మృదువైన కురులు...
బ్యూటిప్స్
రోజూ తీసుకునే ఆహారంలో పోషకాలు సమతూకంలో ఉండాలి. నార్మల్ హెయిర్ గలవారు చేపలు, చికెన్, పప్పు ధాన్యాలు, మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. పొడి జుట్టు గల వారు పచ్చికూరగాయలు, ముడిబియ్యంతో వండిన అన్నం, అరటిపండ్లు, నట్స్, విటమిన్ ‘ఇ’ క్యాప్సుల్స్ తప్పనిసరి. జుట్టు జిడ్డుగా ఉండేవారు తాజా ఆకుకూరలు-కూరగాయలతో చేసిన సలాడ్స్, పండ్లు, పెరుగు తీసుకోవాలి.
షాంపూ: పొడి జుట్టు గలవారు మాడుపై ఉన్న సహజ నూనెలు పీల్చేయని షాంపూలను వాడాలి. షాంపూతో పాటు కండిషనర్ తప్పనిసరిగా వాడాలి. అప్పుడే వెంట్రుకలు ఎక్కువగా పొడిబారకుండా ఉంటాయి. జుట్టు జిడ్డుగా ఉండేవారు వారానికి మూడుసార్లు షాంపూతో తలస్నానం చేయాలి.
గుడ్డు: కోడి గుడ్డులో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతాయి. మాయిశ్చరైజర్‌ని కోల్పోనివ్వవు. వారానికి ఒకసారి పొడిజుట్టు గలవారు గుడ్డులోని పసుపు సొనను, జిడ్డు గలవారు తెల్లసొనను ప్యాక్ వేసి 15 నిమిషాల తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.
చుండ్రు నివారణకు : దుమ్ము, వాతావరణ, శుభ్రత లోపాలు చుండ్రుకు కారణం అవుతుంటాయి. 2 టీ స్పూన్ల బ్రౌన్ షుగర్‌లో టీ స్పూన్ హెయిర్ కండిషనర్ కలిపి మాడుకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తుంటే చుండ్రు తగ్గుతుంది.