Moisturizer
-
మాయిశ్చరైజర్లు వాడుతున్నారా..!
చలికాలంలో చర్మం పొడిబారే సమస్య దాదాపుగా అందరూ ఎదుర్కొనేదే. ఎన్ని క్రీములు రాసినా ఏమాత్రం ఉపయోగం లేదని చాలామంది వాపోతుంటారు. ఈ సమస్యలకు పరిష్కారం కావాలంటే ముందు మన చర్మ తత్త్వాన్ని తెలుసుకోవాలి. కొందరికి ఆయిల్ స్కిన్ ఉంటుంది. వీరికి సమస్య పెద్దగా ఉండకపోవచ్చు. కానీ, ఈ కాలంలో పొడి చర్మం గల వారికి పెద్ద సమస్యగా ఉంటుంది. వారి చర్మతత్వాన్ని బట్టి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. గోరువెచ్చని నీళ్లుఫుల్క్రీమ్ లేదా అయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్లు వాడాలి. స్నానం చేశాక కనీసం పది నిమిషాల్లోపు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చలిని తట్టుకోవడానికి చాలామంది వేడినీళ్లతో స్నానం చేస్తుంటారు. దీనివల్ల చర్మంపై సహజ నూనెలను కోల్పోతాం. అందుకని, స్నానానికి గోరువెచ్చని నీళ్లు వాడాలి. నిమ్మ, చందనంతో తయారైనవి కాకుండా గ్లిజరిన్, అలోవెరా, ఓట్‌మిల్క్ బేస్డ్ సోప్స్ స్నానానికి ఎంచుకోవాలి. వింటర్లోనూ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి.రుద్దకూడదు..డ్రై స్కిన్ ఉన్నవాళ్లు క్లెన్సింగ్ మిల్క్‌ని రోజుకు ఒకసారైనా ఉపయోగించాలి. స్క్రబ్స్ వంటివి ఎక్కువ ఉపయోగించకూడదు. కొందరు స్నానానికి మైత్తటి కాయిర్‌ను వాడుతుంటారు. ఈ కాలం దానిని వాడక΄ోవడం ఉత్తమం. పాదాలను రాత్రివేళ శుభ్రపరుచుకొని, ఫుట్ క్రీమ్ లేదా పెట్రోలియమ్ జెల్లీ రాసుకోవాలి. కాలి పగుళ్ల సమస్య ఉన్నవారు సాక్సులు వేసుకోవాలి. కొందరు సీరమ్స్ వాడుతుంటారు. వీటిలో యాసిడ్ కంటెంట్ చాలా తక్కువగా ఉన్నవి ఎంచుకోవాలి.ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్లు జెల్ లేదా లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్లు ఉపయోగించుకోవాలి. సోరియాసిస్, వంటి చర్మ సమస్యలు ఉన్నవారు ముందుగానే వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవాలి.మేకప్‌కి ముందు మాయిశ్చరైజర్ మేకప్ చే సుకోవడానికి ముందు క్లెన్సింగ్ మిల్క్ ఉపయోగించి, తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి. మేకప్ తీసేసాక మళ్లీ క్లెన్సింగ్ మిల్క్‌ను ఉపయోగించాలి. డ్రైస్కిన్ వాళ్లు ఆయిల్ బేస్డ్ ఫౌండేషన్స్ వాడాలి. సూప్‌లు, జ్యూస్‌లు..ఆకుకూరలు, కూరగాయలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నట్స్, నువ్వులు వంటివి ఈ కాలంలో ఆహారంలో చేర్చుకోవడం, ఉపయోగించడం మంచిది. సాధారణంగా చలికాలంలో చాలామంది తక్కువ నీళ్లు తాగుతారు. కానీ, మన శరీరానికి 3–4 లీటర్ల నీళ్లు అవసరం. నీళ్లు తాగలేక΄ోయినా సూప్‌లు, జ్యూస్‌ల రూపంగా తీసుకోవచ్చు. – డా. స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్ -
మాయిశ్చరైజర్లను ఇంజెక్ట్ చేయడం గురించి విన్నారా..?
చర్మ సంరక్షణ కోసం వివిధ రకాల మాయిశ్చరైజర్లను వాడటం గురించి విన్నాం. ఇప్పుడూ ఏకంగా ముఖానికే నేరుగా ఇంజెక్ట్ చేస్తారట. దీనివల్ల ముఖం హైడ్రేటెడ్‌గా ఉండి మృదువుగా కనిపిస్తుంది. పైగా ఏజ్లెస్గా కనిపిస్తుందట. స్కిన్‌టోన్ కూడా చాలా బాగుంటదట . అసలేంటిది? ఎలా చేస్తారు తదితరాల గురించి తెలుసుకుందాం!.ఇప్పుడూ చర్మ సంరక్షణపై విపరీతమైన అవగాహన, ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. అందుకు తగ్గట్టుగానే మార్కెట్లో బ్యూటీకి సంబంధించిన కొత్తకొత్త చికిత్సా విధానాలు వచ్చాయి. ఈ చర్మ సంరక్షణకు సంబంధించి సర్జరీలు, చికిత్సలు భారత్‌లో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ముఖ్యంగా ఆసియ పసిఫిక్ ప్రాంతాలైన భారత్, చైనా, జపాన్‌లో బ్యూటీ ప్రొడక్ట్‌లు, చికిత్సలు మంచి ఆదాయాలు అందించే మార్కెట్. ఆ క్రమంలోనే కొత్త చర్మ సంరక్షణ ట్రెండ్ ఒకటి వచ్చింది. ఇంతకీ ఏంటీ ఇంజెక్షన్ మాయిశ్చరైజర్స్?ఇంజెక్ట్ చేసే మాయిశ్చరైజర్లను స్కిన్ బూస్టర్లుగా పిలుస్తారు. ఇవి హెలురోనిక్ యాసిడ్‌తో తయారు చేస్తారు. ఇది శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మానికి హైడ్రేషన్, మృదుత్వాన్ని అందిస్తుంది. సాధారణ మాయిశ్చరైజర్ల మాదిరిగా కాకుండా సూదులతో ఇంజెక్ట్ చేయడం వల్ల ఇది చర్మం పొరల్లోకి లోతుగా చొచ్చుకునిపోయి కాంతిగా ఉండేలా చేస్తుంది. అలాగే ముఖాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, ముఖంపై ఉండే గీతలు, ఆకృతి సమస్యలు, వృధాప్య ముడతలను నివారిస్తుంది. చర్మాన్ని రిపేర్ చేసేలా తేమ స్థాయిని నింపుతుంది. ఇది యవ్వనపు ఛాయను అందించి, ముఖం ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. చర్మాన్ని పునరుజ్జీవింపబడేలా చేస్తుంది. మిగతా కాస్మెటిక్ చికిత్స విధానాల కంటే ఇది తక్షణ ఫలితాన్ని ఇస్తుంది. చర్మం ఆకృతిని, రంగును మెరుగ్గా ఉంచుతుంది. ముఖం ఎప్పటికీ యవ్వనంలా కనిపించాలానుకునేవారికి ఈ పద్ధతి మేలు. వృధాప్య ఛాయలను నివారించాలనుకునే వారికి, యూబైలలో ఉన్న మహిళలకు ఈ చికిత్స విధానం బెస్ట్ ఆప్షన్. ఈ ఇంజెక్ట్ మాశ్చరైజర్లు కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తాయి. దీంతో చర్మానికి మంచి బూస్టింగ్ లభించడమే గాక మేను యవ్వనంగా మారేలా పునరుజ్జీవింప చేసి ముడతలను దూరం చేస్తుంది. అయితే ఈ చికిత్సను అర్హులైన నిపుణుల పరివేక్షణలో చేయించుకోవడం ఉత్తమం. (చదవండి: ఈ డివైజ్‌తో కాళ్లు నొప్పులు మాయం!) -
Skin Care Tips: డ్రైఫ్రూట్స్, గుడ్లు, చేపలు తిన్నారంటే..
సీజన్ మారితే మన శరీరంలో కూడా మార్పులు వెంటనే చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో పొడి చర్మం మరింతగా వేదిస్తుంది. వాతావరణంలో తేమ స్థాయిలు తక్కువైనా, చలి లేదా వేడిగా ఉన్నా, వేడి నీళ్లతో స్నానం చేస్తున్నా.. చర్మం పొడిబారిపోతుంది. ఐతే మనం రోజూ తీసుకునే ఆహారం ద్వారా సహజమైన పద్ధతుల్లో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మీకు తెసుసా! జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ అండ్ కాస్మొటాలజీ ప్రకారం ప్రొటీన్లు, తాజా పండ్లు, కూరగాయలు వంటి నీటి శాతం పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకున్నట్లయితే చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌లా సహాయపడతాయని పేర్కొంది. లోపల్నుంచి తగిన పోషకాలను అందిస్తే చర్మానికి మరింత మేలు చేకూరుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు. ఏ ఆహారం తీసుకుంటే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేసే మంచి కొవ్వులు డ్రైఫ్రూట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రేస్ కలిగించే హానికారకాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. కాబట్టి ఒక స్పూన్ లేదా గుప్పెడు డ్రైఫ్రూట్స్ ప్రతిరోజూ తినడం వల్ల అధిక క్యాలరీలు అందడమే కాకుండా మీ శరీర కాంతిని మెరుగుపరుస్తుంది. సోయ సోయలో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. దీనిలోని ఐసోఫ్లేవోన్స్ కొల్జాజెన్ను కాపాడి చర్మ ముడతలను నివారించడంలో సహాయపడుతుంది. సోయ పాలు లేదా టోఫు ఏ విధంగా తీసుకున్న చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. టమాట టమాటాల్లో విటమిన్ ‘సి’, లైకొపీన్ అనే యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేసి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. టమాటాలను ఉడికించి క్రీమీ పేస్ట్‌లా లేదా తక్కువ నూనెలో వేయించి అయినా తినొచ్చు. చేప చేపలో ఒమేగా-3 కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఐతే ఇవి సహజంగా శరీరంలో ఉత్పత్తి కావు. కణత్వచం (పై పొర) ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు ఒమేగా 3 అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే మీ చర్మాన్ని ఎల్లప్పుడూ తడిగా ఉంచుతుంది. గుడ్డు సల్ఫర్, లూటీన్ గుడ్డులో అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృధువుగా, చెమ్మగా ఉంచుతుంది. అల్పాహారంలో లేదా ఇతర ఏ పద్దతుల్లో తిన్నా మంచిదే. సిట్రస్ ఫ్రూట్స్ విటమిన్ ‘సి’ ఈ పండ్లలో నిండుగా ఉంటుంది. ఆరెంజ్, కిన్నో, స్వీట్ లెమన్.. వంటి పండ్లలో క్యాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. అంతేకాకుండా హైడ్రేషన్‌ను అందిస్తుంది. క్యారెట్ బేటా కెరోటిన్, విటమిన్ ‘సి’లకు క్యారెట్ బెస్ట్. ఈ రెండు విటమిన్లు చర్మకాంతిని మెరుగుపరచడంలో, వృద్ధాప్యాన్ని నివారించడంలో తోడ్పడతాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి. ఈ ఆహారపు అలవాట్లు మీ శరీరసోయగాన్ని మరింత పదిలంగా కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు. చదవండి: Zinc Rich Diet: వీటిలో జింక్ పుష్కలంగా ఉంటుంది.. ఇవి తింటే! -
ఇంటి మాయిశ్చరైజర్లు
పాల మీగడ–తేనె ఈ కాలం చర్మం పొడిబారుతుంటుంది. మాయిశ్చరైజర్లు పదే పదే రాయాల్సి వస్తుంది. ఆ అవసరం లేకుండా చర్మం మృదుత్వం కోల్పోకుండా ఉండాలంటే.. పాల మీగడ తీసుకోవాలి. మీగడలో ఉంటే నూనె చర్మాన్ని పొడిబారనీయదు. తేనెలో చర్మసంరక్షణకు సహాయపడే ఔషధాలు ఉన్నాయి. చర్మంపై ఏర్పడే మొటిమలు, యాక్నె వంటి సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. అందుకని మీగడ–తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. మాయిశ్చరైజర్ అవసరం లేదని మీకే తెలిసిపోతుంది. ఈ చలికాలం రోజూ పాల మీగడ–తేనె కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. చర్మకాంతి కూడా పెరుగతుంది. పాలు – అరటిపండు చర్మానికి సరైన పోషణ లేకపోతే జీవ కళ కోల్పోతుంది. పాలు, అరటిపండు కలిపి మిశ్రమం తయారుచేసుకొని ప్యాక్వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. జిడ్డుచర్మం గలవారు పాలు–రోజ్‌వాటర్ కలిపి రాసుకోవచ్చు. అరటిపండు మృతకణాలను తీసేయడంలో అమోఘంగా పనిచేస్తుంది. బాగా మగ్గిన అరటిపండును గుజ్జు చేసి, దాంట్లో టేబుల్ స్పూన్ పాలు కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. తర్వాత వెచ్చని నీటితో కడిగేయాలి. కలబంద– బాదంనూనె – నువ్వుల నూనె చర్మంపై ఎక్కువ మృతకణాలు కనిపిస్తే కలబంద రసంలో పది చుక్కల చొప్పున బాదం నూనె, నువ్వుల నూనె కలిపి ముఖానికి, చేతులకు రాయాలి. వృత్తాకారంలో రాస్తూ మర్దన చేయాలి. రాత్రంతా అలాగే వదిలేసి, మరుసటి రోజు ఉదయం వెచ్చని నీటితో కడిగేయాలి. బొప్పాయి – పచ్చిపాలు విటమిన్–ఇ అందితే చర్మం త్వరగా మృదుత్వాన్ని కోల్పోదు. బాగా పండిన బొప్పాయి ముక్కను గుజ్జు చేసి, దాంట్లో పచ్చి పాలు కలపాలి. ముఖానికి, మెడకు, చేతులకు రాసి ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి. -
చర్మం పొడిబారుతుంటే...
స్వెటర్ వేసుకునో, వేడి వేడిగా కప్పు టీ తాగో చలిని ఇట్టే తరిమేయచ్చు. కానీ, పొడిబారే చర్మాన్ని అశ్రద్ధ చేస్తే మాత్రం దురద, ముడతలు పడటం వంటి సమస్యలు దీర్ఘకాలం బాధిస్తాయి. ఎండాకాలం కన్నా చలికాలం వేధించే చర్మ సమస్యలే అధికం. అందుకు కోల్డ్ క్రీములు, మాయిశ్చరైజర్లు ఉపయోగించినా రోజువారీ ఇంట్లో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. గ్లిజరిన్ – పెట్రోలియమ్ జెల్లీ దూది ఉండను తీసుకొని గ్లిజర్లో అద్ది, పొడిబారిన చర్మంపై మృదువుగా రాయాలి. చర్మంలోకి ఇంకి పొడిబారడం సమస్య తగ్గుతుంది. వారానికి నాలుగైదు సార్లు రాయచు. అలాగే, పెట్రోలియమ్జెల్లీలో మాయిశ్చరైజర్ లక్షణాలు అధికం. పొడి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. రాత్రి పడుకునేముందు పెట్రోలియమ్ జెల్లీ రాసుకుంటే చర్మం పొడిబారడం సమస్య దరిచేరదు. పొద్దుతిరుగుడు నూనె చర్మం పొడిబారితే త్వరగా ముడతలు పడుతుంది. ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపుతుంది పొద్దుతిరుగుడు నూనె. కొద్దిగా ఈ నూనెతో చేతిలో వేసుకొని, ముఖానికి, కాళ్లకు, చేతులకు పట్టించి, మృదువుగా మర్దన చేసి వదిలేయాలి. రోజుకు ఒకసారైనా ఇలా చేస్తే చర్మం పొడిబారే సమస్య ఉండదు. తేనె–బొప్పాయి బొప్పాయిలో చర్మం ముడతలు పడటానికి నివారించే యాంటీ ఏజింగ్ ఏజెంట్స్ అధికం. తేనెలో చర్మాన్ని మృదువుగా మార్చే సుగుణాలు ఉన్నాయి. బొప్పాయి గుజ్జులో తేనె కలిసి ముఖానికి, మెడకు, చేతులకు రాసి ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. కొబ్బరినూనె చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్ అంటే అది కొబ్బరి నూనె. కొద్దిగా అరచేతిలో కొబ్బరి నూనె వేసుకొని రెండు చేతులకూ రాసి పొడిబారిన చర్మం మీదుగా రాయాలి. త్వరగా రిలీఫ్ లభిస్తుంది. చర్మం పొడిబారడం సమస్యా తగ్గుతుంది. పాలు – బాదం బాదంపప్పు, పాలలో చర్మానికి మాయిశ్చరైజర్నిచ్చే సుగుణాలు ఉన్నాయి. పొడిబారి కందిపోయిన చర్మానికి ఇవి ఉపశమనంతో పాటు సమస్యను తగ్గిస్తాయి. టీ స్పూన్ బాదం పొడి, రెండు టేబుల్ స్పూన్ల పాలు కలిపి మిశ్రమం తయారుచేసుకొని కందిపోయిన చర్మం మీదుగా రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తే చర్మానికి తగిన మాయిశ్చరైజర్ లభిస్తుంది. తేనె – నిమ్మరసం నిమ్మలో యాంటీయాక్సిడెంట్లు, తేనెలో మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఈ రెంటినీ కలిపి వాడితే చలికాలం వేధించే చర్మ సమస్యలు దరిచేరవు. -
చలికాలం... చర్మ సంరక్షణ
చలి అయినా, ఎండైనా దానిప్రభావం నేరుగా చర్మంపైనే పడుతుంది. ఇది నవంబరు నెల. రాబోయే నెలల్లో చలి మరింత పెరుగుతుంది. ఫలితంగా చర్మం పొడిబారిపోతుంది. అందుకే ఈ సీజన్లో చర్మంలో తేమ లేకపోవడంతో కాస్తంత గీరగానే తెల్లటి చారికలు పడటం అందరికీ అనుభవమే. చలికాలంలో చర్మ సంరక్షణకు సూచనలు. ఇటీవలి మారిన జీవనశైలిలో రాత్రుళ్లు సైతం చలిని లెక్క చేయకుండా ఔటింగ్స్‌కు వెళ్లడం మామూలే. టీనేజ్ పిల్లలు ఈ పని మరింత ఎక్కువగా చేస్తుంటారు. ఇలాంటివారు చర్మ సంరక్షణ ... ►రాత్రి చలిలో బయటికి వెళ్లాల్సిన వారు తప్పనిసరిగా థిక్ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇక ఈ సీజన్లో పగటి ఎండ కూడా ఒకింత తీక్షణంగానే ఉంటుంది. అందుకే ఎండలోకి వెళ్లేవారు ట్యానింగ్‌ను, ఎండ అలర్జీలను (సన్ అలర్జీస్) నివారించడానికి సన్‌స్క్రీన్ లోషన్ వాడటం మంచిది. అయితే జిడ్డు చర్మం కలిగి ఉండే టీనేజ్ పిల్లలు మాత్రం నూనె లేని (ఆయిల్ ఫ్రీ) సన్‌స్క్రీన్స్ రాసుకోవాలి. ఇక పొడి చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉండే ఆయిల్ బేస్ సన్‌స్క్రీన్స్ రాసుకోవాలి. ►ఎస్పీఎఫ్ (సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్) 40–50 ఉన్న క్రీములు వాడటం మంచిది. చర్మానికి జాగ్రత్తలు: చలికాలంలో వాతావరణం తేమను లాగేస్తుందన్న విషయం తెలిసిందే. వేడినీటి స్నానం చర్మాన్ని మరింత పొడిబారుస్తుంది. కానీ చన్నీళ్లు ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే బాగా వేడిగా ఉండే నీళ్లకు బదులు గోరువెచ్చని నీటినే వాడాలి. ►స్నానానికి అరగంట ముందు ఒంటికి ఆలివ్ లేదా కొబ్బరి నూనె పట్టించాలి. స్నానానికి మాయిశ్చరైజింగ్ సబ్బు/గ్లిజరిన్ బేస్డ్ సబ్బు మంచిది. ►స్నానం చేసి, కాస్త తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను రాయాలి. ఇలా రోజుకు 3,4 సార్లు రాయడం మంచిది. ►తల స్నానానికి రెండు గంటల ముందర మాడుకు నూనె మసాజ్ చేసుకోవాలి. నూనె కండిషనర్‌గా పనిచేస్తుంది. పొడిజుట్టు ఉన్నవారైతే షాంపూ తర్వాత తప్పనిసరిగా కండిషనర్ వాడాలి. ►తడి జుట్టును ఆరబెట్టుకోడానికి డ్రైయర్ వాడకూడదు. ఎందుకంటే అది మాడుపైని చర్మాన్ని, నుదుటినీ మరింత పొడిబారుస్తుంది. ►రోజూ రెండు లీటర్లకు తక్కువ కాకుండా నీటిని తాగాలి. అసలే చల్లటి వాతావరణం కారణంగా ఈ కాలంలో నీటిని తాగడం తగ్గుతుంది. కాబట్టి చర్మం పటుత్వాన్ని , తేమను కోల్పోయి మరింత గరుగ్గా కనిపిస్తుంది. అందుకే తగినంత నీరూ తాగాలి. పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆకుపచ్చటి రంగులో ఉండే ఆకుకూరలు (గ్రీన్‌లీఫీ వెజిటబుల్స్) ఎక్కువగా తినాలి. ►పెదవులు పగలకుండా పెట్రోలియమ్ జెల్లీ లేదా లిప్ బామ్‌ను పెదవులపై రాస్తూ ఉండాలి. ►పాదాలకూ, చేతులకూ కాటన్ గ్లౌజ్ వేసుకోవడం చాలా మంచిది. అది పగుళ్లను నివారిస్తుంది. ఈ క్రీమ్స్ వాడండి: ఈ సీజన్లో చాలామంది కోల్డ్ క్రీమ్స్ వాడుతుంటారు. అయితే ఎలాంటి కోల్డ్ క్రీములు వాడాలో చాలామందికి తెలియదు. ఈ కోల్డ్ క్రిమ్స్ ఎలా ఉండాలంటే... ►ఈ సీజన్లో వాడాల్సిన కోల్డ్ క్రీమ్స్ వాసనలేనివై ఉండాలి. ఒకవేళ మంచి ఫ్లేవర్‌తో కూడిన వాసన ఉన్నవాటిని మీరు వాడాలనుకుంటే... అవి ఎంత తక్కువ వాసనతో ఉంటే అంత మంచివని గుర్తుపెట్టుకోండి. వాసన తక్కువైన కొద్దీ చర్మంపై వాటి దుష్ప్రభావం అంతగా తగ్గుతుంటుంది. ►అలర్జీ కలిగించని (హైపో అలర్జిక్) క్రీమ్‌లను ఎంపిక చేసుకోవాలి. అలర్జీ కలిగించే వాటితో ఆరోగ్యపరంగా మళ్లీ ఓ కొత్త సమస్య ఎదురుకావచ్చు. ►ఈ సీజన్లో చర్మానికి క్లెన్సర్లు వాడకూడదు. అవి మరింత పొడిబారేలా చేస్తాయి. డాక్టర్ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
మలినాలు తొలగించాలంటే..
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏ కాలమైనా చర్మం నల్లబడటం సహజంగా జరుగుతూ ఉంటుంది. చర్మంపై మలినాలు పేరుకోవడం వల్లే ఈ సమస్య. మలినాలు సులువుగా తొలగిపోయి చర్మానికి కాంతి రావాలంటే... రెండు కప్పుల నీళ్లలో మూడు టీ స్పూన్ల కాఫీ గింజలు, టీ స్పూన్ ఉప్పు వేసి పదినిమిషాలు మరిగించాలి. కప్పు కాఫీ అయిన తర్వాత దించి, చల్లారనివ్వాలి. ఈ కాఫీతో శరీరమంతా స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మలినాలు తొలగిపోవడమే కాకుండా, మాయిశ్చరైజర్ లభించి పొడిబారడం సమస్య తగుతుంది. అరకప్పు అరటిపండు గుజ్జు, టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ అలొవెరా జెల్, టీ స్పూన్ పెరుగు, గుడ్డులోని తెల్లసొన.. బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, భుజాలకు రాసుకోవాలి. పది నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత తడి బట్టతో పూర్తిగా తుడిచేసి, శుభ్రపరుచుకోవాలి. పొడి చర్మం మృదువుగా అవుతుంది. మూడు టేబుల్ స్పూన్ల నారింజ రసం, టేబుల్ స్పూన్ పెరుగు, టీ స్పూన్ బాదం నూనె, టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ మలినాలను తొలగిస్తుంది. చర్మకాంతిని మెరుగుపరుస్తుంది. -
చలిబారకుండా
ఎండ, వానల కన్నా చలికాలం చర్మం త్వరగా ముడతలు పడటం, నల్లబడటం చూస్తుంటాం. దీనికి కారణం చర్మం పొడిబారడమే. ఈ సమస్యకు విరుగుడుగా... స్నానానికి ముందు టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, పాదాలకు మసాజ్ చేయాలి. అలాగే స్నానం చేసేముందు అర టీ స్పూన్ బాదం నూనె బకెట్ నీటిలో కలిపాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మం మృదుత్వాన్ని కోల్పోదు. అరటిపండు గుజ్జు, కప్పు పెరుగు, టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ ఓట్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడి చర్మానికి మంచి ప్యాక్ అవుతుంది. ముఖానికి, మేనికి పట్టించి పదిహేను నిమిషాలతర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీంతో చర్మానికి జీవకళ వస్తుంది. చలికాలం నూనె శాతం ఉన్న మాయిశ్చరైజర్లు వాడాలి. ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. అలాగని చర్మాన్ని మరీ రబ్ చేయకూడదు. కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దన చేయాలి. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. టీ స్పూన్ శనగపిండిలో అర టీ స్పూన్ తేనె, పచ్చిపాలు, చిటికెడు గంధం పొడి కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటేæపొడిబారిన ముఖ చర్మం ముడతలు తగ్గుతాయి. -
ఓట్మీల్ ప్యాక్...
ఓట్‌మీల్స్ వండుకుని దానిలో యాపిల్ గుజ్జు కలుపుకోవాలి. ఈ రెండింటినీ బాగా పేస్ట్ చేసుకుని దానిలో రెండు స్పూన్ల నిమ్మరసం కలపాలి. ముఖాన్ని నీటితో కడిగి తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్యాక్ వేసుకుని పది నిముషాల తర్వాత నీటితో కడిగేయాలి. దీని వల్ల జిడ్డు చర్మం మృదువుగా తయారవుతుంది. ఓట్: మీల్ పౌడర్‌లో రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖంపై, ముక్కు చుట్టూ వేళ్ళ సాయంతో కొంచెం గట్టిగా స్క్రబ్ చేసుకోవాలి. దీనివల్ల బ్లాక్ హెడ్స్ పోతాయి. ఓట్: మీల్ పౌడర్‌ను చేతిలోకి తీసుకుని కొద్దిగా నీటిని కలపి పేస్ట్ చేసుకుని ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి. ఐదు నిముషాలపాటు ఆరనిచ్చి కడిగేయాలి. పొడి చర్మం వారు ఈ ప్యాక్‌లో నీటికి బదులు పాలు వాడాలి. ముఖం కడిగిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఓట్ : మీల్ పౌడర్‌కు తాజా నిమ్మరసం కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి ఐదు నిముషాల తర్వాత కడిగేయాలి. చర్మం కొంచెం చమ్మగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీనివల్ల చర్మం మీద ఉన్న మచ్చలు పోతాయి. నిమ్మరసంలో ఉండే సిట్రికి ఆసిడ్, విటమిన్–సి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. సున్నిత చర్మంగల వాళ్ళు నిమ్మరసంలో కొద్దిగా నీటిని కలుపుకోవాలి. -
బ్యూటిప్స్
హెయిర్ డై జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు చర్మానికి తగలకూడదు. ముందుగా ముఖానికి, చెవులకు మాయిశ్చరైజర్ రాసుకొని తర్వాత డై వేసుకోవాలి. డై ఎంపికలో నాణ్యత విషయంలో రాజీపడకూడదు. జుట్టు సువాసనలు వెదజల్లాలంటే హెయిర్ సీరమ్ లేదా హెయిర్ స్ప్రే వాడచ్చు. జుట్టు సిల్కీగా మారాలనుకుంటే స్ట్రెయిటనింగ్ షాంపూ, కండిషనర్ వాడితే కొంతవరకు ఫలితం ఉంటుంది. స్టీమ్ ఫేషియల్ చేసే సమయంలో ముఖానికి ఆవిరి పట్టడం చూస్తుంటాం. అధికంగా ఆవిరిపట్టడం వల్ల చర్మంలోని పోర్స్ ఓపెన్ అయ్యి, చర్మం వదులయ్యే అవకాశాలు ఉన్నాయి. అమితంగా స్క్రబ్ చేయడం, స్టీమ్ పట్టడం వంటివి చర్మంలోని సహజతేమను పోగొడతాయి. అప్పటికి కాంతిగానే అనిపించినా, తర్వాత చర్మం జీవం కోల్పోయినట్టు తయారవుతుంది. అందుకని వీలైనంత వరకు స్టీమ్‌ను తగ్గించడం మేలు. -
వాతావరణం మారినప్పుడల్లా చర్మం డల్‌గా ఉంటోంది...
డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 26 ఏళ్లు. వాతావరణం మారినప్పుడల్లా నా చర్మం కాస్త డల్‌గా అనిపిస్తోంది. నా చర్మం మెరుస్తూ మంచి నిగారింపుతో ఉండటానికి తగిన సూచనలు ఇవ్వండి. – వి. జయశ్రీ, విశాఖపట్నం శరీరంలోని అతి పెద్ద అవయవం చర్మమే. ఒక రకంగా చెప్పాలంటే ఇది దేహాన్ని కప్పి ఉంచే రక్షణ కవచం వంటిది. బయటి నుంచి వచ్చే ప్రతి ప్రభావాన్నీ, ఒత్తిడిని ముందుగా భరించేది చర్మమే. చర్మం సాధారణంగా నాలుగు రకాలుగా ఉంటుంది. అది... సాధారణ చర్మం, పొడి చర్మం, జిడ్డు చర్మం, కాంబినేషన్ చర్మం. పొడిచర్మం సాధారణంగా పొడిబారిపోయి ఉంటుంది. ఇలాంటి చర్మతత్వం కలిగిన వారిలో ముడుతలు త్వరగా వస్తాయి. వీళ్లు తప్పనిసరిగా చర్మంలోని తేమను నిలిపి ఉంచడం కోసం మాయిశ్చరైజర్లను వాడాలి. జిడ్డు చర్మం ఉన్నవారి మేను కాస్తంత జిడ్డుగా ఉంటుంది. వీళ్లలో చర్మరంధ్రాలు కాస్తంత స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా ఉంటాయి. కొంతమందిలో మొటిమలు రావడం కూడా చాలా సాధారణం. కాంబినేషన్ చర్మం ఉన్నవారిలో ముఖంలోని కొన్ని భాగాలు... ముఖ్యంగా బుగ్గల్లోని కొంతభాగం, ముక్కు, గడ్డం వంటివి జిడ్డుగా కనిపిస్తుంటాయి. మిగతా భాగాలు పొడిబారినట్లుగా ఉంటాయి. సాధారణ చర్మం కలిగిన వారిలో మరీ జిడ్డుగానూ, మరీ పొడిగానూ లేకుండా చర్మం సాధారణంగా ఉంటుంది. చర్మ సంరక్షణ కోసం కొన్ని సూచనలు... ∙పొడి చర్మం ఉన్న వారికి చలికాలంతో పోలిస్తే ఎండాకాలంలో కొంచెం సమస్యలు తక్కువేనని చెప్పాలి. అయినప్పటికీ వీళ్లు మాయిశ్చరైజర్లు వాడటం మాత్రం మానకూడదు. ఎస్పీఎఫ్ 30 కలిగిన సన్‌స్క్రీన్ వాడటం తప్పనిసరి. ∙జిడ్డు చర్మం కలిగిన వారికి ఎండాకాలంలో చర్మంపై జిడ్డు పెరిగినట్లుగా ఉంటుంది. చెమట పట్టడం వల్ల సమస్య మరింత ఎక్కువైన ఫీలింగ్ ఉంటుంది. వీరు ఎక్కువగా వేడిమి ఉన్న వాతావరణంలో తరచూ ముఖం నీటితో కడుక్కుంటూ ఉండాలి. మాయిశ్చరైజర్లు, సన్‌స్క్రీన్ తప్పక వాడాలి. పొడి చర్మం ఉన్నవారు క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్లు వాడాలి. ∙ఇక ఏరకమైన చర్మం ఉన్నవారైనా నీళ్లు ఎక్కువగా తాగాలి. నీటి పాళ్లు ఎక్కువగా ఉండే పుచ్చపండ్ల వంటి తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. సమతులమైన ఆహారం తీసుకోవాలి. ప్రైవేట్పార్ట్స్లో నలుపు, ఎరుపు మచ్చలు... నా వయసు 37 ఏళ్లు. బైక్‌పై ఆఫీసుకు వస్తుంటాను. ఇటీవల వారం పాటు వర్షాలు పడ్డప్పుడు అండర్వేర్ తడిసింది. దాంతో తడిగా ఉన్న అండర్‌వేర్‌నే తొడుక్కొని వస్తున్నాను. రెండు మూడు రోజులుగా నడుము కింద చోట చర్మం మడతలు పడే ప్రదేశాల్లో ఎరుపు, నలుపు రంగు మచ్చలు ఉన్నాయి. ఒక్కోసారి అక్కడ దురదగా కూడా ఉంటోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. – సుభాష్, హైదరాబాద్ మీ లక్షణాలను బట్టి మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ఇట్రకొనజోల్–100 ఎంజీ మాత్రలను పదిరోజుల పాటు నోటి ద్వారా తీసుకోవాలి. అలాగే మచ్చలున్న చోట మొమాటోజోన్, టర్బినాఫిన్ కాంబినేషన్ ఉన్న క్రీమును 10 రోజుల పాటు ఉదయం, సాయంత్రం రాయాలి. ఆ తర్వాత ప్లెయిన్ టర్బినఫిన్ ఉన్న క్రీము మరో పదిరోజుల పాటు ఉదయం, సాయంత్రం రాయాలి. దీంతోపాటు మీరు ప్రతిరోజూ మల్టీవిటమిన్ టాబ్లెట్లు కూడా తీసుకుంటూ ఉండాలి. తడి అండర్‌వేర్‌ను ఎప్పుడూ ధరించవద్దు. మీసాలలో దురద... పరిష్కారం సూచించండి నా వయసు 29 ఏళ్లు. నాకు ప్రతిరోజూ మీసాలలో విపరీతమైన దురద వస్తోంది. రోమం మూలల్లో ఇది ఎక్కువగా అనిపిస్తోంది. గత నెల రోజులుగా ఇలా జరుగుతోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – డి. డేవిడ్, ఖమ్మం మీరు పేర్కొన్న వివరాల ప్రకారం మీరు సెబోరిక్ డర్మటైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది మీ మీసాలు ఉన్న చోట సెబమ్ అనే నూనె వంటి దాన్ని ఎక్కువగా స్రవిస్తున్నందువల్ల వచ్చే సమస్య. మీ సమస్యను అధిగమించడానికి ఈ కింది సూచనలు పాటించండి. ∙మొమటోజోన్తో పాటు టెర్బనాఫిన్ యాంటీ ఫంగల్ ఉండే కార్టికోస్టెరాయిడ్ కాంబినేషన్ క్రీమును ప్రతిరోజూ రాత్రిపూట మీ మీసాల వద్ద చర్మంపై రాసుకోండి. ఇలా పది రోజులు చేయడం వల్ల ఫలితం కనిపిస్తుంది. ∙మీ సమస్య పరిష్కారం కోసం ఒకసారి డర్మటాలజిస్ట్‌ను కలవండి. ముఖం నిండా మొటిమలు వస్తున్నాయి... తగ్గేదెలా? నా వయసు 15 ఏళ్లు. నాకు ముఖం నిండా మొటిమలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇవి తగ్గేదెలా? – నివేదిత, తాడేపల్లిగూడెం మీలాంటి టీనేజీ యువతీయువకుల్లో సాధారణంగా మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి ముఖం మీదే కాకుండా ఛాతీ, వీపు మీద కూడా కనిపిస్తుంటాయి. మన చర్మం మీద ఉంటే స్వేదగ్రంధుల ఖాళీలలో ఒక రకమైన నూనె స్రవించే గ్రంథులు కూడా ఉంటాయి. ఈ స్వేదగ్రంథుల ఖాళీలు నూనె, చర్మానికి సంబంధించిన మృతకణాలు, లేదా బ్యాక్టీరియాతో నిండితే మొటిమలు వస్తుంటాయి. మొటిమలకు చికిత్స అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటి తీవ్రత, ఎంతకాలంగా అవి వస్తున్నాయి అనే అనేక అంశాల ఆధారంగా చికిత్స చేస్తారు. మీరు ఒకసారి మీకు దగ్గర్లో ఉన్న డర్మటాలజిస్ట్‌ను కలవండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ ట్రైకాలజిస్ట్ – డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్,గచ్చిబౌలి, హైదరాబాద్ -
మెరుపునిచ్చే మాయిశ్చరైజర్లు
మాయిశ్చరైజర్లు, క్రీములను రెడీమేడ్గాకొనడం కంటే ఇంట్లో తయారు చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది. ఇందుకు కావలసినవన్నీ సౌందర్య సాధనాల మార్కెట్లో దొరుకుతాయి. నార్మల్ మాయిశ్చరైజర్ నార్మల్ స్కిన్ కోసం ఆల్మండ్ ఆయిల్ 30మి.లీ, రోజ్ డ్రాప్స్ 15, చామొమైల్ ఎసెన్స్ఐదు చుక్కలు, లావెండర్ ఐదు చుక్కలు, లెమన్ ఆయిల్ ఐదు చుక్కలు తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి తడిలేని బాటిల్లోనిల్వ చేసుకోవాలి. దీనిని ప్రతిరోజూ ముఖానికి, చేతులకు పట్టించాలి. రిచ్ మాయిశ్చరైజర్ పొడిచర్మానికయితే రిచ్ మాయిశ్చరైజర్ వాడాలి. ఇందుకు ఆప్రికాట్ ఆయిల్, అవొకాడో ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, బీస్ వ్యాక్స్,రోజ్ వాటర్ ఒక్కొక్కటి మూడు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకోవాలి. రోజ్ వాటర్ మినహా మిగిలిన అన్నింటినీ ఒక పాత్రలో వేసికలపాలి. ఈ పాత్రను వేడినీటి పాత్రలో పెట్టివ్యాక్స్ కరిగే వరకు ఉంచాలి. ఈ మిశ్రమాన్నిబాగా చిలికి చివరగా రోజ్ వాటర్ కలపాలి.చల్లారిన తర్వాత నిల్వ చేసుకుని వాడాలి. హై ప్రొటీన్ మాయిశ్చరైజర్ ఒక కోడిగుడ్డును ఒక కప్పు పాలలో కలిపి చిలకాలి. దీనిని ముఖానికి పట్టించి ఆరిన తర్వాతచన్నీటితో కడగాలి. మిగిలిన మిశ్రమాన్నిఫ్రిజ్లో పెట్టి తిరిగి వాడుకోవచ్చు. మాయిశ్చరైజింగ్ లోషన్ బాగా పండిన పీచ్‌ను చెక్కు తీసి గుజ్జు తీసుకోవాలి. దీనిని గ్రైండ్ చేసి రసాన్ని వడపోయాలి.ఈ రసానికి అంతే మోతాదులో తాజా క్రీమ్నుకలిపి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుని వాడుకోవాలి. -
పొడి చర్మానికి హాట్ థెరపీ
పొడిచర్మాన్ని రోజూ పదినిమిషాల సేపు హాట్థెరపీతో స్వాంతన పరచాలి. అదెలాగంటే... గోరువెచ్చటి నీటిని దోసిట్లోకి తీసుకుని ముఖాన్ని నీటిలో మునిగేటట్లు ఉంచాలి. ఇదే హాట్‌థెరపీ. ఉదయం స్నానం చేయడానికి ముందు కానీ రాత్రి పడుకునే ముందు కానీ చేయవచ్చు.ఒక కోడిగుడ్డు సొనలో, ఒక టీ స్పూన్ కమలారసం, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగైదు చుక్కల పన్నీరు, అంతే మోతాదులో నిమ్మరసం తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. పొడిచర్మానికి ఈ ప్యాక్ మంచి ఫలితాన్నిస్తుంది.బాగా మగ్గిన అరటిపండును మెత్తగా చిదిమి ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇది పొడిచర్మానికి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది, మెడనల్లగా ఉంటే క్రమంగా ఆ నలుపును వదులుతుంది. పొడిచర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్సీడ్ ఆయిల్ బాగా పని చేస్తుంది. దేనితోనూ కలపాల్సిన అవసరం లేకుండా ఆయిల్‌ను యథాతథంగా ఒంటికి రాసి మర్దన చేస్తే సరిపోతుంది.ఇది సౌందర్యసాధనాల మార్కెట్లో దొరుకుతోంది.పొడిచర్మం తీవ్రంగా బాధిస్తున్నప్పుడు అనేక రకాల కాంబినేషన్లతో ప్యాక్‌లు తయారు చేసుకోవడానికి సాధ్యం కానప్పుడు సింపుల్‌గా ఓ చిట్కా. స్వచ్ఛమైన ఆముదం లేదా అవొకాడో ఆయిల్ రాయాలి. అదీ కాకపోతే బాదం నూనె లేదా నెయ్యి రాయాలి. -
బ్యూటిప్స్
ఎండకు కమిలిన చర్మానికి బొప్పాయి రసం రాస్తే తక్షణం సాంత్వన కలుగుతుంది. ఫ్రూట్ ఫేషియల్కు బాగా పండిన బొప్పాయి పండు గుజ్జును అన్ని రకాల చర్మాల వాళ్లూ వాడవచ్చు. ఒక టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జులో టీ స్పూన్ శనగపిండి, టీ స్పూన్ పెరుగు కలిపి ప్యాక్ వేయాలి. ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. మెడ, మోచేతులు, పాదాల నలుపు వదలాలంటే బొప్పాయి ముక్కతో ఐదు నిమిషాల సేపు రుద్దాలి. ఇలా రెండువారాలు చేస్తే నలుపుపోతుంది. బొప్పాయిలో సహజసిద్ధంగా మైల్డ్ బ్లీచ్తోపాటు మాయిశ్చరైజర్ కూడా ఉంటుంది. కాబట్టి కృత్రిమ మైన బ్లీచ్, ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాస్తే కలిగే ఫలితాన్ని బొప్పాయి ప్యాక్‌తో సాధించవచ్చు. -
పాదాల జాగ్రత్త కోసం...
బ్యూటిప్స్ నిమ్మరసం – కప్పు, దాల్చిన చెక్క పొడి – పావు టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ – రెండు టీ స్పూన్లు, గోరువెచ్చని నీళ్లు – పాదాలకి సరిపడా. ఇవన్నీ టబ్‌లో కలిపి 20 నిమిషాల సేపు పాదాలను టబ్‌లో ఉంచాలి. టబ్‌లోంచి పాదాలను బయటికి తీశాక, మైల్డ్ సోప్‌తో పాదాలు శుభ్రంగా కడిగి టవల్‌తో లేకుండా తుడిచి, మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఈ విధంగా 15 రోజులకి ఒకసారి చేస్తే పాదాలు తమలపాకుల్లా మృదువుగా ఉంటాయి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వైట్ పెట్రోలియమ్జెల్లీ పాదాలకి అప్లై చేసి, వేళ్లతో వలయాకారంలో పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. -
మృదువైన కురులు...
బ్యూటిప్స్ రోజూ తీసుకునే ఆహారంలో పోషకాలు సమతూకంలో ఉండాలి. నార్మల్ హెయిర్ గలవారు చేపలు, చికెన్, పప్పు ధాన్యాలు, మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. పొడి జుట్టు గల వారు పచ్చికూరగాయలు, ముడిబియ్యంతో వండిన అన్నం, అరటిపండ్లు, నట్స్, విటమిన్ ‘ఇ’ క్యాప్సుల్స్ తప్పనిసరి. జుట్టు జిడ్డుగా ఉండేవారు తాజా ఆకుకూరలు-కూరగాయలతో చేసిన సలాడ్స్, పండ్లు, పెరుగు తీసుకోవాలి. షాంపూ: పొడి జుట్టు గలవారు మాడుపై ఉన్న సహజ నూనెలు పీల్చేయని షాంపూలను వాడాలి. షాంపూతో పాటు కండిషనర్ తప్పనిసరిగా వాడాలి. అప్పుడే వెంట్రుకలు ఎక్కువగా పొడిబారకుండా ఉంటాయి. జుట్టు జిడ్డుగా ఉండేవారు వారానికి మూడుసార్లు షాంపూతో తలస్నానం చేయాలి. గుడ్డు: కోడి గుడ్డులో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతాయి. మాయిశ్చరైజర్‌ని కోల్పోనివ్వవు. వారానికి ఒకసారి పొడిజుట్టు గలవారు గుడ్డులోని పసుపు సొనను, జిడ్డు గలవారు తెల్లసొనను ప్యాక్ వేసి 15 నిమిషాల తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. చుండ్రు నివారణకు : దుమ్ము, వాతావరణ, శుభ్రత లోపాలు చుండ్రుకు కారణం అవుతుంటాయి. 2 టీ స్పూన్ల బ్రౌన్ షుగర్‌లో టీ స్పూన్ హెయిర్ కండిషనర్ కలిపి మాడుకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తుంటే చుండ్రు తగ్గుతుంది. -
లవ్లీ స్కిన్ కోసం ఆలివ్ ఆయిల్
బ్యూటిప్స్ రెండు-మూడు టేబుల్స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను గోరువెచ్చగా చేసి ఒంటికి పట్టించి మర్దన చేసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి. ♦ ఒక టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్లో ఒక కోడిగుడ్డు సొన, కొద్దిగా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో కడగాలి. ఈ ప్యాక్ పొడి చర్మానికి చక్కటి మాయిశ్చరైజర్. ఈ కాలంలో పొడి చర్మం కలిగిన వారయితే వారానికి కనీసం నాలుగుసార్లు, సాధారణ చర్మానికయితే వారానికి ఒకటి- రెండు సార్లు ఈ ప్యాక్ వేస్తే పగుళ్లు రాకుండా చర్మం మృదువుగా ఉంటుంది. ♦ కొన్ని రకాల ప్యాక్‌లు, చర్మం మీద గాయాలున్నప్పుడు మినహాయించాల్సి ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌లోని చర్మరక్షణ గుణాలు చిన్నచిన్న గాయాలను, చర్మ సమస్యలను కూడా తగ్గిస్తాయి కాబట్టి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ♦ మస్కారా పొడిబారినట్లయితే అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేస్తే తిరిగి మామూలుగా వస్తుంది. ♦ రెండు టీ స్పూన్ల చక్కెరలో అంతే మోతాదులో ఆలివ్ ఆయిల్ కలిపి చేతులకు పట్టించి రుద్దినట్లయితే మృతకణాలు తొలగిపోవడంతోపాటు మృదువుగా మారి చర్మం మెరుస్తుంది. ♦ అరకప్పు ఆలివ్ ఆయిల్లో పావుకప్పు వెనిగర్, పావుకప్పు నీటిని కలిపి రాత్రి పడుకునే ముందు ముఖం, మెడ, చేతులకు పట్టిస్తే నిర్జీవంగా ఉన్న చర్మం కాస్తా ఉదయానికి కాంతులీనుతుంది. ఈ సీజన్లో ఇది మంచి ట్రీట్మెంట్. ఈ మిశ్రమాన్ని ఒకసారి తయారుచేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుని నాలుగైదు రోజులపాటు వాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని పట్టించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. -
మునివేళ్లలో అందం...
బ్యూటిప్స్ ♦ గోళ్లు మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో చెబుతాయి. విరగడం, పొడిబారి నిస్తేజంగా కనిపిస్తే ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. దాంతో ఈ జాగ్రత్తలూ తీసుకోవాలి. ♦ చేతులను సబ్బు లేదా లిక్విడ్‌తో శుభ్రపరుచుకున్నాక గోళ్లు పొడిబారినట్టుగా అనిపిస్తే తప్పక లోషన్‌తో మసాజ్ చేసుకోవాలి, దీంతో గోళ్ల చుట్టూ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ♦ గోళ్లను స్నానానంతరం కత్తిరించడం మేలు. నీళ్లలో నాని గోళ్లు గరుకుదనం తగ్గుతుంది. దీంతో ట్రిమ్ చేయడం సులువు అవుతుంది. ♦ వెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి గోళ్లు మునిగేలా చేతులను ఉంచాలి. పది నిమిషాల తర్వాత గోళ్ల చుట్టూ ఉన్న మురికిని తొలగించాలి. తర్వాత మంచినీళ్లతో కడిగి, తడి లేకుండా తుడిచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నెయిల్ పాలిష్‌లో బేస్ కోట్ ఉంటుంది. దీన్ని గోళ్లకు వేసుకుంటే గోళ్ల అందం రెట్టింపు అవుతుంది. త్వరగా గోళ్లు పాడవు. -
ఎండవేళలో చర్మకాంతి...
బ్యూటిప్స్ ఎండ వల్ల కమిలిన చర్మానికి తిరిగి పూర్వపు కాంతి తీసుకురావాలంటే... మూడు స్ట్రాబెర్రీలలో గింజలు తీసేసి, గుజ్జు చేయాలి. దీంట్లో ఐదు చుక్కల తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమంతో ముఖానికి, మెడకు ప్యాక్ వేసి, 20 నిమిషాలు ఆరనివ్వాలి. నీళ్లు ముఖం మీద చిలకరించుకొని, తడి క్లాత్‌తో తుడిచి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మకాంతి పెరుగుతుంది. రెండు ద్రాక్ష పండ్లను తీసుకొని సగానికి కోయాలి. ఆ ముక్కలతో ముఖం, మెడ, భుజాలను రబ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇది మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఎండవేడి నుంచి ఉపశమనం లభించడమే కాదు, రక్తప్రసరణ మెరుగవుతుంది. ఫలితంగా చర్మకాంతి పెరుగుతుంది. ఎండనబడి తిరిగి ఇంటికి చేరుకున్నాక చెరుకురసం ముఖానికి రాసి, ఆరిన తర్వాత చల్లటినీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చెరుకులోని సహజగుణాలు చర్మానికి అంది, ఎండవల్ల ఏర్పడిన ట్యాన్ తగ్గిపోతుంది. బడలిక తీరుతుంది. చర్మం పొడిబారడం తగ్గి, ముడతల సమస్య దరిచేరదు. -
ఫెయిరీ ఫౌండేషన్
శీతాకాలంలో పార్టీకి వెళ్లాలా? ఎలాంటి ఫౌండేషన్ వేసుకోవాలో అర్థం కావట్లేదా? మీ చర్మానికి ఎలాంటి ఫౌండేషన్ అబ్బుతుందోనన్న ప్రశ్నా? అయితే ఈ చిట్కాలు మీ కోసం.. కొంతమందికి ఫౌండేషన్ రాసుకోవాలని ఉన్నా అది ముఖంపై బరువుగా ఉన్నట్టు భావిస్తుంటారు. అలాంటి వారు దాన్ని డెరైక్ట్‌గా చర్మానికి రాసుకోకుండా ముందు ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అది పూర్తిగా చర్మంలోకి ఇంకిపోయాక ఫౌండేషన్ క్రీమ్‌ను కొద్దిగా ముఖానికి అప్లై చేస్తే చాలు. లైట్‌గా అనిపించడమే కాకుండా ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. పొడి చర్మం వారు ఫౌండేషన్ క్రీమ్ అంటే భయపడుతుంటారు. ఎందుకంటే అది రాసుకుంటే ముఖంపై ఆ క్రీమ్ ప్యాచులుగా కనిపిస్తుందని. అలాంటి వారు చేతిలో కొద్దిగా ఫౌండేషన్ క్రీమ్‌ను తీసుకొని దానికి మాయిశ్చరైజర్ కలిపి ముఖానికి రాసుకోవాలి. -
విషమంగానే ఇంద్రాణి ఆరోగ్య పరిస్థితి
-
ప్రయాణంలో మిసమిసలు
ట్రావెల్ కొన్ని రోజులు దూర ప్రాంతాలకు విహారానికి వెళ్లి, తిరిగి వచ్చాక అద్దంలో చూసుకుంటే చర్మం నల్లబడి, జీవం లేనట్టుగా కనపడుతుంది. బస్సు, కారు, రైలు, విమానం.. మార్గం ఏదైనా ప్రయాణం ఆనందంగా, అందంగా సాగిపోవాలంటే మనవైన కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి... మాయిశ్చరైజర్ తప్పనిసరి గాలి, ఎండ వల్ల చర్మం త్వరగా డి-హైడ్రేషన్‌కు లోనై పొడారి పోతుంది. దీని వల్ల చర్మం ముడతలు పడటం, రంగు మారడం వంటి సమస్యలకూ లోనవుతుంది. అందుకని మూడు గంటలకు ఒకసారి నీటి శాతం అధికంగా ఉండే మాయిశ్చరైజర్‌ను తప్పక రాసుకోవాలి. ఫౌండేషన్ దూరం దూరం... ప్రయాణంలో ఫౌండేషన్‌ను దూరం పెట్టాలి. కేవలం మాయిశ్చరైజర్‌ను మాత్రమే వాడాలి. కొంతమంది మేకప్ లేకుండా బయటకు వెళ్లడాన్ని ఇష్టపడరు. సిలికాన్ బేస్డ్ లిక్విడ్ లేదా క్రీమ్ పై పూతగా వాడి, ఆ తర్వాత మేకప్ కోసం ఫౌండేషన్ వాడితే చర్మం తేమను కోల్పోదు. జిడ్డు చర్మానికి ప్రత్యేకం... ప్రయాణంలో జిడ్డు చర్మంగల వారికి సమస్య అధికం. ముఖంపై అదనపు జిడ్డును తొలగించడానికి బ్లాటింగ్ పేపర్లు మేలైన పరిష్కారం. ఈ బ్లాటింగ్ పేపర్‌తో ముఖానికి అద్దితే సరిపోతుంది. మాయిశ్చరైజర్ పోకుండా, ముఖం తాజాగా కనిపిస్తుంది. కొద్దిగా షిమ్మర్ మెరుపు... ప్రయాణంలో పడే సూర్యకాంతికి నునుపైన చెక్కిళ్లు మెరిసిపోవాలంటే అతి కొద్దిగా షిమ్మర్ పౌడర్ వాడితే చాలు. అలాగే ఇంకా కొద్దిగా ముక్కుచివర్లు, చుబుకం దగ్గర బ్లష్‌తో చిన్న స్ట్రోక్ ఇవ్వాలి. గ్లాసీ లిప్ బామ్ వాడితే అందులోని మాయిశ్చరైజర్ వల్ల పెదవుల చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే పగుళ్ల సమస్య దరిచేరదు. -
కొబ్బరి పాలతో మృదువుగా!
