ఇప్పటి వరకు గ్లోబల్ మార్కెట్లో అత్యంత ఖరీదైన బైక్ లేదా కారు గురించి విని ఉంటారు. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ గురించి బహుశా విని ఉండకపోవచ్చు. ఈ కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, ప్రపంచంలో అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ 'అజాచూర్'. దీని ధర రూ. 1.5 కోట్లకంటే ఎక్కువ. దీని ధర ఎందుకింత ఎక్కువగా ఉందంటే.. కారణం ఈ నెయిల్ పాలిష్‌లో మొత్తం 1,118 వజ్రాలు ఉంటాయని తెలుస్తోంది. అంతే కాకుండా దీని క్యాప్ కూడా డైమండ్ కావడం ఇక్కడ విశేషం.
దీనిని లాస్ ఏంజెల్స్‌కు చెందిన డిజైనర్ అజాచూర్ పోగోసియన్ రూపొందించారు. ఈ నెయిల్ పాలిష్ సీసా కూడా చాలా ప్రత్యేకంగా తయారు చేసి ఉంటారు. కావున సీసా కాలి అయిపోయిన తరువాత కూడా దాచుకోవచ్చు. ఈ ఒక్క నెయిల్ పాలిష్ కొనే డబ్బుతో ఏకంగా మూడు మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ కార్లను కొనుగోలు చేయొచ్చు.
ఇదీ చదవండి: ఒక్క ఆలోచన రూ.200 కోట్ల సామ్రాజ్యంగా.. దంపతుల ఐడియా అదుర్స్!
2012లో తయారైన ఈ నెయిల్ పాలిష్‌ని ఇప్పటి వరకు 25 మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. సాధారణ ప్రజలు ఇలాంటి ఖరీదైన నెయిల్ పాలిష్ కొనుగోలు చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ డబ్బున్న సంపన్నులు అందరిలోకంటే ప్రత్యేకంగా కనిపించడానికి ఇలాంటి వాటిని కొనుగోలు చేస్తూ ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment