మునివేళ్లలో అందం...
బ్యూటిప్స్
♦ గోళ్లు మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో చెబుతాయి. విరగడం, పొడిబారి నిస్తేజంగా కనిపిస్తే ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. దాంతో ఈ జాగ్రత్తలూ తీసుకోవాలి.
♦ చేతులను సబ్బు లేదా లిక్విడ్‌తో శుభ్రపరుచుకున్నాక గోళ్లు పొడిబారినట్టుగా అనిపిస్తే తప్పక లోషన్‌తో మసాజ్ చేసుకోవాలి, దీంతో గోళ్ల చుట్టూ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
♦ గోళ్లను స్నానానంతరం కత్తిరించడం మేలు. నీళ్లలో నాని గోళ్లు గరుకుదనం తగ్గుతుంది. దీంతో ట్రిమ్ చేయడం సులువు అవుతుంది.
♦ వెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి గోళ్లు మునిగేలా చేతులను ఉంచాలి. పది నిమిషాల తర్వాత గోళ్ల చుట్టూ ఉన్న మురికిని తొలగించాలి. తర్వాత మంచినీళ్లతో కడిగి, తడి లేకుండా తుడిచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నెయిల్ పాలిష్‌లో బేస్ కోట్ ఉంటుంది. దీన్ని గోళ్లకు వేసుకుంటే గోళ్ల అందం రెట్టింపు అవుతుంది. త్వరగా గోళ్లు పాడవు.