ఫ్రెంచ్ ఫ్లవర్ ఆర్ట్
నెయిల్ ఆర్ట్
ఇది ఫ్రెంచ్ స్టయిల్ నెయిల్ ఆర్ట్. దీన్ని వేయడానికి నాలుగు రంగుల నెయిల్ పాలిష్ కావాలి. నెయిల్ కలర్, వయొలెట్, తెలుపు, యాపిల్ గ్రీన్ కలర్ నెయిల్ పాలిష్‌లు సిద్ధం చేసుకోండి. ముందుగా గోళ్లను అందంగా కత్తిరించండి. ఆ తర్వాత ఈ డిజైన్ వేసుకోండి. ఎలా అంటే...
1 ముందుగా గోరుకి నెయిల్ కలర్‌ను పూయాలి. ఆరిన తర్వాత గోరు మీద క్రాస్‌గా వయొలెట్ కలర్ నెయిల్ పాలిష్‌ను పూయాలి.
2 అది ఆరిన తర్వాత సన్నని సూదిలాంటిది తీసుకుని, తెలుపు రంగు పాలిష్‌లో ముంచి, వయొలెట్ కలర్ ఉన్న చోట చుక్కల్లాగా అద్దాలి.
3 వయొలెట్ కలర్ పాలిష్ లైన్‌ను ఆనుకుని తెలుపు రంగుతో పూల రేకుల్లాగా వేయాలి.
4 ఐదు రేకులు వేశాక పువ్వులాగా అవుతుంది.
5 ఆ పువ్వు పక్కనే అలాంటి మరో పువ్వును వేయాలి.
6 మరోపక్క కూడా ఒక పువ్వు వేయాలి.
7 వయొలెట్ కలర్ ఉన్న మిగతా భాగంలో సన్నని బ్రష్‌తో చుక్కలు పెట్టాలి.
8 యాపిల్ గ్రీన్ పాలిష్‌ను అక్కడక్కడా ఆకుల్లా అద్దాలి.
9 చివరగా పువ్వుల మధ్యలో కూడా యాపిల్ గ్రీన్ పాలిష్‌తో చుక్కలు పెట్టాలి.