మధుమేహం ఎలా వస్తుంది? ఆ.. ఏముంది.. వేళాపాళ లేని ఆహార అలవాట్లు, వ్యాయామ లేమి, రక్తంలో చక్కెర మోతాదు పెరగడం. ఇవే కదా మనకు తెలిసిన కారణాలు. కానీ... చక్కెరతో నిమిత్తం లేకుండా కూడా క్లోమగ్రంథిలోని బీటా కణాలు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తాయని, తద్వారా నిరోధకత ఏర్పడి రక్తంలో గ్లూకోజు మోతాదు తగ్గకుండా టైప్ –2 మధుమేహం వస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించడంతో ప్రశ్న మళ్లీ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన ఒక పరిశోధన టైప్ –2 మధుమేహం వచ్చేందుకూ కొన్ని రకాల కొవ్వు కణాలూ కారణమేనన్న అంచనాను బలపరిచింది. ఊబకాయంతో ఉన్న, మధుమహాం అంచుల్లో ఉన్న కొన్ని ఎలుకలపై వీరు ప్రయోగం చేశారు.
కొవ్వులు ఒక స్థాయి కంటే ఎక్కువైనప్పుడు సైక్లోఫిలిన్ డీ (సైఫ్‌డీ) బీటా కణాల్లోని మైటోకాండ్రియాలోకి ప్రొటాన్లను విడుదల చేస్తుందని... ఆ వెంటనే కణాలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయని ఈ ప్రయోగాల ద్వారా తెలిసింది. సైఫ్‌డీ ప్రొటీన్ లేని ఎలుకలను ఉపయోగించినప్పుడు ఇన్సులిన్ స్థిరంగా ఉన్నట్లు స్పష్టం కావడంతో మధుమేహానికి.. కొవ్వులకు మధ్య ఉన్న లింక్ స్పష్టమైంది. మనుషుల నుంచి సేకరించిన బీటా కణాలపై జరిపిన పరిశోధనలూ ఇదే రకమైన ఫలతాలిచ్చాయి. మరిన్ని పరిశోధనల చేయడం ద్వారా ఈ ఫలితాలను నిర్ధారించుకోవాల్సి ఉందని, తద్వారా మధుమేహానికి కొత్త కొత్త చికిత్స పద్ధతులు, మందులు అందుబాటులోకి వస్తాయని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment