Nail Polish
-
నెయిల్ పాలిష్ రిమూవర్ ఇంత డేంజరా? మంటల్లో చిక్కుకున్న చిన్నారి..
నెయిల్ రిమూవర్ గురించి మనందరికీ తెలుసు. మన వేలి గోళ్లపై నెయిల్ పాలిష్ సరిగ్గా లేకున్నా లేదా తొలగించాలనుకున్నా నెయిల్ రిమూవర్‌ని ఉపయోగిస్తాం. అలానే ఓ చిన్నారి తన వేలి గోళ్లకు నెయిల్ పాలిష్ సరిగా లేదని తొలగించేందుకు నెయిల్ రిమూవర్‌ని ఉపయోగించింది. అంతే అనూహ్యంగా మంటలు చెలరేగి తీవ్ర గాయాల బారినపడింది ఆ చిన్నారి. ఈ దిగ్బ్రాంతికర ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని ఓహియోకు చెందిన 14 ఏళ్ల కెన్నడి అనే బాలిక కొవ్వొత్తి దగ్గర కూర్చొని నెయిల్ పాలిష్‌ని తొలగిస్తుంది. తన వేళ్లకు నెయిల్ పాలిష్ సంక్రమమైన రీతీలో లేదని తొలగించాలనుకుంటుంది. అయితే ఆ టైంలో తన మంచానికి సమీపంలో కొవ్వొత్తి కూడా ఉంటుంది. ఒక్కసారిగా ఆ నెయిల్ రిమూవర్ ఆవిరికి సమీపంలోనే కొవ్వొత్తి ఉండటంతో ఒక్కసారిగా భగ్గుమని మంటలు లేచిపోయాయి. దీంతో ఆ చిన్నారి చేతిలోని నెయిల్ పాలిష్ బాటిల్ డబ్ మని పగిలి మంటలు మరింతగా మంటలు వ్యాపించాయి. ఆమెతో సహా అక్కడ ఉన్న వస్తువులన్నీ అంటుకుపోతున్నాయి. ఈ హఠాత్పరిణామానికి బిగ్గరగా కేకలు పెట్టింది. అయితే ఆ టైంలో చిన్నారి తల్లిదండ్రులు వేరే పనిలో ఉన్నారు. కెన్నడీ అరుపుతో ఉలిక్కిపడ్డ తలిదండ్రులు ఆమె బెడ్ రూంలోకి హుటాహుటీనా వెళ్లి చూడగా..గదిఅంతా పొగలు కమ్మి చిన్నారి మంటల్లో చిక్కుకుని ఉంది. వెంటనే వారు స్పందించి..కెన్నడీని చుట్టుముట్టిన మంటలను ఆర్పేసి హుటాహుటీనా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే ఈ ఘటనతో తల్లిందండ్రలు గట్టి షాక్‌లోకి వెళ్లిపోయారు. పాపం ఆ చిన్నారి తీవ్రంగా గాయపడటంతో చర్మం చాలా వరకు కాలిపోయింది. పొత్తి కడుపు నుంచి, రెండు తొడలు, ఆమె కుడి చెయ్యికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయా భాగాల్లో ఎక్సిషన్ అనే శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతానికి ఆమె చేతులు కొంతవరకు నయం అయ్యాయి. మిగతా భాగాలకు అయ్యిన గాయాలు తగ్గి కొత్త చర్మం రావడానికి కనీసం ఏడాదిపైన పడుతుందని వైద్యులు తెలిపారు. అంతేగాదు అవి తగ్గేందుకు కొద్దిపాటి చికిత్స కూడా తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఏదీఏమైనా పిల్లలను ఒంటరిగా వదిలేటప్పుడూ మధ్యమధ్యలో కాస్త గమనించండి. ఎల్లవేళల వారిపై ఓ కన్నేసి ఉంచండి. లేదంటే తెలిసి తెలియన పనులతో ప్రాణాలపైకి తెచ్చుకునే ప్రమాదం లేకపోలేదు. (చదవండి: చికూ ఫెస్టివల్ గురించి విన్నారా? ఆ ఫ్రూట్ కోసమే ఈ పండుగ!) -
ఒక్క నెయిల్ పాలిష్ ఇన్ని కోట్లా..!! ఆ డబ్బుతో మూడు బెంజ్ కార్లు కొనేయొచ్చు!
ఇప్పటి వరకు గ్లోబల్ మార్కెట్లో అత్యంత ఖరీదైన బైక్ లేదా కారు గురించి విని ఉంటారు. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ గురించి బహుశా విని ఉండకపోవచ్చు. ఈ కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ప్రపంచంలో అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ 'అజాచూర్'. దీని ధర రూ. 1.5 కోట్లకంటే ఎక్కువ. దీని ధర ఎందుకింత ఎక్కువగా ఉందంటే.. కారణం ఈ నెయిల్ పాలిష్‌లో మొత్తం 1,118 వజ్రాలు ఉంటాయని తెలుస్తోంది. అంతే కాకుండా దీని క్యాప్ కూడా డైమండ్ కావడం ఇక్కడ విశేషం. దీనిని లాస్ ఏంజెల్స్‌కు చెందిన డిజైనర్ అజాచూర్ పోగోసియన్ రూపొందించారు. ఈ నెయిల్ పాలిష్ సీసా కూడా చాలా ప్రత్యేకంగా తయారు చేసి ఉంటారు. కావున సీసా కాలి అయిపోయిన తరువాత కూడా దాచుకోవచ్చు. ఈ ఒక్క నెయిల్ పాలిష్ కొనే డబ్బుతో ఏకంగా మూడు మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ కార్లను కొనుగోలు చేయొచ్చు. ఇదీ చదవండి: ఒక్క ఆలోచన రూ.200 కోట్ల సామ్రాజ్యంగా.. దంపతుల ఐడియా అదుర్స్! 2012లో తయారైన ఈ నెయిల్ పాలిష్‌ని ఇప్పటి వరకు 25 మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. సాధారణ ప్రజలు ఇలాంటి ఖరీదైన నెయిల్ పాలిష్ కొనుగోలు చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ డబ్బున్న సంపన్నులు అందరిలోకంటే ప్రత్యేకంగా కనిపించడానికి ఇలాంటి వాటిని కొనుగోలు చేస్తూ ఉంటాయి. -
ఇస్త్రీపెట్టె కొత్తదానిలా మెరవాలంటే ఇలా! ఈ విషయం మాత్రం అస్సలు మర్చిపోవద్దు
సులువైన, ఉపయోగకరమైన వంటింటి చిట్కాలు మీకోసం.. ఇస్త్రీ పెట్టె క్లీనింగ్ ఇలా.. నీళ్లలో కొద్దిగా బేకింగ్ సోడా, వెనిగర్ వేసి కలపాలి. ఈ మిశ్రమంలో ఇయర్ బడ్స్‌ను ముంచి ఇస్త్రీ పెట్టె అడుగు భాగంలో ఉన్న రంధ్రాలను తుడిస్తే లోపల పేరుకున్న దుమ్ముధూళీ పోతాయి. పెట్టె అడుగుభాగాన్ని కూడా ఈ నీటిలో ముంచి వస్త్రంతో తుడిచి, తరువాత పొడి వస్త్రంతో తుడవాలి. ఇలా చేయడం వల్ల ఇస్త్రీపెట్టె అడుగు భాగంలో నలుపు మొత్తం పోయి కొత్తదానిలా మెరుస్తుంది. అయితే ఇలా తుడిచేటప్పుడు ఇస్త్రీపెట్టె ప్లగ్‌ను స్విచ్‌బోర్డు నుంచి తీసేయాలి. లెన్స్ క్లీన్ చేసే లిక్విడ్ అందుబాటులో లేనప్పుడు.. కళ్లజోడు రోజూ వాడడం వల్ల అద్దాల మీద చిన్నచిన్న గీతలు, దుమ్ము ధూళి పడుతుంటాయి. లెన్స్ క్లీన్ చేసే లిక్విడ్ అందుబాటులో లేనప్పుడు.. అద్దాల మీద కొద్దిగా వెనిగర్ రాయాలి. రెండు నిమిషాలు ఆగిన తరువాత మెత్తటి వస్త్రంతో తుడిస్తే గీతలు, దుమ్ము ధూళి పోతాయి. టేప్ వేస్తే.. ట్యాబ్లెట్స్, సిరప్ డబ్బాల మీద ఉన్న ఎక్స్పైరీ డేట్లు ఒక్కోసారి తడితగిలి చెరిగిపోతుంటాయి. డేట్ తెలియకపోతే ఆ మందును వాడడం కష్టం. ఇలా జరగకుండా ఉండాలంటే ట్యాబ్లెట్గానీ, సిరప్‌ను గాని తీసుకొచ్చిన వెంటనే ఎప్పటి నుంచి ఎప్పటివరకు వాడవచ్చో తెలిపే డేట్స్ మీద ట్రాన్స్పరెంట్ టేప్‌ను అతికించాలి. ఈ టేప్ ఉండడంవల్ల మందు అయిపోయేంత వరకు డేట్ చెరిగిపోకుండా ఉంటుంది. మూత బిగుసుకు పోకుండా నెయిల్ పెయింట్ తీసి వేసుకునేటప్పుడు మూత అంచుల మీద కారి గాలికి గట్టిపడిపోతుంది. దీంతో .. తీసిన వెంటనే రాకుండా మూత స్ట్రక్ అయిపోతుంది. మూత పెట్టేముందు పెయింట్ సీసా మూతి చుట్టూ ఉన్న పెయింట్‌ను శుభ్రంగా తుడిచి, ఇయర్ బడ్‌తో కొద్దిగా నెయ్యి లేదా నూనెను రాసి మూతపెట్టాలి. అప్పుడు మూత బిగుసుకు పోకుండా చక్కగా వస్తుంది. రబ్బర్ బ్యాండ్ మూటకట్టి వాషింగ్ మెషిన్లో పెద్దవాళ్ల బట్టలతోపాటు, సాక్సులు, కర్చీఫ్‌లు, చిన్న చిన్న బట్టలు వేయాలనుకున్నప్పుడు.. కూరగాయలు, పండ్లకు ఇచ్చే నెట్ బ్యాగ్‌లో చిన్నచిన్న బట్టలను వేసి రబ్బర్ బ్యాండ్ మూటకట్టి వాషింగ్ మెషిన్లో వేయాలి. అప్పుడు చక్కగా క్లీన్ అవ్వడంతోపాటు, మిగతా బట్టల్లో కలిసిపోకుండా ఉంటాయి. తాజాగా ఉండేందుకు టొమాటో తొడిమ తీసిన ప్రాంతంలో రెండు చుక్కలు నూనె రాసి రిఫ్రిజిరేటర్లో నిల్వచేస్తే ఎక్కువ రోజులపాటు రంగు మారకుండా తాజాగా ఉంటాయి. చదవండి: ఉల్లిపాయ రసంలో బాదం నూనె కలిపి జుట్టుకు పట్టిస్తున్నారా? కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి ముఖానికి రాస్తే! Korrala Idli- Millet Halwa: ‘సిరి’ ధాన్యాలు.. నోటికి రుచించేలా.. కొర్రల ఇడ్లీ, మిల్లెట్ హల్వా తయారీ ఇలా.. -
ఆర్మీ: నెయిల్ పాలిష్, పోనిటెయిల్‌కు ఓకే
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్.. అగ్రరాజ్య సైన్యానికి సంబంధించి పలు కీలక మార్పులకు ఆమోదం తెలిపారు. సైన్యంలో మహిళా సైనికుల వస్త్రధారణకు సంబంధించి కొన్ని నియమాల్లో కీలక మార్పులు చేశారు. ఇక మీదట అమెరికన్ సైన్యంలోని మహిళా సైనికులు షార్ట్ పోనిటెయిల్ వేసుకోవడానికి.. లిప్‌స్టిక్ పెట్టుకోవడానికి అనుమతించారు. అలానే మగ సైనికులు స్పష్టమైన రంగుల నెయిల్ పాలిష్ ధరించవచ్చని తెలిపారు. ఇక బిడ్డకు పాలిచ్చే మహిళా సైనికులు వస్త్రధారణకు సంబంధించి పలు సడలింపులు ఇచ్చారు. బ్రెస్ట్ ఫీడింగ్, పంపింగ్ ద్వారా బిడ్డకు పాలిచ్చే తల్లులు ప్రస్తుత వస్త్రధారణ ప్రమాణాలకు అదనంగా లోపల మరో వస్త్రం ధరించేందుకు అనుమతిచ్చారు. ఈ నూతన మార్పులు ఫిబ్రవరి 25 నుంచి అమల్లోకి రానున్నాయి అని తెలిపారు. ప్రస్తుత మార్పులు అమెరికా సైన్యంలో చేరే మహిళల సంఖ్యను పెంచుతాయని.. అంతేకాక ప్రస్తుతం ఉన్న మహిళా సైనికులపై అసమాన ప్రభావాన్ని చూపుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: బైడెన్ వలస చట్టంపై హోరాహోరీ ) మాజీ డిఫెన్స్ సెక్రటరీ మార్క్ ఎస్పర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రివ్యూ కమిటీ సూచనల ఫలితమే ఈ మార్పులు. ఈ కమిటీ మిలటరీలో జాతివివక్ష, మైనారిటీలపై అధికార దుర్వినియోగం వంటి పలు అంశాల పరిశీలనకు ఉద్దేశించబడింది. గతంలో అమెరికా సైన్యంలోని మహిళలు పొడవాటి జుట్టును బన్(కొప్పు)లా కట్టుకోవాల్సి వచ్చేది. ఇది అసౌకర్యంగా ఉండటమే కాక.. హెల్మెట్ ధరించడంలో ఇబ్బంది కలిగేది. ఇక తాజా సవరణలతో ఈ సమస్యలు తొలగిపోనున్నాయి. ఈ సందర్భంగా ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ గ్యారీ బిట్రో మాట్లాడుతూ.. ‘‘మా విధానాలను నిరంతరం పరిశీలించుకుంటూ.. అవసరమైన చోట మార్పులు చేసుకుంటూ.. ముందుకు సాగుతున్నాం. ఇక మేం అవలించే విధానాల వల్ల సైన్యంలోని సైనికులందరు మాకు ఎంత విలువైన వారో.. వారి పట్ల మాకు ఎంత నిబద్ధత ఉందో వెల్లడవుతుంది. మా ర్యాంకుల్లో చేరిక, ఈక్విటీ వంటి అంశాల్లో.. మాటల కంటే చేతలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని ఈ రోజు మేం మరోసారి నిరూపించాం. మేం ప్రకటించిన ఈ మార్పులు మన ప్రజలను మొదటి స్థానంలో ఉంచే విధానాలకు ఒక ఉదాహరణ అని మేం నమ్ముతున్నాం’’ అన్నారు. (చదవండి: అంతా ఒక్కటే.. నో ఆడ, నో మగ, నో ట్రాన్స్‌జెండర్) The #USArmy has revised Army Regulation 670-1, Wear and Appearance of Army Uniforms and Insignia. The updates will be effective Feb. 25, 2021 and directly supports the Army’s diversity and inclusion efforts. Learn more in this STAND-TO! ➡️ https://t.co/Y2VlaZgQHr#ArmyLife pic.twitter.com/4y9e7hBJ5a — U.S. Army (@USArmy) January 27, 2021 ఇక ఆర్మీలో చేసిన ఈ మార్పులు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మగ వారికి నెయిల్ పాలిషా.. వ్వాటే జోక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక అమెరికా వాయు సేన తన విభాగంలో పని చేస్తున్న మహిళా సైనికుల హెయిర్ స్టైల్ విషయంలో పలు మార్పులు చేసిన వారం రోజుల తర్వాత మిలిటరీ ఈ నూతన మార్పులు ప్రకటించింది. ఇక ఇదే కాక బైడెన్ లింగమార్పిడి వ్యక్తులను సైన్యంలోకి నిషేధిస్తూ.. ట్రంప్ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. అంతేకాక ‘‘దేశానికి సేవ చేయాలనుకునే వారిని ప్రోత్సాహిస్తేనే.. అమెరికా సురక్షితంగా ఉంటుంది. అలాంటి వారి విషయంలో వివక్ష చూపకూడదని.. వారి పట్ల గర్వంగా భావించాలి’’ అని బైడెన్ ట్వీట్ చేశారు. -
అరనిమిషంలో అద్భుతం !
