Rainbow
-
రెయిన్బో డైట్: రంగురంగుల ఆహారాలతో ఆరోగ్యం పదిలం..!
మనం తినే ఆహారంలో వివిధ రకాల పోషకాలు సమతుల్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా జీవించగలుగుతాం. అందుకే పోషకాహార నిపుణులు మనం తినే ఆహారంలో అన్ని రంగుల్లోని పండ్లు, కూరగాయలు ఉండాలంటున్నారు. ముఖ్యంగా రెయిన్బో(ఇంద్ర ధనుస్సు) డైట్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు. ఏంటీది అనేకదా..!. ఏం లేదండీ ఇంద్రధనుస్సులోని ఏడు రంగుల్లో ఉండే కూరగాయాలు, పండ్లు తీసుకుంటే అన్ని రకాల పోషకాలు శరీరానికి అందడమే గాక చక్కటి ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుందని చెబుతున్నారు. ఈ డైట్ వల్ల జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చని అంటున్నారు. అలాంటి ఈ రెయిన్బో డైట్లో రంగుల వారీగా ఉండే కూరగాయాలు, పండ్లు వర్గీకరణ, వాటి ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉంటాయని మనకు తెలుసు. అలాగే రెయిన్బో డైట్ అంటే ఎరుపు, పసుపు, ఊదా, ఆకుపచ్చ, నారింజ వంటి వివిధ రంగుల్లో పండ్లు, కూరగాయలను కలిగి ఉంటుంది. అందులోని ప్రతి రంగుతో కూడిన కూరగాయాలు, పండ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటో చూద్దామా..!రెడ్ ఫుడ్స్: ఇవి లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. అందువల్ల ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే గాక కేన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ రంగు కూరగాయలు, పండ్లు ప్రోస్టేట్, మూత్ర నాళం, డీఎన్ఏ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. అందువల్ల ఎరుపు రంగులో ఉండే యాపిల్స్, చెర్రీస్, నారింజ, బెర్రీలు, పుచ్చకాయలు, ఎర్ర ద్రాక్ష, బీట్రూట్లు, టమోటాలు మొదలైనవి తప్పక తినమని నిపుణులు చెబుతున్నారు.గ్రీన్ ఫుడ్స్: క్లోరోఫిల్ పుష్కలంగా ఉండటం వల్ల అవి శరీరాన్ని నిర్విషీకరణ చేసి జీర్ణక్రియకు తోడ్పడతాయి. అలాగే శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ ఆహారాలు కంటి, ఊపిరితిత్తులు, కాలేయం, కణాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. త్వరగా గాయాలు నయం అవ్వడంలో, చిగుళ్ల ఆరోగ్యంలో సహయపడతాయి. ఆకుపచ్చ రంగులో ఉండే అవోకాడో, ద్రాక్ష, కివి, బేరి, బ్రోకలీ, దోసకాయ, ఆస్పరాగస్, క్యాబేజీ, బీన్స్, మొదలైనవి తీసుకోవాలి.వైట్ ఫుడ్స్: దీనిలో అల్లిసిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఎముకలకు మద్దతునిస్తాయి. అలాగే గుండె జబ్బులు, కేన్సర్‌తో పోరాడుతాయి. అందుకోసం అరటిపండ్లు, వెల్లుల్లి, కాలీఫ్లవర్, బంగాళదుంపలు, పుట్టగొడుగులు, ఖర్జూరం, అల్లం, ముల్లంగి మొదలైనవి తినండి.పసుపు ఆహారాలు: వీటిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఈ సిట్రస్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, చర్మ సంరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. అందుకోసం నిమ్మకాయలు, పైనాపిల్, అత్తి పండ్లను, మొక్కజొన్న, పసుపు మిరియాలు, పసుపు టమోటాలు, మామిడి, బంగారు కివి మొదలైనవి. ఈ ఆహారాలు కళ్ళకు, రోగనిరోధక వ్యవస్థకు మంచివిపర్పుల్ ఫుడ్స్: వీటిలో ఆంథోసైనిన్లు అధికంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కడుపులోని మంటను తగ్గించి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ముఖ్యంగా గుండెకు, మెదడుకు, ఎముకలకు, ధమనులకు, జ్ఞానానికి మేలు చేస్తాయి. ఈ ఆహారాలు కేన్సర్‌తో పోరాడటమే గాకుండా ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి కూడా తోడ్పడతాయి. అందుకోసం ప్లం, ప్రూనే, బ్లాక్‌బెర్రీ, అత్తి పండ్లను, ఎండుద్రాక్ష, వంకాయ, ఊదా క్యాబేజీ, బ్లూబెర్రీస్, పర్పుల్ ద్రాక్ష మొదలైనవి.ఆరెంజ్ ఫుడ్స్: వీటిలో ఉండే బీటా-కెరోటిన్‌తో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. నరాలు, కండరాల ఆరోగ్యానికి, రక్తపోటును అదుపులో ఉంచడానికి ఇవి చాలా అవసరం. దీని కోసం నారింజ, గుమ్మడికాయ, బొప్పాయి, పసుపు, చిలగడదుంపలు మొదలైనవి తీసుకోవాలి.ఎల్లప్పుడూ వివిధ రంగుల కూరగాయలు, పండ్లు తినాలని లక్ష్యంగా పెట్టుకోండి. ఈ ఆహారాలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి, ఇవి మెదడు కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి, అభిజ్ఞా పనితీరును పెంచుతాయి.గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది. పాటించేమందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి ఫాలో అవ్వడం మంచిది. -
ప్రముఖ కంపెనీల రెయిన్బో కలర్ లోగోలు.. (ఫోటోలు)
-
అరుదైన జాలువారే జలపాతాల ఇంద్రధనుస్సు.. విస్తుపోవడమే తరువాయి!
అమెరికాలోని యోస్మైట్ నేషనల్ పార్క్‌లోని ఓ అందమైన జలపాతానికి సంబంధించిన వీడియో మరోమారు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. బలమైన గాలుల మధ్య జారువారే జలపాతాలలో రంగుల హరివిల్లు ఏర్పడటాన్ని ఈ వీడియో చూడవచ్చు. సూర్యోదయం సమయంలో ఈ అద్భుతం ఆవిష్కృతమయ్యింది. సూర్యకాంతిలోని మృదువైన కిరణాలు నీటి బిందువులను తాకినప్పుడు, వాటి వంపు 1,450-అడుగుల ఎత్తయిన జలపాతంలో ఒక మెరిసే ఇంద్రధనస్సు ఆవిష్కృతమయ్యింది. ఈ కాలిఫోర్నియాకు సంబంధించిన పర్వత దృశ్యం 13.7 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. రెండు లక్షలకు మించిన లైక్స్ దక్కించుకుంది. యోస్మైట్ కాలిఫోర్నియాలోని నాలుగు వేర్వేరు కౌంటీలలో సుమారు 761,747 ఎకరాల మేరకు విస్తరించి ఉంది. ఇది పరిమాణం పరంగా అమెరికాలో 16వ అతిపెద్ద జాతీయ ఉద్యానవనం. High winds at the perfect time of day created a rare Rainbow Waterfall in Yosemite National Park pic.twitter.com/8J8EA1Q7x5 — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 24, 2023 న్యూస్‌వీక్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఫుటేజీని వాస్తవానికి అవుట్డోర్ ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీలో నైపుణ్యం కలిగిన సాల్ట్ లేక్ సిటీకి చెందిన ఫోటోగ్రాఫర్ గ్రెగ్ హార్లో చిత్రీకరించినట్లు నమ్ముతారు. న్యూస్ పోర్టల్ నేషనల్ పార్క్ సర్వీస్ (ఎన్ఎస్పీ) 2017లో రూపొందించిన డాక్యుమెంటరీ ఫుటేజ్ ఇది అని సమాచారం. సుమారు ఉదయం 9 గంటలకు బలమైన గాలులు వీస్తున్నప్పుడు ఈ దృశ్యం ఏర్పడింది. 2,400-అడుగుల ఎత్తులో రెయిన్బో ఫాల్స్ కనిపించాయి. ఇది కూడా చూడండి: బయట వర్షం.. బస్సులో గొడుగు పట్టిన డ్రైవర్! -
ఫాంటసీ రెయిన్బో
హీరోయిన్ రష్మిక మందన లీడ్ రోల్లో నటిస్తున్న తొలి చిత్రం ‘రెయిన్బో’. మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీతో శాంతరూబ¯Œ దర్శకునిగా పరిచయమవుతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్ఆర్. ప్రకాష్ బాబు, ఎస్ఆర్. ప్రభు తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ ముగిసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘రెయిన్బో’. తమిళనాడు, కొడైకెనాల్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. అతిత్వరలోనే సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, కెమెరా: కెఎం భాస్కరన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: తంగ ప్రభాకరన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అరవేంద్రరాజ్ భాస్కరన్. -
అందుకే కొన్ని రోజులు మిస్సయ్యా!
