కేన్సర్‌పై యుద్ధంలో మరో ముందడుగు | Another step in the war on cancer | Sakshi
Sakshi News home page

కేన్సర్‌పై యుద్ధంలో మరో ముందడుగు

Published Wed, Jan 9 2019 12:13 AM | Last Updated on Wed, Jan 9 2019 12:13 AM

Another step in the war on cancer - Sakshi

కేన్సర్‌ వ్యాధి చాలా తెలివైందంటారు. శరీరంలో కేన్సర్‌ కణాలు మొట్టమొదట చేసే పని రోగ నిరోధక వ్యవస్థను హైజాక్‌ చేయడం. ఫలితంగా ఈ వ్యవస్థ కాస్తా కేన్సర్‌ కణాలను కూడా తనవిగానే భావిస్తుంది. ఎంటువంటి దాడులూ చేయదు. దీనివల్ల వ్యాధి కాస్తా ముదిరిపోతుంది. అయితే కాలిఫోర్నియా, రష్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు ఈ సమస్యకు ఓ చక్కటి పరిష్కారం లభించింది. శరీరంలో రోగకారక వైరస్‌లు, బ్యాక్టీరియాలపై నిత్యం నిఘా పెట్టే కణాల్లో మైలాయిడ్‌  కణాలు రెండు రకాలు. ఒకరకమైన ఎం1 మాక్రోఫేజ్‌ కేన్సర్‌ కణితి పెరుగుదలను అడ్డుకుంటూంటే.. రెండోది తోడ్పడుతూ ఉంటుంది.

ఈ క్రమంలో ఈ రెండు రకాల కణాలూ రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన కణాలను నాశనం చేస్తూంటాయి. రష్, కాలిఫోరియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ మైలాయిడ్‌ కణాలు ఎందుకు అలా రెండుగా విడిపోతాయో గుర్తించారు. సీడీ11బీ అనే ఒక ప్రొటీన్‌ ఉత్పత్తి ఎక్కువైతే ఎం1 రకం కణాలు.. తక్కువైతే ఎం2 రకానివి ఎక్కువవుతాయి. కణితి కణాలు ఈ ప్రొటీన్‌ను నియంత్రిస్తూ ఎం2 కణాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యేందుకు కారణమవుతూంటాయి. ఈ ప్రొటీన్‌ను మరింత సమర్థంగా నియంత్రించగలగడం.. తద్వారా ఎం1 కణాలు ఎక్కువయ్యేలా చేస్తే కేన్సర్‌కు మెరుగైన చికిత్స లభిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో ఈ ఫలితాలు కనిపించాయని వినీత్‌ గుప్తా అనే శాస్త్రవేత్త తెలిపార 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement