fat cells
-
ఇళ్లు శుభ్రం.. ఒళ్లు భద్రం..
పనివాళ్లెవరూ అందుబాటులో లేని ఈ లాక్డౌన్ ప్రతి ఒక్కరికి ఒళ్లు వంచాల్సిన అవసరాన్ని కల్పించింది. దీంతో ఇప్పుడు సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా ఇంటిపని తప్పనిసరిగా మారింది. మరోవైపు ఇంటిపని చేయడం ఎన్నో రకాలుగా మంచిదని, ముఖ్యంగా శారీరక ఇమ్యూనిటీని పెంచడానికి ఇది ఊతమిస్తుందని, అలాగే జిమ్ అలవాటు ఉన్న వారికి అవి అందుబాటులో లేని బాధ నుంచి ఉపశమనంగా కూడా ఇవి కండరాలకు పని కల్పిస్తాయని సిటీకి చెందిన ఫిట్నెస్ ట్రైనర్లు అంటున్నారు. –సాక్షి, సిటీబ్యూరో హైదరాబాద్ : లాక్డౌన్ టైమ్‌లో టీవీలకో, చాటింగ్ కబుర్లకో పరిమితం కాకుండా ఇంటిని తీర్చిదిద్దుకోవడంపైన శ్రద్ధ పెడితే అది ఇంటికి శుభ్రతను వంటికి ఆరోగ్యాన్ని అందించడం తథ్యం. అంతేకాదు... జిమ్‌లు మూత పడిన నేపథ్యంలో కాస్త ఉపశమనంగా... జిమ్స్, ఫిట్నెస్ సెంటర్లలో కొన్ని వర్కవుట్స్ చేసిన ఫలితం ఇంట్లో చేసే కొన్ని పనుల ద్వారా కూడా పొందవచ్చు. ఫ్లోర్ క్లీనింగ్.. ఫ్యాట్ బర్నింగ్.. ఇల్లు ఊడ్వడం, కడగడం, తడిగుడ్డతో ఫ్లోరింగ్ క్లీన్ చేయడం వంటి పనులతో చేతులు, నడుం, పొత్తికడుపు దగ్గర కండరాలు ఫ్లెక్సిబులిటిని సంతరించుకుంటాయి. ఈ పనులు ఫ్రంట్ షోల్డర్, బ్యాక్ షోల్డర్ మజిల్స్‌కు ఉపయుక్తం. ఓ వైపువంగి ఫ్లోర్ తుడవడం అంటే జిమ్‌లో బెంట్ ఓవర్ లేటరల్ రైజెస్ వర్కవుట్ చేసినట్టే. దీనితో గంటకు కనీసం 200దాకా కేలరీలు ఖర్చు అవుతాయట. షోల్డర్స్,ట్రైసప్స్,బైసప్స్ బలపడతాయి. సీలింగ్ శుభ్రం... ఫిట్నెస్ భద్రం బూజు పట్టిన సీలింగ్, ఫ్యాన్ రెక్కలు మొత్తం దుమ్ము... దీనిని శుభ్రం చేయడంలో భాగంగా చేతులు కాసేపు పైకి పెట్టి కదపాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల భుజాలు, వీపు భాగాలు చైతన్యవంతమవుతాయి. ఫిట్నెస్ సెంటర్లో చేసే పుల్ ఓవర్ ఎక్సర్‌సైజ్‌తో ఇది సమానం. ఆబ్లిక్స్. సైడ్ ఫ్యాట్ తగ్గుతాయి. బ్యాక్ మజిల్స్ బలోపేతానికి ఉపకరిస్తుంది. దీని కోసం కనీసం గంట సమయం వెచ్చిస్తే దాదాపు 100 కేలరీలు ఖర్చుఅవుతాయి. ఆరోగ్యానికి ‘గార్డ్’నింగ్... మొక్కలకు నీళ్ళు పోయడం, పాదులు తీయడం,నాటడం, పిచ్చిమొక్కల్ని తొలగించడం... వంటివన్నీ మన ఇంటి ముంగిటకు ఇంపైన శోభను, మన వంటికి ఆరోగ్యాన్ని తెచ్చిపెడతాయి.ఫోర్ఆర్మ్ మజిల్స్, ట్రైసప్, అప్పర్‌బాడీ మజిల్స్ చురుకవుతాయి..మొక్కలు నాటడంలో భాగంగా తవ్వడం వంటి పనుల కారణంగా గంటకు దాదాపు 250 కేలరీల ఖర్చుఅవుతాయట. ఉతుకు.. హుషారుకు.. మాసిన దుస్తులు ఉతకడంలో భాగంగా పిండడం వంటి పనులతో చేతులకు సంబంధించిన మజిల్స్, ఫోర్ ఆర్మ్ మజిల్స్, మోచేతుల నరాలు ఉత్తేజితమవుతాయి. జిమ్‌లో అయితే దీనికోసం రిస్ట్కర్ల్ వర్కవుట్ చేయిస్తారు. బట్టలుతకడం, వాటిని ఆరవేయడం, ఇస్త్రీ చేయడం... వగైరా పనులు జిమ్‌లో చేసే షోల్డర్ వీల్ ఎక్సర్సైజ్ తో సమానంగా లాభాలను అందిస్తాయి. అప్పర్బ్యాక్ ధృడమవుతుంది. ఇంటింతై... వ్యాయామమంతై.. అల్లికలు, కుట్లు వంటివాటివల్ల గంటకు దాదాపు 85 కేలరీలు, అంట్లుతోమడం, గిన్నెలు కడగడం వంటి పనుల వల్ల 110 నుంచి 160 కేలరీల దాకా ఖర్చుఅవుతాయి. మోటార్‌బైక్, కారు వంటి వ్యక్తిగత వాహనాలు కడగడం వంటి పనులతోనూ దేహానికి మంచి వ్యాయామం. కారు కడగడం వల్ల గంటకు దాదాపు 350 కేలరీలు ఖర్చుచేయవచ్చునట. దీర్ఘకాల ఆరోగ్య సమస్యలేవి లేనివాళ్లు, వ్యాయామ పరంగా ప్రత్యేకలక్ష్యాలు (ఉదాహరణకు ఒబెసిటీ, పొట్టతగ్గించుకోవడం కండలు పెంచడం వంటివి)లేనివాళ్ళు లాక్ డవున్ తర్వాత కూడా ఇంటి పనులు అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అయితే ఎక్కువ బరువులెత్తే పని చేసినపుడు కింద కూర్చుని ఎత్తాలి. లేని పక్షంలో బ్యాక్‌పెయిన్ వచ్చే ప్రమాదముంది. అలాగే అంట్లు తోమేటపుడు గ్లవ్స్ ఉపయోగించడం, తోమడం పూర్తయ్యాక గ్లిజరిన్, మాయిశ్చరైజర్ వంటివి వాడడం బూజులు దులిపేటపుడు కంట్లో దుమ్ము పడకుండా చూసుకోవడం, ఒకవేళ పడితే వెంటనే రోజ్‌వాటర్‌తో శుభ్రపరుచుకోవడం..వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. .ఒకే భంగిమలో ఉండి పనిచేసేపుడు తరచుగా విరామాలివ్వాలి. లేని పక్షంలో శారీరక సమన్వయం లోపించవచ్చు. -
ఉప్పు ద్రావణంతో కొవ్వు కరిగిస్తారు!
శరీరంలో కొవ్వు పెరిగిపోయిందా? కడుపు కట్టుకున్నా.. తెగ వ్యాయామం చేస్తున్నా కరగడం లేదా? ఇంక కొంత కాలం ఆగండి. ఎంచక్కా ఒకట్రెండు సూది మందులతోనే మీ కొవ్వు సగం తగ్గిపోతుంది. అదెలాగో తెలుసుకోవాలంటే హార్వర్డ్, మసాచూసెట్స్ జనరల్ హాస్పిటల్ శాస్త్రవేత్తల పరిశోధనల గురించి తెలుసుకోవాల్సిందే. నిజానికి ఈ పద్ధతి చాలా సింపుల్. గడ్డకట్టించి, ఉప్పు ద్రావణాన్ని కొవ్వు ఉన్న ప్రాంతంలోకి నేరుగా జొప్పించడమే మనం చేయాల్సిన పని. చల్లదనం కారణంగా శరీరంలోని కొవ్వుకణాలు స్పటికాల్లా మారిపోయి నాశనమైపోతాయి.కొన్నివారాల తరువాత చనిపోయిన కణాలను శరీరమే బయటకు తోసేస్తుంది. శరీరంలోని ఏ ప్రాంతంలో ఉన్నా.. ఎంత లోతులో ఉన్నా ఈ కొత్తపద్ధతి ద్వారా కొవ్వును కరిగించవచ్చు. కేవలం కొవ్వు కణాలపై మాత్రమే ప్రభావం చూపుతూ... మిగిలిన కణజాలానికి ఏమాత్రం హాని జరక్కపోవడం ఈ పద్ధతి తాలూకూ విశేషం. ఈ పద్ధతిని తాము పందులపై ప్రయోగించి చూశామని, ఎనిమిది వారాల్లో దాదాపు 55 శాతం కొవ్వు తగ్గిపోయిందని లిలిత్ గార్బియాన్ అనే శాస్త్రవేత్త తెలపారు. లిలిత్ గార్బియాన్ నేతత్వంలోని శాస్త్రవేత్తల బృందం గతంలోనూ కూల్స్కల్ప్టింగ్ పేరుతో కొవ్వును కరిగించే ఓ పద్ధతిని అభివద్ధి చేసింది. అయితే ఆ పద్ధతి అంతగా విజయవంతం కాలేదు. అయితే లిలిత్ బృందం అభివృద్ధి చేసిన రెండు పద్ధతులు కూడా పేరుకుపోయిన కొవ్వులను తగ్గించగలవేగానీ.. లివర్ పనితీరును ఏమీ మెరుగుపరచవు. పరిశోధన వివరాలు ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
కొవ్వులతోనూ మధుమేహం!
మధుమేహం ఎలా వస్తుంది? ఆ.. ఏముంది.. వేళాపాళ లేని ఆహార అలవాట్లు, వ్యాయామ లేమి, రక్తంలో చక్కెర మోతాదు పెరగడం. ఇవే కదా మనకు తెలిసిన కారణాలు. కానీ... చక్కెరతో నిమిత్తం లేకుండా కూడా క్లోమగ్రంథిలోని బీటా కణాలు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తాయని, తద్వారా నిరోధకత ఏర్పడి రక్తంలో గ్లూకోజు మోతాదు తగ్గకుండా టైప్ –2 మధుమేహం వస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించడంతో ప్రశ్న మళ్లీ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన ఒక పరిశోధన టైప్ –2 మధుమేహం వచ్చేందుకూ కొన్ని రకాల కొవ్వు కణాలూ కారణమేనన్న అంచనాను బలపరిచింది. ఊబకాయంతో ఉన్న, మధుమహాం అంచుల్లో ఉన్న కొన్ని ఎలుకలపై వీరు ప్రయోగం చేశారు. కొవ్వులు ఒక స్థాయి కంటే ఎక్కువైనప్పుడు సైక్లోఫిలిన్ డీ (సైఫ్డీ) బీటా కణాల్లోని మైటోకాండ్రియాలోకి ప్రొటాన్లను విడుదల చేస్తుందని... ఆ వెంటనే కణాలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయని ఈ ప్రయోగాల ద్వారా తెలిసింది. సైఫ్డీ ప్రొటీన్ లేని ఎలుకలను ఉపయోగించినప్పుడు ఇన్సులిన్ స్థిరంగా ఉన్నట్లు స్పష్టం కావడంతో మధుమేహానికి.. కొవ్వులకు మధ్య ఉన్న లింక్ స్పష్టమైంది. మనుషుల నుంచి సేకరించిన బీటా కణాలపై జరిపిన పరిశోధనలూ ఇదే రకమైన ఫలతాలిచ్చాయి. మరిన్ని పరిశోధనల చేయడం ద్వారా ఈ ఫలితాలను నిర్ధారించుకోవాల్సి ఉందని, తద్వారా మధుమేహానికి కొత్త కొత్త చికిత్స పద్ధతులు, మందులు అందుబాటులోకి వస్తాయని అంచనా. -
ఆమె ఆరోగ్యం
సాక్షి మహిళలను జాగృతం చేయడానికిమహిళల్లో ఉన్న శక్తిని సమాజానికే కాదు... వారికీ తెలిసేలా చేయడానికి ఎప్పుడూ ముందడుగు వేస్తూనే ఉంది. కాపాడుకోవడం... పరిరక్షించుకోవడం... సమాధాన పరచడం... పరామర్శించడంఇవి కాదు మహిళలకు కావల్సింది. వారిలో ఉన్న శక్తికి అద్దం పట్టాలి.‘నువ్వే శక్తి’ అని మహిళలకు సాక్షి గుర్తు చేస్తోంది.మహిళ అంటే మాకు గౌరవం... మాకు స్ఫూర్తి!మా అక్షరానికి శక్తి... జై స్త్రీ శక్తి!! ఆకుకూరలు... ఇందులో ఉండే మెగ్నీషియం, విటమిన్ కె, విటమిన్ సి, ఫైటో న్యూట్రియెంట్స్ వల్ల ఎముకలు దృఢంగా, బలంగా పెరుగుతాయి. తృణధాన్యాలు... బ్రౌన్ రైస్, కినోవా జీర్ణశక్తిని బలపరుస్తాయి. జీర్ణకోశం స్వచ్ఛంగా ఉంటే, మలబద్దకాన్ని, కోలన్ క్యాన్సర్‌ని నివారించుకోవచ్చు. నట్స్... శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. బాదం పప్పులలో ఎముకలను దృఢపరిచే గుణాలు ఉన్నాయి. పిస్తాలలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6లు ఎక్కువగా ఉన్నాయి. కోడిగుడ్లు... ఇందులో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఉల్లిపాయలు... ఉల్లిపాయలలో ఎముకలకు బలాన్ని కలిగించే శక్తి ఎక్కువ. రోజుకో ఉల్లిపాయ తినడం వల్ల ఎముకలలో రోజుకి ఐదు శాతం చొప్పున శక్తి సమకూరుతుంది. 