‘‘అందరూ క్షమించాలి. కొన్ని రోజులుగా మిమ్మల్ని మిస్సవుతూ వచ్చాను. ఎందుకంటే నెట్వర్క్ లేని ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నాను’’ అని రష్మికా మందన్నా సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఆమె కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘రెయిన్ బో’. ఇందులో దేవ్ మోహన్ హీరో. ఈ చిత్రం షూటింగ్ కొన్నాళ్లు నెట్వర్క్ లేని ప్రాంతాల్లో జరిగింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయి, నెట్వర్క్ ఉన్న ప్రాంతానికి రావడంతో రష్మిక పై విధంగా పేర్కొన్నారు. ఇంకా ఈ చిత్రం గురించి రష్మికా మందన్నా మాట్లాడుతూ – ‘‘ఫస్ట్ చెన్నైలో కొన్ని రోజులు ‘రెయిన్ బో’ షూటింగ్ చేశాం. ఆ తర్వాత కొడైకెనాల్ వెళ్లాం. అక్కడ షూట్ చేసి, మున్నార్‌లో మొదలుపెట్టాం. ఈ రెండు ప్రాంతాల్లోనూ నెట్వర్క్ లేదు. అయితే షెడ్యూల్ చాలా కూల్‌గా జరిగింది. కొడైకెనాల్లో నా గది నుంచి సూర్యోదయాన్ని తిలకించడం ఓ అందమైన అనుభూతి. మంచుకి తడిచిన పువ్వులు కంటికి హాయినిచ్చాయి. మున్నార్ కూడా అంతే. అందమైన, ఆహ్లాదకరమైన ప్రాంతాల్లో షూటింగ్ చేయడం మనసుకి ఉల్లాసంగా అనిపించింది’’ అన్నారు. -
కర్మ ప్రకారం జరుగుతుంది..సమంతపై నిర్మాత షాకింగ్ కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. భాషతో సంబంధం లేకుండా సౌత్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో క్రేజీ హీరోయిన్గా సత్తా చాటుతుంది. ఈ క్రమంలో ఆమె తొలిసారిగా ఫీమెల్ సెంట్రిక్ మూవీలో నటిసస్తుంది. ఈ చిత్రానికి రెయిన్బో అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రభు, ఎస్.ఆర్ ప్రకాష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మికకు జోడీగా శాకుంతలం హీరో దేవ్ మోహన్ నటిస్తున్నారు. అయితే నిజానికి ఈ సినిమాకు ముందుగా సమంతను హీరోయిన్గా అనౌన్స్ చేశారు. మరి ఏమైందో ఏమో కానీ ఊహించని విధంగా ఆమె స్థానంలో రష్మిక వచ్చి చేరింది. దీంతో అసలు సామ్ ప్లేస్‌లో రష్మిక రావడం ఏంటని సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయాన్ని నిర్మాతను అడగ్గా ఆయన మాట్లాడుతూ.. 'స్క్రిప్ట్‌కు ఎవరు సరిపోతారో వాళ్లనే ఎంపిక చేసుకుంటాం. ఆ ఫ్లోని మేం మార్చాలనుకోవడం లేదు. కంటెంట్, కర్మ అలా జరుగుతూ వెళ్తుంటాయి. వాటిని ఎవరూ మార్చలేరు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. సమంతను అనౌన్స్ చేసి ఇప్పుడు మరో హీరోయిన్ను తీసుకోవడమే కాకుండా, కర్మ వల్ల ఇలా జరుగుతుందటూ నిర్మాత ప్రభు కామెంట్స్‌పై సామ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. Today marks the start of a colourful journey. Join us as we bring the world of #Rainbow to life! 🌟 @iamRashmika @ActorDevMohan @bhaskaran_dop @justin_tunes @thamizh_editor #Banglan @sivadigitalart @Shantharuban87 @prabhu_sr#RainbowFilm #RainbowPooja pic.twitter.com/puANA99qWM — DreamWarriorPictures (@DreamWarriorpic) April 3, 2023 Happy to have @Samanthaprabhu2 onboard for our next Bilingual film!! #Production#30 #Tamil #Telugu @DreamWarriorpic written & directed by @Shantharuban87 pic.twitter.com/x4OwEI9HPL — SR Prabhu (@prabhu_sr) October 15, 2021 -
రొమాంటిక్ రెయిన్బో
హీరోయిన్ రష్మికా మందన్నా లీడ్ రోల్లో నటిస్తున్న ‘రెయిన్బో’ చిత్రం షురూ అయింది. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో నటుడు దేవ్ మోహన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటి అమల అక్కినేని క్లాప్ కొట్టారు. నిర్మాత సురేష్‌బాబు స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందించారు. రష్మికా మందన్నా మాట్లాడుతూ– ‘‘రెయిన్బో’ చేస్తు్తన్నందుకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 7న ప్రారంభం అవుతుంది’’ అన్నారు ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్. ప్రభు. ‘‘రొమాంటిక్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు శాంతరూబన్. ఈ ప్రారంభోత్సవానికి నిర్మాతలు కేకే రాధామోహన్, దామోదర్ ప్రసాద్, పి. కిరణ్, శరత్ మరార్, సుప్రియ అక్కినేని, దర్శకులు వెంకీ కుడుముల, శశికిరణ్, హీరో సందీప్ కిషన్ తదితరులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కేఎం భాస్కరన్, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: తంగ ప్రభాకరన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అరవేంద్రరాజ్ భాస్కరన్. -
ఏడు రంగుల రెయన్ అనుకుంటున్నారా.. కానే కాదు.. మరి ఏంటంటే!
ఏమిటిది.. ఇంద్రధనస్సు ఇలా వర్ణరహితంగా పాలిపోయినట్లు కనిపిస్తోందని ఆశ్చర్యపోతున్నారా? ఇది ఏడు రంగుల రెయన్బో కాదు.. అరుదుగా కనిపించే ‘తెల్ల ఇంధ్రధనుస్సు’. దీన్ని ‘ఫాగ్బో’ అని కూడా పిలుస్తారు. అంటే పొగమంచులోని నీటి బిందువులపై సూర్యకాంతి పరావర్తనం, వక్రీభవనం చెందినప్పుడు ఇలా కనిపిస్తుందన్నమాట. పొగమంచులోని నీటి బిందువులు 0.05 మిల్లీమీటర్లకన్నా చిన్నవిగా ఉండటం వల్ల వాటిపై సూర్యకిరణాలు పడగానే అవి అలికినట్లు అయిపోయి ఇలా ఒకే రంగు కనిపిస్తుందట. View this post on Instagram A post shared by Stu Berman 📷 San Francisco (@stuinsf) అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న మారిన్ హెడ్‌ల్యాండ్స్ ప్రాంతంలో కనిపించిన ఈ ‘ఫాగ్బో’ను స్టూ బెర్మన్ అనే ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వాస్తవానికి ఫాగ్బోలోనూ కొన్ని రంగులు అత్యంత స్వల్పస్థాయిలో కనిపిస్తాయని.. ఇంద్రధనుస్సు బయటి, లోపల అంచుల వెంబడి ఎరుపు, నీలం రంగులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చదవండి: వైరల్: 30 ఏళ్లు వచ్చే దాకా తొందరపడొద్దు.. టీనేజర్‌కు జో బైడెన్ సలహా -
బకింగ్హమ్ ప్యాలెస్‌పై జంట ఇంద్రధనుస్సులు
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 మరణాన్ని అధికారికంగా ప్రకటించిన కొన్ని నిమిషాలకే లండన్‌లోని బకింగ్హమ్ ప్యాలెస్‌పై జంట ఇంద్రధనుస్సులు కనిపించడం నెటిజన్లను విశేషంగా ఆకర్షించింది. రాణి మరణవార్త తెలియగానే ప్రజలు పెద్ద ఎత్తున ప్యాలెస్ వద్దకు చేరుకొని ‘గాడ్ సేవ్ ద క్వీన్’అంటూ జాతీయ గీతాన్ని ఆలపించడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా వారికి ఆకాశంలో రెండు ఇంద్రధనుస్సులు కనిపించడంతో వాటిని రాణి ఎలిజబెత్–2, ఆమె భర్త ఫిలిప్‌కు ప్రతీకగా ప్రజలు భావించారు. రాణి, రాజు తిరిగి ఆకాశంలో కలుసుకున్నారంటూ చెప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం -
పెయింటింగ్ అనుకుంటున్నారా?.. అస్సలు కాదండోయ్.. మరేంటి!
ఈ ఫొటో చూశారా? చేయి తిరిగిన రెజిన్ ఆర్టిస్ట్ గీసిన రంగురంగుల హరివిల్లులా ఉంది కదూ! కానీ, ఇది పెయింటింగ్ కాదు.. ఫొటోగ్రాఫ్. వాషింగ్టన్లో ఉన్న మౌంట్ రైనర్ నేషనల్ పార్క్‌లోని ఓ మంచు గుహలో తీసిన చిత్రం. మంచుకు అన్ని రంగులెలా వచ్చాయంటే... ఆ గుహకు ఉన్న ఒక ద్వారం గుండా సూర్యరశ్మి లోపలికి ప్రవేశించి, మంచుపై పడి ఇలా ప్రతిఫలిస్తుందన్నమాట. వీటిని చూడటానికి పర్యాటకులు, ఫొటోగ్రాఫర్స్ ఆసక్తి చూపిస్తుంటారు. నేషనల్ పార్క్ సర్వీస్ అధికారులు మాత్రం అది ప్రమాదమని ప్రవేశాన్ని నిషేదించారు. ‘ ‘నిత్యం కరుగుతోన్న ఆ మంచు గుహలు ఎప్పుడైనా విరిగిపడొచ్చు. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల.. లోపలికి వెళ్లినవాళ్లకు ఊపిరి అందకుండా పోయే ప్రమాదమూ ఉంది’’ అని హెచ్చరించారు. మంచు కరిగి ప్రవహిస్తున్న నీటిపాయ గుహ రాళ్ల మధ్య కనిపిస్తోంది కదా! నిజానికి ఒకప్పుడు ఈ పార్కు మంచు గుహలకే ప్రత్యేకం. కానీ.. వాతావరణంలో వస్తున్న మార్పులతో కరిగి అంతరించి పోతున్నాయి. కరిగిన మంచు చిన్నపాటి కారు సైజులో విరిగి పడుతుండటంతో ప్రమాదమని 1980లోనే గుహలను మూసేశారు. అయితే ప్రాణాలకు తెగించి తీసిన ఫొటోలను ఫోటోగ్రాఫర్ మాథ్యూ నికోల్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అవి వైరలవుతున్నాయి. -
అద్భుతం.. ఆకాశంలో కిరీట హరివిల్లు.. ఎందుకిలా ఏర్పడుతుందో తెలుసా!
చైనాలోని హైనన్ ప్రావిన్సులో ఉన్న హైకు నగరంలో ఇటీవల ఇంద్రధనుస్సు రంగుల్లో మెరిసిన మబ్బుల కిరీటమిది. ప్రకృతి చేసిన ఈ చిత్రవిచిత్రం నెటిజన్లను ఎంతగానో అబ్బురపరించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మబ్బుల్లోని నీటి బిందువులు, మంచు ముక్కల మధ్య సూర్యకాంతి వివర్తనం చెందినప్పుడు ఇంద్రధనుస్సు రంగుల్లో మేఘం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ తరహా మబ్బులను పిలియస్, క్యాప్ క్లౌడ్స్ లేదా స్కార్ఫ్ క్లౌడ్స్‌గా పిలుస్తారని పేర్కొన్నారు. ఒక ప్రాంతంపై క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే క్రమంలో వాటి చుట్టూ ఉండే గాలి వేగంగా మరింత ఎత్తుకు చేరుకున్నాక అందులోని నీరు ఘనీభవించి గొడుగు ఆకారంలో ఈ మబ్బులు ఏర్పడతాయన్నారు. వాతావరణం తీవ్రంగా మారుతోందనేందుకు ఈ తరహా మేఘాలు సంకేతమని వివరించారు. చదవండి: 3 నెలల పాటు వండారు.. 8 నెలలు తిన్నారు Rainbow colored scarf cloud over Haikou city in China pic.twitter.com/ewKmQjsiIE — Sunlit Rain (@Earthlings10m) August 26, 2022 -
Photo Feature: హరివిల్లుతో పులకింత
సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి: తిరుపతి నగరంలో ఆదివారం సాయంత్రం ఓ వైపు ఎండ కాయగా మరోవైపు వర్షం కురిసింది. ఈ క్రమంలో ఆకాశంలో హరివిల్లు విరిసింది. తద్వారా నగర వాసులను పులకింపజేసింది. కొందరు హరివిల్లును తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. -
50 రోజుల పాటు ఒంటరిగా బైక్ రైడ్.. ఎవరీ అంబికా క్రిష్టన్..?
కోచి(కేరళ)కు చెందిన అంబికా క్రిష్టన్ భర్త శివరాజ్ చనిపోయాడు. అప్పుడు ఆమె వయసు పందొమ్మిది సంవత్సరాలు. మూడు నెలల పసిపాప. ఒక్కసారిగా తనను చీకటి కమ్మేసినట్లుగా అనిపించింది. ఎంత మరిచిపోదామన్నా భర్త జ్ఞాపకాలు తనను విపరీతంగా బాధిస్తున్నాయి. ఒకానొక దశలో అయితే... ‘అసలు నేను బతకడం అవసరమా?’ అనుకుంది. ఆ సమయంలో పాప తనవైపు చూస్తుంది. వెంటనే నిర్ణయాన్ని మార్చుకుంది... పాప కోసమైనా బతకాలని! బికామ్ డిగ్రీ పూర్తిచేసింది. సాయంత్రాలు కంప్యూటర్క్లాస్లకు వెళ్లేది. తాను కాలేజికి వెళ్లే రోజుల్లో స్నేహితులు, ఇంటిపక్క వాళ్లు పాపను చూసుకునేవారు. ఒక సంస్థలో తనకు ఎకౌంటెంట్‌గా ఉద్యోగం వచ్చింది. ఎంత ఆత్మవిశ్వాసం వచ్చిందో! ఆ తరువాత ఆకాశవాణి రెయిన్బో 107.5లో పార్ట్–టైమ్ జాబ్‌లో చేరడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడ తనలోని సృజనాత్మకతకు పనిచెప్పే అవకాశం లభించింది. ఎంతోమందిని ఇంటర్యూ్య చేసింది. అవి కాలక్షేపం ఇంటర్వ్యూలు కావు...పదిమందికి స్ఫూర్తి పంచే ఇంటర్య్వూలు. ఈ ఉద్యోగం తనకు నలుగురిని ఆకట్టుకునేలా మాట్లాడే నైపుణ్యాన్ని ఇచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా సామాజిక బాధ్యతను నేర్పింది. ఆకాశవాణి రెయిన్బోలో ఉత్తమ ఆర్జేగా పేరు తెచ్చుకున్న అంబికా ఇప్పుడు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోలోగా ఆల్ ఇండియా బైక్ రైడ్ చేస్తుంది. 50 రోజుల పాటు సాగే ఈ రైడ్ దేశవ్యాప్తంగా ఉన్న 25 రెయిన్బో స్టేషన్లను కనెక్ట్ చేస్తూ సాగుతుంది. ఈ బైక్ యాత్రలో భర్తను కోల్పోయిన సైనికుల భార్యలను కలుసుకుంటుంది. వీరులకు నివాళి అర్పిస్తుంది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన మహిళలతో మాట్లాడుతుంది. వారు మానసికంగా ఒంటరి ప్రపంచంలో ఉంటే...తన జీవితాన్నే ఉదాహరణగా చెప్పి ధైర్యం చెబుతుంది. వారికి తన పరిధిలో చేతనైన సహాయం చేస్తుంది. ఒకప్పుడు ఏ పాప ముఖం చూసి అయితే తాను కచ్చితంగా బతకాలని నిర్ణయించుకుందో...ఆ పాప ఆర్యా ఇప్పుడు ఇన్ఫోసిస్‌లో మంచి ఉద్యోగం చేస్తోంది. ‘50 రోజుల పాటు ఒంటరిగా బైక్ రైడా! ఎందుకొచ్చిన రిస్క్’ అన్నారు కొద్దిమంది స్నేహితులు. ‘రిస్క్’ అనుకుంటే అక్కడే ఆగిపోతాం. ఆ ఆలోచనను బ్రేక్ చేస్తేనే ముందుకు వెళ్లగలమనే విషయం ఆమెకు తెలియందేమీ కాదు. భర్త చనిపోయిన తరువాత... ‘నీ జీవితం రిస్క్‌లో పడింది. ఎలా నెట్టుకొస్తావో ఏమో’ అనేవారు కొందరు. నిజమే అనుకొని తాను ఆ నిరాశపూరిత భావన దగ్గరే నిస్సహాయకంగా ఉండి ఉంటే ఏమై ఉండేదోగానీ...ముందుకు కదిలింది. చిన్నా చితాక ఉద్యోగాలు చేసింది. సొంతకాళ్ల మీద నిలబడింది. బిడ్డను బాగా చదివించింది. అంబికా యాత్ర వృథా పోదు. ప్రతి ఊరికి తమవైన స్ఫూర్తిదాయకమైన కథలు ఉంటాయి. వాటిని సేకరిస్తూ, పంచుతూ వెళ్లడం ఎంత గొప్పపని! -
ది ఎండ్ ఆఫ్ ది రెయిన్బో.. దీని వెనుక కథ ఇదే!
