ఎండవేళలో చర్మకాంతి...
బ్యూటిప్స్
ఎండ వల్ల కమిలిన చర్మానికి తిరిగి పూర్వపు కాంతి తీసుకురావాలంటే...
మూడు స్ట్రాబెర్రీలలో గింజలు తీసేసి, గుజ్జు చేయాలి. దీంట్లో ఐదు చుక్కల తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమంతో ముఖానికి, మెడకు ప్యాక్ వేసి, 20 నిమిషాలు ఆరనివ్వాలి. నీళ్లు ముఖం మీద చిలకరించుకొని, తడి క్లాత్‌తో తుడిచి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మకాంతి పెరుగుతుంది.
రెండు ద్రాక్ష పండ్లను తీసుకొని సగానికి కోయాలి. ఆ ముక్కలతో ముఖం, మెడ, భుజాలను రబ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇది మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఎండవేడి నుంచి ఉపశమనం లభించడమే కాదు, రక్తప్రసరణ మెరుగవుతుంది. ఫలితంగా చర్మకాంతి పెరుగుతుంది.
ఎండనబడి తిరిగి ఇంటికి చేరుకున్నాక చెరుకురసం ముఖానికి రాసి, ఆరిన తర్వాత చల్లటినీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చెరుకులోని సహజగుణాలు చర్మానికి అంది, ఎండవల్ల ఏర్పడిన ట్యాన్ తగ్గిపోతుంది. బడలిక తీరుతుంది. చర్మం పొడిబారడం తగ్గి, ముడతల సమస్య దరిచేరదు.