కొండంత అందం
గోళ్లకు ముందు వేసుకున్న నెయిల్ పాలిష్‌ను రిమూవర్‌లో ముంచిన దూదితో తుడిచేయాలి. వెడల్పాటి పాత్రలో గోరువెచ్చటి నీటిని పోసి రెండు చుక్కల మైల్డ్‌షాంపూ కాని లిక్విడ్‌సోప్ కాని వేసి కలిపి అందులో రెండు చేతులను ముంచి పది నిమిషాల సేపు ఉంచాలి. నెయిల్ కటర్‌తో గోళ్లను అందంగా షేప్ వచ్చేటట్లు కత్తిరించాలి. బ్రష్‌తో చేతిని, వేళ్లకు, గోళ్లకు మర్దన చేసినట్లు రుద్ది కడగాలి. మసాజ్ క్రీమ్ లేదా ఆయిల్ అప్లయ్ చేసి మర్దన చేయాలి.
వేళ్లకు, ప్రతి కణుపు మీద వలయాకారంగా క్లాక్‌వైజ్ గానూ వెంటనే యాంటి క్లాక్ వైజ్ గానూ మసాజ్ చేయాలి. అలాగే ప్రతి గోరుకూ చేయాలి. అన్నింటికీ ఒకే నంబర్ మెయింటెయిన్ చేయడం ముఖ్యం. అంటే మొదటి వేలికి ఒక కణుపుకు క్లాక్‌వైజ్‌గా ఐదుసార్లు చేస్తే యాంటి క్లాక్‌వైజ్‌గా కూడా ఐదుసార్లు మాత్రమే చేయాలి. ఇదే కౌంట్‌ను అన్ని వేళ్లకు, గోళ్లకు పాటించాలి. ∙టిస్యూ పేపర్‌తో వేళ్లకున్న ఆయిల్ తుడిచి నెయిల్ పాలిష్ వేయాలి.
Comments
Please login to add a commentAdd a comment