50 సంవత్సరాలు దాటిన మహిళల మీద .జరిపిన పరీక్షలో తుంటి ఎముక విరగడం అనేది 20 శాతం తక్కువ కనిపిస్తోంది. పెరుగు... పెరుగు లేదా మజ్జిగను ఎక్కువగా తీసుకోవాలని ప్రాచీన కాలం నుంచి చెబుతున్నారు. ఇందులో ఉండే ప్రోబయాటిక్ బ్యాక్టీరియా... జీర్ణక్రియను సవ్యంగా సాగేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. టొమాటోలు... టొమాటోలు తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. పాలు... ఇందులో ఉండే క్యాల్షియం, పొటాషియం, విటమిన్ బి 12 వంటివి ఉంటాయి. ఇవి ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్, కాలన్ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి. అరటిపళ్లు... ఇందులో ఉంటే పొటాషియం, శరీర వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. మలబద్దకాన్ని దూరం చేస్తుంది. -
కేన్సర్ కణాలను కొవ్వుగా మార్చేస్తారు
కేన్సర్ మహమ్మారిపై పోరులో స్విట్జర్లాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. కేన్సర్ కణాలను నిరపాయకరమైన కొవ్వు కణాలుగా మార్చేందుకు వీరు ఒక వినూత్నమైన పద్ధతిని కనుక్కున్నారు. కేన్సర్ కణాలు శరీరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే విధానాన్నే ఆసరాగా చేసుకుని తాము ఈ కొత్త పద్ధతిని ఆవిష్కరించామని గెర్హార్డ్ క్రిస్టోఫొరీ అంటున్నారు. ఈ కణాలు కొన్నిసార్లు ఎపిథీలియల్ మెసన్కైమల్ ట్రాన్సిషన్ అనే ప్రక్రియకు గురవుతూంటాయని ఈ దశలో అవి మూలకణాల మాదిరిగా ఉంటాయని ఆయన వివరించారు. శరీరంలోని ఏ రకమైన కణంగానైనా మారగలిగే సత్తా మూలకణాలదన్నది తెలిసిందే. ఎలుకల్లోకి రొమ్ము కేన్సర్ కణాలను జొప్పించి తాము ప్రయోగాలు చేశామని.. మధుమేహానికి వాడే రోసిగ్లిటాజోన్, కేన్సర్ చికిత్సకు ఉపయోగించే ట్రామిటినిబ్లను ఆ ఎలుకలపై వాడినప్పుడు కేన్సర్ కణాలు కొన్ని కొవ్వు కణాలుగా మారుతున్నట్లు తాము గుర్తించామని... అంతేకాకుండా ఈ మందుల ప్రయోగం తరువాత కేన్సర్ కణాల విస్తరణ కూడా లేకుండా పోయిందని క్రిస్టోఫొరీ తెలిపారు. ఈ పద్ధతిలో వాడిన మందులు రెండింటికీ ఇప్పటికే అనుమతులు ఉండటం వల్ల మానవ ప్రయోగాలు త్వరలో మొదలవుతాయని... కీమోథెరపీతోపాటు ఈ కొత్త పద్ధతిని వాడటం ద్వారా కేన్సర్‌కు మెరుగైన చికిత్స కల్పించవచ్చునని వివరించారు. -
కొవ్వులతో భూమికి చల్లదనం!
లండన్: వంట వండేటప్పుడు విడుదలయ్యే కొవ్వు కణాలు వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి మేఘాలు ఏర్పడేందుకు తోడ్పడతాయని, దీంతో భూమి చల్లబడే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. వేపుళ్లు చేసే సమయంలో కొవ్వు పదార్థాలు వెలువడటంతో పాటు ఏరోసాల్ తుంపరల్లో సంక్లిష్ట త్రీడీ నిర్మాణాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. ఈ త్రీడీ నిర్మాణాలు ఏర్పడటం వల్ల మేఘాల ఏర్పాటును ప్రభావితం చేసే కొవ్వు కణాల జీవిత కాలం పెరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏరోసాల్ తుంపరలపై కొవ్వు కణాలు పొరలాగా ఏర్పడి మేఘాలు ఏర్పడే విధానాన్ని ప్రభావితం చేస్తాయని తమ పరిశోధనల్లో తెలిసిందని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌కు చెందిన క్రిస్టియన్ ఫ్రాంగ్ వివరించారు. తుంపరల లోపల ఈ కొవ్వు కణాలు ఏం చేస్తాయో గుర్తించడం ఇదే తొలిసారి అని తెలిపారు. ఈ కొవ్వు కణాలన్నీ క్రమపద్ధతిలో ఒక చోటుకు చేరి ఓ సిలిండర్ మాదిరిగా ఏర్పడి మేఘాలు ఏర్పడటంలో భాగమైన నీటిని పీల్చుకునే తత్వాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు ఓజోన్ రసాయనానికి ఈ కొవ్వు కణాలు నిరోధకతను కలిగి ఉంటాయని, దీంతో అవి ఎక్కువ కాలం మనగలుగుతాయని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమయ్యాయి. -
కొవ్వు కరిగించాలా...
ఊబకాయంతో పాటు మధుమేహానికి కూడా దాల్చిన చెక్క విరుగుడుగా పని చేస్తుందని యూనివర్శిటీ ఆఫ్ మిషిగన్ లైఫ్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దాల్చిన చెక్కలోని సినమాల్డీహైడ్ అనే పదార్థం రక్తంలోని గ్లూకోజ్‌ను తగ్గిస్తుందని ఇప్పటికే తెలిసినప్పటికీ కారణాలేమిటన్నది మాత్రం జున్ వూ నేతత్వంలోని శాస్త్రవేత్తల బందం నిర్ధారించింది. ఈ పదార్థం జీవక్రియలపై ప్రభావం చూపడం ద్వారా సినిమాల్డీహైడ్ ఊబకాయం, మధుమేహాలపై పనిచేస్తుందని జున్ తెలిపారు. వేర్వేరు వర్గాలు, వయసు, బాడీమాస్ ఇండెక్స్ ఉన్న వ్యక్తుల అడిపోసైట్స్ (కొవ్వులను నిల్వ చేసుకునే కణాలు) లపై తాము పరిశోధనలు జరిపామని సినిమాల్డీహైడ్ను ప్రయోగించినప్పుడు ఈకణాల్లోని వేర్వేరు జన్యువులు, ఎంజైమ్‌లు ఎక్కువగా పనిచేయడం మొదలైందని.. ఇవన్నీ శరీరంలోని లిపిడ్స్‌ను తగ్గించేవని తాము గుర్తించామని జున్ తెలిపారు. మన పూర్వీకులకు కొవ్వు పదార్థాలు పెద్దగా అందుబాటులో ఉండేవి కాదని.. ఆ పరిస్థితుల్లో అత్యవసర సమయాల్లో శరీరానికి కావల్సిన శక్తిని అందించేందుకు అడిపోసైట్స్ కొవ్వులను నిల్వ చేసుకునేవని.. పరిణామ క్రమంలో శరీరంలోకి చేరుతున్న అధిక కొవ్వులను ఇవి నిల్వ చేసుకుంటున్నాయని జున్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఊబకాయం సమస్య పరిష్కారానికి శరీరంలోని కణాలు స్వయంగా కొవ్వులను కరిగించేలా చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్న క్రమంలో జున్‌కు దాల్చిన చెక్క మంచి లక్షణాల గురించి తెలిసింది. దాల్చిన చెక్కను ఇప్పటికే అనేక రకాల ఆహారాల్లో వాడుతున్న నేపథ్యంలో మధుమేహులు, ఊబకాయులు ఈ ఆహారం ద్వారానే తమ సమస్యలను తగ్గించుకునే అవకాశముందని చెప్పారు. -
ఒకే ఒక్క సిట్టింగ్‌లో మీ శరీరాకృతి మార్చుకోండి!
అధిక బరువు తగ్గించుకోవడం, ఒంట్లో కొవ్వును తగ్గించుకోవడం రెండూ ఒకటే అనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఇది నిజం కాదు. బరువు తగ్గినప్పుడు మన శరీరంలో ఉన్న కొవ్వు కణాలు చిన్నవిగా మారతాయి. కానీ కణాల సంఖ్యమాత్రం అలాగే ఉంటుంది. మళ్లీ బరువు పెరగగానే ఆ కొవ్వు కణాలు తిరిగి పెద్దవైపోతాయి. క్రయోలైపాలసిస్... సర్జరీ లేకుండానే కొవ్వు తగ్గించే చికిత్స. ఎఫ్‌డిఎ ఆమోదం కూడా పొందింది. ఆహారంలో జాగ్రత్తలు, వ్యాయామం చేయడం ద్వారా పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది. క్రైలిపాలిసిస్ ఒంట్లోని కొవ్వు కణాలను తగ్గిస్తుంది. చర్మంపై ఎలాంటి ప్రభావం చూపని ఈ ప్రక్రియ వల్ల శరీరంలో ఉన్న అనవసరపు కొవ్వు తక్కువ సమయంలోనే పోతుంది. చక్కటి శరీరాకృతి కోసం.. ఈ విధానం వల్ల శరీరంలోని అనేక భాగాల్లో కొవ్వును తగ్గించవచ్చు. కేవలం మీకోసమే నిర్దేశించిన విధానంలో మీకు చికిత్స ఉంటుంది. కొన్ని వారాలు లేదా నెలల్లోనే చాలా సహజమైన పద్ధతుల్లో మీ శరీరంలోని కొవ్వు కణాలు తొలగించబడతాయి. ఇది పూర్తిగా నాన్ సర్జికల్ సర్జరీ అవసరం లేదు. చికిత్స అనంతరం వెంటనే మీరు మీ పనుల్లోకి వెళ్లొచ్చు. శరీరంలో అనవసరమైన కొవ్వు ఉన్నవారికోసమే ప్రత్యేకంగా రూపొందించిన పద్ధతి ఇది. ఊబకాయంతో బాధపడేవారికి బరువు తగ్గించే ప్రక్రియ కాదు... ఇది లైపోసెక్షన్‌కు ప్రత్యామ్నాయం. ఖర్చు ఎంత? మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు, మీకు అవసరమైన సెషన్లు, మీ లక్ష్యం ఏంటి అనేదానిపై ఆధారపడి ధర ఉంటుంది. మీ బడ్జెట్లో, మీ లక్ష్యాలకు అనుగుణంగా మీ కోసమే తయారు చేసిన చికిత్సా విధానం ఇది. చికిత్స సమయం ఆ చికిత్సా విధానాన్ని రూపొందించడంలో మీ క్రైలిపాలిసిస్ ఫిజీషియన్ మీకు సాయం చేస్తాడు. మీరు ఎక్కడెక్కడ కొవ్వు తగ్గించుకోవాలనుకుంటున్నారనే దానిపై మీ సెషన్ సమయం ఆధారపడి ఉంటుంది. మీకు అదన పు సెషన్స్‌ను మీ ఫిజీషియన్‌తో కలిసి నిర్ణయించుకోవచ్చు. ఇది ఎంతవరకు సురక్షితం శస్త్రచికిత్స అవసరం లేని కొవ్వు తగ్గించే ప్రక్రియగా క్రైలిపాలిసిస్ సురక్షితమైనది. ప్రపంచవ్యాప్తంగా ఒక మిలియన్ ప్రజలు ఈ చికిత్స ద్వారా తాము అనుకున్నది సాధించగలిగారు. నో సైడ్ ఎఫెక్ట్స్ చికిత్స సమయంలో లాగుతున్నట్టుగా. పట్టేసినట్టుగా, గిల్లినట్టుగా లేదా అసౌకర్యంగా ఉంటుంది. అయితే ఇది తాత్కాలికమే. ఫలితం చికిత్స అనంతరం కొవ్వు కణాలు ఒకసారి క్రిస్టలైజ్డ్ అయ్యాక అవి చనిపోయి శరీరంలోంచి తొలగి పోతాయి. చికిత్స తరువాత మూడు వారాల్లోనే మంచి ఫలితాన్ని చూడవచ్చు. రెండు నెలల తరువాత పూర్తి మార్పు మీకు కనబడుతుంది.