అలంకరణ అనేది కేవలం అందాన్నే కాదు.. ఆత్మవిశ్వాన్ని కూడా పెంచుతుంది..! అందుకే చాలామంది మేకప్ వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ముఖానికి ఏదో ఒక వైటెనింగ్ క్రీమ్ రాసుకోవడం, పెదవులకి లిప్‌స్టిక్ పూసుకోవడం, కళ్లకు మస్కారా అప్లై చేసుకోవడం, గోళ్లకి నెయిల్ ఆర్ట్ వేసుకోవడం.. ఇవన్నీ మగువల డైలీ మేకప్‌లో భాగమైపోయాయి. లిప్‌స్టిక్, మస్కారాలతో పాటూ రంగురంగుల నెయిల్ పాలిష్‌లు కూడా మేకప్ కిట్‌లో భాగం చేసుకుంటున్నారు మగువలు. ట్రెండీ లుక్‌ని ఫాలో అవుతూ.. రోజుకో నెయిల్ ఆర్ట్ వేసుకుంటున్నారు. వేసుకున్న డ్రెస్‌కు తగ్గట్టుగా కష్టపడి మరీ.. నెయిల్ ఆర్ట్‌ను వేసుకుంటున్నారు. పొడవుగా గోళ్లని పెంచుకుని, నాజూగ్గా షేప్ చేసుకుని వాటిపై వెరైటీ డిజైన్స్ వేసుకుంటూ మురిసిపోతుంటారు. అలాంటివారి కోసమే ఈ నెయిల్ ప్రింటర్.నాజూకైన గోళ్లను మెషిన్లో ఉంచితే.. కేవలం 30 నుంచి 35 సెకన్స్‌లో అదిరిపోయే నెయిల్ ఆర్ట్ వేస్తుంది ఈ మెషిన్. కొమ్మలు, రెమ్మలు, పక్షులు, పదాలు, ప్రకృతి అందాలు ఇలా ఏదైనా సరే.. సెలెక్ట్ చేసుకుని నెయిల్స్ మీద డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి నెయిల్ ప్రింటర్స్‌లో చాలా మోడల్స్ ఉన్నాయి. మోడల్ని బట్టి.. బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంటుంది. దాంతో ఫోన్లో ఓ సెల్ఫీ తీసుకుని.. దాన్ని ఈ మెషిన్‌కి పంపించి.. గోళ్ల మీద ప్రింట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. చూశారా ఎంత అడ్వాన్స్ టెక్నాలజీనో! నచ్చిన వాళ్ల ముఖాలను, నచ్చిన చిత్రాలను గోళ్లపైన అప్లై చేసుకుంటూ రోజుకో నెయిల్ ఆర్ట్ మార్చుకోవచ్చు. కావాలంటే ఆ డిజైన్ మీద నచ్చిన స్టోన్స్ అతికించుకోవచ్చు. ఇలాంటి నెయిల్ ప్రింటర్స్ పెళ్లిళ్లు, ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది. పైన చిత్రంలోని ప్రింటర్ 899 డాలర్లు (రూ. 63,947) కాగా.. చౌక ధరల్లో కూడా ఇలాంటి నెయిల్ ప్రింటర్స్ మార్కెట్లో లభిస్తాయి. అయితే అవి కాస్త చిన్నగా.. కొన్ని ప్రత్యేకతలను మాత్రమే కలిగి ఉంటాయి. కొన్నింటికి ‘మ్యానుఫ్యాక్చర్ ఇమేజ్ ప్లేట్స్’ మెషిన్‌తో పాటు లభిస్తాయి. వాటిని మెషిన్‌కి అమర్చుకుని.. రంగురంగుల నెయిల్ పాలిష్‌లు అందులో నింపుకుంటే ఆ ఇమేజ్‌లను గోళ్లపై ప్రింట్ చేస్తాయి. ఈ మేకర్స్‌లో కొన్ని చార్జర్‌తో, మరికొన్ని బ్యాటరీతో నడుస్తాయి. భలే ఉంది కదూ! -
నెయిల్ పాలిష్... మస్త్ ఖుష్
‘‘హాలిడే తీసుకోవచ్చని చెప్పడానికి నాకెవరూ అక్కర్లేదు. నా గోళ్లే చెప్పేస్తాయి’’ అంటున్నారు సమంత. ఏంటీ ఆశ్చర్యంగా ఉంది కదూ. దాని గురించి సమంత చెబుతూ – ‘‘నేను చేసే పాత్రలకు నెయిల్ పాలిష్ అవసరంలేదు. అన్ని పాత్రలూ దాదాపు అంతే. అందుకే నెయిల్ పాలీష్ వేసుకునే టైమ్ ఉందంటే.. వెకేషన్‌కి టైమ్ వచ్చినట్లే. ఇప్పుడు నెయిల్ పాలీష్ వేసుకున్నాను. చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. ప్రస్తుతం ఆమె మధ్యధరా సముద్రపు తీర ప్రాంతాల్లో భర్త నాగచైతన్యతో కలిసి మస్త్‌గా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. భర్త క్లిక్‌మనిపించిన ఫొటోను, ఇష్టంగా వేసుకున్న నెయిల్ పాలిష్ చేతివేళ్ల ఫొటోను షేర్ చేశారామె. -
బ్యూటిప్స్
కొండంత అందం గోళ్లకు ముందు వేసుకున్న నెయిల్ పాలిష్‌ను రిమూవర్లో ముంచిన దూదితో తుడిచేయాలి. వెడల్పాటి పాత్రలో గోరువెచ్చటి నీటిని పోసి రెండు చుక్కల మైల్డ్షాంపూ కాని లిక్విడ్‌సోప్ కాని వేసి కలిపి అందులో రెండు చేతులను ముంచి పది నిమిషాల సేపు ఉంచాలి. నెయిల్ కటర్‌తో గోళ్లను అందంగా షేప్ వచ్చేటట్లు కత్తిరించాలి. బ్రష్‌తో చేతిని, వేళ్లకు, గోళ్లకు మర్దన చేసినట్లు రుద్ది కడగాలి. మసాజ్ క్రీమ్ లేదా ఆయిల్ అప్లయ్ చేసి మర్దన చేయాలి. వేళ్లకు, ప్రతి కణుపు మీద వలయాకారంగా క్లాక్‌వైజ్ గానూ వెంటనే యాంటి క్లాక్ వైజ్ గానూ మసాజ్ చేయాలి. అలాగే ప్రతి గోరుకూ చేయాలి. అన్నింటికీ ఒకే నంబర్ మెయింటెయిన్ చేయడం ముఖ్యం. అంటే మొదటి వేలికి ఒక కణుపుకు క్లాక్‌వైజ్‌గా ఐదుసార్లు చేస్తే యాంటి క్లాక్‌వైజ్‌గా కూడా ఐదుసార్లు మాత్రమే చేయాలి. ఇదే కౌంట్‌ను అన్ని వేళ్లకు, గోళ్లకు పాటించాలి. ∙టిస్యూ పేపర్‌తో వేళ్లకున్న ఆయిల్ తుడిచి నెయిల్ పాలిష్ వేయాలి. -
నకిలీ వార్తలు ఇలా పుడతాయా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘ముస్లిం మహిళలు గోళ్ల పెయింట్ (నేల్ పాలిష్) వాడ కూడదు. అది ఇస్లాం మతానికి వ్యతిరేకం, చట్ట విరుద్ధం అంటూ దారుల్ ఉలూమ్ దియోబంద్ ఫత్వాను జారీ చేసిందీ’ అని నవంబర్ ఐదవ తేదీన ఏఎన్ఐ (ఆసియా న్యూస్ ఇంటర్నేషనల్) చేసిన ట్వీట్ వైరల్ అవడంతో పలు న్యూస్ ఛానళ్లు, వార్తా పత్రికలు ఆ ఫత్వాను హైలెట్ చేస్తూ హల్చల్ చేశాయి. కొన్ని వార్తా ఛానళ్లు చర్చా గోష్టిలను కూడా నిర్వహించాయి. ఉత్తరప్రదేశ్‌లోని సహ్రాన్‌పూర్ జిల్లాలోని ఇస్లామిక్ స్కూల్ ‘దారుల్ ఉలూమ్ దియోబంద్’ ముఫ్తీ (మత గురువు) ఇష్రార్ గౌర ఈ ఫత్వాను జారీ చేసినట్లు ఓ ఫొటోతో ఏఎన్ఐ ట్వీట్ చేసింది. ఆ ఫత్వా నకిలీదని నకిలీ వార్తలను కనిపెట్టడంలో ఆరితేరిన ‘ఆల్ట్ న్యూస్’ దర్యాప్తులో తేల్చింది. ఆయన దారుల్ ఉలూమ్ దియోబంద్ మత గురువు కాకపోవడమే కాకుండా ఆ స్కూల్‌తోని ఎలాంటి సంబంధం లేదు. ఆయన సహ్రాన్‌పూర్‌లోని జమా మసీదు పాత ఇమామ్ కుమారుడు, ప్రస్తుత ఇమామ్ సోదరుడని తేలింది. ‘తమరు ఏ హోదాలో ఫత్వా జారి చేశారు ?’ అంటూ సదరు ఇష్రార్ గౌరకు ఆల్ట్ న్యూస్ ప్రతినిధి ఫోన్ చేయగా, తన పేరు ఇష్రార్ గౌర కాదని, ఇషాక్ గౌర అని, తాను 1990 దశకంలో జారీ అయినా ఓ ఇస్లాం ఫత్వా గురించి ప్రస్తావించానని, ముస్లింలు మహిళలు గోళ్లకు రంగులకు బదులుగా మెహిందీ వాడాలని ఫత్వా సూచించినట్లు చెప్పానని, తన మాటలకు తప్పుడు అర్థం ధ్వనించేలా ట్వీట్ పెట్టారని ఆయన వివరణ ఇచ్చారు. ఇదే ఏఎన్ఐ ప్రతినిధిని ప్రశ్నించగా ఎక్కడో పొరపాటు జరిగిందని, తప్పు తెలియగానే సరిదిద్దు కున్నామని చెప్పారు. 1990 దశకంలో కూడా అలాంటి ఫత్వా జారీ అయివుంటుందన్నది కూడా అనుమానమే. ఇస్లాం స్కూల్ వెబ్సైట్లో ఇంతవరకు జారీ చేసిన అన్ని ఫత్వాలు ఉన్నాయి. అందులో ఈ ఫత్వాలేదు. ఈ విషయమై దారుల్ ఉలూమ్ దియోబంద్ నిర్వాహకులను ప్రశ్నించగా వారు స్పందించేందుకు నిరాకరించారు. అయితే ఏఎన్ఐ ట్వీట్ చేసిన ఫొటోలో ఉన్న వ్యక్తికి తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, ఆయనెవరో కూడా తమకు తెలియదని చెప్పారు. ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఏఎన్ఐకి దేశవ్యాప్తంగా 50 బ్యూరోలు ఉన్నాయి. అంతటి పెద్ద సంస్థ వాస్తవాలను తెలుసుకోకుండా నకిలీ వార్తను ప్రచురించడం, ఆ నకిలీ వార్తను నమ్మి వార్తా ఛానళ్లు దానికి విస్తృత ప్రచారం కల్పించడం శోచనీయం. -
నెయిల్ పాలిష్ ధర వింటే.. గుండె ఆగుతుంది?!
ప్రతి మనిషి జీవితంలో తన స్థాయిలో లగ్జరీని కోరుకుంటున్నాడు. వస్తువు ఎలాంటిది అయినా.. దాని ఖరీదు మాత్రం తన స్థాయికన్నా అధికంగా ఉండాలని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రతి వస్తువును తయారీదారులు అదే స్థాయిలో రూపొందించిస్తున్నారు. ఇదిగో ఇక్కడ మీరు చూస్తేన్న నెయిల్ పాలిష్ కూడా అటువంటిదే. దీనిని ప్రపంచంలోని కోటీశ్వరుల్లో చాలాతక్కువ మంది మాత్రమే ఉపయోగించలరు. లగ్జరీకి పరాకాష్టగా కూడాదీనిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని ఖరీదు. కేవలం కోటీ 63 లక్షల 66 వేల రూపాయలు మాత్రమే. దీనిని దిగుమతి చేసుకోవాలంటే అదనంగా మరో పది లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. ఇంతటి ఖరీదైన నెయిల్ పాలిష్‌ని లాస ఏంజెల్స్‌లోని లగ్జరీ సౌందర్య సాధానాల తయారీ సంస్థ అజాతురే రూపొందించింది. ఈ నెయిల్ పాలిష్‌లో 267 కేరట్ల బ్లాక్ డైమండ్‌ను ఉపయోగించారు. అందుకే ఇంత ఖరీదు అని సంస్థ అధికారులు చెబుతున్నారు. ఈ బ్లాక్ డైమండ్ నెయిల్ పాలిష్‌ను కేవలం ఆర్డర్ మీద మాత్రమే తయారు చేస్తామని చెప్పారు. -
ఫస్ట్ టైమ్ కాళ్లు పట్టుకున్నాడు!
ఇన్సెట్లో ఫొటో చూశారా? సుకుమారి కృతీ సనన్ పాదాలను చేతిలోకి తీసుకుని చక్కగా ఓ అబ్బాయి తుడుస్తున్నాడు కదా! అతనెవరో కాదు... హిందీ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్. ఇంతకీ, కృతీ పాదాన్ని సుశాంత్ ఎందుకు పట్టుకున్నాడు? అంటే... ఆమె నెయిల్ పాలీష్‌ను క్లీన్ చేస్తున్నాడు. అదీ చక్కగా కింద కూర్చుని. అప్పుడు కుర్చీలో కూర్చున్న కృతి ఓ ఫొటో తీసుకుని, ‘ఫస్ట్ టైమ్... నా నెయిల్ పెయింట్‌ను క్లీన్ చేస్తున్నాడు’ అని క్యాప్షన్ పెట్టారు. బీ–టౌన్ జనాలు ఈ ఫొటోకి కొత్త అర్థాలు తీస్తున్నారు. ‘ఫస్ట్ టైమ్... నా కాళ్లు పట్టుకున్నాడు చూడండి’ అన్నది కృతి అర్థమని చెబుతున్నారు. వీళ్లిద్దరూ లవ్‌లో ఉన్నారని బీ–టౌన్ టాక్. వీళ్లు మాత్రం ఎప్పుడూ తమ ప్రేమను పబ్లిగ్గా అంగీకరించలేదు. వీలైనప్పుడు ఇలా వార్తల్లో నిలుస్తున్నారు. -
గోరు... అనిపించకూడదు బోరు..!
నెయిల్ జిగేల్ గోళ్లు మరీ బలహీనంగా ఉంటే వాటిని నీళ్లతో తడిపి గోరువెచ్చని ఆలివ్ ఆయిల్లో రోజు విడిచి రోజు 20 నిమిషాల పాటు ఉంచితే బలంగా తయారవుతాయి. మ్యానిక్యూర్ చేయించేప్పుడు ఒక్కోసారి బ్యుటీషియన్స్ గోటి క్యూటికిల్ కూడా తీసేస్తారు. ఇలా చేయడం సరికాదు. దీనివల్ల ఒక్కోసారి ఇన్ఫెక్షన్లు రావచ్చు. వారానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు నెయిల్ పాలిష్ తీసేసి మళ్లీ వేసుకోవడం సరికాదు. అంటే... వారానికి ఒకసారి ఒక్క నెయిల్ పెయింట్ మాత్రమే వేసుకోవడం ఆరోగ్యకరం. మీ గోళ్లకు స్వాభావికమైన మెరుపు రావాలంటే వాటిపై పెట్రోలియమ్ జెల్లీ పూసి, పాలిష్ చేసినట్లుగా ఒక పొడి గుడ్డతో బఫ్ చేయాలి. గోళ్లకు సబ్బు తగిలి ఉంటే అవి పెళుసుగా మారిపోతాయి. కాబట్టి స్నానం చేసిన వెంటనే, లేదా చేతులు శుభ్రం చేసుకున్న వెంటనే వాటికి తగిలి ఉన్న సబ్బు పోయేలా కడిగి పొడిగుడ్డతో శుభ్రం చేసుకోవాలి. గోరు ఆరోగ్యం కోసం బ్రాకోలీ, చేపలు, ఉల్లి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. మంచి నీళ్లు ఎక్కువగా తాగుతూ, ఆకుపచ్చని కూరలు తీసుకుంటూ ఉంటే గోరు మరింత ఆరోగ్యంగా ఉంటుంది. -
గోళ్లెక్కిన లేసులు
నెయిల్ ఆర్ట్ ఇది ‘ఓరియంటల్ లేస్’ నెయిల్ ఆర్ట్. దీన్ని వేసుకోవడానికి లైట్ రెడ్, వైట్, ట్రాన్స్పరెంట్ కలర్ నెయిల్ పాలిష్‌లను సిద్ధం చేసుకోవాలి. ఈ నెయిల్ ఆర్ట్ వేసుకోవడం చాలా సింపుల్‌గా ఉండటమే కాదు.. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీన్ని పిల్లల చేతులకు వేస్తే, వారు భలేగా ముచ్చట పడతారు. ఇప్పటివరకు చీరలు, డ్రెస్సులకే లేసులు వేయడం చూసుంటారు.. కానీ గోళ్లకూ వేయాలనుకుంటే.. ఈ నెయిల్ ఆర్ట్‌ను వేసుకుంటే సరి. 1. ముందుగా గోళ్లన్నిటికీ లైట్ రెడ్ కలర్ నెయిల్ పాలిష్‌ను పూర్తిగా అప్లై చేయాలి. తర్వాత వైట్ పాలిష్‌తో మూడు చుక్కలు పెట్టుకోవాలి. 2. ఇప్పుడు ఆ చుక్కలను మూడు పూరేకులుగా చేసుకోవాలి. 3. ఆ పైన పూరేకులను ఫొటోలో కనిపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేయాలి. 4. తర్వాత వైట్ కలర్ పాలిష్‌తో మునుపటి డిజైన్‌కి పై భాగంలో సన్నగా అయిదు చుక్కలు పెట్టుకోవాలి. 5. ఇప్పుడు ఆ చుక్కలకు ఇరువైపుల మరో రెండు రెండు చుక్కలు పెట్టాలి. 6. ఫొటోలో కనిపిస్తున్న విధంగా వైట్ పాలిష్ వేసిన చోట లైట్ రెడ్ కలర్‌తో మూడు చుక్కలు పెట్టుకోవాలి. 7. ఆ ఎరుపు రంగు చుక్కలను కూడా పూరేకుల్లా చేసుకోవాలి. 8. తర్వాత ఆ ఎరుపు పూరేకులపై వైట్ కలర్‌తో మూడు గీతలు గీయాలి. చివరగా గోళ్లన్నిటి పై ట్రాన్స్పరెంట్ పాలిష్‌తో సింగిల్ కోట్ వేస్తే.. డిజైన్ లుక్కే మారిపోతుంది. -
గోటి తలుపులు...
