viruses
-
మానవుల వల్లే వైరస్ల విజృంభణ!
వాతావరణ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రక్రియ వేగవంతమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూండటం, మంచినీటి లభ్యత తగ్గిపోతూండటం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు మనుషులతోపాటు జంతువులూ కదులుతూండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్ఠంగా లెక్క కట్టినా కనీసం మూడు లక్షల వైరస్లు మొట్టమొదటిసారి కొత్త జంతు అతిథిలోకి చేరతాయని అంచనా. క్షీరదాలు, పక్షుల వలస మార్గాలను కృత్రిమ మేధ సాయంతో అంచనా కట్టి... వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ అధికం అవుతాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవటం, గట్టి ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం ఇందుకు పరిష్కారం.దేశంలో మళ్లీ ఇప్పుడు వైరస్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఒక పక్క ప్యారిస్‌లో భారీ మహోత్సవాల మధ్య ఒలింపిక్స్ జరుగుతుండగా... ఇంకోపక్క దేశంలో నిఫా, చాందీపుర వైరస్లు కూడా ఒలింపిక్స్ మాదిరిగానే వార్తల్లోకి ఎక్కుతున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవిడ్ కారణంగా ఇప్పటికీ మరణాలు కొనసాగుతున్నట్లు మనల్ని హెచ్చరి స్తుండటం గమనార్హం. వీటన్నింటినీ పక్కనపెట్టినా, సాధారణ జలుబు రూపంలో బోలెడన్ని వైరస్ రకాలు తెరిపి లేకుండా మనిషిని జబ్బున పడేస్తూనే ఉన్నాయి. అనేక వైరస్ వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సోకు తున్నవే. అదేదో జంతువులు మనపై కక్షకట్టి చేస్తున్న పనేమీ కాదు. మానవులు ఆక్రమించుకున్న తమ ఆవాసాలను మళ్లీ సంపాదించు కునే పనిలో ఉన్నాయనీ కాదు. అడవిలో బతికే జంతుజాలాన్ని మనం మన ఆవాసాల్లోకి చేర్చుకున్నాం కాబట్టి! అలాగే మన మధ్యలో ఉన్న జంతువులు అటవీ ప్రాంతాల్లోకి చేరేందుకు తగిన ‘మార్గం’ వేశాము కాబట్టి! అటవీ ప్రాంతాల విచ్చలవిడి విధ్వంసం, పాడి పశువులను పెద్ద ఎత్తున పెంచుతూండటం, రకరకాల పెంపుడు జంతువుల ఎగు మతి, దిగుమతులు, దేశాల మధ్య మనిషి విపరీతంగా తిరిగేస్తూండటం వంటివన్నీ వైరస్లు కూడా మనుషుల్లోకి జొరబడేందుకు అవ కాశాలు పెంచుతున్నాయి. పెరుగుతున్న వేడి... తరుగుతున్న నీరువాతావరణ సంక్షోభం కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రక్రియ వేగవంతమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూండటం, మంచినీటి లభ్యత తగ్గిపోతూండటం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు మనుషు లతోపాటు జంతువులూ కదులుతూండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. వైరస్లు స్వేచ్ఛగా ఒక జంతువు నుంచి ఇంకో దాంట్లోకి చేరేందుకు ఈ పరిస్థితులు వీలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే సురక్షితంగా ఉండేందుకు లేదా తీవ్రస్థాయి అనారోగ్యం కలిగించేందుకు వీలు కల్పించే కొత్త కొత్త జంతు అతిథులు వైరస్‌లకు లభిస్తున్నాయి. సైన్ ్స రచయిత ఎడ్ యంగ్ ఇటీవల ‘ది అట్లాంటిక్’లో రాస్తూ... మనిషి ‘ప్యాండెమిసీన్’ యుగాన్ని సృష్టించుకున్నాడని ప్రస్తుత పరిస్థితిని అభివర్ణించారు. భూమిపై మనిషికి ముందు ఉన్న యుగాన్ని హాలోసీన్ అని, మనిషి పుట్టుక తరువాతి యుగాన్ని ఆంత్రో పసీన్ అని పిలిస్తే... ప్రస్తుత మహమ్మారుల యుగాన్ని ప్యాండెమిసీన్ (పాండమిక్ = మహమ్మారి) అని పిలిచాడన్నమాట. జార్జ్‌టౌన్ యూనివర్సిటీకి చెందిన గ్లోబల్ ఛేంజ్ జీవశాస్త్రవేత్త కాలిన్ కార్ల్సన్ ఈ మధ్యే ఈ ప్యాండెమిసీన్ కు సంబంధించి భవిష్యత్తు దర్శనం చేయించారు. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఎలాంటి వైరస్లు మనుషులకు సోకే అవకాశముందో అంచనా కట్టారు. ‘నేచర్’లో ప్రచురితమైన ఈ అంచనా ప్రకారం... మనిషిని ముట్టడించేందుకు అవకాశమున్న వైరస్ల సంఖ్య ఏకంగా పదివేల రకాలు! ప్రస్తుతం వీటిల్లో అత్యధికం జంతువుల్లో మాత్రమే తిరు గుతూ ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన హద్దులు చెరిగిపోతూండటంతో అవి ఇతర జంతువులకు అంటే మనుషులకు కూడా సోకే ప్రమాదం పెరిగింది. వాతావరణ సంక్షోభం కాస్తా జంతువులు, మనుషులు కొత్త ప్రాంతాలకు వలస వెళ్లేలా చేస్తూండటం గోరుచుట్టుపై రోకటిపోటు అన్న చందం అయిందన్నమాట. ఇట్లాంటి పరిస్థితులు వైరస్‌లకు జాతర లాంటిది అంటే అతిశయోక్తి కాదు. అసలు పరిచయమే లేని బోలెడన్ని వైరస్లు ఒక దగ్గర చేరితే ఎన్ని కొత్త స్నేహాలు, బంధుత్వాలు కలుస్తాయో ఊహించుకోవచ్చు.వినాశకర మార్పులువేర్వేరు వాతావరణ, భూ వినియోగ మార్పు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కార్ల్సన్ వేసిన అంచనాల ప్రకారం 2070 నాటికి కనీసం 3,139 క్షీరద జాతులు (పాలిచ్చి పెంచే జంతువులు) సహజ ఆవాసాలకు దూరంగా వలస వెళతాయి. ఈ మార్పు కూడా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని ఎతై ్తన, జీవవైవిధ్య భరిత, జనసాంద్రత అధికంగా ఉన్న చోట్ల జరుగుతుంది. దీనివల్ల జీవజాతుల మధ్య వైరస్ల సంచారం నాలుగు వేల రెట్లు ఎక్కువ అవుతుందని వీరు లెక్క కట్టారు. ఒకప్పుడు పశ్చిమ ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైన ఎబోలా వైరస్ ఇప్పుడు ఖండమంతా విస్తరించింది. అలాగే దక్షిణాసియా లోనూ మునుపు నిర్ధారించిన ప్రాంతాలను దాటుకుని వైరస్లు మను షులకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్ఠంగా లెక్క కట్టినా కనీసం మూడు లక్షల వైరస్లు మొట్టమొదటిసారి కొత్త జంతు అతిథిలోకి చేరతాయని కార్ల్సన్ బృందం అంచనా వేస్తోంది. వీటిల్లో 15,000 వరకూ క్షీరదాలు ఉంటాయి. వాస్తవానికి ఈ మార్పిడి ఇప్పటికే మొదలైందని కార్ల్సన్ హెచ్చరిస్తున్నారు. 2100 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీ సెల్సియస్ వరకూ పెరగవచ్చునని వాతావరణ శాస్త్రవేత్తలు ప్యారిస్ ఒప్పందంలో చెప్పిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరక ముందే పరిస్థితి ఇలా ఉంటే ఇక చేరితే ఇంకెలా ఉంటుందో ఊహించడం కష్టమే. కనిపించేది కొంతే... పొంచివున్నది ఎంతో!కార్ల్సన్ బృందం చేపట్టిన ఈ అధ్యయనం పేరు ‘ఐస్‌బర్గ్ స్టడీ’. అంటే పైకి కనిపించే భాగం మాత్రమే. కనిపించనిది ఇంకా చాలానే ఉందన్నమాట. ప్రస్తుతం ఎక్కువ అవుతున్న జూనోటిక్ వ్యాధులు రాగల ప్రమాదాలతో పోలిస్తే చిన్న భాగం మాత్రమేనని అర్థమవుతుంది. క్షీరదాల్లో గబ్బిలాలు జూనోటిక్ వైరస్ల విజృంభణలో ముందు వరసలో ఉన్నాయి. సార్స్ కోవ్–2 కూడా వూహాన్ ప్రాంతంలోని గుహల్లో ఉన్న గబ్బిలాల నుంచి మనుషులకు సోకిందే. ఎక్కువ దూరాలు ప్రయాణించగల సామర్థ్యం వల్ల ఈ గబ్బిలాలు వాతావరణ మార్పులకు వేగంగా స్పందిస్తాయి. వందల కిలోమీటర్ల దూరాన్ని దాటేస్తాయి. తమతోపాటు వైరస్‌లను కూడా మోసుకొస్తాయి.పండ్లను ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి ఈ వైరస్ జాడలు పండ్ల నుంచి మనకూ సోకుతాయన్నమాట. నిఫా వైరస్ ప్రస్థానం కూడా దాదాపుగా ఇలాంటిదే. ఆగ్నేయాసియా ప్రాంతంలో గబ్బిలాల జీవ వైవిధ్యం చాలా ఎక్కువ. ఫలితంగా ఈ ప్రాంతం నుంచి సరికొత్త వ్యాధులు పుట్టుకొచ్చే, వ్యాప్తి చెందే అవకాశం కూడా ఎక్కువే. అయితే జలచరాలు, పక్షుల ద్వారా కూడా వైరస్లు మనిషికి సోక వచ్చు. ఇన్ ఫ్లుయెంజా వైరస్ రకాలకు పక్షులు ఆతిథ్యమిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వాతావరణ మార్పులు అనేవి వ్యవస్థ మొత్తాన్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల సమస్యను మనం మరింత తీవ్రతతో పరిష్కరించాల్సిన అవసరాన్ని ఈ ఐస్‌బర్గ్ స్టడీ స్పష్టం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదించిన వన్ హెల్త్ (మనుషులతోపాటు పరిసరాల్లోని జంతువులపై కూడా పర్యవేక్షణ) మైక్రోబియల్ నిఘా వ్యవస్థ, వేర్వేరు ప్రాంతాలు, జీవజాతుల సమాచారాన్ని క్రోడీకరించడం వంటివి ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. క్షీరదాలు, పక్షుల వలస మార్గాలను కృత్రిమ మేధ సాయంతో అంచనా కట్టి... బ్యాక్టీరియా, వైరస్ల వంటి వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ ఎక్కువ అవుతాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తు అవసరాలను సరిగ్గా అంచనా కట్టే ఆరోగ్య వ్యవస్థల ఏర్పాటూ తప్పనిసరి. అప్పుడే కొత్త వ్యాధుల ఆగమనం, వాటిని అడ్డుకోవడం, సమర్థంగా తిప్పికొట్టడం సాధ్య మవుతుంది. కె. శ్రీనాథ్ రెడ్డి వ్యాసకర్త ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ మాజీ అధ్యక్షులు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
వేల ఏళ్ల పురాతనమైన వినాశకర వైరస్ల విజృంభణ!
వాషింగ్టన్: రాజులు, సంపన్నులు దాచిన గుప్తనిధులు, లంకెబిందెలు వందల ఏళ్లకు ఇంకెవరికో దొరికితే సంబరమే. కానీ అందుకు భిన్నంగా జరిగితే?. అలాంటి ఉపద్రవమే ముంచుకు రావొచ్చని జీవశాస్త్రవేత్తలు మానవాళిని హెచ్చరిస్తున్నారు. 48,500 సంవత్సరాలపాటు మంచుమయ ఆర్కిటిక్ ఖండంలో మంచు ఫలకాల కింద కూరుకుపోయిన వినాశకర వైరస్లు పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా మంచు కరిగి బయటికొస్తున్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఆ వైరస్‌లకు ఇప్పటికీ ఇంకొక జీవికి సోకే సాంక్రమణ శక్తులు ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో యకూచి అలాస్ సరస్సులో తవి్వతీసిన నమూనాల్లో పురాతన వ్యాధికారక వైరస్‌లను ఇటీవల జీవశాస్త్రవేత్తల బృందం కనుగొంది. వాటిలో కొన్ని రకాలకు జాంబీ(దెయ్యం)వైరస్‌లుగా వర్గీకరించారు. నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ ఇంకో జీవికి సంక్రమించే సత్తా ఇంకా వీటికి ఉందో లేదో పరీక్షిస్తున్నట్లు ఎయిక్స్–మార్సెల్లీ విశ్వవిద్యాలయంలో జన్యు శాస్త్రవేత్త జీన్ మైఖేల్ క్లావెరీ చెప్పారు. ‘‘ఆర్కిటిక్ ఖండం ఉపరితలంలో 20 శాతం భూభాగం శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉంది. అత్యంత చల్లని, ఆక్సిజన్‌రహిత, ఘనీభవించిన ఈ ప్రదేశంలో పెరుగును పడేస్తే అలా పాడవ్వకుండా అలాగే ఉంటుంది. ఒక 50వేల సంవత్సరాల తర్వాత సైతం తినేయొచ్చు’ అని క్లావెరీ అన్నారు. నెదర్లాండ్స్‌లోని రోటెర్డామ్ ఎరాస్మస్ మెడికల్ సెంటర్లోని వైరాలజీ శాస్త్రవేత్త మేరియాన్ కూప్‌మెన్స్ మరికొన్ని వివరాలు చెప్పారు. ‘‘ ఈ మంచు ఫలకాల కింది వైరస్లు బయటికొచ్చి వ్యాప్తి చెందితే ఎలాంటి రోగాలొస్తాయో ఇప్పుడే చెప్పలేం. అయితే 2014లో సైబీరియాలో మేం ఇదే తరహా వైరస్‌లను పరీక్షించగా వాటికి ఏకకణ జీవులకు సోకే సామర్థ్యం ఉందని తేలింది. 2015లోనూ ఇదే తరహా పరీక్షలు చేశాం. ల్యాబ్‌లో అభివృద్దిచేసిన జీవులకూ ఈ వైరస్లు సోకాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో మానవసంచారం పెరగనంతకాలం వీటితో ప్రమాదం ఏమీ లేదు. శతాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న పురాతన పొలియో వ్యాధికారక వైరస్‌లకు ఇప్పటికీ ఆ సంక్రమణ శక్తి ఉండొచ్చు. మనుషుల రాకపోకలతో అంటువ్యాధులను వ్యాపింపజేసే వైరస్లు ఆర్కిటిక్ ప్రాంతం దాకా వ్యాపిస్తే అవి, ఇవీ అన్ని కలసి కొత్తరకం ఊహించని వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాం’’ అని వేరియాన్ కూప్‌మెన్స్ విశ్లేíÙంచారు. -
Antimicrobial Resistance: యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్‌తో ముప్పు
ఆక్స్ఫర్డ్(యూకే): కంటికి కనిపించని సూక్ష్మమైన బ్యాక్టీరియా, వైరస్లు, పారాసైట్లు, ఫంగస్ వంటివి మనిషి శరీరం లోపల, బయట, చుట్టూ ఉంటాయి. వీటిని మైక్రోబ్స్ అని పిలుస్తుంటారు. మన నిత్య జీవితంలో ఇవన్నీ ఒక భాగమే. కొన్ని రకాల జీవ క్రియలకు మైక్రోబ్స్ అవసరం. జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి, రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి, ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకోవడానికి బ్యాక్టీరియా, వైరస్లు తోడ్పడుతుంటాయి. వ్యవసాయం, పరిశ్రమల్లోనూ వీటి ప్రాధాన్యం ఎక్కువే. అయితే, ఈ మైక్రోబ్స్ కేవలం మేలు చేయడమే కాదు, కొన్ని సందర్భాల్లో కీడు చేస్తుంటాయి. అనారోగ్యం కలిగిస్తుంటాయి. మనుషులతోపాటు జంతువులు, మొక్కలకు హాని కలిగిస్తాయి. అందుకే యాంటీ మైక్రోబియల్ టీకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇవి మైక్రోబ్స్‌ను అంతం చేయడం లేదా వాటిని వ్యాప్తిని తగ్గించడం చేస్తుంటాయి. కాలానుగుణంగా మైక్రోబ్స్ ఔషధ నిరోధక శక్తిని పెంచుకుంటాయి. అంటే టీకాలను లొంగకుండా తయారవుతాయి. అంతిమంగా ‘సూపర్‌బగ్స్’గా మారుతాయి. అప్పుడు టీకాలు, ఔషధాలు ప్రయోగించిన ఫలితం ఉండదు. ఈ పరిణామాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) అంటారు. ఈ ఏఎంఆర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా 50 లక్షల మంది మరణిస్తున్నారని తాజాగా దక్షిణాఫ్రికా, యూకేలో జరిగిన అధ్యయనంలో వెల్లడయ్యింది. హెచ్ఐవీ/ఎయిర్స్, మలేరియా సంబంధిత మరణాల కంటే ఇవి చాలా అధికం. ఏఎంఆర్‌తో ఏటా మృత్యువాత పడే వారి సంఖ్య 2050 నాటికి ఏకంగా కోటికి చేరుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే క్యాన్సర్ సంబంధిత మరణాలను కూడా త్వరలో ఏఎంఆర్ మరణాలు అధిగమిస్తాయని అంటున్నారు. ► ప్రపంచవ్యాప్తంగా యాంటీబయోటిక్స్ వాడకం మితిమీరుతోంది. ► 2000 నుంచి 2015 మధ్య ఇది 65 శాతం పెరిగిపోయిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ► మొత్తం యాంటీ మైక్రోబియల్స్ 73 శాతం ఔషధాలను ఆహారం కోసం పెంచే జంతువులపైనే ఉపయోగిస్తున్నట్లు తేలింది. ► ఇలాంటి జంతువులను భుజిస్తే మనుషుల్లోనూ మైక్రోబ్స్ బలోపేతం అవుతున్నాయని, ఔషధాలకు లొంగని స్థితికి చేరుకుంటున్నాయని నిపుణులు గుర్తించారు. ► యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది కేవలం కొన్ని దేశాల సమస్య కాదని, ఇది ప్రపంచ సమస్య అని నిపుణులు చెబుతున్నారు. ► దీనిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యాంటీబయోటిక్స్‌పై అధారపడడాన్ని తగ్గించుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని పేర్కొంటున్నారు. -
వైరస్‌లను గుర్తించే స్మార్ట్ వాచ్
‘కోవిడ్’ మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వైరస్ పేరు చెబితేనే జనాలకు వెన్నులో వణుకు మొదలయ్యే పరిస్థితి దాపురించింది. వైరస్ల నిర్మూలన కోసం శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం కూడా చేశారు. ‘కోవిడ్’ తర్వాత వైరస్ల ఆచూకీని కనిపెట్టే సాంకేతికత కూడా అభివృద్ధి చెందింది. తాజాగా వైరస్ల జాడ గుర్తించగలిగే ‘విక్లోన్’ అనే ఈ స్మార్ట్‌వాచ్ అందుబాటులోకి వచ్చింది. టైమ్ చూపించడం సహా మిగిలిన పనులన్నీ ఇది ఇతర స్మార్ట్‌వాచీల మాదిరిగానే చేయడమే కాకుండా, చుట్టుపక్కల గాలిలో వైరస్లు ఉంటే, వెంటనే అప్రమత్తం చేస్తుంది. గాలిలోని సూక్ష్మకణాలను ఇది లోపలికి పీల్చుకుంటుంది. ఇందులో అమర్చిన అధునాతన సాంకేతికత ద్వారా ప్రమాదకరమైన బ్యాక్టీరియా కణాలు, వైరస్ కణాలు ఉన్నట్లయితే, వాటిని వెంటనే గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘డిజైనర్ డాట్’ వైరస్‌ను గుర్తించే ఈ స్మార్ట్‌వాచీని ‘విక్లోన్’ పేరుతో రూపొందించింది. -
కరోనా తరహా కొత్త మహమ్మారుల జాబితా తయారీ!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా సమీప భవిష్యత్తులో కరోనా తరహా మహమ్మారులకు కారణం కాగల వైరస్‌లను గుర్తించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రంగంలోకి దిగింది. మనకింకా ఆనుపానులు తెలియని డిసీజ్ ఎక్స్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉంది. ప్రస్తుత జాబితాలో దానితో పాటు కొవిడ్–19, ఎబోలా, మార్బర్గ్, లాసా ఫీవర్, మిడిలీస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (ఎంఈఆర్ఎస్), నిఫా, సార్స్, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, జికా వైరస్ తదితరాలున్నాయి. పరిశోధనలో తెరపైకి వచ్చే కొత్త వైరస్‌లతో జాబితాను సవరించనున్నారు. ‘‘ఇందుకోసం పలు బ్యాక్టీరియా కారకాలపై నిశితంగా దృష్టి పెట్టాం. వీటిలో డిసీజ్ ఎక్స్ అత్యంత ప్రమాదకరమైన అంతర్జాతీయ అంటువ్యాధిగా మారే ఆస్కారముంది’’ అని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. 300 మందికి పైగా శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో తలమునకలుగా ఉన్నారు. 25కు పైగా వైరస్, బ్యాక్టీరియా కుటుంబాలపై పరిశోధనలు చేయనున్నారు. ఇలాంటి జాబితాను తొలిసారిగా 2017లో డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసింది. దాన్ని 2018లో సవరించారు. భావి మహమ్మారిని ముందుగానే గుర్తించి దీటుగా ఎదుర్కొనేందుకు రాబోయే జాబితా కరదీపిక కాగలదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. ఈ జాబితాను 2023 మార్చిలోగా విడుదల చేయొచ్చని భావిస్తున్నారు. ఇదీ చదవండి: China Sheep Walking Video: చైనాలో గొర్రెల వింత ప్రవర్తన.. ఎట్టకేలకు వీడిన మిస్టరీ! -
షాకింగ్ రిపోర్ట్: కరోనాను మించిన వైరస్ తయారీలో పాక్-చైనా!
ఇస్లామాబాద్: ప్రాణాంతక కోవిడ్-19 వైరస్ యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ చైనాలోని వ్యూహాన్ ల్యాబ్‌లో అభివృద్ధి చేసినట్లు మొదట్లో వార్తలు వచ్చినా.. అందుకు తగిన ఆధారాలు లభించలేదు. అయితే, కరోనాను మించిన ప్రాణాంతక వైరస్‌ను పాకిస్థాన్-చైనాలు కలిసి సీక్రెట్‌గా సిద్ధం చేస్తున్నాయని ఓ నివేదిక షాకింగ్ విషయాలు వెల్లడించింది. పాకిస్థాన్‌లోని రావల్పిండి పరిశోధన ల్యాబ్‌లో సీక్రెట్‌గా ఈ ప్రాణాంతక వైరస్‌ను ఇరుదేశాల భాగస్వామ్యంతో అభవృద్ధి చేస్తున్నట్లు సంచలన విషయాలు వెల్లడించింది. ఈ మేరకు ‘జియోపాలిటిక్’ను సూచిస్తూ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కథనం వెలువరించింది. ఈ ప్రత్యేక ప్రాజెక్టును వుహాన్ ఇన్స్టిట్యూట్, డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్(డీఎస్‌టీఓ)లు సంయుక్తంగా చేపడుతున్నట్లు పేర్కొంది. ఈ డీఎస్‌టీఓను పాకిస్థాన్ ఆర్మీ నిర్వహిస్తోంది. అయితే, ప్రాణాంతక వైరస్‌ను రూపొందించేందుకు స్పెషల్ ప్రాజెక్టును చేపట్టారన్న నివేదకలను 2020లోనే తిరస్కరించింది పాకిస్థాన్. మరోవైపు.. పాకిస్థాన్ ల్యాబ్ బయోసెఫ్టీ లెవల్-3కి సంబంధించి ఎలాంటి రహస్య ప్రాజెక్టులు లేవని పాక్ విదేశాంగ శాఖ తెలిపినట్లు జియోపాలిటిక్ తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదికలో పేర్కొన్న పరిశోధన కేంద్రం రావల్పిండిలోని చక్లాలా కంటోన్మెంట్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఉన్నాయని, దీనికి 2 స్టార్ జనరల్ అధ్యక్షత వహిస్తున్నట్లు నివేదిక తెలిపింది. మరోవైపు.. కరోనా మహమ్మారులను మించిన ప్రాణాంతక వైరస్‌లను రూపొందించటంలో చైనా నిమగ్నమైనట్లు పలు మీడియా కథనాలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ వస్తోంది చైనా. కానీ, వూహాన్ ల్యాబ్‌పై చాలా దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కరోనా వైరస్‌ను సైతం వూహాన్ ల్యాబ్‌లోనే అభివృద్ది చేసి ఉంటారని పేర్కొన్నాయి. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 10సార్లు ఎమ్మెల్యే, కీలక నేత రాజీనామా -
Virus spillover: తర్వాతి వైరస్ మహమ్మారి రాక...హిమానీ నదాల నుంచే!
లండన్: వాతావరణ మార్పులు ప్రపంచమంతటా కనీవినీ ఎరగని ఉత్పాతాలకు దారి తీస్తున్న వైనం కళ్లముందే కన్పిస్తోంది. కొన్ని దేశాల్లో కరువు, మరికొన్ని దేశాల్లో ఎన్నడూ చూడనంతటి వరద విల యం సృష్టిస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు, వాతావరణ మార్పుల దుష్ప్రభావం మరో తీవ్ర ప్రమాదానికి కూడా దారితీసే ఆస్కారం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి సగటు ఉష్ణోగ్రత స్థాయి శరవేగంగా పెరుగుతుండటంతో హిమాలయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమానీ నదాలన్నీ అంతే వేగంగా కరిగిపోతుండటం తెలిసిందే. ‘‘ఈ హిమానీ నదాల గర్భంలో బహుశా మనకిప్పటివరకూ తెలియని వైరస్‌లెన్నో దాగున్నాయి. హిమానీ నదాల కరుగుదల వేగం ఇలాగే కొనసాగితే భూమిపై విరుచుకుపడబోయే తర్వాతి వైరస్ మహమ్మారి వచ్చేది గబ్బిలాల నుంచో, పక్షుల నుంచో కాక.. నదాల గర్భం నుంచే అది పుట్టుకురావచ్చు’’ అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలా వచ్చే వైరస్లు వన్యప్రాణులకు, అక్కణ్నుంచి మనుషుల్లో ప్రబలుతాయని అంచనా వేస్తున్నారు. దీన్ని వైరస్ స్పిలోవర్గా పిలుస్తున్నారు. ఇందుకోసం ఆర్కిటిక్‌లోని మంచినీటి సరస్సు లేక్ హాజెన్ తాలూకు మన్ను, మడ్డి తదితరాలను శాస్త్రవేత్తల బృందం విశ్లేషించింది. అవశేషాల తాలూకు ఆర్ఎన్ఏ, డీఎన్ఏ నమూనాలను వైరస్‌లతో జతపరిచి చూశారు. హిమానీ నదీ గర్భాలు బయటికి తేలే పక్షంలో, అక్కడి కళేబరాల నుంచి తెలియని తరహా వైరస్లు వచ్చి పడే ప్రమాదముందని తేల్చారు. అధ్యయన ఫలితాలను రాయల్ సొసైటీ జర్నల్‌లో ప్రచురించారు. -
కరోనా అప్డేట్: కొత్తగా మరో 67,597 కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య సోమవారంతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటలలో 67,597 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 1,80,456 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా, 1,188 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,02,874 మంది కోవిడ్ బారినపడి మరణించారు. ప్రస్తుతం 9,94,891 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 2.35 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 170.21 కోట్ల మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు. -
మరో 1,07,474 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 1,07,474 కోవిడ్–19 పాజిటివ్ కేసులు వచ్చాయి. అలాగే మరో 865 మంది వైరస్ కాటుతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,21,88,138కు, మరణాల సంఖ్య 5,01,979కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం... కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 12,25,011కు పడిపోయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 2.90 శాతం ఉన్నాయి. కరోనా రికవరీ రేటు 95.91 శాతమని ఆరోగ్య శాఖ ప్రకటించింది. -
ఈసారి కరోనా వస్తే ఎలుకల నుంచే!
రెండేళ్ల కింద మొదలైన కరోనా వైరస్ దాడి ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. కరోనా ఒక్కటే కాదు.. దీనికి ముందు పంజా విసిరిన సార్స్, మెర్స్ వంటి వైరస్లు గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించినట్టు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. కానీ ఇక ముందు ఎలుకల నుంచి కూడా కరోనా వంటి వైరస్లు వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఆ పరిశోధన ఏమిటి, ప్రమాదం ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ గబ్బిలాల నుంచి వచ్చినట్టుగా.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా (సార్స్ కోవ్–2) వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు సోకినట్టు ఇప్పటికే గుర్తించారు. చైనాలో ఉండే హార్స్‌షూ రకం గబ్బిలాల్లో కరోనా వంటి వైరస్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని.. ఆ గబ్బిలాలు వైరస్‌ను తట్టుకుని సహజీవనం చేస్తున్నాయని తేల్చారు. ఈ నేపథ్యంలోనే మనుషులకు దగ్గరగా ఉండే మరేవైనా జంతువులు, పక్షుల్లో ఈ తరహా పరిస్థితులు ఉన్నాయా, వాటి నుంచి మనుషులకు వైరస్లు వ్యాపించే ప్రమాదం ఉందా అన్న దానిపై అమెరికాకు చెందిన ప్రిన్స్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. జన్యుపరమైన పోలికలున్న జీవులతో.. మనుషులకు దగ్గరగా ఉండే కోతులు, చింపాంజీలతోపాటు ఇతర జంతువుల్లో.. కరోనా వంటి వైరస్ల ప్రభావానికి లోనయ్యే వాటిని శాస్త్రవేత్తలు ఎంపిక చేసుకున్నారు. వాటి శరీరకణాల్లో ఏసీఈ–2 రిసెప్టార్ల (కరోనా వైరస్లు శరీర కణాలకు అతుక్కునేందుకు కారణమయ్యే ప్రోటీన్) తీరును పరిశీలించారు. ఆ జంతువులు కరోనాకు ఎంతగా ప్రభావితం అవుతున్నాయి? ఎలా ఎదుర్కొంటున్నాయి? లక్షణాలు ఎలా ఉంటున్నాయి? అన్నది క్షుణ్నంగా గమనించారు. మిగతా అన్ని జంతువుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తూ, ఆ వైరస్‌తో పోరాడుతుంటే.. ఎలుకలు మాత్రం వైరస్‌ను తట్టుకుంటున్నట్టు గుర్తించారు. ఈ ఎలుకలు కరోనా వంటి వైరస్ల ప్రభావానికి లోనుకాకుండా వాటిలోని ఏసీఈ–2 రిసెప్టార్లు పరిణామం చెందినట్టు తేల్చారు. వైరస్‌లకు రిజర్వాయర్లుగా.. ఈ ఎలుకల ముందు తరాలు తరచూ కరోనా వంటి వైరస్ల దాడికి గురవడంతో.. వాటిని తట్టుకునేశక్తిని పెంచుకున్నాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రాఫెసర్లు షీన్ కింగ్, మోనా సింగ్ వెల్లడించారు. అందువల్లే శరీరంలో వైరస్ పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా.. ఆ ఎలుకల్లో ఎటువంటి లక్షణాలు, అనారోగ్యం కనిపించడం లేదని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల వల్ల ఎలుకలు సదరు వైరస్‌లకు నిలయం (రిజర్వాయర్లు)గా మారిపోతాయని.. భవిష్యత్తులో ఆ వైరస్లు మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ఒక్క ఎలుకలనే కాకుండా.. మరికొన్ని రకాల జంతువులు, పక్షులు కూడా ఇలా పరిణామం చెంది ఉండవచ్చని.. అలాంటి వాటిని గుర్తిస్తే భవిష్యత్తులో ముందు జాగ్రత్తలకు వీలవుతుందని స్పష్టం చేశారు. జూనోటిక్ వ్యాధులే ఇలా.. సాధారణంగా జంతువులు, పక్షుల్లో ఉండే వైరస్లు.. ఇతర జంతువులు/పక్షులు, మనుషులకు వ్యాపించడం వల్ల వచ్చే వ్యాధులను జూనోటిక్ డిసీజెస్ అంటారు. ఈ వైరస్లు ఒకదాని నుంచి మరొకదానికి వ్యాపించే క్రమంలో.. కొన్నిరకాల జంతువులపై ఎక్కువగా, మరికొన్ని రకాలపై తక్కువగా ప్రభావం చూపిస్తాయి. ఇది ఆయా జంతువుల్లో వైరస్ల పట్ల నిరోధకత, జన్యుపరిణామం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ♦జంతువులు ఎక్కువకాలం ఏదైనా వైరస్/ఇతర సూక్ష్మజీవుల దాడికి గురవుతూ ఉంటే.. తమను రక్షించుకునేలా శరీరంలో మార్పులు చేసుకుంటుంటాయి. వాటి తర్వాతి తరంలో ఈ మార్పులు మరింతగా పెరుగుతాయి. అలా అలా సదరు వైరస్/సూక్ష్మజీవులను తట్టుకునే శక్తి పెరుగుతూ ఉంటుంది. ♦మనుషుల్లో కూడా ఇదే తరహాలో ఇప్పటికే ఎన్నో రకాల వైరస్లు/సూక్ష్మజీవులను తట్టుకునే శక్తి సమకూరింది. కరోనా వైరస్ దాడి ఇలాగే సాగితే.. భవిష్యత్తులో అది ఒక సాధారణ జలుబు స్థాయికి మారిపోతుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. -
భవిష్యత్‌లో మరిన్ని వైరస్లు
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల నుంచి మనుషులకు కొత్త వ్యాధులు, వైరస్లు సోకే ప్రమాదం గతంలోకంటే ఎన్నో రెట్లు పెరిగిందని, ఈ సమస్యపై సత్వరం అవసరమైన జాగ్రత్తలు చేపట్టకపోతే భవిష్యత్‌లో తీవ్ర నష్టం తప్పదని ‘కోవిడ్–19: అర్జంట్ కాల్ టు ప్రొటెక్ట్ పీపుల్ అండ్ నేచర్’తాజా నివేదికలో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇంటర్నేషనల్ వెల్లడించింది. ‘వైరస్‌లతో ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ, భద్రతకే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు తలెత్తవచ్చు. ప్రస్తుతం అభివృద్ధి పేరిట జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని, వన్యప్రాణులకు నష్టం చేయడాన్ని తక్షణం ఆపకపోతే భవిష్యత్‌లో మరిన్ని ప్రాణాంతక, ప్రమాదకరమైన వ్యాధులు, వైరస్లు వ్యాప్తి చెంది మానవాళి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. 1990 దశకం నుంచి మనుషుల్లో బయటపడిన 60–70 శాతం కొత్త వ్యాధులు వన్యప్రాణుల నుంచే వచ్చాయి. ఇదే కాలంలో ›ప్రపంచవ్యాప్తంగా 178 మిలియన్ హెక్టార్ల అడవి కనుమరుగైపోయింది. దీనిని బట్టి ఈ రెండింటి మధ్య సంబంధాలు ఏమిటనేది స్పష్టమవుతోంది’అని నివేదికలో ప్రచురించారు. ఈ నివేదిక వెలువడిన నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ, జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులు, వైరస్లు–చేపట్టాల్సిన కార్యాచరణపై డబ్ల్యూడబ్ల్యూఎఫ్ స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వైల్డ్‌లైఫ్ ఓఎస్డీ ఎ.శంకరన్ తమ అభిప్రాయాలను సాక్షితో పంచుకున్నారు. ఆర్థికాభివృద్ధి–పర్యావరణ పరిరక్షణకు సమ ప్రాధాన్యం ‘ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఆర్థికాభివృద్ధి–పర్యావరణ పరిరక్షణ రెండింటికి తప్పనిసరిగా సమాన ప్రాధాన్యతనివ్వాలి. జంతువుల నుంచి సోకే వ్యాధులు, వ్యాపించే వైరస్ల పట్ల భారత్‌లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వన్యప్రాణులు, జంతువుల్లో అనేక రకాల వైరస్లున్నాయని, వాటి నుంచే మనుషులకు ఆయా వైరస్లు, వ్యాధులు సోకుతున్నట్టు తెలుస్తోంది. ఈ వైరస్లు జంతువుల శరీరంలోనే ఉంటే నష్టం లేదు. కానీ వన్యప్రాణులు, జంతువులను చంపి వాటి ఆహారాన్ని తినడం, అవి ఉంటున్న ప్రాంతాల్లోకి వెళ్లడం ద్వారా వివిధ రకాల వైరస్లు మనుషులకు సోకే అవకాశాలు పెరిగాయి. వన్యప్రాణులకు మనుషులు ఆహారం పెట్టడం మానుకోవాలి. అవి సొంతంగా ఆహారం సంపాదించుకోగలుగుతాయి. హైదరాబాద్‌లో పెద్దమొత్తంలో పావురాలకు గింజలు దాణాగా వేయడం వల్ల వాటి జనాభా గణనీయంగా పెరిగిపోయి నగరవాసుల్లో శ్వాసకోశ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి’ –డబ్ల్యూడబ్ల్యూఎఫ్ స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల్ జీవ వైవిధ్యమే కీలకం ‘మనుషులు, ప్రకృతి, పర్యావరణం ఒకదానికి ఒకటి సహకరించుకుంటేనే రాబోయే రోజుల్లో తీవ్రమైన సమస్యల బారిన పడకుండా రక్షించుకోగలుగుతాం. ఏ జంతువు శరీరతత్వం ఏమిటి? దాని మాంసం తినొచ్చా లేదా అన్నది తెలుసుకోకుండానే విచక్షణా రహితంగా అన్నింటినీ తినడం ఏమాత్రం మంచిది కాదు. వన్యప్రాణుల నుంచి మనుషులకు వ్యాధులు వ్యాప్తి చెందడం చాలా ప్రమాదకరం. కోవిడ్ వ్యాప్తి ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది. అందువల్ల ఆహార అలవాట్లను మార్చుకుని సురక్షితమైన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరముంది. ఒక చెట్టు, జంతువు లేదా పక్షి జాతి అంతరిస్తే దాని ప్రభావం చుట్టుపక్కల ఉన్న జాతులపైనా పడుతుంది. ఈ అంశాలన్నింటినీ గ్రహించి పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణకు ముందుకు కదలాలి’ – వైల్డ్‌లైఫ్ ఓఎస్డీ ఎ.శంకరన్ -
వైరస్ల నియంత్రణకు శాశ్వత వార్డులు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని రకాల వైరస్ల నియంత్రణకు శాశ్వతంగా ప్రత్యేక ఐసీయూలు, ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌తోపాటు స్వైన్‌ఫ్లూ, నిపా వంటి వైరస్‌లన్నింటికీ చికిత్స కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో 10 పడకలతో ఐసీయూలు, 20 పడకలతో ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేయనుంది. ఒక్కో ఐసీయూ ఏర్పాటుకు రూ. 2 కోట్ల చొప్పున రూ. 20 కోట్లు, ఒక్కో ఐసోలేషన్ వార్డుకు రూ. కోటి చొప్పున రూ. 10 కోట్లు లెక్కన మొత్తం రూ. 30 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌ల నిబంధనల ప్రకారం ఐసీయూలు, ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చే యనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయా కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు వాటికి ప్రత్యేక ప్రవేశ మార్గాలను సిద్ధం చేయనున్నారు. అలాగే రోగులు ఇళ్లకు వెళ్లేందుకు సైతం విడిగా మార్గాలను అందుబాటులోకి తీసుకురాను న్నారు. వాటిని ఎలా ఏర్పాటు చేయాలన్న దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ ప్రతినిధులు మంగళవారం ఆయా జిల్లాల కేంద్రాలకు వెళ్లారు. దీనిపై బుధవారం ప్రత్యేక సమావేశం జరగనుంది. కాగా, నిన్న మొన్నటివరకు కోవిడ్ భయాలతో మా స్క్‌లు కావాలంటూ వైద్య ఆరోగ్యశాఖకు వీఐపీల నుంచి ఒత్తిడి నెలకొన్నా సీఎం కేసీఆర్ మాస్క్‌లు పెద్దగా అవసరం లేదని చెప్పడంతో వీఐపీల నుంచి మాస్క్‌ల డిమాండ్ తగ్గిందని అంటున్నారు. మరోవైపు లక్ష మాస్క్‌లు కావాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరినా ఇప్పటివరకు ఒక్క మాస్క్ కూడా రాలేదు. మహారాష్ట్రలో తయారీ యూనిట్లు ఉన్న మూడు చోట్ల నుంచి మాస్క్‌లు తెప్పించడంలో కేంద్రం సహకరించడంలేదని అధికారులు అంటున్నారు. కోవిడ్ దెబ్బతో బయోమెట్రిక్ బంద్ కోవిడ్ వైరస్ దెబ్బతో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని విద్యా సంస్థలు క్రమంగా నిలిపివేస్తున్నాయి. కోవిడ్ కారణంగా షేక్ హ్యాండ్ ఇవ్వవద్దని, వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులు కడుక్కోవాలని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులంతా ఒకరి తరువాత ఒకరు వేలి ముద్రలు వేయాల్సిన బయోమెట్రిక్ హాజరును తాత్కాలికంగా నిలి పివేస్తున్నాయి. ఇప్పటికే ప్రొఫెసర్ జయశంకర్ అ గ్రికల్చర్ యూనివర్సిటీ బయోమెట్రిక్ హాజరు వి ధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయగా, కాకతీయ యూనివర్సిటీ కూడా తమ పరిధిలోని కాలేజీల్లో బ యోమెట్రిక్ హాజరు విధానం నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. మరోవైపు జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, పాఠశాలల్లోనూ బయోమెట్రిక్ హాజరు విధానం నిలిపివేతపై ఆలోచనలు చేస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
అన్ని వైరస్‌లకు ఒకేచోట చికిత్స
సాక్షి, హైదరాబాద్ : ఏ వైరస్ సోకినా ఒకేచోట వైద్య చికిత్స అందించే ‘క్లీన్ వార్డు’ కేంద్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలు, సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ముందుగా హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేయాలని అనుకున్నా, తర్వాత దాన్ని ఛాతీ ఆస్పత్రిలో ఐదెకరాల విశాలమైన స్థలంలో నెలకొల్పాలని నిర్ణయించింది. రూ.132 కోట్లు ఖర్చు పెట్టి వచ్చే ఏడాదికి దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలో భూమి పూజ చేసి నిర్మాణం చేపట్టనుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. డబ్లూహెచ్‌వో మార్గదర్శకాల మేరకు.. క్లీన్‌వార్డు కేంద్రంలో స్వైన్‌ప్లూ, కరోనా, నిఫా, ఎబోలా వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లకు చికిత్స అందిస్తారు. ఈ కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా నెలకొల్పుతారు. ప్రస్తుతం ఏదైనా వైరస్ సోకితే గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రుల్లో అప్పటికప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కోసారి కనీస వసతులు కూడా ఉండకపోవడంతో బాధితులు ఆయా ఆస్పత్రులకు రావడానికి వెనుకంజ వేస్తున్నారు. పైగా ఆయా ఆస్పత్రుల్లో సాధారణ రోగులకు వైద్యం అందించే వార్డులనే వైరస్లు సోకిన వారికి ప్రత్యేకంగా కేటాయించి చికిత్స చేస్తున్నారు. దీనివల్ల సాధారణ రోగులకు, వైరస్ సోకిన రోగులకు పక్కపక్కనే చికిత్స అందించే పరిస్థితి ఉంటుంది. అందుకే ఈ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి ప్రత్యేక చికిత్సా కేంద్రం ప్రస్తుతం ఢిల్లీ, పుణేల్లో మాత్రం ఉండగా, త్వరలో హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మూడు రకాల వార్డులు.. ఈ క్లీన్‌వార్డు కేంద్రంలో ప్రొటోకాల్ ప్రకారం చికిత్స అందిస్తారు. క్రిటికల్ కేర్, ఐసోలేషన్, సాధారణ వార్డులుంటాయి. క్రిటికల్ కేర్‌లో 20 పడకలుంటాయి. ఐసోలేషన్ వార్డులో 50 నుంచి 60 పడకలు, సాధారణ వార్డులో దాదాపు 100 పడకలుండేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. వాటితోపాటు వైద్య సిబ్బందికి ప్రత్యేక గదులుంటాయి. ఏదైనా వైరస్ సోకిన వ్యక్తి ఆయా కేంద్రానికి వస్తే సాధారణ వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల్లో వైరస్ వ్యాప్తి తీవ్రతను బట్టి ఐసోలేషన్ వార్డు లేదా క్రిటికల్ వార్డుకు పంపిస్తారు. స్వైన్‌ఫ్లూ, కరోనా లాంటి వైరస్లు సోకితే ముందుగా సాధారణ వార్డుకు పంపించి పరీక్షలు చేస్తారు. అక్కడ పరిస్థితి తీవ్రతను బట్టి ఐసోలేషన్ లేదా క్రిటికల్ వార్డులకు తరలిస్తారు. ఎబోలా, నిఫా వంటి వైరస్లు అత్యంత ప్రమాదకరమైనవి. ఆ వైరస్ లక్షణాలున్న వ్యక్తిని నేరుగా క్రిటికల్ కేర్ వార్డులకు పంపిస్తారు. అంతేగాకుండా ఒక వార్డు నుంచి ఒక వార్డుకు వెళ్లడానికి ముందు అత్యంత శుభ్రంగా చేతులు కడుక్కోవాల్సి ఉంటుంది. అలాగే మాస్క్‌లు, పూర్తిస్థాయి గౌన్లు ధరించి వెళ్లాల్సి ఉంటుంది. ఆ మేరకు ప్రత్యేక వైద్య బృందాన్ని నియమిస్తారు. నిష్ణాతులైన వారి ద్వారా చికిత్స అందిస్తారు. ఈ కేంద్రంలోనే వైరస్‌లకు సంబంధించిన పరిశోధనలు కూడా జరుగుతుంటాయని ఆ వర్గాలు వెల్లడించాయి. -
మోస్ట్ డేంజరస్ ల్యాప్‌టాప్ ఇదే
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ల్యాప్‌టాప్ ఒకటి ఆన్లైన్ వేలంలో భారీ ధర పలుకుతోంది. ఆరు భయంకరమైన వైరస్లు ఈ ల్యాప్‌టాప్ తిష్టవేశాయి. అందుకే 'వరల్డ్స్ మోస్ట్ డేంజరస్’ ల్యాప్‌టాప్‌గా పేరు తెచ్చుకుంది. అత్యంత ప్రమాదకరమైన, ప్రపంచానికి భారీ నష్టాన్ని మిగిల్చిన ఆరు వైరస్లు ఇందులో పొంచి వున్నాయి. ఈ వైరస్ కారణంగా ప్రపంచంలో సుమారు 100 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందట. అలాంటి ల్యాప్‌టాప్ వేలమా? పైగా అంత భారీ ధర పలకడమా? విచిత్రంగా ఉంది కదూ.. సెక్యూరిటీ సంస్థ డీప్ ఇన్స్టింక్ట్ ఆధ్వర్యంలోనే గ్వో ఓ డాంగ్ అనే ఇంటర్నెట్ ఆర్టిస్ట్ ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. అతి ప్రమాదకరమైన ఆరు వైరస్‌లను లైవ్లీగా ఉంచి మరీ, ఈ డివైస్‌ను వేలానికి వుంచారు. డిజిటల్ ప్రపంచానికి ఎదురవుతున్న ముప్పును భౌతికంగా ప్రజలకు తెలియ చెప్పేందుకే ఈ ప్రయత్నమని గ్వో చెప్పారు. కంప్యూటర్లోని భయంకరమైన వైరస్లు మనల్ని భౌతికంగా ప్రభావితం చేయలేవని చాలామంది ప్రజలు భావిస్తున్నారు. కానీ అవి ఆర్థికంగా ఎంత నష్టాన్ని కలుగజేస్తాయో గమనించలేక పోతున్నారన్నారు. అందుకే ఆర్థికంగా భారీ నష్టాన్ని కలుగ జేసిన ఈ ఆరు భయంకరమైన వైరస్‌లను ఎంచుకున్నట్టు తెలిపారు. విండోస్ ఎక్స్పీ ఆధారిత శాంసంగ్ ఎన్సీ10 దీని పేరు.10.2 అంగుళాల 14జీబీ (2008) డివైస్ ఇది. వైఫై, ఫ్లాష్‌డ్రైవ్‌కి కనెక్ట్ చేయనంత వరకూ దీన్నుంచి మిగతా పీసీలకు ఈ వైరస్‌లకు వ్యాపించకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నామని నిర్వాహకులు చెప్పారు. ఐ లవ్యూ, మైడూమ్, సోబిగ్, వాన్నా క్రై, డార్క్ టెక్విలా బ్లాక్ఎనర్జీ అనే ఆరు వైరస్లు ఈ ల్యాప్‌టాప్‌లో దాగి వున్నాయి. 'ది పెర్సిస్టెన్స్ ఆఫ్ ఖోస్' అనే శీర్షికతో, గ్వోఓ ఓ డోంగ్ దీన్ని సృష్టించారు. ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్న ప్రైవేట్ వేలంలో ఇది ఇప్పటికే 1.2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.8 కోట్ల, 34 లక్షలు) ధర పలుకుతోంది. అద్భుతమైన ఈ ఆర్ట్‌పీస్‌పై ఆసక్తి వున్నవారు ఎవరైనా ఈ వేలంలో పాల్గొనవచ్చు. -
కేన్సర్‌పై యుద్ధంలో మరో ముందడుగు
కేన్సర్ వ్యాధి చాలా తెలివైందంటారు. శరీరంలో కేన్సర్ కణాలు మొట్టమొదట చేసే పని రోగ నిరోధక వ్యవస్థను హైజాక్ చేయడం. ఫలితంగా ఈ వ్యవస్థ కాస్తా కేన్సర్ కణాలను కూడా తనవిగానే భావిస్తుంది. ఎంటువంటి దాడులూ చేయదు. దీనివల్ల వ్యాధి కాస్తా ముదిరిపోతుంది. అయితే కాలిఫోర్నియా, రష్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు ఈ సమస్యకు ఓ చక్కటి పరిష్కారం లభించింది. శరీరంలో రోగకారక వైరస్లు, బ్యాక్టీరియాలపై నిత్యం నిఘా పెట్టే కణాల్లో మైలాయిడ్ కణాలు రెండు రకాలు. ఒకరకమైన ఎం1 మాక్రోఫేజ్ కేన్సర్ కణితి పెరుగుదలను అడ్డుకుంటూంటే.. రెండోది తోడ్పడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ రెండు రకాల కణాలూ రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన కణాలను నాశనం చేస్తూంటాయి. రష్, కాలిఫోరియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ మైలాయిడ్ కణాలు ఎందుకు అలా రెండుగా విడిపోతాయో గుర్తించారు. సీడీ11బీ అనే ఒక ప్రొటీన్ ఉత్పత్తి ఎక్కువైతే ఎం1 రకం కణాలు.. తక్కువైతే ఎం2 రకానివి ఎక్కువవుతాయి. కణితి కణాలు ఈ ప్రొటీన్‌ను నియంత్రిస్తూ ఎం2 కణాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యేందుకు కారణమవుతూంటాయి. ఈ ప్రొటీన్‌ను మరింత సమర్థంగా నియంత్రించగలగడం.. తద్వారా ఎం1 కణాలు ఎక్కువయ్యేలా చేస్తే కేన్సర్‌కు మెరుగైన చికిత్స లభిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో ఈ ఫలితాలు కనిపించాయని వినీత్ గుప్తా అనే శాస్త్రవేత్త తెలిపార -
మృగరాజుకు ఎంత కష్టం!
తమ ప్రాంతంపై ఆధిపత్యం కోసం సాగుతున్న అంతర్గత పోరులోనే గుజరాత్ గిర్ మృగరాజులు ఒకదాని వెనక ఒకటి మృత్యువాత పడుతున్నాయా? అంతుపట్టని రోగాలు, ప్రాణాంతక వైరస్ కారణంగానే దాదాపు 15 రోజుల సమయంలోనే 23 సింహాలు మరణించాయా? ఆధిపత్య పోరు వల్లే మరణిస్తున్నాయన్న వాదన ప్రస్తుత పరిణామాలు మాత్రం దాన్ని బలపరచట్లేదు. అడవులకు దగ్గరగా జనావాసాలు విస్తరించడంతో అంతుచిక్కని వ్యాధులతో పాటు గొర్రెలు, మేకలు ఇతర పెంపుడు జంతువుల నుంచి సింహాలకు సోకుతున్న వైరస్ ఈ మరణాలకు కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా గిర్ ప్రాంతంలోని ఇతర సింహాలను అక్కడకు 100 కిలోమీటర్ల దూరంలోని పోర్బందర్ సమీపాన ఉన్న బర్ద దుంగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. బర్దాతో పాటు మధ్యప్రదేశ్‌లోని పాల్పుర్–కునో, మరో రెండు సంరక్షణ కేంద్రాలకు కూడా వీటిని తరలించాలని గతంలోనే కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. అడవి రాజుకు కష్టమొచ్చింది..! సింహాన్ని అడవికి రాజుగా గొప్పగా చిత్రీకరించిన తీరును మనం చిన్నపుడు కథల పుస్తకాల్లో చదువుకున్నాం. తామున్న ప్రాంతంపై పట్టు, ప్రతిష్ట కోసం సింహాల మధ్య తీవ్రమైన సంఘర్షణ చోటు చేసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. రాజ్యం (భూభాగం)పై ఆధిçపత్యం కోసం పురుష సింహాలు ఒకదాన్ని మరొకటి చంపుకుంటాయని గతంలోనే వెల్లడైంది. ఈ పోరులో భాగంగా ఆడ సింహాలు అరుదుగా గాయపడతాయి. అయితే తాజాగా గుజరాత్లో మూడు ఆడసింహాలు కూడా మరణించడంతో గతంలోని సూత్రీకరణల్లో వాస్తవమెంత అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంటువ్యాధుల జాడలు.. గిర్ ప్రాంతంలో గతంలో అంటువ్యాధులు ప్రబలిన దాఖలాలున్నాయి. గతంలో మరణించిన ఓ సింహం నుంచి భద్రపరిచిన కణజాలాన్ని 2012లో ఐవీఆర్ఐ జరిపిన పరిశోధనలో పెస్ట్ డెస్ పిటిట్స్ వైరస్ (పీపీఆర్‌వీ) ఉన్నట్టు వెల్లడైంది. ఈ వైరస్ వల్ల వచ్చే జబ్బులు అంటువ్యాధిగా మారితే గిర్ సింహాల జనాభాలో 40 శాతం మేర కనుమరుగయ్యే అవకాశాలున్నాయంటూ బ్రిటన్ రాయల్ వెటర్నరీ కాలేజీకి చెందిన రిచర్డ్ కాక్ హెచ్చరించారు.2013లో గుజరాత్ బయో–టెక్నాలజీ మిషన్ గిర్ ప్రాంతంలోని 10 శాతం సింహాలపై నిర్వహించిన అధ్యయనంలో సీడీవీ, పీపీఆర్‌వీ వైరస్ రకాల దాఖలాల్లేవని స్పష్టమైంది. 1990ల మధ్యలో సీడీవీ వైరస్‌తో ప్రబలిన అంటువ్యాధుల వల్ల ఆఫ్రికాలోని మూడోవంతు సింహాలు తుడిచిపెట్టుకుపోయాయి. అంతుపట్టని రోగాలే కారణం.. అంతుపట్టని రోగాల కారణంగానే ఇవి మరణిస్తున్నాయన్న వాదనలు తెరపైకి వచ్చాయి. పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరీక్షల్లో కొన్ని సింహాల రక్తం, కణజాల నమూనాల్లో ‘వైరల్ ఇన్ఫెక్షన్’ ఆధారాలు లభించినట్లు తెలిసింది. నాలుగు శాంపిళ్లలో కెనైన్ డిస్టెంపర్ వైరస్ (సీడీవీ) ఉన్నట్లు తేలింది. జునాగఢ్‌లోని ఫోరెన్సిక్ సైన్స్‌ల్యాబ్ పరీక్షల్లోని ఆరు శాంపిళ్లలో ప్రోటోజువా ఇన్ఫెక్షన్లు గుర్తించారు. తదుపరి పరీక్షల్లో ఈ రెండు పరిశోధనశాలలు నిమగ్నమయ్యాయి. వీటికి తోడు బరేలిలోని ఇండియన్ వెటర్నరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ బృందం గుజరాత్ వెళ్లి నమూనాలు పరిశీలించింది. ఎక్కువగా సింహాలు మరణించిన చోటుకు సమీపంలోని అటవీ ప్రాంతాల నుంచి 31 సింహాలను గిర్ అధికారులు మరో చోటికి తరలించారు. ఆ తర్వాత అవి అరోగ్యంగానే ఉంటున్నాయి. -
సీడీవీ వైరస్‌తోనే గిర్ సింహాల మృతి
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని గిర్ అభయారణ్యంలో చనిపోయిన 23 ఆసియా జాతి సింహాల్లో ఐదు సింహాలను ప్రమాదకర కెనైన్ డిస్టెంపర్ వైరస్(సీడీవీ) బలికొందని భారత వైద్య పరిశోధన మండలి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ–పుణె) తెలిపాయి. సింహాల మృత కళేబరాల నుంచి సేకరించిన నమూనాల్లో ఈ వైరస్ అవశేషాలు ఉన్నట్లు తేలింది. ఈ ప్రమాదకరమైన వైరస్ కారణంగా తూర్పు ఆఫ్రికాలో ఉన్న సింహాల్లో 30 శాతం అంతరించిపోయాయని పేర్కొన్నాయి. గిర్ అభయారణ్యంలో గత నెల 12 నుంచి ఇప్పటివరకూ 23 సింహాలు చనిపోయాయి. ఈ నేపథ్యంలో నమూనాలను సేకరించిన భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్).. సీడీవీ వైరస్‌ను ధ్రువీకరించింది. గాలితో పాటు ప్రత్యక్షంగా తాకడం ద్వారా జంతువుల్లో ఈ వైరస్ సోకుతుంది. దీంతో అధికారులు మిగతా సింహాలకు ఈ వ్యాధి వ్యాపించకుండా వాటిని వేరే జూలకు తరలించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఐసీఎంఆర్ విజ్ఞప్తితో కేంద్రం సీడీవీ టీకాను శుక్రవారం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. గిర్ అభయారణ్యంలో దాదాపు 600 ఆసియా జాతి సింహాలున్నాయి. సాధారణంగా సీడీవీ వైరస్ పెంపుడు కుక్కల్లో కనిపిస్తుంది. తోడేలు, నక్క, రకూన్, ముంగిస, రెడ్ పాండా, హైనా, పులి, సింహం వంటి మాంసాహార జంతువులకూ సోకుతుంది. ఇది సోకిన జంతువుల్లో 50 శాతం చనిపోతాయి. చికిత్స ద్వారా కోలుకున్నా చూపును కోల్పోవడం, మూర్ఛ రావడం, వేటాడే శక్తిలేక నిస్తేజంగా మారిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వైరస్ మనుషులపై ప్రభావం చూపదు. -
బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కొనేందుకు కొత్త అస్త్రం
అంచనాలు తల్లకిందులవడం సైన్స్‌లో కొత్తేమీ కాదు. ఒకప్పుడు పనికిరావు, విసర్జితాలు అనుకున్న చెడు యాంటీబాడీల విషయంలో ఇప్పుడు అదే రుజువైంది. బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కోవడంలో ఈ చెడు యాంటీబాడీలే మెరుగైన అస్త్రాలుగా మారతాయని గార్వాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా రుజువు చేశారు. శరీరంలోని కణజాలం పైనే దాడి చేయడం మొదలుపెడుతున్న కారణంగా మన శరీరంలోని కొన్ని యాంటీబాడీలు చెడు చేసేవని.. కొంతకాలం తరువాత ఇవి వాటంతట అవే నిర్వీర్యమైపోతాయని ఇంతకాలంగా శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. అయితే ఈ పరిస్థితి కొంతకాలమే అని ప్రొఫెసర్ డేనియల్ క్రైస్ట్ అనే శాస్త్రవేత్త అంటున్నారు. ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఈ చెడు యాంటీబాడీలు కొంతకాలం తరువాత.. శరీరానికి సూక్ష్మజీవుల ద్వారా ముప్పు ఉందని స్పష్టమైనప్పుడు ఇవే వాటిపై పోరాడేందుకు సిద్ధమైపోతాయి అని తాము గుర్తించామని క్రైస్ట్ చెప్పారు. రోగ నిరోధక వ్యవస్థ కళ్లు కప్పే బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కోవడంలో ఇవి మరింత మెరుగ్గా పనిచేస్తాయని తాజా అంచనాలు చెబుతున్నాయి. హెచ్ఐవీ మొదలుకొని అనేక ఇతర వ్యాధులను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని క్రైస్ట్ తెలిపారు. -
స్వైన్ ఫ్లూ నిర్ధారణకు ఏపీలో ల్యాబ్‌లు లేవు
వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడి హైదరాబాద్: ప్రాణాంతక స్వైన్‌ఫ్లూ (హెచ్1ఎన్1)లాంటి వైరస్లు సోకితే నిర్ధారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా ల్యాబొరేటరీలు లేవని ఆరోగ్య సంచాలకులు డా. అరుణకుమారి చెప్పారు. రక్తనమూనాలను హైదరాబాద్‌కు పంపాల్సిందేనని తెలిపారు. గురువారం ఆమె వైద్యవిద్య సంచాలకులు డా. శాంతారావు, ఆరోగ్యశాఖ అదనపు సంచాలకులు డా. గీతాప్రసాదినిలతో కలసి స్వైన్‌ఫ్లూ నివారణకు తీసుకుంటున్న చర్యలపై విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైతే ఆ నమూనాలను హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో నిర్ధారణ చేస్తున్నామన్నారు. ఏపీలో స్వైన్‌ఫ్లూ వైరస్ ప్రమాదం లేదని తెలిపారు. అయినా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెలలో 19 మంది రక్త నమూనాలను సేకరించగా 12 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు తేలిందని చెప్పారు. వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందారని అరుణకుమారి పేర్కొన్నారు. -
సూక్ష్మజీవులు.. వ్యాధి కారకాలు
మానవునికి అనేక రకాల సూక్ష్మజీవుల ద్వారా వ్యాధులు సంక్రమిస్తాయి. వీటిలో ముఖ్యమైనవి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు, ప్రోటోజోవా వర్గానికి చెందిన కొన్ని జీవులు. ఇందులో కొన్నిటి ద్వారా స్వల్ప స్థాయిలో ప్రభావం కనిపిస్తే.. మరికొన్ని ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో వ్యాధులు అదుపు తప్పి దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తాయి. 2009 మార్చిలో మెక్సికోలో మొదలైన స్వైన్‌ఫ్లూ ఇప్పుడు దాదాపు 200 దేశాలకు విస్తరించడమే ఇందుకు చక్కని ఉదాహరణ. అదేవిధంగా ఎబోలా వంటి వ్యాధులు కూడా ఈ విధంగా వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు. ఈ సందర్భంలో వైద్య సంసిద్ధత సరిగా లేకపోతే నష్టం తీవ్రంగా ఉండొచ్చు. సూక్ష్మ జీవులను కేవలం వ్యాధిని కలుగజేసే కారకాలుగా మాత్రమే పరిగణించడం సరికాదు. ఎందుకంటే వీటి వల్ల మానవునికి ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. బ్యాక్టీరియా సూక్ష్మజీవుల్లో ముఖ్యమైనవి బ్యాక్టీరియా. ఇవి కేంద్రకపూర్వ జీవులు, ఏకకణ జీవులు. ఒక నిర్దిష్ట కేంద్రకం, ఇతర కణ భాగాలు లేని పూర్వకణాలు.. కేంద్రకపూర్వ కణాలు (్కటౌజ్చుటడౌ్టజీఛి ఛ్ఛిట). వీటిలో జన్యు పదార్థం (డీఎన్ఏ) ఏ ఆచ్ఛాదన లేకుండా కణ ద్రవ్యంలో ఉంటుంది. కేంద్రకపూర్వ కణాలతో ఏర్పడతాయి కాబట్టి వీటిని కేంద్రక పూర్వ జీవులు (Prokaryotes) అంటారు. ఇవి పూర్వపరమైన జీవులు. జీవావిర్భావ ప్రారంభంలో పరిణామం చెందాయి. వీటి నుంచి తర్వాతి కాలంలో నిజ కేంద్రక జీవులు పరిణామం చెందాయి. రాబర్ట విట్టేకర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన జీవుల వర్గీకరణలో కేంద్రకపూర్వ జీవులన్నింటిని మొనీరా (కౌ్ఛట్చ) రాజ్యంలో వర్గీకరించారు. బ్యాక్టీరియా, సయనో బ్యాక్టీరియా అనే రెండు రకాల జీవులను మొనీరా రాజ్యంలో వర్గీకరించారు. సయనో బ్యాక్టీరియా కూడా బ్యాక్టీరియాను పోలిన జీవి. వీటిని అంతకుముందు నీలి-ఆకుపచ్చ శైవలాలు (ఆఠ్ఛ ఎట్ఛ్ఛ అజ్చ్ఛ) గా పిలిచేవారు. ప్రారంభంలో వీటిని శైవలాలుగా భావించడమే దీనికి కారణం. తర్వాతి కాలంలో ఇవి శైవలాలు, నిజకేంద్రక జీవులు కాదని గుర్తించి, బ్యాక్టీరియా ఉన్న మొనీరా రాజ్యంలో చేర్చారు. బ్యాక్టీరియా సాధారణంగా రెండు రకాలు. అవి.. ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా. వీటిల్లో ఆర్కీ బ్యాక్టీరియా అతి పురాతనమైంది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం బ్యాక్టీరియా తమ మనుగడను సాగించగలదు. 60 నుంచి 800ఛి ఉష్ణోగ్రత వద్ద ఉన్న సల్ఫర్ ఊటలో సైతం ఇవి జీవిస్తాయి. ఉదాహరణ: థర్మోప్లాస్మా, మెథనో బ్యాక్టీరియా. విభిన్న ఆకారాలు: సాధారణంగా బ్యాక్టీరియా అనే పదాన్ని ఉపయోగించినపుడు మనం తెలియకుండానే యూ బ్యాక్టీరియాను సంభోధించినట్టు అవుతుంది. ఇవి విభిన్న ఆకారాల్లో ఉంటాయి. అవి.. దండ ఆకార బ్యాక్టీరియం, బాసిల్లస్, వృత్తాకార బ్యాక్టీరియం, కోకస్, కామా ఆకార బ్యాక్టీరియం, విబ్రియో, సర్పిలాకార బ్యాక్టీరియం, స్పైరిల్లం. సాధారణంగా బ్యాక్టీరి యం నిర్మాణంలో బాహ్యంగా ఒక కణకవచం ఉంటుంది. ఇది పెప్టిడోగ్లైకాన్/మ్యూరీన్/మ్యాకోపెప్ట్మై అనే పదార్థంతో తయారవుతుంది. కొన్ని బ్యాక్టీరియాల్లో కణకవచం మందంగా, మరికొన్నింటిలో పల్చగా ఉంటుంది. ఈ రెండు రకాల బ్యాక్టీరియాను కచ్చితంగా నిర్ధారించే ప్రక్రియ/ పరీక్షను హాన్స క్రిస్టియన్ గ్రామ్ రూపొందించాడు. ఈ పరీక్ష కణకవచం మందంగా ఉంటే పాజిటివ్, పల్చగా ఉంటే నెగిటివ్‌గా స్పందిస్తుంది. కాబట్టి బ్యాక్టీరియాను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి.. 1. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఉదాహరణ: స్ట్రె ప్టోకోకస్ నియోనియే. 2. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఉదాహరణ: విబ్రియో కలరే. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో కణకవచం పల్చగా ఉంటుంది. కాబట్టి వీటిలో కణకవచానికి అదనంగా బాహ్యంగా అవుటర్ మెంబరెన్ (Outer membrane) అనే బాహ్య పొర ఉంటుంది. ఇది కొవ్వు పిండి పదార్థంతో తయారవుతుంది. కాబట్టి దీన్ని ఎల్పీఎస్ (లిపో పాలీ శాఖరైడ్) లేయర్ అంటారు. కణకవచం తర్వాత లోపలి వైపు కణద్రవ్యాన్ని కప్పి ప్లాస్మాత్వచం ఉంటుంది. కణద్రవ్యంలో వృత్తాకార డీఎన్ఏ ప్రధాన జన్యు పదార్థం. నిజకేంద్రక కణాల మాదిరి డీఎన్ఏ కేంద్రకంలో ఉండదు. ఈ రకమైన జన్యు నిర్మాణం, న్యూక్లియామిడ్ లేదా జీనోఫోర్ లేదా బ్యాక్టీరియా క్రోమోజోమ్, రైబో జోమ్‌లు అనే కణ భాగాలు ప్రొటీన్లను నిర్మిస్తాయి. ప్రధాన జన్యు పదార్థానికి అదనంగా కూడా బ్యాక్టీరియా కణద్రవ్యంలో స్వయం ప్రతికృతి చెందే వృత్తాకార డీఎన్ఏ అణువులు ఉంటాయి. వీటిని ప్లాస్మిడ్స అంటారు. వీటి ద్వారా బ్యాక్టీరియాకు అదనపు లక్షణాలు సంభవిస్తాయి. నేడు వివిధ యాంటీబయాటిక్ మందులకు నిరోధకతను అభివృద్ధి చేసుకోవడానికి కారణం ఈ ప్లాస్మిడ్లు. పలు మార్గాల ద్వారా: వివిధ మార్గాల ద్వారా బ్యాక్టీరియాలు వ్యాధులను కలుగజేస్తాయి. అవి.. గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు: క్షయ, నిమోనియ, డిఫ్తీరియా, కోరింత దగ్గు. కలుషిత ఆహారం, నీరు ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు: కలరా, బొట్యులిజం, షిజెల్లోసిస్, టైఫాయిడ్. దూళి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు: టెటానస్ (ధనుర్వాతం), బొట్యులిజం. లైంగికంగా సంక్రమించే వ్యాధులు: సిఫిలిస్, గనేరియా. అధిక శాతం బ్యాక్టీరియాలు మానవునిలోకి ప్రవేశించి విష పదార్థాలను విడుదల చేయడం ద్వారా తమ ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణ: కలరా బ్యాక్టీరియా చిన్న పేగులో కలరాజెన్ అనే కలరా టాక్సిన్ను విడుదల చేస్తుంది. ఉపయోగాలు: మానవునికి బ్యాక్టీరియా ద్వారా పలు ఉపయోగాలు ఉన్నాయి. ఎశ్చరిషియకొలి అనే బ్యాక్టీరియాను జన్యు పరిశోధనల్లో వినియోగిస్తారు. నీటి కాలుష్యానికి సూచికగా కూడా పని చేస్తుంది. స్ట్రెప్టోమైసిస్ నుంచి అనేక యాంటీబయాటిక్‌లు లభిస్తాయి. కొన్ని బ్యాక్టీరియా మృత్తికలో ఇది స్వేచ్ఛగా ఉంటూ లేదా మొక్కల వేర్లతో సహజీవనం చేస్తూ నేలలో నత్రజని స్థాపనను నిర్వహించి నేలసారాన్ని అభివృద్ధి చేస్తాయి. ఉదాహరణ: లెగ్యూం మొక్కల వేర్లలో రైజోబియం బ్యాక్టీరియాకు చెందిన పలు జాతులు సహజీవనం చేస్తూ వేరు బొడిపెలను ఏర్పర్చి నత్రజని స్థాపనను నిర్వహిస్తుంది. తద్వారా వేర్లకు నత్రజని అందిస్తుంది. ఈ విధంగా నేలలోకి కూడా నత్రజని విడుదలై నేలసారం అభివృద్ధి చెందుతుంది. ఈ కారణంతోనే లెగ్యూం పంటలను అంతర పంటలుగా, మిశ్రమ పంటలుగా సాగు చేస్తారు. మృతికలో స్వేచ్ఛగా ఉంటూ కూడా కొన్ని బ్యాక్టీరియా నత్రజని స్థాపనను చేపడతాయి. ఉదాహరణ: అజటోబ్యాక్టర్, రోడోస్పైరిల్లం, అజోస్పైరిల్లం. ఇదే విధంగా కొన్ని సయానో బ్యాక్టీరియా కూడా నత్రజని స్థాపనను నిర్వహిస్తూనే మొక్కలకు కావల్సిన పెరుగుదల కారకాలు, విట్జమిన్లు అందిస్తాయి. బాసిల్లస్ తురింజియన్సిస్ (ఆఖీఆ్చఛిజీఠట ్టజిఠటజీజజ్ఛీటజీట) అనే బ్యాక్టీరియంలోని కొన్ని ప్రొటీన్లలో విషగుణాలను గుర్తించి వాటిని, పంట తెగుళ్ల నివారణలో వినియోగిస్తున్నారు. వీటినే బీటీ టాక్సిన్లు అంటారు. జన్యు మార్పిడి టెక్నాలజీ ద్వారా వీటిని అనేక పంటల్లో ప్రవేశపెట్టారు. ఈ విధంగా తెగుళ్ల నియంత్రణలో వాడే బీటీ ట్యాక్సీన్లను జీవక్రిమి సంహారకాలు అంటారు. కొన్ని బ్యాక్టీరియా నుంచి పారిశ్రామికంగా అనేక రసాయనాలను కిణ్వనం ద్వారా ఉత్పత్తి చేయవచ్చు. ఉదాహరణ: ల్యాక్టోబాసిల్లస్ కిణ్వనం ద్వారా ల్యాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. బ్యాక్టీరియాను కాలుష్య నియంత్రణలో కూడా ఉపయోగిస్తారు. బ్యాక్టీరియం లేదా వాటి మిశ్రమాలను వినియోగించి చేపట్టే జల, భూ కాలుష్య నిర్మూలనను బయో రేడియేషన్ అంటారు. చమురు వ్యర్థాల నిర్మూలనకు ఉపయోగించే ముఖ్యమైన బ్యాక్టీరియం సూడోమొనాస్ పుటిడా. శిలీంధ్రాలు వీటిని సాధారణంగా బూజులు (ఫంగి) అంటారు. నిజ కేంద్రక జీవులు. ఇవి ప్రధానంగా విచ్ఛిన్నకారులు లేదా వినియోగదారులు. మృత జంతు, వృక్ష కళేబరాలను విచ్ఛిన్నం చేసి వాటిలోని కర్బన పదార్థాలను అకర్బన ఖనిజాలుగా మార్చి నేల సారాన్ని పెంచుతాయి. భూమిపై దాదాపుగా లక్షకుపైగా శిలీంధ్ర జాతులు ఉన్నాయి. ఇవి ప్రదర్శించే తంతుయుత దేహం మైసీలియం. ఇందులోని శాఖలను హైఫే అంటారు. శిలీంధ్రాలు సిద్ధ బీజాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. మానవునికి వీటి ద్వారా సోకే వ్యాధులలో ప్రధానమైనవి.. తామర, కాండిడియాసిస్, మైసిటిస్మస్, సయడ్రా. కొన్ని శిలీంధ్రాలు విడుదల చేసే విష పదార్థాలు ఆహారం ద్వారా మానవునిలోకి చేరి వ్యాధులను కలుగజేస్తాయి. ఉదాహరణ-పప్పు ధాన్యాల్లో పెరిగే ఏస్పర్ జిల్లస్ ఫ్లేవస్ అనే శిలీంధ్రం నుంచి అఫ్లటాక్సిన్స్ అనే విష పదార్థాలు విడుదలవుతాయి. అత్యధిక శిలీంధ్ర వ్యాధి కారకాలు.. అవకాశవాద వ్యాధి కారకాలు. బలహీన అతిథి తారసపడినప్పుడే మాత్రమే వ్యాధి కారకాలుగా వ్యవహరిస్తాయి. ఉపయోగాలు: అనేక శీలింధ్రాలు మానవునికి ఉపయోగపడతాయి. ఈస్టు అనే ఏకకణ శీలింధ్రాన్ని జన్యు పరిశోధనల్లో వినియోగిస్తారు. దీన్ని ద్వారా నిర్వహించే కిణ్వనం ప్రక్రియతో అనేక రకాల మత్తు పానీయాలు..విస్కీ, బ్రాందీ, బీరు, వైన్ వంటి వాటిని తయారు చేస్తారు. కొన్ని శీలింధ్రాలు మొక్కల వేర్లతో సహజీవం చేస్తూ పోషకాలను అందిస్తాయి. ఈ రకమైన సహజీవనాన్ని మైకోరైజా అంటారు. ట్రైకోడెర్మ అనే శీలింధ్రం జీవ క్రిమిసంహారకంగా పని చేస్తుంది. వైరస్లు వైరస్ అనే పదానికి అర్థం విషం. ఇవి కణ వ్యవస్థను ప్రద ర్శించని ప్రత్యేక నిర్మాణాలు. జీవుల శరీరంలో మాత్రమే తమ సంఖ్యను పెంచుకునే జీవ లక్షణాన్ని ప్రదర్శిస్తాయి. జీవి వెలపల ఈ రకమైన లక్షణం లేనివి నిర్జీవులు. వీటి నిర్మాణంలో క్యాప్సిడ్ అనే ప్రోటీన్ తొడుగు.. అందులో జన్యు పదార్థం (డీఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ) ఉంటుంది. ఇవి దాదాపు అన్ని రకాల జీవులు, మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, శీలింధ్రాలపై దాడి చేస్తాయి. తద్వారా అతిధేయిలోకి ప్రవేశించిన వైరస్ ఒక ప్రత్యేక అతిధేయి కణాన్ని ఎంచుకుని మరీ దాడి చేస్తుంది. ఉదాహరణ- మానవునిలోకి ప్రవేశించిన హెచ్ఐవీ రోగ నిరోధక శక్తిలో కీలకమైన 4 లింఫోసైట్స్ అనే తెల్ల రక్త కణాలపై దాడి చేసి వాటి సంఖ్యను క్షిణింపచేస్తుంది. బ్యాక్టీరియా మాదిరిగా వైరస్లు కూడా వివిధ మార్గాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తా యి. వైరస్ల మాదిరిగా కణ వ్యవస్థ లేని మరికొన్ని నిర్మాణాలు ప్రకృతిలో ఉన్నాయి. అవి..ప్రయాన్స్, వైరాయిడ్స్. ఇవి పూర్తిగా ప్రోటీన్ నిర్మితాలు. ఇవిక్షీరదాల కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. పశువుల్లో మ్యాడ్‌కౌ, గొర్రెల్లో స్క్రేపీ, పపువన్యూగినియా ప్రాంతంలోని ప్రజలలో కురు అనే వ్యాధులకు కారణమవుతాయి. మొక్కల్లో మాత్రమే వ్యాధులను కలుగజేసే ఆర్ఎన్ఏ నిర్మితాలు వైరాయిడ్లు. బ్యాక్టీరియా- కలుగజేసే వ్యాధులు: కలరా - విబ్రియో కలరే టైఫాయిడ్ - సాల్మోనెల్ల టైఫి బొట్యులిజం - క్లాస్ట్రీడియం బొట్యులినం టెటనస్ (ధనుర్వాతం) - క్లాస్ట్రీడియం టెటనీ షీజెల్లోసిస్ - షీజెల్ల సోని ఆంథ్రాక్స్ - బాసిల్లస్ ఆంథ్రసిస్ నిమోనియ - స్ట్రెప్టోకోకస్ నిమోనియే కుష్టు - మైకోబ్యాక్టీరియం ట్యుబర్కులోసిస్ ప్లేగు - ఎర్సీనియ పెస్టిస్ డిఫ్తీరియా (కంఠసర్పి) - కార్నిబ్యాక్టీరియం డిఫ్తిరియే కోరింత దగ్గు (పర్టుసిస్) - బోర్టెటెల్ల పర్టుసిస్ గనేరియా - నిస్సీరియా గనేరియా ట్రకోమా - క్లామిడియా ట్రకోమ్యాటిస్ సిఫిలిస్ - ట్రెపోనీమా ప్యాలిడం వైరస్ వ్యాధులు ఇన్ఫ్లుయంజా (ఫ్లూ) - ఆర్థోమిక్సో వైరస్ మిజిల్స్ (రుబియోల) - ప్యారామిక్సో వైరస్ పోలియో మైలిటిన్ - పికోర్న వైరస్ జర్మన్ మీజిల్స్ (రూబెల్ల) - టోగా వైరస్ అమ్మ వారు (చికెన్‌పాక్స్) - వారిసెల్ల వైరస్ చికున్ గున్యా - చిక్‌వి (టోగా/ఆల్ఫా) వైరస్ జపనీస్ ఎన్సిఫలైటిస్ - ఫ్లేవీ (ఒఉ) వైరస్ డెంగీ జ్వరం - ఫ్లేవీ వైరస్ హెపటైటిస్ - ఆర్థోహెపడ్నా వైరస్ గవద బిళ్లలు - పారామిక్సో వైరస్ ఎయిడ్స్ - హెచ్ఐవీ జలుబు - రైనో వైరస్ గర్భాశయముఖం క్యాన్సర్ - హ్యూమన్ పాపిల్లోమ క్యాన్సర్ ఎల్లో ఫివర్ - ఆర్బో వైరస్ క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ - బున్యా వైరస్ హెర్పస్ సింప్లెక్స్ - హెర్పస్ వైరస్ ఎబోలా-ఫైలో వైరస్ severe acute respiratory syndrome and middle east respiratory syndrome -కరోన వైరస్ శిలీంధ్ర వ్యాధులు కాండిడియాసిస్ - కాండిడ ఆల్చికన్స్ మైసిటిస్మస్ - విష పుట్టగొడుగులు ఫంగల్ మైనింజైటిస్ - క్రిప్టోకోకస్ బ్లాక్ మోల్ట్ - స్టాకిబోట్రిస్ అథ్లెట్స్ఫుట్ - ట్రైకోఫైటాన్ -
సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు ఎవరు?
కంటికి నేరుగా కనిపించని జీవ జాలాలను సూక్ష్మజీవులు అంటారు. బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, ఫంగస్ మొదలైనవి సూక్ష్మజీవులకు ఉదాహరణ. వీటిలో వైరస్ తప్ప మిగతా సూక్ష్మజీవులు మానవ సంక్షేమానికి తోడ్పడుతున్నాయి. అదేవిధంగా హాని కలిగించేవి కూడా ఉన్నాయి. వీటి ఉనికికి సంబంధించిన అధ్యయనం 16వ శతాబ్దంలో ప్రారంభమైంది. జెకారియస్ జాన్సన్ 1590లో సూక్ష్మదర్శినిని కనుగొన్నారు. ఆ తర్వాత ఆంటోని వాన్ లీవెన్ హాక్ సంయుక్త సూక్ష్మదర్శినిని కనుగొన్నారు. కొన్ని సూక్ష్మజీవులను అతి శక్తిమంతమైన సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. దీన్ని ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని అంటారు. దీన్ని నాల్, రస్కా 1932లో కనుగొన్నారు. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా సూక్ష్మ జీవిని సుమారు లక్ష రెట్లు పెద్దదిగా చేసి చూడొచ్చు. సూక్ష్మజీవులు - బ్యాక్టీరియా బ్యాక్టీరియాను ఆంటోని వాన్ లీవెన్ హాక్ 1676లో కనుగొన్నారు. బ్యాక్టీరియా అని పేరు పెట్టినవారు ఎహెరెన్ బర్గ. బ్యాక్టీరియా విశ్వవ్యాప్తం. దాదాపు అన్ని రకాల ఆవాసాల్లో జీవించగలుగుతుంది. ఆంథ్రాక్స్ను కలగజేసే బ్యాక్టీరియాను కనుగొన్నందుకు రాబర్ట కోచ్‌కు నోబెల్ బహుమతి లభించింది. ఎడ్వర్డ జెన్నర్ (1796) బ్యాక్టీరియా వ్యాధులను - నిర్మూలించే వ్యాక్సినేషన్‌ను కనుగొన్నారు. బెజరింక్ (1888) లెగ్యూమ్ మొక్కల వేరుబుడిపెల్లో రైజోబియం బ్యాక్టీరియాను కనుగొన్నారు. బ్యాక్టీరియాను ‘మిత్రులు, శత్రువులు’, ‘ప్రకృతి పారిశుధ్య కార్మికులు’గా పేర్కొం టారు. బ్యాక్టీరియా కేంద్రక పూర్వజీవకణం. అతిపెద్ద బ్యాక్టీరియా - ఎపులోపిసియం పిసెల్సోని. అతి చిన్న బ్యాక్టీరియా పీపీఎల్ఓ(ప్లూరో న్యుమోనియా లైక్ ఆర్గానిజం). పెద్దపేగులో ఉండే బ్యాక్టీరియా ఎశ్చరీసియా కోలి. గంగా నదిలో ఉండే బ్యాక్టీరియా - డీలో విబ్రియో బ్యాక్టీరియో వోరస్. మట్టిలో ఉండే బ్యాక్టీరియా - క్లాస్ట్రీడియం. బ్యాక్టీరియా కణంలో సుమారు 70% నీరు, 21% ప్రోటీన్స, 4.5% కేంద్రకామ్లాలు, 3% లిపిడ్స, 1.5% పాలీశాఖరైడ్స ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియాలు కశాభాలను కలిగి ఉంటాయి. ఇవి చలనానికి, ఇతర జీవులను అంటుకొని ఉండటానికి తోడ్పడతాయి. బ్యాక్టీరియా వివిధ ఆవాసాల్లో జీవిస్తుంది. ఒక గ్రామ్ మృత్తికలో 106 - 107 బ్యాక్టీరియాలుంటాయి. మంచినీటిలో కంటే మురుగునీటిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. బ్యాక్టీరియాలు పరాన్నజీవులుగా, సహ జీవులుగా, కొన్ని పూతికాహారులుగా జీవిస్తాయి. రైజోబియం, ఇ-కొలీ అనే బ్యాక్టీరియాలు సహజీవనం చేస్తాయి. వ్యాధులను కలిగించేవి పరాన్నజీవ బ్యాక్టీరియా. కొన్ని బ్యాక్టీరియాలు... వేడి బుగ్గల్లో, అతిశీతల ప్రదేశాల్లో, ఆమ్ల (ఎసిడోఫిలిక్), క్షార (ఆల్కలోఫిలిక్), లవణ (హాలోఫిలిక్) స్వభావం ఉండే ప్రదేశాల్లో నివసిస్తాయి. బ్యాక్టీరియా కణ కవచం మ్యూరిన్/మ్యూరామక్ ఆమ్లంతో నిర్మితమై ఉంటుంది. కణ కవచంపై ప్లాజెల్లా (కశాభాలు) ఉంటాయి. కణత్వచం ముడతలను మీసోజోమ్ అంటారు. ఇది శ్వాసక్రియలో తోడ్పడుతుంది. బ్యాక్టీరియాలో కేంద్రకం లోపించి కేవలం డీఎన్ఏ మాత్రమే ఉంటుంది. దీన్ని న్యూక్లియాయిడ్ అంటారు. తక్కువ పరిమాణంలో ఉన్న డీఎన్ఏను ప్లాస్మిడ్ అంటారు. ఇది డీఎన్ఏ టెక్నాలజీ / జెనెటిక్ ఇంజనీరింగ్‌లోనూ తోడ్పడుతుంది. బ్యాక్టీరియాలో నిల్వ ఆహార పదార్థం గ్లైకోజన్. కొన్ని బ్యాక్టీరియాల్లో క్రోమాటోఫోర్ ఉండటం వల్ల అవి పిండి పదార్థాలను తయారు చేసుకోగలుగుతాయి. బ్యాక్టీరియాలో ద్విదావిచ్ఛితి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ప్రతి 18 - 20 నిమిషాలకు ఒకసారి కణాలు ద్విగుణీకరణం చెందుతాయి. బ్యాక్టీరియాలో ప్రత్యుత్పత్తి విధానాలు 1. జన్యుపరివర్తన: దీన్ని ప్రెడ్గ్రిఫిట్ అనే శాస్త్రజ్ఞుడు ఎలుకల్లో ఉండే స్రెప్టోకోకస్ న్యుమోనియే అనే బ్యాక్టీరియాలో కనుగొన్నాడు. ఒక కణంలోని జన్యు పదార్థం అది పెరిగి యానకం ద్వారా వేరే కణంలోకి బదిలీ అవుతుంది. 2. సంయుగ్మం: ఈ విధానాన్ని లెడెన్బర్గ, టాటం అనే శాస్త్రజ్ఞులు ఇ. కొలి బ్యాక్టీరియాలో కనుగొన్నారు. కణాలు పరస్పరం తాకడం వల్ల జన్యుమార్పిడి జరుగుతుంది. 3. జన్యు వాహనం: దీన్ని లెడెన్బర్గ, జిండర్ అనే శాస్త్రజ్ఞులు సాల్మోనెల్లా టైఫిమ్యారియం అనే బ్యాక్టీరియాలో కనుగొన్నారు. దీంట్లో వైరస్ (బ్యాక్టీరియోఫేజ్) ద్వారా కణంలోకి జన్యు పదార్థం మార్పిడి జరుగుతుంది. అభిరంజన లక్షణాన్ని బట్టి గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగెటివ్ బ్యాక్టీరియాగా గుర్తిస్తారు. దీనిలో క్రిస్టల్ వయోలెట్‌ను ఉపయోగిస్తారు. ఈ అంశాన్ని క్రిస్టియన్ గ్రామ్ కనుగొన్నారు. గ్రామ్ పాజిటివ్సలో ట్రైకోయిక్ ఆమ్లం ఉంటుంది. బ్యాక్టీరియా - ప్రయోజనాలు పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా - లాక్టోబాసిల్లస్ పెద్దపేగులో ఉండి ఆ12 విటమిన్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ృ ఇ.కొలీ జెనెటిక్ ఇంజనీరింగ్‌లో ఎక్కువగా తోడ్పడేది ృ ఇ.కొలీ గోబర్‌గ్యాస్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా - మిథనోకోకస్, మిథనో బాసిల్లస్ గంగానదిలో హానికర సూక్ష్మజీవులను నశింపజేసేది - డీలో విబ్రియో బ్యాక్టీరియో వోరస్ వ్యవసాయ రంగంలో నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియాలు - నైట్రోసో మోవాస్, నైట్రోబాక్టర్, అజటోబాక్టర్, అజోస్పైరిల్లం, క్లాస్ట్రీడియం మొదలైనవి. లెగ్యూమ్ (పప్పుధాన్యాలు) మొక్కల్లో నత్రజని స్థాపన చేసేది - రైజోబియం. రెట్టింగ్ (నార తీయడం), టానింగ్ (తోళ్లను పదును పెట్టడం), పొగాకు క్యూరింగ్, కిణ్వణం మొదలైన ప్రక్రియల్లో ఉపయోగపడేవి... క్లాస్ట్రీడియం బ్యుటలకం, క్లాస్ట్రీడియం ఫెల్సీనియం. వివిధ రకాల యాంటీ బయోటిక్స్ కూడా బ్యాక్టీరియాల నుంచి లభిస్తాయి. {స్టెప్టోమైసిన్ - స్ట్రెప్టోమైసిన్ గ్రిసియస్ (దీన్ని వాక్స్మెన్ కనుగొన్నాడు) టెట్రాసైక్లిన్ (ఆరోమైసిన్) - స్ట్రెప్టోమైసిస్ ఆరోఫేసియస్ ఎరిథ్రోమైసిన్ - స్ట్రెప్టోమైసిన్ ఎరిథ్రియస్ నియోమైసిన్ - స్ట్రెప్టోమైసిన్ ఫ్రాడియే టెర్రామైసిన్ - స్ట్రెప్టోమైసిస్ రియోసస్ కనామైసిన్ - స్ట్రెప్టోమైసిస్ కెనోమైసిటియస్ క్లోరో మైసిటిన్ - స్ట్రెప్టోమైసిన్ వెనిజులె పాలిమిక్సిన్ బి- బాసిల్లస్ పాలిమిక్సా సింథటిక్ రబ్బర్ తయారీలో అసిటో బాక్టర్ను ఉపయోగిస్తారు. జెనెటిక్ ఇంజనీరింగ్‌లో ట్రాన్సజెనిక్ ప్లాంట్స్‌ను తయారు చేసేందుకు బాసిల్లస్ దురెంజియన్సిస్, ఆగ్రో బ్యాక్టీరియం ట్యుమిఫేసియన్స, ఇ-కొలీ వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. యురేనియం, కాపర్ గనుల్లోనూ థయోబాసిల్లస్ ఫెరాక్సిడెన్స వంటి బ్యాక్టీరియాను ఉపయోగిస్తున్నారు. జున్ను పరిశ్రమల్లో తయారయ్యే యోగార్టను లాక్టోబాసిల్లస్ సాన్‌ఫ్రాన్సిస్కో నుంచి తీస్తారు. పర్యావరణ పరిరక్షణలో ఎక్రోమోబాక్టర్, అసిటోబాక్టర్, ఫ్లావో బ్యాక్టీరియం వంటివి 2, 4ఈ, ఈఈఖీ వంటి వాటిని నశింపజేస్తాయి. పాలను పెరుగుగా మార్చడానికి ముందు పాలను వేడి చేసి చల్లార్చుతారు. దీన్నే పాశ్చరైజేషన్ అంటారు. పాలను 50 ృ 600ఇ వరకు వేడి చేసి హానికర బ్యాక్టీరియాను నశింప జేస్తారు. ఈ విధానాన్ని లూయిస్ పాశ్చర్ కనుగొన్నారు. ఇతడిని సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు అని కూడా అంటారు. కలరా సంభవించినప్పుడు ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వాలి. దీన్ని తయారు చేసేందుకు ఒక గ్లాసు నీటిలో 3 చెంచాల చెక్కర, 1 చెంచా ఉప్పును కలపాలి. డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతాల నిర్మూలనకు ఈ్కఖీ(ట్రిపుల్ యాంటీజెన్) ఇంజెక్షన్ చేస్తారు. డిప్తీరియా నిర్ధారణకు షేక్ పరీక్ష చేస్తారు. ధనుర్వాతం కండరాలకు సంభవిస్తుంది. టైఫాయిడ్ వ్యాధి పేగు భాగానికి సోకుతుంది. దీని నిర్ధారణకు వైడల్ పరీక్ష చేస్తారు. క్షయ వ్యాధి ఊపిరితిత్తులు, ఎముకలకు సోకుతుంది. దీని నిర్మూలనకు ఆఇఎ టీకా, నివారణకు ఈైఖీ చికిత్స చేస్తారు. గనేరియా, సిఫిలిస్ అనేవి ఖీఈ వ్యాధులు (్ఛ్ఠఠ్చడ ఖీట్చటఝజ్ట్ట్ఛీఛీ ఛీజీట్ఛ్చట్ఛట) గొర్రెల్లో ఆంథ్రాక్స్ వ్యాధి బాసిల్లస్ ఆంథ్రోసిస్ ద్వారా సంభవిస్తుంది. కుక్కలు, పశువుల్లో ట్యుబర్ కులోసిస్ అనేది మెకో బ్యాక్టీరియం ట్యుబర్కులోసిస్ వల్ల సంభవిస్తుంది. పశువుల్లో మైకోబ్యాక్టీరియం బోవిస్ వల్ల ఆక్టినో మైకోసిస్, విబ్రియోటిటస్ వల్ల విబ్రియోసిస్ వ్యాధులు సంభవిస్తాయి. కలుషిత ఆహారాన్ని తిన్నప్పుడు ‘బొటులిజం’ అనే వ్యాధి సంభవిస్తుంది. మొక్కలు - బ్యాక్టీరియా వ్యాధులు వరిబ్లైట్ - జాంథోమోనాస్ ఒరెజై సిట్రస్ కాంకర్ (నిమ్మగజ్జి) - జాంథోమోనాస్ సిట్రె ఆపిల్ బ్లైట్ - ఎర్వీనియా అమైలోవొరా ఆపిల్, పియర్ వ్రణాలు - ఆగ్రో బ్యాక్టిరాయం ట్యుమిఫేసియన్స పత్తి కోణీయ ఆకుమచ్చ తెగులు - జాంథోమోనాస్ మాల్వేసియారం సొలనేసి మొక్కల వడల తెగులు - సూడోమోనాస్ సొలనేసి యారం గతంలో అడిగిన ప్రశ్నలు 1. ట్యుబర్ క్యులోసిస్ వ్యాధి దేని వల్ల వస్తుం ది? (పోలీస్ కానిస్టేబుల్ -2012) 1) వైరస్ 2) ప్రోటోజోవా 3) పోషకాహార లోపం 4) బ్యాక్టీరియా 2. డయేరియాను తగ్గించడానికి వాడే ద్రావ ణం ైఖను విస్తరించండి? (పోలీస్ కానిస్టేబుల్ -2012) 1) Oral Rehydration Solution 2) Oral Recharging Solution 3) Oral Replenishing Solution 4) Oral Reducing Solution 3. కింది వాటిలో దేన్ని నిర్ధారించడం కోసం ‘వైడల్ పరీక్ష’ చేస్తారు? (పోలీస్ కానిస్టేబుల్ -2012) 1) మలేరియా 2) టైఫాయిడ్ 3) ట్యుబర్ క్యులోసిస్ 4) పచ్చజ్వరం 4. తాజా పాలకు కొంచెం ఆమ్లత్వం ఉండటా నికి కారణం? (ఎస్ఐ -2012) 1)ఇౌ2 మాత్రమే 2) ఏ2ఇై3 మాత్రమే 3) లాక్టిక్ బ్యాక్టీరియా మాత్రమే 4) పైవన్నీ 5. ఏ వ్యాధి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ప్రత్యక్షంగా సంక్రమించదు? (ఎస్ఐ -2012) 1) తట్టు 2) ధనుర్వాతం 3) కంఠవాతం 4) ఊపిరితిత్తుల క్షయ 6. పాలు పెరుగుగా మారినప్పుడు పుల్లని రుచి రావడానికి కారణం? (ఎస్ఐ -2011) 1) సిట్రిక్ ఆమ్లం 2) ఎసిటిక్ ఆమ్లం 3) లాక్టిక్ ఆమ్లం 4) టార్టారిక్ ఆమ్లం 5) ఆక్సాలిక్ ఆమ్లం మాదిరి ప్రశ్నలు 1. బ్యాక్టీరియా శుద్ధ వర్ధనం చేసిన మొదటి వ్యక్తి? 1) లూయీస్ పాశ్చర్ 2) ఆంటోని వాన్ లీవెన్ హాక్ 3) ఎడ్వర్డ జెన్నర్ 4) రాబర్ట కోచ్ 2. ఒక గ్రాము సారవంతమైన మట్టిలో ఎన్ని బ్యాక్టీరియాలుంటాయి? 1) 100 మిలియన్లు 2) 1 మిలియన్ 3) 500 మిలియన్లు 4) 1 బిలియన్ పైగా 3. ఒక బ్యాక్టీరియా కణం ప్రతి నిమిషానికి ద్విదావిచ్ఛితి చెందుతూ ఒక కప్పును ఒక గంటలో నింపినట్లయితే మొదటి సగం కప్పు నిండటానికి ఎంత సమయం అవసరం? 1) 15 ని. 2) 30 ని. 3) 59 ని. 4) 61 ని. 4. బ్యాక్టీరియో ఫేజెస్ అంటే? 1) బ్యాక్టీరియాలో నివసించే వైరస్ 2) బ్యాక్టీరియాపై దాడిచేసే వైరస్ 3) బ్యాక్టీరియాను నాశనం చేసే వైరస్ 4) వైరస్ పైన దాడిచేసే బ్యాక్టీరియా