Microbes
-
ఏఎంఆర్.. యమ డేంజర్!
సాక్షి, విశాఖపట్నం: అతి సర్వత్రా వర్జయేత్... అని పెద్దలు చెప్పినట్లుగా మేలు చేస్తున్నాయని యాంటీబయాటిక్స్‌ను మితిమీరి వాడటం మానవాళి మనుగడకు ముప్పుగా మారుతోంది. అతిగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మనుషులకు మేలు చేసే మైక్రోబ్స్‌ను నాశనం చేస్తున్నాయి. కీడు చేసే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) పెరగడానికి కారణమవుతున్నాయి. ప్రపంచ బ్యాంక్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం ఏఎంఆర్ వల్ల 2019 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏటా 49 లక్షల మంది మరణిస్తున్నారు. మన దేశంలో కూడా 2019లో ఏఎంఆర్ కారణంగా దాదాపు 3లక్షల మంది మృతిచెందారు. ఏఎంఆర్ మరణాలు ఎక్కువగా దక్షిణాసియా, లాటిన్ అమెరికా, కరేబియన్ దీవుల్లో గుర్తించారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కారక మరణాల కన్నా అధికంగా ఏఎంఆర్ మరణాలు ఏటా కోటి వరకు నమోదవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తలసరి ఆదాయం, డిమాండ్‌కు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను పెంచుకోవడానికి మన దేశంలో కూడా వాణిజ్య, జంతు, వ్యవసాయ ఉత్పత్తుల్లో యాంటీబయాటిక్స్ వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది. దీనిని అరికట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఏఎంఆర్ ముప్పును ప్రపంచమంతా కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు ‘వరల్డ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ అవేర్నెస్ వీక్’ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏమిటీ ఏఎంఆర్ ? » కంటికి కనిపించని సూక్ష్మ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పారాసైట్స్ మొదలైనవి మనిషి శరీరం లోపల, బయట, చుట్టూ ఉంటాయి. వీటన్నింటినీ మైక్రోబ్స్ అని పిలుస్తారు. » కొన్ని రకాల జీవక్రియలకు మైక్రోబ్స్ అవసరం. జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి, రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి, ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకోవడానికి మంచి బ్యాక్టీరియాలు, వైరస్లు సహాయకారిగా ఉంటాయి. వ్యవసాయం, పరిశ్రమల్లోను వీటి ప్రాధాన్యం పెరిగింది. » ఈ మైక్రోబ్స్ కేవలం మేలు చేయడమే కాదు... కొన్ని సందర్భాల్లో మానవాళితోపాటు జంతువులు, మొక్కలకు హాని కలిగిస్తాయి. అందుకే యాంటీ మైక్రోబియల్ టీకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టీకాలు ప్రమాదకర మైక్రోబ్స్‌ను అంతం చేయడం, వాటి వ్యాప్తిని తగ్గించడం చేస్తుంటాయి. » అయితే, యాంటిబయాటిక్స్ అధికంగా వాడటం వల్ల చెడు మైక్రోబ్స్ తమ శరీరంలో ఔషధ నిరోధక శక్తిని పెంచుకుంటాయి. టీకాలకు లొంగకుండా మొండిగా మారి సూపర్ బగ్స్‌గా రూపాంతరం చెందుతాయి. అప్పుడు టీకాలు, ఔషధాలు వినియోగించినా ఎలాంటి ఫలితం కనిపించదు. దీనినే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అంటారు. వన్ హెల్త్ అప్రోచ్ అవసరం ఏఎంఆర్ అనేది మానవ ఆరోగ్యం, జంతువులు, వ్యవసాయం, ఆహారం, పర్యావరణం... ఇలా అన్నింటిపైనా ప్రభావం చూపిస్తోంది. ఈ విపత్తు నుంచి బయటపడాలంటే ‘వన్ హెల్త్ అప్రోచ్’ ఆధారంగా మానవ ఆరోగ్యం, జంతు ఆరోగ్య, పర్యావరణ రంగాల మధ్య సమన్వయంతో కూడిన సహకార చర్యలు అవసరం. ఈ ముప్పు నుంచి కాపాడుకునేందుకు, సమస్యను పరిష్కరించడానికి 2017లో మన దేశం జాతీయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. 2022లోనే ఏపీలో కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాం. – డాక్టర్ బి.మధుసూదనరావు, ఐసీఏఆర్–సీఐఎఫ్టీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఆహారభద్రత, సుస్థిరాభివృద్ధికి ముప్పు » ప్రస్తుతం ఏఎంఆర్ మానవ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు, సుస్థిర అభివృద్ధికి సైతం ముప్పుగా పరిణమించింది. » ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం కేవలం ప్రాణనష్టంలోనే కాదు... అన్ని దేశాలను ఆర్థికంగా దిగజార్చేంత శక్తి ఏఎంఆర్‌కు ఉంది. » ఏఎంఆర్ కారణంగా 2050 నాటికి 100 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టాన్ని ప్రపంచం చవిచూస్తుందని అంచనా. » జీడీపీలో 3.5శాతం తగ్గుముఖం పట్టే ప్రమాదం ఉంది. » ఏఎంఆర్ వల్ల ప్రపంచ ఎగుమతుల్లో 3.5% వరకు తగ్గవచ్చు. » మితిమీరిన యాంటీబయాటిక్స్ వినియోగం వల్ల పశువుల ఉత్పత్తి 7.5శాతం తగ్గుతుంది. » ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి 28 మిలియన్ల మంది పేదరికంలో కూరుకుపోతారు. -
మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
గతంలో చనిపోయిన మనిషి శరీరం వ్యర్థం ఎందుకూ పనికిరాదు అని భావించేవాళ్లం. కానీ ప్రస్తుతం అలా కాదు. చనిపోయిన (నిబంధనల ప్రకారం) వారి అవయవాలను దానం చేయడం ద్వారా మరో నలుగురికి ప్రాణ దానం చేయవచ్చు. లేదంటే మెడికల్ కాలేజీల్లో పరిశోధనలు నిమిత్తం దానం చేయవచ్చు. తాజాగా ఒక సంస్థ మానవుల మలాన్ని దానం చేయాలని కోరుతోంది. ఇందుకు వారికి కోట్ల రూపాయలు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇది షాకింగ్‌గా అనిపించినా, మీరు చదివింది నిజమే. ఎందుకో తెలుసుకోవాలటే ఈ కథనాన్ని చదవాల్సిందే.అమెరికా, కెనడాలో పనిచేస్తున్న హ్యూమన్ మైక్రోబ్స్ (Human Microbes) అనే సంస్థ వైద్య పరిశోధనలు, ముఖ్యమైన ప్రయోగం కోసం మనుషుల మలాన్ని పరీక్షించాలని భావిస్తోంది. ఇందుకోసం మలవిసర్జన నమూనాలు పంపించాలని ప్రజలను కోరుతోంది. ఇందుకు వారికి పెద్ద ఎత్తున డబ్బును కూడా ముట్టచెప్పనుంది. అయిత ఎంపిక చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్. ఒక ప్రత్యేకమైన బాక్టీరియా ఉండే మలం కోసమే కంపెనీ వెతుకుతోంది.మానవ మలాన్ని కంపెనీ ఏమి చేస్తుంది?ఆరోగ్యకరమైన, కలుషితంకానీ, వ్యాధి-నిరోధక సూక్ష్మజీవులు ఉండే వారినుంచి మలాన్ని సేకరిస్తుంది. పేగుల్లో ఉండే ఒకే రకమైన బ్యాక్టీరియాలో వివిధ స్ట్రెయిన్స్ ఎందుకు ఉంటాయో నిర్ధారించుకునేందుకు వీరి మలాన్ని పరీక్షించనుంది కంపెనీ. సాధారణంగా మన పేగుల్లో వేలాదిరకాల బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే ఒకే రకమైన బ్యాక్టీరియాలో వివిధ స్ట్రెయిన్స్ ఉంటాయి. ఇవి పలు వ్యాధులకు దారి తీస్తాయి. ఇవి గట్ బ్యాక్టీరియాను ఎలా ప్రభావితం చేస్తాయి అనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తారు.There's a man currently paying $500 per 💩 sample on a hunt to try and find the "0.1% of people with healthy, unperturbed, disease-resistant microbiomes". He's screened over 1 million people and still hasn't found what he's looking for. https://t.co/xyEyL1NXcp https://t.co/9Rt2hZdYzI pic.twitter.com/m0ZXQB7kcR— Katherine Champagne (@keccers) March 18, 2024 ఈ క్రమంలోనే మానవుల మలాన్ని కొనుగోలు చేస్తోంది హ్యూమన్ మైక్రోబ్స్. డోనర్ల ఒక్కో శాంపిల్‌కు 500 డాలర్లు (సుమారు రూ.41,000) ఇస్తారు. రోజూ మల విసర్జన చేసే వారికైతే ఏడాదికి దాదాపు 180,000 డాలర్లు (దాదాపు రూ.1 కోటి 40 లక్షలు) చెల్లించనుంది. అయితే దాదాపు 10లక్షల మందిని పరీక్షిస్తే ఒక్కరు కూడా దొరకలేదని తెలుస్తోంది.హ్యూమన్ మైక్రోబ్స్ తరతరాలుగా 0.1 శాతం కంటే తక్కువ సూక్ష్మజీవులను కలిగి ఉన్న వ్యక్తులను ఎంపిక చేయనుంది. అంటే పరిశోధన ప్రయోజనాల కోసం ఉపయోగపడే ఈ సూక్ష్మజీవులను కలిగి ఉన్న కొద్ది మంది వ్యక్తుల కోసం కంపెనీ వెతుకుతోంది, తద్వారా వారు ఈ "అధిక నాణ్యత గల మలం దాతలను" పరిశోధకులతో కనెక్ట్ చేస్తుంది. సదరు వ్యక్తులను వైద్యులు, పరిశోధకులు, ఆసుపత్రులు, క్లినికల్ ట్రయల్స్ ,వ్యక్తులతో కనెక్ట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా మలాన్ని డొనేట్ చేయవచ్చు. హ్యూమన్ మైక్రోబ్స్ వెబ్సైట్ ప్రకారం, సంస్థ ఇచ్చే డబ్బు సరిపోకపోతే, సొంత ధరను నిర్ణయించుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్యాలు గత కొన్ని దశాబ్దాలుగా విపరీతంగా పెరుగుతున్నాయనీ, జనాభాలో ఎక్కువ భాగం ఇప్పుడు చాలా అనారోగ్యంగా ఉన్నారని కంపెనీ పేర్కొంది. ఈ పరిస్థితి తర తరానికి విపరీతంగా క్షీణిస్తున్న సంక్షోభమని వ్యాఖ్యానించింది. ఇటీవలి మైక్రోబయోమ్ పరిశోధన ఆవిష్కరణలు ఈ ప్రధాన సమస్యలను పరిష్కరిస్తాయనే ఆశలను రేకెత్తించిన ఈ నేపథ్యంలో ఆరోగ్యంగా ఉన్న 0.1 శాతం మంది వ్యక్తులు తమ పరిశోధనకు అవసరమని వెల్లడించింది. తద్వారా తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతోపాటు, వివిధ జీర్ణకోశ వ్యాధులతో బాధ పడుతున్న వారికి కూడా ఉపశమనం కలిగించవచ్చని భావిస్తోంది.హ్యూమన్ మైక్రోబ్స్ వెబ్సైట్లో ఉన్న ఒక వీడియోలో “స్టూల్ డోనార్” కావాలని పోస్ట్ చేసింది. ఈ హ్యూమన్ వేస్ట్ ఎవరినైనా కాపాడవచ్చని వివరించింది. అలాగే సెలక్ట్ అయిన డోనార్లకు హ్యూమన్ మైక్రోబ్స్ ముందుగానే డబ్బు చెల్లిస్తుంది. దాతలు డ్రై ఐస్ ఉపయోగించి శాంపిల్స్ షిప్పింగ్ చేయాలి. అంతేకాదు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతుంది. -
Antimicrobial Resistance: యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్‌తో ముప్పు
ఆక్స్ఫర్డ్(యూకే): కంటికి కనిపించని సూక్ష్మమైన బ్యాక్టీరియా, వైరస్లు, పారాసైట్లు, ఫంగస్ వంటివి మనిషి శరీరం లోపల, బయట, చుట్టూ ఉంటాయి. వీటిని మైక్రోబ్స్ అని పిలుస్తుంటారు. మన నిత్య జీవితంలో ఇవన్నీ ఒక భాగమే. కొన్ని రకాల జీవ క్రియలకు మైక్రోబ్స్ అవసరం. జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి, రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి, ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకోవడానికి బ్యాక్టీరియా, వైరస్లు తోడ్పడుతుంటాయి. వ్యవసాయం, పరిశ్రమల్లోనూ వీటి ప్రాధాన్యం ఎక్కువే. అయితే, ఈ మైక్రోబ్స్ కేవలం మేలు చేయడమే కాదు, కొన్ని సందర్భాల్లో కీడు చేస్తుంటాయి. అనారోగ్యం కలిగిస్తుంటాయి. మనుషులతోపాటు జంతువులు, మొక్కలకు హాని కలిగిస్తాయి. అందుకే యాంటీ మైక్రోబియల్ టీకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇవి మైక్రోబ్స్‌ను అంతం చేయడం లేదా వాటిని వ్యాప్తిని తగ్గించడం చేస్తుంటాయి. కాలానుగుణంగా మైక్రోబ్స్ ఔషధ నిరోధక శక్తిని పెంచుకుంటాయి. అంటే టీకాలను లొంగకుండా తయారవుతాయి. అంతిమంగా ‘సూపర్‌బగ్స్’గా మారుతాయి. అప్పుడు టీకాలు, ఔషధాలు ప్రయోగించిన ఫలితం ఉండదు. ఈ పరిణామాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) అంటారు. ఈ ఏఎంఆర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా 50 లక్షల మంది మరణిస్తున్నారని తాజాగా దక్షిణాఫ్రికా, యూకేలో జరిగిన అధ్యయనంలో వెల్లడయ్యింది. హెచ్ఐవీ/ఎయిర్స్, మలేరియా సంబంధిత మరణాల కంటే ఇవి చాలా అధికం. ఏఎంఆర్‌తో ఏటా మృత్యువాత పడే వారి సంఖ్య 2050 నాటికి ఏకంగా కోటికి చేరుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే క్యాన్సర్ సంబంధిత మరణాలను కూడా త్వరలో ఏఎంఆర్ మరణాలు అధిగమిస్తాయని అంటున్నారు. ► ప్రపంచవ్యాప్తంగా యాంటీబయోటిక్స్ వాడకం మితిమీరుతోంది. ► 2000 నుంచి 2015 మధ్య ఇది 65 శాతం పెరిగిపోయిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ► మొత్తం యాంటీ మైక్రోబియల్స్ 73 శాతం ఔషధాలను ఆహారం కోసం పెంచే జంతువులపైనే ఉపయోగిస్తున్నట్లు తేలింది. ► ఇలాంటి జంతువులను భుజిస్తే మనుషుల్లోనూ మైక్రోబ్స్ బలోపేతం అవుతున్నాయని, ఔషధాలకు లొంగని స్థితికి చేరుకుంటున్నాయని నిపుణులు గుర్తించారు. ► యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది కేవలం కొన్ని దేశాల సమస్య కాదని, ఇది ప్రపంచ సమస్య అని నిపుణులు చెబుతున్నారు. ► దీనిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యాంటీబయోటిక్స్‌పై అధారపడడాన్ని తగ్గించుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని పేర్కొంటున్నారు. -
వయసును సూక్ష్మజీవి శాసిస్తుందా?
మనిషి జీవితాన్ని కంటికి కనబడని సూక్ష్మజీవి నిర్దే శిస్తుందా? ఆయుఃప్రమాణాన్ని అంతర్గత రోగనిరోధకత ప్రభావితం చేస్తుందా? మైక్రోబ్స్ బారిన పడకుండా ఉంటే వృద్ధాప్య ఛాయలు తొందరగా రావా? అవునంటోంది తాజా పరిశోధన.. ఆ కథేంటో చూద్దాం! మనిషిలో రోగనిరోధకతకు, వృద్ధాప్యానికి సంబంధం ఉందనేలా నూతన అధ్యయన ఫలితాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ సంస్థ ఐసైన్స్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయన వివరాలు ఆసక్తికలిగించేలా ఉన్నాయి. డ్రోసోఫిలా(ఫ్రూట్‌ఫ్లై) అనే కీటకంపై సంస్థ జరిపిన పరిశోధనల్లో వయసు పెరుగుదలకు సంబంధించిన 70 శాతం జన్యువులకు బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా కలిగే ఇమ్యూన్ రెస్పాన్స్‌కు సంబంధం ఉన్నట్లు తేలింది. జీవి శరీరంలోకి బ్యాక్టీరియా లాంటి పరాయి పదార్ధాలు(యాంటిజెన్స్) ప్రవేశించగానే రోగనిరోధక వ్యవస్థ ఉత్తేజమై(ఇమ్యూన్ రెస్పాన్స్) సదరు యాంటిజెన్స్‌ను అడ్డుకుంటుందన్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలోనే ఏజింగ్‌ను ప్రేరేపించే జన్యువులు సైతం యాక్టివేట్ అవుతాయని నిరూపితమైంది. రోగనిరోధకత అతి చురుకుదనం(హైపర్ యాక్టివ్ ఇమ్యూనిటీ) చూపడం వల్ల నరాలకు డ్యామేజీ కలుగుతుందని మాత్రమే ఇప్పటివరకు శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. అయితే తాజాగా డ్రోసోఫిలాపై జరిపిన పరిశోధనతో ఇమ్యూనిటీ, ఏజింగ్ జన్యువులపై ప్రభావం చూపుతుందని తెలిసింది. ‘‘చాలా రోజులుగా ఏజింగ్ జీన్స్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రతి జీవిలో ఈ జీన్స్ కారణంగా వృద్ధాప్యం సంభవిస్తుంది. మా పరిశోధనలో ఈ జీన్స్‌లో 30 శాతం మాత్రమే సహజసిద్ధంగా ఏజింగ్ ప్రక్రియలో పాలుపంచుకుంటాయని, 70 శాతం ఏజింగ్ జీన్స్ ఇమ్యూన్ రెస్పాన్స్‌తో యాక్టివేట్ అవుతాయని తెలిసింది.’’అని సీనియర్ సైంటిస్టు డా.ఎడ్వర్డ్ జినిజెర్ చెప్పారు. వయసు ప్రభావిత సమస్యలపై జరిగే మెడికల్ రిసెర్చ్‌లకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందన్నారు. ఎలా కనుగొన్నారు? తాజాగా జన్మించిన కొన్ని డ్రోసోఫిలా కీటకాలను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు ఈగలను బ్యాక్టీరియా చొరబడలేని వాతావరణంలో యాంటీబయాటిక్స్ మధ్య పెంచారు. రెండో గ్రూపును సాధారణ వాతావరణంలో పెంచారు. వీటిలో బ్యాక్టీరియా బారిన పడని ఈగలు 63 రోజులు బతికితే, సహజ వాతావరణంలో బ్యాక్టీరియాకు గురైన ఈగలు 57 రోజులు మాత్రమే బతికాయి. దీంతో ఏజింగ్ జీన్స్‌ను ఇమ్యూనిటీ వ్యవస్థ ప్రభావితం చేస్తుందని, యాంటీబయాటిక్స్ వాడకం కారణంగా ఏజింగ్ జీన్స్ యాక్టివిటీ మందగించిందని నిర్ధారణకు వచ్చారు. ఈగల్లో 6 రోజుల జీవిత కాలం తేడా అంటే మానవుల్లో సుమారు 20 సంవత్సరాలకు సమానమని పరిశోధనలో పాల్గొన్న మరో సైంటిస్టు డా. అరవింద్ కుమార్ శుక్లా వివరించారు. అలాగే వీటిలో కొన్ని జన్యువులు శరీరాంతర్గత గడియారం(బయలాజికల్ క్లాక్)ను నియంత్రిస్తున్నట్లు తెలిసిందన్నారు. అయితే కచ్ఛితంగా వీటిలో ఏ జీన్స్ పూర్తిగా ఏజింగ్ ప్రక్రియకు కారణమనేది తెలియరాలేదని, దీనిపై మరింత పరిశోధన జరగాలని చెప్పారు. ఇమ్యూనిటీతో పాటు జీవక్రియలు, ఒత్తిడి తదితరాలపై కూడా మైక్రోబయోమె(శరీరంలో నివసించే అన్ని సూక్ష్మక్రిముల మొత్తం జన్యుపదార్థం) ప్రభావితం చేయగలవన్నారు. -
కరోనా నిరోధక శక్తికి ‘నిద్ర’ ముఖ్యం
న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సిన్‌గానీ, పడితే ప్రాణాలను కాపాడేందుకు తగిన మందులుగానీ ఇంతవరకు అందుబాటులో లేవు. కనుక పడకుండా ఉండేందుకు పరిశుభ్రత ఎలా ఏకైక మార్గమో, పడితే మన శరీరంలోని రోగ నిరోధక శక్తియే మనల్ని కాపాడాలి. మనలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే అన్ని విటమిన్లకు సంబంధించిన పండ్లు, కూరగాయలు తినాలని మన వైద్యులు చెబుతూ వస్తున్నారు. కానీ ఎన్నితిన్నా వేళకు సరైన నిద్ర లేకపోతే రోగ నిరోధక శక్తి శక్తివంతంగా పని చేయదట. ఈ విషయాన్ని అమెరికాలోని జాతీయ ఆరోగ్య సంస్థ ఇటీవల ఓ అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ చెప్పింది. మన శరీరమంతా బయటి నుంచి దాడిచేసే మైక్రోబ్స్‌ను ఎదుర్కొనేలా నిర్మాణమై ఉంది. అణువులతో కూడా మన శరీరంపైనుండే చర్మం భిగించినట్లుగా ఉండి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్ లాంటి మైక్రోబ్స్‌ను చొరపడకుండా అడ్డుకుంటుంది. అందుకు అనువుగా చర్మం వెలుపలి పొరలో ‘డెడ్ సెల్స్’ ఉంటాయి. కనుక కళ్లు, ముక్కు, నోరు ద్వారా మైక్రోబ్స్ శరీరంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తాయి. కళ్లలో ఓ దశ వరకు యాంటీసెప్టిక్ కన్నీళ్లు మైక్రోబ్స్‌ను అడ్డుకుంటాయి. ముక్కు, కాలేయంలో ఏర్పడే శ్లేష్మం కూడా వాటికి ఓ దశ వరకు అడ్డుకుంటాయి. కాలేయంలో తయారయ్యే శ్లేష్మం ముక్కు ద్వారా తుమ్ముల రూపంలో బయటకు వేగంగా వస్తుంది. శ్లేష్మం తుంపర్ల ద్వారా మైక్రోబ్స్ మన శరీరం నుంచి బయటకు వస్తాయి. ఈ ప్రక్రియను కూడా తట్టుకొని కొన్ని వైరస్లు మన శరీర జన్యువుల్లోకి ప్రవేశిస్తాయి. వాటిని మన రక్తంలోని యాంటీ బాడీస్ (రోగ నిరోధక శక్తి) గుర్తించి చంపేస్తాయి. మొట్టమొదటగా ‘బి–లింపోసైట్స్’గా పిలిచే కొన్ని తెల్ల రక్త కణాల గుంపు మైక్రోబ్స్‌ను ఎదుర్కొనేందుకు యాంటీ బాడీస్ సృష్టికి సంకేతాలు పంపిస్తాయి. అప్పుడు టీ–సెల్స్‌గా పిలిచే రక్తంలోకి మరికొన్ని తెల్ల రక్తకణాలు వైరస్ మీద దాడి చేస్తాయి. రసాయనిక సంకేతాలు పంపడం ద్వారా ఇవి మైక్రోబ్స్‌ను నాశనం చే స్తాయి. మైక్రోబ్స్‌ను ఎదుర్కోవడంలో భాగంగా అభివృద్ధి చెందిన యాంటీ బాడీస్ రక్తంలోని ప్లాస్మాలో కొన్ని సంవత్సరాలపాటు మనుగడ సాగిస్తాయి. యాంటీ బాడీస్ వల్ల నాశనం కాకుండా బతికే మైక్రోబ్స్ వల్లనే అంటురోగాలు వస్తాయి. (ఈ ఏడాది చివరికల్లా టీకా!) చర్మం దగ్గరి నుంచి రక్తంలోని యాంటీ బాడీస్ వరకు అన్ని రోగ లేదా మైక్రోబ్స్ నిరోధక వ్యవస్థలు సక్రమంగా పని చేయాలంటే జీవ గడియారం (బయాలోజికల్ క్లాక్) సరిగ్గా పని చేయాలని, అందులో నిద్ర అతి ముఖ్యమైనదని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ నిపుణులు తెలియజేశారు. ఏ వేళకు తినాలి, ఏ వేళకు నిద్రపోవాలి, ఏ వేళకు నిద్ర లేవలనే ప్రక్రియలను నిర్దేశించేదే జీవ గడియారం. ఈ జీవ గడియారం సక్రమంగా నడవాలన్నదే నిద్రనే ముఖ్యం. (చైనా కంటే ముందే ఆ దేశంలో కరోనా వైరస్!?) -
నానో కణాలతో కేన్సర్ చికిత్స!
రాగి చెంబులో ఉంచిన నీటిని తాగితే హానికారక సూక్ష్మజీవులు నశిస్తాయని మనం చాలాసార్లు విని ఉంటాం. మరి.. అదే రాగిని నానోస్థాయిలో... అంటే అత్యంత సూక్ష్మస్థాయిలో ఉపయోగిస్తే ఏమవుతుంది? కేన్సర్ కణితుల్లోని కణాలు చచ్చిపోతాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో రాగి నానో కణాలు కణాలను నాశనం చేస్తాయని పలు యూనివర్శిటీల శాస్త్రవేత్తలు కలిసికట్టుగా చేసిన ప్రయోగాల ద్వారా స్పష్టమైంది. కేన్సర్ కణాలకు కొన్ని రకాల నానో కణాలకూ అస్సలు పడదని ఇటీవలే స్పష్టమైంది. దీంతో శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని పరిశోధనలు ప్రారంభించారు. రాగితోపాటు, ఆక్సిజన్‌తో తయారైన నానో కణాలు అత్యంత ప్రభావశీలంగా ఉన్నట్లు గుర్తించారు. కాపర్‌ఆక్సైడ్ నానోకణాలు ఒక్కసారి శరీరంలోకి ప్రవేశిస్తే.. అవి కరిగిపోయి విషపూరితంగా మారతాయి. కేన్సర్‌కణాలను మట్టుబెడతాయి. అయితే వీటిద్వారా సాధారణ కణాలకు నష్టం కలగకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు ఐరన్ ఆక్సైడ్‌ను జత చేయడం విశేషం. రోగ నిరోధక కణాలను ఉత్తేజితం చేయడం ద్వారా కేన్సర్ చికిత్స కల్పించే ఇమ్యూనోథెరపీని, కాపర్ ఆక్సైడ్ నానో కణాలను కలిపి ప్రయోగించినప్పుడు ఎలుకల్లో చాలా ఎక్కవ కాలంపాటు కేన్సర్ తిరగబెట్టలేదని ప్రొఫెసర్ స్టీఫాన్ సోనెన్ తెలిపారు. తాము ఎలుకల ఊపిరితిత్తులు, పేవు కేన్సర్లపై ప్రయోగాలు చేసి మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. -
ప్రాణవాయువు గుట్టు విప్పినందుకు..
తిన్న ఆహారం శక్తిగా మారాలంటే మనిషితోపాటు అన్ని రకాల జంతువులకూ ఆక్సిజన్ అవసరం. సూక్ష్మస్థాయిలో కణాలూ ఆక్సిజన్ తగ్గిపోతే ఇబ్బంది పడతాయి. ఈ సూక్ష్మ కణాలు తమ పరిసరాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉందని ఎలా గుర్తిస్తాయి? అందుకు తగ్గట్లుగా తమను తాము ఎలా మలచుకుంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కున్న శాస్త్రవేత్తలు కెలీన్, రాట్క్లిఫ్, సెమెన్జాలకు ఈ ఏడాది వైద్యనోబెల్ దక్కింది. కణస్థాయిలో ఆక్సిజన్ స్థాయికి తగ్గట్లుగా జన్యువులను ప్రేరేపించే ఓ కణ యంత్రాంగాన్ని వీరు గుర్తించారు. ఆక్సిజన్ మోతాదుల్లో వచ్చే తేడాలు జీవక్రియలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునేందుకు, రక్తహీనత మొదలుకొని కేన్సర్ వరకూ అనేకవ్యాధులకు సరికొత్త, మెరుగైన చికిత్స కల్పించేందుకు ఈ పరిశోధనలు ఉపయోగపడతాయని స్వీడెన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ సోమవారం ప్రకటించింది. వాతావరణంలో 20 శాతం... భూ వాతావరణంలో 20 శాతం వరకూ ఉన్న ఆక్సిజన్ జీవక్రియల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. కణాల్లోని మైటోకాండ్రియా.. ఆక్సిజన్‌ను ఉపయోగించుకొని ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. ఎంజైమ్‌ల ద్వారా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుందని 1931 నోబెల్ గ్రహీత ఒట్టో వార్బర్గ్ గుర్తించారు. మెడకు ఇరువైపులా రెండు పెద్ద రక్తనాళాల పక్కనే ఉండే కరోటిడ్ బాడీలో... రక్తంలో ఆక్సిజన్ మోతాదును గుర్తించే ప్రత్యేక కణాలు ఉంటాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగాన్ని నియంత్రించేందుకు ఈ కరోటిడ్ బాడీలు మెదడుకు సంకేతాలు పంపుతాయని 1938 నో»ñ ల్ గ్రహీత కార్నైయిల్ హేమన్స్ గుర్తించారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు శరీరం చేపట్టే ఇంకో పని... ఎరిథ్రోపొయిటిన్ అనే హర్మోన్‌ను ఉత్పత్తి చేయడం. ఈ హార్మోన్ ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ఎక్కువ చేస్తుంది. అయితే ఈ ప్రక్రియను ఆక్సిజన్ ఎలా నియంత్రిస్తుందన్నది ఇటీవలి వరకూ తెలియదు. జన్యు ప్రహేళిక... ఈ ఏడాది నోబెల్ అవార్డుగ్రహీతలు సెమెన్జా, రాట్క్లిఫ్లు ఎరిథ్రోపొయిటిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసే జన్యువుపై పరిశోధనలు చేశారు. ఈ జన్యువులో మార్పులు చేసిన ఎలుకలను ఉపయోగించినప్పుడు ఆక్సిజన్ కొరతకు ఈ జన్యువు స్పందిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా ఈ ఎరిథ్రోపొయిటిన్ కిడ్నీ కణాల్లో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కానీ శరీరంలోని దాదాపు అన్ని కణజాలాల్లోనూ ఎరిథ్రోపొయిటిన్ ఉత్పత్తిని నియంత్రించే జన్యువు ఉన్నట్లు స్పష్టమైంది. దీంతోపాటు అనేక ఇతర ప్రొటీన్లు, (హెచ్ఐఎఫ్–1, ఏఆర్ఎన్టీ), ఒక రకమైన కేన్సర్‌ను నిరోధించే హార్మోన్‌ను ఉత్పత్తి చేసే జన్యువు వీహెచ్ఎల్కు కూడా కణాల ఆక్సిజన్ నియంత్రణలో తమదైన పాత్ర ఉన్నట్లు తెలిసింది. వీటన్నింటి మధ్య జరిగే చర్యలు ఆక్సిజన్ మోతాదుకు తగ్గట్లుగా కణాలు మార్పులు చేసుకునేందుకు కారణమవుతున్నట్లు తెలిసింది. వీటిల్లో కొన్ని పరిశోధనలను కెలీన్ వేరుగా చేశారు. ఏతావాతా... శరీరంలో ఆక్సిజన్ మోతాదు తక్కువగా ఉన్నప్పుడు హెచ్ఐఎఫ్–1 ప్రొటీన్ కణ కేంద్రకంలో ఎక్కువగా పోగుపడుతుంది. ఇక్కడ అది ఏఆర్ఎన్టీతో కలసి ఆక్సిజన్ లేమి, కొరతను నియంత్రించే జన్యువులకు అతుక్కుంటుంది. ఆక్సిజన్ సాధారణ స్థితిలో ఉన్నప్పుడు హెచ్ఐఎఫ్–1 వేగంగా నశిస్తూ టుంది. కొన్ని అణువులను జత చేయడం ద్వారా ఆక్సిజన్ దీనిని నియంత్రిస్తుంటుంది. ఎన్నో వ్యాధులకు హేతువు.. కణాలు ఆక్సిజన్ లేమి, కొరతలను గుర్తించకపోవడం రకరకాల వ్యాధులకు కారణమవుతుంది. కిడ్నీ వైఫల్యం ఉన్న వారిలో ఎక్కువ మంది రక్తహీనతతోనూ బాధపడుతుంటారు. ఎరిథ్రోపొయిటిన్ హార్మోన్ జన్యువు సక్రమంగా పనిచేయకపోవడం దీనికి కారణం. ఆక్సిజన్ మోతాదులను గుర్తించే వ్యవస్థ కేన్సర్ విషయంలోనూ కీలకంగా ఉంటుంది. కేన్సర్ కణితుల్లో ఈ వ్యవస్థ జీవక్రియలను మార్చేందుకు, కొత్త రక్తనాళాల ఏర్పాటు, కేన్సర్ కణాలు శరీరంలో వేగంగా వ్యాప్తి చెందేందుకూ ఉపయోగపడుతూ ఉంటాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సూక్ష్మజీవులను నింపుకుంటే వ్యాధులు దూరం!
మన జీర్ణవ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులకు, ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యునైటెడ్ కింగ్డమ్కు చెందిన బ్రాబ్రహమ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తాజాగా ఓ ప్రయోగం చేపట్టారు. దీని ప్రకారం.. జీర్ణవ్యవస్థకు సంబంధించిన బ్యాక్టీరియాను కృత్రిమ పద్ధతుల ద్వారా చేర్చడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పునరుజ్జీవం పొందుతుందని.. తద్వారా వ్యాధులను మరింత సమర్థంగా ఎదుర్కోవడం వీలవుతుందని ఈ పరిశోధన చెబుతోంది. తక్కువ వయసున్న ఎలుకల వ్యర్థాల నుంచి సేకరించిన బ్యాక్టీరియాను వయసు మీదపడిన ఎలుకల్లోకి జొప్పించినప్పుడు వాటి రోగ నిరోధక వ్యవస్థ పనితీరులో గణనీయమైన మార్పు కనిపించిందని ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన శాస్త్రవేత్త మరిసా స్టెబెగ్ తెలిపారు. పేవుల్లోని బ్యాక్టీరియాకు రోగనిరోధక వ్యవస్థకు మధ్య నిత్యం సమాచార వినిమయం జరుగుతూంటుందని వయసు పెరిగే కొద్దీ రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని మరిసా తెలిపారు. ఎలుకల్లో బాగా పనిచేసిన ఈ పద్ధతి మనుషుల్లోనూ పనిచేస్తుందా? లేదా? అన్నది ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉందని చెప్పారు. అయితే ఇప్పటికే జరిగిన కొన్ని పరిశోధనలు పేవుల్లోని బ్యాక్టీరియాకు, వయసుతోపాటు వచ్చే సమస్యలకు మధ్య సంబంధం ఉన్నట్లు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ తాజా పరిశోధనకు ప్రాముఖ్యత ఏర్పడింది. పరిశోధన వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
అంతరిక్షంలో బ్యాక్టీరియా బెడద
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్)లో కూడా సూక్ష్మజీవుల బెడద తప్పట్లేదు. అక్కడ బ్యాక్టీరియా, శిలీంధ్రం వంటి సూక్ష్మజీవులు ఉన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. దీంతో అక్కడి వ్యోమగాముల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎస్ఎస్లో భూమిపై ఉండే జిమ్, ఆస్పత్రుల్లో ఉండే అన్ని సూక్ష్మజీవులు ఉన్నట్లు కనుగొన్నారు. వీటిని కనుగొనడం వల్ల వ్యోమగాముల ఆరోగ్య సంరక్షణ కోసం, అంతరిక్షంలోకి ప్రయాణం చేసేటప్పుడు, అక్కడ నివసించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవచ్చని నాసా పేర్కొంది. ‘ఐఎస్ఎస్ వంటి మూసి ఉన్న ఆవరణలో సూక్ష్మజీవులు ఎంత కాలం జీవించి ఉంటాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’అని పరిశోధన బృందంలోని భారత సంతితికి చెందిన కస్తూరి వెంకటేశ్వరన్ వివరించారు. అక్కడ కనుగొన్న బ్యాక్టీరియాలో 26 శాతం స్టెఫైలోకోకస్, 23 శాతం పాంటియా, 11 శాతం బాసిల్లస్ ఉన్నట్లు ఆయన తెలిపారు. మానవుడి జీర్ణవ్యవస్థలో ఉండే ఎంటిరోబ్యాక్టర్, స్టెఫైలోకోకస్ ఆరియస్ (10 శాతం)ను గుర్తించినట్లు చెప్పారు. అయితే ఇవి వ్యోమగాములు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా లేదా అన్న విషయం ఇంకా తెలియదని తెలిపారు. అంతరిక్షంలో ఆ వాతావరణంలో బ్యాక్టీరియాలు క్రియాశీలకంగా ఉంటాయా లేదా అనేది కూడా పరిశోధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఐఎస్ఎస్లోని లోపలి ఉపరితలంలో 8 ప్రాంతాల్లో (కిటికీ, టాయిలెట్, డైనింగ్ టేబుల్..) సేకరించిన నమూనాలను పరిశీలించగా ఈ విషయం తెలిసింది. అరుణ గ్రహంపై జీవం అరుణగ్రహంపై జీవం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంగారకుడికి చెందిన ఉల్కపై బ్యాక్టీరియా ఉందని వారు లండన్‌కు చెందిన పరిశోధకులు గుర్తించారు. దీన్ని బట్టి అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. 1977–78 మధ్య అంటార్కిటికా ప్రాంతంలో జపాన్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలార్ రీసెర్చ్ జరుపుతున్న తవ్వకాల్లో ఏఎల్‌హెచ్–77005 అనే ఉల్క దొరికినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. దీనిపై హంగేరియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ, ఎర్త్ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఉల్కను అధ్యయనం చేసి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉల్క లోపల సేంద్రియ పదార్థ రూపంలో బ్యాక్టీరియా ఉందని కనుగొన్నట్లు ఇల్డికో గ్యొల్లయ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ‘భౌగోళిక, జీవ, రసాయన, వాతావరణ శాస్త్ర రంగాలకు చెందిన పరిశోధకులకు మా పరిశోధనలు ఎంతో మేలు చేస్తాయి’అని ఇల్డికో చెప్పారు. తమ పరిశోధనతో భవిష్యత్తులో ఉల్కలు, గ్రహ శకలాలను అధ్యయనం చేసే తీరు మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
తీ ఇన్ వన్ స్మార్ట్ విండో!
మీ ఇంట్లోని కిటికీలు ఒకేసారి మూడు పనులు చేయగలిగితే ఎలా ఉంటుంది? ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేశారు నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. వీరు అభివృద్ధి చేసిన స్మార్ట్ కిటికీలు ఒకవైపు ఎండను, ఇంకోవైపు వేడిని నియంత్రిస్తూనే మరోవైపు హానికారక సూక్ష్మజీవులను చంపేయగలవు. విమానాలు మొదలుకొని ఆసుపత్రులు, బస్సులు, రైళ్లలో ఈ కిటికీలను వాడితే బ్యాక్టీరియా, వైరస్ల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించగలమనీ, అదే సమయంలో ఎండ, వేడిని నియంత్రించడం ద్వారా బోలెడంత డబ్బును కూడా ఆదా చేయగలమని అంటున్నారు షియా అనే శాస్త్రవేత్త. టంగ్స్టన్ ట్రయాక్సైడ్ అనే ప్రత్యేక పదార్థం వాడటం ద్వారా ఇది సాధ్యమవుతోందని, విద్యుత్తు ఛార్జ్ లేదా రసాయనాల ద్వారా ఈ పదార్థం తక్కువ సమయంలో కాంతిని ప్రసారం చే యడం లేదా అడ్డుకునే స్థితికి మారగలదని చెప్పారు. అదే సమయంలో సూర్యరశ్మిలోని పరారుణ కాంతికిరణాలను వేడిగా మార్చడం ద్వారా భవనం లోపలి భాగపు ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చునని వివరించారు. టంగ్స్టన్ ట్రయాక్సైడ్కు నానోస్థాయి బంగారు కణాలను చేర్చడం ద్వారా వేడిని గ్రహించవచ్చునని చెప్పారు. ఈ వేడి వల్ల కిటికీ ఉపరితలంపై ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్లు జీవించలేవని అన్నారు. -
సూక్ష్మజీవులు మారితే.. ఆరోగ్యం!
పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు మారితే.. ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. పరిశోధనశాలల్లో పనిచేసే మందులు కొన్ని వాస్తవ పరిస్థితుల్లో పనిచేయక పోవడానికీ ఇదే కారణం కావొచ్చని అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్‌లోని డాక్టర్ బార్బరా రెహర్మాన్ చెబుతున్నారు. ప్రకృతిలో, పరిశోధనశాలల్లో పెరిగే ఎలుకలు రెండూ వేర్వేరు. పరిశోధనశాలల్లో వాటికి ఏ రకమైన ఇన్ఫెక్షన్లు సోకకుండా జాగ్రత్తగా నియంత్రిత వాతావరణంలో పెంచుతారు. దీని ప్రభావం వాటి శరీరం, పేగుల్లోని సూక్ష్మజీవులపై ఉంటుందని బార్బరా పేర్కొంటున్నారు. ఈ సూక్ష్మజీవులు సాధారణ వాతావరణంలో వ్యాధులను ఎదుర్కొనేందుకు తగిన నిరోధకతను ఇస్తుందని, పరిశోధనశాలల్లో పెరిగిన ఎలుకలకు ఈ సామర్థ్యం ఉండదని వివరించారు. ఈ నేపథ్యంలో తాము సహజ సిద్ధంగా పెరుగుతున్న దాదాపు 800 ఎలుకల్లోని సూక్ష్మజీవులను సేకరించి పరిశోధనశాలల్లో పెరిగిన ఎలుకల్లోకి జొప్పించామని, నాలుగు తరాల తర్వాత అవి ఫ్లూ వైరస్‌ను తట్టుకున్నాయని వివరించారు. అలాగే పెద్దపేగు కేన్సర్ కణుతులు కూడా గణనీయంగా తగ్గిపోయినట్లు గుర్తించారు. ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు చేసి సహజసిద్ధమైన సూక్ష్మజీవుల ప్రభావాన్ని స్పష్టంగా గుర్తించాల్సి ఉందని చెప్పారు. -
నెల వయసులోనే గుర్తించొచ్చు!
లాస్ ఏంజిలెస్: నెల వయసున్న పసికందుల జీర్ణాశయంలో సూక్ష్మజీవులు ఉంటే బాల్యంలో ఆస్తమా, ఇతర అలర్జీలకు గురయ్యే అవకాశం 3 రెట్లు ఎక్కువని అధ్యయనంలో తేలింది. అధ్యయనం ఫలితాలు కొత్త చికిత్స అభివృద్ధికి దోహదం చేస్తాయని అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సుసాన్ లించ్ తెలిపారు. ఆస్తమా వ్యాధి నిర్ధారణ పిల్లల్లో ఏడేళ్ల వయసులో జరుగుతుందని, దీనికి చికిత్సా విధానం లేకపోవడంతో మందులు తీసుకోవాల్సి ఉంటుందని ఒక నెల వయసున్న పసికందుల జీర్ణాశయంలో ఉండే సూక్ష్మజీవులు రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని, తదుపరి మూడేళ్ల వయసులో అలర్జీలకు, నాలుగేళ్ల వయసులో ఆస్తమాకు దారి తీస్తాయని పరిశోధకులు వెల్లడించారు. -
క్రిములను మటుమాయం చేసేస్తుంది
ఇళ్లలో కిచెన్ ప్లాట్‌ఫామ్స్, బాత్రూమ్ గచ్చు వంటివి సూక్ష్మజీవులకు ఆవాసాలుగా ఉంటాయనేది తెలిసిందే. సూక్ష్మజీవుల బెడద తప్పించుకోవడానికి చాలామంది ఫినైల్ వంటివి వాడుతుంటారు. అయితే, వాటి వాసనను భరించడం చాలా కష్టం. అలాంటి బెడదేమీ లేకుండానే సూక్ష్మక్రిములను తొలగించుకోవడం ఇప్పటి వరకు దాదాపు అసాధ్యంగానే ఉంటూ వచ్చింది. అయితే, ఈ ఫొటోలో మోడర్న్ మంత్రదండంలా కనిపిస్తున్న పరికరం సూక్ష్మక్రిముల పాలిట మంత్రదండంలాగానే పనిచేస్తుంది. ఇది అల్ట్రావయొలెట్ శానిటైజర్. సూక్ష్మక్రిములకు ఆలవాలాలుగా ఉండే ప్రదేశాల్లో ఉపరితలానికి కాస్త చేరువగా ఈ పరికరాన్ని నెమ్మదిగా మంత్రదండం ఆడించినట్లుగా ఆడిస్తే చాలు... సూక్ష్మ క్రిములు అక్కడికక్కడే నాశనమైపోతాయి. ఇంతకీ ఇదెలా పనిచేస్తుందంటారా..? రీచార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ఈ పరికరంలో ఒక బల్బు ఉంటుంది. స్విచాన్ చేయగానే బల్బు వెలిగి దీని నుంచి అల్ట్రావయొలెట్ కిరణాలు వెలువడతాయి. ఇందులోంచి వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాలు సోకిన ప్రదేశంలో సూక్ష్మక్రిములు అక్కడికక్కడే నశిస్తాయి. ఇన్ఫ్లుయెంజాకు దారితీసే వైరస్, ఇ-కోలి, సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా సైతం దీని ధాటికి పూర్తిగా నాశనమవుతాయి. -
ఊబకాయానికి..సూక్ష్మజీవులకు లింకు!
ఎంత మితంగా తిన్నా లావెక్కుతున్నారా.. ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా.. అయితే దానికి కారణం మీ పేగుల్లోని సూక్ష్మజీవులే! తినే ఆహారంలోని పోషకాలు ఒంట పట్టేందుకు పేగుల్లోని సూక్ష్మజీవులు (మైక్రో బయోమ్) దోహదపడుతాయనే విషయం తెలిసిందే. అయితే ఈ మైక్రో బయోమ్లో తేడా వస్తే అనేక సమస్యలు వస్తాయని అమెరికాలోని యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో తేలింది. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే జంతువుల్లో ఎసిటేట్ అనే రసాయనాన్ని అధిక మొత్తంలో కనుగొన్నారు. అలాగే ఎసిటేట్‌ను శరీరంలోకి ఎక్కించినపుడు క్లోమంలోని బీటా కణాలు ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయని గుర్తించారు. అయితే దీనికి కారణాలు తెలియరాలేదు.ఎసిటేట్‌ను నేరుగా మెదడులోకి ఎక్కిస్తే పర సహనుభూత నాడీ వ్యవస్థ ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతోందని పరిశోధకులు వివరించారు. అతిగా తినడాన్ని ప్రేరేపించే గ్యాస్ట్రిన్, గ్రెలిన్ అనే హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు. -
వ్యాధుల వర్షం
వర్షం సంతోషాన్ని తెస్తుంది. జాగ్రత్తపడకపోతే కుండెడు వ్యాధులనూ తెస్తుంది. ప్రత్యేకంగా పిల్లలకు, వృద్ధులకు వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. అలాగే ఆఫీసులకు వెళ్లి వస్తూ వానలో తడిసే వాళ్లకు కూడా జాగ్రత్తలు అవసరం. మంచి అవగాహన, కొద్దిపాటి జాగ్రత్తలతో మీ ఫ్యామిలీ బాగుండాలని... మన ఫ్యామిలీ చెబుతోంది. ఈగలతో వచ్చే వ్యాధులు ఈ సీజన్లో వర్షాలు మొదలుకాగానే ఈగలు తప్పక కనిపిస్తుంటాయి. ముసురు పట్టగానే మరీ ఎక్కువగా వచ్చేస్తుంటాయి. ఈగలతో దాదాపు నూరు రకాల వ్యాధులు వస్తుంటాయి. ఇవి సాధారణంగా పరిశుభ్రత లేని పరిసరాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి కొన్ని మైళ్ల దూరం ప్రయాణం చేయగలరు. ఈగ లార్వాలతో వృద్ధి చెందే వ్యాధులను మైయాలిస్ అంటారు. సాధారణంగా ఒంటిపై ఉండే గాయాలు, పుండ్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఈగల ద్వారా వృద్ధి అయ్యే వ్యాధులు వ్యాప్తి చెందుతుంటాయి. ఈగ లార్వాలు కొన్ని కంటిలోకి కూడా ప్రవేశించి, రెటీనాకు సైతం హాని చేయవచ్చు. . ఈగల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల్లో కొన్ని... అమీబియాసిస్ : ఇవి ప్రోటోజోవాకు చెందిన సూక్ష్మక్రిములు. వీటి వల్ల ఆహారం కలుషితమైనప్పుడు తీవ్రమైన కడుపునొప్పి, మలంలో రక్తం పడటం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మలపరీక్ష, ఎలైసా వంటి వైద్యపరీక్షలతో ఈ వ్యాధిని సులభంగా గుర్తించవచ్చు. అమీబియాసిస్ వల్ల జీర్ణ వ్యవస్థలోని పేగులతో పాటు కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు వంటి కీలకమైన అవయవాలు సైతం దెబ్బతినవచ్చు. ముఖ్యంగా కాలేయంలో చీముగడ్డలు (లివర్ యాబ్సెస్) కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాలేయంలోని ఈ చీముగడ్డలను అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా సులభంగా గుర్తించవచ్చు. జియార్డియాసిస్ : ఈ వ్యాధి జియార్డియా లాంబ్లియా అనే ప్రోటోజోవా రకానికి చెందిన సూక్ష్మక్రిముల వల్ల వస్తుంది. ఈ జీవులు చిన్నపేగుల్లో నివాసం ఏర్పరచుకొని ఈ వ్యాధిని కలగజేస్తాయి. ఈ వ్యాధి వచ్చినవారిలో వికారం, వాంతులు, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు రక్తంలోకి విస్తరించినప్పుడు ఒంటిపై దురద రావడం, అలా దురద వచ్చిన ప్రాంతమంతా నల్లబారడం వంటి చర్మసంబంధమైన లక్షణాలూ కనిపిస్తాయి. తిన్న ఆహారం ఒంటికి పట్టకపోవడం (మాల్ అబ్జార్ప్షన్) వంటివి కూడా ఈ వ్యాధి వచ్చిన వారిలో కనిపిస్తుంటుంది. నీరు కలుషితం కావడం వల్ల ఈ సీజన్లో నీరు కలుషితం కావడం వల్ల కనిపించే ప్రధాన వ్యాధులు... టైఫాయిడ్ : సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. బ్లడ్ కల్చర్, స్టూల్ కల్చర్, వైడాల్ టెస్ట్ వంటి పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. సకాలంలో వైద్య చికిత్స అందించడం వల్ల దీనికి చికిత్స చేయవచ్చు. కలరా : విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. తీవ్రమైన నీళ్ల విరేచనాలు, వాంతులు వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. దాంతో బీపీ పడిపోవడం జరుగుతుంది. బియ్యం కడిగిన నీళ్లలా విరేచనం కావడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. అందుకే ప్రత్యేకంగా ఈ లక్షణాన్ని రైస్ వాటర్ స్టూల్స్ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ వ్యాధికి సకాలంలో వైద్యం అందకపోతే కిడ్నీలు పాడైపోవడం వంటి పరిణామాలు సంభవించి, ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. షిజెల్లోసిస్ : జ్వరం, రక్త విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, ఈ వ్యాధి లక్షణాలు. పేగులో ఇన్ఫెక్షన్ వచ్చే ‘టాక్సిక్ మెగా కోలన్’ అనే కాంప్లికేషన్‌తో పాటు రక్తంలో యూరియా పాళ్లు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగి, రక్తం కలుషితమయ్యే ‘కీటోలైటిక్ యురేమియా’ వంటి దుష్ర్పభావాలూ కనిపించవచ్చు. ఈ-కొలై : నీళ్ల విరేచనాలకు దారితీసే ఈ కండిషన్‌కు ‘ఈ-కొలై’ అనే బ్యాక్టీరియా కారణమవుతుంది. ఇది పేగులతో పాటు కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు, చర్మం లాంటి భాగాల్లోనూ ఇన్ఫెక్షన్ కలిగించవచ్చు. రక్తం, మూత్ర కల్చర్ పరీక్షల ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. దోమలతో వచ్చే వ్యాధులు మలేరియా : ఇది అనాఫిలస్ దోమతో వ్యాప్తి చెందే వ్యాధి. ఈ దోమ రాత్రివేళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దోమలో వృద్ధి చెందే ప్లాస్మోడియమ్ అనే ప్రోటోజోవా రకానికి చెందిన సూక్షజీవి వల్ల వస్తుంది. ఈ వ్యాధిలో ఒక రకం (స్పీషీస్) వల్ల సెరిబ్రల్ మలేరియా వస్తుంది. దీని వల్ల ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ తప్పిపడిపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, మూత్రపిండాలు విఫలం కావడం (రీనల్ ఫెయిల్యూర్) వంటివి రావచ్చు. చికన్ గున్యా : ఇది ఎడిస్ ఈజిప్టై అనే దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. దోమల వల్ల వ్యాప్తి చెందే ఒక రకం వైరస్ కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఏడిస్ ఈజిప్టై దోమ సాధారణంగా పగటి వేళ ఎక్కువగా కనిపిస్తుంటుంది. జ్వరంతో పాటు విపరీతమైన తలనొప్పి, తీవ్రస్థాయిలో కీళ్లనొప్పులు వస్తాయి. ఈ కీళ్లనొప్పులు భరించలేనంతగా ఉంటాయి. డెంగ్యూ : ఈ వ్యాధికి సైతం ఏడిస్ ఈజిప్టై దోమలే కారణం. జ్వరం, తీవ్రమైన తలనొప్పితో పాటు ఎముకలు విరిచేసినంత తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకే దీన్ని ‘బ్రేక్ బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. వ్యాధి ముదిరినప్పుడు అంతర్గత అవయావాల్లో రక్తస్రావం కూడా జరగవచ్చు. ఎలుకల వల్ల వర్షాలకు ఎలుకలు బయట నుంచి ఇంట్లోకి రావడం వల్ల లెప్టో స్పైరోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఎలుకలు వృద్ధి చేసే ఈ వ్యాధికి అసలు కారణం లెప్టోస్పైరోసిస్ అనే బ్యాక్టీరియా. ఎలుకల వల్ల ఆహారం కలుషితమైపోయి ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ సీజన్లో నీళ్లలో నిత్యం తిరిగే వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కొన్నిసార్లు వాంతులు కావడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ప్రధానంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు కడుపునొప్పి, కళ్లు ఎర్రబారడం, కళ్లు పచ్చగా మారడం కూడా జరుగుతుంది. వర్షాకాలపు వ్యాధుల నివారణ ఈ సీజన్‌లోని దాదాపు అన్ని వ్యాధులకు కారణం కలుషితమైన నీరే. కాబట్టి నీటిని కాచి చల్లార్చి తాగడం అన్నిటికంటే ప్రధానం.కుండల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నీరు తాగకండి.వాటర్‌ను డిస్ ఇన్ఫెక్ట్ చేయుడానికి క్లోరిన్ బిళ్ల వేసి క్లోరినేషన్ ద్వారా శుభ్రం చేసిన నీరు తాగడం వుంచిది.బయుటి ఆహార పదార్థాలు ఈ సీజన్లో వద్దు.తాజాగా వండుకున్న తర్వాత వేడిగా ఉండగానే తినండి. చల్లారిన ఆహారాన్ని వూటి వూటికీ వేడి చేసి తినవద్దు.వూంసాహారం కంటే శాకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే మాంసాహారం వల్ల వ్యాధులు వ్యాప్తిచెందవు. కానీ ఈగల వంటివి ముసరడానికి శాకాహారంతో పోలిస్తే మాంసాహారం వల్ల అవకాశం ఎక్కువ. సరిగ్గా ప్రాసెస్ చేయడం, పూర్తిగా ఉడికించడం వంటి జాగ్రత్తలు పాటిస్తే మాంసాహారంతో వచ్చే ముప్పును తప్పించుకోవచ్చు. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. నీళ్ల నిల్వకు అవకాశం ఇచ్చే, పాత టైర్లు, ఖాళీ కొబ్బరి చిప్పల వంటివి దోవుల పెరుగుదలకు ఉపకరిస్తారుు. నీటి నిల్వకు అవకాశం ఇచ్చే చిన్న చిన్న నీటి గుంటలు, పెపైచ్చులు ఊడిపోయిన సన్‌షేడ్‌కు పైన ఉండే ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెట్టి బ్రీడింగ్ చేస్తాయి. కాబట్టి మీ ఇంటి వద్ద దోమలను వృద్ధి చేసే పరిస్థితులన్నింటినీ నివరించండి. దోమ తెరలు వాడటం మేలు. ఈ సీజన్లో దోవులతో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోడానికి శరీరవుంతా కప్పే దుస్తులు వేసుకోవాలి.ఇంటి కిటికీలకు మెష్‌లు ఉపయోగించడం మేలు. కిటికీలకు మెష్‌లు ఉపయోగించడం కాస్త శ్రమతోనూ, ఖర్చుతోనూ కూడిన వ్యవహారమే. అయితే కిటికీలకు అంటించడానికి సంసిద్ధంగా ఉండే మెల్క్రో వంటి ప్లాస్టిక్ మెష్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.వేప ఆకులతో పొగవేయడం, మస్కిటో రిపల్లెంట్ ఉపయోగించడం వల్ల దోమలు దూరమవుతాయి. అయితే కొంతమందికి పొగ, మస్కిటో రిపల్లెంట్స్లోని ఘాటైన వాసనల వల్ల అలర్జీ ఉంటుంది. కుటుంబ సభుల్లో ఇలాంటి అలర్జీ ఉంటే జాగ్రత్తగా ఉండాలి.ఇంట్లో చెత్త వేసుకునే కుండీలను ఎప్పటికప్పుడు దూరంగా ఉన్న కుండీలలో వేస్తుండాలి. వీధిలో ఉండే కుండీలను సైతం సిబ్బంది తరచూ శుభ్రం చేసేలా జాగ్రత్త వహించాలి. త్వరగా కుళ్లేందుకు అవకాశం ఉన్న పదార్థాలను వెంటవెంటనే శుభ్రం చేసుకుంటూ ఉండాలి.వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వుల, వుూత్ర విసర్జనకు వుుందు, తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో లేదా బూడిదతో కడుక్కోవాలి.కొందరు నేల మీది వుట్టితో పాత్రలు శుభ్రం చేస్తారు. అలా ఎప్పుడూ చేయువద్దు. పాత్రలు శుభ్రం చేసే సవుయుంలో సబ్బు లేదా బూడిద వూత్రమే వాడాలి.వానలో అతిగా తడసిన సందర్భాల్లో అప్పటికే ఏవైనా ఇన్ఫెక్షన్లతో బాధపడే వారిలో నిమోనియా వంటి సెకండరీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారు సాధ్యమైనంత వరకు తల తడవకుండా జాగ్రత్త వహించాలి. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. చేతులు ఎక్కువగా కడుక్కోవడం వల్ల చాలా రకాల జబ్బులను... మరీ ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చే వ్యాధులను నివారించుకోవచ్చు. -
ఎన్నెన్నో అందాలు.. ఏవేవో వర్ణాలు..
చేయి తిరిగిన చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన కళాఖండంలా ఉంది కదూ ఈ చిత్రం! అయితే ఇది ఏ ఆయిల్ పెయింటింగో.. వాటర్ పెయింటింగో కాదు.. నేలపై ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన హరివిల్లు! నేలకు వర్ణాలద్దినట్లుగా ఉన్న ఈ చిత్రం శాన్ఫ్రాన్సిస్కోలోని ఉప్పు తయారీ క్షేత్రాల్లోనిది. సముద్రపు నీటి నుంచి ఉప్పు తయారు చేసే క్రమంలో నీటికి రకరకాల రంగులు వస్తుంటాయట. నీరు ఆవిరై ఉప్పు తయారయ్యేటపుడు వివిధ సూక్ష్మక్రిములు చేరి నీటిని పులియబెట్టడంతో రంగులు ఏర్పడతాయట. రంగులను బట్టి ఉప్పు లవణీయత కూడా తెలుస్తుందట. -
సూక్ష్మజీవులు.. వ్యాధి కారకాలు
మానవునికి అనేక రకాల సూక్ష్మజీవుల ద్వారా వ్యాధులు సంక్రమిస్తాయి. వీటిలో ముఖ్యమైనవి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు, ప్రోటోజోవా వర్గానికి చెందిన కొన్ని జీవులు. ఇందులో కొన్నిటి ద్వారా స్వల్ప స్థాయిలో ప్రభావం కనిపిస్తే.. మరికొన్ని ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో వ్యాధులు అదుపు తప్పి దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తాయి. 2009 మార్చిలో మెక్సికోలో మొదలైన స్వైన్‌ఫ్లూ ఇప్పుడు దాదాపు 200 దేశాలకు విస్తరించడమే ఇందుకు చక్కని ఉదాహరణ. అదేవిధంగా ఎబోలా వంటి వ్యాధులు కూడా ఈ విధంగా వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు. ఈ సందర్భంలో వైద్య సంసిద్ధత సరిగా లేకపోతే నష్టం తీవ్రంగా ఉండొచ్చు. సూక్ష్మ జీవులను కేవలం వ్యాధిని కలుగజేసే కారకాలుగా మాత్రమే పరిగణించడం సరికాదు. ఎందుకంటే వీటి వల్ల మానవునికి ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. బ్యాక్టీరియా సూక్ష్మజీవుల్లో ముఖ్యమైనవి బ్యాక్టీరియా. ఇవి కేంద్రకపూర్వ జీవులు, ఏకకణ జీవులు. ఒక నిర్దిష్ట కేంద్రకం, ఇతర కణ భాగాలు లేని పూర్వకణాలు.. కేంద్రకపూర్వ కణాలు (్కటౌజ్చుటడౌ్టజీఛి ఛ్ఛిట). వీటిలో జన్యు పదార్థం (డీఎన్ఏ) ఏ ఆచ్ఛాదన లేకుండా కణ ద్రవ్యంలో ఉంటుంది. కేంద్రకపూర్వ కణాలతో ఏర్పడతాయి కాబట్టి వీటిని కేంద్రక పూర్వ జీవులు (Prokaryotes) అంటారు. ఇవి పూర్వపరమైన జీవులు. జీవావిర్భావ ప్రారంభంలో పరిణామం చెందాయి. వీటి నుంచి తర్వాతి కాలంలో నిజ కేంద్రక జీవులు పరిణామం చెందాయి. రాబర్ట విట్టేకర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన జీవుల వర్గీకరణలో కేంద్రకపూర్వ జీవులన్నింటిని మొనీరా (కౌ్ఛట్చ) రాజ్యంలో వర్గీకరించారు. బ్యాక్టీరియా, సయనో బ్యాక్టీరియా అనే రెండు రకాల జీవులను మొనీరా రాజ్యంలో వర్గీకరించారు. సయనో బ్యాక్టీరియా కూడా బ్యాక్టీరియాను పోలిన జీవి. వీటిని అంతకుముందు నీలి-ఆకుపచ్చ శైవలాలు (ఆఠ్ఛ ఎట్ఛ్ఛ అజ్చ్ఛ) గా పిలిచేవారు. ప్రారంభంలో వీటిని శైవలాలుగా భావించడమే దీనికి కారణం. తర్వాతి కాలంలో ఇవి శైవలాలు, నిజకేంద్రక జీవులు కాదని గుర్తించి, బ్యాక్టీరియా ఉన్న మొనీరా రాజ్యంలో చేర్చారు. బ్యాక్టీరియా సాధారణంగా రెండు రకాలు. అవి.. ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా. వీటిల్లో ఆర్కీ బ్యాక్టీరియా అతి పురాతనమైంది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం బ్యాక్టీరియా తమ మనుగడను సాగించగలదు. 60 నుంచి 800ఛి ఉష్ణోగ్రత వద్ద ఉన్న సల్ఫర్ ఊటలో సైతం ఇవి జీవిస్తాయి. ఉదాహరణ: థర్మోప్లాస్మా, మెథనో బ్యాక్టీరియా. విభిన్న ఆకారాలు: సాధారణంగా బ్యాక్టీరియా అనే పదాన్ని ఉపయోగించినపుడు మనం తెలియకుండానే యూ బ్యాక్టీరియాను సంభోధించినట్టు అవుతుంది. ఇవి విభిన్న ఆకారాల్లో ఉంటాయి. అవి.. దండ ఆకార బ్యాక్టీరియం, బాసిల్లస్, వృత్తాకార బ్యాక్టీరియం, కోకస్, కామా ఆకార బ్యాక్టీరియం, విబ్రియో, సర్పిలాకార బ్యాక్టీరియం, స్పైరిల్లం. సాధారణంగా బ్యాక్టీరి యం నిర్మాణంలో బాహ్యంగా ఒక కణకవచం ఉంటుంది. ఇది పెప్టిడోగ్లైకాన్/మ్యూరీన్/మ్యాకోపెప్ట్మై అనే పదార్థంతో తయారవుతుంది. కొన్ని బ్యాక్టీరియాల్లో కణకవచం మందంగా, మరికొన్నింటిలో పల్చగా ఉంటుంది. ఈ రెండు రకాల బ్యాక్టీరియాను కచ్చితంగా నిర్ధారించే ప్రక్రియ/ పరీక్షను హాన్స క్రిస్టియన్ గ్రామ్ రూపొందించాడు. ఈ పరీక్ష కణకవచం మందంగా ఉంటే పాజిటివ్, పల్చగా ఉంటే నెగిటివ్‌గా స్పందిస్తుంది. కాబట్టి బ్యాక్టీరియాను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి.. 1. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఉదాహరణ: స్ట్రె ప్టోకోకస్ నియోనియే. 2. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఉదాహరణ: విబ్రియో కలరే. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో కణకవచం పల్చగా ఉంటుంది. కాబట్టి వీటిలో కణకవచానికి అదనంగా బాహ్యంగా అవుటర్ మెంబరెన్ (Outer membrane) అనే బాహ్య పొర ఉంటుంది. ఇది కొవ్వు పిండి పదార్థంతో తయారవుతుంది. కాబట్టి దీన్ని ఎల్పీఎస్ (లిపో పాలీ శాఖరైడ్) లేయర్ అంటారు. కణకవచం తర్వాత లోపలి వైపు కణద్రవ్యాన్ని కప్పి ప్లాస్మాత్వచం ఉంటుంది. కణద్రవ్యంలో వృత్తాకార డీఎన్ఏ ప్రధాన జన్యు పదార్థం. నిజకేంద్రక కణాల మాదిరి డీఎన్ఏ కేంద్రకంలో ఉండదు. ఈ రకమైన జన్యు నిర్మాణం, న్యూక్లియామిడ్ లేదా జీనోఫోర్ లేదా బ్యాక్టీరియా క్రోమోజోమ్, రైబో జోమ్‌లు అనే కణ భాగాలు ప్రొటీన్లను నిర్మిస్తాయి. ప్రధాన జన్యు పదార్థానికి అదనంగా కూడా బ్యాక్టీరియా కణద్రవ్యంలో స్వయం ప్రతికృతి చెందే వృత్తాకార డీఎన్ఏ అణువులు ఉంటాయి. వీటిని ప్లాస్మిడ్స అంటారు. వీటి ద్వారా బ్యాక్టీరియాకు అదనపు లక్షణాలు సంభవిస్తాయి. నేడు వివిధ యాంటీబయాటిక్ మందులకు నిరోధకతను అభివృద్ధి చేసుకోవడానికి కారణం ఈ ప్లాస్మిడ్లు. పలు మార్గాల ద్వారా: వివిధ మార్గాల ద్వారా బ్యాక్టీరియాలు వ్యాధులను కలుగజేస్తాయి. అవి.. గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు: క్షయ, నిమోనియ, డిఫ్తీరియా, కోరింత దగ్గు. కలుషిత ఆహారం, నీరు ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు: కలరా, బొట్యులిజం, షిజెల్లోసిస్, టైఫాయిడ్. దూళి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు: టెటానస్ (ధనుర్వాతం), బొట్యులిజం. లైంగికంగా సంక్రమించే వ్యాధులు: సిఫిలిస్, గనేరియా. అధిక శాతం బ్యాక్టీరియాలు మానవునిలోకి ప్రవేశించి విష పదార్థాలను విడుదల చేయడం ద్వారా తమ ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణ: కలరా బ్యాక్టీరియా చిన్న పేగులో కలరాజెన్ అనే కలరా టాక్సిన్ను విడుదల చేస్తుంది. ఉపయోగాలు: మానవునికి బ్యాక్టీరియా ద్వారా పలు ఉపయోగాలు ఉన్నాయి. ఎశ్చరిషియకొలి అనే బ్యాక్టీరియాను జన్యు పరిశోధనల్లో వినియోగిస్తారు. నీటి కాలుష్యానికి సూచికగా కూడా పని చేస్తుంది. స్ట్రెప్టోమైసిస్ నుంచి అనేక యాంటీబయాటిక్‌లు లభిస్తాయి. కొన్ని బ్యాక్టీరియా మృత్తికలో ఇది స్వేచ్ఛగా ఉంటూ లేదా మొక్కల వేర్లతో సహజీవనం చేస్తూ నేలలో నత్రజని స్థాపనను నిర్వహించి నేలసారాన్ని అభివృద్ధి చేస్తాయి. ఉదాహరణ: లెగ్యూం మొక్కల వేర్లలో రైజోబియం బ్యాక్టీరియాకు చెందిన పలు జాతులు సహజీవనం చేస్తూ వేరు బొడిపెలను ఏర్పర్చి నత్రజని స్థాపనను నిర్వహిస్తుంది. తద్వారా వేర్లకు నత్రజని అందిస్తుంది. ఈ విధంగా నేలలోకి కూడా నత్రజని విడుదలై నేలసారం అభివృద్ధి చెందుతుంది. ఈ కారణంతోనే లెగ్యూం పంటలను అంతర పంటలుగా, మిశ్రమ పంటలుగా సాగు చేస్తారు. మృతికలో స్వేచ్ఛగా ఉంటూ కూడా కొన్ని బ్యాక్టీరియా నత్రజని స్థాపనను చేపడతాయి. ఉదాహరణ: అజటోబ్యాక్టర్, రోడోస్పైరిల్లం, అజోస్పైరిల్లం. ఇదే విధంగా కొన్ని సయానో బ్యాక్టీరియా కూడా నత్రజని స్థాపనను నిర్వహిస్తూనే మొక్కలకు కావల్సిన పెరుగుదల కారకాలు, విట్జమిన్లు అందిస్తాయి. బాసిల్లస్ తురింజియన్సిస్ (ఆఖీఆ్చఛిజీఠట ్టజిఠటజీజజ్ఛీటజీట) అనే బ్యాక్టీరియంలోని కొన్ని ప్రొటీన్లలో విషగుణాలను గుర్తించి వాటిని, పంట తెగుళ్ల నివారణలో వినియోగిస్తున్నారు. వీటినే బీటీ టాక్సిన్లు అంటారు. జన్యు మార్పిడి టెక్నాలజీ ద్వారా వీటిని అనేక పంటల్లో ప్రవేశపెట్టారు. ఈ విధంగా తెగుళ్ల నియంత్రణలో వాడే బీటీ ట్యాక్సీన్లను జీవక్రిమి సంహారకాలు అంటారు. కొన్ని బ్యాక్టీరియా నుంచి పారిశ్రామికంగా అనేక రసాయనాలను కిణ్వనం ద్వారా ఉత్పత్తి చేయవచ్చు. ఉదాహరణ: ల్యాక్టోబాసిల్లస్ కిణ్వనం ద్వారా ల్యాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. బ్యాక్టీరియాను కాలుష్య నియంత్రణలో కూడా ఉపయోగిస్తారు. బ్యాక్టీరియం లేదా వాటి మిశ్రమాలను వినియోగించి చేపట్టే జల, భూ కాలుష్య నిర్మూలనను బయో రేడియేషన్ అంటారు. చమురు వ్యర్థాల నిర్మూలనకు ఉపయోగించే ముఖ్యమైన బ్యాక్టీరియం సూడోమొనాస్ పుటిడా. శిలీంధ్రాలు వీటిని సాధారణంగా బూజులు (ఫంగి) అంటారు. నిజ కేంద్రక జీవులు. ఇవి ప్రధానంగా విచ్ఛిన్నకారులు లేదా వినియోగదారులు. మృత జంతు, వృక్ష కళేబరాలను విచ్ఛిన్నం చేసి వాటిలోని కర్బన పదార్థాలను అకర్బన ఖనిజాలుగా మార్చి నేల సారాన్ని పెంచుతాయి. భూమిపై దాదాపుగా లక్షకుపైగా శిలీంధ్ర జాతులు ఉన్నాయి. ఇవి ప్రదర్శించే తంతుయుత దేహం మైసీలియం. ఇందులోని శాఖలను హైఫే అంటారు. శిలీంధ్రాలు సిద్ధ బీజాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. మానవునికి వీటి ద్వారా సోకే వ్యాధులలో ప్రధానమైనవి.. తామర, కాండిడియాసిస్, మైసిటిస్మస్, సయడ్రా. కొన్ని శిలీంధ్రాలు విడుదల చేసే విష పదార్థాలు ఆహారం ద్వారా మానవునిలోకి చేరి వ్యాధులను కలుగజేస్తాయి. ఉదాహరణ-పప్పు ధాన్యాల్లో పెరిగే ఏస్పర్ జిల్లస్ ఫ్లేవస్ అనే శిలీంధ్రం నుంచి అఫ్లటాక్సిన్స్ అనే విష పదార్థాలు విడుదలవుతాయి. అత్యధిక శిలీంధ్ర వ్యాధి కారకాలు.. అవకాశవాద వ్యాధి కారకాలు. బలహీన అతిథి తారసపడినప్పుడే మాత్రమే వ్యాధి కారకాలుగా వ్యవహరిస్తాయి. ఉపయోగాలు: అనేక శీలింధ్రాలు మానవునికి ఉపయోగపడతాయి. ఈస్టు అనే ఏకకణ శీలింధ్రాన్ని జన్యు పరిశోధనల్లో వినియోగిస్తారు. దీన్ని ద్వారా నిర్వహించే కిణ్వనం ప్రక్రియతో అనేక రకాల మత్తు పానీయాలు..విస్కీ, బ్రాందీ, బీరు, వైన్ వంటి వాటిని తయారు చేస్తారు. కొన్ని శీలింధ్రాలు మొక్కల వేర్లతో సహజీవం చేస్తూ పోషకాలను అందిస్తాయి. ఈ రకమైన సహజీవనాన్ని మైకోరైజా అంటారు. ట్రైకోడెర్మ అనే శీలింధ్రం జీవ క్రిమిసంహారకంగా పని చేస్తుంది. వైరస్లు వైరస్ అనే పదానికి అర్థం విషం. ఇవి కణ వ్యవస్థను ప్రద ర్శించని ప్రత్యేక నిర్మాణాలు. జీవుల శరీరంలో మాత్రమే తమ సంఖ్యను పెంచుకునే జీవ లక్షణాన్ని ప్రదర్శిస్తాయి. జీవి వెలపల ఈ రకమైన లక్షణం లేనివి నిర్జీవులు. వీటి నిర్మాణంలో క్యాప్సిడ్ అనే ప్రోటీన్ తొడుగు.. అందులో జన్యు పదార్థం (డీఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ) ఉంటుంది. ఇవి దాదాపు అన్ని రకాల జీవులు, మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, శీలింధ్రాలపై దాడి చేస్తాయి. తద్వారా అతిధేయిలోకి ప్రవేశించిన వైరస్ ఒక ప్రత్యేక అతిధేయి కణాన్ని ఎంచుకుని మరీ దాడి చేస్తుంది. ఉదాహరణ- మానవునిలోకి ప్రవేశించిన హెచ్ఐవీ రోగ నిరోధక శక్తిలో కీలకమైన 4 లింఫోసైట్స్ అనే తెల్ల రక్త కణాలపై దాడి చేసి వాటి సంఖ్యను క్షిణింపచేస్తుంది. బ్యాక్టీరియా మాదిరిగా వైరస్లు కూడా వివిధ మార్గాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తా యి. వైరస్ల మాదిరిగా కణ వ్యవస్థ లేని మరికొన్ని నిర్మాణాలు ప్రకృతిలో ఉన్నాయి. అవి..ప్రయాన్స్, వైరాయిడ్స్. ఇవి పూర్తిగా ప్రోటీన్ నిర్మితాలు. ఇవిక్షీరదాల కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. పశువుల్లో మ్యాడ్‌కౌ, గొర్రెల్లో స్క్రేపీ, పపువన్యూగినియా ప్రాంతంలోని ప్రజలలో కురు అనే వ్యాధులకు కారణమవుతాయి. మొక్కల్లో మాత్రమే వ్యాధులను కలుగజేసే ఆర్ఎన్ఏ నిర్మితాలు వైరాయిడ్లు. బ్యాక్టీరియా- కలుగజేసే వ్యాధులు: కలరా - విబ్రియో కలరే టైఫాయిడ్ - సాల్మోనెల్ల టైఫి బొట్యులిజం - క్లాస్ట్రీడియం బొట్యులినం టెటనస్ (ధనుర్వాతం) - క్లాస్ట్రీడియం టెటనీ షీజెల్లోసిస్ - షీజెల్ల సోని ఆంథ్రాక్స్ - బాసిల్లస్ ఆంథ్రసిస్ నిమోనియ - స్ట్రెప్టోకోకస్ నిమోనియే కుష్టు - మైకోబ్యాక్టీరియం ట్యుబర్కులోసిస్ ప్లేగు - ఎర్సీనియ పెస్టిస్ డిఫ్తీరియా (కంఠసర్పి) - కార్నిబ్యాక్టీరియం డిఫ్తిరియే కోరింత దగ్గు (పర్టుసిస్) - బోర్టెటెల్ల పర్టుసిస్ గనేరియా - నిస్సీరియా గనేరియా ట్రకోమా - క్లామిడియా ట్రకోమ్యాటిస్ సిఫిలిస్ - ట్రెపోనీమా ప్యాలిడం వైరస్ వ్యాధులు ఇన్ఫ్లుయంజా (ఫ్లూ) - ఆర్థోమిక్సో వైరస్ మిజిల్స్ (రుబియోల) - ప్యారామిక్సో వైరస్ పోలియో మైలిటిన్ - పికోర్న వైరస్ జర్మన్ మీజిల్స్ (రూబెల్ల) - టోగా వైరస్ అమ్మ వారు (చికెన్‌పాక్స్) - వారిసెల్ల వైరస్ చికున్ గున్యా - చిక్‌వి (టోగా/ఆల్ఫా) వైరస్ జపనీస్ ఎన్సిఫలైటిస్ - ఫ్లేవీ (ఒఉ) వైరస్ డెంగీ జ్వరం - ఫ్లేవీ వైరస్ హెపటైటిస్ - ఆర్థోహెపడ్నా వైరస్ గవద బిళ్లలు - పారామిక్సో వైరస్ ఎయిడ్స్ - హెచ్ఐవీ జలుబు - రైనో వైరస్ గర్భాశయముఖం క్యాన్సర్ - హ్యూమన్ పాపిల్లోమ క్యాన్సర్ ఎల్లో ఫివర్ - ఆర్బో వైరస్ క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ - బున్యా వైరస్ హెర్పస్ సింప్లెక్స్ - హెర్పస్ వైరస్ ఎబోలా-ఫైలో వైరస్ severe acute respiratory syndrome and middle east respiratory syndrome -కరోన వైరస్ శిలీంధ్ర వ్యాధులు కాండిడియాసిస్ - కాండిడ ఆల్చికన్స్ మైసిటిస్మస్ - విష పుట్టగొడుగులు ఫంగల్ మైనింజైటిస్ - క్రిప్టోకోకస్ బ్లాక్ మోల్ట్ - స్టాకిబోట్రిస్ అథ్లెట్స్ఫుట్ - ట్రైకోఫైటాన్ -
పేపర్‌తో మైక్రోస్కోప్
న్యూయార్క్: మన కంటికి కనిపించని సూక్ష్మజీవులను చక్కగా చూడడానికి ఉపయోగించే మైక్రోస్కోప్(సూక్ష్మదర్శిని) గురించి మనందరికీ తెలిసిందే. ప్రయోగశాలల్లో, ఆసుపత్రుల్లో మాత్రమే ఎక్కువగా ఉపయోగించే ఈ మైక్రోస్కోప్‌ల ఖరీదు సామాన్యుడికి అందనంత దూరంలో ఉంటుంది. అలాంటి మైక్రోస్కోప్‌లను కాగితంతో కారుచౌకగా అభివృద్ధి చేస్తే...సామాన్యుడికి అందుబాటులో...ఏకంగా జేబులో పెట్టుకొని తిరిగే విధంగా రూపొందిస్తే.... అది నిజంగా అద్భుతమే కదా... ఆ అద్భుతాన్ని ఆవిష్కరించాడు భారత సంతతికి చెందిన అమెరికా పరిశోధకుడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ మనుప్రకాష్ తన బృందంతో కలసి కాగితంతో మైక్రోస్కోపును అభివృద్ధి చేశాడు. ‘ఫ్లొడ్స్కోప్’గా పిలిచే ఈ మైక్రోస్కోప్ అత్యంత చవకైనది కూడా. మూడు భాగాలుగా ఉండే దీని నిర్మాణంలో ఒక ఎల్.ఈ.డీ. లైట్, లెన్స్ కూడా అమర్చారు. ఈ మైక్రోస్కోపును పూర్తిగా విప్పేసి మన జేబులో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. కేవలం ఒక్క నిమిషంలో మళ్లీ మైక్రోస్కోపును పూర్తిస్థాయిలో బిగించుకోవచ్చు.