నెయిల్ ఆర్ట్ ఈ నెయిల్ ఆర్ట్ చూడటానికి ఎంత స్టైల్‌గా ఉంటుందో... వేసుకోవడానికీ అంతే సులువుగా ఉంటుంది. ఈ డిజైన్ చూడటానికి తెరిచిన ఉన్న డోర్లలా కనిపిస్తాయి. ఈ ఆర్ట్‌ను మీరూ వేసుకోవాలంటే... ముందుగా లావెండర్ (లేత వంకాయ రంగు), తెలుపు లేదా నెయిల్ కలర్ పాలిష్‌లు, ఫొటోల్లో కనిపిస్తున్న హోల్ రీయిన్‌ఫోర్స్‌మెంట్ లేబుల్స్ (షాపుల్లో దొరుకుతాయి), ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్‌ను సిద్ధం చేసుకోవాలి. అంతే.. వీటితో కింద చెప్పిన విధంగా చేసుకుంటూ పోతే మీ గోళ్లు అందంగా మారతాయి. 1. ముందుగా గోళ్లన్నిటినీ శుభ్రం చేసుకొని, అందంగా కత్తిరించుకోవాలి. ఆపైన వాటిపై లావెండర్ కలర్ నెయిల్ పాలిష్‌ను పూర్తిగా పూయాలి. 2. తర్వాత ఫొటోలో కనిపిస్తున్న విధంగా రెండు హోల్ రీయిన్‌ఫోర్స్‌మెంట్ లేబుల్స్‌ను గోరుకు రెండు వైపులా పెట్టి, మధ్యభాగంలో వైట్ లేదా నెయిల్ కలర్ పాలిష్‌ను అప్లై చేయాలి. 3. ఒకదాని తర్వాత మరో గోరుపై ముందు స్టెప్‌లో చెప్పిన విధంగా చేసుకుంటూ పోవాలి. 4. అన్ని గోళ్లపై పాలిష్ పూర్తిగా ఆరిన తర్వాత ట్రాన్స్పరెంట్ పాలిష్‌తో బేస్‌కోట్ వేయాలి. దాంతో మీ గోళ్లు మరింత ఆకర్షణీయంగా తయారవుతాయి. -
హాలోవీన్ నెయిల్ ఆర్ట్
నెయిల్ ఆర్ట్ కాలేజీ అమ్మాయిలు, వీకెండ్ పార్టీలు, పబ్‌లు... యువతరం మనసును ఇట్టే ఆకట్టుకునే నెయిల్ ఆర్ట్ డిజైన్ ఇది. సింపుల్ అనిపిస్తూనే ప్రత్యేకతను చాటే ఈ డిజైన్‌ను ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం. 1. అన్ని గోర్లకు ముందుగా బేస్ కోట్ వేసి తర్వాత వైట్ నెయిల్ పాలిష్ వేయాలి. 2. ఉంగరం గోరు మీద నల్ల రంగు నెయిల్ పాలిష్‌తో చిన్న డాట్ పెట్టాలి. 3. రెండు కళ్లు వచ్చేలా రెండు చుక్కలు పెట్టాలి. నెయిల్ పాలిష్ బ్రష్‌తో ఆ చుక్కలను కొద్దిగా పెద్దవిగా చేయాలి. రెండు చుక్కల మధ్య చిన్నవి రెండు నిలువు గీతలు పెట్టాలి. 4. కళ్లకు కింది భాగంలో కొద్దిగా వంపు వచ్చేలా అడ్డగీత గీయాలి. అడ్డగీత మొత్తానికి చిన్నవి నిలువు గీతలు గీయాలి. 5. మిగతా అన్ని గోళ్లకు నల్లరంగు నెయిల్ పాలిష్ వేయాలి. 6. పాలిష్ ఆరనివ్వాలి. తెలుపు రంగు నెయిల్ పాలిష్‌తో నిలువుగా సన్నని గీతలు గీయాలి. ఇలా అన్నింటికి నెయిల్పాలిష్తో అందంగా తీర్చిదిద్దాలి. ప్రత్యేకంగా అనిపించే డిజైన్ మీ కళ్లకు కడుతుంది. -
నవ్వులు రువ్వే పువ్వులు
నెయిల్ ఆర్ట్ గోళ్లు నవ్వడం ఎప్పుడైనా చూశారా! మునివేళ్లలో నవ్వులు ఎప్పుడైనా వీక్షించారా! గులాబీ, బంతి, చామంతి, గోరింట అందాలతో మురిసిపోతూ నవ్వే గోళ్లు మీవి కావాలని ఉందా! అయితే చాలా సింపుల్‌గా ఆ నవ్వులను మీ గోళ్లకు అతికించవచ్చు. పువ్వుల కాంతులను వెదజల్లవచ్చు. మార్బుల్ ఆర్ట్ ద్వారా మీ గోళ్లను అందంగా తీర్చిదిద్దవచ్చు. ముందుగా గోళ్లకు బేస్ కోట్ వేసుకోవాలి. దీని వల్ల డిజైన్ బ్రైట్‌గా కనిపించడమే కాదు, ఎక్కువ రోజులు ఉంటుంది. ఆ తర్వాత తెలుపు రంగు నెయిల్ పాలిష్ వేసి, ఆరనివ్వాలి. గోరును మాత్రమే వదిలేసి చుట్టూతా (వేలికి) పెట్రోలియమ్ జెల్లీ రాయాలి. చుట్టూ గ్లూ ఉండే టేప్ అతికించాలి. 1. చిన్న గాజు గిన్నెలో ముప్పావు వంతు నీళ్లు పోయాలి. నచ్చిన నెయిల్ పాలిష్‌ను ఎంచుకోవాలి. (ఇక్కడ గులాబీ రంగు నెయిల్‌పాలిష్‌ను ఎంచుకున్నాం) ఒక చుక్క నెయిల్‌పాలిష్‌ను నీళ్ల మధ్యలో వేయాలి. 2. నెయిల్ పాలిష్ చుక్క నీటి పై భాగంలో స్ప్రెడ్ అవగానే తెలుపు రంగు నెయిల్ పాలిష్ డ్రాప్ వేయాలి. ఇలా ఒకసారి గులాబీ రంగు, మరోసారి తెలుపు రంగు నెయిల్‌పాలిష్ డ్రాప్స్ నాలుగైదు సార్లు వేయాలి. 3. టూత్ పిక్ తీసుకొని మధ్యలో పువ్వు వచ్చేలా నెయిల్‌పాలిష్‌ను కదపాలి. 4. టేప్ వేసిన వేలి గోరు మునిగేలా డిజైన్ చేసిన నెయిల్‌పాలిష్‌లో నెమ్మదిగా ముంచి, తీయాలి. 5. నెయిల్ పాలిష్ ఆరాక టేప్ తీసేయాలి. 6. పువ్వుల రేకలతో అందమైన డిజైన్ గోళ్ల మీద సాక్షాత్కరిస్తుంది. దీని మీద మళ్లీ ట్రాన్స్పరెంట్గా కనిపించే బేస్‌కోట్ వేయాలి. ఇలా చూడముచ్చటైన డిజైన్లు మీ గోళ్ల మీద అందంగా కనువిందు చేయవచ్చు. -
గోరంతా హరివిల్లు
నెయిల్ ఆర్ట్ ఈ నెయిల్ ఆర్ట్ వేసుకోవడానికి ట్రాన్స్పరెంట్, ఆరెంజ్, వయొలెట్, పింక్, వైట్, గ్రీన్, స్కై బ్లూ రంగుల నెయిల్ పాలిష్‌లు, ఓ స్పాంజి ముక్క ఉంటే చాలు. ఈ ఆర్ట్ మీ గోళ్లకు డిఫరెంట్ లుక్ ఇస్తుంది. ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపించే ఈ నెయిల్ ఆర్ట్‌ను వేసుకోవడం చాలా సింపుల్. ఇంద్రధనుస్సులో ఏడు రంగులుంటాయి. కానీ ఈ డిజైన్‌లో ఆ ఏడు రంగులు లేకున్నా... ఇంద్ర ధనుస్సులాగే కనిపిస్తుంది. మరి మీకూ ఈ డిజైన్ కావాలంటే, ముందుగా గోళ్లన్నిటినీ శుభ్రం చేసుకోవాలి. ఆపైన డిజైన్‌ను వేసుకోండి... 1. ముందుగా గోళ్లన్నిటికీ వైట్ కలర్ పాలిష్‌ను అప్లై చేసుకోవాలి. తర్వాత స్పాంజి ముక్కపై ఫొటోలో కనిపిస్తున్న విధంగా అన్ని రంగుల పాలిష్‌లను పూయాలి. 2. ఇప్పుడు ఆ స్పాంజిని గోళ్లపై అద్దాలి. దాంతో ఆ రంగులన్నీ గోళ్లకు అంటుకుంటాయి. 3. ఒకే కోటింగ్ కావడం వల్ల రంగులు గోళ్లపై లైట్‌గా కనిపిస్తాయి. కాబట్టి మరోసారి స్టెప్ 1,2 లను రిపీట్ చేయాలి. అలా చేస్తే నెయిల్ పాలిష్ రంగులు డార్క్‌గా అందంగా కనిపిస్తాయి. 4. ఒక స్టిక్లాంటిది తీసుకొని, దాన్ని వైట్ కలర్ నెయిల్ పాలిష్‌లో ముంచాలి. ఇప్పుడు ఆ పెయింట్‌తో ఫొటోలో కనిపిస్తున్న విధంగా పూల రేకులను డ్రా చేయాలి. 5. పూల రేకులు పూర్తిగా వేస్తే... 5వ నంబర్లో కనిపిస్తున్నట్టుగా వస్తాయి. ఆ రేకులు కాస్త దూరం దూరంగా వేస్తేనే, అవి ఒకదానికొకటి తగలకుండా ఉంటాయి. ఇప్పుడు మరో గీతను చాపంలా గీసి, చిన్న సైజు ఆకులను గీయాలి. ఆపైన గోళ్లపై ట్రాన్స్పరెంట్ పాలిష్‌తో ఫినిషింగ్ కోట్ ఇవ్వాలి. -
అక్షరాలు నేర్పిస్తాయి
నెయిల్ ఆర్ట్ ఇది న్యూస్ పేపర్ నెయిల్ ఆర్ట్. దీన్ని వేసుకోవడానికి తెలుపు, గులాబి, ట్రాన్స్పరెంట్, ఆకుపచ్చ రంగుల నెయిల్ పాలిష్‌లు, కొన్ని న్యూస్ పేపర్ ముక్కలు ఉంటే సరిపోతుంది. ఎన్నోరకాల నెయిల్ ఆర్ట్ డిజైన్స్‌లో ఇదొకటి. ఈ ఆర్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ న్యూస్ పేపర్ డిజైన్‌కు కొన్ని గులాబి అందాలు జోడిస్తే.. మీ గోళ్ల అందం మరింత పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం..ఈ డిజైన్‌ను మీరూ వేసుకోండి. ఎలా అంటే... 1. ముందుగా గోళ్లను శుభ్రం చేసుకొని.. అందంగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటికి పూర్తిగా తెలుపు రంగు నెయిల్ పాలిష్ పూయాలి. 2. తర్వాత ఫొటోలో కనిపిస్తున్న విధంగా న్యూస్‌పేపర్ ముక్కలను సిద్ధం చేసుకోవాలి. 3. ఆపైన వెనిగర్‌లో ముంచిన దూది ఉండను గోళ్లపై రాయాలి. (వెనిగర్‌కు బదులుగా నీళ్లను కూడా వాడొచ్చు. కాకపోతే గోళ్లపై న్యూస్‌ప్రింట్ లైట్‌గా పడుతుంది) 4. ఆ వెనిగర్ ఆరకముందే.. న్యూస్‌పేపర్ ముక్కను గోరుపై పెట్టి ప్రెస్ చేయాలి. అర నిమిషం తర్వాత ఆ పేపర్‌ను తొలగిస్తే.. పేపర్‌పై అక్షరాలు మీ గోళ్లపై ప్రత్యక్షమవుతాయి. 5. ఇప్పుడు ఆ ప్రింటెడ్ గోళ్లపై గులాబిరంగు పాలిష్‌తో పెద్ద సైజు చుక్కలు పెట్టుకోవాలి. 6. తర్వాత తెలుపురంగు పాలిష్‌తో ఆ చుక్కలపై అక్కడక్కడా పూయాలి. (అది గులాబి పువ్వు ఆకారంలోకి వచ్చేలా గీయాలి) 7. చివరగా ఆకుపచ్చ రంగు పాలిష్‌తో ఫొటోలో కనిపిస్తున్న విధంగా ఆకులు గీసుకోవాలి. వాటి మధ్యలో వైట్పాలిష్తో ఓ లైన్ గీస్తే సరి. పువ్వులు, ఆకులు, అక్షరాలతో మీ గోళ్లు ఎంతో అందంగా కనిపిస్తాయి. -
తియ్య తియ్యగా...
