గోరంతా హరివిల్లు
నెయిల్ ఆర్ట్
ఈ నెయిల్ ఆర్ట్ వేసుకోవడానికి ట్రాన్స్‌పరెంట్, ఆరెంజ్, వయొలెట్, పింక్, వైట్, గ్రీన్, స్కై బ్లూ రంగుల నెయిల్ పాలిష్‌లు, ఓ స్పాంజి ముక్క ఉంటే చాలు. ఈ ఆర్ట్ మీ గోళ్లకు డిఫరెంట్ లుక్ ఇస్తుంది. ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపించే ఈ నెయిల్ ఆర్ట్‌ను వేసుకోవడం చాలా సింపుల్. ఇంద్రధనుస్సులో ఏడు రంగులుంటాయి. కానీ ఈ డిజైన్‌లో ఆ ఏడు రంగులు లేకున్నా... ఇంద్ర ధనుస్సులాగే కనిపిస్తుంది. మరి మీకూ ఈ డిజైన్ కావాలంటే, ముందుగా గోళ్లన్నిటినీ శుభ్రం చేసుకోవాలి. ఆపైన డిజైన్‌ను వేసుకోండి...
1. ముందుగా గోళ్లన్నిటికీ వైట్ కలర్ పాలిష్‌ను అప్లై చేసుకోవాలి. తర్వాత స్పాంజి ముక్కపై ఫొటోలో కనిపిస్తున్న విధంగా అన్ని రంగుల పాలిష్‌లను పూయాలి.
2. ఇప్పుడు ఆ స్పాంజిని గోళ్లపై అద్దాలి. దాంతో ఆ రంగులన్నీ గోళ్లకు అంటుకుంటాయి.
3. ఒకే కోటింగ్ కావడం వల్ల రంగులు గోళ్లపై లైట్‌గా కనిపిస్తాయి. కాబట్టి మరోసారి స్టెప్ 1,2 లను రిపీట్ చేయాలి. అలా చేస్తే నెయిల్ పాలిష్ రంగులు డార్క్‌గా అందంగా కనిపిస్తాయి.
4. ఒక స్టిక్‌లాంటిది తీసుకొని, దాన్ని వైట్ కలర్ నెయిల్ పాలిష్‌లో ముంచాలి. ఇప్పుడు ఆ పెయింట్‌తో ఫొటోలో కనిపిస్తున్న విధంగా పూల రేకులను డ్రా చేయాలి.
5. పూల రేకులు పూర్తిగా వేస్తే... 5వ నంబర్‌లో కనిపిస్తున్నట్టుగా వస్తాయి. ఆ రేకులు కాస్త దూరం దూరంగా వేస్తేనే, అవి ఒకదానికొకటి తగలకుండా ఉంటాయి. ఇప్పుడు మరో గీతను చాపంలా గీసి, చిన్న సైజు ఆకులను గీయాలి. ఆపైన గోళ్లపై ట్రాన్స్‌పరెంట్ పాలిష్‌తో ఫినిషింగ్ కోట్ ఇవ్వాలి.