హాలోవీన్ నెయిల్ ఆర్ట్
నెయిల్ ఆర్ట్
కాలేజీ అమ్మాయిలు, వీకెండ్ పార్టీలు, పబ్‌లు... యువతరం మనసును ఇట్టే ఆకట్టుకునే నెయిల్ ఆర్ట్ డిజైన్ ఇది. సింపుల్ అనిపిస్తూనే ప్రత్యేకతను చాటే ఈ డిజైన్‌ను ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం.
1. అన్ని గోర్లకు ముందుగా బేస్ కోట్ వేసి తర్వాత వైట్ నెయిల్ పాలిష్ వేయాలి.
2. ఉంగరం గోరు మీద నల్ల రంగు నెయిల్ పాలిష్‌తో చిన్న డాట్ పెట్టాలి.
3. రెండు కళ్లు వచ్చేలా రెండు చుక్కలు పెట్టాలి. నెయిల్ పాలిష్ బ్రష్‌తో ఆ చుక్కలను కొద్దిగా పెద్దవిగా చేయాలి. రెండు చుక్కల మధ్య చిన్నవి రెండు నిలువు గీతలు పెట్టాలి.
4. కళ్లకు కింది భాగంలో కొద్దిగా వంపు వచ్చేలా అడ్డగీత గీయాలి. అడ్డగీత మొత్తానికి చిన్నవి నిలువు గీతలు గీయాలి.
5. మిగతా అన్ని గోళ్లకు నల్లరంగు నెయిల్ పాలిష్ వేయాలి.
6. పాలిష్ ఆరనివ్వాలి. తెలుపు రంగు నెయిల్ పాలిష్‌తో నిలువుగా సన్నని గీతలు గీయాలి.
ఇలా అన్నింటికి నెయిల్‌పాలిష్‌తో అందంగా తీర్చిదిద్దాలి. ప్రత్యేకంగా అనిపించే డిజైన్ మీ కళ్లకు కడుతుంది.