నెయిల్ ఆర్ట్ ఇది స్ట్రాబెర్రీ నెయిల్ ఆర్ట్... చూడగానే అందరికీ నోరూరించే పండ్లు - స్ట్రాబెర్రీలు.. ఇకపై మీ గోళ్లనే వాటిలా చేసుకోవాలనుకుంటే ఈ నెయిల్ ఆర్ట్ వేసుకోండి. పూలను మాత్రమే కాకుండా ఈసారి పండ్ల డిజైన్స్‌నూ నేర్చుకుందాం. ఈ డిజైన్ కోసం లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, లైట్ ఎల్లో, ఎరుపు రంగుల నెయిల్ పాలిష్‌లు ఉంటే చాలు. పెద్దలే కాదు.. చిన్నపిల్లలకూ ఈ స్ట్రాబెర్రీ నెయిల్ ఆర్ట్‌ను వేస్తే.. వాళ్లు భలే థ్రిల్లింగ్‌గా ఫీలవుతారు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే డిజైన్‌ను ట్రై చేయండి.. ఎలా అంటే. 1. ముందుగా గోళ్లను శుభ్రం చేసుకొని, అందంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక్కోగోరుపై ఎరుపు రంగు నెయిల్ పాలిష్‌ను పూర్తిగా పూయాలి. 2. ఆ పాలిష్ ఆరిన తర్వాత ఎల్లో కలర్ పాలిష్‌లో టూత్ పిక్‌ను ముంచి ఫొటోలో కనిపిస్తున్న విధంగా చుక్కలు పెట్టుకోవాలి. 3. తర్వాత గోరు అడుగు భాగంలో డార్క్ గ్రీన్ పాలిష్‌తో ఆకులు గీసుకోవాలి. 4. రంగు పూర్తిగా ఆరిన తర్వాత లైట్ గ్రీన్ నెయిల్ పాలిష్‌తో ఆకుల డిజైన్‌కు బార్డర్స్ గీయాలి. అలా చేస్తే నిజమైన ఆకుల్లా కనిపిస్తాయి. అంతే, ఎంతో అందమైన స్ట్రాబెర్రీలు మీ చేతి సొంతం. -
సీతాకోకమ్మకు... గోరుముద్ద
నెయిల్ ఆర్ట్ ఇది బటర్‌ఫ్లై నెయిల్ ఆర్ట్... దీన్ని వేసుకోవడానికి ఆరెంజ్, పసుపు, తెలుపు, నలుపు, ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్‌లు కావాలి. వాటితో పాటు నెయిల్ పాలిష్ రిమూవర్, స్పాంజి ముక్కను కూడా సిద్ధం చేసుకోవాలి. ముందుగా గోళ్లను శుభ్రం చేసుకొని, అందంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ డిజైన్‌ను జాగ్రత్తగా వేసుకోండి. ఎలా అంటే.. 1. ముందుగా గోళ్లన్నిటికీ పూర్తిగా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ వేసుకోవాలి. 2. అది పూర్తిగా ఆరిపోయాక.. అన్ని గోళ్లకు తెలుపు రంగు పాలిష్ వేసుకోవాలి. 3. ఇప్పుడు స్పాంజి ముక్కపై ఫొటోలో కనిపిస్తున్నట్టుగా పసుపు, ఆరెంజ్ రంగులు పూయాలి (ఎక్కువ భాగం ఆరెంజ్ కలర్ ఉండేలా చూసుకోవాలి). 4. ఆ స్పాంజీని గోళ్లపై అద్దాలి. అప్పుడు ఆ రెండు రంగులు మీ గోళ్లకు అతుక్కుంటాయి. రెండు మూడు కోటింగ్స్ వేసుకుంటే రంగులు ముదురుగా అందంగా వస్తాయి . 5. నెయిల్ పాలిష్ గోళ్లకే కాదు.. వేళ్లకూ అంటుకుంటుంది. కాబట్టి ఇప్పుడు నెయిల్ పాలిష్ రిమూవర్‌తో అలా అంటుకున్న పాలిష్‌ను తొలగించండి. ఆపైన గోళ్లకు ట్రాన్స్పరెంట్ పాలిష్‌తో ఓ కోటింగ్ వేయండి. 6. ఇప్పుడు బ్లాక్ పాలిష్‌ను తీసుకొని, అందులో సన్నని బ్రష్‌ను ముంచి గోళ్లపై ఓ ఆర్క్ (చాపం) గీయాలి. 7. తర్వాత అదే కలర్ పాలిష్‌తో ఫొటోలో కనిపిస్తున్న విధంగా డిజైన్ వేసుకోవాలి. 8. ఆపైన గోళ్ల పై చివర ఖాళీగా ఉన్న చోట బ్లాక్ పాలిష్‌ను పూర్తిగా రాయాలి. 9. ఇప్పుడు తెలుపు రంగు పాలిష్‌తో బ్లాక్ పాలిష్‌పై చుక్కలు పెట్టుకోవాలి. 10. పాలిష్ పూర్తిగా ఆరిపోయాక, ట్రాన్స్పరెంట్ పాలిష్‌తో ఓ కోటింగ్ వేసుకుంటే గోళ్లు అందంగా షైన్ అవుతాయి. అంతే, ఎంతో అందమైన సీతాకోక చిలుకలు మీ గోళ్లపై ఎగిరి తీరాల్సిందే. -
గోటి పూసలు... మేటి సొగసులు
నెయిల్ ఆర్ట్ ఇది ఫిష్ ఎగ్ నెయిల్ ఆర్ట్.. గోళ్లను ఎప్పుడూ నెయిల్ పాలిష్లతోనే అలంకరించుకునే కంటే దానికి ఇంకేవైనా మెరుగులు దిద్దితే బాగుంటుందని అందరికీ అనిపిస్తుంది. అందుకే ఈసారి మీ గోళ్లకు ఫిష్ ఎగ్స్ (చేప గుడ్లు) అతికించండి. అదేమిటి..! ఇప్పుడు ఆ చేప గుడ్ల కోసం సముద్రం వరకు వెళ్లాలా అని ఆలోచిస్తున్నారా..? అంత దూరం వద్దులెండి.. ఒరిజినల్ చేప గుడ్లు కాదు కానీ, వాటిలాగే ఉండే రంగురంగుల మినీ బీడ్స్ ప్రస్తుతం షాపుల్లో దొరుకుతున్నాయి. ఈ ఫిష్ ఎగ్ నెయిల్ ఆర్ట్ వేసుకోవడానికి గులాబి రంగు నెయిల్ పాలిష్, గులాబి రంగు మినీ బీడ్స్ ఉంటే చాలు. ముందుగా గోళ్లను శుభ్రం చేసుకొని, అందంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ డిజైన్‌ను వేసుకోండి. ఎలా అంటే... 1.ముందుగా గోళ్లన్నిటికీ పూర్తిగా గులాబి రంగు నెయిల్ పాలిష్ వేసుకోవాలి. ఎక్స్ట్రాగా చుట్టుపక్కలకు ఏమైనా పాలిష్ అంటుకుంటే రిమూవర్‌తో తుడిచేసుకోండి. 2.ఇప్పుడు గులాబి రంగు మినీ బీడ్స్‌ను సిద్ధం చేసుకోవాలి. షైనింగ్‌గా ఉండే బీడ్స్‌ను ఎంచుకుంటే గోళ్లు అందంగా కనిపిస్తాయి. 3.నెయిల్ పాలిష్ వేసుకున్న గోళ్లను బీడ్స్ డబ్బాలో ఓసారి ముంచి తీసేయాలి. అప్పుడు అవి గోళ్లకు అతుక్కుంటాయి. (నెయిల్ పాలిష్ ఆరక ముందే బీడ్స్‌ను అతికించాలి). 4.ఈ మినీ బీడ్స్ ఇప్పుడు మీ గోళ్లకు ఫొటోలో కనిపిస్తున్నట్లుగా అతుక్కుంటాయి. అలా ఒక్కొక్క గోరుకు బీడ్స్‌ను అతికించుకుంటూ పోవాలి. (గులాబి రంగుకు బదులుగా వేరే ఏ రంగునైనా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, మల్టీకలర్ బీడ్స్ కూడా దొరుకుతున్నాయి) -
ఫ్రెంచ్ ఫ్లవర్ ఆర్ట్
నెయిల్ ఆర్ట్ ఇది ఫ్రెంచ్ స్టయిల్ నెయిల్ ఆర్ట్. దీన్ని వేయడానికి నాలుగు రంగుల నెయిల్ పాలిష్ కావాలి. నెయిల్ కలర్, వయొలెట్, తెలుపు, యాపిల్ గ్రీన్ కలర్ నెయిల్ పాలిష్‌లు సిద్ధం చేసుకోండి. ముందుగా గోళ్లను అందంగా కత్తిరించండి. ఆ తర్వాత ఈ డిజైన్ వేసుకోండి. ఎలా అంటే... 1 ముందుగా గోరుకి నెయిల్ కలర్‌ను పూయాలి. ఆరిన తర్వాత గోరు మీద క్రాస్‌గా వయొలెట్ కలర్ నెయిల్ పాలిష్‌ను పూయాలి. 2 అది ఆరిన తర్వాత సన్నని సూదిలాంటిది తీసుకుని, తెలుపు రంగు పాలిష్‌లో ముంచి, వయొలెట్ కలర్ ఉన్న చోట చుక్కల్లాగా అద్దాలి. 3 వయొలెట్ కలర్ పాలిష్ లైన్‌ను ఆనుకుని తెలుపు రంగుతో పూల రేకుల్లాగా వేయాలి. 4 ఐదు రేకులు వేశాక పువ్వులాగా అవుతుంది. 5 ఆ పువ్వు పక్కనే అలాంటి మరో పువ్వును వేయాలి. 6 మరోపక్క కూడా ఒక పువ్వు వేయాలి. 7 వయొలెట్ కలర్ ఉన్న మిగతా భాగంలో సన్నని బ్రష్‌తో చుక్కలు పెట్టాలి. 8 యాపిల్ గ్రీన్ పాలిష్‌ను అక్కడక్కడా ఆకుల్లా అద్దాలి. 9 చివరగా పువ్వుల మధ్యలో కూడా యాపిల్ గ్రీన్ పాలిష్‌తో చుక్కలు పెట్టాలి. -
