కేన్సర్ మహమ్మారిపై పోరులో స్విట్జర్లాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. కేన్సర్ కణాలను నిరపాయకరమైన కొవ్వు కణాలుగా మార్చేందుకు వీరు ఒక వినూత్నమైన పద్ధతిని కనుక్కున్నారు. కేన్సర్ కణాలు శరీరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే విధానాన్నే ఆసరాగా చేసుకుని తాము ఈ కొత్త పద్ధతిని ఆవిష్కరించామని గెర్హార్డ్ క్రిస్టోఫొరీ అంటున్నారు. ఈ కణాలు కొన్నిసార్లు ఎపిథీలియల్ మెసన్‌కైమల్ ట్రాన్సిషన్ అనే ప్రక్రియకు గురవుతూంటాయని ఈ దశలో అవి మూలకణాల మాదిరిగా ఉంటాయని ఆయన వివరించారు. శరీరంలోని ఏ రకమైన కణంగానైనా మారగలిగే సత్తా మూలకణాలదన్నది తెలిసిందే.
ఎలుకల్లోకి రొమ్ము కేన్సర్ కణాలను జొప్పించి తాము ప్రయోగాలు చేశామని.. మధుమేహానికి వాడే రోసిగ్లిటాజోన్, కేన్సర్ చికిత్సకు ఉపయోగించే ట్రామిటినిబ్‌లను ఆ ఎలుకలపై వాడినప్పుడు కేన్సర్ కణాలు కొన్ని కొవ్వు కణాలుగా మారుతున్నట్లు తాము గుర్తించామని... అంతేకాకుండా ఈ మందుల ప్రయోగం తరువాత కేన్సర్ కణాల విస్తరణ కూడా లేకుండా పోయిందని క్రిస్టోఫొరీ తెలిపారు. ఈ పద్ధతిలో వాడిన మందులు రెండింటికీ ఇప్పటికే అనుమతులు ఉండటం వల్ల మానవ ప్రయోగాలు త్వరలో మొదలవుతాయని... కీమోథెరపీతోపాటు ఈ కొత్త పద్ధతిని వాడటం ద్వారా కేన్సర్‌కు మెరుగైన చికిత్స కల్పించవచ్చునని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment