సూక్ష్మజీవులు.. వ్యాధి కారకాలు | Micro-disease factors | Sakshi
Sakshi News home page

సూక్ష్మజీవులు.. వ్యాధి కారకాలు

Published Thu, Jan 8 2015 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

సూక్ష్మజీవులు.. వ్యాధి కారకాలు

సూక్ష్మజీవులు.. వ్యాధి కారకాలు

మానవునికి అనేక రకాల సూక్ష్మజీవుల ద్వారా వ్యాధులు సంక్రమిస్తాయి. వీటిలో ముఖ్యమైనవి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్‌లు, ప్రోటోజోవా వర్గానికి చెందిన కొన్ని జీవులు. ఇందులో కొన్నిటి ద్వారా స్వల్ప స్థాయిలో ప్రభావం కనిపిస్తే.. మరికొన్ని ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో వ్యాధులు అదుపు తప్పి దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తాయి. 2009 మార్చిలో మెక్సికోలో మొదలైన స్వైన్‌ఫ్లూ ఇప్పుడు దాదాపు 200 దేశాలకు విస్తరించడమే ఇందుకు చక్కని ఉదాహరణ. అదేవిధంగా ఎబోలా వంటి వ్యాధులు కూడా ఈ విధంగా వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు. ఈ సందర్భంలో వైద్య సంసిద్ధత సరిగా లేకపోతే నష్టం తీవ్రంగా ఉండొచ్చు. సూక్ష్మ జీవులను కేవలం వ్యాధిని కలుగజేసే కారకాలుగా మాత్రమే పరిగణించడం సరికాదు. ఎందుకంటే వీటి వల్ల మానవునికి ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి.
 
 బ్యాక్టీరియా
 సూక్ష్మజీవుల్లో ముఖ్యమైనవి బ్యాక్టీరియా. ఇవి కేంద్రకపూర్వ జీవులు, ఏకకణ జీవులు. ఒక నిర్దిష్ట కేంద్రకం, ఇతర కణ భాగాలు లేని పూర్వకణాలు.. కేంద్రకపూర్వ కణాలు (్కటౌజ్చుటడౌ్టజీఛి ఛ్ఛిట). వీటిలో జన్యు పదార్థం (డీఎన్‌ఏ) ఏ ఆచ్ఛాదన లేకుండా కణ ద్రవ్యంలో ఉంటుంది. కేంద్రకపూర్వ కణాలతో ఏర్పడతాయి కాబట్టి వీటిని కేంద్రక పూర్వ జీవులు (Prokaryotes) అంటారు. ఇవి పూర్వపరమైన జీవులు. జీవావిర్భావ ప్రారంభంలో పరిణామం చెందాయి. వీటి నుంచి తర్వాతి కాలంలో నిజ కేంద్రక జీవులు పరిణామం చెందాయి. రాబర్‌‌ట విట్టేకర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన జీవుల వర్గీకరణలో కేంద్రకపూర్వ జీవులన్నింటిని మొనీరా (కౌ్ఛట్చ) రాజ్యంలో వర్గీకరించారు. బ్యాక్టీరియా, సయనో బ్యాక్టీరియా అనే రెండు రకాల జీవులను మొనీరా రాజ్యంలో వర్గీకరించారు.
 
  సయనో బ్యాక్టీరియా కూడా బ్యాక్టీరియాను పోలిన జీవి. వీటిని అంతకుముందు నీలి-ఆకుపచ్చ శైవలాలు (ఆఠ్ఛ ఎట్ఛ్ఛ అజ్చ్ఛ) గా పిలిచేవారు. ప్రారంభంలో వీటిని శైవలాలుగా భావించడమే దీనికి కారణం. తర్వాతి కాలంలో ఇవి శైవలాలు, నిజకేంద్రక జీవులు కాదని గుర్తించి, బ్యాక్టీరియా ఉన్న మొనీరా రాజ్యంలో చేర్చారు. బ్యాక్టీరియా సాధారణంగా రెండు రకాలు. అవి.. ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా. వీటిల్లో ఆర్కీ బ్యాక్టీరియా అతి పురాతనమైంది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం బ్యాక్టీరియా తమ మనుగడను సాగించగలదు. 60 నుంచి 800ఛి ఉష్ణోగ్రత వద్ద ఉన్న సల్ఫర్ ఊటలో సైతం ఇవి జీవిస్తాయి. ఉదాహరణ: థర్మోప్లాస్మా, మెథనో బ్యాక్టీరియా.
 
 విభిన్న ఆకారాలు:
 సాధారణంగా బ్యాక్టీరియా అనే పదాన్ని ఉపయోగించినపుడు మనం తెలియకుండానే యూ బ్యాక్టీరియాను సంభోధించినట్టు అవుతుంది. ఇవి విభిన్న ఆకారాల్లో ఉంటాయి. అవి.. దండ ఆకార బ్యాక్టీరియం, బాసిల్లస్, వృత్తాకార బ్యాక్టీరియం, కోకస్, కామా ఆకార బ్యాక్టీరియం, విబ్రియో, సర్పిలాకార బ్యాక్టీరియం, స్పైరిల్లం. సాధారణంగా బ్యాక్టీరి యం నిర్మాణంలో బాహ్యంగా ఒక కణకవచం ఉంటుంది. ఇది పెప్టిడోగ్లైకాన్/మ్యూరీన్/మ్యాకోపెప్ట్మై అనే పదార్థంతో తయారవుతుంది. కొన్ని బ్యాక్టీరియాల్లో కణకవచం మందంగా, మరికొన్నింటిలో పల్చగా ఉంటుంది. ఈ రెండు రకాల బ్యాక్టీరియాను కచ్చితంగా నిర్ధారించే ప్రక్రియ/ పరీక్షను హాన్‌‌స క్రిస్టియన్ గ్రామ్ రూపొందించాడు. ఈ పరీక్ష కణకవచం మందంగా ఉంటే పాజిటివ్, పల్చగా ఉంటే నెగిటివ్‌గా స్పందిస్తుంది. కాబట్టి బ్యాక్టీరియాను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి.. 1. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఉదాహరణ: స్ట్రె ప్టోకోకస్ నియోనియే. 2. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఉదాహరణ: విబ్రియో కలరే. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో కణకవచం పల్చగా ఉంటుంది.

 కాబట్టి వీటిలో కణకవచానికి అదనంగా బాహ్యంగా అవుటర్ మెంబరెన్ (Outer membrane)  అనే బాహ్య పొర ఉంటుంది. ఇది కొవ్వు పిండి పదార్థంతో తయారవుతుంది. కాబట్టి దీన్ని ఎల్‌పీఎస్ (లిపో పాలీ శాఖరైడ్) లేయర్ అంటారు. కణకవచం తర్వాత లోపలి వైపు కణద్రవ్యాన్ని కప్పి ప్లాస్మాత్వచం ఉంటుంది. కణద్రవ్యంలో వృత్తాకార డీఎన్‌ఏ ప్రధాన జన్యు పదార్థం. నిజకేంద్రక కణాల మాదిరి డీఎన్‌ఏ కేంద్రకంలో ఉండదు. ఈ రకమైన జన్యు నిర్మాణం, న్యూక్లియామిడ్ లేదా జీనోఫోర్ లేదా బ్యాక్టీరియా క్రోమోజోమ్, రైబో జోమ్‌లు అనే కణ భాగాలు ప్రొటీన్లను నిర్మిస్తాయి. ప్రధాన జన్యు పదార్థానికి అదనంగా కూడా బ్యాక్టీరియా కణద్రవ్యంలో స్వయం ప్రతికృతి చెందే వృత్తాకార డీఎన్‌ఏ అణువులు ఉంటాయి. వీటిని ప్లాస్మిడ్‌‌స అంటారు. వీటి ద్వారా బ్యాక్టీరియాకు అదనపు లక్షణాలు సంభవిస్తాయి. నేడు వివిధ యాంటీబయాటిక్ మందులకు నిరోధకతను అభివృద్ధి చేసుకోవడానికి కారణం ఈ ప్లాస్మిడ్‌లు.
 
 పలు మార్గాల ద్వారా:
 వివిధ మార్గాల ద్వారా బ్యాక్టీరియాలు వ్యాధులను కలుగజేస్తాయి. అవి..
 గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు: క్షయ, నిమోనియ, డిఫ్తీరియా, కోరింత దగ్గు.
 కలుషిత ఆహారం, నీరు ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు: కలరా, బొట్యులిజం, షిజెల్లోసిస్, టైఫాయిడ్.
 దూళి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు: టెటానస్ (ధనుర్వాతం), బొట్యులిజం.
 లైంగికంగా సంక్రమించే వ్యాధులు: సిఫిలిస్, గనేరియా.
 అధిక శాతం బ్యాక్టీరియాలు మానవునిలోకి ప్రవేశించి విష పదార్థాలను విడుదల చేయడం ద్వారా తమ ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణ: కలరా బ్యాక్టీరియా చిన్న పేగులో కలరాజెన్ అనే కలరా టాక్సిన్‌ను విడుదల చేస్తుంది.
 
 ఉపయోగాలు:
 మానవునికి బ్యాక్టీరియా ద్వారా పలు ఉపయోగాలు ఉన్నాయి. ఎశ్చరిషియకొలి అనే బ్యాక్టీరియాను జన్యు పరిశోధనల్లో వినియోగిస్తారు. నీటి కాలుష్యానికి సూచికగా కూడా పని చేస్తుంది. స్ట్రెప్టోమైసిస్ నుంచి అనేక యాంటీబయాటిక్‌లు లభిస్తాయి. కొన్ని బ్యాక్టీరియా మృత్తికలో ఇది స్వేచ్ఛగా ఉంటూ లేదా మొక్కల వేర్లతో సహజీవనం చేస్తూ నేలలో నత్రజని స్థాపనను నిర్వహించి నేలసారాన్ని అభివృద్ధి చేస్తాయి. ఉదాహరణ: లెగ్యూం మొక్కల వేర్లలో రైజోబియం బ్యాక్టీరియాకు చెందిన పలు జాతులు సహజీవనం చేస్తూ వేరు బొడిపెలను ఏర్పర్చి నత్రజని స్థాపనను నిర్వహిస్తుంది. తద్వారా వేర్లకు నత్రజని అందిస్తుంది. ఈ విధంగా నేలలోకి కూడా నత్రజని విడుదలై నేలసారం అభివృద్ధి చెందుతుంది. ఈ కారణంతోనే లెగ్యూం పంటలను అంతర పంటలుగా, మిశ్రమ పంటలుగా సాగు చేస్తారు. మృతికలో స్వేచ్ఛగా ఉంటూ కూడా కొన్ని బ్యాక్టీరియా నత్రజని స్థాపనను చేపడతాయి.
 
  ఉదాహరణ: అజటోబ్యాక్టర్, రోడోస్పైరిల్లం, అజోస్పైరిల్లం. ఇదే విధంగా కొన్ని సయానో బ్యాక్టీరియా కూడా నత్రజని స్థాపనను నిర్వహిస్తూనే మొక్కలకు కావల్సిన పెరుగుదల కారకాలు, విట్జమిన్లు అందిస్తాయి. బాసిల్లస్ తురింజియన్సిస్ (ఆఖీఆ్చఛిజీఠట ్టజిఠటజీజజ్ఛీటజీట) అనే బ్యాక్టీరియంలోని కొన్ని ప్రొటీన్లలో విషగుణాలను గుర్తించి వాటిని, పంట తెగుళ్ల నివారణలో వినియోగిస్తున్నారు. వీటినే బీటీ టాక్సిన్‌లు అంటారు. జన్యు మార్పిడి టెక్నాలజీ ద్వారా వీటిని అనేక పంటల్లో ప్రవేశపెట్టారు. ఈ విధంగా తెగుళ్ల నియంత్రణలో వాడే బీటీ ట్యాక్సీన్లను జీవక్రిమి సంహారకాలు అంటారు. కొన్ని బ్యాక్టీరియా నుంచి పారిశ్రామికంగా అనేక రసాయనాలను కిణ్వనం ద్వారా ఉత్పత్తి చేయవచ్చు. ఉదాహరణ: ల్యాక్టోబాసిల్లస్ కిణ్వనం ద్వారా ల్యాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. బ్యాక్టీరియాను కాలుష్య నియంత్రణలో కూడా ఉపయోగిస్తారు. బ్యాక్టీరియం లేదా వాటి మిశ్రమాలను వినియోగించి చేపట్టే జల, భూ కాలుష్య నిర్మూలనను బయో రేడియేషన్ అంటారు. చమురు వ్యర్థాల నిర్మూలనకు ఉపయోగించే ముఖ్యమైన బ్యాక్టీరియం సూడోమొనాస్ పుటిడా.
 
 శిలీంధ్రాలు
  వీటిని సాధారణంగా బూజులు (ఫంగి) అంటారు. నిజ కేంద్రక జీవులు. ఇవి ప్రధానంగా విచ్ఛిన్నకారులు లేదా వినియోగదారులు. మృత జంతు, వృక్ష కళేబరాలను విచ్ఛిన్నం చేసి వాటిలోని కర్బన పదార్థాలను అకర్బన ఖనిజాలుగా మార్చి నేల సారాన్ని పెంచుతాయి. భూమిపై దాదాపుగా లక్షకుపైగా శిలీంధ్ర జాతులు ఉన్నాయి. ఇవి ప్రదర్శించే తంతుయుత దేహం మైసీలియం. ఇందులోని శాఖలను హైఫే అంటారు. శిలీంధ్రాలు సిద్ధ బీజాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. మానవునికి వీటి ద్వారా సోకే వ్యాధులలో ప్రధానమైనవి.. తామర, కాండిడియాసిస్, మైసిటిస్మస్, సయడ్రా. కొన్ని శిలీంధ్రాలు విడుదల చేసే విష పదార్థాలు ఆహారం ద్వారా మానవునిలోకి చేరి వ్యాధులను కలుగజేస్తాయి. ఉదాహరణ-పప్పు ధాన్యాల్లో పెరిగే ఏస్పర్ జిల్లస్ ఫ్లేవస్ అనే శిలీంధ్రం నుంచి అఫ్లటాక్సిన్స్ అనే విష పదార్థాలు విడుదలవుతాయి. అత్యధిక శిలీంధ్ర వ్యాధి కారకాలు.. అవకాశవాద వ్యాధి కారకాలు. బలహీన అతిథి తారసపడినప్పుడే మాత్రమే వ్యాధి కారకాలుగా వ్యవహరిస్తాయి.
 
 ఉపయోగాలు:
 అనేక శీలింధ్రాలు మానవునికి ఉపయోగపడతాయి. ఈస్టు అనే ఏకకణ శీలింధ్రాన్ని జన్యు పరిశోధనల్లో వినియోగిస్తారు. దీన్ని ద్వారా నిర్వహించే కిణ్వనం ప్రక్రియతో అనేక రకాల మత్తు పానీయాలు..విస్కీ, బ్రాందీ, బీరు, వైన్ వంటి వాటిని తయారు చేస్తారు. కొన్ని శీలింధ్రాలు మొక్కల వేర్లతో సహజీవం చేస్తూ పోషకాలను అందిస్తాయి. ఈ రకమైన సహజీవనాన్ని మైకోరైజా అంటారు. ట్రైకోడెర్మ అనే శీలింధ్రం జీవ క్రిమిసంహారకంగా పని చేస్తుంది.
 
 వైరస్‌లు
 వైరస్ అనే పదానికి అర్థం విషం. ఇవి కణ వ్యవస్థను ప్రద ర్శించని ప్రత్యేక నిర్మాణాలు. జీవుల శరీరంలో మాత్రమే తమ సంఖ్యను పెంచుకునే జీవ లక్షణాన్ని ప్రదర్శిస్తాయి. జీవి వెలపల ఈ రకమైన లక్షణం లేనివి నిర్జీవులు. వీటి నిర్మాణంలో క్యాప్సిడ్ అనే ప్రోటీన్ తొడుగు.. అందులో జన్యు పదార్థం (డీఎన్‌ఏ లేదా ఆర్‌ఎన్‌ఏ) ఉంటుంది. ఇవి దాదాపు అన్ని రకాల జీవులు, మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, శీలింధ్రాలపై దాడి చేస్తాయి. తద్వారా అతిధేయిలోకి ప్రవేశించిన వైరస్ ఒక ప్రత్యేక అతిధేయి కణాన్ని ఎంచుకుని మరీ దాడి చేస్తుంది. ఉదాహరణ-
 
 మానవునిలోకి ప్రవేశించిన హెచ్‌ఐవీ రోగ నిరోధక శక్తిలో కీలకమైన 4 లింఫోసైట్స్ అనే తెల్ల రక్త కణాలపై దాడి చేసి వాటి సంఖ్యను క్షిణింపచేస్తుంది. బ్యాక్టీరియా మాదిరిగా వైరస్‌లు కూడా వివిధ మార్గాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తా యి. వైరస్‌ల మాదిరిగా కణ వ్యవస్థ లేని మరికొన్ని నిర్మాణాలు ప్రకృతిలో ఉన్నాయి. అవి..ప్రయాన్స్, వైరాయిడ్స్. ఇవి పూర్తిగా ప్రోటీన్ నిర్మితాలు. ఇవిక్షీరదాల కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. పశువుల్లో మ్యాడ్‌కౌ, గొర్రెల్లో స్క్రేపీ, పపువన్యూగినియా ప్రాంతంలోని ప్రజలలో కురు అనే వ్యాధులకు కారణమవుతాయి. మొక్కల్లో మాత్రమే వ్యాధులను కలుగజేసే ఆర్‌ఎన్‌ఏ నిర్మితాలు వైరాయిడ్‌లు.
 
 బ్యాక్టీరియా- కలుగజేసే వ్యాధులు:
  కలరా - విబ్రియో కలరే
 టైఫాయిడ్ - సాల్మోనెల్ల టైఫి
 బొట్యులిజం - క్లాస్ట్రీడియం బొట్యులినం
 టెటనస్ (ధనుర్వాతం) - క్లాస్ట్రీడియం టెటనీ
 షీజెల్లోసిస్ - షీజెల్ల సోని
 ఆంథ్రాక్స్ - బాసిల్లస్ ఆంథ్రసిస్
 నిమోనియ - స్ట్రెప్టోకోకస్ నిమోనియే
 కుష్టు -
 మైకోబ్యాక్టీరియం ట్యుబర్‌కులోసిస్
 ప్లేగు - ఎర్సీనియ పెస్టిస్
 డిఫ్తీరియా (కంఠసర్పి) -
 కార్నిబ్యాక్టీరియం డిఫ్తిరియే
 కోరింత దగ్గు (పర్టుసిస్) - బోర్టెటెల్ల పర్టుసిస్
 గనేరియా - నిస్సీరియా గనేరియా
 ట్రకోమా - క్లామిడియా ట్రకోమ్యాటిస్
 సిఫిలిస్ - ట్రెపోనీమా ప్యాలిడం
 
 వైరస్ వ్యాధులు
  ఇన్‌ఫ్లుయంజా (ఫ్లూ) - ఆర్థోమిక్సో వైరస్
 మిజిల్స్ (రుబియోల) - ప్యారామిక్సో వైరస్
 పోలియో మైలిటిన్ - పికోర్న వైరస్
 జర్మన్ మీజిల్స్ (రూబెల్ల) - టోగా వైరస్
 అమ్మ వారు (చికెన్‌పాక్స్) - వారిసెల్ల వైరస్
 చికున్ గున్యా - చిక్‌వి (టోగా/ఆల్ఫా) వైరస్
 జపనీస్ ఎన్సిఫలైటిస్ - ఫ్లేవీ (ఒఉ) వైరస్
 డెంగీ జ్వరం - ఫ్లేవీ వైరస్
 హెపటైటిస్ - ఆర్థోహెపడ్నా వైరస్
 గవద బిళ్లలు - పారామిక్సో వైరస్
 ఎయిడ్స్ - హెచ్‌ఐవీ
 జలుబు - రైనో వైరస్
 గర్భాశయముఖం క్యాన్సర్ -
 హ్యూమన్ పాపిల్లోమ క్యాన్సర్
 ఎల్లో ఫివర్ - ఆర్బో వైరస్
 క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ -
 బున్యా వైరస్
 హెర్పస్ సింప్లెక్స్ - హెర్పస్ వైరస్
 ఎబోలా-ఫైలో వైరస్
 severe acute respiratory syndrome and middle east respiratory syndrome -కరోన వైరస్
 
 శిలీంధ్ర వ్యాధులు
  కాండిడియాసిస్ - కాండిడ ఆల్చికన్స్
 మైసిటిస్మస్ - విష పుట్టగొడుగులు
 ఫంగల్ మైనింజైటిస్ - క్రిప్టోకోకస్
 బ్లాక్ మోల్ట్ - స్టాకిబోట్రిస్
 అథ్లెట్స్‌ఫుట్ - ట్రైకోఫైటాన్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement