీ యూనివర్సిటీ బెర్లిన్‌లకు చెందిన శాస్త్రవేత్తల బృందం అభివృద్ధిపర్చింది. ఔషధాలను కేన్సర్ కణతుల వద్ద విడిచేందుకు ఈ రాకెట్లు ఉపయోగపడతాయి.