మనకు ఒక బలమైన కోరిక లేదా లక్ష్యం ఉండవచ్చు. అయితే దాన్ని నిజం చేసుకోవడం చాలా కష్టం కావచ్చు. ఇలాంటి సందర్భంలో ఉపయోగించే ఇడియమ్... ది ఎండ్ ఆఫ్ ది రెయిన్బో. ఉదా: ఎట్ ది మూమెంట్, ఫైండింగ్ ఏ గుడ్ ప్లంబర్ ఈజ్ లైక్ ఫైండింగ్ ఏ పాట్ ఆఫ్ గోల్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది రెయిన్బో. ఇక దీని కథ విషయానికి వస్తే... అనగనగా ఐర్లాండ్‌లో పేద దంపతులు ఉంటారు. ఒకరోజు వీరు పొలంలో పనిచేస్తుండగా ‘లెప్రికాన్’ ప్రత్యక్షమౌతాడు. కోటు, హ్యాట్, గెడ్డంతో కనిపించే ఈ వృద్ధుడికి ఇతరులను ఇబ్బందుల్లోకి నెట్టి తమాషా చూడడం అంటే ఇష్టం. ఈ విషయం తెలియక చాలామంది బోల్తా పడుతుంటారు. (నయా ఇంగ్లిష్: ఘోస్ట్ కిచెన్ అంటే?) ‘మీకు ఏంకావాలో కోరుకోండి’ అని ఆ దంపతులను అడుగుతాడు. ఇక అంతే. వెనకా ముందు ఆలోచించకుండా తమలోని దురాశను బయటపెట్టుకుంటారు ఆ దంపతులు. ఖరీదైన బట్టలు, బంగ్లాల నుంచి బంగారుగనుల వరకు అన్నీ కోరుకుంటారు. (క్లిక్: క్యాచ్–22 సిచ్యువేషన్ అంటే ఏంటో తెలుసా?) ‘మీరు కోరినవన్నీ తీరుతాయి. అయితే ఒక విషయం. మీరు ఎప్పుడైతే ఇంద్రధనసు చివర దాగున్న బంగారునాణేల పాత్రను చూస్తారో... అప్పుడు మీ కోరిక నెరవేరుతుంది’ అని చెప్పి మాయమవుతాడు లెప్రికాన్. రెయిన్బో చివర ఎప్పుడు కనిపించాలి, అక్కడ బంగారం ఎప్పుడు కనిపించాలి!! (క్లిక్: ఉత్త ప్యాంగసియన్ ఆశ.. ఇంతకీ ఎవరు ఇతను?) -
Photo Feature: సప్తగిరులపై ‘స్నో’యగాలు
విస్తార వర్షాలతో గిరులు పచ్చదనాన్ని పరుచుకున్నాయి. నీలిమేఘాలు సప్తగిరులను కమ్మేశాయి. పొగమంచు కొత్త అందాలను నెరిపాయి. తిరుమల రహదారుల నుంచి శ్రీవారి మెట్టుమార్గం వైపు చూసినప్పుడు మేఘాలు పరుచుకున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఈ హిమ సోయగాలు కొత్త అనుభూతిని కల్గిస్తున్నాయి. కశ్మీర్ లోయను తలపించేలా సప్తగిరులపైన నీలిమబ్బులు పరుచుకున్నాయి. వానలు, మంచు, పచ్చదనం, కమ్మేసిన మబ్బుల దృశ్యాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాము కొత్త లోకాలకు వచ్చామా అన్న అనుభూతిని కలిగిస్తున్నాయి. – తిరుమల కృష్ణమ్మకు ‘ఇంద్ర’హారం చిరుజల్లులకు సూర్యకిరణాలు తోడై సప్తవర్ణ మిళితమైన ఇంద్రధనస్సు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద సోమవారం ఇలా కనువిందు చేసింది. -
అదో ‘మాయాద్వీపం’.. మట్టితో చేసిన వంటలు భలే రుచి.. ఇంకా ఉప్పు దేవత, బ్లడ్ సీ కూడా
Iran Rainbow Valley Unknown Facts In Telugu: మట్టి వాసన బాగుందంటాం కానీ..దానిని రుచి చూడం. కానీ, మట్టినే మసాల దినుసులుగా, సాస్‌గా తీసుకుంటారంటే నమ్ముతారా? తినే పర్వతం ఒకటి ఉందంటే ఊహించగలరా? ఎగిసిపడుతున్న రక్తపు సముద్రాన్ని చూస్తే భయపడకుండా ఉండగలరా? చిటికెడు ఉప్పు అనేవాళ్లకు ఉప్పు కొండలు కనిపిస్తే అచ్చెరువొందరా? పర్వతాలే ఇంద్రధనస్సులై మెరిస్తే మైమరిచిపోరా? ఇదంతా ఏదో హాలీవుడ్ సినిమా గ్రాఫిక్స్ కాదు.. ఈ భూమి మీదే! ప్రపంచ పర్యాటకానికి దూరంగా..ఓ మాయా ద్వీపంలా ఉన్న ‘రెయిన్బో ఐలాండ్’ విశేషాలు తెలుసుకుందామా? ఇరాన్–పర్షియన్ గల్ఫ్‌లోని హార్ముజ్ ద్వీపం 42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 7,000 జనాభా. ఇది శాస్త్రవేత్తలకు ఓ పెద్ద డిస్నీల్యాండ్. ఎటుచూసినా సహజసిద్ధంగా ఏర్పడిన రంగురంగుల పర్వతాలు..అడుగడుగునా ఖనిజ నిక్షేపాలు..నాపరాయి, మట్టి, ఇనుము అధికంగా ఉండే అగ్నిపర్వత శిలలతో ఏర్పడిన తెలుపు, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, నారింజ, లేత గోధుమరంగు, గోధుమ, లేత మణి, బంగారపు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. అందుకే దీనిని ‘రెయిన్బో ఐలాండ్’ అని పిలుస్తారు. ఈ దీవిలో దాదాపు 70 వరకు ఖనిజాలను గుర్తించారు. కోట్ల ఏళ్ల కిందట పర్షియన్ గల్ఫ్ అంచుల చుట్టూ సముద్రం నుంచి కొట్టుకొచ్చిన ఉప్పు భారీగా పేరుకుపోయిందని, ఖనిజ, అగ్ని పర్వతాలతో కలిసి రంగురంగుల ఉప్పు దిబ్బలుగా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. చదవండి: 1485 ఎకరాల్లో అతి పేద్ద శ్మశానం.. ఇప్పటివరకు 50 లక్షల మృతదేహాలు.. – సాక్షి, అమరావతి ఉప్పు దేవత.. స్థానికులు ఇక్కడి ఉప్పు పర్వతాన్ని దేవతగా పిలుస్తారు. ఇది కిలోమీటరకుపైగా విస్తరించి ఉంది. దీనికి ఔషధ గుణాలున్నాయని నమ్ముతారు. రాతి ఉప్పు గాలి పీల్చుకోవడంతో అనారోగ్య సమస్యలను నయమవుతాయని విశ్వసిస్తారు. అందుకే దీనిని పాజిటివ్ ఎనర్జీ వ్యాలీ అని కూడా అంటారు. బ్లడ్ సీ.. ఈ ద్వీపంలోని సముద్రం ఎర్రటి అలలతో ఎగిసిపడుతుంది. అందుకే దీనిని బ్లడ్ బీచ్, బ్లడీ సీ అని పిలుస్తారు. ఐరన్ ఆక్సైడ్ అధికంగా ఉండే ఎర్రటి మట్టి వల్ల నీరు ఎరుపుగా ఉంటుంది. ఇక్కడ అతిపెద్ద రంగురంగుల మట్టి కార్పెట్ కనిపిస్తుంది. సైలెంట్ వ్యాలీ, రెయిన్బో గుహలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. 2019 ఇరాన్ లెక్కల ప్రకారం 18 వేల మంది మాత్రమే ఈ ప్రదేశాన్ని సందర్శించారు. ఇక్కడ పెద్ద వాహనాలు ఉండవు. స్థానికుల రిక్షాల్లో ద్వీపాన్ని చుట్టిరావచ్చు. చదవండి: Viral Video: ‘వాట్ ఏ టైమింగ్.. ఇక్కడ విసిరితే అక్కడ ల్యాండ్ అయ్యింది’ తినే పర్వతం.. హార్ముజ్‌లోని ఓ పర్వతపు ఎర్ర మట్టిని సుగంధ ద్రవ్యంగా స్థానికులు వంటల్లో వినియోగిస్తుంటారు. ఇక్కడి పర్వతాల ఎర్రటి మట్టిని గెలాక్ అని పిలుస్తారు. ఇది అగ్నిపర్వత శిలల నుంచి ఉద్భవించిన హెమటైట్ ఐరన్ ఆక్సైడ్ వల్ల ఏర్పడింది. ఈ ఖనిజానికి ఎన్నో పారిశ్రామిక ఉపయోగాలున్నాయి. దీని మట్టి కూరలకు మంచి రుచి ఇస్తుంది. స్థానికులు దీనిని రొట్టెతో నంజుకుని తింటారు. తాజాగా పట్టిన సార్డినెస్, కిల్కా, మోమాగ్ చేపలను శుభ్రం చేసి వాటిని మట్టితో చేసి సాస్‌లో పెద్ద కంటైనర్‌లో వేసి 2 రోజులు ఎండలో ఉంచడంతో ‘సురఘ్’అనే రుచికరమైన భోజనం అవుతుంది. ఈ మట్టినే స్థానిక కళాకారులు పెయింటింగ్, సిరామిక్స్, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తారు -
గద్వాలలో అద్భుత దృశ్యం.. మీరే చూసేయండి
సాక్షి, గద్వాల: ప్రకృతి అందాలు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఎన్నో ఉన్నాయి. వర్షాకాలం వేళ మరింత రమణీయంగా పర్యాటక ప్రాంతాలు కనులవిందు చేస్తుంటాయి. వర్షాల జోరుకు బుధవారం కొంత తెరపడింది. అయితే వాతావరణం మాత్రం ఆహ్లాదకరంగా మారింది. ఈ సమయంలో ఇంద్రధనుస్సు విరిసింది. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులో అద్బుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆకాశంలో ఇంద్రధనుస్సు అస్తమించే సూర్యుడిలా దర్శనమిచ్చింది. ఇంద్రధనస్సు కనువిందు చేయడంతో స్థానిక ప్రజలందరూ ఆసక్తిగా తిలకించారు. ఈ దృశ్యాలను తమ సెల్ఫోన్లలో బంధించారు. -
ప్రకృతి కాంత హోయలు.. రెండు హరివిల్లులు
సాధారణంగా ఆకాశంలో ఇంద్రధనస్సు ఒక సమయంలో ఒకటే ఏర్పడుతుంది. అయితే ఆదివారం నిజామాబాద్ జిల్లా నందిపేట్ గ్రామ శివారులో రెండు ఇంద్రధనుస్సులు ఏర్పడ్డాయి. సాయంత్రం వేళ ఆకాశం మేఘావృతమై మోస్తరు వర్షం కురిసిన అనంతరం రంగుల హరివిల్లు ఇలా వెల్లివిరిసింది. –ఇందూరు(నిజామాబాద్ అర్బన్) పంటలను ముంచిన బ్యాక్‌వాటర్ మహదేవపూర్: మూడు రోజులుగా కురిసిన వర్షాలకు వచ్చిన వరదలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అబట్పల్లి వద్ద మేడిగడ్డ లక్ష్మీబ్యారేజ్లో 79 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో బ్యాక్‌వాటర్‌తో కొంగలవాగు, పెద్దంపేట వాగు ఉప్పొంగి సూరారం, పెద్దంపేట గ్రామాల్లోని దాదాపు 300 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. నష్టం అంచనా వేసి సాయం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. బ్యారేజీలో 94.80 మీటర్ల ఎత్తులో నీరు నిల్వ ఉందని, ప్రస్తుతం కురిసిన వర్షానికి 25,300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదుతున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు పేర్కొన్నారు. -
ఎంత అందంగా ఉందో.. ఇదేం వింత: 48 మిలియన్ల వ్యూస్
సాధారణంగా పాము, కొండచిలువ, అనకొండ వంటి పేర్లు వినగానే మనకు తెలియకుండానే ఒంట్లోకి భయం ప్రవేశిస్తుంది. ఆ వెంటనే ముఖం అదోలా పెడతా. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వీడియోని ఒకసారి చూస్తే.. మళ్లీ మళ్లీ వీక్షిస్తారు. ఇంత అందంగా ఉంది.. ఇదేలా సాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసే ఈ కొండచిలువ ఇంద్రధనసు మాదిరిగా పలు వర్ణాల్లో మెరిసిపోతుంది. టక్కున చూస్తే.. ఏదైనా డ్రెస్ ఏమో అనుకుంటారు. అంత అందంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. కాలీఫోర్నియాకు చెందిన రెప్టైల్ జూ ఫౌండర్ జే బ్రూవర్ వివిధ వర్ణాల్లో ఉన్న కొండచిలువకు సంబంధించిన వీడియోని షేర్ చేశాడు. ఇక ఈ కొండచిలువ లేత నెమలి పించం, బంగారు వర్ణం రంగుల్లో మెరిసిపోతు నెటిజనులను ఆకర్షిస్తుంది. దీన్ని చూసిన నెటిజనులు ఇంత అందమైన కలర్ కాంబీనేషనా.. వావ్ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోని 48 మిలియన్ల మందికిపైగా చూడగా.. 3.3 మిలియన్ల మంది లైక్ చేశారు. చదవండి: ప్రాణం కోసం విలవిల.. గట్టిగా చుట్టి మింగేసింది -
Sun Halo: అందమైన రెయిన్బో.. ట్విటర్ ట్రెండింగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అద్భుతమైన దృశ్యం విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆకాశంలో బుధవారం అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మంగళవారం రాత్రంతా ఉరుములు మెరుపులు, భారీ వర్షంతో తడిసి ముద్దైన నగరంలో సూర్యుడి చుట్టూ రెయిన్ బో (ఇంద్రధనస్సు) అందంగా పరుచుకుంది. దీంతో పలువురు ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ‘సన్ హాలో’ అంటూ ఫోటోలను షేర్ చేస్తున్నారు. సన్‌హాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. కాగా మధ్యాహ్నం 12 తర్వాత సూర్యుడి చుట్టూ గుండ్రంగా రెయిన్ బో చాలా స్పష్టంగా కనిపించింది. మంగళవారం రాత్రి భారీ వర్షం కారణంగానే ఇంద్రధనస్సు దర్శనమిచ్చిందంటూ నగర వాసులు మురిసిపోతున్నారు. వర్షం కారణంగా, వాతావరణంలో నీటి బిందువులు ఉంటాయనీ, అవి క్రిస్టల్స్‌గా మారతాయని, క్రిస్టల్స్‌గా మారిన నీటి బిందువులలో సూర్యుడి కాంతి ప్రసంరించినప్పుడు ఇలా రెయిన్ బో ఏర్పడుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
'సన్'మోహన దృశ్యం
వేలేరుపాడు: వేలేరుపాడు మండలంలో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సూర్యుడి చుట్టూ వలయాకారంలో రంగుల వృత్తం ఏర్పడింది. వలయం చుట్టూ నీలం రంగులో నిలువెత్తు కిరణాలు వెలువడ్డాయి. దీనిని అంతా ఆసక్తిగా చూసారు. దీనిపై ఖగోళ శాస్త్రవేత్త కంబాల రవికుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల్లో వాతావరణం చల్లబడిన తర్వాత ఈ తరహా వలయాలు ఏర్పడతాయన్నారు. నదీ పరివాహక, సముద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఏర్పడతాయన్నారు. సూర్యుడి చుట్టూ వలయం ఏర్పడి వాతావరణంలో మేఘాలు ఎక్కువగా ఉన్న సమయంలో వాటిలో నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు పరావర్తనం, వక్రీభవనం చెందడం వల్ల ఈ తరహా వలయాలు ఏర్పడతాయని ఆయన వివరించారు. ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఏర్పడిన వలయాకారం -
నాలుగేళ్లకు ఇల్లు చేరిన బాలిక
సాక్షి, హైదరాబాద్: దాదాపు నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన బాలికను తెలంగాణ పోలీసులు దర్పణ్ యాప్ సాయంతో ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. పాతబస్తీలోని హసన్‌నగర్‌కు చెందిన పదేళ్ల ముస్కాన్ ఫాతిమా 2015 మే 5న హైకోర్టు సమీపంలో తప్పిపోయింది. దీనిపై ఫాతిమా నానమ్మ మాలేబీ పోలీసులకు ఫిర్యా దు చేశారు. పోలీసులు గాలించినా ఫాతిమా ఆచూకీ దొరకలేదు. 2016లో ఈ కేసు సీఐడీకి బదిలీ అయింది. అక్కడ ఫాతిమా ఫొటోను దర్పణ్ యాప్ సాయంతో వెతికి చూడగా.. ఫలక్‌నుమాలోని రెయిన్బో హోంలో ఉన్నట్లు గుర్తించారు. దర్ప ణ్ యాప్ సాయంతో మూడేళ్ల 10 నెలల తర్వా త తిరిగి ఫాతిమా సొంతింటికి చేరింది. దర్పణ్ యాప్ ద్వారా ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 20 మంది చిన్నారులను కన్న వారి వద్దకు చేర్చినట్లు వుమెన్స్ ప్రొటెక్షన్ సెల్ ఇన్చార్జి, ఐజీ స్వాతీ లక్రా వెల్లడించారు. -
ఆరోగ్యానికి ఇంద్రధనుస్సు రుచులు
తిండిగోల వాన వచ్చినప్పుడు మాత్రమే ఇంద్రధనుస్సు వస్తుంది. కానీ ఇంద్రధనుస్సులో ఉండే రంగుల్లో కూరగాయలన్నీ ఉంటాయి. వానల్లేనప్పుడు కూడా వాన పడేటప్పుడు మాత్రమే వెల్లివిరిసే రంగుల కూరగాయలు తింటుంటే మన ఆరోగ్యం ఎప్పుడూ ఇంద్రధనుస్సంత అందంగా ఉంటుంది. విబ్జియార్ అని పిలిచే ఆ రంగు కూరగాయలను తినాలంటే... వి ఫర్ వయొలెట్ అంటూ వంకాయ; ఐ ఫర్ ఇండిగో అంటూ ఆలివ్స్, ఇండిగో కలర్లో ఉండే సోయాబీన్స్, బి ఫర్ బ్లూ అంటూ నేరేడు, జీ ఫర్ గ్రీన్ అంటూ ఆకుకూరలూ, వై ఫర్ ఎల్లో అంటూ పైనాపిల్, గుమ్మడి, ఓ ఫర్ ఆరెంజ్ అంటూ నారింజలు, ఆర్ ఫర్ రెడ్ అంటూ స్ట్రాబెర్రీస్, పుచ్చకాయలు తింటే మేలు. అయితే తెల్లరంగులో ఉండే ఉప్పు, వరి, నెయ్యితో కాస్త జాగ్రత. కానీ తెల్లగా ఉండే ఉల్లి, వెల్లుల్లి మాత్రం ఆరోగ్యానికి ఎంతో మేలు. -
‘హరివిల్లు’ కనువిందు
తూప్రాన్: తూప్రాన్ మండలం రంగాయిపల్లిలో సోమవారం సాయంత్రం ఆకాశంలో ఏర్పడిన ‘ఇంద్రదనుస్సు’ కనువిందు చేసింది. ఇంద్రదనుస్సు ఏర్పడటం సహజమైనా రంగాయిపల్లిలో మాత్రం ఒకేసారి రెండు ఇంద్రదనుస్సులు ఏర్పాడటంపై ప్రజలు ఆసక్తింగా తిలకించగా.. ‘సాక్షి’ క్లిక్ మనిపించింది. -
ఇంద్రధనుస్సు చీరకట్టే..!
ఎండావాన కలసిన వేళ... ప్రకృతిలో ఒక పులకింత... ఆకాశంలో ఒక వినూత్న తేజస్సు ఆకాశ వీధికి తోరణం కట్టినట్లు ఆకర్షణీయమైన ఇంద్ర ధనుస్సు. చూపరుల మదిలో ఉల్లాసాల ఉషస్సులు ప్రసరింపజేస్తున్న ఈ సోయగాల ఇంద్ర ధనుస్సు కర్నూలు నగరంలో శనివారం సాయంత్రం కనిపించింది. ఆకాశపు తెల్ల కాగితంపై కోణమానిని పెట్టి వెలుగు రేఖ గీసినట్టనిపించే ఈ దృశ్యం నిర్మలాకాశ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసింది. సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు ఇంద్రధనుస్సు చీరకట్టే..! -
గోరంతా హరివిల్లు
నెయిల్ ఆర్ట్ ఈ నెయిల్ ఆర్ట్ వేసుకోవడానికి ట్రాన్స్పరెంట్, ఆరెంజ్, వయొలెట్, పింక్, వైట్, గ్రీన్, స్కై బ్లూ రంగుల నెయిల్ పాలిష్‌లు, ఓ స్పాంజి ముక్క ఉంటే చాలు. ఈ ఆర్ట్ మీ గోళ్లకు డిఫరెంట్ లుక్ ఇస్తుంది. ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపించే ఈ నెయిల్ ఆర్ట్‌ను వేసుకోవడం చాలా సింపుల్. ఇంద్రధనుస్సులో ఏడు రంగులుంటాయి. కానీ ఈ డిజైన్‌లో ఆ ఏడు రంగులు లేకున్నా... ఇంద్ర ధనుస్సులాగే కనిపిస్తుంది. మరి మీకూ ఈ డిజైన్ కావాలంటే, ముందుగా గోళ్లన్నిటినీ శుభ్రం చేసుకోవాలి. ఆపైన డిజైన్‌ను వేసుకోండి... 1. ముందుగా గోళ్లన్నిటికీ వైట్ కలర్ పాలిష్‌ను అప్లై చేసుకోవాలి. తర్వాత స్పాంజి ముక్కపై ఫొటోలో కనిపిస్తున్న విధంగా అన్ని రంగుల పాలిష్‌లను పూయాలి. 2. ఇప్పుడు ఆ స్పాంజిని గోళ్లపై అద్దాలి. దాంతో ఆ రంగులన్నీ గోళ్లకు అంటుకుంటాయి. 3. ఒకే కోటింగ్ కావడం వల్ల రంగులు గోళ్లపై లైట్‌గా కనిపిస్తాయి. కాబట్టి మరోసారి స్టెప్ 1,2 లను రిపీట్ చేయాలి. అలా చేస్తే నెయిల్ పాలిష్ రంగులు డార్క్‌గా అందంగా కనిపిస్తాయి. 4. ఒక స్టిక్లాంటిది తీసుకొని, దాన్ని వైట్ కలర్ నెయిల్ పాలిష్‌లో ముంచాలి. ఇప్పుడు ఆ పెయింట్‌తో ఫొటోలో కనిపిస్తున్న విధంగా పూల రేకులను డ్రా చేయాలి. 5. పూల రేకులు పూర్తిగా వేస్తే... 5వ నంబర్లో కనిపిస్తున్నట్టుగా వస్తాయి. ఆ రేకులు కాస్త దూరం దూరంగా వేస్తేనే, అవి ఒకదానికొకటి తగలకుండా ఉంటాయి. ఇప్పుడు మరో గీతను చాపంలా గీసి, చిన్న సైజు ఆకులను గీయాలి. ఆపైన గోళ్లపై ట్రాన్స్పరెంట్ పాలిష్‌తో ఫినిషింగ్ కోట్ ఇవ్వాలి. -
కలర్స్
పాఠశాలల్లో ప్రత్యేక దినోత్సవాలు ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు అవగాహన, ఆనందం సప్తగిరికాలనీ : జీవితం రంగులమయం. సంతోషం, దుఃఖం, హాస్యం, ప్రమాదం.. ఇలా ఒక్కో దానికి ఒక్కో రంగు. జీవితంలో సప్తవర్ణాలది విడదీయరాని బంధం. తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, ఉదా, నీలం.. దేనికదే ప్రత్యేకం. ఈ రంగులపై ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాఠశాలలు ప్రత్యేకంగా కృషి చేస్తున్నాయి. విద్యాసంస్థల్లో రంగుల దినోత్సవాలు నిర్వహిస్తున్నాయి. వారంలో ఒక రోజును ఎంపిక చేసి ఒక కలర్‌పై ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ కలర్స్ డే గురించి కలర్ఫుల్గా తెలుసుకుందాం.. ఒలింపిక్ రంగులు ఒలింపిక్స్ అంటే చాలా మందికి తెలుసు. నాలుగేళ్లకోసారి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే క్రీడల లోగోలో ఐదు వలయాలు ఉంటాయి. ఒక్కో వలయం ఒక్కో రంగు ఉంటుంది. ఆ రంగు ఒక్కో ఖండాన్ని సూచిస్తుంది. నేటి కాలంలో విద్యాసంస్థలు చేపడుతున్న రంగుల దినోత్సవాల్లో ముఖ్యంగా ఈ ఐదు రంగులకు ప్రాధాన్యతనిస్తున్నారు. పసుపు రంగు–ఆసియా, ఎరుపు–అమెరికా, నీలం–యూరప్, నలుపు–ఆఫ్రిక, ఆకుపచ్చ–ఆస్ట్రేలియా ఖండాలకు సూచికలని విద్యార్థులకు బోధిస్తున్నారు. నిర్వహణ ఇలా.. రంగుల దినోత్సవాలకు వారంలో ఒక రోజు ఎంపిక చేసుకుంటున్నారు. ఆ రోజు ఒక రంగును ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన రంగుల దుస్తులను విద్యార్థులు వేసుకుని వస్తారు. దీంతోపాటు ఆ రంగుకు సంబంధించి ఇంట్లో, బయట కనిపించే ప్రతి వస్తువును పాఠశాలకు తీసుకొస్తారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులందరు ఒక చోటు కూర్చుంటారు. వారు తెచ్చిన వస్తువులను అందంగా ఒక చోట అలంకరిస్తారు. టీచర్స్ ఏం చెబుతారు ఒక చోట కూర్చున్న విద్యార్థులకు ఉపాధ్యాయుల ఆ రంగు ప్రత్యేకతను వివరిస్తారు. ఉదాహరణకు రెడ్ కలర్ తీసుకుంటే...రంగులలో పెద్దన్న పాత్ర రెడ్ అని విద్యార్థులకు చెబుతారు. టమాట, ఆపిల్ రెడ్ కలర్ ఉంటాయని చెబుతారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు కనిపించే ట్రాఫిక్ సిగ్నల్‌లోనూ రెడ్ రంగు ఉంటుందని వివరిస్తారు. రెడ్ సిగ్నల్ పడగానే వాహనాలు ఆపాలని తెలుపుతారు. అదే విధంగా రెడ్ సిగ్నల్ ఎక్కడ కన్పించిన ఆది ప్రమాదానికి సంకేతమని వివరిస్తారు. ఇలా రెడ్ కలర్ ప్రాముఖ్యతను వివరిస్తారు. రంగుల సారాంశం ఎరుపు : ప్రమాద హెచ్చరికగా, ఫ్యాషనబుల్ పవర్ఫుల్ ఆరేంజ్ : స్నేహపూరితం, ఉత్సాహవంతం పసుపు : సంతోషం, తెలివికి నిదర్శనం నీలం : మంచి ఆలోచనలకు, ప్రశాంతతకు చిహ్నం నలుపు : కోపానికి, నిరసన, సంతాపానికి, తదితర వాటికి చిహ్నం తెలుపు : శాంతికి చిహ్నం, కొత్తదనానికి నిదర్శనం అంటు ఇవే కాకుండా అన్ని రంగుల సారాంశాన్ని ఇలా విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరిస్తారు. హల్చల్గా ముస్తాబు కలర్స్ డే నిర్వహించే రోజు ఆ రంగుతో ముస్తాబు చేస్తారు. బెలూన్లు, కలర్ పేపర్లు, డెకరేషన్ అదే రంగులో అదిరేలా చేస్తారు. రంగులకు సంబంధించిన వస్తువులు, వాటి ప్రత్యేకతను తెలిపేలా అమర్చుతారు. అవగాహన కోసం రంగులపై చిన్న వయసులోనే అవగాహన కల్పించేందుకు వెరైటీగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నేటి కాలంలో కలర్స్‌కు ప్రాముఖ్యత పెరిగింది. ఒక్కో కలర్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంది. అది ఏమిటో విద్యార్థులకు తెలిపేందుకే ఈ ప్రయత్నం. – ఎల్.రాజయ్య, లెజెండ్ స్కూల్ కరస్పాండెంట్ తెలిసింది శాటర్డే నాడు మా స్కూల్ బ్లూ కలర్ డే చేశారు. మా టీచర్ బ్లూ కలర్ గురించి వివరించారు. స్కూల్లో అందరం బ్లూ డ్రెస్సులు వేసుకొచ్చాం. ఇంకా బ్లూ బెలూన్లు కూడా తెచ్చాం. స్కూల్ ఎన్విరాన్మెంట్ ఆకాశంలా అనిపించింది. – హాసిని వారానికి ఒక రోజు స్కూల్లో వీక్లీ ఒక రోజు కలర్ డేను పెట్టారు. మొన్న రెడ్, నిన్న గ్రీన్ డేలు చేశారు. అందరం చాలా ఎంజాయ్ చేశాం. అసలు మాకు రంగులకు ఒక ప్రత్యేకత ఉంటుందని తెలియదు. స్కూల్ లో రంగుల డేలు చేయడంతో వాటి గురించి తెలిసింది. – ప్రణయ్ -
ఆకాశంలో అద్భుతం !
ఆకాశంలో హరివిల్లు అనగానే... చల్లగాలి.. కమ్ముకొస్తున్న మేఘాలు... చిరుజల్లులు.. సూర్యకిరణాల ప్రసరణ.. వంటి సప్తవర్ణ సోయగాలు మనకు గుర్తుకొస్తాయి. ఇది సహజసిద్ధమైన ప్రకృతి దశ్యకావ్యం. అయితే అటువంటివేమీ లేకుండానే శుక్రవారం మధ్యాహ్నం భగభగ మండే సూర్యుని చుట్టూ హరివిల్లు ఏర్పడింది. మధ్యాహ్నం 12.02 గంటల సమయంలో ఆకాశంలో సూర్యుని చుట్టూ చక్రం ఆకారంలో హరివిల్లు కనిపించింది. సుమారు 28 నిమిషాలపాటు స్పష్టంగా కనిపించిన ఈ హరివిల్లు ప్రజలకు కనువిందు చేసింది. విజయనగరం, గంట్యాడ, పార్వతీపురం ప్రాంతాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఎండతీవ్రత వల్ల ఈ అద్భుత దృశ్యాన్ని ఎక్కువసేపు చూడలేకపోయామని ప్రజలు తెలిపారు. దుమ్ము, ధూళి కాలుష్య మేఘాలు సూర్యుని చుట్టూ ఆవర్తనమై ఉన్నప్పుడు వాటిపై సూర్యకిరణాలు పడితే ఇటువంటి దృశ్యం ఏర్పడుతుందని ఆలిండియా ఫిజికల్ సైన్స్ అధ్యాపకుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగ చంద్రశేఖర్ తెలిపారు. ఇటువంటి దృశ్యాలు గతంలోనూ ఏర్పడ్డాయని చెప్పారు. వీటి ప్రభావం పర్యావరణంపై దుష్ర్పభావం చూపే అవకాశం లేదని, ఆందోళన పడాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారని పేర్కొన్నారు. - విజయనగరం అర్బన్/గంట్యాడ/పార్వతీపురం -
రెయిన్‌బోను చీలుస్తూ విమానం ల్యాండింగ్
డసెల్ డార్ఫ్: జర్మనీలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సాధరణ పరిస్థితులు ఉన్నప్పుడు సురక్షితంగా విమానంలో నుంచి ప్రాణాలతో దిగడమే అద్భుతం అనుకుంటున్న ఈ రోజుల్లో ఏకంగా భీకర గాలుల మధ్య ఓ పైలెట్ విమానాన్ని సురక్షితంగా దించాడు. ఆ గాలి కూడా ఎంత వేగంగా ఉందంటే విమానాన్ని కూడా అమాంతం విసిరేసేంతగా. ఇందులో అసలైన మరో అద్భుతం ఏంటంటే అదే సమయంలో విరిసిన రెయిన్ బో చివరి అంచుమీదుగా చీల్చుకుంటూ పైలెట్ విమానాన్ని దించడం. జర్మనీలోని డసెల్ డార్ఫ్ ఎయిర్ పోర్ట్ లో ఈ సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. అప్పటికే ఆ ప్రాంతంలో తుఫాను వచ్చి వెళ్లిపోయింది. కానీ, బలమైన గాలులు భీకరంగా వీస్తున్నాయి. అదే సమయంలో ప్రయాణీకులతో వచ్చిన జర్మనీ ప్యాసెంజర్ జెట్ విమానం సరిగ్గా రెయిన్ బో చివరి అంచున ఆగింది. అనంతరం దాన్ని చీల్చుకుంటూ రన్ వేపై ముందుకు వెళ్లింది. అత్యంత అరుదుగా కనిపించే ఇలాంటి దృశ్యం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. -
ఎన్నెన్నో అందాలు.. ఏవేవో వర్ణాలు..
చేయి తిరిగిన చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన కళాఖండంలా ఉంది కదూ ఈ చిత్రం! అయితే ఇది ఏ ఆయిల్ పెయింటింగో.. వాటర్ పెయింటింగో కాదు.. నేలపై ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన హరివిల్లు! నేలకు వర్ణాలద్దినట్లుగా ఉన్న ఈ చిత్రం శాన్ఫ్రాన్సిస్కోలోని ఉప్పు తయారీ క్షేత్రాల్లోనిది. సముద్రపు నీటి నుంచి ఉప్పు తయారు చేసే క్రమంలో నీటికి రకరకాల రంగులు వస్తుంటాయట. నీరు ఆవిరై ఉప్పు తయారయ్యేటపుడు వివిధ సూక్ష్మక్రిములు చేరి నీటిని పులియబెట్టడంతో రంగులు ఏర్పడతాయట. రంగులను బట్టి ఉప్పు లవణీయత కూడా తెలుస్తుందట. -
కలలో రెయిన్ బో!
ఇంద్రధనసు... అనే మాట వినబడగానే మనసులో భావుకత తొంగిచూస్తుంది. మరి కలలో కనిపిస్తే? స్థూలంగా చెప్పాలంటే, ‘అంతా బాగుంది’ అనే భావనను ఈ కల ప్రతిఫలిస్తుంది. విజయం ఇచ్చిన ‘కిక్’ కావచ్చు, డబ్బు ఇచ్చిన ‘సౌఖ్యం’ కావచ్చు, కీర్తి ఇచ్చిన ‘సంతోషం’ కావచ్చు. ‘నిన్నటి వరకు కష్టాలు పడ్డావు. ఇక అవి తీరినట్లే’ అనే సందేశాన్ని ఈ కల మార్మికంగా ఇస్తుంది. స్నేహసంబంధం కావచ్చు, భార్యాభర్తల అనుబంధం కావచ్చు...ఇలా మానవ సంబంధాల్లో కొనసాగే సంతోషాన్ని ఈ కల ప్రతిబింబిస్తుంది. దీంతో పాటు మీలోని ఆధ్యాత్మిక కోణాన్ని ఈ కల పట్టిస్తుంది. కళాకారులకు, రచయితలకు ఈ కల అనేది ‘సృజనాత్మక అన్వేషణ’ను సూచిస్తుంది. కొత్తగా ఆలోచించడం, నిన్నటి వరకు లేని కొత్త ఉత్సాహం పొందడం, తనను తాను కొత్తగా మలుచుకోవడం... ఇలాంటివన్నీ ఈ కల ప్రతిఫలిస్తుంది. అరబ్ దేశాలలో ఈ కలకు...‘ప్రేమ గాఢత’, ‘జటిల సమస్యలకు పరిష్కారం దొరకడం’, ‘శుభవార్త’, ‘జీవితాన్ని మలుపు తిప్పే అదృష్టం’... మొదలైన అర్థాలు ఉన్నాయి. పాశ్చాత్య దేశాల్లో ఈ కలకు ‘అసాధారణ విజయం’ అనే అర్థం ఉంది. -
దిగివచ్చిన హరివిల్లు
కడప కల్చరల్ : కడప నగరంలోని నాగార్జున మోడల్ స్కూలు మైదానంలో ఆదివారం హరివిల్లు దిగివచ్చిందా అని అనిపించింది. శ్రీ గోపాల్ ఆటోస్టోర్స్ సౌజన్యంతో సాక్షి దినపత్రిక, టీవీ చానల్ ఆదివారం నిర్వహించిన ముగ్గుల పోటీ సందర్భంగా ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలతోపాటు పలు ఆకర్షణీయమైన ముగ్గులు వేశారు. గౌరమ్మను కొలువుదీర్చిన వారు కొందరైతే, పొంగళ్లు పెట్టిన వారు మరికొందరు. ముగ్గులను బంతిపూలతో నింపిన వారు ఇంకొందరైతే, తళుకు బెళుకులతో ముస్తాబు చేసిన వారు మరికొందరు. వైవీయూ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రమాదేవి, ముడియం హేమలత, సాక్షి ప్రకటనల విభాగం అధికారిణి చాముండేశ్వరి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి బహుమతులకు అర్హమైన ముగ్గులను ఎంపిక చేశారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు 20 ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. పోటీలలో పాల్గొన్న మహిళలందరికీ సంక్రాంతి కానుకను అందజేశారు. సంప్రదాయాలను కాపాడుకుందాం తెలుగు వారికి సంక్రాంతి ఎంతో ఇష్టమైన పండుగ అని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీటీసీ బసిరెడ్డి పేర్కొన్నారు. నేటితరం వారికి పండుగ విశిష్టతను తెలిపేందుకు ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోకరమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో నిర్వహించాలని కోరుకుంటున్నానన్నారు. సృజన శక్తికి ప్రతీక సంక్రాంతి ముగ్గులు మహిళల సృజనాత్మక శక్తికి ప్రతీకలుగా చెప్పవచ్చని కడప క్రైం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలు లోపించడంతోనే సమాజంలో యువత పెడదోవపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమ స్పాన్సర్ శ్రీ గోపాల్ ఆటోస్టోర్స్ యజమాని జ్యూలియస్ మాట్లాడుతూ సంప్రదాయాలను, విలువలను కాపాడే పోటీలలో తమకు అవకాశం కల్పించినందుకు సాక్షి మీడియాకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. నేటి మహిళలను ప్రోత్సహించేందుకు, వారిలో ఆత్మస్థైర్యం, సృజనాశక్తిని పెంచేందుకు ఇలాంటి పోటీలు ఎంతైనా ఉపయోగపడగలవన్నారు. ప్రపంచ స్థాయిలో 11 ఏళ్లుగా నంబర్ వన్‌గా నిలిచి గిన్నీస్ రికార్డులకెక్కిన హీరో సంస్థ ప్రతినిధులుగా తాము ఈ కార్యక్రమం నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. సాక్షి బ్రాంచ్ మేనేజర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ అతి తక్కువ సమయంలోనే సాక్షి దినపత్రిక అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని సంపాదించడం గర్వంగా ఉందన్నారు. ఎడిషన్ ఇన్చార్జి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సాక్షి ఫ్యామిలీ పేజీతో తెలుగు పాఠకులంతా కుటుంబ సభ్యులు కావడం సంతోషాన్నిస్తోందన్నారు. బ్యూరో ఇన్చార్జి ఎం.బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళల్లో దాగివున్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. స్టాఫ్ రిపోర్టర్ బీవీ నాగిరెడ్డి మాట్లాడుతూ సాక్షి పత్రిక ఎప్పటికప్పుడు వినూత్నమైన రీతిలో అవసరమైన వార్తల ప్రచురణతో ముందడుగులో ఉండటానికి కారణం పాఠకుల అభిమానమేనన్నారు. ఈ కార్యక్రమంలో హీరో సంస్థ జనరల్ మేనేజర్ వినాయకా, సేల్స్ మేనేజర్ వెంకటేష్, సేల్స్ టీం ప్రతినిధులు సుబ్బయ్య, సురేష్ పాల్గొన్నారు. విజేతలు వీరే: శిరీషాబాయి (ప్రొద్దుటూరు),వి.సుజాత (కడప), వి.అంజలి (కడప) ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను పొందారు. ఎం.ధనలక్ష్మికి ప్రత్యేక బహుమతి లభించింది. సి.పద్మావతి, వి.విజయలక్ష్మి, జి.రమాదేవి, యు.అరుణ, సుమ, సరోజమ్మ, రమాదేవి, సౌభాగ్యలక్ష్మి, మంజులావాణి, రేణుక, సుమలత, సునీత, నాగజ్యోతి, ప్రవీణ, గాయత్రి, రోహిణి, మాధవి ప్రోత్సాహక బహుమతులు సాధించారు. శ్రీ గోపాల్ ఆటో స్టోర్స్ యజమాని జ్యూలియస్ దంపతులతోపాటు అతిథులు బహుమతులు అందజేశారు. -
రీడింగ్ స్పాట్
ఇంద్రధనుస్సు ఎలా వస్తుంది.. చెట్లు ఎక్కడి నుండి వస్తాయి.. చిన్నారుల ప్రశ్నల పరంపరకు అడ్డుకట్ట వేయలేం. అయితే నేటి బిజీలైఫ్‌లో వీటికి సమాధానం చెప్పేంత టైమ్ తల్లిదండ్రులకు ఉండటం లేదు. అలాగని వాటన్నింటికి స్కూల్స్‌లోనూ పూర్తి సమాచారం దొరకకపోవచ్చు. ఇలాంటప్పుడు చిరు ప్రశ్నలే పేరెంట్స్‌కు పెద్ద సమస్యలుగా మారుతుంటాయి. దీనికి పరిష్కారం చూపెడుతున్నాయి సిటీలో ఏర్పాటవుతున్న కిడ్స్ లైబ్రరీలు. విజయారెడ్డి చదివితే పోయేదేం లేదు అజ్ఞానం తప్ప అన్నట్టుగా... రీడింగ్‌కు దూరమవుతున్న చిన్నారులకు పుస్తకాలను చేరువ చేసేందుకు ఆధునిక తల్లిదండ్రులు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. పిల్లల ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసేందుకు, రీడింగ్ కల్చర్‌ను ఇంప్రూవ్ చేసేందుకు వీరు పడుతున్న ఆరాటం నుంచి పుట్టుకొచ్చినవే ఈ కిడ్స్ లైబ్రరీలు. చదువు... ఆట విడుపు... ఈ లైబ్రరీలు పిల్లలకు అటు రీడింగ్ హాబీని అలవరుస్తూనే ఇటు ఆటవిడుపుగానూ ఉంటున్నాయి. పెద్దవాళ్ల లైబ్రరీ కల్చర్‌కు ఇవి భిన్నంగా ఉంటున్నాయి. లైబ్రరీ అంటే కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సైన్స్‌కు సంబంధించిన ప్రతి అంశాన్నీ ప్రాక్టికల్‌గా చిన్నారుల ద్వారా చేయించడం వీటిలో కనిపిస్తుంది. ఉదాహరణకు రెయిన్బో ఎలా వస్తుందనే విషయాన్ని తీసుకుంటే వైట్ పేపర్ని తీసుకుని లెన్స్ ఉపయోగించి టార్చ్ లైట్ ఫోకస్‌తో రెయిన్‌బోని చూపిస్తారు. అలాగే విత్తనం ఎలా మొలకెత్తుతుందనే సందేహాన్ని తీర్చేందుకు పెద్ద సైజు డిస్బోజబుల్ వాటర్ గ్లాస్లో సగం వరకు మట్టి నింపి అందులో ఏదైనా ఒక విత్తనం పిల్లల చేత నాటిస్తారు. అది మొలకెత్తేవరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతారు. ఇలా చదువుతో పాటు ప్రాక్టికల్‌గా ఉపకరించే ఎన్నో విషయాలను పిల్లలకు నేర్పించడం సిటీలోని కిడ్స్ లైబ్రరీల ప్రత్యేకత. ప్రతి వారం చిన్నారులకు సంబంధించిన వర్క్‌షాపులు నిర్వహిస్తారు. ఇంగ్లిష్ బాషపైన పట్టు. స్పేస్‌లో జరిగే వింతలూ విశేషాలు, డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్‌గా ఉంటాయి. వారంలో శుక్ర, శని, ఆదివారాల్లో ఇవి అందుబాటులో ఉంటున్నాయి. చదివే అలవాటు వల్లే... నాకు స్వతహాగా చిన్నప్పటి నుంచి రకరకాల బుక్స్ చదివే అలవాటు ఉండేది. దీని వల్ల నా దగ్గర 5 వేల పుస్తకాలు పోగయ్యాయి. ఎంబీయే పూర్తి చేసి ఐదు సంవత్సరాల పాటు ముంబైలో ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ మేనేజర్‌గా పనిచేశా. హైదరాబాద్‌కు వచ్చాక మా పిల్లల నాలెడ్జ్‌కి దోహదపడే సెంటర్స్ ఏవీ లేకపోవటంతో... నా జీతం డబ్బులు జాగ్రత్త చేసి 10 వేల పుస్తకాలతో మూడేళ్ల క్రితం చిన్నారుల లైబ్రరీ ఏర్పాటు చేశా. మా లైబ్రరీలో పిల్లలకు సంబంధించిన ప్రతి పుస్తకం దొరుకుతుంది. కేవలం పుస్తకాలే కాకుండా విభిన్న అంశాలపై పిల్లల్లో విజ్ఞానం పెరిగేందుకు వర్క్‌షాప్‌లు కండక్ట్ చేస్తున్నా. - వర్షా రమేష్, బుక్ ఎండ్ మోర్, వెస్ట్‌మారేడ్‌పల్లి -
హుదూద్ బాధితుల కోసం ‘ఇంద్రధనుస్సు’
హుదూద్ బాధితుల సహాయార్థం శ్రీ సుధా ఆర్ట్స్, శ్రీ భవిరి ఆర్ట్స్ క్రియేషన్స్ ఆదివారం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో ‘ఇంద్రధనుస్సు’ పేరిట సాంస్కృతిక కార్యక్రవూన్ని నిర్వహిస్తున్నారుు. ఉదయుం 10.00 గంటలకు ప్రారంభవుయ్యే ఈ కార్యక్రవుంలో హరికిషన్, జీవీఎన్ రాజు, భవిరి రవి మల్లెల, సుధాకర్ల మిమిక్రీ, కళాధర్ మైమ్, కె.జనార్దన్ మేజిక్ కార్యక్రమాలు ఉంటాయి. సినీ, టీవీ కళాకారులు పాల్గొనే ఈ కార్యక్రవుంలో ఫన్నీ నృత్యాలు, పసందైన హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. -
ఇంద్ర చాపాల డబుల్ ధమాకా
ఇంద్ర ధనుస్సు ఒకటి ఆకాశంలో దర్శనమిస్తేనే ఆనందం. అలాంటిది రెండు ఇంద్ర ధనుస్సులు కనిపిస్తే ఇక ఆ ఆనందమే వేరు. బుధవారం సాయంత్రం విశాఖ జిల్లా చోడవరం ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. వెనువెంటనే ఎండ కాయడంతో గోవాడ గ్రామంలో ఇలా రెండు ఇంద్ర ధనుస్సులు దర్శనమిచ్చి కనువిందు చేశాయి. - చోడవరం రూరల్ -
ఫౌంటేన్.. అదిరెన్..
ఇంద్రధనుస్సు వర్ణాలతో మెరిసిపోతున్న ఈ బ్రిడ్జి ఫౌంటేన్ దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఉంది. హన్ నదిపై ఉన్న బ్రిడ్జికి రెండువైపులా ఉండే ఈ ఫౌంటేన్‌ను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అంతేకాదు.. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జి ఫౌంటేన్‌గా గిన్నిస్ రికార్డు కూడా సాధించింది. 1.14 కిలోమీటర్ల పొడవుతో ఉండే ఈ ఫౌంటేన్ నిమిషానికి 190 టన్నుల నీటిని చిమ్ముతుంది. 2009లో దీన్ని నిర్మించారు.