
ఎన్నెన్నో అందాలు.. ఏవేవో వర్ణాలు..
చేయి తిరిగిన చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన కళాఖండంలా ఉంది కదూ ఈ చిత్రం! అయితే ఇది ఏ ఆయిల్ పెయింటింగో.. వాటర్ పెయింటింగో కాదు.. నేలపై ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన హరివిల్లు! నేలకు వర్ణాలద్దినట్లుగా ఉన్న ఈ చిత్రం శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఉప్పు తయారీ క్షేత్రాల్లోనిది.
సముద్రపు నీటి నుంచి ఉప్పు తయారు చేసే క్రమంలో నీటికి రకరకాల రంగులు వస్తుంటాయట. నీరు ఆవిరై ఉప్పు తయారయ్యేటపుడు వివిధ సూక్ష్మక్రిములు చేరి నీటిని పులియబెట్టడంతో రంగులు ఏర్పడతాయట. రంగులను బట్టి ఉప్పు లవణీయత కూడా తెలుస్తుందట.