అందమే ఆనందం కొబ్బరి పాలు జుట్టు కుదుళ్లను దృఢం చేస్తాయి. కొబ్బరి పాలను మాడుకు పట్టించి తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు మాయిశ్చరైజర్ లభించి మృదువుగా అవుతుంది. కొబ్బరి పాలలో నిమ్మరసం కలిపి ఫ్రిజ్‌లో 2-3 గంటలు ఉంచాలి. తర్వాత బయటికి తీసి, దానిపైన ఏర్పడ్డ పొరను తొలగించాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, మాడుకు పట్టించి, వేడినీళ్లలో ముంచిన ఉన్ని టవల్‌ను తలకు చుట్టాలి. గంట సేపు అలాగే ఉంచి, షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తూ ఉంటే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. జుట్టు మృదువుగా అవుతుంది. -
గోరంత అందానికి
నఖ సౌందర్యం దూదితో కొద్దిగా పాలిష్ రిమూవర్‌ని అద్దుకొని అప్పటికే గోర్లకు ఉన్న రంగును రుద్దుతూ తీసేయాలి. నెయిల్ పాలిష్ ఉన్నా లేకపోయినా ఇలాగే చేయాలి. దీని వల్ల కంటికి కనిపించని మలినాలు కూడా తొలగిపోతాయి. వేళ్ల చర్మం భరించగలిగేటంత నీటిని ఒక గిన్నెలోకి , చల్లని నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేడినీటి గిన్నెలో 5-8 నిమిషాలు గోళ్లు మునిగేలా వేళ్లను ఉంచాలి. గోళ్లు మెత్తబడినట్టు మీకే తెలుస్తుంది. మెత్తటి పొడి టవల్‌తో నీళ్లు లేకుండా తుడవాలి. నెయిల్ కటర్‌తో మీడియమ్ లెంగ్త్‌లో గోర్లను కట్ చేసుకోవాలి. మెత్తబడిన గోరును సరైన షేప్‌లో కట్చేసుకోవడం చాలా సులువు. నెయిల్ ఫిల్లర్‌తో ఒక్కో గోరు చివర భాగంలో రబ్ చేయాలి. క్యుటికల్ ఆయిల్‌ను గోరుచుట్టూ రాయాలి. ఇందుకోసం ఆలివ్ లేదా జొజొబా నూనెను వాడచ్చు. ఒక్కో వేలికి ఒక్కో డ్రాప్ ఆయిల్ తీసుకొని, క్లాక్‌వైజ్‌గా తరువాత యాంటీ క్లాక్‌వైజ్ డెరైక్షన్‌లో వేలితో మసాజ్ చేయాలి. గోరుచుట్టూ ఉన్న మృత చర్మకణాలు ( క్యుటికల్స్) క్యుటికల్ పుషర్తో తొలగించాలి. (నెయిల్ కిట్‌లోనూ లేదా షాపులో విడిగానూ క్యుటికల్ పుషర్స్ లభిస్తాయి) ఆరోగ్యకరమైన గోర్లకు క్యుటికల్స్ చాలా ముఖ్యమైనవి. ఈ ప్లేస్లోనే బాక్టీరియా, ఫంగస్ చేరే అవకాశాలు ఉంటాయి. అందుకే చర్మానికి హాని కలగకుండా క్యుటికల్స్ను అత్యంత జాగ్రత్తగా శుభ్రపరచాలి. (ఇందుకోసం మరో 10 నిమిషాల సమయం పడుతుంది) హ్యాండ్ లోషన్‌ని వేళ్లకు, చేతులకు మాత్రమే ఉపయోగించాలి. పారపాటున గోర్ల మీద నూనె, మాయిశ్చరైజర్ ఉంటే తుడిచేయాలి. క్లియర్ బేస్ కోట్ని ప్రతి గోరుకు వేయాలి. -
మేని మెరుపులకు...
చర్మసౌందర్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు చాలా మంది. అయితే కొన్ని సార్లు చర్మాన్ని మెరుగు పెట్టే సౌందర్య ఉత్పాదనలు, ఇంట్లో చేసే చిన్న చిన్న చిట్కాల వల్ల కూడా హాని జరుగుతుంటుంది. అవగాహన లేమి దీనికి ప్రధాన కారణం అంటున్నారు సౌందర్య నిపుణులు. ఏమేం చేయకూడదంటే... Right: చర్మం తెల్లగా అవ్వాలని, మృదువుగా అవ్వాలని స్క్రబ్(మార్కెట్లో రకరకాల స్క్రబ్‌లు అందుబాటులో ఉన్నాయి) తో అతిగా రుద్దుతుంటారు. దీని వల్ల చర్మం ఎర్రబడడమే కాకుండా పొడిబారుతుంది. మొటిమలు ఉంటే సమస్య మరింతగా పెరుగుతుంది. Wrong: రెండు వారాలకు ఒకసారి చర్మతత్త్వానికి సరిపడే స్క్రబ్ (మార్కెట్లో లభిస్తుంది) తో 2-3 నిమిషాలు మృదువుగా రుద్ది, శుభ్రపరుచుకోవాలి. మెటిమలు ఎక్కువగా ఉంటే స్క్రబ్ వాడకూడదు. వేపాకులను రుబ్బి, ముఖానికి రాసుకొని, ఆరాక శుభ్రపరచాలి. Right: చాలామంది తమ చర్మతత్వానికి సరిపడిన మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లోషన్లు ఎంచుకోరు. దీని వల్ల సేదగ్రంథులు మూసుకుపోవడం, చర్మంపై దద్దుర్లు, పొక్కులు రావడం జరుగుతుంటాయి. Wrong: ఏదైనా కొత్త సౌందర్య ఉత్పత్తిని చర్మానికి ఉపయోగించే ముందు మోచేతిపై లేదా చెవి వెనకాల కొద్దిగా రాసి, 2-3 గంటల సేపు అలాగే ఉంచాలి. ఎరుపు దనం, దద్దుర్లు లేవని నిర్ధారించుకున్నాకే ఆ ఉత్పత్తిని వాడుకోవాలి. అలాగే, మాయిశ్చరైజర్ రాసిన వెంటనే ఫౌండేషన్ వాడకూడదు. మాయిశ్చరైజర్ చర్మానికి రాసిన 60 సెకండ్లలో ఇంకిపోతుంది. ఆ తర్వాత ఫౌండేషన్‌ను వాడవచ్చు. మొటిమలను గిల్లడం, లోపలి పస్(చీము) తీయడం వంటివి చేస్తే ఆ ప్రాంతంలో మచ్చలు పడే అవకాశం ఉంది. Right: జిడ్డు చర్మం గలవారికి మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీరు రోజులో 2-3 సార్లు ఫేస్‌వాష్‌తో శుభ్రపరుచుకోవడం, నిమ్మ గుణాలున్న పేస్ప్యాక్లు వేసుకోవడం వల్ల ముఖం శుభ్రంగా ఉండి మొటిమల సమస్య తగ్గుతుంది. Wrong: చాలామంది దుస్తులు ధరించిన తర్వాత పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటారు. దుస్తుల మీద స్ప్రే చేయడం వల్ల అందులోని ఫైబర్ లక్షణాలతో కలిసి పెర్ఫ్యూమ్ సువాసన మారే అవకాశం ఉంది. కొన్ని సార్లు ఈ తరహా ప్రయోగాలు చర్మానికి హాని కలిగించవచ్చు. Right: వస్త్రధారణకు ముందు దూది ఉండకు స్ప్రే చేసి గొంతు, ముంజేతులు, భుజాల కింద... పెర్ఫ్యూమ్ను అద్దాలి. దీని వల్ల చర్మానికి హాని కలగదు.