అమెరికాలోని యోస్మైట్ నేషనల్ పార్క్‌లోని ఓ అందమైన జలపాతానికి సంబంధించిన వీడియో మరోమారు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. బలమైన గాలుల మధ్య జారువారే జలపాతాలలో రంగుల హరివిల్లు ఏర్పడటాన్ని ఈ వీడియో చూడవచ్చు.
సూర్యోదయం సమయంలో ఈ అద్భుతం ఆవిష్కృతమయ్యింది. సూర్యకాంతిలోని మృదువైన కిరణాలు నీటి బిందువులను తాకినప్పుడు, వాటి వంపు 1,450-అడుగుల ఎత్తయిన జలపాతంలో ఒక మెరిసే ఇంద్రధనస్సు ఆవిష్కృతమయ్యింది. ఈ కాలిఫోర్నియాకు సంబంధించిన పర్వత దృశ్యం 13.7 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. రెండు లక్షలకు మించిన లైక్స్ దక్కించుకుంది. యోస్మైట్ కాలిఫోర్నియాలోని నాలుగు వేర్వేరు కౌంటీలలో సుమారు 761,747 ఎకరాల మేరకు విస్తరించి ఉంది. ఇది పరిమాణం పరంగా అమెరికాలో 16వ అతిపెద్ద జాతీయ ఉద్యానవనం.
High winds at the perfect time of day created a rare Rainbow Waterfall in Yosemite National Park pic.twitter.com/8J8EA1Q7x5
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 24, 2023
న్యూస్‌వీక్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఫుటేజీని వాస్తవానికి అవుట్‌డోర్ ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీలో నైపుణ్యం కలిగిన సాల్ట్ లేక్ సిటీకి చెందిన ఫోటోగ్రాఫర్ గ్రెగ్ హార్లో చిత్రీకరించినట్లు నమ్ముతారు. న్యూస్ పోర్టల్ నేషనల్ పార్క్ సర్వీస్ (ఎన్‌ఎస్‌పీ) 2017లో రూపొందించిన డాక్యుమెంటరీ ఫుటేజ్ ఇది అని సమాచారం. సుమారు ఉదయం 9 గంటలకు బలమైన గాలులు వీస్తున్నప్పుడు ఈ దృశ్యం ఏర్పడింది. 2,400-అడుగుల ఎత్తులో రెయిన్‌బో ఫాల్స్ కనిపించాయి.
ఇది కూడా చూడండి: బయట వర్షం.. బస్సులో గొడుగు పట్టిన డ్రైవర్!
Comments
Please login to add a commentAdd a comment