సీతాకోక పూలు
ఇంటికి - ఒంటికి ‘మన్మథుడు’ సినిమాలో నాగార్జున... లిప్‌స్టిక్ పెదాలకే ఎందుకు వేసుకోవాలి అని అడుగుతాడు. పెదాలకి మాత్రమే వేసుకోవాలని చివరకు డిసైడ్ చేస్తాడు. మరి నెయిల్ పాలిష్ కూడా అంతేనా గోళ్లకు మాత్రమే వేసుకోవాలా? అది కేవలం అందుకే పనికొస్తుందా? లేదు. నెయిల్ పాలిష్ గోళ్లకు మాత్రమే కాదు... మన ఇంటికి కూడా అందాన్ని తెస్తుంది. ఎలా అంటారా... ఒక్కసారి పక్కనున్న ఫొటోలపై ఓ లుక్కేయండి. అవన్నీ నెయిల్ పాలిష్‌తో చేసినవే. ఇంట్లో పెట్టుకునే డెకరేషన్ ఐటమ్స్ నుంచి ఒంటికి పెట్టుకునే ఫ్యాషన్ జ్యూయెలరీ వరకు అన్నింటికీ నెయిల్ పాలిష్ హంగును అద్దారు. కావాలంటే ఇవన్నీ మీరు కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే... కావలసినవి: సులువుగా వంకులు తిరిగే సన్నని వైరు, రంగు రంగుల నెయిల్ పాలిష్‌లు (కొంచెం చిక్కబడినవి. అలాంటివి లేక పోతే నెయిల్ పాలిష్ సీసా మూత తీసి గాలి తగిలేలా పెడితే చిక్క బడుతుంది), క్విక్ డ్రై నెయిల్ పాలిష్ స్ప్రే (మార్కెట్లో దొరుకుతుంది; లేకున్నా ఫర్వాలేదు), కత్తెర, పెన్ లేదా సన్నని రాడ్, పట్టకారు తయారీ విధానం: ముందుగా తీగను పెన్ లేదా రాడ్‌కు చుట్టాలి. అది ఒక పూరేకులాగా అవుతుంది. పెన్/రాడ్‌ను రింగ్ లోంచి బయటికి తీసేసి, ఆ రేకుకు పక్కనే మరో రేకులా చేయాలి. ఇలా తీగను తిప్పుకుంటూ పక్కపక్కనే అయిదు రేకులు వచ్చేలా చేసు కుని, దాన్ని పువ్వు ఆకారంలోకి తీసుకురావాలి. తర్వాత నెయిల్ పాలిష్‌ను తీగల మీద పూసుకుంటూ పోవాలి. మొదట పలుచగా ఉన్నా కాసేపటికి దళసరి అవుతుంది. అప్పుడు దానిపై డ్రై నెయిల్ పాలిష్ స్ప్రే చల్లాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత, మళ్లీ రెండో కోటింగ్ వేస్తే రంగు బాగా కనిపిస్తుంది. ఇలా రంగురంగుల పూలు చేసు కుని వాటితో నెక్లెస్‌లు, బ్రేస్లెట్లు, ఉంగరాలు, హెయిర్ క్లిప్పులు చేసుకో వచ్చు. పూలగుత్తులు చేసుకుని ఫ్లవర్‌వాజుల్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడిదో ఫ్యాషన్. మీరూ దీన్ని అనుసరించి చూడండి! -
మునివేళ్లలో అందం...
బ్యూటిప్స్ ♦ గోళ్లు మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో చెబుతాయి. విరగడం, పొడిబారి నిస్తేజంగా కనిపిస్తే ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. దాంతో ఈ జాగ్రత్తలూ తీసుకోవాలి. ♦ చేతులను సబ్బు లేదా లిక్విడ్‌తో శుభ్రపరుచుకున్నాక గోళ్లు పొడిబారినట్టుగా అనిపిస్తే తప్పక లోషన్‌తో మసాజ్ చేసుకోవాలి, దీంతో గోళ్ల చుట్టూ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ♦ గోళ్లను స్నానానంతరం కత్తిరించడం మేలు. నీళ్లలో నాని గోళ్లు గరుకుదనం తగ్గుతుంది. దీంతో ట్రిమ్ చేయడం సులువు అవుతుంది. ♦ వెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి గోళ్లు మునిగేలా చేతులను ఉంచాలి. పది నిమిషాల తర్వాత గోళ్ల చుట్టూ ఉన్న మురికిని తొలగించాలి. తర్వాత మంచినీళ్లతో కడిగి, తడి లేకుండా తుడిచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నెయిల్ పాలిష్‌లో బేస్ కోట్ ఉంటుంది. దీన్ని గోళ్లకు వేసుకుంటే గోళ్ల అందం రెట్టింపు అవుతుంది. త్వరగా గోళ్లు పాడవు. -
ఇంటిప్స్
టీ ఫ్లాస్కులు, పాల ఫ్లాస్కులను శుభ్రం చేయడం చాలా కష్టం. అలాంటప్పుడు కొద్దిగా సబ్బు నీటిలో పాత పేపర్లను ముక్కలు ముక్కలుగా చేసి అందులో వేయాలి. పదిహేను నిమిషాలు వాటిని అలాగే ఉంచి, తర్వాత ఆ ఫ్లాస్క్‌ను బాగా కదపాలి. అప్పుడు ఆ నీటిని పారబోసి, మళ్లీ మంచి నీటితో కడిగితే ఆ ఫ్లాస్క్ పరిశుభ్రంగా ఉంటుంది.చాలామంది ఇళ్లల్లో తులసి మొక్కకు తరచు తెగులు సోకుతుంది. అలా జరగకుండా ఉండాలంటే తులసి కోట మట్టిలో ఒక ఉల్లిగడ్డను పాతి పెట్టాలి. అలా చేసేటప్పుడు దాని పైపొర తీసేయాలి. తెల్లటి దుస్తులకు కానీ తెల్లటి షూలకు కానీ ఏవైనా మరకలు అంటితే - వాటిని అలాగే శుభ్రం చేయకూడదు. ముందు ఒక దూది ఉండను తీసుకొని, దాన్ని నెయిల్ పాలిష్ రిమూవర్లో ముంచి ఆ మరకలపై రుద్దాలి. అలా చేస్తే మరకలు తగ్గుముఖం పడతాయి. -
రంగుపడుద్ది!
గోళ్లకు రకరకాల రంగులు వేసుకోవడం మగువలందరికీ ముచ్చటే. గోళ్లకు రంగులు వేసుకోవాలంటే, నెయిల్ పాలిష్ ఎంపిక చేసుకోవడం దగ్గర నుంచి, గోళ్లకు ఆ పాలిష్ పట్టించుకోవడం వరకు నానా తంటాలు పడుతుంటారు. కష్టపడి ఒక డిజైన్‌తో గోళ్లకు రంగులు వేసుకోగానే, అప్పటికే ఫ్యాషన్ ట్రెండ్ మారిపోతే నిరాశకు గురవుతుంటారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకే పోర్చుగల్ శాస్త్రవేత్తలు ఒక అద్భుత పరిష్కారాన్ని కనిపెట్టారు. ఈ ఫొటోలో ఏటీఎం మిషిన్ మాదిరిగా కనిపిస్తున్నదే ఆ పరిష్కారం. ఇది డిజిటల్ కియోస్క్. లిస్బన్లోని టెన్సేటర్ టెక్నాలజీ సెంటర్ శాస్త్రవేత్తలు దీనికి రూపకల్పన చేశారు. ఇందులో పదివేలకు పైగా నెయిల్ పాలిష్ రంగులు, డిజైన్లు ఉంటాయి. వీటితో తృప్తిపడకుంటే, నెయిల్‌పాలిష్ వేసుకోదలచిన యూజర్లు తమకు నచ్చిన డిజైన్లను పెన్‌డ్రైవ్‌లలో వెంట తీసుకుపోవచ్చు. పెన్‌డ్రైవ్‌లను దీనిలోని యూఎస్బీ పోర్ట్ ద్వారా కనెక్ట్ చేసుకుని తమకు నచ్చిన డిజైన్లను ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక పూర్తయ్యాక కియోస్క్ యంత్రంలో చేయి పట్టేందుకు అమర్చిన ఖాళీ జాగాలో చేతిని ఉంచితే చాలు. గోళ్లపై కోరుకున్న రంగులతో కూడిన డిజైన్లు క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి.