Nutrients
-
Snake Fruit: స్నేక్ ఫ్రూట్!
‘స్నేక్ ఫ్రూట్’ లేదా సలక్ ఫ్రూట్. శాస్త్రీయ నామం సలక్క జలక్క. అరెకేసియే కుటుంబం. ఈత, ఖర్జూర వంటి పామ్ జాతికి చెందిన ఒక రకం. ఇండోనేషియాలోని జావా, సుమత్ర ప్రాంతం దీని పుట్టిల్లు. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ వంటి ఈశాన్య ఆసియా దేశాల్లో విస్తారంగా సాగులో ఉన్న పండు. లేత కాఫీ రంగులో ఉండే ఈ పండు పైన పోలుసు పాము చర్మంపై పోలుసులను పోలి ఉంటుంది. అందుకే కాబోలు, దీనికి స్నేక్ ఫ్రూట్ లేదా స్నేక్ స్కిన్ ఫ్రూట్ అంటారు. పండిన అంజూర పండు సైజులో, అదే ఆకారంలో స్నేక్ ఫ్రూట్ ఉంటుంది. పైపోర పెళుసుగా ఉంటుంది. పైపోరను ఒలిస్తే లోపల తెల్లటి రెబ్బలు (వెల్లుల్లి రెబ్బల మాదిరిగా) ఉంటాయి. వాటి లోపల గోధుమ రంగు గింజలు ఉంటాయి. గింజలు తీసేసి ఈ రెబ్బల్ని తినాలి. రుచి గమ్మత్తుగా, విలక్షణంగా ఉంటుంది. ద ఫ్యూచర్ ఆఫ్ ద హెల్త్ అని, సూపర్ హీరోస్ ఆఫ్ ఫంక్షనాలిటీ అని దీన్ని వ్యవహరిస్తుంటారు. సలక్కు ఇంకా చాలా పేర్లున్నాయి. ఇండోనేషియాలో పోందో, థాయ్‌లాండ్‌లో రకం, చైనాలో సలక లేదా షి పై గ్యో జాంగ్, మయన్మార్‌లో ఇంగన్ అని పిలుస్తున్నారు. న్యూ గినియ, ఫిలిప్పీన్స్, క్వీన్స్లాండ్, ఉత్తర ఆస్ట్రేలియా, పోనపె ఐలాండ్ (కారోలిన్ అర్చిపెలాగో), చైనా, సూరినామ్, స్పెయిన్, ఫిజి తదితర దేశాల్లో స్నేక్ ఫ్రూట్‌ను సాగు చేస్తున్నారు. ఇండోనేషియాలోని ఇతరప్రాంతాల్లో దీన్ని ఆహార పంటగా సాగు చేస్తున్నారు.20 అడుగుల ఎత్తుస్నేక్ ఫ్రూట్ చెట్టుకు కాండం చాలా చిన్నది. అయితే, కొమ్మలు పెద్దగా 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ప్రతి కొమ్మకు ముళ్లతో కూడిన 2 మీటర్ల పోడవైన తొడిమె ఉంటుంది. ముల్లు 6 అంగుళాల వరకు పోడవుంటుంది. కొమ్మకు చాలా ఆకులుంటాయి. ఈ చెట్టు కాండానికి కాయలు గెలలుగా కాస్తాయి. ఆకు అడుగున లేత ఆకుపచ్చగా, పైన ముదురు ఆకుపచ్చగా ఉంటుంది. స్నేక్ ఫ్రూట్ మొక్క నాటిన తర్వాత 3–4 ఏళ్లలో కాపుకొస్తుంది. ఇప్పుడు ముళ్లు లేని వంగడాలు కూడా వచ్చాయి. ఆడ చెట్లు, మగ చెట్లు ఉంటాయి. కొన్ని రకాల స్నేక్ ఫ్రూట్ చెట్లలో (ఉదా.. సలక్ బాలి) ఆడ, మగ పూలు రెండూ ఒకే చెట్టుకు పూసి స్వపరాగ సంపర్కం చెందుతాయి. పూలు గుత్తులుగా పూస్తాయి. ఆడ పూలు 20–30 సెం.మీ., మగవి 50–100 సెం.మీ. పోడవు ఉంటాయి. పరాగ సంపర్కం కోసం మగ పూలలో 20%ని మాత్రమే ఉంచి, మిగతావి తొలగించాలి. మనుషులు చేతులతో పరాగ సంపర్కం చేయిస్తే పండ్ల దిగుబడి పెరుగుతుంది.తీపి కాదు, వగరుసలక్క చెట్ల రకాలు 21 జాతులున్నాయి. మలేషియాలో మూడు రకాలను పెంచుతున్నారు. ఎస్.గ్లాబెరెసెన్స్, ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన. ఎస్. గ్లాబెరెసెన్స్ను లోకల్ సలక్గా భావిస్తారు. దీని నుంచి 9 క్లోన్స్‌ను తయారు చేశారు. ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన రకాలు ఇండోనేషియా నుంచి మలేషియాకు వచ్చాయి. ఇక ఇండోనేషియాలో దేశీయ, విదేశీ మార్కెట్ల కోసం వాణిజ్యపరంగా ఎస్. జటక్క, ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన రకాలను సాగు చేస్తున్నారు. మనోంజయ, బొంగ్కాక్, బంజార్నెగర, కొండెట్, పోందో, బాలి, ఎన్రెంకంగ్, సైడెంపుయన్ వంటి అనేక రకాల స్నేక్ ఫ్రూట్ వంగడాలు సాగులో ఉన్నాయి. స్నేక్ ఫ్రూట్ తియ్యని పండు కాదు, కొంచెం వగరు. బోంగ్కాక్ రకం పండు మరీ ఎక్కువ వగరు. మిగతా రకాల కన్నా తక్కువ తీపి కలిగి ఉంటుంది.పుష్కలంగా పోషకాలుస్నేక్ ఫ్రూట్లో ఇతర పండ్లతో పోల్చినప్పుడు అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. సుక్రోజ్ (7.6 గ్రా/100 గ్రా.), ఫ్రక్టోజ్ (3.9 గ్రా/100 గ్రా.), టోటల్ సుగర్ (17.4 గ్రా./100 గ్రా.), జీర్ణమయ్యే పీచు (0.3 గ్రా./100 గ్రా.), జీర్ణం కాని పీచు (1.4 గ్రా./100 గ్రా.), టోటల్ డైటరీ ఫైబర్ (1.7 గ్రా./100 గ్రా.), నీరు (80గ్రా./100 గ్రా.), కేలరీలు (77 కిలోకేలరీలు/ 100 గ్రా.),ప్రోటీన్ (0.7గ్రా./100 గ్రా.), బూడిద (0.6గ్రా./100 గ్రా.), కొవ్వు (0.1 గ్రా./100 గ్రా.). ఉన్నాయి. సహజ పీచు, సుగర్స్‌కు స్నేక్ ఫ్రూట్ చక్కని వనరు. దీని గుజ్జులో మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఫాస్ఫరస్ (1161 ఎంజి/కేజీ), పోటాషియం (11.339 ఎంజి/కేజీ), కాల్షియం (220 ఎంజి/కేజీ), మెగ్నీషియం (607 ఎంజి/కేజీ), సోడియం (231 ఎంజి/కేజీ), ఐరన్ (12.0 ఎంజి/కేజీ), మాంగనీసు (10.4 ఎంజి/కేజీ), రాగి (3.36 ఎంజి/కేజీ), బోరాన్ (5.07 ఎంజి/కేజీ), సల్ఫర్ (5.07 ఎంజి/కేజీ), అస్కార్బిక్ ఆసిడ్ (400 ఎంజి/కేజీ), కెరోటిన్ (5 ఎంజి/కేజీ), థయామిన్ (20 ఎంజి/కేజీ), నియాసిన్ (240 ఎంజి/కేజీ), రిబోఫ్లావిన్ (0.8 ఎంజి/కేజీ), ఫొలేట్ (6 ఎంజి/కేజీ) మేరకు ఉన్నాయి. స్నేక్ ఫ్రూట్లో ఆరోగ్యదాయకమైన పీచు, పిండి పదార్థం నిండుగా ఉన్నాయి. ఇతర విదేశీ పండ్లతో పోల్చితే దీని గుజ్జులో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఈ పండును నేరుగా తినొచ్చు లేదా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. డ్రైఫ్రూట్స్, పచ్చళ్లు, చిప్స్, ఊరబెట్టి కూడా వాడుకుంటున్నారు. పోందో (ఇండోనేషియన్ సలక్) రకం లేత కాయలను గింజలతో సహా తినొచ్చు. స్నేక్ ఫ్రూట్ ఆకులను, రెమ్మలను కూడా చాపలు, బుట్టల అల్లికకు వాడుతున్నారు.50 ఏళ్ల పాటు దిగుబడిస్నేక్ ఫ్రూట్‌ను విత్తనాలతో మొక్కలు పెంచి నాటుకోవాలి. అయితే, 50% మాత్రమే ఆడ మొక్కలు వస్తాయి. పండు నాణ్యత ఒకే స్థాయిలో ఉంటుంది. తల్లి మొక్క లక్షణాలు పూర్తిగా రావాలంటే మాత్రం పిలకలు నాటుకోవాలి. 6–12 నెలల వయసు మొక్కను పైన ఆకుల నుంచి కింది వేర్ల వరకు నిలువుగా చీల్చి నాటుకోవచ్చు. పిహెచ్ 4.7 – 7.5 వరకు తట్టుకుంటుంది. లేత మొక్క నీడలో బాగా పెరుగుతుంది. వాణిజ్యపరంగా సాగయ్యే తోటల్లో కొబ్బరి, డ్యూరియన్ చెట్ల నీడన ఈ మొక్కల్ని పెంచుతుంటారు. నాటిన 3–4 ఏళ్లకు కాపు ్రపారంభం అవుతుంది. ఈ చెట్టు 50 ఏళ్ల పాటు హెక్టారుకు 5–15 టన్నుల పండ్ల దిగుబడినిస్తుంది. ఏటా నాలుగు సార్లు పూత వచ్చినప్పటికీ ఏప్రిల్ – అక్టోబర్ మధ్యలోనే పండ్లు వస్తాయి. మొక్కలు 60–70 సెం.మీ. ఎత్తు పెరిగిన 5–7 నెలల తర్వాత నాటుకోవాలి. గుంతలు 40“40“40 సెం.మీ. సైజులో తవ్వాలి. 1.5 “ 3 మీటర్ల నుంచి 2 “ 2 మీటర్ల దూరంలో నాటుకోవాలి. కొమ్మకత్తిరింపు, కలుపు తీత ప్రతి రెండు నెలలకోసారి చేస్తే పూత బాగా వస్తుంది. సరిగ్గా లేని లేదా పాడైన పండ్లను ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. గుత్తికి 20–25 పండ్లు ఉంటే దిగుబడి లాభదాయకంగా ఉంటుంది. సాధారణంగా వర్షాధారంగానే పెరుగుతుంది. కొమ్మ కత్తిరించినప్పుడు, పండ్లు ఎదుగుతున్న దశలో, వేడి సీజన్లలో నీరు అందించాలి. పూత దశలో, పండ్ల కోతకు ముందు రోజుల్లో తగుమాత్రంగా నీరివ్వాలి. ఎక్కువ నీరిస్తే కుళ్లిపోతాయి. వాణిజ్యపరంగా సాగు చేసే తోటల్లో అధిక దిగుబడి కోసం కూలీలతో పోలినేషన్ చేయిస్తారు. పువ్వు గట్టిపడితే పోలినేషన్ సక్సెస్ అయ్యిందని గుర్తు. మెత్తగానే ఉండిపోతే ఫెయిలైనట్లు గుర్తించి తొలగిస్తారు. పండు తగిన సైజు, రంగు వచ్చి, పండుపై ఉన్న సన్నని ముళ్లు ఊడిపోయిందంటే పక్వానికి వచ్చినట్లు గుర్తిస్తారు. పండు 70–80% పండినప్పుడు కూలీలతో పండ్లు కోయిస్తారు. తాజా పండ్ల మార్కెట్లో విక్రయించటంతో పాటు స్నేక్ ఫ్రూట్స్‌ను ఊరగాయ పచ్చడి పెడతారు. సుగర్, ఈస్ట్ కలిపి వైన్ తయారీలో కూడా స్నేక్ ఫ్రూట్స్ వాడుతున్నారు. -
బియ్యం,గోధుమల్లో బలం సగమే, పైగా.. : షాకింగ్ రిపోర్ట్
తిండికి కటకటలాడుతూ ఓడలో ధాన్యం వస్తేనే దేశం ఆకలి తీరే పరిస్థితుల్లో హరిత విప్లవ సాంకేతికత (జిఆర్టి)ల అమలు మన దేశంలో 1960వ దశకంలో ప్రాంరంభమైంది. అధిక దిగుబడినిచ్చే వరి/గోధుమ ఆధునిక వంగడాలు తయారుచేసుకొని వాడుతున్నాం.. నీటి పారుదల, రసాయనిక ఎరువులు, పురుగుమందులతో పంటలు పండిస్తున్నాం.. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు తెల్ల బియ్యం, గోధుమలు అందిస్తున్నది. ఏభయ్యేళు గడచిపోయాక.. వెనక్కి చూస్తే జనం కడుపు నిండుతోంది. కానీ, పోషకలోపం వెంటాడుతోంది. ముందెన్నడూ లేనట్లుగా రోగాలు ముసురుకుంటున్నాయి. దీనికి మూలకారణం ఏమిటో ఓ తాజా అధ్యయనం విడమర్చి చెబుతోంది. ప్రసిద్ధ వంగడాలపైనే అధ్యయనం వరి, గోధుమల్లో పోషకాల స్థాయిని తెలుసుకునేందుకు ఐసిఎఆర్, ఐసిఎంఆర్ పరిశోధన సంస్థల్లో పనిచేస్తున్న నేలల నిపుణుడు డా. సోవన్ దేబనాద్, మరో 11 మంది శాస్త్రవేత్తలతో కలసి విస్తృత పరిశోధనలు చేశారు. డా. సోవన్ ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఐసిఎఆర్– సెంట్రల్ ఆగ్రోఫారెస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త. పశ్చిమబెంగాల్లోని ఐసిఎఆర్– బిధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయ, హైదరాబాద్‌లోని ఐసిఎంఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌కు చెందిన మరో 11 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 1960వ దశకం నుంచి ఐసిఎఆర్ శాస్త్రవేత్తలు 1,199 వరి, 448 గోధుమ, 417 మొక్కజొన్న, 223 జొన్న అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. వీటిల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన (50 లక్షల హెక్టార్ల కన్నా ఎక్కువగా సాగైన) వంగడాల్లో నుంచి ఒక్కో దశాబ్దానికి 2–4 రకాలను ఎంపిక చేసి ప్రత్యేకంగా పండించి మరీ అధ్యయనం చేశారు. జయ నుంచి స్వర్ణ సబ్ 1 వరకు.. ఈ విధంగా ఎంపికచేసిన 16 వరి, 18 గోధుమ రకాలను 2018–2020 మధ్యకాలంలో మూడేళ్ల పాటు సాగు చేశారు. ఎంపికైన వరి రకాల్లో 1960ల నాటి జయ, పంకజ్, 1970ల నాటి ఐఆర్8, స్వర్ణ, రాశి, 1980ల నాటి ఐఆర్ 36, క్షితిశ్, సాంబ మసూరి, లలత్, 1990ల నాటి ఐఆర్ 64, ఖందగిరి, రంజిత్, త్రిగుణ, 2000ల నాటి నవీన్, ప్రతిక్ష్య, స్వర్ణ సబ్ 1 వున్నాయి. గోధుమ రకాల్లో 1960ల నాటి సొనాలిక నుంచి 2010లలో విడుదలైన హెచ్డి–3059 రకాలను ఎంపిక చేశారు. 2009లో విడుదలైన స్వర్ణ సబ్ 1 తర్వాత 5 లక్షల హెక్టార్లకు పైగా సాగైన లాండ్మార్క్ వరి వంగడాలు లేక΄ోవటం వల్ల 2010లలో విడుదలైన ఏ వరి వంగడాన్నీ అధ్యయనం చేయలేదని డా. సోవన్ తెలి΄ారు. వరి విత్తనాలను కటక్‌లోని ఎన్ఆర్ఆర్ఐ నుంచి, గోధుమ విత్తనాలను కర్నల్‌లోని ఐఐడబ్లు్యబిఆర్ల నుంచి సేకరించారు. వీటన్నిటినీ ఒకే రకమైన మట్టి మిశ్రమంతో కూడిన ప్రత్యేక కుండీల్లో సాగు చేశారు. అలా పండించిన తెల్ల బియ్యం, గోధుమ పిండిలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో సరిపోల్చి విశ్లేషించటం ఈ అధ్యయనం లక్ష్యం. 45శాతం తగ్గి పోయిన పోషకాలు మన దేశంలో ప్రజలు రోజువారీ ప్రధాన ఆహారంగా తినే వరి బియ్యం లేదా గోధుమల ద్వారానే రోజుకు అవసరమైన శక్తిలో 50%కి పైగా సమకూరుతుంది. ఈ రెండు ధాన్యాలు గత 50 ఏళ్లలో 45% పోషక విలువలను కోల్పోయినట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు.. గత 50 ఏళ్లలో, వరి బియ్యంలో అత్యవసరమైన పోషకాలైన జింక్ 33%, ఇనుము 27% తగ్గిపోయాయి. గోధుమలో జింక్ 30%, ఇనుము 19% తగ్గిపోయాయి. ఈ సమస్యను ఇప్పటికైనా సరిచేయకపోతే 2040 నాటికి వరి బియ్యం, గోధుమలు తినటానికి పనికిరానంతగా పోషకాలన్నిటినీ కోల్పోతాయని డా. సోవన్ ఆందోళన వ్యక్తం చేశారు. పోషకాలు బాగా తగ్గి΄ోవటంతో పాటు మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. ఈ ధాన్యాల్లో విషతుల్య పదార్థాలు చాలా పెద్ద ఎత్తున పోగుపడటం. ఆర్సెనిక్ (పాషాణం) ఏకంగా 1,493 శాతం మేరకు పెరిగిపోయింది. భార ఖనిజాలతో జబ్బులు ఈ అధ్యయనం మనకు తెలియజెప్తున్నదేమిటంటే.. రోజువారీగా ప్రధాన ఆహారంగా మనం తింటున్న తెల్ల అన్నం, గోధుమ రొట్టెల్లో పోషకాలు సగానికి తగ్గటంతో పాటు ఆరోగ్యానికి హాని చేసే భార ఖనిజాలు మెండుగా చేరాయన్న మాట. షుగర్, బీపీ, గుండె జబ్బులు, ఊబకాయం, కేన్సర్ వంటి అసాంక్రమిక వ్యాధులు పెచ్చుమీరిపోవడానికి వరి, గోధుమల్లో ΄ోషకాలు లోపించటంతో పాటు భార ఖనిజాలు కూడా కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఫాస్ఫరస్, కాల్షియం, సిలికాన్, వనాడియం వంటి పోషకాలు ఎముకల అభివృద్ధికి దోహదం చేస్తాయి. రోగనిరోధక శక్తి, పునరుత్పాదక శక్తికి, నరాల బలానికి జింక్ కీలకం. రక్తవృద్ధికి ఇనుము చాలా ముఖ్యం. రోజూ ఎక్కువ మొత్తంలో తినే ఆహారంలో ఈ పోషకాలు లోపిస్తే నరాల బలహీనత, సంతానలేమి, కండరాలు, ఎముకల క్షీణతకు దారితీస్తుందని నేచర్ పత్రికలో ప్రచురితమైన వ్యాసాల్లో నిపుణులు చెబుతున్నారు. ఆర్సెనిక్, క్రోమియం, బేరియం, స్ట్రాంటియమ్ వంటి విషతుల్య భార ఖనిజాలు ఊపిరితిత్తుల కేన్సర్లు లేదా తీవ్ర శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, హైపర్కెరటోసిస్, కిడ్నీల సమస్యలు, ఎముకల్లో కాల్షియం లోపించటం వంటి జబ్బులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పూర్వం మాదిరిగా జొన్న తదితర చిరుధాన్యాలు తినటం తగ్గిపోవటం, వరి, గోధుమల వినియోగం బాగా పెరిగి΄ోవటం వల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. 1990–2016 మధ్యకాలంలో అసాంక్రమిక వ్యాధులు 25% పెరిగి΄ోయాయని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) నివేదికలు చెబుతున్నాయి. బయోఫోర్టిఫైడ్ వంగడాలతో సమస్య తీరేనా? ధాన్యాల్లో పోషకాల లేమిని అధిగమించేందుకు ఐరన్, జింక్ వంటి పోషకాలు అధికంగా ఉండే బయోఫోర్టిఫైడ్ వంగడాలను రూపొదించటంపై ఐసిఏఆర్ పదేళ్ల క్రితం నుంచే పని ప్రారంభించింది. ఇప్పటికి 142 బయోఫోర్టిఫైడ్ వంగడాలను రూపొందించింది. ఇందులో 124 ధాన్యపు పంటలు. వీటిలో 10 వరి, 43 గోధుమ, 20 మొక్కజొన్న, 13 రకాల కొర్ర వంటి చిన్న చిరుధాన్యాలు, 11 సజ్జ రకాలు ఉన్నాయి. వీటి ద్వారా పోషకాల లోపాన్ని కొంతమేరకు అధిగమించవచ్చన్నది శాస్త్రవేత్తల మాట. దేశవ్యాప్తంగా 6% సాగు భూమిలో ఈ వంగడాలు సాగవుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. సాగు భూమిలో పోషకాలు తగ్గిపోయాయి కాబట్టి ఆహారంలో పోషకాలు తగ్గి పోతున్నాయని ఇన్నాళ్లూ అనుకున్నాం. అయితే, వరి, గోధుమ మొక్కలకు నేలలో ఉన్న పోషకాలను తీసుకునే శక్తి కూడా తగ్గిపోయిందని ఇప్పుడు రూఢి అయ్యింది. ఇంతకన్నా ఆందోళన కలిగించే మరో విషయాన్ని కూడా ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. నేలలో భార ఖనిజాలు వంటి విషతుల్య పదార్థాలను కంకుల్లోని ధాన్యాలకు చేరకుండా ఆపి వేసే సహజసిద్ధమైన విచక్షణా జ్ఞానం మొక్కలకు ఉంటుంది. అయితే, అధిక దిగుబడుల కోసం తయారు చేసిన ఆధునిక వరి, గోధుమ విత్తనాల బ్రీడింగ్ ప్రక్రియల్లో గత ఏభయ్యేళ్లలో చేసిన కీలక మార్పుల వల్ల ఈ పంటల్లో ఆ తెలివి లోపించింది. అందువల్లే ఇప్పుడు వరి బియ్యం, గోధుమల్లోకి ప్రాణాంతక భార ఖనిజాలు అధిక పాళ్లలో చేరుతున్నాయి. వీటిని తిన్న మనుషులకు పోషకాలు లోపించటం వల్ల మాత్రమే కాదు, భార ఖనిజాల వల్ల కూడా రకరకాల జబ్బులొస్తున్నాయని తేలింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, భారతీయ వైద్య పరిశోధనా మండలి సమన్వయంతో అత్యంత కీలకమైన ఈ అధ్యయనం చేయటం విశేషం. గత నవంబర్‌లో ‘నేచర్’ లో ఈ అధ్యయన పత్రం అచ్చయ్యింది. ఇందులోని వివరాలు సంక్షిప్తంగా.. ► గత ఏభయ్యేళ్లలో 45% మేరకు పోషకాలు కోల్పోయిన వరి, గోధుమలు.. ►2040 నాటికి పూర్తిగా తగ్గే ప్రమాదం.. ►అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాల్లో దశాబ్దానికి ఒకటి, రెండు ప్రాచుర్యం ΄పొందిన రకాలపై ఐసిఏఆర్, ఐసిఎంఆర్ సంయుక్త అధ్యయనం ►సాంబ మసూరి, స్వర్ణ సబ్ 1 తదితర 16 రకాల వరి, 18 రకాల ►గోధుమ అధిక దిగుబడి వంగడాలపై అధ్యయనం ►భారఖనిజాల శాతం పెరగటంతో ప్రజారోగ్యానికి ముప్పు ►బయోఫోర్టిఫైడ్ వంగడాలు మేలంటున్న శాస్త్రవేత్తలు నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పిల్లల పెరుగుదల: సరైన పోషకాల స్వీకరణ, ప్రాముఖ్యత
పిల్లల్లో పోషకాహార లోపం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ప్రజారోగ్య సమస్య. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మిలియన్ల మంది పిల్లలు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. బాల్యం వేగవంతమైన వృద్ధి దశలో పిల్లల ఎత్తు బరువు వంటి కీలక మైలురాళ్లు. పిల్లల్లో ఎదుగుదల పోషకాహార లోపం, ఆహారపు అలవాట్లు , శారీరక శ్రమ, వివిధ జీవనశైలి కారకాలతో ముడిపడి ఉంటుంది. స్టన్నింగ్ (వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం) అండర్ వెయిట్ (వయసుకు తగ్గ బరువులేకపోవడం) వేస్టింగ్ (ఎత్తుకు తగ్గ బరువు తక్కువ) లాంటివి కీలక అంశాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 నివేదిక ప్రకారం, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 149 మిలియన్ల మంది పిల్లలు వయసు తగ్గ ఎత్తు ఎదగలేదు. భారతదేశంలో వీరి వాటా దాదాపు మూడింట ఒక వంతు. ఐదేళ్లలోపు వయస్సున్న 40.6 మిలియన్ల మంది పిల్లలు స్టన్నింగ్ కేటగిరీలో నమోదైనారు. సరియైన విజ్ఞానం లేకపోవడం, విద్యాపరమైన విజయాలు, ఉత్పాదకత కోల్పోవడం లాంటివి మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలతో పాటు, ఎదుగుదలపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుంది. ఇది పిల్లల జీవితంలో వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోకుండా నిరోధిస్తుంది. పోషకాహార లోపాలు రోగనిరోధక శక్తి క్షీణించడం, ప్రవర్తనా సమస్యలు, ఎముకల ఆరోగ్యం క్షీణించడం, కండరాల్లో శక్తి లేకపోవడం లాంటి ప్రమాదాలకు దారితీయవచ్చు. పిల్లలు ఎదగడానికి, నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన మైలురాళ్లను చేరుకోవడానికి సరైన పోషకాహారం అవసరమైన పునాదులేస్తాయి. పిల్లలకు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు,కొవ్వుతో పాటు కాల్షియం, విటమిన్ D, విటమిన్ K, అర్జినిన్ వంటి సూక్ష్మపోషకాలతో సహా సరైన మొత్తంలో మాక్రోన్యూట్రియెంట్లు అవసరం. పిల్లల వృద్ధి, ఎగుదలలో పోషకాహార జోక్యం కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ గణేష్ కధే, మెడికల్ అండ్ సైంటిఫిక్ అఫైర్స్, అబోట్ న్యూట్రిషన్ బిజినెస్ తెలిపారు. తల్లిదండ్రులు వివిధ స్థూల పోషకాలు, సూక్ష్మపోషకాలతో కూడిన సమతుల్య పోషకాహారం తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. అబాట్, పోషకాహార లోపం పరిష్కారాల కోసం అబాట్ సెంటర్‌ను ప్రారంభించడంతోపాటు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కృషి చేయనుంది. నిపుణులు, భాగస్వాముల సహకారంతో, పిల్లలతో సహా, ఇతర జనాభా కోసం పోషకాహార లోపాన్ని గుర్తించడం, చికిత్స , నివారించడంపై దృష్టి ఈ కేంద్రం దృష్టి సారిస్తుంది. పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ప్రొఫెసర్ పెడ్రో అలార్కోన్ దీనిపై మరిన్ని వివరాలు అందిస్తూ స్టంటింగ్ పై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పోషకాహారం పాత్రను అర్థం చేసుకొని తల్లిదండ్రులు ఓవర్ నూట్రిషన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి. పోషకాహార సప్లిమెంట్ పానీయాలను సేవించడం ద్వారా పోషకాహార లోపాన్ని పూరించు కోవచ్చు. అవసరమైన విటమిన్లు, ఖనిజాల స్వీకరణలో కూడా దోహద పడతాయి. ఇది పోషకాల స్వీకరణ సామర్థ్యాన్ని పెంచడం లాంటిదే. దీంతో తీసుకున్న ఆహారంలోని శక్తిని పిల్లల శరీరాలు సంపూర్ణంగా స్వీకరిస్తాయని వివరించారు. పిల్లల ఎదుగుదలకు ప్రోటీన్లు, విటమిన్లు మినరల్స్ కీలకం, అయితే కొన్నిసార్లు కాల్షియం, ఐరన్ జింక్ వంటి 50శాతం పోషకాలు మాత్రమే పిల్లవాడు తినే ఆహారం నుండి లభిస్తాయి. కనుక ఈ విషయంలో పోషకాహార సప్లిమెంట్లు ద్వంద్వ పాత్రను పోషిస్తాయి. ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాల శోషణను మెరుగుపరుస్తాయి. ఇటీవలి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సర్వేలో పట్టణ ప్రాంతాల్లో 33.8శాతం మంది పిల్లలు ఉన్నారని తేలిందని సికింద్రాబాద్, యశోద హాస్పిటల్స్ పీడియాట్రిక్స్, నియోనాటాలజీ విభాగాధిపతి DNB పీడియాట్రిక్స్ ప్రోగ్రాం హెడ్ డాక్టర్ డీరమేష్ తెలిపారు. గ్రామీణ తెలంగాణలో 33 శాతం మంది సరైన ఎదుగుదలకు తోడ్పడటానికి, పిల్లలకు ఐదు ఆహార సమూహాల నుండి వచ్చే స్థూల మరియు సూక్ష్మ పోషకాల మంచి మిశ్రమం కూరగాయలు, పండ్లు, ప్రోటీన్, పాల ఉత్పత్తులు, ఇంకా తృణధాన్యాలు వల్ల ఆరోగ్యకరమైన సంపూర్ణ ఎదుగుదలకు అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పిల్లలకు అందేలా తల్లిదండ్రులు ఆహారాన్ని అందించాలి. సమతుల్య ఆహారం, అవసరమైనప్పుడు పోషకాహార సప్లిమెంట్ డ్రింక్స్ లాంటి ఆకర్షణీయమైన కలయికతో పిల్లల అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం తోపాటు, పూర్తి సామర్థ్యాన్ని స్వీకరించే శక్తినిస్తుందని పేర్కొన్నారు. -
భలే.. భలే.. కొబ్బరిపువ్వు
సాక్షి, అమలాపురం: దేవాలయాల్లోనో, శుభకార్యాల్లోనో కొబ్బరి కాయ కొట్టినప్పుడు అందులో పువ్వు కనిపిస్తే మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఆ కొబ్బరి పువ్వు ఇప్పుడు కొంతమంది వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. సాధారణంగా కొబ్బరికాయలోని నీరు ఇంకిపోయాక మొక్క మొలకెత్తే సమయంలో ఈ కొబ్బరిపువ్వు కాయ లోపల తయారవుతుంది. ఈ సమయంలో కొబ్బరికాయను కొడితే లోపల దూదిలా తెల్లగా ఉండే కొబ్బరిపువ్వు ఉంటుంది. దీనిని చాలామంది ఇష్టంగా తింటారు. గతంలో ఇవి కొబ్బరి పంట ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువగా లభించేవి. ఇప్పుడు మహానగరాల్లో కూడా లభిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చెన్నై వంటి నగరాల్లో కొబ్బరి పువ్వుకు మంచి డిమాండ్ ఉంది. ఈ ప్రాంతాలకు గోదావరి జిల్లాల నుంచి ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల ద్వారా రోజూ కొబ్బరి పువ్వు ఎగుమతి అవుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ముంజవరం, ముంగండ, మలికిపురం మండలం రామరాజులంక, పెదతిప్ప, రాజోలు, మామిడికుదురు మండలాలతో పాటు, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, దెందులూరు, పెదవేగి ప్రాంతాల్లో కొబ్బరి పువ్వు ఎక్కువగా లభ్యమవుతోంది. గోదావరి ప్రాంతం నుంచి ఈ వేసవి సీజన్లో రోజుకు 3 వేల నుంచి 5 వేల పువ్వులు హైదరాబాద్‌కు ఎగుమతి అవుతున్నాయి. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకూ రోజుకు 8 వేల నుంచి 10 వేల వరకు ఎగుమతి అవుతాయి. కాయ కన్నా ప్రియం కొబ్బరి పువ్వును వాడుక భాషలో కొబ్బరి గుడ్డుగా పిలుస్తారు. హైదరాబాద్ వంటి నగరాల్లో కొబ్బరి గుడ్డుకు సైజును బట్టి రూ. 30 నుంచి రూ.70 వరకూ ధర ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా చెన్నై, బెంగళూరు మార్కెట్లకు ఈ పువ్వులు ఎగుమతి అవుతున్నాయి. పెద్దసైజు పువ్వులను ఆ మార్కెట్లలో రూ. 100 వరకూ అమ్ముతున్నారు. గోదావరి జిల్లాల్లో కొబ్బరి రైతుల వద్ద నుంచి వ్యాపారులు అన్ సీజన్లో పువ్వు సైజును బట్టి రూ. 4 నుంచి రూ. 9 మధ్యలోనే కొంటున్నారు. అదే సీజన్లో రూ.12 నుంచి రూ.15 వరకూ ధర చెల్లిస్తున్నారు. నీళ్ల కంటే ఎక్కువ పోషకాలు కొబ్బరి నీళ్లు, కొబ్బరి కంటే కూడా కొబ్బరి పువ్వులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పువ్వు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేయడంలో బాగా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, అలసట, నీరసం వంటి సమస్యలను దూరం చేస్తుందని వివరిస్తున్నారు. కిడ్నీ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ డ్యామేజ్ వంటి జబ్బులను నివారించడంలో కొబ్బరి పువ్వు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను దరి చేరకుండా చేస్తాయి. చర్మ సౌందర్యాన్ని సైతం రెట్టింపు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి మంచిది కొబ్బరి పువ్వులో 66 శాతం కార్బోహైడ్రేట్లు, 64 శాతం సాల్యుబుల్ సుగర్స్ ఉంటాయి. ఫైబర్‌తో పాటు మినరల్స్, న్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిని తినడం ఆరోగ్యపరంగా మంచిది. – బి.శ్రీనివాసులు, వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా కేంద్రం అధిపతి, అంబాజీపేట, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గతం కన్నా ఎగుమతులు పెరిగాయి ఐదారేళ్ల క్రితం కొబ్బరి గుడ్డు ఉచితంగా ఇచ్చేవారు. మరీ డిమాండ్ ఉంటే పువ్వు రూపాయి ఉండేది. ఇప్పుడు కొబ్బరి కాయకన్నా ఎక్కువ ధర పలుకుతోంది. ఇటీవల ఎగుమతులు బాగా పెరిగాయి. కోనసీమ నుంచే కాకుండా ఏలూరు నుంచి కూడా ఎగుమతి అవుతోంది. అప్పుడప్పుడు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా హైదరాబాద్‌కు కొబ్బరి గుడ్డు వస్తోంది. – సూదాబత్తుల వెంకట రామకృష్ణ, వ్యాపారి, అంబాజీపేట -
మీకు తెలుసా?
పాలు అనగానే సాధారణంగా గేదెపాలు లేదా ఆవుపాలే అందరికీ తెలుసు. అయితే ఇటీవల గాడిదపాలు, మేకపాలు కూడా కొందరు తాగుతున్నారు. ఇవే కాదు, కొబ్బరిపాలు కూడా ఉన్నాయి. పచ్చికొబ్బరిని కోరి లేదా ముక్కలు చేసి తగినన్ని నీళ్లు చేర్చి రుబ్బి, వడపోయడం ద్వారా కొబ్బరిపాలను తయారు చేయవచ్చు. కొబ్బరిపాలను తాగడం ద్వారా చాల ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాం... ♦ ఆవు పాలకు సమానమైన పోషకాలను కలిగి ఉంటాయి. ♦ యాంటీ వైరల్ గుణాలు సమృద్ధిగా ఉండటంతో రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ♦ శరీరంలో ఏర్పడే ఒత్తిడి తగ్గించడంతో పాటు కీళ్ల నొప్పులకు మందులా పనిచేస్తాయి. ♦ ఫాస్ఫరస్, కాల్షియం వంటి పోషకాలు ఉండడంతో దంతాలు, ఎముకలు బలంగా మారతాయి. మీ పిల్లలు మామూలు పాలు తాగడానికి మొగ్గు చూపనప్పుడు ఒకసారి కొబ్బరిపాలను పట్టించడానికి ప్రయత్నించండి. మంచి ఫలితం ఉంటుంది. -
ఇండియన్ సాల్మన్.. సాగు సక్సెస్..
సాక్షి, అమరావతి: ఇండియన్ సాల్మన్.. మన వాడుక భాషలో ‘మాగ’గా పిలిచే ఈ చేపలను దేశంలో తొలిసారి మన రాష్ట్రంలో సాగుచేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణాజిల్లా నాగాయలంక వద్ద కేజ్ కల్చర్‌లో చేపట్టిన ఈ చేపల సాగు విజయవంతమైంది. దీంతో చెరువుల్లో సాగుచేసే దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు. సముద్రచేపల్లో అత్యంత రుచికరమైన వాటిలో ఇదొకటి. జంతుశాస్త్రపరంగా సాల్మో సాలార్‌గా పిలిచే ఈ చేప మన దేశానికి చెందినది కాదు. పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల్లో పెరిగే ‘సాల్మో నిడ్స్’ సమూహానికి చెందినది. 5 నుంచి 10 అడుగుల లోతులో చల్లటి ఉప్పునీటి జలాల్లో మాత్రమే ఇవి పెరుగుతాయి. ఇవి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సముద్రపునీరు, మంచినీరు కలిసే చోటుకువచ్చి గుడ్లు పెట్టి పొదిగి తిరిగి సముద్ర జలాల్లోకి వెళ్లిపోతాయి. ఇవి 10 కిలోల వరకు పెరుగుతాయి. పొడవుగా, నునుపాటి శరీరంతో ఉండే ఈ చేపకు పైభాగానే చిన్న నల్లటి చుక్కలుంటాయి. కింద భాగం (పొట్ట) తెల్లగా ఉంటుంది. మలేషియా, కువైట్లలో మాత్రమే వీటిని సాగుచేస్తున్నారు. ఈ చేపల తొలి హేచరి మలేషియాలో ఉంది. సముద్ర జలాల్లో సహజసిద్ధంగా దొరకడమే తప్ప.. వీటిసాగుపై ఇన్నాళ్లు దృష్టి పెట్టలేదు. పోషకాలు పుష్కలం.. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఈ చేపల్లో విటమిన్స్, కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, సెలీనియం, అయోడిన్‌కు కొదవలేదు. వారానికి కనీసం రెండుసార్లు తిన్నవారిలో గుండెపోటు, క్యాన్సర్, ట్యూమర్స్ దరిచేరవు. బీపీ తగ్గడమే కాదు.. ఎముకలు బలపడతాయి. నాడీవ్యవస్థ, మెదడు పనితీరు మెరుగుపడడమేగాక జ్ఞాపకశక్తి పెరుగుతుందని, వయసు సంబంధిత నష్టం తగ్గిస్తాయని అధ్యయనాల్లో రుజువైంది. మన దేశంలో మత్స్యకారులకు ఈ చేపలు అరుదుగా దొరుకుతాయి. మార్కెట్‌కు ‘మాగ’ చేప వస్తే చాలు.. ఎంత రేటైనా ఎగరేసుకుపోతారు. వెన్నుముల్లు మాత్రమే ఉండే ఈ చేపను వేపుడు చేసుకునేందుకు ఎక్కువమంది ఇష్టపడతారు. ఇగురు, పులుసు కూడా వండుకుంటారు. రొయ్యలకు ప్రత్యామ్నాయంగా రైతులు ఈ చేపలసాగుపై దృష్టి సారిస్తున్నారు. పెట్టుబడికి రెట్టింపు ఆదాయం దేశంలో తొలిసారి కృష్ణాజిల్లా నాగాయలంక వద్ద సముద్ర జలాల్లో ప్రయోగాత్మకంగా కేజ్ కల్చర్ విధానంలో వీటిసాగు చేపట్టారు. కేజ్ కల్చర్‌లో విజయవంతం కావడంతో చెరువుల్లో సాగుపై దృష్టిసారించారు. కేజ్‌ల్లో అరకిలోకు మించి పెరగవు. అదే నాలుగడుగుల లోతున్న చెరువుల్లో 8–12 నెలలు పెంచితే కిలో నుంచి రెండుకిలోల వరకు పెరుగుతాయి. సీ మౌత్‌లో దొరికే సీడ్‌ను నర్సరీ చెరువులో మూడంగుళాల సైజు వరకు పెంచి తర్వాత ఎకరా చెరువులో రెండువేల పిల్లల వరకు వేయవచ్చు. 45 శాతం ప్రొటీన్లు, 12 శాతం కొవ్వు పదార్థాలు కలిగిన మేత వేస్తే చాలు. వ్యాధి నిరోధకశక్తి అధికం కాబట్టి వ్యాధులకు కూడా దూరంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ధర కిలో రూ.450కి పైగా పలుకుతోంది. కిలోకి రూ.225 వరకు పెట్టుబడి అవుతుంది. రెట్టింపు ఆదాయం వస్తుంది. ఈ చేపల సాగుపై లోతైన అధ్యయనం చేసి రైతులను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తొమ్మిదేళ్లు శోధించా కొన్నేళ్లుగా కేజ్‌కల్చర్‌లో పండుగప్ప సాగుచేస్తున్నా. ఇండియన్ సాల్మన్ సాగుచేయాలని తొమ్మిదేళ్ల నుంచి ఎంతో లోతుగా అధ్యయనం చేసి ఇటీవలే ప్రయోగాత్మకంగా చేపట్టా. సీ మౌత్‌లో పిల్లలను సేకరించి వేశా. పోషక విలువలున్న మేత అందిస్తున్నా. నాలుగు నెలల్లో పావుకిలో సైజు పెరిగాయి. మరో మూడునెలలు పెంచితే ముప్పావు కిలోవరకు వస్తాయి. రూ.లక్షన్నర వరకు పెట్టుబడి అవుతుంది. రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నా. చెరువుల్లో సాగుకు ఎంతో అనుకూలమైన ఈ చేపల సాగుపై రైతులు దృష్టిసారిస్తే మంచిది. – తలశిల రఘుశేఖర్, నాగాయలంక, కృష్ణాజిల్లా -
వెదురు.. పోషకాల సిరులు
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదం చేసే వెదురు నిలువెల్లా పోషకాలతో మానవాళికి ఆరోగ్య సిరులనూ అందిస్తోందని పరిశోధనల్లో తేలింది. ఇతర వృక్ష జాతుల కంటే 35 శాతం అధికంగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ఈ పచ్చ బంగారం దీర్ఘకాలిక రోగుల పాలిట ఆరోగ్య ప్రదాయినిగా మారుతోందని వెల్లడైంది. అరుదుగా దొరికే వెదురు బియ్యంతో పాటు టీ పౌడర్ వంటి ఉత్పత్తులు ఆన్లైన్ మార్కెట్లో అందుబాటులో ఉండగా.. ఇతర ఉత్పత్తులు అటవీ ప్రాంతాల్లో విరివిగా లభిస్తున్నాయి. 50 ఏళ్లకు వెదురు బియ్యం వెదురు మొక్కకు 50 ఏళ్లు నిండాక కంకులు వేసి (పుష్పించి).. వాటిలోంచి ధాన్యం మాదిరిగా వెదురు వడ్లు కాస్తాయి. వాటి నుంచి వెదురు బియ్యాన్ని సేకరిస్తారు. అంటే.. ఒక్కో వెదురు చెట్టు 50 ఏళ్ల వయసులో ఒకసారి మాత్రమే 1–2 కిలోల బియ్యం వరకు ఇస్తుంది. ఈ బియ్యంతో అన్నం, పాయసం, పొంగలి వంటి వంటకాలు చేసుకోవచ్చు. వీటిని వినియోగించడం వల్ల వెన్నునొప్పి, కీళ్ల నొప్పులతో పాటు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుందని అధ్యయనాల్లో వెల్లడైంది. వీటిలో తక్కువగా ఉండే గ్‌లెసైమిక్ ఇండెక్స్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అధికంగా ఉండే ఐరన్, ఫాస్ఫరస్ వంటి మూలకాలు గుండెకు మేలు చేస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. ఈ బియ్యంలో కాల్షియం, భాస్వరం, ఇనుము, వీటిలో మాంసకృత్తులు, విటమిన్ బీ–6, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల్ని దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. మన రాష్ట్రంలో బుట్టాయగూడెం, పోలవరం, అరకు, పాడేరు, సీలేరు, నల్లమల అటవీ ప్రాంతాల్లో వెదురు బియ్యం దొరుకుతుంటాయి. ఆదివాసీల నుంచి సేకరించే వెదురు బియ్యాన్ని ఆన్లైన్ ద్వారా ఈ–కామర్స్ సంస్థలు వినియోగదారులకు విక్రయిస్తున్నాయి. రెమ్మ రెమ్మకో రోగం దూరం వెదురు రెమ్మలు ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి. వెదురు మొలకలు (వెదురు దుంప నుంచి మొలకెత్తేవి), రెమ్మలు, చిటారు కొమ్మన కనిపించే చిగుళ్లతో వివిధ వంటకాలను తయారు చేసుకోవచ్చు. వీటిని నేరుగానూ తినేయొచ్చు. ఇటీవల కాలంలో సూప్‌లలో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. తాజా పిలకలు, చిగుళ్లతో ఊరగాయలు తయారు చేస్తున్నారు. వెదురు రెమ్మల్ని తింటే గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చని కార్డియాలజిస్టులు సైతం సిఫార్సు చేస్తున్నారు. వీటిలో క్యాన్సర్ నిరోధక, యాంటీ బయాటిక్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ధమనులను శుభ్రం చేయడం, చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సహాయపడతాయి. వీటి పిలకలతో ఊబకాయం దూరం వెదురు పిలకలు, చిగుళ్లతో చేసిన వంటకాలను తినడం ద్వారా ఊబకాయానికి దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. వర్షకాలంలో ప్రతి మొక్కకు 4 నుంచి 10 పిలకల వరకు వస్తాయి. వెదురు పిలకలను ఉడికించి వంటల్లో ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో 2–3 రోజుల పాటు నానబెట్టి పచ్చడి చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో ఊరగాయగా వాడుతుంటారు. పిలకల్లో పిండి పదార్థాలు, ప్రోటీన్లతో పాటు కాపర్, ఐరన్, పాస్ఫరస్, పొటాషియం వంటి మూలకాలు, రిబోప్లేవిన్, విటిమిన్ ఏ, కే, ఈ, బీ–6 పుష్కలంగా ఉంటాయి. వీటిలో లభించే పైటోప్టెరాల్స్, పైటో న్యూట్రియంట్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు ఆరోగ్యాన్నిస్తాయి. వెదురు బియ్యం చాలా రుచి వెదురు బియ్యం చాలా అరుదుగా లభిస్తాయి. మా ఇంట్లో అప్పుడప్పుడూ ఈ బియ్యం వాడుతుంటాం. ఆన్లైన్ మార్కెట్లో లభిస్తున్నాయి. రుచికరంగా ఉంటాయి. మధుమేహ రోగులకు ఎంతో మేలు చేస్తాయి. మైదాన ప్రాంతాల్లో వెదురు విస్తరణను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందున భవిష్యత్‌లో వెదురు ఉత్పత్తులు విరివిగా దొరికే అవకాశం ఉంది. – తమ్మినేని రాఘవేంద్ర, డైరెక్టర్, ఏపీ మేదరి కార్పొరేషన్ 20 హెక్టార్లలో వెదురు సాగు చేస్తున్నా నేను ఏజెన్సీ ప్రాంతంలో 20 హెక్టార్లలో వెదురు సాగు చేస్తున్నా. ఏజెన్సీ సంతల్లో వెదురు బియ్యం దొరుకు తాయి. వెదురు పిలకలు, చిగుళ్లు, రెమ్మలతో చేసే వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయి. – నారాయణ, రైతు, పాడేరు వెదురు ఉప్పు.. బహుప్రియం సుమీ! వెదురు ఉప్పు కొరియాలో ఎక్కువగా వాడతారు. అందుకే దీన్ని కొరియన్ సాల్ట్ అని పిలుస్తారు. మూడేళ్ల వయసున్న వెదురును సేకరించి.. వాటిని సమానంగా కత్తిరించి.. అందులో సముద్రపు ఉప్పు నింపి బాగా కాలుస్తారు. ఈ క్రమంలో వెదురు నుంచి వెలువడిన ద్రవాలు ఉప్పుతో కలుస్తాయి. ఇలా తొమ్మిదిసార్లు చేస్తే ఉప్పు ఊదా రంగులోకి మారుతుంది. అందుకే దీన్ని ‘పర్పుల్ సాల్ట్’ అని కూడా పిలుస్తుంటారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన లవణాలలో ఇదొకటి. దీని ధర పావు కిలో రూ.8 వేలపై మాటే. వంటంతా అయ్యాక.. చివరగా ఫినిషింగ్ సాల్ట్‌గా వాడే వెదురు ఉప్పులో క్యాన్సర్‌ను నిరోధించే గుణాలూ ఉన్నాయంటారు. చర్మ, దంత సౌందర్యానికి ఉపకరిస్తుంది. వెదురు(లేత) కొమ్ములను పౌడర్ రూపంలో మార్చి వంటకాల్లో వాడుతుంటారు. -
మీరు తినే ఆహారంలో పోషకాలెన్ని? విష రసాయన అవశేషాలతో భద్రం!
ఆహారమే ఔషధం అనే రోజులు పోయి, ఆహారమే రోగకారకమైన రోజులు వచ్చాయి. ఆహారం కంటి నిండా, చేతి నిండా, గోదాముల నిండా వుంది. కానీ, అందులో పోషకాలు మాత్రం అంతకంతకూ అడుగంటి పోతున్నాయి. అరకొర పోషకాలతో పాటు విష రసాయన అవశేషాలు అదనం. వెరసి, ఇప్పుడు మనకు అన్ని విధాలా అనారోగ్యకారకమైన ఆహారం అత్యాధునిక రూపాల్లో పుష్కలంగా అందుబాటులో వుంది! ఏదో ఒక ఆహారం పండిస్తే చాలు ఆకలి తీరుతుంది అనుకున్నాం. ఎక్కువ దిగుబడి తెస్తే చాలనుకుంటూ బోల్తా పడ్డాం. వినాశకర సేద్యంతో భూముల్ని సర్వ నాశనం చేసుకున్నాం. జీవం లేని ఆ నేలల్లో పండించుకుంటున్న అరకొర పోషకాల కెమికల్ తిండితో ఇదే ప్రాప్తమనుకొని సరిపెట్టుకుంటున్నాం. ఆహారంలో 18 పోషకాలు ఉన్నాయని ఐరాసకు చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ చెబుతోంది. అయితే, రసాయన వ్యవసాయంలో పండించిన పంటలో పోషకాల సాంద్రత, సమతుల్యత లోపించి ప్రజలు రోగాల పాలవుతున్నారు. క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వంటి రోగాల పంట పండించుకొని తింటున్నాం. కొని తెచ్చుకొని జీవితాంతం నెత్తిన మోస్తున్నాం. ఈ విపత్కర ఆహార ఆరోగ్య పర్యావరణ విధ్వంసక దుస్థితి నుంచి బయటపడే మార్గం ఉందా? సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తిరిగి అందరికీ అందుబాటులోకి తెచ్చుకోగలమా? ఈ ప్రశ్నలన్నిటికీ ‘అవును. ప్రకృతి వ్యవసాయంతో ఇది ముమ్మాటికీ సాధ్యమే! ఇంకా చెయ్యి దాటిపోలేదంటూ’ శుభవార్త చెబుతున్నారు నిపుణులు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారోత్పత్తుల్లో 50కి పైగా పోషకాలు వుంటాయని, రసాయనాలతో పండించిన ఆహారంలో కన్నా ఈ సహజాహారంలో పోషకాల సాంద్రత రెండు రెట్లు ఎక్కువగా వుంటుందని సూచిస్తున్నారు. ∙∙ ప్రపంచ జనాభా 798 కోట్లు. ప్రజలందరికీ అవసరమైన దానికన్నా ఎక్కువగానే ఇప్పుడు తిండి గింజలు పండించుకుంటున్నాం. గోదాములు కిటకిటలాడుతున్నాయి. ఆ మేరకు ఆహార భద్రత వుంది. అయితే పేదరికం వల్ల అందరికీ ఆహారం అందటం లేదు. దాదాపు 310 కోట్ల మందికి నాణ్యమైన ఆహారం తినే ఆర్థిక స్థోమత లేదు. మరో 82.8 కోట్ల మంది నిరుపేదలు అనుదినం అర్ధాకలితో ఈసురో మంటున్నారు. సామాజిక, ఆర్థిక అసమానతలతో సతమతం అవుతున్న వీరి సంగతి అటుంచితే, పుష్కలంగా ఆహారం తింటున్నప్పటికీ ఆహార సంబంధమైన జబ్బుల పాలవుతున్నవారు చాలామంది వున్నారు. ఈ సమస్యనే ‘హిడెన్ హంగర్’ అంటారు. ‘హిడెన్ హంగర్’ మూలంగా 200 కోట్ల మంది క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, ఆటో ఇమ్యూన్ డీసీజెస్ వంటి ప్రాణాంతక జబ్బుల పాలవుతున్నారని ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఏ.ఓ.) అంచనా. అంతేకాదు, ప్రతి 8 మందిలో ఒకరు స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఈ సమస్య ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ అంతకంతకూ పెరుగుతోంది. గత ఏడు దశాబ్దాల్లో మన ఆహారంలో విటమిన్లు, పోషకాల సాంద్రత అడుగంటడమే ఇందుకు మూల కారణమని ఎఫ్.ఏ.ఓ. అధినేత క్యూ డోంగ్యు వాపోయారు. ఇప్పటి పండ్లు, కూరగాయలు, ధాన్యాలు దశాబ్దాల క్రితం పెరిగిన వాటి కంటే తక్కువ ప్రోటీన్, కాల్షియం, భాస్వరం, ఇనుము, రిబోఫ్లావిన్, విటమిన్ సి కలిగి ఉన్నాయని అనేక శాస్త్రీయ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. అందువల్ల, మనం తింటున్న ఆహారంలో ఆరోగ్యం ఎంత? పోషకాల సాంద్రత ఎంత? అన్నవే ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఇప్పుడు చర్చనీయాంశాలయ్యాయి. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. ఇది పూర్వకాలపు మాట. ఇప్పటి ఆహారంలో క్యాలరీలు ఉంటున్నాయి గానీ పోషకాల సాంద్రత, సమతుల్యత లోపించాయి. ఇప్పటికి ఆకలి తీర్చుతూనే మనల్ని రోగగ్రస్తులుగా మారుస్తోంది. ప్రసిద్ధ సాయిల్ ఎకాలజిస్ట్ డాక్టర్ క్రిస్టీన్ జోన్స్ (ఆస్ట్రేలియా) చెప్తున్నదేమంటే, 1940లో తిండి పదార్థాల్లో వున్నన్ని పోషకాలు ఇప్పుడు మనం పొందాలంటే మాంసం అయితే ఎప్పటికన్నా రెట్టింపు తినాలి. పండ్లయితే మూడింతలు, కూరగాయలైతే ఏకంగా నాలుగైదు రెట్లు తినాల్సిన దుస్థితి నెలకొంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో రొడేల్ ఇన్స్టిట్యూట్ 70 ఏళ్లుగా సేంద్రియ, రసాయన సేద్యం, ఆహారంలో వస్తున్న మార్పులపై తులనాత్మక పరిశోధన చేస్తోంది. ‘పారిశ్రామిక వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా నేలలను క్షీణింపజేసింది. సంకుచిత దృష్టితో దిగుబడుల పెంపుదల గురించి మాత్రమే సాగు చేస్తున్నారు. పోషకాలపై దృష్టి లేదు. ఈ రోజు మనం తినే ఆహారంలో అర్ధ శతాబ్దం క్రితం పండించిన ఆహారం కంటే తక్కువ ప్రోటీన్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, రిబోఫ్లావిన్, విటమిన్–సి ఉన్నాయ’ని రొడేల్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. మనుషులు 1950కు ముందు కన్నా ఇప్పుడు దీర్ఘకాలం జీవిస్తున్నారు, అయితే ఆహారంలో పోషకాల సాంద్రత బాగా తగ్గిపోవటంతో జీవన నాణ్యత తగ్గిపోయింది. క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, ఆటో ఇమ్యూన్ డీసీజెస్ వంటి జబ్బులు పెచ్చరిల్లటానికి రసాయనిక పురుగుమందుల అవశేషాలతో పాటు పోషకాల సాంద్రత తగ్గిపోవటం కూడా ఓ ముఖ్య కారణం. ఈ జబ్బులతో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 71% మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని పేర్కొంది రొడేల్ ఇన్స్టిట్యూట్ కార్యనిర్వాహక సంచాలకుడు జాన్ మేయర్ అన్నారు. ఆహారం రోగ కారకంగా ఎలా మారింది? ఆహార సమస్య మూలాలను అర్థం చేసుకోవాలంటే భూమి లోపలికి తొంగి చూడాల్సిందే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ భూముల్లోకి రసాయనిక ఎరువులు, పురుగు/ తెగుళ్లు/ కలుపు మందులు వచ్చి చేరాయి. అవి ఆహారం గుణగణాలను, స్వరూప స్వభావాలను గుణాత్మకంగా మార్చేశాయి. పంట భూములను విష రసాయనాలతో నింపేయటం మొదలు పెట్టిన తర్వాత మట్టిలో సహజ సేంద్రియ పోషక వ్యవస్థ నాశనమవ్వటం ప్రారంభమైంది. నేల ఉత్పాదక శక్తిని కోల్పోయింది. మొక్కలకు, తద్వారా మన ఆహారానికి పోషకాలు అందించే శిలీంద్రాలు, సూక్ష్మజీవులు, వానపాములు సహా జీవ పర్యావరణ వ్యవస్థ అంతా నిర్జీవం అయిపోయింది. సహజసిద్ధంగా పోషకాలు పంటలకు అందే మార్గం బాగా పరిమితం అయిపోయింది. రసాయనిక వ్యవసాయం చేసే భూముల్లో మట్టి గట్టి పడిపోతుంది. పంట మొక్కల వేర్లు 10–20 సెంటీమీటర్ల వరకే చొచ్చుకు వెళ్ళ గలుగుతాయి. ఆ మేరకు పోషకాల లభ్యత కూడా తగ్గిపోతుంది. రసాయనిక ఎరువుల ద్వారా నత్రజని, భాస్వరం, పొటాష్‌తో పాటు అతికొద్ది రకాల పోషకాలను మాత్రమే అందిస్తుండటంతో.. ఆ పొలాల్లో పండిన పంట దిగుబడుల్లో పోషకాల సమగ్రత లోపించింది. ప్రాకృతిక పుష్కలత్వం నుంచి రసాయనిక పరిమితత్వంలోకి వ్యవసాయం దిగజారిపోయింది. ఈ పరిణామమే మన ఆహారాన్ని అతికొద్ది రకాల పోషకాలకే పరిమితం చేసేసింది. ఆలా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో మన ఆహారం ‘అరకొర పోషకాల’తో పోషకాల సమగ్రత, సమతుల్యతను కోల్పోయింది. మూలిగే నక్క మీద తాటి పండు మాదిరిగా రసాయనాల అవశేషాలు కూడా తోడవటంతో.. అమృతాహారం ‘రోగకారక ఆహారం’గా మారిపాయింది. ఎఫ్.ఏ.ఓ. సమాచారం ప్రకారం.. ప్రకృతిలో 92 రసాయన మూలకాలు ఉంటాయి. మొక్కలకు భూమి నుంచి 15 (6 స్థూల, 9 సూక్ష్మపోషకాలు) అందుతున్నాయి. మరో మూడింటిని మొక్కలు వాతావరణం నుంచి గ్రహిస్తున్నాయని ఎఫ్.ఏ.ఓ. చెబుతోంది. గత 70 ఏళ్లలో ఆహారంలో విటమిన్లు, పోషకాల సాంద్రత బాగా తగ్గిందని కూడా సెలవిచ్చింది. సహజాహారంలో 50+ పోషకాలు అడవిలో లేదా ప్రకృతి వ్యవసాయం ద్వారా పునరుజ్జీవింపజేసిన భూముల్లో పండించిన ఆహారోత్పత్తుల్లో రసాయనిక సేద్యంలో పండించిన ఆహారంలో కన్నా పోషకాల సాంద్రత రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆస్ట్రేలియాకు చెందిన ప్రసిద్ధ సాయిల్ మైక్రోబయాలజిస్ట్, రీజెనెరేటివ్ అగ్రికల్చర్ నిపుణుడు డాక్టర్ వాల్టర్ ‘సాక్షి’కి ఇచ్చిన జూమ్ ఇంటర్వ్యూలో తెలిపారు. రసాయన వ్యవసాయ భూమి బండబారి ఉంటుందని, సీజనల్ పంట మొక్కల వేర్లు 10–20 సెంటీమీటర్ల కన్నా లోతుకు వెళ్ళలేవని అన్నారు. ప్రకృతి వ్యవసాయ భూముల్లో పంటల వేర్లు 2 మీటర్ల వరకూ చొచ్చుకు వెళ్లగలవు. ఆ మేరకు పోషకాల సాంద్రతతో పాటు ఉత్పాదకత కూడా పెరుగుతాయి. ఈ ఆహారంలో సుమారు 50కి పైగా పోషకాలు ఉంటాయి. చాలా సూక్ష్మపోషకాలు అతి తక్కువ పాళ్లలోనే ఉన్నప్పటికీ.. పోషకాల సమతుల్యత, సమగ్రతలో ఇవి చాలా కీలకం అన్నారాయన. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారంలో వున్న పోషకాలలో మూడింట ఒక వంతు కన్నా తక్కువ పోషకాలు మాత్రమే రసాయన వ్యసాయంలో పండించిన ఆహారంలో వుంటాయని పరిశోధనల్లో తేలిందన్నారు డాక్టర్ వాల్టర్. రసాయనాలు వేయని ప్రకృతి వ్యవసాయ భూమిలో సేంద్రియ కర్బన నిల్వలతో కూడిన వ్యవస్థ (సాయిల్ ఆర్గానిక్ స్పాంజ్) ఏర్పడుతుంది. సహజ పోషక పునర్వినియోగ చక్రం పునరుద్ధరణకు ఇదే మూలం. 98% పోషకాలు దీని ద్వారానే పంట మొక్కలకు అందుతాయి. శిలీంద్రాలు, సూక్ష్మజీవుల పాత్ర కీలకం ఆహారంలో పోషకాల సాంద్రత ఒక్కటే కాదు.. ఆ పోషకాలు తగిన నిష్పత్తిలో సమతుల్యంగా ఉండటం అతి ముఖ్యమైన విషయం. ఏయే పోషకాన్ని ఎంత నిష్పత్తిలో స్వీకరించాలో ఎంపిక చేసుకునే సెలెక్టివ్ మెకానిజం సజీవమైన భూమిలో శిలీంద్రాలు, సూక్ష్మజీవుల వ్యవస్థకు ఉంటుంది. శిలీంద్రపు పోగులు తమ ఆహారపు అవసరాల కోసం చేసే ఈ పని వల్ల మొక్కల వేర్లకు కూడా పోషకాలు సమతుల్యంగా అందుతాయి. సాధారణంగా మట్టిలో వుండే ముడి పోషకాలను నేరుగా మొక్కల వేర్లు తీసుకోలేవు. అందుకే వీటి రూపం మార్చి వేర్లకు అందించేందుకు ప్రకృతిలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటైంది. సకల పోషకాలను అందించే ఈ పని మైకోరైజా వంటి ఇంటెలిజెంట్ శిలీంద్రాలకు, అశేష సూక్ష్మజీవ రాశి, వానపాములకి ప్రకృతి అప్పగించింది. చదరపు మీటరుకు 25 వేల కిలోమీటర్ల పొడవున విస్తరించి వుండే శిలీంద్రపు పోగులు, సూక్ష్మజీవులు, వానపాములు ఈ బృహత్ కార్యం చేస్తూ ఉంటాయి. ఈ సహజ జీవరసాయన ప్రక్రియల ద్వారా మొక్కల వేర్లకు సకల పోషకాలు అందుతాయి. శిలీంద్రాలు, సూక్ష్మజీవరాశులు చేసే ఈ సేవకు మొక్కలు ప్రతిసేవ చేస్తాయి. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తాము తయారుచేసుకున్న పోషక ద్రవం (సుగర్స్)లో నుంచి 30–40 శాతాన్ని వేర్ల ద్వారా మట్టిలోకి జారవిడుస్తూ ఉంటాయి. ఈ సుగర్స్‌ను సూక్ష్మజీవులు, శిలీంద్రాలు తీసుకుంటూ మనుగడ సాగిస్తాయి. ఈ సుగర్స్‌ను ‘రూట్ ఎక్సుడేట్స్’ అంటారు. మొక్కలు తయారు చేసుకునే పోషక ద్రవాహారంలో ఇంకో 30% కాండం, ఆకులు, గింజలు, కాయలు, పూల పెరుగుదలకు.. మిగతా 30%ని వేరు వ్యవస్థ పెరుగుదలకు చెట్లు, మొక్కలు ఉపయోగిస్తాయి. మన ఆహారంలోనూ తగ్గుతున్న పోషకాలు సీఎస్ఏ అధ్యయనంలో వెల్లడి ఆహారోత్పత్తుల్లో పోషకాల సాంద్రత బాగా తగ్గటం, సాగు భూములు నిస్సారం కావడానికి మధ్య సంబంధం వుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామమే మన దేశంలో కూడా జరుగుతున్నట్లు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సుస్థిర వ్యవసాయ కేంద్రం నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. మన దేశంలో ఆహారోత్పత్తుల్లో పోషకాలపై జాతీయ పోషకాహార సంస్థ (ఎన్.ఐ.ఎన్.) 1987, 2017 సంవత్సరాల్లో వెలువరించిన ఇండియన్ ఫుడ్ కంపోజిషన్ టేబుల్స్ ఆధారంగా ప్రధానంగా ఈ అధ్యయనం చేశారు. ఈ 30 ఏళ్ళ కాలంలో శక్తి, రిబోఫ్లావిన్, నియాసిన్ భారీగా తగ్గాయి. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, ప్రోటీన్, థయామిన్ తదితర పోషకాల్లో కూడా తగ్గుదల కనిపించింది. వ్యవసాయంలో రసాయనాల వాడకం వల్ల ఆహారంలో పోషకాలు తగ్గుతున్న సంగతిని గుర్తించి పాలకులు, పరిశోధన సంస్థలు విధానాల రూపకల్పనలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీవీ రామాంజనేయులు అన్నారు. ఈ అధ్యయనం వివరాలు ఇండియన్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో ప్రచురితం అయ్యాయి. జన్యుమార్పిడితో పోషకాల సమతుల్యతకు భంగం రెండో ప్రపంచ యుద్ధానికి ముందు స్థాయితో పోల్చితే ఆహారంలో ఇప్పుడు మూడో వంతు పోషకాలు మాత్రమే మిగిలాయి. జన్యుమార్పిడి వంటి టెక్నాలజీల ద్వారా ఎక్కువ ఇనుము, మాంగనీస్ వాటి పోషకాలను టొమాటోల్లోకి జొప్పించటం వల్ల ప్రయోజనం ఉండదు. అందులో పోషకాల సమతుల్యతకు భంగం కలగవచ్చు. కాబట్టి మనుషుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించటానికి ఇది సహాయం చేయదు. సమస్యలకు దగ్గరి దారిలో పరిష్కారం వెతికే క్రమంలో సహజ సమతుల్యతలకు భంగం కలిగిస్తున్నాం. ఆ క్రమంలో మరిన్ని సమస్యలను సృష్టిస్తున్నామని మనం గుర్తించాలి. బియ్యానికి అదనపు ఇనుము జోడించి గోల్డెన్ రైస్ తయారు చేస్తున్నారు. ఈ విధంగా అదనపు పోషకాలను కృత్రిమంగా జోడించడం వలన సహజ ఆహారంలో మాదిరిగా పోషకాల సమగ్రతను గానీ, పోషకాల మధ్య కూర్పును గానీ, సమతుల్యతను గానీ సాధించలేం. ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ ద్వారా చాలా సమయాన్ని, చాలా శ్రమను వృథా చేసుకుంటున్నాం. ఈ శక్తి యుక్తులను ప్రకృతి వ్యవసాయాన్ని సర్వవ్యాప్తం చేసే దిశగా ఖర్చు చేయటం మేలు. ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయ, రసాయనిక వ్యవసాయాల ద్వారా పండించిన ఆహారోత్పత్తుల మధ్య వ్యత్యాసాన్ని అంచనా వేసేటప్పుడు వాటి బరువును బట్టి కాకుండా వాటి పోషకాల సమగ్రతను, వాటి ఆరోగ్యపరమైన విలువను గుర్తించాలి. మనం తినే ఆహారంలోని పోషకాల సమగ్రతపైనే మన దేహంలో జరిగే జీవ రసాయన ప్రక్రియలు, రోగ నిరోధక శక్తి 90 శాతం వరకూ ఆధారపడి ఉంటుంది. – డాక్టర్ వాల్టర్ యన, ప్రసిద్ధ సాయిల్ మైక్రోబయాలజిస్ట్, రీజెనరేటివ్ అగ్రికల్చర్ నిపుణుడు, ఆస్ట్రేలియా ఔషధ గుణాలు ఎలా వచ్చాయి? సహజ ఆహారానికి ఔషధ గుణాలు ఎలా వస్తాయి అనేది ఆసక్తికరమైన ప్రశ్న. ప్రకృతిసిద్ధంగా పెరిగే పంటల ఆహారంలో ఏయే పోషకాలు ఏయే నిష్పత్తిలో ఉండాలో ఎంపిక చేసే ఇంటెలిజెంట్ శిలీంద్ర వ్యవస్థ ఉంటుందని తెలుసుకున్నాం కదా! చాలా ముఖ్యమైన ఇంకో విషయం ఏమిటంటే, మట్టిలో నుంచి పోషకాలను సమతుల్యంగా ఎంపిక చేసి సంగ్రహించటంతో పాటు (అల్యూమినియం, లెడ్ వంటి హెవీ మెటల్స్) హానికరమైన విషతుల్యాలను గుర్తించి పక్కనపెట్టేసే విజ్ఞతతో కూడిన నాణ్యత నియంత్రణ శక్తి కూడా శిలీంద్ర వ్యవస్థకు ఉంది. ఈ కారణంగానే పూర్తిగా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించినప్పుడు ఆ ఆహారం పోషకాల సాంద్రత, సమగ్రత, సమతుల్యతలతో పాటు ఔషధ గుణాలనూ కలిగి సంతరించుకుంటుంది. ఈ ఆహారంలో క్యాన్సర్ కణాలను మట్టుబెట్టే సెలీనియం ఉంటుంది. అందుకే ఆర్గానిక్ ఆహారాన్ని ‘డిసీజ్ ప్రివెంటెటివ్ ఫుడ్’ అని వ్యవహరిస్తున్నారు. సాగు భూముల్లో సేంద్రియ కర్బనం 0.5%–03%కి తగ్గిపోయింది. ఇప్పటికే 33% వ్యవసాయ భూమి వ్యవసాయ యోగ్యం కాకుండా పోయింది. దీనికి మూలం రసాయనిక సేద్యమే. పాలకులు, ప్రజలు ఇప్పటికైనా మేల్కొని భూముల్ని పునరుజ్జీవింపజేసే ప్రకృతి సేద్యం వైపు మళ్లితే ఆహారం పోషకాల సాంద్రతను, సమతుల్యతను మళ్ళీ సంతరించుకుంటుంది. పనిలో పనిగా భూతాపోన్నతిని కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 60% మంది ప్రజలు ఇంకా గ్రామాల్లో నివసించే భారత్ వంటి దేశాలకు పునరుజ్జీవ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లటం సులభమని డాక్టర్ వాల్టర్ అంటున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని అనుభవం వున్న రైతుల ద్వారా మిగతా రైతులకు నేర్పించటంలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రగతి సాధిస్తోంది. కొన్నేళ్లలోనే రాష్ట్రంలో పొలాలన్నీ ప్రకృతి సేద్యంలోకి మారిపోయి పోషకాల సాంద్రతతో కూడిన అమృతాహారాన్ని ప్రజలకు అందించే సుదినం రానుంది. పోషకాల సాంద్రత, సమగ్రత సాధన కృషిలో దేశీ వంగడాలు, సిరిధాన్యాలకున్న ప్రాధాన్యాన్ని కూడా గుర్తించటం అవసరం. పర్యావరణ అనుకూల వ్యవసాయ, పోషకాహార, ఆరోగ్య గొలుసును పునర్నిర్మించుకోవటానికి ‘ప్రకృతిని తిరిగి తలదాల్చటం’ తప్ప ఏ ఇతర ఖరీదైన అత్యాధునిక ఉపకరణలూ, టెక్నాలజీలూ అక్కరలేదని కూడా అనుభవాలు తెలియజెపుతున్నాయి. ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ సందర్భంగా మన భూముల్ని, మన ఆహారారోగ్యాలను తిరిగి సుసంపన్న పోషకవంతంగా మార్చుకోవటానికి పునరంకితమవుదాం. – పంతంగి రాంబాబు -
సీతా ఫలంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
రాయదుర్గం(అనంతపురం జిల్లా): ఎరువులు వేయాల్సిన పనిలేదు. సాధారణ పంటల్లా నీరు కట్టాల్సిన అవసరం లేదు. రేయింబవళ్లూ కాపలా ఉండాల్సిన అవసరం అంత కంటే ఉండదు. కేవలం సహజసిద్ధంగా, కొంత వర్షం వచ్చిందంటే వాటంతట అవే కాసేస్తాయి. పేదోళ్లకు ఉన్నంతలో పోషకాలందించడమే కాకుండా జీవనోపాధిని కూడా కల్పిస్తున్నాయా పండ్లు. ఇంతటి ప్రఖ్యాతి గాంచిన ఫలరాజసాలు సీతాఫలాలు. చదవండి: ఏపీలో మరో భారీ సంక్షేమ పథకం.. అక్టోబర్ 1 నుంచి అమలు అదనులో వర్షాలు కురవడం.. కొండ ప్రాంతాలన్నీ నందనవనాలను తలపించడం వెరసి సీతాఫలాలు విరగ్గాశాయి. కాయలు పక్వానికి రావడంతో కోతలు మొదలు పెట్టిన వ్యాపారులు మార్కెట్లో గంపలను నింపేశారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం నల్లకొండ, బోడిగుట్ట, అడిగుప్ప కొండలతో పాటు పైతోట, చెరువుదొడ్డి, సిరిగేదొడ్డి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో ఈ కాయలు ఎక్కువగా లభిస్తాయి. మాంసకృతులు, ఖనిజ లవణాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తుండడంతో సీతాఫలాలకు గిరాకీ తగ్గడం లేదు. గంపలో 200 కాయలు చిన్నవిగా ఉంటే రూ.200– 250, కాస్త సైజు ఉంటే రూ.300లు, 30 కేజీలు పట్టే బాక్సయితే రూ.600–700 వరకు విక్రయిస్తున్నారు. యాపిల్‌లో ఉండే పోషకాలకు దీటుగా లభ్యం కావడంతో ఈ పేదోడి యాపిల్ సీజన్ నవంబర్ చివరి కంతా పూర్తి కానుంది. సీతాఫలం ప్రాముఖ్యతే వేరు.. అరటి, బొప్పాయి, ద్రాక్ష, అంజూర, జామ, దానిమ్మ, యాపిల్, సపోట, మామిడి లాంటి పండ్ల ఉత్పత్తికి ఎన్నో రకాల క్రిమి సంహారక మందులు వాడుతుంటారు. రసాయనిక ఎరువులు కూడా వినియోగిస్తారు. పండ్లు కోతకొచ్చాక మాగేందుకు సైతం రసాయనాలు చల్లుతారు. ఇలాంటివి తింటే ఆరోగ్యానికి హానికరం. అయితే ప్రకృతిసిద్ధంగా పండిన సీతాఫలాలు రసాయన రహితంగా ఉండి చక్కటి ఆరోగ్యాన్నిస్తాయి. పది వేల ఎకరాల్లో విస్తరించిన చెట్లు.. రాయదుర్గం పరిసరాల్లో కొండలు, గుట్టలు అధికంగా ఉండడంతో సీతాఫలం చెట్లు పది వేల ఎకరాలకు పైగా విస్తరించాయి. గుమ్మఘట్ట మండలంలో అత్యధికంగా ఈ చెట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సీతాఫలాల అమ్మకాలపై ఆధారపడి సుమారు 650 కుటుంబాల వారు జీవనోపాధి పొందుతున్నారు. వర్షాకాలం మొదలైందంటేæ చాలు ఇంటిల్లిపాదీ ఈ పనిలోనే నిమగ్నమైపోతారు. చెట్లలో కాయలు పక్వానికి వచ్చాయని తెలియగానే వేకువ జామునే కొండ ఎక్కడం.. కాయలు కోయడం.. వెంటనే మార్కెట్‌కు తరలించడం చేస్తారు. 100 గ్రాముల సీతాఫలంలో లభ్యమయ్యే పోషకాలు.. ♦చక్కెర శాతం 19 నుంచి 29 గ్రాముల వరకు ♦23.05 గ్రాముల కార్బోహైడ్రేట్లు ♦104 కిలోల కేలరీల శక్తి ♦3.1 గ్రాముల ఫైబర్ ♦1.6 గ్రాముల ప్రొటీన్లు ♦17 మిల్లీ గ్రాముల క్యాల్షియం. ♦0.4 గ్రాముల కొవ్వుపదార్ధాలు ♦4.37 గ్రాముల ఫాస్పర్ ♦ 4.37 మిల్లీ గ్రాముల ఐరన్ ♦37 మిల్లీ గ్రాముల సీ–విటమిన్ పండ్లే జీవనాధానం 20 ఏళ్లుగా సీతాఫలాల వ్యాపారం చేస్తున్నా. సీజన్లో ఈ పండ్లే మాకు జీవనాధారం. సాయంత్రమే కొండమీద నుంచి కాయలు ఇంటికి తెచ్చుకుంటాం. ఉదయమే మార్కెట్‌కు తీసుకొస్తాం. కాయల సైజు బాగుండడంతో మధ్యాహ్నానికంతా అమ్ముకుని రూ.వెయ్యి సంపాదనతో ఇంటికి చేరుకుంటున్నా. –ముద్దమ్మ, సీతాఫలం వ్యాపారి,చెరువుదొడ్డి కర్ణాటక నుంచీ వస్తున్నారు రాయదుర్గం సీతాఫలాలు ఎంతో ప్రఖ్యాతిగాంచాయి. బళ్లారి, బెంగళూరు, చెళ్లకెర, చిత్రదుర్గం నుంచి చాలా మంది వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. నల్లకొండ నుంచి ఎక్కువగా కాయలు తీసుకొచ్చి అమ్మకం చేపడతా. వర్షం సక్రమంగా కురిస్తే చాలు పంట చేతికందుతుంది. పైసా పెట్టుబడి కూడా అవసరం లేదు. ఈ పండ్లను షుగర్ ఉన్న వారు కూడా తింటే ఏమీ కాదని వైద్యులే చెబుతున్నారు. – బంజోబయ్య, సీతాఫలం వ్యాపారి, బంజయ్యనగర్ వర్షాలకు చెట్లు ఏపుగా పెరిగాయి సీతాఫలాల చెట్లు వందల కుటుంబాలకు జీవనాధారమయ్యాయి. ఇవి మూడేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏపుగా పెరిగాయి. అంతకు ముందు సరైన వానలు లేక దిగుబడుల మాట అటుంచితే చెట్లన్నీ ఎండిపోయి కొండలు కళావిహీనంగా కనిపించేవి. ఇప్పుడు మాత్రం కళకళలాడుతున్నాయి. ఈసారి మంచి దిగుబడినిచ్చాయి. – కుళ్లాయిస్వామి, కామయ్యతొట, రాయదుర్గం -
Jack Fruit: నోరూరించే పనస పండ్లు.. తింటే ఎన్ని లాభాలో తెలుసా?
అంబాజీపేట(కోనసీమ జిల్లా): చెట్లకు సాధారణంగా పువ్వు నుంచి పిందె, పిందె నుంచి కాయ వచ్చి అది పండుగా మారుతుంది. కాని పనస పండు పుట్టిక మాత్రం అలా జరగదు. ఈ చెట్టు కాండం నుంచే పిందెలు దిగి అవి కాయులు, పండ్లుగా తయారవుతాయి. కనుకనే పనస చెట్టు మొదలు నుంచి చివరి వరకూ కాండంపై కాయలు నిండి ఉంటాయి. సువాసనలు వెదజల్లుతూ నోరూరించే పనసపండు అంటే అందరికీ ఇష్టమే. పనసపండులో శరీరానికి అవసరమైన పలు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును ఆంగ్లంలో జాక్‌ఫ్రూట్ అంటారు. దీని వృక్షశాస్త్ర నామ థేయం ఎట్రోకార్పస్ ఇంటి గ్రిఫోలియా. ఏటా మార్చి నుంచి జూలై వరకూ పనస పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. ఒక్కొక్క చెట్టుకు 100 వరకూ కాయలు దిగుబడులు వస్తాయి. ఒక్కొక్క కాయ 10 నుంచి 20 కేజీల బరువు ఉంటాయి. కాగా కాయ ఎంత బరువున్నా అందులో 30 శాతం మాత్రమే తినడానికి ఉపయోగపడుతుంది. కాగా అంబాజీపేట పరిసర ప్రాంతాల్లో దొరకే పనస పండ్లకు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉంది. పనసలో పలు రకాలు బంగారు పనస, కొబ్బరి పనస, ఖర్జూర పనస, వేరు పనస, చిన్నకోల పనస, గుండ్రు పనస, గులాబి పనస, కర్ణపనస, తేనెపనస అనే రకాలు ఉన్నాయి. వివాహాది శుభ కార్యాలయాల్లో పనసకాయ కూర చేస్తారు. పనసకాయను పొట్టుగా కొట్టి కూర వండితే తినతివారు ఉండరు. అంతేకాకుండా లేత పనస కాయలను చిన్న ముక్కలుగా తరిగి మషాలా కూరల్లో ఉపయోగిస్తారు. పోషకాలు ఇలా.. పనస పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయని, ఏడాదికి ఒకసారైనా కచ్చితంగా పనసపండు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. పనస పండులో మాంసకృతులు 1.9 శాతం, చక్కెర 19.8 శాతం, కొవ్వులు 0.1 శాతం, కెరోటిన్ 175 మైక్రో గ్రాములు, థియోమిన్ 0.3 మిల్లీ గ్రాములు, విటమిన్ సి 7 మిల్లీ గ్రాములు, పీచు పదార్థం 1.1 శాతం, సున్నం 20.0 మిల్లీ గ్రాములు, ఇనుము 0.56 మిల్లీ గ్రాములు ఉంటాయి. -
Pista Pappu: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల..
పిస్తా పప్పు.. చూడగానే నోరూరిపోతుంది! చటుక్కున రెండు పప్పులు తీసుకుని నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. చాలా మంది రోజూవారీ డైట్లో తప్పక దర్శనమిస్తుంది ఈ పిస్తా. ఈ అలవాటు మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి.. పిస్తా కేవలం రుచికి మాత్రమే కాదు... మంచి బలవర్ధకమైన ఆహారం కూడా. కొంచెం తిన్నా చాలు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. అదే సమయంలో మనకు కావాల్సిన శక్తి లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సాగవుతోన్న ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌లో పిస్తా కూడా ఒకటి. మరో విషయం.. పిస్తా, కాజూ ఒకే జాతికి చెందినవి. పిస్తా పప్పులో ఉండే పోషకాలు: ►పిస్తా పప్పులో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు ఉంటాయి. ►పిస్తాలో పీచు పదార్థాలు, మాంసకృత్తులు కూడా ఎక్కువే. ►ఇక పిస్తాలో లభించే విటమిన్లు.... విటమిన్ బి6, సి, ఇ. ►పిస్తాలో పొటాషియం చాలా ఎక్కువ. ►ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాపర్ క్యాల్షియం లాంటి ఖనిజ లవణాలు కూడా మెండుగా ఉంటాయి. ►ఇతర డ్రై ఫ్రూట్స్‌తో పోలిస్తే... పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఒక ఔన్సు అంటే (28 గ్రాములు) సుమారు 49 పిస్తా పప్పుల్లో ఉంటే పోషకాలు.. కాలరీలు: 159 కార్బోహైడ్రేట్లు: 8 గ్రా. ఫైబర్: 3 గ్రా. ప్రొటిన్: 6 గ్రా. ఫ్యాట్: 13 గ్రా.(90 శాతం అనుశాటురేటెడ్ ఫ్యాట్స్) పొటాషియం: 6 శాతం ఫాస్పరస్: 11 శాతం విటమిన్ బీ6: 28 శాతం థయామిన్: 21 శాతం మెగ్నీషియం: 15 శాతం. చదవండి: Goru Chikkudu Kaya Benefits: షుగర్ పేషెంట్లు గోరు చిక్కుడు కూర తింటే... ఇందులోని ఆ గుణాల వల్ల... పిస్తా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: ►డ్రై ఫ్రూట్స్ అన్నింట్లోకెల్లా పిస్తాలో క్యాలరీలు ఎక్కువ. ►ఇందులోని విటమిన్ బి6 ప్రొటీన్లను జీర్ణం చేసుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది. ►రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ పిస్తా బాగా పనిచేస్తుంది. ►రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ►ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్ ముప్పును తగ్గిస్తాయి. ►పిస్తాలోని అధిక ఫైబర్, ప్రొటిన్ కారణంగా కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలుగడంతో పాటు తక్షణ శక్తి లభిస్తుంది. దీంతో తక్కువగా తినడం.. తద్వారా బరువు తగ్గడంలోనూ ఇది ఉపయోగపడుతుంది. ►ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్ బి6 అధికంగా లభించే ఆహారపదార్థాల్లో పిస్తా ముందు వరుసలో ఉంటుంది. కాబట్టి పిస్తా తినడం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు. ►ఆరోగ్యానికి మేలు చేసే బాక్టీరియాను పెంపొందిస్తుంది. ►ఇందులో ఉండేది ఎక్కువగా ఆరోగ్యకరమైన కొవ్వే కాబట్టి డైట్లో పిస్తాను చేర్చుకోవచ్చు. చదవండి: Health Benefits Of Ivy Gourd: దొండకాయ కూర తింటున్నారా.. అందులో ఉండే బీటా కెరోటిన్ వల్ల.. -
ఉద్దానం గూనచారు.. తింటే వదల్లేరు
ఇచ్ఛాపురం రూరల్: ఉద్దానం ప్రాంతంలో చేసే విందుల్లో విశేష వంటకం ‘గూనచారు’. వేడివేడి అన్నంలో గూనచారు వేసుకుంటే ‘ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి’ అంటూ పాట పాడక తప్పదు. ఈ వంటకం అంత రుచికరంగా ఉంటుంది మరి. అరచేతికి అంటిన గూనచారు వాసన వారం రోజులపాటు పోదంటే అతిశయోక్తి కాదు. శ్రీకాకుళం జిల్లాలో ‘భోజీ పులుసు’గా పిలిచే గూనచారు కేవలం ఉద్దానం ప్రాంతానికే సొంతం. మట్టి బాన (పెద్ద కుండ)లో తయారు చేసే ఈ చారు 10 నుంచి 15 రోజులపాటు నిల్వ ఉంచినా చెక్కు చెదరకుండా.. రంగూ, రుచి పోకుండా అంతే రుచిగా ఉంటుంది. ఈ చారును ఉద్దానం వాసులు ఇతర రాష్ట్రాల్లో ఉండే మిత్రులు, బంధువులు, సహోద్యోగులకు పంపిస్తుంటారు. పోషకాల రారాజు గూనచారులో అన్నిరకాల పోషక విలువలు ఉంటాయని విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ పూడి రామారావు తెలిపారు. ముఖ్యంగా ఇందులో ఏ, బీ, సీ, డీ, కే విటమిన్లు ఉంటాయని చెప్పారు. ఇది క్యాన్సర్ నిరోధకంగా పని చేస్తుందని.. రక్తహీనతను తగ్గించే ఔషధ గుణాలు, నరాల బలహీనతను తగ్గించే గుణాలు, వీర్యకణాల వృద్ధి, ఐరన్, మాంసకృత్తులు, శరీర నిర్మాణానికి అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయని ఆయన వివరించారు. గూనచారు ఎసిడిటీని రూపుమాపుతుందని పేర్కొన్నారు. ఇలా తయారు చేస్తారు ► మొదట చింతపండు నానబెట్టి రసం తీయాలి. ఆ రసాన్ని కనీసం గంటపాటు బానలో మరిగించాలి. మరిగించిన రసంలో బెల్లం, పసుపు పొడి, కారం, అరటి ముక్కలు, మునగ, పనస ఇత్యాది కూర ముక్కలు కలపాలి. ► ఇలా తయారైన రసాన్ని మరో గంటసేపు మరిగించాలి. అందులో బాగా వేయించిన బియ్యం పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ► పోపు పెట్టడం చాలా ముఖ్యమైన ఘట్టం. మొదటిగా వంటనూనెను పావుగంట మరిగించాలి. తరువాత ఉల్లికి గాట్లు పెట్టి ఆ నూనెలో వేసి బాగా వేయించాలి. తర్వాత ఎండుమిరప కాయల్ని దోరగా వేయించాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి ముద్దలు వేయాలి. ఈ పోపు కార్యక్రమం ఇంచుమించు గంటసేపు సాగాలి. ► తయారైన పోపుని బియ్యం పిండి కలిపి, మరిగించిన చింతపండు రసంలో కలిపి తగినంత ఉప్పు, కారం పొడి అందులో వేయాలి. ఆ తరువాత బానపై మూతపెట్టి అరగంట సేపు ఉంచాలి. అంతే.. భోజీ పులుసు అదేనండీ.. అదే ఉద్దానం ‘పేటెంట్’ గూనచారు తయార్. మామూలుగా ఉండదు ఉద్దానం ప్రాంతంలో వివిధ ఫంక్షన్లకు ప్రత్యేకంగా తయారు చేసే గూనచారు మామూలుగా ఉండదు. నాకెంతో ఇష్టమైన వంటకం ఇది. ఉద్యోగరీత్యా ఇతర దేశంలో ఉన్న నేను స్వదేశానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ చారును తయారు చేయించుకుని విందారగిస్తాను. స్థానికంగా దొరికే మసాలా దినుసులతో తయారు చేసే ఈ చారును ఇతర రాష్ట్రాల్లోని వారికి ఉద్దానం వాసులు బహుమతిగా పంపిస్తుంటారు. ఇప్పటివరకు నేను ఎన్నో రాష్ట్రాలు, దేశాలు తిరిగినప్పటికీ ఉద్దానం ప్రాంతంలో తయారు చేసే గూనచారును ఎక్కడా చూడలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉద్దానం పేటెంట్ గూనచారు. – తిప్పన శంకరరావురెడ్డి, ప్రవాసాంధ్రుడు, తిప్పనపుట్టుగ, ఇచ్ఛాపురం మండలం ఫంక్షన్లలో భలే డిమాండ్ మా తాతల కాలం నుంచీ ఉద్దానం ప్రాంతంలో జరిగే ప్రతి ఫంక్షన్లో గూనచారు వండాల్సిందే. చింతపండు, బెల్లం, పనస పొట్టుతో ప్రత్యేకంగా తయారు చేసే ఈ చారు చాలా రుచికరంగా ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్లో మాకు చాలా డిమాండ్ ఉంటుంది. దీనిని చాలా జాగ్రత్తగా తయారు చేయాలి. ముఖ్యంగా చింతపండు, బెల్లం, ఉల్లిపాయలతో తయారు చేసే పాకం బాగుండాలి. చారు వాసన సుమారు అర కిలోమీటరు వరకు వ్యాపిస్తుంది. 15 రోజులపాటు నిల్వ ఉంచుకుని దర్జాగా తినొచ్చు. – దున్న ఢిల్లీరావు, గూనచారు తయారీదారు, బూర్జపాడు, ఇచ్ఛాపురం మండలం -
Leaf Vegetable: పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారా?
సాక్షి, అమరావతి: దేశంలో నూటికి 80 శాతం మంది కౌమార దశలో ఉన్న పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వీరిలో ఎక్కువమంది పేదలే. ఇవి ప్రైవేటు సంస్థలో, వ్యక్తులో చెప్పిన మాటలు కాదు. సాక్షాత్తు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉండే యూనిసెఫ్ భారతదేశానికి సంబంధించి ఇటీవల ఇచ్చిన నివేదిక. మారుతున్న రోజులకు ఇదో సవాలు. దీన్ని ఎదుర్కొనేందుకు అనేక పరిష్కార మార్గాలు మన చేతుల్లోనే ఉన్నా వాటిని చిన్నచూపు చూస్తున్న ఫలితమే ఈ దుర్గతి అని ఆహార నిపుణులు ఆవేదన చెందుతున్నారు. ఈనేపథ్యంలో పోషకాహార లేమిని తరిమి కొట్టేందుకు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్శిటీ నిపుణులు అనేక పరిష్కారాలను సూచిస్తున్నారు. వాటిల్లో అత్యంత ఆచరణాత్మకమైంది పెరటి తోటల పెంపకం. పెరటి తోటలకు పెరిగిన గిరాకీ పోషకాహార లోపం, కాలుష్యం, హిడెన్ హంగర్ (పౌష్టికాహర లేమి)కు ఏదీ అతీతం కాకపోవడంతో ఇటీవలి కాలంలో పెరటి తోటలకు బాగా గిరాకీ పెరిగింది. పోషకాహారలోప నివారణలో వీటి పాత్ర కీలకమైంది. ఆహార ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ పోషకాహార లోపంలోనూ అదేస్థాయిలో ఉంది. పెరుగుతున్న జనాభాను, పోషకాహార లోపాలను, కూరగాయల లభ్యతను, ధరలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన కూరగాయలను ఏడాది పొడవునా అందుబాటులో ఉంచేందుకు ఈ పోషకాహార పెరటి తోటలు ఉపయోగపడతాయి. అందుకే వీటిని ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. రసాయన ఎరువులు, సస్యరక్షణ, కలుపు నివారణ మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకోవడం అనివార్యమని శాస్త్రవేత్తలు సైతం సలహా ఇస్తున్నారు. ఒక్కో మనిషికి ఎన్నెన్ని గ్రాములు కావాలంటే.. సగటున ప్రతి మనిషికి రోజుకు కనీసం 85 గ్రాముల పండ్లు, 75 నుంచి 125 గ్రాముల ఆకుకూరలు, 85 గ్రాముల ఇతర కూరగాయలు, 85 గ్రాముల దుంప కూరలు కావాలి. ఇలా తీసుకున్నప్పుడే శరీరానికి అవసరమైన పోషకాలు సమకూరతాయి. ప్రస్తుత లెక్క ప్రకారం ఇంతకన్నా తక్కువ తీసుకుంటున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో ఆకుకూరలకు రోజువారీ ఆహారంలో చోటు తక్కువైంది. ఫలితంగా విటమిన్ల లోపం ఏర్పడుతోంది. విటమిన్–ఎ లోపంతో రేచీకటి వస్తుంది. ఐరన్ లోపంతో రక్తహీనత వస్తుంది. దాదాపు సగంమంది మహిళలు, పిల్లలు, యుక్త వయస్కులు రక్తహీనతతో బాధపడుతున్నారు. విటమిన్–బి లోపంతో ఆకలి మందగించడం, నోటిచివర పగుళ్లు, నాలుకపై పూత వస్తాయి. ఈ లోపాలను నివారించాలంటే ఆకుకూరలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి. సమగ్ర జాతీయ పోషకాహార సర్వే లెక్క ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు సరైన పోషకాహారం అందడంలేదు. 2 నుంచి 4 ఏళ్ల వయసున్న పిల్లల్లో విటమిన్–ఎ లోపం తీవ్రంగా ఉంది. కూరగాయల వినియోగం తక్కువగా ఉంది. పెరటి తోటల్లోని ఆకుకూరలతో.. పోషకాహార పెరటి తోటలు పెంచడం వల్ల కుటుంబ ఆరోగ్యం బాగవుతుంది. దీనికి కావాల్సిందల్లా ఆసక్తే. చాలామందికి పెరళ్లు ఉంటాయి. లేనివారు కుండీల్లోను పెంచుకోవచ్చు. ఏడాది పొడవునా బెండ, వంగ, టమోటా, మిరప, పాలకూర, మెంతికూర, గోంగూర, తోటకూర, చుక్కకూర, బచ్చలి, సిర్రాకు, నిమ్మ, జామ, అరటి, బొప్పాయి, మామిడి, దానిమ్మ వంటి వాటిని పెంచుకోవచ్చు. అదనపు ఆదాయం పొందవచ్చు. ఇవి పోషకాహార లోపాన్ని నివారిస్తాయి. ఇళ్లల్లో మనకున్న స్థలాన్ని చిన్న మడులుగా విడగొట్టి తీగ జాతి కూరగాయలను కంచె మీదికి పాకించవచ్చు. దంప కూరలను గట్లపై పెంచవచ్చు. పండ్ల చెట్లను పెరట్లో ఏదైనా మూలగా వేసుకోవచ్చు. పెరట్లోనే ఒక పక్క కంపోస్టు గుంతను ఏర్పాటు చేసుకుని సేంద్రియ ఎరువును తయారు చేసుకుని దాన్నే ఉపయోగించుకోవచ్చు. బయటి నుంచి నారు తెస్తే 3, 4 వారాల మధ్య నాటుకోవాలి. నాటే సమయంలో 2, 3 గంపల పశువుల ఎరువులు వేయాలి. ఉపయోగాలు ఏమిటంటే.. కూరగాయల వినియోగం పెరిగితే పోషకాహార లోపం, సూక్ష్మపోషకాల లోపాలను నివారించుకోవచ్చు. కుటుంబ ఆహార అవసరాలను తీర్చుకోవచ్చు. తాజా కూరగాయలతో పోషకాలు మెండుగా వస్తాయి. వ్యాధుల నుంచి రక్షణ ఉంటుంది. ఖనిజాలు, పోషకాలు, విటమిన్లు సరేసరి. డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రాలు ఈ పోషకాహార తోటలు పెంచుకోవడానికి సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. ఇళ్లల్లో పెంచుకోవడానికి ఆకుకూరల విత్తనాలు కూడా సరఫరా చేస్తున్నట్లు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం గృహ విజ్ఞానశాస్త్ర విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్ బి.విజయలక్ష్మి, డాక్టర్ కె.మల్లికార్జునరావు, బి.గోవిందరాజులు తెలిపారు. -
మీకు షుగర్ ఉందా? అయితే, ఎర్ర బియ్యంపై ఓ లుక్కేయండి..
మీకు షుగర్ ఉందా? అధికంగా పీచు పదార్థాలున్న ఆహారం కావాలా? పుష్కలంగా పోషక విలువలున్న తిండి గింజల కోసం చూస్తున్నారా? ఆస్తమా, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఎర్ర బియ్యంపై ఓ లుక్కేయండి. ఈ బియ్యంతో వండిన అన్నం తినడం వల్ల షుగర్ నియంత్రణలోకి వస్తోందని దాన్ని తింటున్న వాళ్లు చెబుతున్న మాట. ఆస్తమా, కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు జీర్ణశక్తి పెరుగుతుందన్నది నిపుణుల మాట. అన్నట్టు.. ఎర్ర బియ్యాన్ని సాంబారు, పెరుగుతో లాగిస్తే ఉంటుంది నా సామిరంగా..! అంతేకాదు.. ఈ బియ్యంతో వండిన అన్నం తిన్నాక అంత త్వరగా ఆకలి వేయదని ఎర్ర బియ్యం ప్రియులు చెబుతున్నారు. ఎక్కడ పండిస్తున్నారంటే.. ఎర్ర బియ్యంలో దాదాపు 34 రకాలకు పైగా ఉన్నాయి. కెంపు సన్నం, చంద్రకళ, జకియా, బారాగలి, రక్తసాలి, కాల్చర్, కలాంకాలి, నవారా.. వీటి రకాల్లో కొన్ని. కెంపు సన్నం, కాల్చార్లు సన్నాలు. కలాంకాలి రకం అయితే సన్నదనంతో పాటు గింజ పొడవుగా కూడా ఉంటుంది. అయితే వీటన్నింటిలోకెల్లా నవారా రకాన్ని బాగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం కిలో బియ్యం రూ.120 దాకా దాకా పలుకుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 600 మంది రైతుల దాకా ఎర్ర బియ్యాన్ని పండిస్తున్నారు. వీరిలో 80 మంది తెనాలి సమీపంలోని అత్తోటలోనే ఉన్నారు. పాలేకర్ వ్యవసాయ విధానంలో దేశవాళీ వరిసాగులో భాగంగా ఒక్కొక్కరూ 10, 20 సెంట్ల విస్తీర్ణంలో పండిస్తున్నారు. వారు తినగా మిగిలినవి విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల నుంచి మధుమేహ రోగులు, ఆరోగ్య స్పృహ కలిగిన వినియోగదారులు ఎర్ర బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. తెనాలి: ఎర్ర బియ్యానికి ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతోంది. పీచు పదార్థాలతో పాటు అధికంగా పోషకాలుండటంతో క్రమంగా ఈ బియ్యం వైపు మొగ్గు చూపుతున్నారు. తెల్లని బియ్యంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటే, ఇతర అన్ని రకాల బియ్యంలో కన్నా ఎర్ర బియ్యంలో పీచు అధికంగా ఉంది. జీర్ణ శక్తిని పెంచి, రక్తనాళాల్లో పూడికలను తొలగించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. విటమిన్ బి1, బి2, బి6లతో పాటు ఐరన్, జింక్, పోటాషియం, సోడియం, కాల్షియం, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటన్నింటికీ మించి మధుమేహ రోగులకు ఈ బియ్యం దివ్యౌషధంలా ఉపకరిస్తున్నాయి. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ 45 శాతం కన్నా తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర నిల్వను ఎక్కువగా లేకుండా చేస్తాయి. ఎర్ర అన్నాన్ని రోజూ తినడం వల్ల ఐరన్ తగినంత లభిస్తుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కణజాలానికి సక్రమంగా అందుతుంది. క్రమం తప్పకుండా తింటుంటే ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి. ఆస్తమా, కీళ్ల సమస్యలూ తొలగిపోతాయి. లాభదాయకం.. సేంద్రియ పద్ధతిలో పండించడం వల్ల ఎర్ర బియ్యం సాగుకు ఎకరానికి పెట్టుబడి రూ.20,000కు మించదు. ఎర్ర బియ్యం రకాలన్నింటికీ పంట కాలం 110 నుంచి 130 రోజులు. ఎకరానికి గరిష్టంగా 13 బస్తాల(బస్తాకు 75 కిలోలు) ధాన్యం దిగుబడి వస్తుంది. వీటి నుంచి 650 కిలోల బియ్యం వస్తాయి. బియ్యం కిలోకు రూ.120 చొప్పున రూ.78,000 దిగుబడి వస్తుంది. ఖర్చులు రూ.20,000 పోగా రూ.58,000 దాకా మిగులుతాయి. కౌలు రైతు అయితే ఇంకో రూ.20,000 కౌలు తీసేస్తే.. రూ.38,000 మిగులుతాయి. -
పెండలం ఆకులతో పురుగుమందులు
కర్ర పెండలం దుంపల్లో చాలా పోషకాలుంటాయని మనకు తెలుసు. అయితే, కర్రపెండలం మొక్కల ఆకులతో చక్కని సేంద్రియ పురుగు మందులను తయారు చేయవచ్చని డా. సి. ఎ. జయప్రకాశ్ నిరూపించడంతోపాటు పేటెంటు సైతం పొందారు. కేరళలోని శ్రేకరియంలో గల కేంద్రీయ దుంప పంటల పరిశోధనా సంస్థ (సిటిసిఆర్‌ఐ) లో ఆయన ప్రధాన శాస్త్రవేత్తగా విశేష పరిశోధనలు చేస్తున్నారు. కర్రపెండలం ఆకులను తిన్న పశువులు చనిపోతాయి. వీటిలో వుండే శ్యానోజన్ అనే రసాయన సమ్మేళనం విషతుల్యమైనది కావటమే ఇందుకు కారణం. ఇది గ్రహించిన డా. జయప్రకాశ్ 13 ఏళ్ల క్రితం పరిశోధనలు ప్రారంభించారు. విశేష కృషి చేసి విజయం సాధించారు. శ్యానోజన్ సమ్మేళనాన్ని ఆకుల్లో నుంచి వెలికితీయడం కోసం తొలుత ఒక యంత్రాన్ని కనుగొన్నారు. ఇందుకోసం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సాయం తీసుకున్నారు. అనేక ఏళ్లు పరిశోధన చేసి ఎట్టకేలకు నన్మ, మెన్మ, శ్రేయ అనే మూడు రకాల సేంద్రియ పురుగుమందులను తయారు చేశారు. ఒక కిలో కర్రపెండలం ఆకులతో ప్రత్యేక యంత్రం ద్వారా 8 లీటర్ల సేంద్రియ పురుగుమందు తయారు చేయవచ్చని డా. జయప్రకాశ్ తెలిపారు. నన్మ, మెన్మ, శ్రేయ సేంద్రియ పురుగుమందులు ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు తీవ్రనష్టం కలిగిస్తున్న పురుగులను అరికడతాయి. అరటిలో సూడోస్టెమ్ వీవిల్, కొబ్బరిలో రెడ్‌పామ్ వీవిల్తో పాటు అనేక పండ్ల / కలప పంటల్లో కనిపించే కాండం తొలిచే పురుగులను ఈ సేంద్రియ పురుగుమందులు సమర్థవంతంగా అరికడతాయని డా. జయప్రకాశ్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. డీఆర్డీవో తోడ్పాటుతో ఈ పురుగుమందును వాయువు రూపంలోకి మార్చుతున్నారు. ఆహార గోదాముల్లో కనిపించే పురుగులను సమర్థవంతంగా ఈ వాయు రూపంలోని సేంద్రియ పురుగుమందు అరికడుతుందట. లైసెన్స్ ఫీజు చెల్లించే ప్రభుత్వ/ప్రైవేటు సంస్థలకు ఈ పురుగుమందుల తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సిటిసిఆర్‌ఐ సంచాలకులు డాక్టర్ షీల ప్రకటించారు. కర్రపెండలం ఆకుల రసం తో లీటరు పురుగుమందు తయారు చేయడానికి కేవలం రూ. 20 మాత్రమే ఖర్చవుతుందట. ఈ పురుగుమందులు ఆకులతో తయారు చేసినవి కావటం వల్ల రసాయన పురుగుమందులకు మల్లే పురుగులు వీటికి ఎప్పటికీ అలవాటుపడిపోవు. ప్రభుత్వ సంస్థలు ఇటువంటి చక్కని సేంద్రియ పురుగుమందులను స్వయంగా తయారు చేయించి రైతులకు సరసమైన ధరకు అందిస్తే ఎంతో మేలు జరుగుతుంది. వివరాలకు.. సిటిసిఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త డా. జయప్రకాశ్‌ను ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు: prakashcaj@gmail.com డా. సి.ఎ.జయప్రకాశ్ -
వ్యర్థాలతో పోషక జలం!
కుండీల్లో పెంచుకునే కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్ల మొక్కలకు వంటింట్లోనే సులువుగా పోషక జలాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇందులో సౌలభ్యం ఏమిటంటే.. ఏరోజుకారోజే పోషక జలాన్ని తయారు చేసుకోవచ్చు. ఇందులో రెండు పద్ధతులున్నాయి. మొదటిది.. వంట కోసం బియ్యం, పప్పులు కడిగిన నీటిని సాధారణంగా సింక్‌లో పారబోస్తుంటాం. కానీ, అలా పారబోయకుండా.. వంటింట్లోనే ఒక మూలన ప్రత్యేకంగా ఇందుకోసం ఒక బక్కెట్‌ను ఉంచండి. బియ్యం, పప్పులు కడిగిన నీటిని ఉదయం నుంచి దాంట్లో పోస్తూ ఉండండి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తరిగినప్పుడు వచ్చిన తొక్కలు, ముక్కలను ఆ నీటిలో వేయండి. బక్కెట్‌పై ఈగలు మూగకుండా మూత పెట్టండి. సాయంత్రం (నియమం ఏమిటంటే.. బియ్యం, పప్పులు కడిగిన నీటిలో వేసిన వ్యర్థాలు 24 గంటలకు మించి నిల్వ ఉంచకూడదు) వంట పూర్తయిన తర్వాత.. ఆ బక్కెట్లో నీటిలో నుంచి తొక్కలు, ముక్కలను బయటకు తీసి లేదా వడకట్టి.. ఆ పోషక జలాన్ని మొక్కల కుండీల్లో పోసుకోండి. ఇలా పోస్తూ ఉంటే.. మొక్కలు అంతకుముందు కన్నా కళగా, ఏపుగా పెరుగుతుండటం గమనించవచ్చు. మిగిలిన వ్యర్థాలను మీరు ఇప్పటికే కంపోస్టు తయారు చేస్తూ ఉన్నట్లయితే కంపోస్టు పిట్ లేదా పాత్రల్లో వేయండి. ఒకవేళ.. ఇంకా కంపోస్టు తయారు చేయడం ప్రారంభించకపోతే.. ఆ వ్యర్థాలను కూడా బయట పారేయనక్కర లేదు. అందుకు ఇంకో ఉపాయం ఉంది. కూరగాయలు, పండ్ల తొక్కలను.. నీటి లో నుంచి బయటకు తీసి.. చిన్న చిన్న ముక్కలుగా కోసి.. మిక్సీలో వేయండి. దాన్ని పోషక జలంతో కలిపి కుండీలు, మడుల్లో మీరు పెంచుకుంటున్న ఇంటిపంటలకు పోసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పోషక జలం మరీ చిక్కగా లేకుండా మట్టిలో ఇంకిపోయేలా ఉండేలా చూసుకోవాలి. పెరట్లో పెరిగే చెట్లకు కూడా పోసుకోవచ్చు. వారానికి రెండు సార్లు పోసినా మంచి ఫలితం కనిపిస్తుంది. -
మునగ చెట్టు ఎక్కండి
►మునక్కాడలతో రుచికరమైన వంటకాలు చేసుకుంటాం. అలాగే మనగ ఆకులు, గింజల్లోనూ పోషకాలు ఉన్నాయి. ఈ శక్తివంతమైన మునగ సౌందర్య పోషణ లో మెరుగైన ఫలితాలను ఇస్తుంది. మునగ ఆకు పొడి ముఖచర్మం ముడతలు తగ్గడానికి బాగా పనిచేస్తుంది. యవ్వనకాంతిని తీసుకురావడంలో సహాయపడతుంది. మునగ ఆకు పొడిలో రోజ్‌వాటర్ కలిపి నల్ల మచ్చలు, యాక్నె అయిన చోట రాయాలి. ఆరిన తర్వాత శుభ్రపరచాలి. మచ్చలు, మొటిమలు, యాక్నె సమస్య తగ్గుతుంది. ►అర టీ స్పూన్ మునగ ఆకు పొడి, టేబుల్ స్పూన్ తేనె, రోజ్ వాటర్ సగం టేబుల్ స్పూన్, తగినన్ని నీళ్లు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, పది నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. శుభ్రమైన టవల్‌తో తుడిచి, కొద్దిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీని వల్ల చర్మం మృదుత్వం, కాంతిమంతం అవుతుంది. ►కప్పు కొబ్బరి పాలు, టేబుల్ స్పూన్ మునగ ఆకు పొడి, టీ స్పూన్ తేనె తీసుకోవాలి. కొబ్బరి పాలను ఒక గిన్నెలో పోసి సన్నని మంట మీద రెండు నిమిషాలు వేడి చేయాలి. మంట తీసేసి పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ గిన్నెలో మునగ ఆకు, తెనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, షవర్ క్యాప్ వేయాలి. పది నిమిషాలు వదిలేసి తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే శిరోజాలకు తగినంత మాయిశ్చరైజర్ అంది జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. -
మల్టిపుల్ ప్రయోజనాల మల్టీ గ్రెయిన్ ఆటా
సాధారణంగా ఏదో ఒక ధాన్యపు పిండిని వాడటం మామూలే. కానీ ఇటీవల చాలామంది మల్టి గ్రెయిన్ ఆటాలను వాడుతున్నారు. ఏదో ఒక ధాన్యంతో చేసిన పిండి కాకుండా... చాలా రకాల ధాన్యాలను కలిపి దంచిన పిండినే ‘మల్టి గ్రెయిన్ ఆటా’ అంటున్నాం. ఓట్స్, గోధుమపిండి, కుసుమలు, పొట్టు తీయని మరికొన్ని తృణధాన్యాలు కలిపి ఈ పిండిని తయారుచేసుకోవచ్చు. ఇందులో కనిష్టంగా 3 – 5 మొదలుకొని, గరిష్ఠంగా 12 వరకు ధాన్యాలు కలిపి తయారు చేసుకోవచ్చు. ప్రయోజనాలు... చాలాసందర్భాల్లో ఒక రకం పిండిలో ఉన్న పోషకాలు మరోరకం పిండిలో లోపించవచ్చు లేదా చాలా తక్కువగా ఉండవచ్చు. రకరకాల ధాన్యాలను తీసుకొని వాటిని కలిపి పిండిగా చేసుకోవడం వల్ల మల్టి గ్రెయిన్ అనే ఒకే పిండిలోనే చాలా రకాల పోషకాలు దొరుకుతాయి. ఈ పిండి వాడటం వల్ల దేహానికి అన్నిరకాల పోషకాలు అంది ఆరోగ్యం సమకూరుతుంది. ప్రయోజనాలు పొందాలంటే... దేహానికి అన్ని రకాల పోషకాలు అందేలా అన్ని ధాన్యాల సమష్టి ప్రయోజనాలు పొందాలంటే... కనీసం 10 రకాల ధాన్యాలను కలిపి మనమే స్వయంగా పిండిగా పట్టించుకోవడం మేలు. ఎలా తయారు చేసుకోవాలంటే... 1 పైన పేర్కొన్న ధాన్యాలను విడివిడిగా వేయించుకోవాలి. (ఒక్క గోధుమలను మాత్రం వేయించకూడదు). 2 వేయించిన ధాన్యాలు చల్లబడే వరకు ఆరబెట్టాలి. ఆ తర్వాత గోధుమలతో కలపాలి. 3 అన్నింటినీ కలిపి మర ఆడించి, పిండి పట్టించుకోవాలి. 4 మర ఆడించిన పిండి వేడిగా ఉంటుంది. అది చల్లారేవరకు వేచి చూడాలి. 5 రెండుసార్లు జల్లెడ పట్టుకోవాలి. 6 జల్లెడ పట్టినప్పుడు జల్లెడలో మిగిలిన పదార్థాలను పారేయాలి. 7 జల్లెడ పట్టగా కింద మిగిలిన మెత్తటి పిండిని గాలి చొరని ఎయిర్‌టైట్ డబ్బాలో నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి. ఈ జాగ్రత్త పాటించండి: మార్కెట్లో లభ్యమయ్యే మల్టీ గ్రెయిన్ ఆటాలో వాణిజ్య ప్రయోజనాల కోసం చాలా మంది తేలిగ్గా లభ్యమయ్యే గోధుమ పిండినే ప్రధానంగానూ, ఎక్కువగానూ వాడి, మిగతా తృణధాన్యాలను తక్కువ మోతాదులో వాడుతుంటారు. దీని వల్ల మనం దాదాపు సాధారణ గోధుమ పిండిని వాడిన ప్రయోజనానికి మించి పెద్దగా ఉపయోగం పొందలేం. అందుకే మన మల్టి గ్రెయిన్ ఆటాను మనమే తయారుచేసుకునేలా మర పట్టించుకోవడం మంచిది. సుజాతా స్టీఫెన్ చీఫ్ న్యూట్రిషనిస్ట్ యశోద హాస్పిటల్స్, మలక్‌పేట, హైదరాబాద్ -
వంటర్‌ఫుల్ కేరాఫ్ రావులపాలెం
గలగలపారే గోదావరి పాయల నడుమ పచ్చని పైరులు, పిల్ల కాలువలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలకు నిలయమైన కోనసీమకు ముఖద్వారంగా నిలిచే రావులపాలెంలో ఘుమఘుమలాడే పోషకాహార రుచుల ఆర్.కె. టిఫిన్ సెంటర్ కేరాఫ్ అడ్రస్. రావులపాలేనికి చెందిన గొలుగూరి వెంకటరెడ్డి ఆహార ప్రియుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఆహార ప్రియులకు ఇక్కడకు వస్తే పండుగే. అతి తక్కువ ధరకు ఆరోగ్యకరమైన ఆహారంతో ఆకలి తీర్చుకోవచ్చు. వినియోగదారుడు చూస్తుండగానే వేడివేడిగా తయారుచేస్తూ, ప్రేమగా పలకరిస్తూ, ఆప్యాయంగా వడ్డిస్తారు. తిన్నవారికి తిన్నంత. కాని చెల్లించవలసినది మాత్రం కేవలం 70 రూపాయలు. రకరకాల చట్నీలు, పలు రకాల పొడులతో విందుగా పసందుగా కడుపు నింపుకోవచ్చు. సంప్రదాయానికి ప్రతీకగా... ప్రతి చోట లభించే అల్పాహారాలకు భిన్నంగా పోషకాలతో కూడిన సంప్రదాయ అల్పాహారం కోసం ఒక్కసారి ఇక్కడ ఆగి రుచి చూస్తారు. ఆధునిక యువతకు తెలియని దిబ్బరొట్టి (మినపరొట్టి), కోనసీమకే తలమానికంగా నిలిచే పొట్టిక్కలు, ఆవిరి కుడుము, చిట్టి పెసరట్టు, చిట్టి మినపట్టు, చిట్టి గారెలు, రాగి మాల్ట్ (చోడి జావ), మొలకల వడ, విటమిన్ ఇడ్లీ, పెసర పునుగులు... అన్నీ రుచి చూడచ్చు. దిబ్బరొట్టి – చెరకు పానకం: బాణలిలో వేరుసెనగ నూనె వేసి కాగాక మినప్పిండి వేసి, మధ్యలో గ్లాసు పెట్టి దానిలో నీళ్ళు పోసి పైన మూతపెడతారు. అది కొంత సేపటికి రొట్టెగా తయారవుతుంది. దానిని ముక్కలుగా కోసి చట్నీతో పాటు ప్రత్యేకంగా చెరకు పానకం జత చేసి అందిస్తారు. పొట్టిక్కలు: పనసాకులతో బుట్టలు తయారుచేసి వాటిలో ఇడ్లీ పిండిని వేసి ఆవిరి మీద ఉడికిస్తారు. పనసాకుల పోషకాలు పొట్టిక్కలకు అదనంగా చేరడంతో, ఇవి బలాన్ని చేకూరుస్తాయి. ఆవిరి కుడుము: క్యారట్, జీలకర్ర కలిపిన ఇడ్లీ పిండితో ఆవిరి మీద వండుతారు. నెయ్యి, జీలకర్ర, క్యారట్లలో ఉండే పోషకాలతో ఆవిరి మీద ఉడికి, ఆరోగ్యం సమకూరుస్తుంది. మొలకల వడ: పెసలు, బొబ్బర్లు్ల, సెనగలు నానబెట్టి, వస్త్రంలో కట్టి, మొలకొచ్చాక గ్రైండ్ చేసి ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, జీలకర్ర కలిపి నూనెలో వేయిస్తారు. మొలకలు వచ్చాక వండటం వల్ల పోషకాలు అధికంగా లభిస్తాయి. విటమిన్ ఇడ్లీ: మినప్పప్పు, బీట్రూట్, రాగులు, పెసలు నానబెట్టి గ్రైండ్ చేసి ఇడ్లీ మాదిరిగానే పాత్రలో వేసి ఆవిరి మీద ఉడికిస్తారు. చిరుధాన్యాలు, బీట్రూట్ల వల్ల అదనపు పోషకాలు సమకూరతాయి. జగతా రాంబాబు, కొత్తపేట ఫొటోలు:కొవ్వూరి ఆదినారాయణరెడ్డి,రావులపాలెం రోజుకు రెండు వేల మందికి పైగా... అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే అల్పాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ టిఫిన్ సెంటర్ ప్రారంభించాం. రోజూ సుమారు రెండువేల మంది వస్తుంటారు. ఇటుగా ప్రయాణించేవారంతా ఇక్కడ ఆగి మరీ లొట్టలేసుకుంటూ అల్పాహారం తిని వెళ్తుంటారు. ఉద్యోగస్థులు క్యారేజీలు మానేసి మా దగ్గర తినడానికి ఇష్టపడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం కావడమే ఇందుకు కారణం. – జి.శ్రీరామ్, మేనేజర్, ఆర్కే టిఫెన్ సెంటర్, రావులపాలెం -
తరగక ముందే కడగాలి
► ఆకు కూరలను ఉప్పునీటితో కడిగితే త్వరగా శుభ్రపడుతాయి. మామూలు నీటితో నాలుగు సార్లు కడగడం కంటే ఉప్పు నీటితో రెండుసార్లు కడిగితే చాలు. ► ఆకుకూరలు, కూరగాయలను కడిగిన తర్వాత మాత్రమే తరగాలి. తరిగిన తర్వాత కడిగితే వాటిలో ఉండే పోషకాలు నీటిలో కలిసిపోతాయి. ► జిడ్డు పట్టిన ఇనుప పెనాలను శుభ్రం చేయడం కష్టం. పెనం మీద ఉప్పు చల్లి, పేపర్‌తో తుడిచి ఆ తర్వాత సబ్బునీటితో శుభ్రం చేయాలి. ► కప్పుల్లో చివరగా మిగిల్చే కొద్దిపాటి కాఫీ, టీల వల్ల కప్పు అడుగున మరకలు పడుతుంటుంది. అలా పట్టేసిన మరకలు పోవాలంటే పొడి కప్పులో ఉప్పు చల్లి రుద్దాలి. ► రిఫ్రిజిరేటర్ లోపల శుభ్ర పరచడానికి ఉప్పు, సోడా బైకార్బనేట్ కలిపిన నీటిని వాడాలి. సోడా బైకార్బనేట్ రిఫ్రిజిరేటర్లో దుర్వాసనను కూడా పోగొడుతుంది. చిన్న కప్పులో (వంటసోడా) వేసి ఫ్రిజ్‌లో ఒక మూల పెడితే కొద్దిగంటల్లోనే దుర్వాసన పోతుంది. ► రాగి పాత్రల మీద మరకలు పోవాలంటే మరకల మీద ఉప్పు చల్లి వెనిగర్‌లో ముంచిన క్లాత్‌తో తుడవాలి. ► ద్రాక్షపండ్ల మీద చల్లిన రసాయనాలు వదలాలంటే ఉప్పు కలిపిన నీటిలో కనీసం గంటసేపు ఉంచి కడగాలి. -
ఎముకల బలాన్నిచాలాకాలం కాపాడుకుందాం
ఎముక గట్టిగా ఉండాలంటే అందులో ఉండాల్సిన పదార్థాలూ, ఖనిజ లవణాలన్నీ కూరి కూరి నిండి ఉన్నట్లుగా ఉండాలి. అప్పుడే ఎముకకు బలం. అదే కూరినట్లుగా కాకుండా వదులొదులుగా ఉంటే అది పెళుసుగా ఉంటుంది. అంటే... దీన్ని బట్టి తెలిసేదేమిటంటే... ఎముకలో ఉండాల్సిన ఖనిజాలు, పదార్థాల సాంద్రత ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఎముక అంత ఆరోగ్యంగా ఉంటుంది. అలాంటి ఎముకలు ఉన్నవారిలో ఆస్టియోపోరోసిస్ జబ్బుల్లాంటివి త్వరగా రావు. అలా ఎముక సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు జబ్బులేమీ రాకుండా చూసుకోవడంతో పాటు వాటిని ఎక్కువ కాలం కాపాడుకోడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే ఎముకలో క్యాల్షియమ్, ఇతర మినరల్స్ వంటివి తక్కువగా ఉంటే అది పెళుసుగా మారిపోతుంది. పెళుసుగా ఉన్నవి త్వరగా విరిగిపోతాయన్న సంగతి తెలిసిందే కదా. ఎముకలు అలా పెళుసుబారకుండా ఉండాలంటే ఎముకలో ఉండాల్సిన పదార్థాల సాంద్రత (బోన్ మినరల్ డెన్సిటీ) ఎంత ఉండాలి, అసలు బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఏమిటి, దాన్ని సమకూర్చుకోడానికి ఏం చేయాలి వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. మన ఎముకలు చిన్నప్పుడు కాస్తంత మెత్తగా ఉంటాయి. మెత్తగా అనడం కంటే ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. మనిషి ఎదిగే కొద్దీ అవి క్రమంగా బలం పుంజుకుని, గట్టిపడుతుంటాయి. అంటే మునుపు ఉన్న ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుందన్నమాట. ఇలా ఎముకలు బలం పుంజుకోడానికి... మనం తీసుకునే ఆహారం నుంచి, సూర్యరశ్మి నుంచి అవి అనేక పోషకాలను గ్రహిస్తుంటాయి. ఆహారం నుంచి క్యాల్షియమ్, సూర్యరశ్మి నుంచి విటమిన్ ‘డి’ గ్రహిస్తాయి. ఈ రెండింటితో పాటు మనం చేసే శారీరక శ్రమ కూడా తోడైతే అవి మరింత బలంగానూ, ఆరోగ్యకరంగానూ తయారవుతాయి. ఇలా ఎముకలు బలం పుంజుకుని, వాటిలో ఉండాల్సిన పదార్థాన్ని, ఖనిజాలను సమకూర్చుకుని పూర్తి సాంద్రతను సమకూర్చుకోడం అన్నది ఎదిగే పిల్లలు ఎదిగే క్రమంలో నిరంతరం జరిగే ప్రక్రియ. ఇలా ఎముకలో ఉండే సాంద్రతను బోన్ మాస్ డెన్సిటీ (బీఎమ్‌డీ) అంటారు. ముప్ఫై ఏళ్ల వయసులో గరిష్ఠ సాంద్రత ఒక మనిషికి 30 ఏళ్లు వచ్చే నాటికి అతడి ఎముకల్లోని సాంద్రత గరిష్టంగా ఉంటుంది. అలా గరిష్టంగా ఉన్న 30 ఏళ్ల వయసు తర్వాత నుంచి... క్రమంగా ఎముకలోని పదార్థాన్ని కోల్పోతూ ఉంటారు. దీన్నే ‘ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ అని వ్యవహరిస్తారు. ఒకవేళ ఎముకలు త్వరత్వరగా తమ సాంద్రత కోల్పోతే అవి చాలా త్వరగా పెళుసుబారి త్వరగా ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. అయితే కొందరిలో ఎముక సాంద్రతను కోల్పోయే ప్రక్రియ చాలా నెమ్మదిగా, ఆలస్యంగా జరుగుతుంది. కానీ ఒక వయసు తర్వాత మాత్రం ఎముక తన సాంద్రతను కోల్పేయే పరిస్థితి క్రమంగా కొనసాగుతూనే ఉంటుంది. మహిళల్లో మెనోపాజ్ తర్వాత... మహిళల విషయానికి వస్తే రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్) తర్వాత ఎముక సాంద్రత కోల్పోయే వేగం బాగా పెరుగుతుంది. (అందుకే మెనోపాజ్ ఆగిన మహిళల్లో ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువ). కాబట్టి మన ఎముకలోని సాంద్రతను వీలైనంత ఎక్కువ కాలం మనం నిలుపుకోగలిగితే మన ఎముక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎముకల్లో సాంద్రత తగ్గించే రిస్క్ ఫ్యాక్టర్లు ఇవే... ఎముకల్లో సాంద్రత తగ్గేలా చేసే పొగాకు, ఆల్కహాల్ దురలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వంటి వాటిని మనం ప్రయత్నపూర్వకంగా మార్చుకుని ఆరోగ్యాన్ని సమకూర్చుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని మార్చుకోలేని, తప్పనిసరి రిస్క్ ఫ్యాక్టర్లు కూడా ఉన్నాయి. అవి... మహిళలు ఎముకల సాంద్రత కోల్పోవడం ఎక్కువ (మరీ ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత), పొట్టిదనం (అరవై కిలోల కంటే లోపు ఉండి, 155 సెం.మీ. కంటే తక్కువ ఎత్తున్న మహిళల్లో ఎముక సంద్రత తగ్గడం చాలా త్వరగా, వేగంగా జరుగుతుంటుంది). దీనికి తోడు మన ప్రాంతీయత కూడా ఎముక సాంద్రతకు దోహదం చేస్తుంది. (పాశ్చాత్యులతో పోలిస్తే ఆసియన్లు, చైనీయులు, కాకసాయిడ్స్లో ఎముక సాంద్రత స్వతహాగానే తక్కువ). అలాగే మన కుటుంబ చరిత్ర (కొందరిలో ఎముకలు తేలిగ్గా విరిగే తత్వం ఉంటుంది), మన జీవనశైలి, కాఫీ, ఆల్కహాల్ వంటి అలవాట్లు... ఇవన్నీ ఎముక సాంద్రత త్వరగా తగ్గడానికి దోహదం చేసే అంశాలే. ఎముక సాంద్రతను తక్కువ చేసే జబ్బులివి... ఇక హైపోగొనాడిజమ్, థైరోటాక్సికోసిస్, కుషింగ్ సిండ్రోమ్, అనొరెక్సియా నర్వోజా (తిండిపై ఆసక్తికోల్పోయి అసలు ఆహారం తీసుకోకపోయే రుగ్మత), మాల్ అబ్షార్‌ప్షన్ సిండ్రోమ్ (మనం తీసుకున్న పోషకాలు వంటికి పట్టని రుగ్మత), దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు, దీర్ఘకాలిక మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, ఫిట్స్ వస్తున్నప్పుడు తీసుకునే మందులైన యాంటీ కన్వల్సెంట్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక ఇన్ఫ్లమేటరీ వ్యాధుల వల్ల కూడా ఎముక సాంద్రత తగ్గిపోయి, ఆ తర్వాతి దశలో మొదటి వ్యాధుల ఫలితంగా సెకండరీ ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. ఎముక సాంద్రతపై దృష్టి పెట్టాల్సిన వారెవరు? ►మహిళలు 55 ఏళ్లు దాటిన వారైతే, పురుషులైతే 65 ఏళ్లు దాటినవారైతే ఒకసారి ఎముక సాంద్రత పరీక్ష చేయించుకోవాలి. ఇక ఈ కింది కండిషన్స్ గాని ఉంటే 50 ఏళ్ల పైబడ్డవారంతా ఎముక సాంద్రతపై దృష్టిపెట్టాలి. అవి... ►గతంలో ఏదైనా ప్రమాదం జరిగి ఎముక విరగడం వంటి ట్రామా కేసుల వారు. తక్కువ బరువు ఉన్నవారు. ►గతంలో తుంటి ఎముక ఫ్రాక్చర్ అయినవారు ►వెన్నెముకకు సంబంధించిన రుగ్మత లేదా అబ్నార్మాలిటీస్ ఉన్నవారు. ►గ్లూకోకార్టికాయిడ్ స్టెరాయిడ్‌ను ఒక మందుగా తీసుకుంటున్నవారు ►హైపర్ థైరాయిడిజమ్‌తో బాధపడుతున్నవారు ►ఆస్టియోపోరోసిస్ జబ్బుకు మందు తీసుకుంటూ... డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉన్నవారు. ►తినడానికి సంబంధించిన రుగ్మతలు (అంటే తిన్నది సరిగా ఒంటబట్టకపోవడం వంటి) ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నవారు... వీరితో పాటు పొగతాగడం, మద్యపానం అలవాటు ఉన్నవారు, విటమిన్ ‘డి’ లోపం ఉన్నవారు తప్పనిసరిగా మీద 50 ఏళ్లు పైబడ్డ నాటి నుంచే డాక్టర్ సలహా మేరకు ఎముక సాంద్రత పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఎముక సాంద్రత తెలుసుకోవడం ఎలా..? నిజానికి ఇది ఆస్టియోపోరోసిస్ నిర్ధారణకు చేసే పరీక్ష. దీన్ని ‘డ్యుయల్ ఎనర్జీ ఎక్స్–రే అబ్జార్షియోమెట్రీ’ అంటారు. దీనితో కేవలం ఐదు నిమిషాల్లోనే ఎముక సాంద్రత ఎంత అన్నది తెలిసిపోతుంది. అయితే ఈ విలువను అందరిలో ఒకేలా కాకుండా వయసును పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి దీన్ని ‘టీ’ స్కోర్‌గా చెబుతారు. దీనితో పాటు సీరమ్ లెవల్స్ ఆఫ్ క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఆల్కలైన్ ఫాస్ఫేట్స్, ఇన్‌టాక్ట్ పారాథైరాయిడ్ హార్మోన్ (పీటీహెచ్) వంటి పరీక్షలు కూడా అవసరమవుతాయి. ఎముక సాంద్రతను పెంచుకోవాలంటే... ముందు చెప్పుకున్నట్లుగానే ఎముక సాంద్రతకు మంచి బీజం యుక్తవయసులోనే పడాలి. పైగా ఎముక సాంద్రత పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ పెద్దగా ఖర్చు లేకుండానే స్వాభావికంగా జరిగేవే ఎక్కువ. కాబట్టి పిల్లలందరినీ యుక్తవయసులోకి వచ్చే ముందు క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని అంటే పాలు, పెరుగు, బ్రకోలీ వంటి తాజా కూరలు ఎక్కువగా తీసుకునేలా చూడాలి. అలాగే ఆరుబయట ఎండకు ఎక్స్పోజ్ అవుతూ ఎక్కువసేపు ఆడేలా ప్రోత్సహించాలి. దీనివల్ల శరీరంలో విటమిన్ ‘డి’ ఎక్కువగా తయారవుతుంది. మనం తీసుకున్న ఆహార పదార్థాల్లోని క్యాల్షియమ్‌ను ఎముకల్లోకి ఇంకేలా చేస్తుంది విటమిన్ ‘డి’. అందుకే కేవలం క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకున్నంత మాత్రాన కాకుండా... విటమిన్ ‘డి’ వల్ల కూడా ఎముకలకు బలం చేకూరుతుంది. దీనితో పాటు ఆ సమయంలో వారు తగినంతగా శారీరక శ్రమ, వ్యాయామం చేసేలా చూస్తే పిల్లలు బలంగా మారడమే కాకుండా, వారు మంచి బలంగా తయారవుతారు. చాలాకాలం... అంతెందుకు వృద్ధాప్యంలోనూ వారు ఇంచుమించుగా దాదాపుగా అంతే బలంతో ఉంటారు. ఎముక సాంద్రతను నిర్ణయించే అంశాలు... మనలోని చాలా అంశాలు ఎముక సాంద్రతతో కీలక భూమిక పోషిస్తాయి. ఉదాహరణకు ఒకరి జన్యువుల్లోనే ఎముక సాంద్రత అధికంగా ఉండే గుణం ఉంటుంది. దాంతోపాటు వ్యాయామం / శారీరక శ్రమ, క్యాల్షియమ్ తీసుకోవడం, విటమిన్ ‘డి’ని గ్రహించడం వంటి అంశాలు కూడా ఎముక సాంద్రతకు దోహదపడతాయి. ఇక పొగతాగడం, మద్యపానం, తరచూ జబ్బుపడటం, శారీరక శ్రమ చేయకుండా ఒక చోట కూర్చొని పనిచేయడం లేదా బద్దకంగా ఉండటం, కొన్ని రకాల మందులు (గ్లూకోకార్టికాయిడ్స్, యాంటీ ఎపిలెప్టిక్ మందులు) తీసుకోవడం వంటి అంశాలు ఎముక సాంద్రతను గుల్లబార్చి అవి బలహీనంగా మారేలా చేస్తాయి. యౌవన దశే కీలకం మన బాలలు యౌవన ప్రవేశకాలంలో ఎక్కువగా క్యాల్షియమ్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం, ఆ సమయంలో ఎక్కువగా విటమిన్ ‘డి’ని గ్రహించేలా ఆరుబయట తిరగడం, వ్యాయామం చేయడం వంటివి చేయాలి. ఎందుకంటే ఆ సమయంలో సమకూర్చుకున్న ఎముక సాంద్రత దాదాపు జీవితకాలమంతా రక్షణ ఇస్తుంది. ఆ సమయంలో ఎంత ఎక్కువ సాంద్రతను గ్రహిస్తే, క్రమంగా కోల్పోయే దశ ప్రారంభమైనా కూడా అది చాలాకాలం ఉండేలా తోడ్పడుతుంది. ఆ సమయంలో దురలవాట్లకు చేరువ కావడం, వ్యాయామం చేయకపోవడం వంటివి చేస్తే అది ఆ తర్వాత కాలంలోనూ నష్టం చేకూరుస్తుంది. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్ -
ఇవి వండితే బెస్ట్... ఇవి వండకపోతే మరింత బెస్ట్!
టొమాటో, క్యారెట్ల లాంటి వెజిటబుల్స్‌ను పచ్చిగా కూడా తినవచ్చు . కానీ పాలకూర, క్యాప్సికమ్ వంటి వాటిని వండితేగానీ తినలేం. పచ్చిగా కూడా తినగలిగే వాటిని పచ్చిగా తిన్నా పర్లేదు. కానీ వాటిల్లో కొన్నిటిని వండుకొని తింటే... పచ్చిగా తిన్నప్పటి కంటే ఎక్కువ పోషకాలు దొరుకుతాయంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. అలాగే వండుకుతినేవి కొన్నింటిని పచ్చిగా తింటే మరింత ప్రయోజనం అంటున్నారు. అలాంటి కొన్నింటిని చూద్దాం. వీటిని వండాక తినడం బెస్ట్... క్యారెట్లూ, టొమాటోలు, క్యాబేజీ వంటివి వండిన తర్వాత తిన్నప్పుడు వాటి నుంచి దొరికే పోషకాలు రెట్టింపు అవుతాయట. ఎందుకలా జరుగుతోందో బ్రిటిష్ న్యూట్రిషనిస్టు పరీక్షించి చూశారు. అప్పుడు వారికి తెలిసినదేమిటంటే... టొమాటోల్లో ఉండే లైకోపిన్, క్యారట్లలో ఉండే బీటా కెరోటిన్ వాటిని ఉడికించినప్పుడు రెట్టింపవుతోందట. మరి పోషకాలు రెట్టింపు కావడం మంచిదే కదా. అలాగని పచ్చిగా తినగలిగే వాటిని మీరు సరదా తినదలచుకుంటే ఎలాంటి ఆంక్షలూ లేవు. నిరభ్యంతరంగా తినండి. కాకపోతే పరిశోధనల్లో తేలిన విషయం న్యూట్రిషనిస్టులు చెబుతున్నారంతే! వీటిని పచ్చిగా కూడా తినవచ్చు... సాధారణంగా మనం క్యాప్సికమ్, బ్రకోలి, పాలకూర వంటివి ఉడికించాకే తింటాం కదా. కానీ వాటిని పచ్చిగా తింటేనే మంచి ప్రయోజనం ఉంటుందని బ్రిటన్ ఆహార శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాలకూరలో ఉండే కెరోటినాయిడ్స్, క్యాప్సికమ్‌లో ఉండే విటమిన్ ‘సి’ వాటిని పచ్చిగా తిన్నప్పుడే ఒంటికి పుష్కలంగా అందుతాయట. కాబట్టి ఆ పోషకాలు కావాలనుకున్నవారూ, ఆరోగ్యస్పృహతో మెలుగుతూ ఇలాంటి సూచనలను పాటించేవారు కావాలనుకుంటే పచ్చిగానూ తినవచ్చు. డయాబెటిస్ ముప్పు తప్పాలంటే శాకాహారం బెస్ట్... పనిలో పనిగా బ్రిటిష్ ఆహార పరిశోధకులు మరో విషయాన్నీ చెప్పారు. శాకాహారం వల్ల టైప్–2 డయాబెటిస్ ముప్పు గణనీయంగా తగ్గుతుందట. పైగా వాటిని తినాల్సిన పద్ధతిలో తింటే ఆరోగ్యం మరింత చక్కగా ఉంటుందని బ్రిటిష్ డైటీషియన్ హెలెన్ బాండ్ పేర్కొన్నారు. -
ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా?
ఇప్పుడంతా ప్రణాళికాబద్ధంగా జరిగే కాలం. యువతీ యువకులకు తమ కెరియర్ ప్లానింగ్‌లో టైమే తెలియడం లేదు. దాంతో వారికి అనువైన సమయంలో ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే... అప్పుడు మనోరథం నెరవేరకపోతే సమస్యే కదా. అలాంటి సమస్యలేమీ రాకుండా... తాము కోరుకున్నట్లే పాపనో, బాబునో పొందడం కోసం దంపతులకు కొన్ని తేలికపాటి జాగ్రత్తలివే! ►కాబోయే తల్లి దండ్రులిద్దరూ ప్లానింగ్ చేసుకున్ననాటి నుంచి మంచి ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవాలి. అదీ వేళకు తింటూ ఉండాలి. అన్ని రకాల పోషకాలు అందేలా రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, తాజాపండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ►డాక్టర్‌ను సంప్రదించి ఫోలిక్ యాసిడ్ వంటి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండండి. ఇవి తీసుకోవడం వల్ల బిడ్డల్లో పుట్టుకతో వచ్చే అనేక లోపాలను నివారించవచ్చు. ►నిత్యం ఆహ్లాదకరమైన, సంతోషభరితమైన వాతావరణంలో ఉండండి. ఆహ్లాకరమైన సంగీతం వింటూ, టీవీ చూస్తున్నప్పుడు ఇలాంటి ప్రోగ్రాములే చూస్తూ ఉండండి. ఎప్పుడూ సానుకూల దృక్పథం (పాజిటివ్ యాటిట్యూడ్)తో ఉండండి. ►ఒత్తిడి ఎక్కువగా ఉండే వృత్తుల్లో ఉండేవారు వీలైతే కొద్ది రోజులు దాని నుంచి దూరంగా ఉండండి. ఇందుకోసం వీలైతే మళ్లీ మరో హనీమూన్‌కు వెళ్లిరండి. ►యువతుల్లో పీరియడ్స్ వచ్చిన 11వ రోజు నుంచి 18వ రోజు వరకు రోజూ సెక్స్‌లో పాల్గొనండి. ఈమధ్య రోజుల్లోనే అండం విడుదల (ఓవ్యులేషన్) జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో జరిగే కలయిక వల్లనే గర్భధారణ జరుగుతుంది. ►ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందుగా వీలైతే – మహిళలైతే పీసీఓ వంటి సమస్యలు ఉన్నాయేమోనని, పురుషులైతే స్పెర్మ్ కౌంట్ వంటి పరీక్షలు చేయించుకోవడం చాలా మేలు చేసే అంశం. అలాంటప్పుడు సమయం వృథాపోకుండా కొన్ని అవసరమైన చికిత్సలు అంది, మీ ప్లానింగ్ విజయవంతమవుతుంది. చేయకూడనివి... ►ఆహార పదార్థాల్లో ఉప్పు, చక్కెర, మసాలాలు, నూనెలు తక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ►ఈ టైమ్‌లో పురుషులు లాప్‌టాప్‌ను తమ ఒడిలో పెట్టుకుని పనిచేయడం లేదా తమ మొబైల్‌ఫోన్‌ను ప్యాంట్ జేబులో ఉంచుకోవడం... ఈ రెండుపనులూ చేయకూడదు. (ఇవి శుక్రకణాల నాణ్యతను దెబ్బతీస్తాయనే అంశం ఇంకా నిర్ధారణ కాలేదు. కాబట్టి ఆ విషయంలో ఆందోళన వద్దు. అయితే స్పెర్మ్ నాణ్యత బాగుండటం కోసం ప్రకృతి కొన్ని మంచి ఏర్పాట్లు చేసింది. మనంతట మనమే అక్కడ ఉష్ణోగ్రత పెరిగేందుకు ఆస్కారం ఇస్తే ఎలా? అందుకే ల్యాప్‌టాప్‌తో పనిచేయడం వల్ల వాటి ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం లేదా అవి మందకొడిగా మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టే ఈ జాగ్రత్త). ►దంపతులిద్దరూ గర్భధారణ సక్రమంగా జరగడానికి కృషి చేయాలి. కడుపు పండటానికి అంటూ కొందరు... పల్లెటూళ్లలో ఇచ్చే నాటుమందులనూ, హెర్బల్ మందులను సిఫార్సు చేస్తుంటారు. మీ డాక్టర్ సలహా లేకుండా అలాంటివేమీ వాడకండి. అవి మీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీయవచ్చు. ►సోయా ఉత్పాదనలు, టోఫూ వంటి వాటిని ఎక్కువపాళ్లలో తీసుకోవద్దు. ►ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత దంపతులు మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. టీ, కాఫీ వంటి పానీయాలను కూడా చాలా పరిమితంగా తీసుకోవడమే మంచిది. ►ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత తొలినాళ్లలోనే గర్భధారణ జరగకపోతే అంతలోనే నిరాశ వద్దు. కనీసం ఏడాదిపాటైనా ప్రయత్నించాక... అప్పుడు మాత్రమే డాక్టర్‌ను సంప్రదించాలి. పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటి? పార్కిన్సన్స్ కౌన్సెలింగ్స్ మా తాతగారి వయసు 68 ఏళ్లు. ఈమధ్య చాలా బలహీనంగా తయారయ్యారు. చేతులు, కాళ్లు, తల చాలా ఎక్కువగా వణుకుతున్నాయి. మాట్లాడే విధానం కూడా మారింది. ఇదివరలో ఎన్నడూలేనంత గంభీరంగా తయారయ్యారు. ఎంతో ఇష్టంగా తినే వంటలు కూడా ఏమాత్రం ఇష్టం లేదంటున్నారు. ఏం పెట్టినా రుచిలేని తిండి పెడుతున్నారంటూ లేచి వెళ్లిపోతున్నారు. మాకు దగ్గర్లోని పెద్దాసుపత్రిలో చూపిస్తే పార్కిన్సన్స్ వ్యాధి వస్తున్నట్లు కనిపిస్తోందని స్పెషలిస్టు డాక్టర్‌కు చూపించమని చెప్పారు. పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటి? ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? చికిత్స ఏమిటి? దయచేసి వివరంగా తెలపండి. – ఎ. సందీప్, కరీంనగర్ పార్కిన్సన్స్ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీకణాలు దెబ్బతినడం, క్షీణించడం కారణంగా ఇది వస్తుంది. డోపమైన్ మెదడులోని వివిధ భాగాలకూ... శరీరంలోని నాడీ వ్యవస్థకు మధ్య సమాచార మార్పిడి (కమ్యూనికేషన్)కి తోడ్పడే కీలకమైన రసాయనం. దీనికి తయారుచేసే కణాలు క్షీణించడం వల్ల మెదడు దేహంలోని అవయవాలను అదుపుచేయగల సామర్థ్యాన్ని కోల్పోతుంది. దాంతో శరీరభాగాలు ప్రత్యేకించి చేతులు, కాళ్లు, తల వణుకుతుంటాయి. శరీరంలోని కండరాలు బిగుతుగా తయారవుతాయి. మాట్లాడే విధానంలో తీవ్రమైన మార్పులు వస్తాయి. వ్యక్తి బలహీనంగా తయారవుతాడు. ఈ వ్యాధి నెమ్మదిగా పెరుగుతూ తీవ్రస్థాయికి చేరుకుంటుంది. సాధారణంగా అరవై ఏళ్లకు పైబడ్డవారే ఎక్కువగా పార్కిన్సన్స్ వ్యాధికి గురవుతుంటారు. కొన్ని కుటుంబాల్లో మాత్రం ఇది వంశపారంపర్యంగా వస్తూ, చిన్న వయసు వారిలోనూ కనిపిస్తుంటుంది. మన దేశంలో దాదాపు కోటికి పైగా మంది దీనితో బాధపడుతున్నారు. సరైన సమయంలో డాక్టర్‌ను సంప్రదించి ఆధునిక సౌకర్యాలు ఉన్న పెద్ద ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం ద్వారా దీన్ని అదుపు చేయడానికి వీలుంటుంది. పార్కిన్సన్స్ వ్యాధి చికిత్స ఇటీవల సమూలంగా మారిపోయింది. ఈ వ్యాధిగ్రస్తులు తమను వేధిస్తున్న లక్షణాలను అదుపు చేసుకొని, సాధారణ జీవితం గడిపేందుకు ఇదివరకు ఎన్నడూ లేని స్థాయిలో వైద్యపరమైన ఔషధాలు, సర్జికల్ చికిత్సలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. పార్కిన్సన్స్ వ్యాధి మధ్యస్థాయిలో ఉండి శరీరక పరిమితులు ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో వ్యాధి లక్షణాలను అదుపు చేయటంతో పాటు వాడుతున్న మందుల నుంచి గరిష్ఠప్రయోజనం పొందేందుకు ఇప్పుడున్న ఆధునిక చికిత్సలు తోడ్పడుతున్నాయి. చికిత్స : ప్రధానంగా వ్యాధి లక్షణాలను అదుపు చేసి, వ్యాధిగ్రస్తులు సాధారణ జీవితాలు గడిపే లక్ష్యంగా ఈ చికిత్స జరుగుతుంటుంది. ఇందుకుగాను వ్యాధి తీవ్రత, రోగి ఆరోగ్యపరిస్థితి, శరీరతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చికిత్స వ్యూహాన్ని రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకు మందులు, ఫిజియోథెరపీ, అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స ఉపయోగపడతాయి. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట కనిపెట్టిన ‘ఎల్ డోపా’ అనే ఔషధం వణుకుడు వ్యాధికి సమర్థంగా పనిచేస్తున్నది. శక్తిమంతమైన ఈ మందును డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. లేనిపక్షంలో మోతాదులో ఏవైనా లోటుపాట్లు జరిగితే మొత్తంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది మెదడులోని ముఖ్యమైన నాడీకణాలకు సహాయపడుతూ డోపమైన ఉత్పత్తి జరిగేట్లు చేస్తుంది. దాంతో అవయవాలు బిగుసుకుపోవడం, వణుకుడు తగ్గుతుంది. డీబీఎస్ శస్త్రచికిత్స అంటే? మా మామగారికి 60 ఏళ్లు. చేతి వేళ్లలో వణుకు మొదలైంది. ఆపైన చేయి, కాలు వణుకుతుంటాయి. ఏ పనీ చేయకుండా ఉన్న సమయంలో కూడా చేతివేళ్లు, చెయ్యి, కాళ్లు, సెకనుకు నాలుగైదుసార్లు వణుకుతుంటాయి. అదేవిధంగా చూపుడువేలు, బొటనవేలు లయబద్దంగా రాపిడికి గురవుతుంటాయి. చేతులు, కాళ్లు వణికే ఈ పరిస్థితిలో నడవడం చాలా ఇబ్బందికరం అవుతోంది. డాక్టర్‌కి చూపిస్తే ఇవి పార్కిన్సన్ లక్షణాలుగా గుర్తించారు. ఈ వ్యాధిని నిరోధించడంలో ‘డీబీఎస్’ శస్త్రచికిత్స బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. డీబీఎస్ సర్జరీ అంటే ఏమిటి? దాంతో ఉపయోగం ఏమిటి? వివరంగా తెలపగలరు. – శ్రావణి, ఏలూరు పార్కిన్సన్స్ వ్యాధికి సంబంధించి చేసే చికిత్సల్లో డీబీఎస్ (డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్) కీలకమైన శస్త్రచికిత్స. పార్కిన్సన్స్ వ్యాధి పెరుగుదలను నిరోధించడంలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) శస్త్రచికిత్స ఎంతగానో తోడ్పడుతున్నట్లు గుర్తించారు. గుండెపనితీరును మెరుగుపరిచేందుకు పేస్‌మేకర్ అమర్చినట్లుగానే ఈ సర్జరీ ద్వారా మెదడులో ఎలక్ట్రోడ్‌ను అమరుస్తారు. ఇందుకుగాను ముందుగా ఎమ్మారై, సీటీస్కాన్ ద్వారా వ్యాధిగ్రస్తుల మెదడులో సమస్య ఎక్కడ ఏర్పడిందో గుర్తిస్తారు. ఆ పైన చిన్న ఎలక్ట్రోడ్‌ను అమరుస్తారు. దీనికి ఓ చిన్న బాటరీ–తీగ ఉంటాయి. మెదడులోని కొన్ని కణాలను తొలగించడం, మరికొన్ని భాగాలకు ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా వ్యాధి ముదరకుండా చేయగలుగుతారు. అలా డోపమైన్ తయారీని పునరుద్ధరించవచ్చు. పెద్దగా రక్తస్రావం జరగకుండా, ఇంజక్షన్లు అవకాశం లేకుండా పూర్తయ్యే ఈ శస్త్రచికిత్స వల్ల మెదడు... తన శరీర భాగాలను తన అదుపులోకి తెచ్చుకోవడం సాధ్యపడుతుంది. ఇది పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలను తీసివేయలేదు గానీ వాటిని అదుపులో ఉంచగలదు. ఇది సంక్లిష్టమైన, క్రమం తప్పకుండా న్యూరలాజికల్ ఫాలోఅప్ అవసరమైన శస్త్రచికిత్స. అయితే ఔష«ద చికిత్స అందిస్తున్నప్పటికీ, రోగి పరిస్థితి ఆమోదకరం కాని స్థితికి దిగజారినప్పుడు డీబీఎస్ ప్రభావశీలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణియమ్, సీనియర్ న్యూరోసర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
మిద్దె తోటలో మొక్కజొన్న
మిద్దె తోటల్లో కూడా మొక్కజొన్నను అన్ని కాలాల్లోనూ బాగా పండించుకోవచ్చు. పెద్దగా తెగుళ్లు రావు. నాటిన రెండు నెలలకు, పొత్తులు తయారవుతాయి. మరో నెల దాకా అవసరాలకు పనికివస్తాయి. ఉదయాన్నే ఒకటో రెండో మొక్కజొన్న పొత్తులు తినండి. ఉప్పూ నూనెల తిండ్లకు దూరంగా ఉండండి. ఒక మొక్కజొన్న పొత్తు తింటే, మరే టిఫిన్ అవసరం లేదు. ఆకలి అవదు. మలబద్ధకం ఉండదు. అనేక సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. పాలిష్ చేసిన తెల్ల అన్నం తినటం కంటే, మొక్కజొన్న పొత్తును తినడం నయం. పొత్తుల్ని కాల్చుకొని తినడం కంటే, లైట్‌గా ఉడికించి తినడం మంచిది. అడుగు(ఫీటు) లోతు మట్టి ఉంటే చాలు, మొక్కజొన్నను పెంచుకోవచ్చు. ఎటు చూపినా పది అంగుళాలకు ఒక విత్తనాన్ని నాటుకోవాలి. అర అంగుళం లోతులో విత్తనాలను నాటుకోవాలి. నాటాకా మడి మొత్తం తడిసేలా నీరు పెట్టాలి. మట్టి నాలుగైదు వంతులు, ఎరువు ఒక వంతు చొప్పున కలిపి వాడాలి– మడుల్లో. ఆహార వైవిధ్యం పాటించాలి. మనం ఆరోగ్యంగా జీవించాలి. – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దెతోట నిపుణులు -
అరికల వంటలు
అరికలు (Kodo Millet) నియాసిన్ (Niacin)mg (B3) 2.0 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.09 థయామిన్(Thiamine) mg (B1) 0.33 ఐరన్ (Carotene)ug 0 కాల్షియం (Calcium)g 0.04 ఫాస్పరస్ (Phosphorous)g 0.24 ప్రొటీన్ (Protein)g 6.2 ఖనిజాలు (Minerals) g 2.6 పిండిపదార్థం(Carbo Hydrate) g 65.6 పీచు పదార్థం (Fiber) g 9.0 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 7.28 కొర్ర బ్రెడ్ కావలసినవి: కొబ్బరి పాలు – అర కప్పుకొర్ర పిండి – ఒక కప్పుఈస్ట్ – అర టీ స్పూను, నీళ్లు – అర కప్పుబెల్లం పొడి – 2 టీ స్పూన్లు.ఉప్పు – తగినంతబ్రెడ్ ఇంప్రూవర్ – 0. 05 గ్రా. గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు తయారీ: స్టౌ మీద బాణలిలో నీళ్లు పోసి వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉండగానే అందులో ఈస్ట్, బెల్లం పొడి, ఉప్పు వేసి కలిపి దింపేయాలి. కొబ్బరి పాలు జత చేయాలి. కొర్ర పిండి, గోధుమ పిండి, బ్రెడ్ ఇంప్రూవర్ మూడింటినీ కలుపుకుని, అప్పడాల పీట మీద వేసి బాగా కలపాలి. ఒక గిన్నెకు నూనె పూసి, ఈ తయారైన పిండి ముద్దను అందులో పెట్టి, మూత పెట్టి, రెండు గంటలపాటు నాననివ్వాలి. అప్పుడు అది పొంగుతుంది. అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర వేడి చేయాలి. బన్ పాన్ తీసుకుని దానికి నూనె పూయాలి. ఈ తయారైన ముద్దను మళ్లీ పది నిమిషాల పాటు బాగా కలపాలి. ఆ తరవాత ట్రే లో ఉంచి, అవెన్‌లో పెట్టి పావు గంట సేపు బేక్ చేసి తీసేయాలి. అరికల అట్టు కావలసినవి: అరికలు – అర కప్పు, కంది పప్పు – పావు కప్పు, పచ్చి సెనగ పప్పు – పావు కప్పు, పెసర పప్పు – ఒక టీ స్పూను, మినప్పప్పు – ఒక టీ స్పూను, ఎండు మిర్చి – 2 సోంపు – ఒక టీ స్పూను, ఉల్లి తరుగు – పావు కప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను, పుదీనా తరుగు – ఒక టేబుల్ స్పూను ఉప్పు – తగినంత తయారీ: ఒక పెద్ద గిన్నెలో అరికలు, కంది పప్పు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, పెసర పప్పు వేసి తగినన్ని నీళ్లు జత చేసి నాలుగు గంటల పాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీలో ఎండు మిర్చి, సోంపు జత చే సి మరోమారు గ్రైండ్ చేసి, ఇడ్లీపిండికి, దోసెల పిండికి మధ్యరకంగా రుబ్బి, పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు జత చేసి, మూత పెట్టి సుమారు గంటసేపు పిండిని నాననివ్వాలి. స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, కొద్దిగా నూనె వేసి కాగాక, గరిటెతో పిండి తీసుకుని పెనం మీద దోసె మాదిరిగా వేయాలి. అంచులు గోధుమరంగులోకి వచ్చాక ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి. పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు వేసి అలంకరించి దోసెను మధ్యకు మడత వేసి తీసేయాలి. కొబ్బరి చట్నీ లేదా అల్లం పచ్చడితో వేడివేడిగా అందించాలి. అరికల పులావు కావలసినవి: అరికల బియ్యం – ఒక కప్పు, ఉల్లి తరుగు – ఒక కప్పు, నిలువుగా తరిగిన పచ్చి మిర్చి – 4అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు, కూరగాయ ముక్కలు – ఒక కప్పు (క్యారట్, బఠాణీ, బీన్స్, క్యాప్సికమ్)షాజీరా – అర టీ స్పూను, ధనియాల పొడి – ఒక టీ స్పూను, నిమ్మ రసం – ఒక టీ స్పూను నెయ్యి/నూనె – 2 టేబుల్ స్పూన్లు, షాజీరా – అర టీ స్పూను, పుదీనా తరుగు – పావు కప్పుఉప్పు – తగినంత, బిర్యానీ మసాలా దినుసులు, బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క – చిన్న ముక్క లవంగాలు – 4, ఏలకులు – 2, మిరియాలు – అర టీ స్పూను సోంపు – అర టీ స్పూను, జాపత్రి – కొద్దిగా తయారీ: అరికల బియ్యాన్ని రెండుమూడు సార్లు కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి. బిర్యానీ మసాలా దినుసులన్నీ రెండున్నర కప్పుల నీళ్లలో మరిగించి, వడకట్టి పక్కన ఉంచాలి. స్టౌ మీద మందపాటి గిన్నెలో నెయ్యి/నూనె పోసి వేడి అయిన తరవాత షాజీరా, పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు, కూరగాయ ముక్కలు ఒకదాని తరవాత ఒకటి వేస్తూ దోరగా వేయించుకోవాలి. పుదీనా, అల్లం వెల్లుల్లి ముద్ద చేర్చుకుని పచ్చి వాసన పోయేవరకు కలియబెట్టాలి. వడకట్టుకున్న నీళ్లు, ఉప్పు జత చేసి మరగనివ్వాలి. నానబెట్టుకున్న అరికల బియ్యంలో నీళ్లు ఒంపేసి, అరికలను మరుగుతున్న నీటిలో వేసి మూతపెట్టి, సన్నటి మంట మీద పులావు వండుకోవాలి. మధ్యలో ఒకటిరెండుసార్లు గరిటñ తో కలిపి మూత ఉంచి ఉడికించాలి. దించే ముందు ధనియాల పొడి, నిమ్మ రసం, నెయ్యి వేసి పూర్తిగా కలియబెట్టి దింపేయాలి. పుదీనా చల్లి, వేడివేడిగా అందించాలి. -
కొర్రల వంటలు
కొర్ర మామిడి అన్నం కావలసినవి: కొర్ర బియ్యం – ఒక గ్లాసుడుమామిడి తురుము – అర కప్పు అల్లం తురుము – ఒక టీ స్పూనుఉప్పు – తగినంత నెయ్యి/నూనె – 2 టేబుల్ స్పూన్లు పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు మినప్పప్పు – 2 టీ స్పూన్లు ఎండు మిర్చి – 4 తరిగిన పచ్చి మిర్చి – 5 ఆవాలు – ఒక టీ స్పూను మెంతులు – పావు టీ స్పూను పసుపు – పావు టీ స్పూను ఇంగువ – పావు టీ స్పూను కరివేపాకు – 3 రెమ్మలు తయారీ: కొర్ర బియ్యాన్ని సుమారు మూడు గంటలపాటు నానబెట్టిన తరవాత నీళ్లు ఒంపేసి, తగినన్ని మంచినీళ్లు జత చేసి అన్నం ఉడికించాలి. ఉడికిన కొర్ర అన్నాన్ని వేడిగా ఉండగానే ఒక ప్లేటులో ఆరబెట్టుకోవాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి/నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. మామిడి తురుము జత చేసి ఐదు నిమిషాల పాటు వేయించి, దింపి చల్లారాక, కొర్ర అన్నంలో వేసి బాగా కలపాలి. ఉప్పు జత చేసి మరోమారు కలపాలి. రెండు గంటల పాటు బాగా ఊరిన తరవాత తినాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? కొర్రలు (Foxtail Millet) నియాసిన్ l (Niacin)mg (B3) 0.7 రిబోఫ్లావిన్(Rivoflavin)mg (B2) 0.11 థయామిన్ (Thiamine) mg (B1) 0.59 కెరోటిన్ (Carotene)ug 32 ఐరన్(Iron)mg 6.3 కాల్షియం (Calcium)g 0.03 ఫాస్పరస్(Phosphorous)g 00.29 ప్రొటీన్ (Protein)g 12.3 ఖనిజాలు (Minerals) g 3.3 పిండిపదార్థం (Carbo Hydrate) g 60.6 పీచు పదార్థం(Fiber) g 8.0 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 7.57 కొర్ర దోసె కావలసినవి: కొర్రలు – 3 కప్పులు, మినప్పప్పు – ఒక కప్పుఉప్పు – తగినంత, మెంతులు – పావు టీ స్పూను నూనె – తగినంత తయారీ: మెంతులు, మినప్పప్పు, కొర్రలను విడివిడిగా తగినన్ని నీళ్లు జత చేసి, ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం నీళ్లు ఒంపేయాలి. గ్రైండర్లో మినప్పప్పు, కొర్రలు, మెంతులు వేసి కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ దోసెల పిండి మాదిరిగా మెత్తగా రుబ్బుకోవాలి. సుమారు ఆరేడు గంటలు బాగా ఊరిన తరవాత తగినంత ఉప్పు జత చేయాలి. స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి/నూనె వేయాలి. రుబ్బి ఉంచుకున్న పిండిని గరిటెతో తీసుకుని దోసె మాదిరిగా వేయాలి. చుట్టూ నెయ్యి/ నూనె వేసి కాలిన తరవాత, తిరగేసి రెండో వైపు కూడా కాలిన తరవాత ప్లేటులోకి తీసుకోవాలి. కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి. కొర్ర కొబ్బరి అన్నం కావలసినవి: కొర్ర బియ్యం – ఒక కప్పుకొబ్బరి తురుము – ఒక కప్పుకొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లుఉప్పు – తగినంతనెయ్యి – 2 టీ స్పూన్లుపోపు కోసంజీలకర్ర – ఒక టీ స్పూనుపచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లుమినప్పప్పు – 1 టీ స్పూనుఅల్లం తురుము – ఒక టీ స్పూనుపచ్చి మిర్చి తరుగు – అర టీ స్పూనుఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి)కరివేపాకు – 2 రెమ్మలు జీడిపప్పులు – 10 తయారీ: కొర్ర బియ్యాన్ని రెండు గంటల పాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి అన్నం ఉడికించాలి. వెంటనే వెడల్పాటి పళ్లెంలో పోసి పొడిపొడిగా చేసి చల్లారబెట్టుకోవాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీలకర్ర, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, జీడిపప్పులు, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి. కొబ్బరి తురుము చేర్చి రెండు నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తగినంత ఉప్పు, జత చేసి బాగా కలిపి దింపేయాలి. కొర్రల అన్నం మీద వేసి కలియబెట్టి, కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి. కొర్ర ఇడ్లీ కావలసినవి: కొర్రల రవ్వ – 3 కప్పులు, మినప్పప్పు – ఒక కప్పు నెయ్యి/నూనె – తగినంత, ఉప్పు – తగినంత తయారీ: మినప్పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు మూడు గంటలసేపు నానబెట్టాలి. కొర్ర రవ్వకు తగినన్ని నీళ్లు జత చేసి మూడు గంటలసేపు నానబెట్టాలి. పప్పులో నీళ్లు వడగట్టేసి, మినప్పప్పును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. రవ్వలో నీటిని గట్టిగా పిండి తీసేసి, రుబ్బిన పిండిలో కలుపుకోవాలి. తగినంత ఉప్పు జత చేసి సుమారు ఆరేడు గంటలు నానబెట్టాలి. ఇడ్లీరేకులకు నెయ్యి/నూనె పూసి, పిండిని గరిటెతో వేసి, ఇడ్లీ కుకర్‌లో ఉంచి, స్టౌ మీద పెట్టి, ఆవిరి మీద ఉడికించాలి. వేడి వేడి ఇడ్లీలను చట్నీతో వడ్డించాలి. కొర్ర రొట్టెలు కావలసినవి: కొర్ర పిండి – 100 గ్రా., ఉప్పు – తగినంత, నెయ్యి – తగినంత, నీళ్లు – తగినంత తయారీ: కొర్ర పిండిని శుభ్రంగా జల్లించి పక్కన ఉంచాలి. వేడి నీళ్లను కొద్దికొద్దిగా జత చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలిపిన పిండి మీద తడిబట్ట వేసి రెండు గంటలపాటు ఉంచాలి. తరువాత ఉండలు చేసి పక్కన ఉంచాలి. కొద్దికొద్దిగా పిండి జత చేస్తూ, గుండ్రంగా ఒత్తాలి. ముందుగా వేడి చేసిన పెనం మీద రెండు పక్కలా నెయ్యి వేసి కాల్చి తీయాలి. వేడిగా కూరలతో గాని, పప్పుతో గాని తింటే రుచిగా ఉంటాయి. కొర్రల తీపి పొంగలి కావలసినవి: కొర్రలు – అర కప్పు, పెసర పప్పు – అర కప్పు, కొబ్బరి పాలు – 2 కప్పులుబెల్లం పొడి – ఒక కప్పు, ఏలకుల పొడి – పావు టీ స్పూనునెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు, జీడి పప్పులు – 10 ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూను తయారీ: పెసర పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి. ఒక చిన్న గిన్నెలో కొర్రలు, కొబ్బరి పాలు వేసి స్టౌ మీద ఉంచి మెత్తగా ఉడికించాలి. ఉడికించిన పెసరపప్పు జత చేసి బాగా కలియబెట్టాలి. బెల్లం పొడి, ఏలకుల పొడి జత చేసి మరోమారు కలియబెట్టి, దింపేయాలి. స్టౌ మీద చిన్న బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఉడికిన పొంగలిలో వేసి కలియబెట్టి, వేడివేడిగా వడ్డించాలి. కొర్రల హల్వా కావలసినవి: నెయ్యి – ఒక కప్పు కొబ్బరి పాలు – ఒక కప్పు కొర్ర పిండి – ఒక కప్పు బెల్లం పొడి – ఒక కప్పు జీడి పప్పులు – 10 కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను బాదం పప్పులు – ఒక టేబుల్ స్పూను తయారీ: స్టౌ మీద బాణలిలో ఒక చెంచాడు నెయ్యి వేసి కరిగాక, కొర్ర పిండి వేసి దోరగా వేయించాలి. కొబ్బరి పాలు జత చేసి బాగా కలియబెట్టాలి. కొద్దిగా ఉడుకుతుండగా, బెల్లం పొడి వేసి అది కరిగేవరకు కలుపుతుండాలి. మిగతా నెయ్యి జత చేసి బాగా కలిపి ఉడికించాలి. చిన్న బాణలి స్టౌ మీద ఉంచి కొద్దిగా నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు, కిస్మిస్, బాదం పప్పులు వేసి దోరగా వేయించి, ఉడికించిన హల్వాలో వేసి కలపాలి. కొద్దిగా చల్లారాక కప్పులలో అందించాలి. కొర్ర సాంబారు అన్నం కావలసినవి: కొర్ర బియ్యం – ఒక గ్లాసు కంది పప్పు – ఒక గ్లాసుచింతపండు గుజ్జు – 2 టీ స్పూన్లుఉప్పు – తగినంతకూరగాయ ముక్కలు – ఒక కప్పు (క్యారట్, బీన్స్, మునగకాడ మొదలైనవి)నెయ్యి లేదా నూనె – 2 టీ స్పూన్లుకొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లుబిసిబేళబాత్ మసాలా – 2 టీ స్పూన్లుపోపు కోసంఆవాలు – ఒక టీ స్పూనుకరివేపాకు – 2 రెమ్మలుఎండు మిర్చి – 2పచ్చిమిర్చి – 2– జీడిపప్పు – 10ఇంగువ – పావు టీ స్పూనుఉల్లి తరుగు – పావు కప్పు తయారీ: కొర్ర బియ్యం, కంది పప్పులను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలో విడివిడిగా సుమారు మూడు గంటలపాటు నానబెట్టాలి. కూరగాయ ముక్కలను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఐదుగ్లాసుల నీరు మరగబెట్టాలి. నీళ్లు మరుగుతుండగా కంది పప్పు వేసి మూడు వంతులు ఉడికిన తరవాత, కొర్ర బియ్యం కూడా చేర్చి మెత్తగా ఉడికించాలి. స్టౌ మీద బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి కాగాక ఆవాలు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఉల్లి తరుగు, కరివేపాకు, జీడిపప్పులు, ఇంగువ వేసి దోరగా వేయించాలి. చింత పండు గుజ్జు, ఉప్పు జత చేసి కొద్దిసేపు ఉడికించాలి. బిసిబేళబాత్ మసాలా వేసి కలపాలి. మెత్తగా ఉడికించిన కొర్రబియ్యం, కంది పప్పు మిశ్రమాన్ని జత చేసి, మరో రెండు నిమిషాలు ఉడికించి దింపేయాలి. కొత్తిమీర, నెయ్యి వేసి కలియబెట్టి, అప్పడాలు, కారబ్బూందీ, పిండి వడియాలతో వేడివేడిగా వడ్డించాలి. కొర్ర బిస్కెట్లు కావలసినవి: కొర్ర పిండి – ఒక కప్పు, బేకింగ్ పౌడర్ – పావు టీ స్పూను నెయ్యి – ఒక టేబుల్ స్పూను, బెల్లం పొడి – అర కప్పు వెనిలా ఎసెన్స్ – కొద్దిగా, ఉప్పు – చిటికెడు తయారీ: ముందుగా కొర్ర పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు కలిపి జల్లెడ పట్టాలి. నెయ్యిని ప్లానిటరీ మిక్సర్‌లో వేసి అరగంట సేపు బాగా కలపాలి. జల్లించిన పిండిని, బెల్లం పొడిని జత చేసి మరో ఐదు నిమిషాలు కలిపి బయటకు తీయాలి. వెనిలా ఎసెన్స్ జత చేయాలి. అంగుళం మందంలో పిండిని ఒత్తాలి. బిస్కెట్ కటర్‌తో కావలసిన ఆకారంలో బిస్కెట్లను కట్ చేయాలి. 150 డిగ్రీల దగ్గర అవెన్‌ను ప్రీ హీట్ చేసి, తయారుచేసి ఉంచుకున్న బిస్కెట్లను అందులో ఉంచి సుమారు అరగంటసేపు బేక్ చేసి బయటకు తీయాలి. కొద్దిగా చల్లారాక గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి. ఇవి నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి. కొర్ర వెజిటబుల్ బిర్యానీ కావలసినవి: కొర్రలు – పావు కేజీతరిగిన ఉల్లిపాయ – 1క్యారట్ తరుగు – పావు కప్పుబీన్స్ తరుగు – పావు కప్పుఅల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లుఉప్పు – తగినంతతరిగిన పచ్చి మిర్చి – 4పచ్చి బఠాణీ – ఒక టేబుల్ స్పూనుటొమాటో తరుగు – అర కప్పుపుదీనా తరుగు – అర కప్పుకొత్తిమీర – అర కప్పుతరిగిన బంగాళ దుంప – 1నిమ్మ రసం – 2 టీ స్పూన్లుపెరుగు – ఒక టేబుల్ స్పూనునెయ్యి/నూనె – 2 టేబుల్ స్పూన్లుధనియాల పొడి – ఒక టీ స్పూనుజీలకర్ర పొడి – ఒక టీ స్పూనుబిర్యానీ మసాలా – 2 టీ స్పూన్లుగరం మసాలా – ఒక టీ స్పూనుఉడకబెట్టడానికి నీళ్లు – తగినన్ని తయారీ: కొర్రలకు నీళ్లు జత చేసి సుమారు రెండుగంటల సేపు నానబెట్టాలి. పచ్చి బఠాణీ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి/నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు, బంగాళ దుంప ముక్కలు, పెరుగు, క్యారట్ తరుగు, బీన్స్ తరుగు వేసి దోరగా వేయించాలి (క్యారట్ బీన్స్ తక్కువగా వేగాలి. బీన్స్ కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది). స్టౌ మీద పెద్ద పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి. మరుగుతుండగానే ఉప్పు, నెయ్యి/నూనె, బిర్యానీ మసాలా, గరం మసాలా వేసి దోరగా వేయించాలి. నానబెట్టిన కొర్ర బియ్యాన్ని వేసి కలపాలి. కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడే ఒకసారి వార్చుకోవాలి. వార్చిన తరవాత కొద్దిగా చల్లటి నీళ్లు జల్లి పక్కన పెట్టాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి వేడయ్యాక పచ్చి మిర్చి వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు దోరగా వేయించాలి. టొమాటో తరుగు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. టొమాటో వేగుతుండగానే, వేయించి ఉంచుకున్న కూరగాయ ముక్కలు సగం వేసి వేయించాలి. బఠాణీ జత చేయాలి. ఆ తరువాత ఉడికించిన కొర్ర బియ్యం ఈ కూరల మీద పొరగా ఒక వరుస వేయాలి. నిమ్మ రసం, కొద్దిగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, జీలకర్ర పొడి సమానంగా పైన చల్లాలి. చిన్న పాత్రలో కొద్దిగా పాలు, మిఠాయి రంగు వేసి కలిపి, మసాలా పొడి మీద చల్లాలి. ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, టొమాటో తరుగు, పుదీనా తరుగు పైన వేసి మూత పెట్టి, పది నిమిషాలు చిన్న మంట మీద ఉడికించాలి. పది నిమిషాల తరవాత కొర్ర బిర్యానీ వేసుకునేటప్పుడు ఒక పక్క నుండి తీసుకోవాలి. కొర్రలు – క్యాబేజీ ముత్తియాస్ కావలసినవి: తురిమిన క్యాబేజీ – ఒక కప్పుకొర్ర పిండి – ఒక కప్పుపెరుగు – 5 టేబుల్ స్పూన్లునిమ్మ రసం – ఒక టీ స్పూనుఅల్లం + పచ్చి మిర్చి ముద్ద – ఒక టీ స్పూనుపసుపు – అర టీ స్పూను బేకింగ్ సోడా – చిటికెడుఉప్పు – తగినంతపోపు కోసంనెయ్యి/నూనె – ఒక టీ స్పూనుజీలకర్ర – ఒక టీ స్పూనుఇంగువ – పావు టీ స్పూనుకరివేపాకు – 4 రెమ్మలుకొత్తిమీర – అలంకరించడానికి తగినంత తయారీ: ఒక గిన్నెలో తురిమిన క్యాబేజీ, కొర్ర పిండి, పెరుగు, నిమ్మ రసం, అల్లం పచ్చి మిర్చి ముద్ద, పసుపు, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు జత చేసి మెత్తటి పిండిగా తయారుచేసుకోవాలి. ఉండలు చేసి, చేతితో వడ మాదిరిగా ఒత్తాలి. స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక కొద్దిగా నూనె వేసి, తయారుచేసి ఉంచుకున్న ముత్తియాస్లను ఒకటొక్కటిగా వేస్తూ రెండువైపులా కాల్చాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి/నూనె వేసి కాచాలి. జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి కొద్దిగా వేయించాలి. తయారుచేసి ఉంచుకున్న ముత్తియాస్ని పోపులో వేసి వేయించాలి. కొత్తిమీరతో అలంకరించి సాస్‌తో ప్లేట్లో ఉంచి అందించాలి. కొర్ర బ్రెడ్ కావలసినవి: కొబ్బరి పాలు – అర కప్పుకొర్ర పిండి – ఒక కప్పుఈస్ట్ – అర టీ స్పూను, నీళ్లు – అర కప్పుబెల్లం పొడి – 2 టీ స్పూన్లు.ఉప్పు – తగినంతబ్రెడ్ ఇంప్రూవర్ – 0. 05 గ్రా. గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు తయారీ: స్టౌ మీద బాణలిలో నీళ్లు పోసి వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉండగానే అందులో ఈస్ట్, బెల్లం పొడి, ఉప్పు వేసి కలిపి దింపేయాలి. కొబ్బరి పాలు జత చేయాలి. కొర్ర పిండి, గోధుమ పిండి, బ్రెడ్ ఇంప్రూవర్ మూడింటినీ కలుపుకుని, అప్పడాల పీట మీద వేసి బాగా కలపాలి. ఒక గిన్నెకు నూనె పూసి, ఈ తయారైన పిండి ముద్దను అందులో పెట్టి, మూత పెట్టి, రెండు గంటలపాటు నాననివ్వాలి. అప్పుడు అది పొంగుతుంది. అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర వేడి చేయాలి. బన్ పాన్ తీసుకుని దానికి నూనె పూయాలి. ఈ తయారైన ముద్దను మళ్లీ పది నిమిషాల పాటు బాగా కలపాలి. ఆ తరవాత ట్రే లో ఉంచి, అవెన్‌లో పెట్టి పావు గంట సేపు బేక్ చేసి తీసేయాలి. -
పాలు రుబ్బండి... గొడుగు పట్టండి!
ఇప్పటి పశువుల పాలు ఒకనాటి పాలు కావు. రసాయన అవశేషాలుండే ఆ పాలు తాగితే మనమూ అనారోగ్యం పాలు కావచ్చు. ఇల్లూ ఆఫీసూ ఇవే జీవితమైపోయిన మనకు ఎండ ఎండమావి అయిపోయింది. విటమిన్–బి 12, విటమిన్–డి లోపాలకు మందులు అక్కర్లేదు... రుబ్బిన పాలు, పట్టించే గొడుగు చాలంటున్నారు స్వతంత్ర శాస్త్రవేత్త ఖాదర్‌వలి. ఆరోగ్యవంతమైన జీవనానికి పోషకాలతోపాటు విటమిన్ డి, విటమిన్ బి–12 అత్యంత అవసరం. ఎండ తగలని జీవనశైలి వల్ల, భిన్నమైన డ్యూటీ సమయాల వల్ల విటమిన్–డి లోపం వస్తుంది. కొందరికి బి–12 లోపం వస్తోంది. ఈ సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలం మందులు వాడాల్సిందేనన్న భావన చాలా మందిలో ఉంది. అయితే ఈ రెండు ముఖ్య విటమిన్లూ, కాల్షియం కూడా దేశీయ ఆహార పదార్థాల్లోనే పుష్కలంగా ఉన్నాయంటున్నారు ప్రసిద్ధ స్వతంత్ర ఆరోగ్య, ఆహార శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్‌వలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ బీ 12 చాలా అవసరం. ఇది లోపించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బి 12 కేవలం మాంసాహారం ద్వారా లభిస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే కోడిగుడ్డు, కోడి, గొడ్డు, మేక, పంది, కుందేలు మాంసం.. ఇంకా ఏ జంతువు/పక్షిæనుంచి సేకరించిన మాంసాహారమైనా మనిషి దేహంలో హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుందే తప్ప సమతుల్యత కలిగించదు. నాటు జాతి కోళ్లు, పశువులను రసాయనాల్లేకుండా పెంచినవైనప్పటికీ వాటి గుడ్లు, మాంసం మనిషికి ఉపయోగపడవు. చిరుధాన్యాల పాలతో బి 12 విటమిన్ బి 12ను.. ఆ మాటకొస్తే ఏ విటమిన్‌ను అయినా టాబ్లెట్లు, ఇంజక్షన్ల రూపంలో కాకుండా ఆహారం ద్వారా తీసుకుంటేనే సరిగ్గా ఒంటికి పడుతుంది.ఆహారంలో ఇమిడి ఉంటేనే దేహం సజావుగా గ్రహించగలుగుతుంది. ఆహారం ద్వారా విటమిన్ బి 12ను పొందడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది.. దేశీ ఆవు పాలు, పెరుగు, మజ్జిగలో బి 12 విటమిన్ పుష్కలంగా ఉంది. ఈ పాలు తోడుపెట్టి చిలికి వెన్న తీసిన మజ్జిగను ఉదయం ఒక గ్రాసు, సాయంత్రం ఒక గ్లాసు తీసుకుంటే బి 12 విటమిన్ లోపం రాదు. రెండోది.. కుసుమలు, వేరుశనగలు, నువ్వులు మనకు నూనె గింజలుగా మాత్రమే తెలుసు. అయితే వీటి ద్వారా పాలు, ఆ పాలతో పెరుగు, మజ్జిగ తయారు చేసుకొని వాడుకోవడం పూర్వం మన దేశంలోని చాలా ప్రాంతాల్లో వాడుకలో ఉండేది. వీటితోపాటు సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలు, పచ్చి కొబ్బరితో కూడా చక్కని పాలు, పెరుగు, మజ్జిగ తయారు చేసుకొని నిక్షేపంగా వాడుకోవచ్చు. పశువుల మాంసం, పశువుల పాలకు బదులుగా ఈ పాలతో తయారు చేసిన పెరుగును, మజ్జిగను వాడుతూ ఉంటే బి 12 విటమిన్ లోపం రాదు. వచ్చినా కొద్ది వారాల్లో పోతుంది.పర్యావరణ దృక్కోణంలో చూసినా కూడా ఇదే సబబైన దారి. బి 12తోపాటు కాల్షియం కూడా.. నువ్వులు, రాగుల పాల ద్వారా బి 12తోపాటు మన దేహానికి అవసరమైనంత మేరకు కాల్షియం కూడా లభిస్తుంది. పశువుల పాలలో కన్నా నువ్వుల పాలతో తయారైన పెరుగు/మజ్జిగలో 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంది. నువ్వుల పాల పెరుగు అందుబాటులో లేకపోతే వారానికి ఒక నువ్వు లడ్డు తిన్నా లేదా వారానికి రెండు చెంచాల దోరగా వేపిన నువ్వులు తిన్నా పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరికైనా కాల్షియం లోపం దరిచేరదు. లోపం ఉంటే కొద్దివారాల్లోనే తగినంత సమకూరుతుంది. నేరుగా కాయకూడదు నూనె గింజలు, చిరుధాన్యాలు, పచ్చి కొబ్బరితో తయారు చేసుకునే పాలలో సాధారణ పశువుల పాలలో మాదిరిగా కొవ్వు ఎక్కువగా ఉండదు. అందువల్ల వీటిని గిన్నెలో పోసి నేరుగా పొయ్యి మీద కాయకూడదు. నురగ వచ్చి పొంగవు. అలా చేస్తే ఇరిగిపోతాయి. పొయ్యి మీద గిన్నెలో నీరు పోసి మరిగిస్తూ ఆ నీటిలో ఈ పాల గిన్నెను ఉంచి వేడిచేయాలి. గోరు వెచ్చగా కాగితే చాలు. మొదట్లో సాధారణ పెరుగు/మజ్జిగతోనే తోడు వేసుకోవాలి. అలా గింజల పాల ద్వారా తయారైన పెరుగు/మజ్జిగతోనే తోడు వేస్తూ ఉంటే కొన్నాళ్లకు పూర్తిగా ఈ పెరుగే సిద్ధమవుతుంది. పశువుల పాలు/పెరుగు/మజ్జిగకు బదులు నూనెగింజలు, చిరుధాన్యాలు, పచ్చి కొబ్బరి పెరుగు/మజ్జిగను తీసుకోవటం ఉత్తమం. పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరైనా నిశ్చింతగా వీటిని తాగవచ్చు. కుసుమ, వేరుశనగ, నువ్వులు, సజ్జలు, జొన్నలు, పచ్చి కొబ్బరిలలో మీకు ఏవి అందుబాటులో ఉంటే లేక ఏవి నచ్చితే వాటిని ఉపయోగించి పాలు తయారు చేసుకొని పెరుగు/మజ్జిగ చేసుకొని వాడుకోవచ్చు. ఒకే రకం పాలతో చేసిన పెరుగు/మజ్జిగ దీర్ఘకాలం పాటు నిరంతరాయంగా వాడకుండా ఉంటే మంచిది. వారానికి ఒక రకం తీసుకుంటే బాగుంటుంది. మీ నోట్లోకి వెళ్లే ప్రతి ముద్దా, ప్రతి నీటి చుక్కా సరైనదైతే.. సంపూర్ణ ఆరోగ్య వంతులవ్వడానికి ఏ ఔషధమూ అక్కర్లేదు. ఆహారం సరైనది కాకపోతే ఏ ఔషధమూ పనిచేయదు. దేశీయ ఆహారమే నిజమైన దివ్యౌషధం. ఈ వాస్తవాన్ని గుర్తిద్దాం. అందరమూ సంపూర్ణ ఆరోగ్యవంతులవుదాం. ఎలుగెత్తి చాటుదాం! – డాక్టర్ ఖాదర్ వలి, స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త, మైసూరు ఎండిన పుట్టగొడుగుల్లో పుష్కలంగా విటమిన్ డి! ఎండ వేళ ఆరుబయట తిరిగే అవకాశం లేని వారికి కాలక్రమంలో విటమిన్ డి లోపం వస్తుంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ తదితర రంగాల ఉద్యోగులు, బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లలో నివసించే వారిలో కూడా కొందరికి అసలు ఎండ పొడ సోకని పరిస్థితి ఉంటుంది. ఇటీవల కాలంలో విటమిన్ డి లోపాన్ని ఖరీదైన మాత్రల ద్వారా తగ్గించుకోవచ్చన్న ప్రచారం సాగుతోంది. నిజానికి, ఎటువంటి మందులూ అవసరం లేదు. పుట్టగొడుగులను ఎండబెట్టి వంట చేసుకొని తినటం ద్వారా విటమిన్ డి లోపం రాకుండా చూసుకోవచ్చు. పుట్టగొడుగుల్లో ఎర్గోస్టెరాల్ అనే పదార్థం ఉంటుంది. ఎండ తగిలినప్పుడు విటమిన్ డిగా మారుతుంది. అందువల్ల వారానికి రెండు, మూడుసార్లు ఎండు పుట్టగొడుగులు తింటూ ఉంటే కొన్ని వారాల్లో విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు. తాజా పుట్టగొడుగులను 3 గంటల పాటు ఎండబెట్టి, అదేరోజు కూర వండుకొని తినవచ్చు లేదా సూప్ చేసుకొని తాగవచ్చు. మరో పద్ధతి ఏమిటంటే.. పుట్టగొడుగులను 3–4 రోజులు ఎండలో పెట్టి పూర్తిగా ఒరుగుల మాదిరిగా చేసుకొని, గాజు సీసాల్లో నిల్వ చేసుకొని.. తదనంతరం అవసరమైనప్పుడు వాడుకోవడం. ఎండిన పుట్టగొడుగులను నీటిలో నానబెట్టి, తర్వాత కూర వండుకోవచ్చు. లేదా బాగా ఉడకబెట్టి జావ మాదిరిగా చేసుకొని తాగవచ్చు. ఏదో ఒక విధంగా?? రోజు మార్చి రోజు ఒకసారైనా ఎండు పుట్టగొడుగులు తింటూ ఉంటే.. 3 నెలల్లో విటమిన్ లోపాన్ని ఎటువంటి మందులూ వాడకుండానే అధిగమించవచ్చు. ఇప్పటికే లోపం వచ్చినా లోపాన్ని పూడ్చుకోవడానికి నిస్సందేహంగా ఆస్కారం ఉంది. ఎండలోకి వెళ్లే అవకాశం ఉన్న వారు కూడా బయటకు వెళ్లకపోవడం వల్ల కూడా విటమిన్ డి లోపానికి గురవుతూ ఉంటారు. అటువంటి వారు ఖాళీ ఉన్నప్పుడల్లా వీలైనప్పుడల్లా ఎండలో నడవటం ద్వారా విటమిన్ డి లోపాన్ని సరిచేసుకోవచ్చు. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో ఎండలో నడుస్తూ ఉంటే 3 నెలల్లో సమస్య తీరిపోతుంది. కనీసం వారానికి ఒక రోజు వంటికి నువ్వుల/కొబ్బరి నూనె రాసుకొని ఎండలో కొద్దిసేపు నిలబడినా కొద్ది వారాల్లో విటమిన్ డి లోపం తీరిపోతుంది. రాతి రోలులో రుబ్బి పాలు తయారు చేసుకునే పద్ధతి ఈ నూనెగింజలు/చిరుధాన్యాలను కనీసం 7, 8 గంటలు లేదా రాత్రి నానబెట్టి పొద్దున రాతి రుబ్బు రోలులో కొంచెం కొంచెం నీరు కలుపుతూ పొత్రంతో రుబ్బుతూ.. ఆ పిండిని పల్చని గుడ్డలోకి తోడుకొని పిండితే పాలు వస్తాయి. మిక్సీలో వేస్తే పాలు రావు. మోటారుతో నడిచే వెట్ గ్రైండర్‌ను వాడుకోవచ్చు. ఆ పిండిని మళ్లీ రోట్లో వేసి కొంచెం నీరు పోసి రుబ్బుతూ.. మళ్లీ పిండుకోవాలి. ఇలా అనేక సార్లు చేయడం ద్వారా వంద గ్రాముల నూనెగింజలు/చిరుధాన్యాలతో కనీసం లీటరు వరకు పాలు తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పాలను తోడు వేసి పెరుగు/మజ్జిగ చేసుకొని ఉదయం, సాయంత్రం గ్లాసు తీసుకున్నట్లయితే మందుబిళ్లల ద్వారా కన్నా ఎక్కువ మోతాదులో బి 12 మనకు అందుతుంది. మాంసాహారంతో హార్మోన్ అసమతుల్యత మనిషి దేహం మాంసాహారం భుజించడానికి అనువుగా నిర్మితమైనది కాదన్న వాస్తవాన్ని ప్రపంచం నెమ్మదిగా గుర్తిస్తోంది. మాంసాహారం కలిగించే హార్మోన్ల అసమతుల్యత వల్ల మనిషి దేహంలో జీవక్రియలు అస్తవ్యస్తమై అనేక అనారోగ్యాలు వస్తున్నాయన్న చైతన్యం కూడా పెరుగుతోంది. పారిశ్రామిక ప్రక్రియలతో అతి తక్కువ రోజుల్లోనే అధిక పరిమాణంలో మాంసం, గుడ్లు ఉత్పత్తి చేయడానికి కోళ్లు, వివిధ జంతువులకు తినిపించే కృతకమైన పదార్థాలు, అందులో కలిపే రసాయనాలు, గ్రోత్ హార్మోన్లు, స్టెరాయిడ్లు, యాంటీబయోటిక్ ఔషధాలు.. అన్నీ గుడ్లు, మాంసాన్ని అనేక రసాయనాల కుప్పగా మార్చుతున్నాయని అర్థం చేసుకోవాలి. దీనినే జైవిక్ సాంద్రీకరణ (బయో కాన్సంట్రేషన్) అంటారు. మాంసాహారం తిన్న వారి దేహాల్లో పోగుపడే రసాయనిక అవశేషాలు, కల్మషాలు వారిని అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. ఒక కిలో మాంసం ఉత్పత్తి చేయడానికి ఇటువంటి 8 కిలోల ఆహార ధాన్యాలను పశువులకు మేప వలసి వస్తున్నది. అంటే, 8 కిలోల ధాన్యాలను తిన్నప్పుడు కలిగే హాని కిలో మాంసంతోనే కలుగుతోంది. మరోవైపు పారిశ్రామిక, రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో అడ్డూ అదుపూ లేకుండా రసాయనిక కలుపు మందులు, ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు. దీని అర్థం ఏమిటంటే.. ఈ ధాన్యాలను తిని ఆకలి తీర్చుకునే వారికన్నా మాంసం, గుడ్లు తిని ఆకలి తీర్చుకునే మనుషుల దేహాల్లోకి విష రసాయనాల అవశేషాలు 8 రెట్లు ఎక్కువగా చేరుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వనరులను మాంసాహారుల కన్నా శాకాహారులు చాలా పొదుపుగా వాడుతున్నారని మనం గ్రహించాలి. వాతావరణంలోకి అత్యధిక స్థాయిలో కర్బన ఉద్గారాల విడుదలకు కారణభూతమవుతున్న అన్ని రకాల మాంసం, గుడ్ల ఉత్పత్తిని తగ్గించుకుంటేనే భూతాపాన్ని కొంతమేరకైనా తగ్గించగలుగుతాం.కిలో వరి బియ్యం ఉత్పత్తి చేయడానికి 8 వేల లీటర్ల నీరు ఖర్చవుతోంది. కిలో కొర్ర, అరిక వంటి సిరిధాన్యాల బియ్యం ఉత్పత్తికి కేవలం 300 లీటర్ల నీరు సరిపోతుంది. వరి తినటం, పండించడం మాని సిరిధాన్యాల వైపు కదలితే ఆరోగ్యానికి ఆరోగ్యం చేకూరుతుంది. ప్రకృతి వనరుల వృథా తగ్గిపోతుంది. ఆ మేరకు ఉద్గారాలతోపాటు భూతాపమూ తగ్గుతుంది. ఏ విటమిన్‌ను అయినా టాబ్లెట్లు, ఇంజక్షన్ల రూపంలో కాకుండా ఆహారం ద్వారా తీసుకుంటేనే సరిగ్గా ఒంటికి పడుతుంది. విటమిన్లు ఆహారంలో ఇమిడి ఉంటేనే దేహం సజావుగా గ్రహించగలుగుతుంది. – డాక్టర్ ఖాదర్ వలి -
కొవ్వు పదార్థాలంటే ఎప్పుడూ చెడు చేసేవేనా?
విటమిన్స్‌టే చెడు చేస్తాయనే అపోహ చాలామందికి ఉంది. కొన్ని విటమిన్లు, అన్ని పోషకాలూ సమకూరాలంటే కొవ్వులు కావాల్సిందే! అవే ఏ, డి, ఈ, కే విటమిన్లు. అవి ఫ్యాట్ సొల్యుబుల్ విటమిన్స్. శరీరం బరువు తగ్గడానికి కూడా కొన్ని కొవ్వులు కావాలి. కాకపోతే కొవ్వుల్లో కొన్ని రకాలైన ట్రాన్స్ ఫ్యాట్స్, హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్‌ని మాత్రం తగ్గించాలి. ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమెగా 6, ఒమెగా 9 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి కొవ్వులు మేలు చేస్తాయి. ఈ తరహా కొవ్వు పదార్థాలు చేపల్లో, అవిశె నూనెలో ఉంటాయి. కొవ్వు పదార్థాలన్నీ చెడ్డవే అనుకునే చాలా మంది వాటిని తీసుకోవడం తగ్గిస్తారు. అలా అవసరమైనన్ని కొవ్వులు తీసుకోకపోవడం వల్ల కూడా చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని గుర్తించండి. అందుకే పూర్తిగా నిరాకరించకండి. అలాగని అధికంగా తీసుకోకండి. మితమెప్పుడూ హితమే. -
ప్లేట్లో తక్కువ....డస్ట్‌బిన్‌లో ఎక్కువ!
ఓ వైపు ప్రపంచంలో 300 కోట్ల మందికి సరైన ఆహారం లభించక ఆకలితో మాడిపోతుంటే మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఉత్పత్తి చేస్తున్న దాదాపు 130 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహారంలో 33 శాతం వృథా అయిపోతోంది. ఈ వృథా విలువ ఏడాదికి సుమారు రూ.లక్ష కోట్లని అంచనా. పోషకాలు అధికంగా వుండే పండ్లు, కూరగాయలు, సముద్రపు ఉత్పత్తులు, రకరకాల మాంసాలు భారీగా పాడైపోతున్నాయి. ‘గ్లోబల్ ప్యా నల్ ఆన్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సిస్టమ్స్ ఫర్ న్యూట్రిషన్’తో కలసి ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార– వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) వెలువరించిన తాజా నివేదికలోని విషయాలివి. ఆహార వ్యవస్థల్లో చోటు చేసుకున్న ఈæ లోపాల్ని నివారించేందుకు విధానపరమైన చర్యలు చేపట్టాలని, ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని ఎఫ్ఏవో పాల కులకు విజ్ఞప్తి చేసింది. త్వరగా పాడైపోయే ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. ప్రభుత్వ– ప్రైవేటు రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంపై దృష్టి సారించాలని కోరింది. సగానికి సగం కూరగాయలు.. నివేదిక ప్రకారం.. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న పండ్లు, కూరగాయల్లో 50% పైగా వృథా అవుతున్నాయి. మొత్తం మాంసంలో 25%, సముద్ర ఉత్పత్తుల్లో 30 శాతం పైగా నిరుపయోగమవుతున్నాయి. వ్యవసాయం ద్వారా ప్రపంచ ప్రజలకు అవసరమైన దానికంటే 22% ఎక్కువ విటమిన్ ఏ ఉత్పత్తుల్ని పండిస్తున్నప్పటికీ, వృథా కారణంగా అవి పూర్తి స్థాయిలో జనం వద్దకు చేరడం లేదు. దీంతో విటమిన్ ఏ ఆహారోత్పత్తులకు 11% మేరకు కొరత ఏర్పడుతోంది. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో– పంటకోతలు, స్టోరేజీ, ప్రాసెసింగ్, రవాణా దశల్లో ఎక్కువ నష్టం జరుగుతోంది. అధికాదాయ దేశాల్లో– చిల్లర అమ్మకాల సందర్భంలో కొంత, వినియోగదార్ల వద్ద కొంత వ్యర్థమైపోతోంది. ఆరోగ్యానికి అతి పెద్ద ముప్పు.. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రతి 5 మరణాల్లో ఒకటి నాసిరకపు ఆహారంతో ముడిపడిందని మలేరియా, టీబీ, మీజిల్స్ కంటే నిత్యం నాసిరకపు ఆహారం తీసుకోవడం వల్లే ప్రజారోగ్యానికి ఎక్కువ నష్టం వాటిల్లుతోందని నివేదిక పేర్కొంది. వృథాను నివారించడం వల్ల ప్రజలకు పోషకాలు లభ్యం కావడంతోపాటు ఐరాస సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పింది. ఆహార వృథాను ఎంతవరకు నివారించగలిగితే అంతమేరకు ఆర్థిక వ్యవస్థలకు లాభం చేకూరుతుందని, నీరు– నేల– ఇంధనాన్ని కూడా పొదుపు చేసుకోవచ్చునని నివేదిక వివరించింది. -
ఒంటికి పట్టేస్తుంది
పైన పెంకుతో లోపల నట్‌తో చాలా వైవిధ్యం కనిపించే పిస్తాలో ఎన్నెన్నో విలువైన పోషకాలు ఉన్నాయి. వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా విశిష్టమైనవి. వాటిలో ఇవి కొన్ని. పిస్తాలో క్యాలరీలు చాలా ఎక్కువ. కాబట్టి పరిమితంగా తీసుకున్నా సరే... పిస్తా వల్ల లభించే శక్తి చాలా ఎక్కువ. ప్రోటీన్లు, కొవ్వులు ఎక్కువ. కానీ పిస్తాలో లభ్యమయ్యే కొవ్వు ఆరోగ్యకరమైన కొవ్వు కావడం వల్ల దాని గురించి అంతగా బెంగ అక్కర్లేదు. అలాగని మరీ ఎక్కువగా కాకుండా కాస్త పరిమితంగా తినడమే మంచిది. పిస్తాలో ప్రోటీన్లతో పాటు.. వాటిని సరిగా జీర్ణమయ్యేలా చేసి, ఒంటికి ప్రోటీన్లు పట్టేలా చేసే విటమిన్–బి6 కూడా ఎక్కువే. ఇందులో పీచు కూడా అధికం. అందువల్ల పిస్తా వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరగడమే కాకుండా, పేగుల్లో ఆహారం సాఫీగా ముందుకు జరుగుతుంది. పిస్తాలోని పీచు కారణంగా మలబద్దకం సమస్య కూడా నివారితమవుతుంది. ఇందులో విటమిన్ బి–కాంప్లెక్స్, విటమిన్–సి ఉన్నాయి. వీటి కారణంగా అవి చాలా రకాల వ్యాధుల నుంచి మనల్ని రక్షించేందుకు అవసరమైన రోగనిరోధక శక్తిని ఇస్తాయి. పిస్తాలో విటమిన్–ఈ కూడా ఎక్కువే. దీనివల్ల పురుషుల్లో వ్యంధ్యత్వాన్ని నిరో«ధించడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. అంతేగాక... చర్మాన్ని నిగారించేలా చేయడం, దీర్ఘకాలం పాటు యౌవనంగా ఉంచేలా చూడటంతో పాటు వృద్ధాప్యాన్ని వీలైనంతగా వెనక్కునెడుతూ... ఆలస్యమయ్యేలా చూడటానికీ పిస్తా బాగా తోడ్పడుతుంది. పిస్తాలో పొటాషియమ్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తనాళాల్లో రక్తం సాఫీగా ప్రసరించేలా చూడటంతో పాటు గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. పిస్తాలో ఫాస్ఫరస్, క్యాల్షియమ్ కూడా ఎక్కువే అయినందున ఇది ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది. మెగ్నీషియమ్, ఇతర ఖనిజలవణాలు మెండుగా ఉన్నందున మెదడు, వెంట్రుకలు, చర్మం ఆరోగ్యానికి పిస్తా ఎంతగానో తోడ్పడుతుంది. -
బార్లీతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు
ఎంతో ఆరోగ్యస్పృహ ఉన్నవారు మినహా ‘బార్లీ’ని ఆహారంగా తీసుకునేవారు మన సమాజంలో కొద్దిగా తక్కువే. అయితే బార్లీ గింజల్లోని పోషకాలు ఎంతో ఆరోగ్యకరం కాబట్టే వీటిని హెల్త్ డ్రింక్స్‌లో విరివిగా వాడుతుంటారు. అంతేకాదు... ఆరోగ్యకరం అంటూ ఉత్పత్తి చేసే బ్రెడ్లూ, బిస్కెట్లలోనూ దీన్ని వాడుతుంటారు. బార్లీతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే. బార్లీలో పోటాషియమ్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. బార్లీలో పీచు పదార్థాలు కూడా ఎక్కువ. అందువల్ల అది జీర్ణాశయపు ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతుంది. బార్లీలోని పీచుపదార్థాల వల్ల అవి రక్తంలో చక్కెరను అతి మెల్లగా విడుదలయ్యేలా చేస్తాయి. దాంతో చక్కెర అదుపునకు బాగా తోడ్పడతాయి. ఈ కారణం వల్లనే అవి డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచడంతో పాటు, డయాబెటిస్ లేనివారిలో నివారణకూ తోడ్పడతాయి. ఈ గింజలు కొలెస్ట్రాల్‌ను బాగా అదుపు చేస్తాయి. రక్తపోటుతో పాటు కొలెస్ట్రాల్‌నూ అదుపు చేసే గుణం ఉండటం వల్ల ఇవి అనే రకాల గుండెజబ్బులనూ, గుండెపోటునూ నివారిస్తాయి. బార్లీలోని విటమిన్–ఏ కారణంగా ఇవి కంటిచూపును దీర్ఘకాలం పాటు పదిలంగా కాపాడతాయి. వీటిల్లో ఐరన్ కూడా ఎక్కువే. అందువల్ల రక్తహీనతను నివారిస్తాయి. బార్లీలో ఉండే క్యాల్షియమ్, ఫాస్ఫరస్ ఎముకలను మరింత శక్తిమంతం చేస్తాయి. ఇందులోని మెగ్నీషియమ్, జింక్ వంటి ఖనిజాలు చర్మానికీ, వెంట్రుకలకూ మెరుపునిస్తాయి. బార్లీలోని విటమిన్ బి–కాంప్లెక్స్‌తో పాటు విటమిన్–సి... మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా అనేక రకాల వ్యాధుల నుంచి మనల్ని కాపాడతాయి. -
16 పోషకాలనిచ్చే సమృద్ధ ఎరువు
పంట పొలంలో వేసిన రసాయనిక ఎరువులు 30% మాత్రమే పంటలకు ఉపయోగపడతాయి. మిగిలిన 70% వృథాయే. ఈ రసాయనాల వల్ల భూసారం దెబ్బతింటుంది. అంతేకాదు.. భూమిలో ఉండి పంటలకు, రైతులకు మేలు చేసే జీవాలు చనిపోతాయి. పంటల దిగుబడి ఊహించనంతగా తగ్గిపోతుంది. ఇది గ్రహించిన కొందరు రైతులు ఇష్టపడి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. వర్మీ కంపోస్టు(జెర్రెల ఎరువు), పెంట(పశువుల) ఎరువు, కంపోస్టు మొదలైనవి తమ వీలును బట్టి పంటలకు వాడుతున్నారు. అయితే, ఇలా ఏదో ఒక ఎరువు వేస్తే మన పంటలకు సరైన పోషకాలు అందక ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నారు. సేంద్రియ పంటలకు అవసరమైన ముఖ్యమైన 16 పోషకాలను అందించే ‘సమృద్ధ ఎరువు’ను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, డీడీఎస్–కృషి విజ్ఞాన కేంద్రం వాడుకలోకి తెచ్చాయి. సమృద్ధ ఎరువులో 16 పోషకాలు.. టన్ను వర్మీ కంపోస్టును పొలంలో వేస్తే సుమారు 15 కిలోల నత్రజని, 3 కిలోల భాస్వరం, 5 కిలోల పొటాష్ లభిస్తుంది. వర్మీ కంపోస్టుతోపాటు పిడకల/పశువుల/పెంట ఎరువు, మేకల ఎరువులను 3:3:4 నిష్పత్తిలో కలిపి వేసినట్టయితే భూమికి అధిక పోషకాలు అందుతాయి. అంటే.. 3 టన్నులు వర్మీకంపోస్టు, 3 టన్నుల పిడకల ఎరువు, 4 టన్నుల మేకల ఎరువు కలిపితే 10 టన్నుల సమృద్ధ ఎరువు తయారవుతుంది. టన్ను సమృద్ధ ఎరువును వేస్తే.. 385 కిలోల సేంద్రియ కర్బనం, 18.6 కిలోల నత్రజని, 5.8 కిలోల భాస్వరం, 10.1 కిలోల పొటాష్ నేలకు అందుతాయి. సమృద్ధ ఎరువు మొత్తం 16 రకాల బలాల(పోషకాల)ను అందిస్తుంది. పంటకు తోడ్పడే సూక్ష్మజీవరాశి పుష్కలంగా ఉండటం వల్ల పూత, కాత బాగా వస్తుంది. భూసారాన్ని పెంపొందిస్తుంది. ఇసుక భూములకు కూడా నీటిని పట్టుకునే గుణం పెరుగుతుంది. భూమి మెత్తగా అయి, గాలిని పీల్చుకునే గుణం పెరుగుతుంది. దీన్ని వేయడం వల్ల చౌడు తగ్గి పంటలు బాగా వస్తాయి. సమృద్ధ ఎరువు ప్రభావం భూమిపై 2–3 ఏళ్ల వరకు ఉంటుంది. ప్రతి ఏటా ఎరువు ఎక్కువగా వేయాల్సిన అవసరం ఉండదు. దీనితో పండించిన పంట ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. రుచిగా ఉంటుంది. మంచి ధర పలుకుతుంది. వివరాలకు.. డీడీఎస్–90003 62144, డీడీఎస్–కృషి విజ్ఞాన కేంద్రం–90104 96756 -
ఫుడ్ ప్యాకేజింగ్‌తో పోషకాలకు చిల్లు...
ప్యాకెట్లలో వచ్చే తిండితో ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయని చాలాకాలంగా తెలుసు. అయితే బర్మింగ్‌హామ్‌టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తాజాగా ఇంకో విషయాన్ని ఆవిష్కరించారు. ప్యాకేజింగ్‌కు వాడిన పదార్థాల కారణంగా పోషకాలు ఒంటబట్టకుండా అడ్డుకుంటుందని వీరు అంటున్నారు. ప్యాకెట్ల లైనింగ్లో ఉండే జింక్ ఆక్సైడ్ నానోస్థాయిలో ఆహారంలోకి చేరుకోవడం వల్ల మన పేగుల్లో కణాలు సక్రమంగా పనిచేయవు. ఫలితంగా పోషకాలు శరీరానికి చేరకుండానే వ్యర్థాలుగా బయటికి వెళ్లిపోతాయి. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల ద్వారా ఆహారం పాడవకుండా ఉండేందుకు జింక్ ఆక్సైడ్ ఉపయోగపడుతుంది. వీటివల్ల పెద్దగా సమస్యలు లేవని ఇప్పటివరకూ అనుకుంటూ వచ్చారు. అయితే తాజా పరిశోధన వీటి ద్వారా కూడా పరోక్షంగానైనా కొన్ని సమస్యలు ఉన్నట్లు స్పష్టం చేసింది. చిన్నపేగుల మోడల్ ఒకదాన్ని సిద్ధం చేసి తాము కొన్ని ప్రయోగాలు చేశామని, ఎంత మోతాదులో నానో కణాలు ఏ ప్రభావం చూపుతున్నాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేశామని వీరు చెబుతున్నారు. జింక్ ఆక్సైడ్ నానో కణాలపై పొడుచుకు వచ్చే ప్రత్యేక భాగాలకు అతుక్కుంటాయి. ఈ భాగాలు పోషకాలు శరీరంలోకి చేరేందుకు అనువుగా విశాలమైన ప్రాంతాన్ని అందుబాటులోకి తెస్తాయి. వీటిపై జింక్ ఆక్సైడ్ చేరడం వల్ల సమస్యలు వస్తాయని తాము తెలుసుకున్నామని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మాహ్లర్ చెబుతున్నారు. -
అందమైన జుట్టుకు ఆరు పోషకాలు
అందమైన జుట్టుకు ఆరు పోషకాలే చాలా కీలకమని, ఆహారంలో భాగంగా ఈ పోషకాలను తీసుకుంటే జుట్టు గురించి దిగులు పడాల్సిన పనే లేదని అంతర్జాతీయ కేశ చికిత్స నిపుణులు చెబుతున్నారు. వారు చెబుతున్న ఆరు పోషకాలూ అందరికీ తెలిసినవే. అయితే, వాటిని సమతులంగా తీసుకుంటే చాలంటున్నారు. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు తగిన పరిమాణంలో తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని, ఆహార సమతుల్యత లేదా ఇతర కారణాల వల్ల మాడు పల్చబడిపోయినా, తిరిగి జుట్టు ఆరోగ్యకరంగా పెరుగుతుందని ఆస్ట్రేలియాకు చెందిన కేశ చికిత్స నిపుణురాలు సిమోన్ లీ చెబుతున్నారు. జుట్టు పెరుగుదలకు ప్రొటీన్లలో ముఖ్యంగా సిస్టీన్, లైసైన్, ఆర్గినైన్, మెథియోనైన్ అనే నాలుగు అమినో యాసిడ్లు కీలకమైనవని ఆమె వివరించారు. వీటిలో లైసైన్, మెథియోనైన్ అమినో యాసిడ్లు శరీరంలో తయారయ్యేవి కావని, వీటిని ఆహారం ద్వారా మాత్రమే పొందగలమని, గుడ్లు, పాలు, పెరుగు, చీజ్, చికెన్, మటన్, చేపలు వంటి పదార్థాల్లో ఇవి పుష్కలంగా ఉంటాయని, వీటిని తరచుగా తీసుకుంటూ, ఇతర పోషకాలు కూడా ఆహారంలో ఉండేలా చూసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని సిమోన్ లీ వివరిస్తున్నారు. -
జీవకణాలకు శక్తి
జొన్నలను మనం చాలావరకు మరచిపోయినప్పటికీ అప్పుడప్పుడైనా వాటిని తినడం వల్ల వాటిలోని పోషకాలతో మనకు మేలు జరుగుతుందని గుర్తుంచుకోవాలి. జొన్నల వల్ల ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. జొన్నలో పీచుపదార్థాలు చాలా ఎక్కువ. ఫలితంగా వాటి వల్ల జీర్ణ వ్యవస్థకు మేలు జరుగుతుంది. జొన్నల్లో పిండి పదార్థంతో పాటు పీచు పదార్థాలు కూడా ఎక్కువే కాబట్టి జొన్నల్లోని చక్కెర వేగంగా కాకుండా... జీర్ణమయ్యాక చాలా మెల్లిగా రక్తంలోకి వస్తుంది. డయాబెటిస్ రోగులకు ఇదెంతో మేలు చేసే అంశం. స్థూలకాయంతో పాటు గుండెజబ్బులు, పక్షవాతం వంటి ప్రమాదకర పరిస్థితులను నివారిస్తాయి. జొన్నల్లో ప్రొటీన్లు కూడా ఎక్కువే. కండరాల రిపేర్లు, కణాల పుట్టుక, పెరుగుదలకు ప్రొటీన్లు ఎంతగానో తోడ్పడతాయి. జొన్నలు ఒంట్లోని చెడుకొవ్వులను నియంత్రిస్తాయి. వీటిల్లో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. జొన్నల్లో మెగ్నీషియమ్ పాళ్లు ఎక్కువ. దాంతో అవి క్యాల్షియమ్‌ను ఎక్కువగా గ్రహించేలా దోహదపడటం ద్వారా ఎముకల దారుఢ్యాన్ని పెంచుతాయి. జీవకణాల్లో మరింత శక్తినింపుతాయి. వాటిలో పునరుత్తేజం కలిగిస్తాయి. -
పచ్చగా... తాజాగా...
సాధారణంగా ఆకుకూరలు తెచ్చిన గంటకే వాడిపోతుంటాయి. అలా వాడిపోకుండా, తాజాగా ఉండేందుకు అనువుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ సంస్థ ఒక బాక్సుని కనిపెట్టింది. ఈ బాక్సులో 98 శాతం దాకా తేమ ఉంటుంది. అందువల్ల ఆకుకూరలు రెండు రోజుల పాటు సాధారణ గదిలో కూడా పాడవకుండా నిల్వ ఉంటాయి. ఈ బాక్సులోని సాంకేతికత ఆకుకూరలలోని పోషకాలు పోకుండా భద్రపరుస్తుంది. ఆకు కూరలను అప్పటికప్పుడు కోసినప్పుడు ఎంత తాజాగా ఉంటాయో, రెండు రోజుల తర్వాత కూడా అంతే తాజాగా ఉంటాయి. సుమారు 12– 15 కిలోల ఆకుకూరలు నిల్వ ఉంచుకోవచ్చు. బాక్సు ధర ఆన్లైన్లో 10 వేల రూపాయల వరకు ఉంది. వీటి తయారీలో మంచి నాణ్యత కలిగిన పాలిమర్‌ను ఉపయోగిస్తారు. అందువల్ల మామూలు ప్లాస్టిక్‌ల నుంచి వచ్చే వాసన వీటి నుంచి రాదు. ప్రాంతాలను బట్టి, ఎక్కువ వేడిమి ఉన్న ప్రాంతాలలో జెల్ ప్యాక్‌లను ఉపయోగించి 6 – 8 డిగ్రీల వరకు వేడిని తగ్గించవచ్చు. బావుంది కదూ. -
జబ్బులను నివారణకు జామ!
జామపండులో ‘విటమిన్–సి’తో పాటు రోగనిరోధకశక్తిని పెంచే గుణం ఉంది. ఇంకా అనేక పోషకాలు ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా జామపండు ఎన్నో జబ్బులను అవి రాకముందే నిరోధిస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది. ∙జామ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. జామలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఇందుకు దోహదం చేస్తాయి. ముఖ్యంగా ప్రోస్టేట్, రొమ్ముక్యాన్సర్ల నివారణకు బాగా ఉపయోగపడుతుంది. జామపండు డిమెన్షియా, అలై్జమర్స్ వంటి జబ్బులను నివారించడంలో తోడ్పడుతుంది. ∙రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లను జామపండు తగ్గిస్తుంది. అలాగే అధిక రక్తపోటును నివారిస్తుంది. ∙జామపండ్లను తినేవారిలో చిగుర్లు, పంటి వ్యాధులు చాలా తక్కువగా కనిపిస్తాయి. -
హెల్త్ టిప్స్
శరీరంలో పోషకాలు లోపిస్తే నోటి పూత తరచూ బాధిస్తుంటుంది. ఇందుకు గాను తాజా సంత్రా జ్యూస్‌ని తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ‘సి’ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. తాజా కొబ్బరిపాలు నోటిపూతకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. రోజులో కనీసం మూడు లేదా నాలుగు సార్లు కొబ్బరి పాలను నోట్లో పోసుకుని పుకిలించి తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. కొబ్బరిపాలు అందుబాటులో లేకపోతే నోరు భరించేంత వేడి ఉన్న గ్లాస్ నీటిలో టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ నీటితో నోరు పుకిలించి శుభ్రం చేసుకుంటే ఉపశమనం కలగడమే కాకుండా రెండు, మూడు రోజుల్లో నోటిపూత తగ్గుతుంది. నోటి పూత వల్ల కలిగే ఇబ్బంది, నొప్పికి మిరియాల నూనె త్వరిత ఉపశమనం కలుగజేస్తుంది. ఉసిరికవేరు పొడి ఒక టీ స్పూన్, టేబుల్ స్పూన్ తేనెతో కలపాలి. ఆ పేస్ట్‌ని నేరుగా నోటిపూతపై రాస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. -
మజిల్‌క్రాంప్స్‌ను తగ్గించే అరటిపండు
అతి తేలిగ్గా చవకగా దొరుకుతూ అత్యంత ఎక్కవ పోషకాలు ఉండే పండ్లలో ముఖ్యమైనది అరటిపండు. దానితో ఒనగూరే ప్రయోజనాల్లో అవి కొన్ని... ∙ఒంట్లో ఖనిజ లవణాలు తగ్గి మాటిమాటికీ కండరాలు పట్టేస్తున్నవారు (మజిల్ క్రాంప్స్‌తో బాధపడుతున్నవారు) అరటిపండ్లు తింటే ఆ సమస్య దూరవుతుంది ∙అరటిపండులో పొటాషియమ్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే అది రక్తపోటు (హైబీపీ)ని స్వాభావికంగానే నియంత్రిస్తుంది ∙ఇందులో ఉండే పొటాషియమ్, విటమిన్ సి, విటమిన్ బి6... గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు తోడ్పడతాయి. విటమిస్ సితో పాటు బి6 అంశాలు రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు సైతం తోడ్పడతాయి ∙అరటిపండు జీర్ణశక్తిని పెంచి, ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేలా చూస్తుంది. జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ∙ఇందులోని పొటాషియమ్ మన మూత్రపిండాల ఆరోగ్య నిర్వహణకు తోడ్పడుతుంది ∙ఇందులోని అమైనో యాసిడ్స్ అద్భుతమైన జ్ఞాపకశక్తికి, మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపయోగపడతాయి -
హెల్త్ టిప్స్
► జుట్టు రాలడం సౌందర్య కాదు, ఆరోగ్య సమస్య. శరీరం పోషకాల సమతుల్యాన్ని కోల్పోయిందనడానికి నిదర్శనం. ఈ ఆరోగ్య సమస్యను గుర్తించిన వెంటనే దానిని అధిగమించడానికి చర్యలు తీసుకోవాలి. ► రోజుకు ఒక గ్లాసు బనానా సూతీ తాగుతుంటే శరీరానికి, జుట్టు పెరుగుదలకు కావలసిన పోషకాలు అంది రాలడం తగ్గుతంది. ఇది చేయడం చాలా సులభం. పాలు, పెరుగు, తేనె, అరటిపండు గుజ్జు కలిపి మిక్సీలో బ్లెండ్ చేస్తే బనానా సూతీ రెడీ. -
హెల్త్‌టిప్స్
రోజుకు ఒక గ్లాసు బనానా సూతీ తాగుతుంటే... శరీరం ఆరోగ్యంగాఉండడానికి, జుట్టు పెరుగుదలకు కావలసిన పోషకాలు అందుతాయి. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. బనానా సూతీ చేయడం చాలా సులభం. పాలు, పెరుగు, తేనె, బాగా పండిన అరటిపండు గుజ్జు కలిపి మిక్సీలో బ్లెండ్ చేస్తే బనానా సూతీ రెడీ. రోజుకొకసారి ఒక కప్పు తాజా పాలకూర రసం లేదా కొత్తిమీర రసం కాని తాగుతుంటే హెయిర్‌ఫాల్ కంట్రోల్ అవడమే కాకుండా జుట్టు త్వరగా పెరుగుతుంది కూడ. ఇలా మూడు నుంచి నాలుగు వారాలు చేస్తే ఫలితం కనిపిస్తుంది. -
ఏలక్కాయలో ఏముంది?
గుడ్ ఫుడ్ ఏలక్కాయలో పోషకాలు ఏముంటాయి? మంచి వాసన తప్ప... అనుకుంటాం. వంటల్లో సువాసనకోసం వాడే దినుసుగానే పరిగణిస్తాం. కానీ ఇందులో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఇదొక ఔషధం. ఏలక్కాయ కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుంది. మంట అనిపించినప్పుడు వేడి నీటిలో చిటికెడు ఏలకుల పొడి చల్లుకుని తాగితే ఉపశమనం ఉంటుంది. కడుపులో ఒడుదొడుకులు కూడా అదుపులోకి వస్తాయి. ఏలక్కాయ అజీర్తి, అరుచి, ఆకలవుతున్నా తినాలనిపించకపోవడం వంటి సమస్యలను తొలగిస్తుంది. నోటి దుర్వాసనను తొలగిస్తుంది. తల తిరుగుతున్నప్పుడు ఏలక్కాయను నమిలి తింటే సాంత్వన కలుగుతుంది. కొందరికి ప్రయాణాల్లో తల తిరుగుతుంటుంది. అటువంటి వాళ్లు ఏలక్కాయ దగ్గర పెట్టుకోవడం మంచిది. ప్రయాణం మొదలు పెట్టినప్పుడే ఒక ఏలక్కాయ నోట్లో వేసుకుంటే తల తిరిగే సమస్య రానే రాదు. దాహం కూడా అనిపించదు. రోజుకు ఒక ఏలక్కాయ తింటే, జీర్ణశక్తిని మెరుగుపరిచి అపానవాయువు సమస్యను తొలగిస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్తో బాధపడేవారు రోజూ ఉదయం, సాయంత్రం ఏలకుల పొడిని నీటిలో కలుపుకొని తాగాలి. అలా వారం రోజులు చేస్తే ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గుతుంది. రెండు ఏలకులు, చక్కెర కలుపుకొని తింటే కడుపునొప్పి తగ్గుతుంది. -
ఆరోగ్యానికి అండ... నువ్వుండ
గుడ్ ఫుడ్ చిన్నప్పుడు నువ్వుల ఉండలు, నూజీడీలు తినకుండా పెరిగి పెద్దయిన వారు ఉండరు. నువ్వుల్లో ఐరన్, క్యాల్షియమ్, మెగ్నీషియమ్, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, కాపర్, జింక్, ఫైబర్, థయామిన్, విటమిన్ బి6, ఫోలేట్, ట్రిప్టోఫాన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. రక్తహీనత ఉన్నవారికి బెల్లం–నువ్వులతో చేసిన ఉండలు తినమని నిపుణులు ఇప్పటికీ చెబుతుంటారు. ఆహారంలో నువ్వులు క్రమం తప్పకుండా తినేవారిలో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులోని మెగ్నీషియమ్ వ్యాసోడయలేటర్గా (రక్తనాళాలను విప్పార్చడం) పనిచేయడం వల్ల ఈ ప్రయోజనం చేకూరుతుంది. అన్ని రకాల ఖనిజాలు (మినరల్స్)తో పాటు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఫైటేట్ పుష్కలంగా ఉండటం వల్ల నువ్వులు శక్తిమంతమైన క్యాన్సర్ నిరోధకాలు. నువ్వుల్లో క్యాల్షియమ్, ఫాస్ఫరస్ చాలా ఎక్కువ. అందుకే అవి ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తాయి. ఎముక ఆరోగ్యాన్ని కాపాడతాయి. నువ్వుల్లో పీచు చాలా ఎక్కువ కాబట్టి కడుపు ఆరోగ్యాన్ని కాపాడటంలో వాటి పాత్ర ఎంతో ఎక్కువ. మలబద్ధకాన్ని కూడా నివారిస్తాయి. రోజూ గుప్పెడు నువ్వులు తినేవారిలో నోటి ఆరోగ్యం బాగుంటుంది. పళ్లు, చిగుర్ల వ్యాధులు తగ్గుతాయి. నువ్వులు క్రమం తప్పకుండా తినేవారిలో చర్మం మిలమిల మెరుస్తుంది. నువ్వుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం ఉండడం వల్ల అవి వాపు, మంట నొప్పిని తగ్గిస్తాయి. -
రెయిన్బో జ్యూస్
హెల్దీ ట్రీట్ కావలసినవి:బీట్రూట్ – 1 (చిన్నది), క్యారట్లు – 2, టొమాటో – 1, తేనె – 1 టీ స్పూన్ తయారి: బీట్రూట్, క్యారట్ల పై తొక్క తీసి, కట్ చేసుకోవాలి. టొమాటోలను కూడా ముక్కలుగా చేయాలి. ఈ పదార్థాలన్నీ మిక్సర్‌లో వేసి తగినన్ని నీరుపోసి జ్యూస్ చేయాలి. జ్యూస్‌ని గ్లాస్లో పోసి తేనె వేసుకుని తాగాలి. నోట్: యువతీ యువకులు మొటిమల సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. వీళ్లు భోజనానికి గంట ముందు ఈ జ్యూస్ తాగాలి. దీంట్లో ఉప్పు, పంచదార కలపకూడదు. జ్యూస్ తాగిన గంట వరకు ఏమీ తినకూడదు. ఇలా క్రమం తప్పకుండా నెలరోజులు చేస్తే మొటిమలు తగ్గుతాయి, చర్మం కాంతివంతం అవుతుంది, సన్‌బర్న్ బారిన పడదు. క్యాల్షియం, ఐరన్ అధికంగా ఉన్న ఈ జ్యూస్‌లో క్యాలరీలు తక్కువగా ఉన్నాయి. ఊబకాయం సమస్య ఉన్నవారు ఈ జ్యూస్‌ను తాగడం వల్ల ఫలితం ఉంటుంది. పోషకాలు: క్యాలరీలు – 95.9కె.సి.ఎ. ఎల్, కార్బోహైడ్రేట్లు 20.77 గ్రా., ప్రొటీన్ – 2.21గ్రా., ఫ్యాట్ – 0.35గ్రా., క్యాల్షియం – 113 మి.గ్రా. -
మ్యాంగో కుల్ఫీ ...
హెల్దీ ట్రీట్ కావలసినవి: మామిడిపండు – 1, కండెన్స్డ్ మిల్క్ – 1 కప్పు, పాలపొడి – పావు కప్పు, పంచదార – 3 టీ స్పూన్లు, ఏలకులపొడి – పావు టీ స్పూన్, కుంకుమ పువ్వు – కొద్దిగా, చెర్రీ ముక్కలు – 2 టీ స్పూన్లు. తయారి: 1. మామిడిపండు పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్‌చేసుకోవాలి. లోపలి టెంక తీసేయాలి. 2. మామిడి పండు ముక్కలు, పంచదార, కండెన్స్డ్ మిల్క్, పాల పొడి వెడల్పాటి పాన్‌లో వేసి కలుపుతూ దగ్గరగా అయ్యేంతవరకు మరిగించాలి. ఆ తర్వాత దించి చల్లార్చాలి. 3. ఫ్రీజర్‌లో గట్టిపడేంత వరకు ఉంచి ఐస్‌క్రీమ్ కప్పులో వేసి సర్వ్ చేయాలి. నోట్: ఈ మిశ్రమం ఒకరికి సరిపోతుంది. వ్యక్తులను బట్టి పదార్థాల క్వాంటిటీని పెంచుకోవాలి. వేసవి తాపానికి పిల్లలు ఐస్‌క్రీమ్ కావాలని గొడవ చేస్తుంటారు. వారి అల్లరి మానిపించడానికి పోషకాలు గల ఈ కుల్ఫీ పైన కావలిస్తే జీడిపప్పు అలంకరించి చల్లగా అందించవచ్చు. పోషకాలు: క్యాలరీలు – 275 కె.సి.ఎ.ఎల్ ప్రొటీన్ – 11.1గ్రా. కార్బోహైడ్రేట్లు – 41.88గ్రా. ఫ్యాట్ – 7.08గ్రా. ఐరన్ – 1 గ్రా. కాల్షియం – 389.5 గ్రా. -
పోషకాలను మోతాదు మేరకు వాడాలి
గుర్రంపోడు వ్యవసాయ శాస్త్రవేత్తలు వివిధ వ్యవసాయ పంటలకు అవసరమయ్యే పోషకాలను మోతాదు మేరకు వాడాల్సి ఉంటుంది.. ఉద్యానపంటలకు మాత్రం మొక్కకు వాడాల్సిన పోషకాల మోతాదును బట్టే ఎరువుల పరిమాణాన్ని సూచిస్తారు. పీల్డ్ క్రాప్లైన వ్యవసాయ పంటలు పత్తి, మిర్చి, వరిలాంటి పంటలకు మాత్రం పోషకాల మోతాదును మాత్రమే సూచిస్తారు. రసాయన ఎరువుల్లోని ఈ మోతాదును లెక్కగట్టి వాడితే ఖర్చు తగ్గడమేగాక పైరుకు పోషకాలు సమతుల్యంగా అందినట్లవుతుంది. ఎరువుల ధరలు తరుచూ పెరుగుతున్నందున వాటి వాడకం మరింత భారం కాకుండా పోషకాల మోతాదు గణనలో రైతులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ మురళి సూచిస్తున్నారు. ఎరువుల్లో పోషకాల గణనపై సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే.. ఎరువుల్లో పోషకాల శాతం ఎరువుల బస్తాపై ఆ ఎరువులో ఉండే పోషకాల శాతం ముద్రించి ఉంటుంది. యూరియా బస్తాపై 46 శాతం ఉంటుంది. అంటే వంద కిలోల యూరియాలో 46శాతం యూరియా ఉంటుంది. సింగిల్ సూపర్ పాస్పేట్లో 16శాతం భాస్వరం ఉంటుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌లో 60 శాతం పొటాష్ ఉంటుంది. ఈ ఎరువుల్లో ఒకే పోషక పదార్థం ఉన్నందున వీటిని సూటి ఎరువులు అంటారు. రెండు లేదా మూడు పోషకాలు కలిపి ఉండే ఎరువులను కాంప్లెక్స్ ఎరువులు అంటారు. డీఏపీలో 18 శాతం నత్రజని, 46 శాతం భాస్వరం ఉంటాయి. పోషకాల గణన ఇలా... ఫీల్డ్ క్రాప్ పత్తి పంటకు ఎకరాకు 60 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 24 కిలోల భాస్వరం సిఫారసు చేయబడింది. ఎంచుకునే కంపెనీ ఎరువులో పోషకాల మోతాదును బట్టి అవసరమయ్యే ఎరువులను లెక్కించవచ్చు. కిలో నత్రజని కోసం 2.17 కిలోల యూరియా(100/46)ను వాడాలి. కిలో భాస్వరం అందించేందుకు 6.25 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్(100/16) వేసుకోవాలి. కిలో పొటాష్ కోసం 1.67 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (100/60)వాడాలి. 15–15–15 బస్తాలో 7.5 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్‌లు ఉంటాయి. బస్తా డీఏపీలో 9 కిలోల నత్రజని, 23 కిలోల భాస్వరం ఉంటాయి. వ్యవసాయ పంటల్లో ఎకరాకు ఎరువు మోతాదును లెక్కించడంలో కిలో భాస్వరాన్ని డీఏపీ ద్వారా అందించాలంటే 2.17 కిలోల (100/46) డీఏపీ వాడాలి. అయితే 2.17 కిలోల డీఏపీలో కిలో భాస్వరంతోపాటు 0.4 కిలోల (18/100“2.17) నత్రజని కూడా ఉంటుంది. కిలో భాస్వరాన్ని 20–20–0 అనే కాంప్లెక్స్ ఎరువు ద్వారా అందించాలంటే 5 కిలోల (100/20) 20–20–0 అనే కాంప్లెక్స్ ఎరువు వాడాలి. అయితే 5 కిలోల 20–20–0 ఎరువులో ఒక కిలో భాస్వరంతో పాటు కిలో నత్రజని కూడా ఉంటుంది. నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను వాడినప్పుడు వాటి మోతాదుననుసరించి అవసరమైన ఎరువులు లెక్కగట్టి సరైన అవసరమైనంత మోతాదులో వాడి వృ«థా ఖర్చు తగ్గించుకుని, పోషకాల సమతుల్యతను పొందవచ్చు. ఎరువుల వాడకంలో కాంప్లెక్స్ ఎరువులు దుక్కిలో విత్తనాలు వేసేటప్పుడు వాడాలి. పైపాటుగా కాంప్లెక్స్ ఎరువుల వాడకం వల్ల పోషకాలు సమర్థవంతంగా పనిచేయవు. యూరియాను పలు ధపాలుగా వేయాలి. ఎక్కువగా యూరియా వాడకం వల్ల చీడపీడలు, తెగుళ్లు సోకుతాయి. -
నట్‌ఇంట్లో
నట్ అంటే ఏంటని గింజుకోకండి! గింజల గురించి మాట్లాడుతున్నాం. గింజల్లో పోషకాలుంటాయని అందరికీ తెలుసు. మరి... ఇన్ని రుచులుంటాయని తెలుసా? వంటింట్లో చేయండి... నట్టింట్లో ఆస్వాదించండి. వదలకండి. నట్ బిగించండి!! ఉలవల రసం కావలసినవి: ఉలవలు - 100 గ్రా; చింతపండు - 50 గ్రా మిరియాలు - 10 గ్రా; ఉప్పు - తగినంత వెల్లుల్లి రేకలు- నాలుగు; కరివేపాకు- రెండు రెమ్మలు ఎండు మిర్చి - మూడు; పచ్చిమిర్చి- మూడు కారం- 20 గ్రా; జీలకర్ర- 10 గ్రా; కొత్తిమీర- చిన్న కట్ట ధనియాలు- 10 గ్రా; నూనె- ఒక టేబుల్ స్పూన్ తయారీ: ఉలవలను మూడు గంటల సేపు నానబెట్టాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో మెత్తగా ఉడికించి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. రుబ్బేటప్పుడు ఉలవకట్టు (ఉడికించిన ప్పుడు మిగిలిన నీరు), చింతపండు రసం కలపాలి. తగినంత ఉప్పు చేర్చాలి. ఇప్పుడు తాలింపు పెట్టాలి. ఒక గిన్నెలో నూనె వేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి రేకలు, జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత, కరివేపాకు వేయాలి. ఇప్పుడు ఉలవల రసం మిశ్రమాన్ని పోయాలి. చివరగా కొత్తిమీర వేసి వేడెక్కిన తర్వాత ఆపేయాలి. ఈ రసం వర్షాకాలం ఆరోగ్యానికి మంచిది. రాజ్మా మసాలా కర్రీ కావలసినవి: రాజ్మా గింజలు- 200 గ్రా నూనె - 4 టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి- 6 టొమాటోలు- 4 పెద్దవి; వెల్లుల్లి రేకలు- 4 గరం మసాలా పొడి- 10 గ్రా కొత్తిమీర- ఒక కట్ట; ఉప్పు- తగినంత ఉల్లిపాయలు- 2 (మీడియం సైజు) క్రీమ్ - ఒక టీ స్పూన్; ఉప్పు- తగినంత నెయ్యి- ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి- ఒక టీ స్పూన్ ధనియాలపొడి - ఒక టీ స్పూన్ రాజ్మా మసాలా పొడి- ఒక టేబుల్ స్పూన వెన్న- ఒక టేబుల్ స్పూన్; కారం : టీ స్పూన్ తయారీ: రాజ్మా గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం ఉడికించి పక్కన పెట్టాలి. టొమాటోలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి తరగాలి. మందపాటి పెనం తీసుకుని నూనె వేసి కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి సన్నమంట మీద బంగారు రంగు వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రేకలు వేసి వేగిన తర్వాత టొమాటో ముక్కలు వేసి వేగేటప్పుడు నెయ్యి వేయాలి. ఇప్పుడు ఉడికించిన రాజ్మా గింజలు (నీటితోపాటుగా), కారం, గరం మసాలా పొడి వేసి సన్నమంట మీద ఐదు నిమిషాలు ఉంచాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, రాజ్మా మసాలా పొడి, ఉప్పు వేసి బాగా కలిపి ఐదు నిమిషాల సేపు ఉడకనివ్వాలి. చివరగా వెన్న వేసి మంట తగ్గించి రెండు నిమిషాల తర్వాత క్రీమ్ వేసి దించేయాలి. బొబ్బర్ల వడలు కావలసినవి: అలసందలు (బొబ్బర్లు)- 100 గ్రా పచ్చి శనగలు- 25 గ్రా మినప్పప్పు- 15 గ్రా పచ్చిమిర్చి- 15 గ్రా ఉల్లిపాయ ముక్కలు- 10 గ్రా జీలకర్ర- 5గ్రా ఉప్పు- తగినంత అల్లం తరుగు- రెండు గ్రాములు నూనె- వేయించడానికి సరిపడినంత తయారీ: అలసందలు, పచ్చిశనగలు, మినప్పప్పు కడిగి రెండు గంటల సేపు నానబెట్టాలి. అన్నింటినీ కలిపి ఉప్పు వేసి కొంచెం పలుకుగా రుబ్బాలి. పిండి మరీ జారుడుగా ఉండకూడదు. వడ చేయడానికి వీలుగా ఉండాలి. ఇందులో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర వేసి బాగా కలపాలి. బాణలిలో నూనె పోసుకుని కాగిన తర్వాత మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని వడలాగ వత్తి నూనెలో వేసి రెండు వైపులా దోరగా వేయించి తీయాలి. ఈ వడలకు కొబ్బరి పచ్చడి, టొమాటో పచ్చడి చక్కటి కాంబినేషన్. ఇదే పిండిని పకోడీల్లా వేసుకుంటే సూప్‌తో స్టార్టర్‌గా తినడానికి కూడా బాగుంటాయి. కాజు-మోతీ పులావ్ కావలసినవి: బాసుమతి బియ్యం- 200 గ్రా బిర్యానీ ఆకులు - రెండు ఉప్పు - తగినంత జీడిపప్పు - 50 గ్రా తాలింపు కోసం: నెయ్యి- మూడు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి- 5 (తరగాలి) పుదీన- ఒక కట్ట కొత్తిమీర- చిన్న కట్ట ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు జీలకర్ర- ఒక టీ స్పూన్ ధనియాలు- ఒక టీ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టేబుల్ స్పూన్ పన్నీర్ బాల్స్ కోసం: పనీర్- 50 గ్రా గరమ్ మసాలా పొడి- 10 గ్రా కార్న్‌ఫ్లోర్- ఒక టీ స్పూన్ ఉప్పు- తగినంత నూనె- రెండు టేబుల్ స్పూన్లు తయారీ: బియ్యాన్ని కడిగి అరగంట సేపు నానబెట్టాలి. పన్నీరును తురిమి ఉప్పు, గరం మసాలా పొడి, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలు చేయాలి. వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు బియ్యంలో బిర్యానీ ఆకులు, ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టాలి. బాణలి పెట్టి నెయ్యి వేసి జీడిపప్పును నేతిలో వేయించి పక్కన పెట్టాలి. మిగిలిన నెయ్యితో తాలింపు దినుసులన్నీ వేసి వేగనివ్వాలి. అందులో రైస్ కలిపి కాజు, వేయించిన పన్నీరు ఉండలతో గార్నిష్ చేయాలి. హాజల్‌నట్ సూప్ కావలసినవి: బటర్- 15 గ్రా; మైదా-100 గ్రా; ఉప్పు : తగినంత బే లీఫ్- ఒకటి; మిరియాలు- ఆరు గింజలు హాజల్‌నట్ - 50 గ్రా (వీటి బదులు బాదం తీసుకోవచ్చు) క్రీమ్- అర టీ స్పూన్; పాలు- 125 మి.లీ తయారీ: హాజల్ నట్ లేదా బాదం గింజలను పెనంలో దోరగా వేయించి చల్లారిన తర్వాత కొద్దిగా నీటిని చేరుస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి. గార్నిష్ కోసం కొన్ని పలుకులు పక్కన పెట్టుకోవాలి. పెనంలో వెన్న వేసి వేడెక్కిన తర్వాత మిరియాలు, బే లీఫ్, మైదా, ఉప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలి. మరొక పెనంలో పాలు పోసి కాగిన తర్వాత హాజల్‌నట్ లేదా బాదం గింజల పేస్టు వేసి కలుపుతూ ఐదు నిమిషాల సేపు మరగబెట్టాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మైదా మిశ్రమంలో నీటిని పోసి కలిపి మొత్తాన్ని పాలలో వేసి కలపాలి. మిశ్రమం వేడయిన తర్వాత దించి పైన క్రీమ్, బటర్, హాజల్‌నట్ లేదా బాదం పలుకులు వేసి సర్వ్ చేయాలి. ఆపిల్ వాల్నట్ సలాడ్ కావలసినవి: ఆపిల్ - 150 గ్రా వాల్నట్- 25 గ్రా సెలెరీ - రెండు కాడలు (ఇది ఆకుకూరల్లో ఒక రకం. అది లేనప్పుడు ఉల్లికాడలు తీసుకోవాలి) ఉప్పు - తగినంత క్రీమ్- 25 మి.లీ మయనైజ్ - 10 గ్రా లేదా వెన్న తయారీ: ఆపిల్‌ను శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి. సెలెరీ కాడలను సన్నగా తరగాలి. ఒక పాత్ర తీసుకుని ఆపిల్ ముక్కలు, సెలెరీ తరుగు, వాల్నట్, క్రీమ్, ఉప్పు, మయనైజ్ లేదా వెన్న వేసి కలపాలి. పిస్తా మిల్క్ షేక్ కావలసినవి: పిస్తా - 100 గ్రా క్రీమ్ - 75 గ్రా బటర్ - 15 గ్రా చక్కెర - 100 గ్రా వెనిలా ఐస్‌క్రీమ్ - 50 గ్రా (రెండు స్కూప్‌లు) పాలు- 100 మి.లీ పిస్తా ఎసెన్స్- రెండు చుక్కలు తయారీ: పిస్తా ను అర గంట సేపు నానబెట్టి కొన్ని పలుకులు పక్కన ఉంచుకుని మిగిలిన వాటిని మెత్తగా పేస్టు చేయాలి. అందులో క్రీమ్, బటర్, చక్కెర, పాలు, పిస్తా పలుకులు, ఎసెన్స్ వేసి బాగా కలపాలి. తర్వాత ఐస్‌క్రీమ్ ఒక స్కూప్ వేసి ఒక మోస్తరుగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడవాటి గ్లాసులో పోసి మరొక ఐస్‌క్రీమ్ స్కూప్ వేసి పైన పిస్తా పలుకులతో గార్నిష్ చేయాలి. ఇష్టమైతే లిక్విడ్ చాకొలెట్ కూడా వేసుకోవచ్చు. చెఫ్: రాఘవేంద్ర హోటల్ ఇన్నర్ సర్కిల్, హైదరాబాద్ -
అమ్మ పాలు.. అమృతం!
సాక్షి, సిటీ బ్యూరో: నవ మాసాలు మోసిన తల్లి.. తన బిడ్డ ఈ లోకంలో అడుగు పెట్టగానే ఆరోగ్యాన్ని...రోగ నిరోధక శక్తిని కానుకగా ఇవ్వాలంటున్నారు వైద్యులు. ఇది కేవలం తల్లి పాలతోనే సాధ్యమని చెబుతున్నారు. పుట్టిన 15 నిమిషాల నుంచి గంట వ్యవధి లోపు ఇచ్చే ముర్రుపాలు చిన్నారులకు రోగ నిరోధక ఔషధమని అంటున్నారు. దాదాపు 30 శాతం శిశు మరణాలను తగ్గించేది ఇవేనని యూనిసెఫ్ నివేదిక స్పష్టం చేసింది. ముర్రుపాలు పట్టకూడదనే అపోహతో చాలా మంది గ్రామీణ మహిళలు గంటలోపు పాలు పెట్టనివ్వరు. నిజానికి ఆ రెండు మూడు చుక్కల పాలలాంటి నీళ్లు బిడ్డకు వారం రోజులకు సరిపడా పౌషక విలువలను అందిస్తాయి. పోషకాలు పుష్కలం బిడ్డ పుట్టిన 15 నిమిషాల నుంచి మూడు రోజుల పాటు వచ్చే ముర్రుపాలల్లో అత్యంత ఆరోగ్యవంతంగా ఉంచగలిగే పోషక విలువలు ఉంటాయి. ఆరు నెలల వరకు ఎంత ఎండాకాలమైనా సరే నీళ్లు కూడా ఇవ్వకుండా తల్లి పాలే ఇవ్వాలి. ఇది బిడ్డ ఎదుగుదలకు అత్యంత కీలకం. తల్లి పాలల్లో బాక్టీరియా ఉండదు. ఎలాంటి పోషకాలు అవసరమో... ఎంత వేడి కావాలో... ఎటువంటి రోగ నిరోధకాలు అవసరమో... ఎంత తియ్యదనం కావాలో తల్లి పాలలో సహజసిద్ధంగా లభిస్తాయి. పిల్లల్లో మలబద్ధకం ఉండదు. పొట్టలో గ్యాస్ తయారు కాదు. డయేరియా, దగ్గు, జలుబు లాంటివి దరిచేరవు. ఇన్ఫెక్షన్లు సోకవు. రెండు గంటలకొకసారి తప్పనిసరిగా తల్లి బిడ్డకు పాలివ్వాలి. 24 గంటల్లో 8 సార్లు తప్పనిసరిగా పాలు ఇవ్వాల్సి ఉంటుంది. – డాక్టర్ బాలాంబ, గైనకాలజిస్ట్ మానసిక వికాసానికి తోడ్పాటు భవిష్యత్‌లో బిడ్డకు మానసిక సమస్యలు రాకుండా తల్లి పాలు నిరోధించగలుగుతాయి. పర్సనాలిటీ డిజార్డర్స్ని దూరం చేస్తాయి. కూలి పని చేసుకునే తల్లులకు గ్రామీణ ఉపాధిహామీ పథకంలో కూడా పిల్లల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉంది. కానీ ఇదెవ్వరూ పట్టించుకోరు. ఐటీæసంస్థలు, కార్పొరేట్ ఆఫీసుల్లోనూ బిడ్డలకు ప్రత్యేకించి సంరక్షణ కేంద్రాలు 99 శాతం లేవనే చెప్పాలి. ఎన్ని అవగాహనా కార్యక్రమాలు పెట్టినా అందుకు అనుగుణమైన వాతావరణాన్ని కల్పించడం అవసరం. –డాక్టర్ రమాదేవి, కన్వీనర్, జనవిజ్ఞాన వేదిక క్యాన్సర్ దూరం వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ అనే సంస్థ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే అంశాల్లో బిడ్డలకు పాలివ్వడం కూడా ఒకటని ప్రచారం చేస్తోంది. పాలిచ్చే తల్లుల కంటే పాలివ్వని వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా నమోదవుతున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. పుట్టిన గంటలోపు పాలివ్వకపోవడం వల్లనే తల్లుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. మిల్క్ బ్రెడ్, తృణధాన్యాలు, ఓట్స్ లాంటివి తక్షణమే తల్లిపాల ఉత్పత్తికి దోహదం చేస్తాయి. అందం తరిగిపోతుందన్నది కూడా అపోహే. –డాక్టర్ భావన కాసు -
ఊబకాయానికి..సూక్ష్మజీవులకు లింకు!
ఎంత మితంగా తిన్నా లావెక్కుతున్నారా.. ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా.. అయితే దానికి కారణం మీ పేగుల్లోని సూక్ష్మజీవులే! తినే ఆహారంలోని పోషకాలు ఒంట పట్టేందుకు పేగుల్లోని సూక్ష్మజీవులు (మైక్రో బయోమ్) దోహదపడుతాయనే విషయం తెలిసిందే. అయితే ఈ మైక్రో బయోమ్లో తేడా వస్తే అనేక సమస్యలు వస్తాయని అమెరికాలోని యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో తేలింది. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే జంతువుల్లో ఎసిటేట్ అనే రసాయనాన్ని అధిక మొత్తంలో కనుగొన్నారు. అలాగే ఎసిటేట్‌ను శరీరంలోకి ఎక్కించినపుడు క్లోమంలోని బీటా కణాలు ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయని గుర్తించారు. అయితే దీనికి కారణాలు తెలియరాలేదు.ఎసిటేట్‌ను నేరుగా మెదడులోకి ఎక్కిస్తే పర సహనుభూత నాడీ వ్యవస్థ ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతోందని పరిశోధకులు వివరించారు. అతిగా తినడాన్ని ప్రేరేపించే గ్యాస్ట్రిన్, గ్రెలిన్ అనే హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు. -
ఇంటిప్స్
కూరగాయలను ఉడికించిన నీరు పారబోయకుండా, బియ్యంలోకి నీళ్లుగానూ, సూప్ల్లోకీ వాడుకోవచ్చు.ముక్కలు చేసిన కూరగాయలను నీటిలో ఎక్కువ సేపు నానబెట్టకూడదు. ఆహారం వండుతున్నప్పుడు తప్పనిసరిగా గిన్నెపై మూత పెట్టాలి. ఈ జాగ్రత్త పోషకాలు కోల్పోకుండా చేస్తుంది.వంటకాలలో వంటసోడాను ఎక్కువగా వాడకపోవడమే మేలు. వాడగా మిగిలిన నూనెను మళ్ళీ మళ్ళీ వేడి చేయకూడదు. ఆ నూనెలో పోషకాలు ఉండకపోగా కొలెస్ట్రాల్‌కు కారణమవుతుంది. -
కోడిగుడ్డు కుతకుత..
గుడ్డు ధర రూ.5.50 ‘టమాటా’ కోసం రైతుబజార్లో క్యూ అమాంతం పెరిగిన ధరలు సిటీబ్యూరో/ గాజులరామారం/సనత్‌నగర్: పోషకాలు పుష్కలంగా ఉండే కోడిగుడ్డు గొంతు దిగనంటోంది. కూరలోని టమాటా వంటింటికి రానంటోంది. వీటిని కొనాలంటే సామాన్యుడు ఒకటికి పదిసార్లు జేబు తడుముకుని లెక్కలు వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కోడిగుడ్డు ధర పప్పులతో సమానంగా పెకైక్కుతూ ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.5.50కు చేరి బెంబేలెత్తిస్తోంది. మొన్నటి దాకా భయపెట్టిన టమాటా ధర వారం క్రితం దిగివచ్చింది. ఈ వారం మాత్రం రైతు బజార్లకు సరఫరా తక్కువ కావడంతో జనం టమాటా కోసం క్యూకట్టారు. దీంతో అమ్మకందార్లు ధరను పెంచేశారు. కోడిగుడ్డు ఇలా పైపైకి.. కోడి గుడ్డు ధర జూన్ 21 నుంచి కొద్దికొద్దిగా పెరుగుతూ వస్తున్న ధర ఆదివారం ఏకంగా రూ. 5.50 పైసలకు దుకాణాదారులు విక్రయించడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ఆదివారం నాటికి ఫామ్ ధర ఒక గుడ్డు రూ.4.14గా ఉంది. విక్రయ కేంద్రాలను బట్టి దుకాణదారులకు అది రూ. 4.34 నుంచి 4.80 కి లభిస్తుండగా.. రిటైల్ ధర రూ.5.50కు చేరింది. పప్పులు, కూరగాయల ధరలతో కోడిగుడ్డు పోటీ పడుతుండడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు గుడ్డు కొనాలంటే గుడ్లు తేలేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని రేటు.. ఈ ఏడాది గుడ్డు ధర ఫారం రేటు రూ. 4.14గా నమోదవడం ఇది రెండోసారి. 2015 జూన్ 3న గుడ్డు ఒకటికి ఫారం ధర రూ.3.20గా ఉంది. 2009 నుంచి 2015 వరకు జూన్ నెలలో ఒక గుడ్డు ధర ఇంతగా పెరిగిన దాఖలా లేదు. ఉత్ప త్తి తక్కువగా ఉండడం, నిర్వహణ భారంతో ఫామ్‌లు మూతపడుతుండడంతో ఇంతగా రేటు పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. టమాటా కోసం పడిగాపులు మరోవైపు టమాటా కూడా మాట విననంటోంది. బహిరంగ మార్కెట్లో కిలో టమాటాలు రూ.50 వరకు విక్రయిస్తుండటంతో జనం రైతుబజార్ బాట పట్టారు. అయితే బోర్డుపై నిర్దేశించిన ధర ప్రకారం టమాటా రూ.27కు విక్రయించాలి. ఎర్రగడ్డ రైతుబజార్‌లోని స్టాళ్ల నిర్వాహకులు కొనుగోళ్లకు రద్దీ పెరగడంతో ధరను ఏకంగా రూ.35కు పెంచేశారు. అయినప్పటికీ బయట ధరలతో పోలిస్తే తక్కువనే భావనతో చెప్పిన ధరకు వినియోగదారులు కొనుగోలు చేశారు. కొంతమంది బోర్డుపై ఉన్న ధర కంటే ఎక్కువగా అమ్ముతుండడంపై ప్రశ్నించినా లాభం లేకపోయింది. సరుకు తక్కువగా ఉండడంతో ఎర్రగడ్డ రైతుబజార్‌లోని టమాటా స్టాళ్ల వద్ద కొనుగోలుదారులు గంటల తరబడి బారులు తీరారు. -
మృదువైన కురులు...
బ్యూటిప్స్ రోజూ తీసుకునే ఆహారంలో పోషకాలు సమతూకంలో ఉండాలి. నార్మల్ హెయిర్ గలవారు చేపలు, చికెన్, పప్పు ధాన్యాలు, మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. పొడి జుట్టు గల వారు పచ్చికూరగాయలు, ముడిబియ్యంతో వండిన అన్నం, అరటిపండ్లు, నట్స్, విటమిన్ ‘ఇ’ క్యాప్సుల్స్ తప్పనిసరి. జుట్టు జిడ్డుగా ఉండేవారు తాజా ఆకుకూరలు-కూరగాయలతో చేసిన సలాడ్స్, పండ్లు, పెరుగు తీసుకోవాలి. షాంపూ: పొడి జుట్టు గలవారు మాడుపై ఉన్న సహజ నూనెలు పీల్చేయని షాంపూలను వాడాలి. షాంపూతో పాటు కండిషనర్ తప్పనిసరిగా వాడాలి. అప్పుడే వెంట్రుకలు ఎక్కువగా పొడిబారకుండా ఉంటాయి. జుట్టు జిడ్డుగా ఉండేవారు వారానికి మూడుసార్లు షాంపూతో తలస్నానం చేయాలి. గుడ్డు: కోడి గుడ్డులో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతాయి. మాయిశ్చరైజర్‌ని కోల్పోనివ్వవు. వారానికి ఒకసారి పొడిజుట్టు గలవారు గుడ్డులోని పసుపు సొనను, జిడ్డు గలవారు తెల్లసొనను ప్యాక్ వేసి 15 నిమిషాల తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. చుండ్రు నివారణకు : దుమ్ము, వాతావరణ, శుభ్రత లోపాలు చుండ్రుకు కారణం అవుతుంటాయి. 2 టీ స్పూన్ల బ్రౌన్ షుగర్‌లో టీ స్పూన్ హెయిర్ కండిషనర్ కలిపి మాడుకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తుంటే చుండ్రు తగ్గుతుంది. -
ఎడారి మొక్కల్లో ఎన్నో పోషకాలు
పరిపరి శోధన నిండా ముళ్లతో కనిపించే ఎడారి మొక్కలను ఏం చేసుకుంటాం అనుకుంటున్నారా? ఎడారి మొక్కల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయని అంతర్జాతీయ పరిశోధకులు చెబుతున్నారు. బ్రహ్మజెముడు, నాగజెముడు వంటి ఎడారి మొక్కల్లో పుష్కలంగా విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థాలు ఉంటాయని, వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే, మధుమేహం, స్థూలకాయం, గుండెజబ్బులు వంటి చాలారకాల వ్యాధులు దరిచేరవని న్యూయార్క్‌కు చెందిన న్యూట్రిషన్ నిపుణురాలు షాపిరో చెబుతున్నారు. ఎడారి మొక్కల పైభాగంలో కనిపించే ముళ్లతో నిండే తొక్కలను తొలగించి, గుజ్జుతో నిండిన భాగాన్ని జ్యూస్, జామ్, సలాడ్ వంటి వంటకాల తయారీలో భేషుగ్గా ఉపయోగించుకోవచ్చని ఆమె అంటున్నారు. -
మెక్సికో మనదనుకో
టొమాటో పోషకాల గురించి చిలవలు పలవలుగా వర్ణన కరక్టేనేమో! అందుకే మనం చారు కాస్తాం. మెక్సికన్లు సూప్ చేస్తారు. మెక్సికోలో అయినా మనదేశంలోనైనా చీజ్, చిప్స్, చికెన్, చిల్లీస్... కాంబినేషన్ కుదిరితే... పాకం ముదరడం, రుచి అదరడం ఖాయం. అడ్డుగోడ కట్టేసి వంట ఘుమఘుమల్ని ఆపడం కష్టం. ఆపడమూ, ఆగడమూ ఎందుకు? చలో కిచెన్... ప్రిపేర్ మెక్సికన్! ట టార్టిల్లా సూప్ కావల్సినవి: టొమాటోలను ఉడికించి, గుజ్జు చేసి, తీసిన రసం - 1 1/2 కప్పు, నల్ల చిక్కుడు గింజలు/బొబ్బెర్లు(ఉడికించినవి) - టీ స్పూన్ టొమాటో, ఉల్లిపాయల తరుగు - టేబుల్ స్పూన్ ఉడికించిన స్వీట్ కార్న్ (మొక్కజొన్న గింజలు) - టేబుల్ స్పూన్ పనీర్ (మాంసాహారం కావాలనుకునేవారు ఉడికించిన చికెన్ ముక్కలను సన్నగా తరిగి వాడచ్చు) - టేబుల్ స్పూన్ ఉప్పు - తగినంత అలంకరణకు... పాల మీగడ - టీ స్పూన్, కొత్తిమీర - 4 ఆకులు టార్టిల్లా చిప్స్ (ఏ చిప్స్ అయినా వాడుకోవచ్చు) - 10-15 తయారీ: టొమాటో రసాన్ని మరిగించాలి. ఒక గిన్నెలో ఉడికించిన ఉలవలు, పనీర్ తరుగు లేదా చికెన్ ముక్కలు, టొమాటో, ఉల్లి తరుగు, ఉడికించిన మొక్కజొన్న, పనీర్ లేదా చికెన్ తరుగు, ఉప్పు వేయాలి.దీనిపైన మరిగించిన టొమాటో రసం పోయాలి. పైన పాల మీగడ, కొత్తిమీర,టార్టిల్లా చిప్స్ వేసి సర్వ్ చేయాలి. ఎన్చిలడాస్ కావల్సినవి: ఫ్లోర్ టార్టిల్లా - 2 (4 కప్పుల మైదా, టీ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల వెన్న, నీళ్లు తగినన్ని. ఇవన్నీ కలిపి ముద్ద చేసి, 10 నిమిషాలు అలాగే ఉంచాలి. పిండి మృదువుగా అవుతుంది. దీన్ని చిన్న చిన్న ముద్దలు తీసుకొని, చపాతీలా చేసి, పెనం మీద రెండు వైపులా కాల్చుకోవాలి. వీటిని ఫ్లోర్ టర్టిలా అంటారు) ఫిల్లింగ్‌కు... ఎన్చిలడా సాస్ - టేబుల్ స్పూన్ (2 టేబుల్ స్పూన్ల మైదా, కప్పు టొమాటో గుజ్జు, టేబుల్ స్పూన్ కారం, వాము, వెల్లుల్లి, ఉల్లి, పంచదార టీ స్పూన్ చొప్పున, ఉప్పు, మిరియాల పొడి తగినంత. 2 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసి, పై పదార్థాలన్నీ బాగా వేసి, వేయించి వాడుకోవాలి), పనీర్, క్యారెట్, క్యాబేజీ తరుగు - 2 టేబుల్ స్పూన్లు, ఛీజ్ - టేబుల్‌స్పూన్ అలంకరణకు... పాల మీగడ (గిలకొట్టినది) - 2 టేబుల్ స్పూన్లు, కారం - పావు టీ స్పూన్, ఉప్పు - తగినంత తయారీ: ఎన్చిలడా సాస్‌ను ఫ్లోర్ టార్టిల్లా అంతా రాయాలిదాంట్లో క్యారెట్, క్యాబేజీ, సాస్, ఛీజ్ తరుగు వేసి రోల్ చేయాలి వెడల్పు, మందం ఉన్న గిన్నెలో అడుగున స్పూన్ బటర్ వేసి, రోల్ చేసిన టార్టిల్లాలను ఉంచి, సన్నని మంట మీద ఉడికించాలి. మాడకుండా ఛీజ్ కరిగేంతవరకు ఉంచి, తీయాలి పాలమీగడ వేసి, టొమాటో, క్యాబేజీ, ఉల్లి, కొత్తిమీర తరుగుతో వడ్డించాలి. నోట్: ఫిల్లింగ్ కోసం... చికెన్, మటన్ తరుగులను వాడచ్చు. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ కావల్సినవి: వెనిలా లేదా నచ్చిన ఐస్ క్రీమ్ - 1 స్కూప్ బ్రౌన్ బ్రెడ్ - 2 స్లైసులు కాస్టర్ సుగర్ (గిన్నెలో పంచదార వేసి, సన్నని మంట మీద కరిగించినది) - 1/3 కప్పు దాల్చిన చెక్కపొడి/ ఇలాచీ పొడి - టీ స్పూన్, చాక్లెట్ సిరప్/ తేనె (ఒక చిన్న గిన్నెలో చాక్లెట్ బార్ వేసి, వేడి నీళ్లలో పెట్టి కరిగించినది. లేదంటే మార్కెట్లో చాక్లెట్ సిరప్ లభిస్తుంది) - కావల్సినంత తయారీ:ఐస్ క్రీమ్ స్కూప్ను (2 గంటలు డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి){బెడ్ చివర్లను కత్తితో కట్ చేయాలి. {బెడ్‌ను గుండ్రంగా స్వీట్ కప్‌లా రోల్ చేయాలి.ఐస్ క్రీమ్‌ను రోల్ చేసిన బ్రెడ్ మీద పెట్టి, చుట్టూ బ్రెడ్తోనే అదిమి, బాల్లా చేసుకోవాలి. (పూర్ణం బూరెలా) మరుగుతున్న నూనెలో వేసి, 8-10 సెకండ్లలోపు తీసేయాలి.కరిగించిన పంచదారలో దాల్చిన చెక్క/ఇలాచీ పొడి కలపాలి.దీంట్లో ఐస్‌క్రీమ్ ఉన్న బ్రెడ్ ఉండను దొర్లించాలి.చివరగా చాక్లెట్ సాస్, లేదంటే తేనె పైన వేసి, సర్వ్ చేయాలి. చెర్రీ పండు, వాల్‌నట్స్‌ను అలంకరణకు వాడుకోవచ్చు. నోట్: అవెన్‌లో అయితే, 175 డిగ్రీల వేడిలో 15 సెకన్లు ఉంచి, వెంటనే తీయాలి సిజ్లింగ్ ఫజిట కావల్సినవి:ఎరుపు, పచ్చ బెంగుళూరు మిర్చి తరుగు (పొడవుగా కట్ చేయాలి) - 1 1/2 టీ స్పూన్ చొప్పున ఉల్లిపాయ - 1, టొమాటో -1 ఫ్లోర్ టార్టిల్లా- 5 రొయ్యలు - 200 గ్రా.లు (శాకాహారులు పనీర్‌ను వాడచ్చు) నూనె - టేబుల్ స్పూన్ ఉప్పు, మిరియాల పొడి - రుచికి తగినంత సోయా సాస్(పనీర్ లేదా చికెన్ మ్యారినేషన్‌కు) - టేబుల్ స్పూన్ తయారీ:ఇనుప మూకుడును వేడి చేయాలి. అందులో నూనె వేసి మిర్చి, ఉల్లిపాయ తరుగు, ఉప్పు, మిరియాల పొడి వేసి 3-4 నిమిషాలు వేయించాలి.చికెన్‌ను బొగ్గుల మీద కాల్చి, ప్లేట్లో తీసుకోవాలి. సాస్ వేసి 10 నిమిషాలు ఉంచాలి. 2 టర్టిలాలను తయారుచేసుకొని, పక్కన ఉంచాలి.వేయించిన కూరగాయ ముక్కలను పెట్టి, దాని పైన రొయ్యలను లేదా పనీర్ ముక్కలను ఉంచాలి.వాటి పైన కరిగించిన బటర్ లేదా నెయ్యి వేయాలి. దీనిని వేడి వేడిగా టార్టిల్లా, టొమాటో సూప్, ప్రైడ్ రైస్.. వంటి కాంబినేషన్‌తో వడ్డించాలి. గమనిక: సిజ్లర్ ప్లేట్‌ను ఇనుముతో తయారుచేస్తారు. అందులోనే పదార్థాలను వండి, ఆ ప్లేట్‌ను చెక్కమీద పెట్టి వడ్డిస్తారు. దీని వల్ల పదార్థం వేడి తొందరగా తగ్గదు. కరె్టిసీ: జావేద్, షెఫ్ లా మెక్సికన్ కె.పి.హెచ్.బి, హైదరాబాద్ ఫొటోలు: శివ మల్లాల -
నేను మీ పేగుని
ఆనంద్ శరీరంలో నేనో అనాకారి భాగాన్ని. మిగిలిన అవయవాలన్నీ వాటి పని అవి చేసుకుంటూ కాస్త మొహమాటానికి పోతాయి గానీ, నేనలా కాదు. బిగదీసే నొప్పి ద్వారా, ఇబ్బందికరమైన శబ్దాల ద్వారా ఆనంద్‌కు నా ఉనికిని నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటాను, ఒక్కోసారి అతిగా పనిచేస్తుంటాను. ఒక్కోసారి మందకొడిగా పనిచేస్తుంటాను. నేను ఆనంద్ పేగును. ఎనిమిది మీటర్ల పొడవు ఉంటాను.నేను లుంగలుగా చుట్టుకున్న పెద్ద గొట్టంలా తన శరీరంలో ఉంటానని ఆనంద్ అనుకుంటూ ఉంటాడు. నిజమే! నేను లుంగలుగా చుట్టుకున్న గొట్టాన్నే! అంతకు మించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కూడా. నన్ను తనే పోషిస్తున్నాడని ఆనంద్ అనుకుంటూ ఉంటాడు. నిజానికి నేనే అతడిని పోషిస్తున్నాను. ఆహారాన్ని ఆమోదయోగ్యంగా మారుస్తా ఆనంద్ తినే ఆహారం నేరుగా రక్తంలో కలసిపోతే అది రక్తపింజర విషం కంటే ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి ఆహారాన్ని నేను ఆమోదయోగ్యంగా తయారు చేస్తాను. అతడి రక్తప్రవాహంలో కలిసే సాధారణ పదార్థాలుగా విడగొడతాను. అవే అతడి శరీరంలోని లక్షలాది కోట్ల కణాలకు ఆహారంగా మారుతాయి. అతడి కండరాలకు శక్తినిస్తాయి. ఆనంద్ తినే ఆహారంలోని కొవ్వులను నేను ఫ్యాటీ యాసిడ్స్‌గా, గ్లిజరాల్‌గా మార్చేది నేనే. ప్రొటీన్స్‌ను అమినో యాసిడ్స్‌గా, పిండి పదార్థాలను గ్లూకోజ్‌గా మారుస్తాను. నాకు ఈ రసాయనిక శక్తే లేకుంటే, ఆనంద్ మనుగడ సాగించలేడు. అతడు తినే ఎలాంటి ఆహారాన్నయినా నేను జీర్ణం చేసుకుంటాను. తర్వాత ఆ ఆహారంలోని పోషకాలను అతడి రక్తంలోకి పంపుతాను. జీర్ణం చేసుకున్న తర్వాత నాలో మిగిలే వ్యర్థంలో కోట్లాది మృత బ్యాక్టీరియా కణాలు, కాస్త జారుడుగా ఉండే మ్యూకస్ నిండి ఉంటాయి. వాటితో పాటే నేను పీల్చుకోలేని పదార్థాలు కూడా ఉంటాయి. దిగువభాగమే సూక్ష్మజీవులకు ఆవాసం నా నిర్మాణం సంక్లిష్టమైన జీర్ణక్రియకు అనుగుణంగా ఉంటుంది. కడుపు దిగువన ఉండే నా భాగాన్ని చిన్నపేగు అంటారు. ఇందులో ఎగువన 25 సెంటీమీటర్ల పొడవున ఉండే భాగాన్ని డువోడినమ్ అని అంటారు. దాని దిగువనే నాలుగు సెంటీమీటర్ల వ్యాసంతో రెండున్నర మీటర్ల పొడవున ఉండే భాగాన్ని జెజునమ్ అంటారు. నాలుగు మీటర్ల పొడవున ఉండే చివరి భాగాన్ని ఇలియమ్ అంటారు. దాని తర్వాత రెండు మీటర్ల పొడవున పెద్ద పేగు ఉంటుంది. సాధారణంగా నా పైభాగంలో ఎలాంటి సూక్ష్మజీవులు ఉండవు. కడుపులో తయారయ్యే శక్తిమంతమైన ఆమ్లాలు చాలావరకు సూక్ష్మజీవులను చంపేస్తాయి. అయితే, నా దిగువ భాగమే సూక్ష్మజీవులకు ఆవాసంగా ఉంటుంది. అక్కడ యాభై రకాలకు పైగా సూక్ష్మజీవులు లక్షల కోట్ల సంఖ్యలో ఉంటాయి. మూడు నుంచి ఎనిమిది గంటల్లో జీర్ణం ఆనంద్ తీసుకునే ఆహారాన్ని మొత్తంగా జీర్ణం చేసుకోవాలంటే, నా చిన్నపేగుకు మూడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది. ఆనంద్ మూడు పూటలా తింటుంటాడు. అందువల్ల నా చిన్నపేగుకు విశ్రాంతి లభించడమే అరుదు. చిన్నపేగు ద్వారా జీర్ణమైన ఆహారం చిక్కని ద్రవరూపంలో పెద్దపేగుకు చేరుకుంటుంది. పెద్దపేగు అందులోని నీటిని పీల్చేసుకుని, రక్తంలోకి పంపుతుంది. తీరికగా జరిగే ఈ ప్రక్రియకు 12 నుంచి 24 గంటల సమయం పడుతుంది. ఒకవేళ ఆనంద్ రోజు మొత్తంలో ఎనిమిది లీటర్ల నీటిని కోల్పోతే, కొద్ది వ్యవధిలోనే డీహైడ్రేషన్‌కు గురై పూర్తిగా శుష్కించిపోతాడు. పెద్దపేగు నీటిని పీల్చేసుకున్న తర్వాత అందులో మెత్తటి ఘనరూపంలో వ్యర్థపదార్థం మిగులుతుంది. నెమ్మదిగా ఇది అడుగు భాగానికి చేరి, బయటకు పోతుంది. అయితే, ఆనంద్ ఒకవేళ తీవ్రమైన ఒత్తిడికి గురైనా, పెద్దపేగులోకి ఆహారం చేరే వేగం పెరిగినా, బ్యాక్టీరియా సోకినా.. నీటిని పీల్చుకునే ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. అలాంటప్పుడు ఆనంద్‌కు నీళ్ల విరోచనాలు మొదలవుతాయి. ఒకవేళ ఆనంద్ దిగులుతో కుంగిపోతున్నా, పీచుపదార్థాలు తగినంతగా లేని ఆహారం తీసుకున్నా, తగినంత నీరు తాగకపోయినా అతడికి మలబద్ధకం మొదలవుతుంది. అయితే, మలబద్ధకం కంటే నీళ్ల విరోచనాలతోనే ప్రమాదం ఎక్కువ. వాటి వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆనంద్ మరింత ఎక్కువగా నీళ్లు, ద్రావకాలు తాగాల్సి ఉంటుంది. నోటి నుంచే జీర్ణక్రియ ప్రారంభం ఆనంద్‌లో జీర్ణక్రియ అతడి నోటి నుంచే ప్రారంభమవుతుంది. నోటితో నమిలి మింగిన ఆహారం కాస్త మెత్తటి స్థితిలో కడుపులోకి చేరుతుంది. కడుపు ఆ ఆహారాన్ని చిలికేస్తుంది. దాంతో చిక్కటి సూప్‌లా మారిన పదార్థం నాలోకి చేరుతుంది. ఈ ప్రక్రియకు కాస్త సమయం పడుతుంది. ఆనంద్ ఓ గ్లాసుడు నీరు తాగితే, ఆ నీరు నాలోకి చేరడానికి పది నిమిషాలు పడుతుంది. ఘనాహారం తీసుకుంటే, అది నా వరకు చేరడానికి నాలుగు గంటలు పడుతుంది. కడుపు నుంచి నాలోకి విడుదలయ్యే ఆహారం శక్తిమంతమైన యాసిడ్‌తో నిండి ఉంటుంది. కడుపు నుంచి నాలోకి ఒకేసారి పెద్దమొత్తంలో యాసిడ్ విడుదలైతే సున్నితమైన నా లైనింగ్ దెబ్బతింటుంది. దాంతో నేను జీర్ణక్రియను సక్రమంగా నిర్వర్తించలేను. అయితే, చాలా వరకు నేను నాలోకి చేరే యాసిడ్‌ను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తాను. నాలోని డువోడినమ్ ఉత్పత్తి చేసే పదార్థం ఆనంద్ రక్తంలోకి చేరి, రక్తం ద్వారా అతడి క్లోమగ్రంథికి (పాంక్రియాస్‌కు) చేరుకుంటుంది. వెంటనే అతడి పాంక్రియాస్ క్షారస్వభావం గల జీర్ణరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ జీర్ణరసం నాలోని డువోడినమ్కు చేరి, అక్కడకు వచ్చిపడే యాసిడ్స్‌ను నిర్వీర్యం చేస్తాయి. పాంక్రియాస్ ఉత్పత్తి చేసే జీర్ణరసంలోని మూడు ముఖ్యమైన ఎంజైమ్స్ ఆహారంలోని ప్రొటీన్లు, కొవ్వులు, కార్బొహైడ్రేట్లను శరీరానికి పనికొచ్చేలా తయారు చేస్తాయి. పాంక్రియాస్ ద్వారా విడుదలయ్యే జీర్ణరసంతో పాటు నాలోకి వేర్వేరు మార్గాల ద్వారా రకరకాల రసాలు వచ్చి చేరుతూనే ఉంటాయి. నాలోకి రోజుకు రెండు లీటర్ల లాలాజలం, కడుపు ద్వారా మూడు లీటర్ల ఆమ్లరసాలు, లివర్ ద్వారా పిత్తరసం (బైల్), వివిధ గ్రంథుల ద్వారా మరో రెండు లీటర్ల స్రావాలు నాలోకి చేరుతాయి. ఈ ప్రక్రియకు ఏదైనా విఘాతం కలిగితే, ఆనంద్‌కు అల్సర్లు ఏర్పడతాయి. దాదాపు 75 శాతం అల్సర్లు డువోడినమ్లోనే ఏర్పడతాయి. తిండి జాగ్రత్తతో సురక్షితంగా ఉంటా చాలామందిలాగే ఆనంద్ కూడా తనకు తానే పెద్ద ఆహార నిపుణుడిని అనుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు తలెత్తే మలబద్ధకాన్ని వదిలించుకునేందుకు తనకు తోచిందల్లా తినేస్తూ ఉంటాడు. యవ్వనంలో సరే ఆనంద్ ఏం తిన్నా హరాయించుకునే శక్తి నాకు ఉండేది. ఈ నడివయసులోనూ అలాగే తింటే ఎలా కుదురుతుంది? ఆనంద్ కాస్త తిండి జాగ్రత్త పాటిస్తే చాలు, నేను సురక్షితంగా ఉంటా. అతడికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటా. ఈ వయసులో ఆనంద్ గ్యాస్‌ను అతిగా ఉత్పత్తి చేసే ఉల్లిపాయలు, క్యాబేజీ, బీన్స్ వంటివి అతిగా తినకుండా ఉంటేనే మంచిది. వాటి బదులుగా పుష్కలంగా ఆకుకూరలు, చిరుధాన్యాలు, పండ్లు తీసుకోవడం మంచిది. అలాగే తను బాగా నీరు కూడా తాగాలి. ఒత్తిడికి, దిగులుకు దూరంగా ప్రశాంతంగా ఉండాలి. విశ్రాంతితో సర్దుకుంటా చాలామందిలాగానే ఆనంద్ కూడా తిండి విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటాడు. ఒక్కోసారి వేళాపాళా లేకుండా తింటుంటాడు. నడి వయసుకొచ్చాననే ధ్యాస కూడా లేకుండా రుచుల కోసం ఆత్రపడి నాలుకకు నచ్చినదల్లా లాగించేస్తూ ఉంటాడు. నడి వయసుకు వచ్చే సరికి నా వెలుపలి వైపు చిన్న చిన్న బుడగల్లా ఏర్పడతాయి. ఇవి మహా అయితే ఒక ద్రాక్షపండు పరిమాణంలో ఉంటాయి. ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటే, వీటి వల్ల ప్రమాదమేమీ ఉండదు. ఇన్ఫెక్షన్లు సోకితే మాత్రం వీటికి వాపు ఏర్పడి నాకు ఇబ్బందులు కలుగుతాయి. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు, కొన్ని రసాయనాల వల్ల ఇలా జరుగుతుంది. వాటి వల్ల నొప్పి, వికారం, నీళ్ల విరోచనాలు మొదలవుతాయి. అలాంటప్పుడు ఒక రోజంతా విశ్రాంతినిస్తే నా అంతట నేనే తేరుకుంటాను. నా పెద్ద పేగులో లైనింగ్ దెబ్బతిన్నప్పుడు కూడా కడుపునొప్పి తప్పదు. ఒత్తిడి, కుంగుబాటు వంటి కారణాల వల్ల కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ఆనంద్ ఒత్తిడి నుంచి తేరుకుని, ప్రశాంతంగా మారితే నేనూ కోలుకుంటాను. పెద్దపేగు లోపలి గోడలు బాగా దెబ్బతిని అల్సర్ ఏర్పడితే, రక్తస్రావం కూడా జరగొచ్చు. అదృష్టవశాత్తు ఆనంద్‌కు ఇంతవరకు అలాంటి పరిస్థితి తలెత్తలేదు. ఒకవేళ ఆ పరిస్థితే తలెత్తితే, వైద్యుల సాయం తీసుకోక తప్పదు. మూడ్స్‌తో మారే పనితీరు ఆనంద్ శరీరంలోని చాలా ఇతర అవయవాల మాదిరిగానే నా పనితీరు కూడా అతడి మూడ్స్‌కు అనుగుణంగా మారుతూ ఉంటుంది. అతడి మూడ్స్ వల్ల ఒక్కోసారి నా కదలికలు వేగంగా మారడం లేదా ఒక్కోసారి కదలికలు నిలిచిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతేకాదు, నేను ఆనంద్‌కు తరచుగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాను. ఒక్కోసారి శబ్దాలు తెప్పిస్తుంటా. నాలోని గ్యాస్ బుడగలు కదిలేటప్పుడు వచ్చే శబ్దాలవి. ఎక్కువగా అవి ఆనంద్ మింగిన గాలి వల్ల ఏర్పడినవే. అయితే, నేను కూడా కొంత గ్యాస్‌లను ఉత్పత్తి చేస్తా. వాటిలో ముఖ్యంగా మీథేన్, హైడ్రోజన్ ఉంటాయి. -
మిన్నరల్స్
కొంత కార్బోహైడ్రేట్, ఇంత ప్రొటీన్... మరికొన్ని విటమిన్స్... కూసింత ఫ్యాట్... గోరంత మినరల్స్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ సున్నా... ఆరోగ్యం మిన్న! ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సిన అవసరం అందరికీ తెలిసిందే కానీ, మినరల్స్ విషయంలో తరచూ అశ్రద్ధ చూపిస్తారు. వాటి అవసరం ఎంత గొప్పదో చెబితే జాగ్రత్త పడతారని నమ్ముతున్నాం. నేలలో విత్తనాలు చల్లి ఊరుకుంటే సరిపోదు. నీళ్లు, ఎరువులు అనే పోషకాలు కావాలి. అప్పుడే పంట ఫలవంతం అవుతుంది. అలాగే మన శరీరానికి కూడా ఫ్యాట్స్,కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్ అనే పోషకాలు కావాలి.మినరల్స్.. పోషకాల్లో చివరివీ, చిట్టిమోతాదుల్లో అవసరమైనవే అయినా అత్యంతముఖ్యమైనవి. శరీరం నిర్వర్తించే వివిధ పనులకు వాటి సాయం కావల్సిందే. అవి కూడా అందినప్పుడే మనిషికి ఆరోగ్యం.. అదే మహాభాగ్యం అవుతుంది. శరీరానికి అవసరమయ్యే మినరల్స్‌ను మేజర్ మినరల్స్, ట్రేస్ మినరల్స్ అని రెండురకాలుగా విభజించారు. మేజర్, ట్రేస్.. ఏ మినరల్స్ అయినా అన్నిటినీ సమపాళ్లలో తీసుకోవాలి. ఒక మినరల్ మోతాదు మించితే ఇంకో మినరల్ శరీరంలో చోటును కోల్పోవాల్సిందే. ఉదాహరణకు.. మ్యాంగనీస్ని మోతాదుకి మించి ఏకొంచెం ఎక్కువ తీసుకున్నా ఐరన్ డెఫిషియెన్సీ ఏర్పడుతుంది. ఏ మినరల్స్నయినా ఆహారం ద్వారా తీసుకుంటేనే మంచిది. ఒకవేళ సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తే మోతాదు మించకుండా జాగ్రత్తపడాలి.అదీ వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. మేజర్ మినరల్స్ వీటి అవసరం పెద్దమొత్తంలోనే ఉంటుంది. ఇవి శరీరంలో నిల్వ ఉండటమే గాక రకరకాల దారుల గుండా శరీరమంతా ప్రయాణం చేస్తుంటాయి. కాల్షియం, క్లోరైడ్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, సల్ఫర్ మొదలైనవి మేజర్ మినరల్స్. కాల్షియం... ఎముకలు, దంతాల ఆరోగ్యానికి, కండరాల కదలికలకు, నాడీ వ్యవస్థ పనులకు, రక్తపోటును సాధారణస్థాయిలో ఉంచడానికి, రోగనిరోధక శక్తిని కాపాడ్డానికీ కాల్షియం అవసరమవుతుంది. రోజుకి ఎంత కాల్షియం తీసుకోవాలి అనేది వయసు, ఎదుగుదల దశను బట్టి ఉంటుంది. మూడేళ్లలోపు పిల్లలకైతే రోజుకి 700 నుంచి1000 మి.గ్రా. కాల్షియం ఇవ్వాలి ఆహారం ద్వారానే. 8 ఏళ్ల లోపు పిల్లలకైతే వెయ్యి మిల్లీగ్రాములు, 18ఏళ్ల లోపువాళ్లకైతే 13 వందల మిల్లీగ్రాములు, యాభై ఏళ్ల లోపు వాళ్లకు వెయ్యి మిల్లిగ్రాములు కాల్షియం సరిపోతుంది. 70 ఏళ్లలోపు మహిళలకైతే 12 వందల మిల్లీగ్రాములు, పురుషులకైతే వెయ్యి మి.గ్రా. కాల్షియం చాలు. 70 పైబడిన ఎవరికైనా 12 వందల మిల్లీగ్రాములు సరిపోతాయి. గర్భిణులు, తల్లులైతే రోజుకి వెయ్యి మి.గ్రా. కాల్షియం తీసుకోవాలి. అయితే ఈ కాల్షియంను శరీరం గ్రహించాలంటే మన శరీరంలో విటమిన్ డి తగినంత ఉండాలి. సప్లిమెంట్ల (మాత్రల) రూపంలో మోతాదుకు మించి తీసుకుంటే విపరిణామాలు కలిగే ప్రమాదం ఉంటుంది. జీర్ణక్రియ మందగించడం, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడం, కోమాలోకి వెళ్లడం వంటివి జరగొచ్చు. కాల్షియం తక్కువైతే ఆస్టియోపొరాసిస్ వస్తుంది. కాల్షియం పాల ఉత్పత్తులు, చేపలు, కూరగాయలు, టోఫూ, కాయ ధాన్యాల్లో దొరుకుతుంది. క్లోరైడ్ .. జీర్ణక్రియకు తోడ్పడే ఆమ్లాలను ఉత్పత్తి చేయడంలో కీలకపాత్ర వహిస్తుంది. క్లోరైడ్ తక్కువైతే నీరసం, కండరాలు బిగుసుకుపోవడం, మూత్రంలో పొటాషియం పోవడం, బీపీ తక్కువడం వంటివి కనిపిస్తాయి. ఉప్పు, పాలు, మాంసం, బ్రెడ్, కూరగాయలు, సోయాజసాస్లో క్లోరైడ్ పుష్కలం. మెగ్నీషియం... శరీరంలో జరిగే 300 జీవరసాయనిక ప్రతిక్రియలకు, కండరాలు, నాడీవ్యవస్థ సక్రమంగా పరిచేసేందుకు, గుండె చప్పుడు సాధారణ స్థాయిలో ఉండేందుకు, ఎముకల దృఢత్వానికి, రోగనిరోధక శక్తి పెరగడానికీ ఉపకరిస్తుంది. మెగ్నీషియం తక్కువైతే రక్తంలో ఇన్సులిన్ స్రవించే ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. దీని ప్రభావం షుగర్ వ్యాధిగ్రస్తుల మీద ఎక్కువగా ఉంటుంది. టైప్ 2 డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల బ్లడ్‌షుగర్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ సూచించిన ప్రకారం మహిళలు రోజుకి 310 నుంచి 320 మిల్లీగ్రాములు, పురుషులు 400 నుంచి 420 మిల్లీగ్రాముల మెగ్నీషియంను తీసుకోవాలి. బీన్స్, ధాన్యాలు, కూరగాయలు, నట్స్, కాయ ధాన్యాలు, ఆకుకూరలు, సీ ఫుడ్, డార్క్చాక్లేట్స్, ఉప్పు నీరు, పాల పదార్థాల్లో మెగ్నీషియం లభిస్తుంది. ఫాస్ఫరస్... ఎముకలు, పళ్ల పటుత్వానికి, కొన్నిరకాల ప్రొటీన్ల తయారీకి, కణాల రిపేర్‌కి ఫాస్ఫరస్ తనవంతు కృషిని అందిస్తుంది. ఇది తక్కువైతే నాడీవ్యవస్థకు సంబంధించిన వ్యాధులు, కండరాల సమస్యలూ వస్తాయి. రోజుకి 700 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్‌ను తీసుకోవాలి. మాంసం, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, గుడ్లు, పాల పదార్థాలు, పొట్టు ధాన్యాల్లో ఫాస్ఫరస్ లభిస్తుంది. పొటాషియం... గుండె చప్పుళ్లు సాధారణస్థాయిలో ఉండేట్టు చూస్తుంది. ప్రొటీన్స్‌ను తయారు చేయడంలో, అవి జీర్ణమయ్యేలా చూడ్డంలో, కార్బోహైడ్రేట్స్ ఉపయోగంలో, రక్తంలోని పీహెచ్‌ని బ్యాలెన్స్ చేయడంలో, కండరాలు సోడియంను గ్రహించేలా చేయడంలో, మనం బరువులెత్తినప్పుడు కండరాలకు తోడ్పడంలో, ఆహారం నుంచి శక్తిని గ్రహించడంలో తోడ్పడ్తుంది. దీని కొరత కండరాలు బిగుసుకుపోవడం, బలహీనమవడం, ఆస్టియోపొరాసిస్, కిడ్నీలో రాళ్లు, నిస్త్రాణ, శ్వాస ఆడకపోవడం, గందరగోళం వంటి పరిస్థితులకు దారితీస్తుంది. రోజుకి 4 వేల 7 వందల మి.గ్రా. పొటాషియంను తీసుకోవాలి. పొటాషియం చేపలు, చికెన్, బంగాళదుంపలు, టమాటో, బీన్స్, మాంసం, పాలు, పండ్లు, కూరగాయలు, పొట్టు ధాన్యాలు, కాయ ధాన్యాలు, అరటి, కమలా, పాలకూర, చిలకడదుంపలు, కొబ్బరి నీళ్లలో దొరుకుతుంది. సోడియం... నాడీ, కండర వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఫ్లూయిడ్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. శరీరం అమినో యాసిడ్స్, గ్లూకోజ్ వంటి పోషకాలను గ్రహించేలా చేస్తుంది. సోడియం మోతాదు పెరిగితే బీపీకి దారితీస్తుంది. అధిక మోతాదులో ఉప్పు తీసుకోవడం వల్ల దాహం పెరిగి ఎక్కువగా ఉన్న ఉప్పు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. మహిళలు, పురుషులు రోజుకి 1500 మి.గ్రా. సోడియంను తీసుకోవాలి. సోడియం టేబుల్ సాల్ట్, పాలు, బ్రెడ్, కూరగాయలు, మాంసం, సోయాసాస్‌లో దొరుకుతుంది. సల్ఫర్... ప్రొటీన్ అణువులను ఏర్పరుస్తుంది. సల్ఫర్ కొరత వల్ల కండరాల నొప్పి, కండరాలు బలహీనవమడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, చేపలు, గుడ్లు, పాలు, కాయ ధాన్యాలు, నట్స్‌లో సల్ఫర్ ఉంటుంది. ట్రేస్ మినరల్స్ ఇవి తక్కువ మొత్తంలో అవసరమవుతాయి. కానీ ప్రాధాన్యం ఎక్కువే. క్రోమియం, కాపర్, ఫ్లోరైడ్, అయోడిన్, ఐరన్, మ్యాంగనీస్, మాల్బిడినమ్, సెలేనియం, జింక్.. మొదలైనవి ట్రేస్ మినరల్స్. క్రోమియం...ఇన్సులిన్ హార్మోన్ ప్రభావాన్ని పెంచుతుంది. క్రోమియం తక్కువైతే గ్లూకోజ్ నిర్వహణా సామర్థ్యం తగ్గిపోతుంది. నిస్సత్తువ ఆవరిస్తుంది. పురుషులైతే రోజుకి 30 నుంచి 35మైక్రోగ్రాములు, మహిళలైతే 20 నుంచి 25 మైక్రోగ్రాముల క్రోమియంను తీసుకోవాలి. కాలిఫ్లవర్ జాతి, బంగాళదుంపలు, బీన్స్, ద్రాక్ష రసం, గోధుమలు, కాలేయం, పొట్టు ధాన్యాల్లో క్రోమియం లభ్యమవుతుంది. కాపర్... శరీరం ఐరన్‌ను గ్రహించేలా చేస్తుంది. మెలనిన్‌ను సంశ్లేషణం చేయడంలో సాయపడ్తుంది. రక్తస్రావం ఆపడంలోను, రోగనిరోధక శక్తి సక్రమంగా పనిచేయడంలోనూ తోడ్పడుతుంది. కాపర్ తక్కువైతే రక్తహీనత, పెరిఫెరల్ న్యూరోపతి వంటి జబ్బులు వస్తాయి. రోజుకు 900మైక్రోగ్రాముల కాపర్‌ను తీసుకోవాలి. కాయ ధాన్యాలు, నట్స్, గింజలు, పొట్టు ధాన్యాలు, మాంసం, తాగు నీరు, సీ ఫుడ్, కొకోల్లో కాపర్ ఉంటుంది. ఫ్లోరైడ్... దంతాల ఆరోగ్యానికి, ఎముకల నిర్మాణంలో తనవంతు పాత్ర పోషిస్తుంది. దంతాల మీద సాఫ్ట్ ఎనామిల్‌ను బాగుచేస్తుంటుంది. దంతక్షయాన్ని నివారిస్తుంది. ఇది తక్కువైతే దంతక్షయానికి, ఆస్టియోపొరాసిస్కీ దారితీస్తుంది. తాగు నీరు, చేపలు, అన్ని రకాల ‘టీ’ల్లో ఫ్లోరైడ్ ఉంటుంది. అయోడిన్... హార్మోన్ల ఉత్పత్తిలో థైరాయిడ్కి 60 శాతం సహకారం అందిస్తుంది. అందుకే ఇది తక్కువైతే థైరాయిడ్ హార్మోన్ పనితీరు కుంటుపడుతుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది, కాళ్ల్లూచేతులూ మొహానికి తిమ్మిర్లు, భ్రమలు కలగడం వంటివి పరిణమిస్తాయి. రోజూ 150 మైక్రోగ్రాముల అయోడిన్‌ను తీసుకోవాలి. ఉప్పు, బీన్స్, గుడ్లు, సీ ఫుడ్, బ్రెడ్, పాల పదార్థాల్లో అయోడిన్ దొరుకుతుంది. ఐరన్.... హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ అత్యవసరం. మయోగ్లోబిన్ తయారీకి తోడ్పడుతుంది. ఐరన్ తక్కువైతే అలసట, నీరసం, చిరాకు కలుగుతాయి. మూడేళ్లలోపు పిల్లలకు రోజుకి 7 మి.గ్రా. ఐరన్‌ను, 8 ఏళ్లలోపు పిల్లలకు 10 మి.గ్రా., 13 ఏళ్లలోపు పిల్లలకు 8 మి.గ్రా. ఐరన్ ఇవ్వాలి. పురుషులు, రుతుక్రమం ఆగిన మహిళలు 8 మి.గ్రా. ఐరన్ తీసుకోవాలి. పిల్లతల్లులు 18 మి.గ్రా. గర్భిణులు రోజుకి 27 మి.గ్రా. ఐరన్‌ను తీసుకోవాలి. మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు, చేపలు, బీన్స్, కాయ ధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, గుడ్లు, ఉడికించిన బంగాళదుంపలు, ఎండు ద్రాక్ష, గోధుమలు, ఓట్స్‌లో ఐరన్ ఉంటుంది. మాంగనీస్... కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఆమినోయాసిడ్స్ మొదలు ప్రొటీన్స్ వరకు అన్ని జీవక్రియలకు తోడ్పడుతుంది. ఎముకల నిర్మాణానికీ చేయి అందిస్తుంది. గ్లూకోజ్ జీవక్రియలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. మహిళలు రోజుకి 1.8 మిల్లీగ్రాములు, పురుషులు 2.3 మి.గ్రా. మాంగనీస్ తీసుకోవాలి. కాయ ధాన్యాలు, శనగలు, పైనాపిల్, పాలకూర, చిలకడ దుంప, పప్పు దినుసుల్లో మాంగనీస్ లభిస్తుంది. మాల్బిడినమ్... అమినో యాసిడ్స్ జీర్ణం చేయడంలో ఎంజైమ్స్‌కి సహకరిస్తుంది. పురుషులు, మహిళలు ఎవరికైనా రోజుకి 45మైక్రోగ్రాముల మాల్బిడినమ్ కావాలి. కాయ ధాన్యాలు, నట్స్, పప్పు ధాన్యాలు, బ్రెడ్, ఆకు కూరలు, కూరగాయలు, పాలు, కాలేయం ద్వారా మాల్బిడినమ్ అందుతుంది. సెలేనియం... థైరాయిడ్ హార్మోన్స్‌ను నియంత్రిస్తుంది. ఆంటీ యాక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి కాన్సర్‌ను నివారిస్తుంది. ఇది విటమిన్ ఇ తో కలిసి కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మద్యపానం వల్ల వచ్చిన కాలేయ జబ్బుల నుంచి కూడా మందుబాబులను కాపాడుతుంది. సెలేనియం తక్కువైతే కండరాల నొప్పి, నీరసం వస్తాయి. పెద్దవాళ్లందరికీ రోజుకి 55 మైక్రోగ్రాముల సెలేనియం అవసరం. మాంసం, సీ ఫుడ్, నట్స్, పాల పదార్థాలు, పప్పు ధాన్యాలు, పొట్టు ధాన్యాల్లో సెలీనియం ఉంటుంది. జింక్... ఆర్ఎన్ఏ, డీఎన్ఏ ఉత్పత్తికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి చక్కగా ఉండేలా చూస్తుంది. గాయాలు త్వరగా మానేలా, నాలుక మీది రుచి మొగ్గలు సరిగ్గా పనిచేసేలా చూస్తుంది. అంధత్వానికి కారణమయ్యే పరిస్థితిని నివారిస్తుంది. జింక్ తక్కువైతే ఆకలి మందగించడం, రోగనిరోధక శక్తి క్షీణించడం, ఎదుగుదల కుంటుపడడం, డయేరియా, జుట్టురాలడం, నంపుంసకత్వం, గాయాలు త్వరగా మానకపోవడం వంటి సమస్యలు వస్తాయి. పురుషులు రోజుకి 11మిల్లీగ్రాములు, మహిళలైతే 8 మిల్లీగ్రాముల జింక్ తీసుకోవాలి. మాంసం, చేపలు, బీన్స్, నట్స్, పాలపదార్థాలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, పొట్టు ధాన్యాలు, కాయగూరల్లో జింక్ ఉంటుంది. - సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: సుజాతా స్టీఫెన్, సీనియర్ న్యూట్రిషనిస్ట్, మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్ శాంపుల్ మినరల్ రిచ్ డైట్ బ్రేక్‌ఫాస్ట్ ఐటం మినరల్స్ మొత్తం కాలరీలు ఫ్యాట్‌ఫ్రీ పాలు కాల్షియం120ఎమ్‌జి 102 (200ంఎల్) ఫాస్ఫరస్ 90ఎమ్‌జి ఐరన్ 0.2 ఎమ్‌జి రాగిదోస-2, కాల్షియం 344ఎమ్‌జి 328 చట్నీ, సాంబార్ ఐరన్ 3.9 పొటాషియం 405ఎమ్‌జి జింక్ 2.3 ఎమ్‌జి బాయిల్డ్ ఎగ్ ఫాస్ఫరస్ 220 173 ఐరన్ 2.1 సోడియం124ఎమ్‌జి జింక్ 2.7 సెలీనియం77మైక్రోగ్రాములు వాటర్‌మిలన్1కప్పు ఐరన్7.9ఎమ్‌జి 30 పొటాషియం 160ఎమ్‌జి మెగ్నీషియం13ఎమ్‌జి కొబ్బరినీళ్లు 1గ్లాస్ పొటాషియం 515ఎంజి 43 మెగ్నీషియం51.1ఎమ్‌జి కాల్షియం 49.4ఎమ్‌జి ఫాస్ఫరస్ 41.1ఎమ్‌జి సోడియం 216ఎమ్‌జి లంచ్ అన్నం 2కప్పులు సెలీనియం 19.11మైక్రోగ్రాములు 412 మ్యాంగనీస్1.8ఎమ్‌జి ఐరన్1.6ఎమ్‌జి ఫాస్ఫరస్162ఎమ్‌జి జింక్ 1.2ఎమ్‌జి సోయాబీన్ కర్రీ కాల్షియం 175ఎమ్‌జి 298 ఐరన్ 8.8ఎమ్‌జి జింక్2.0ఎమ్‌జి మ్యాంగనీస్ 1.4ఎమ్‌జి పెరుగు 1కప్పు కాల్షియం448 ఎమ్‌జి 137 మెగ్నీషియం 46.5ఎమ్‌జి జింక్2.4ఎమ్‌జి ఫ్లోరైడ్29.4ఎమ్‌జి కీర సలాడ్ మెగ్నీషియం 14ఎమ్‌జి 80 టమాటా పొటాషియం 146ఎమ్‌జి సోడియం 12.9ఎమ్‌జి ఈవినింగ్ స్నాక్స్ పాలకూర శాండ్విచ్ కాపర్7.9ఎమ్‌జి 23 మ్యాంగనీస్ 17.2మైక్రోగ్రాములు ఐరన్ 15.8ఎమ్‌జి వాల్నట్స్4, పిస్తా4 మెగ్నీషియం 373ఎమ్‌జి 93 బాదాం 6 జింక్ 3.57ఎమ్‌జి మ్యాంగనీస్2.62మైక్రోగ్రాములు డిన్నర్ అన్నం సెలీనియం 19.11మైక్రోగ్రాములు 325 (ఒకటిన్నర కప్పు) మ్యాంగనీస్1.8ఎమ్‌జి ఐరన్1.6ఎమ్‌జి ఫాస్ఫరస్162ఎమ్‌జి జింక్1.2ఎమ్‌జి గుమ్మడికాయ కూర ఐరన్ 1.4ఎమ్‌జి 40 పొటాషియం564ఎమ్‌జి సోడియం2.5ఎమ్‌జి ఫాస్ఫరస్73.5ఎమ్‌జి ఫ్యాట్‌ఫ్రీ పాలు కాల్షియం120ఎమ్‌జి 87 (200ఎంఎల్) ఫాస్ఫరస్90ఎమ్‌జి ఐరన్0.2ఎమ్‌జి -
నేడే హెల్త్ ఫెస్టివల్ ప్రారంభం!
-
నేడే హెల్త్ ఫెస్టివల్ ప్రారంభం!
పండగలు అందరూ చేసుకుంటారు. వేడుకలు అందరూ నిర్వహించుకుంటారు. సాధారణంగా పండగ రోజున ఎవరి ఇంట్లో వారికే పండగ. కానీ ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించే ఈపండగ ఇతరులకు కోసం. అందరి ఆరోగ్యం కోసం. ఆ ఆరోగ్యంపై అవగాహన కోసం. వ్యాధిబాధితులూ, రోగవేదనలూ ఎంత బాధాకరమో తెలుసు కాబట్టి; వాటి వల్ల పడే ఆర్థిక, పనినష్టభారాలు విదితం కాబట్టి అందరికీ ఆరోగ్యం పంచడానికి నడుం బిగించింది సాక్షి. అందరికీ ఆరోగ్య అంశాలపై అవగాహన కలిగించేందుకు ‘సాక్షి లివ్ వెల్ ఎక్స్పో’ పేరిట రెండు రోజుల వేడుకల్లో భాగంగా అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన కార్యక్రమం నేడు (శనివారం) ప్రారంభం కానుంది. ప్రపంచాన్ని ఇప్పుడు జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులు శాసిస్తున్నాయి. వాటి నివారణ కూడా జీవనశైలిని మార్పుచేసుకోవడం అనే ప్రక్రియ ద్వారా మన చేతుల్లోనే ఉంది. శని, ఆదివారాల్లో జరిగే ‘సాక్షి లివ్ వెల్ ఎక్స్పో’ లో మంచి ఆరోగ్యకరమైన జీవనం కోసం అవలంబించాల్సిన విధానాలు, పోషకాలతో కూడిన ఆహారాలు, వాటివల్ల ఒనగూడే ప్రయోజనాలు, ఒత్తిడిని తొలగించుకునే మార్గాలు, సరదగా శ్రమ తెలియకుండా తేలికగా చేయగల వ్యాయామాలు, యోగభోగాలను సాధించేందుకు దారులు, మనల్ని మనం ఉత్తేజితం చేసుకుంటూ స్వయం ప్రేరణ పొందేందుకు ఉన్న మార్గాల వంటి అనేక అంశాలపై ఆయా రంగాలకు చెందిన అత్యున్నత స్థాయి నిపుణులు మాట్లాడతారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభిస్తారు. ఆదివారం నాడు ఉచిత బస్సు సేవలు... ఎక్స్పో ప్రాంగణానికి ఉచిత బస్సు సర్వీసులు: లివ్ వెల్ ఎక్స్పో కార్యక్రమం శని, ఆదివారాల్లో నిర్వహిస్తున్నప్పటికీ ఆదివారం రోజున సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న నిర్వాహకులు ఆ రోజున మాత్రం ప్రజలను లివ్ వెల్ ఎక్స్పో నిర్వహిస్తున్న హైటెక్స్ ప్రాంగణానికి తరలించేందుకు ఉచిత బస్ సేవలను అందించే ఏర్పాటు చేశారు. ఇందులో నాగోల్ నుంచి బయల్దేరే బస్సులు ఉదయం 7 గంటలు, 11 గంటలు, మధ్యానం 3 గంటలకు బయల్దేరుతాయి. ఆయా వేళల్లో నాగోలు నుంచి బయల్దేరే ఈ బస్సులు నాగోల్‌లోని బిగ్ బజార్, ఎల్బీ నగర్లో ఆంజనేయస్వామి గుడి, కొత్తపేటలోని చెన్నై షాపింగ్ మాల్ ఎదుట, దిల్‌సుఖ్‌నగర్‌లో చందనా బ్రదర్స్, కోటీలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఆబిడ్స్‌లోని జీపీఓ, నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్, లక్డీకాపూల్ దగ్గరున్న బస్ స్టాప్ల వద్దనుంచి, మాసాబ్‌ట్యాంక్‌లో పాలిటెక్నిక్ దగ్గర, బంజారాహిల్స్‌లోని రోడ్ నెం. 12 దగ్గరున్న పెన్షన్ ఆఫీసు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గరున్న పెట్రోల్ బంక్ దగ్గర, మాధాపూర్‌లోని రత్నదీప్ దగ్గర ఆగుతూ ఎక్స్పో సందర్శకులను ఎక్కించుకుంటూ హైటెక్స్ ప్రాంగణానికి చేరుతాయి. ఇవే మూడు బస్సులు మళ్లీ హైటెక్స్ నుంచి ఉదయం 9 గంటలు, మధ్యానం ఒంటిగంట, సాయంత్రం 6 గంటలకు తిరిగి హైటెక్స్నుంచి అదే రూట్లలో తిరుగుప్రయాణం సాగిస్తూ సందర్శకులను ఆయా ప్రాంతాలకు చేరవేస్తాయి. కూకట్పల్లి నుంచి హైటెక్స్‌కు మరో ఐదు బస్సులు ఇక కూకట్పల్లి ప్రాంతం నుంచి హైటెక్స్ ప్రాంగణానికి వచ్చేందుకు తయారైన సందర్శకుల కోసం మరో ఐదు బస్సులు అందుబాటులో ఉంటాయి. అవి... ఉదయం 8 గంటలు, 10గంటలు, మధ్యానం 12 గంటలు, 2 గంటలు, సాయంత్రం, 4 గంటలకు కూకట్పల్లి నుంచి బయల్దేరతాయి. కూకట్‌పల్లిలో చైతన్య కాలేజీ వద్ద నుంచి బయల్దేరే బస్సులు కేపీహెచ్బీలో ఆర్.ఎస్. బ్రదర్స్ షాపింగ్ మాల్ వద్ద, హైదర్‌నగర్‌లో భ్రమరాంబ థియేటర్ ఎదురుగా, మియాపూర్‌లో సితారా రెస్టారెంట్ దగ్గర, హఫీజ్‌పేటలో ఆల్విన్ క్రాస్‌రోడ్స్ వద్ద, కొండాపూర్‌లో కమాన్ వద్ద, కొత్తగూడ క్రాస్‌రోడ్స్‌లో జయభేరీ టవర్స్ వద్ద ఆగి సందర్శకులకు ఎక్కించుకుంటాయి. అలాగే హైటెక్స్ నుంచి మళ్లీ కూకట్‌పల్లికి అదే దారిలో ఉదయం 9గంటలు, 11 గంటలు, మధ్యానం ఒంటిగంట, 3 గంటలు, సాయంత్రం 6 గంటలకు తిరిగివస్తాయి. మంచి ఆహారంతోనే మంచి ఆరోగ్యం... అన్ని పోషకాలు ఉన్న సమతుల ఆహారంతో మంచి ఆరోగ్యం సమకూరుతుందని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి జాస్తి పేర్కొన్నారు. సాక్షి లివ్ వెల్ ఎక్స్‌పోలో ఆరోగ్యకరమైన ఆహారం, పొట్టుతో కూడిన ఆహారంతో సమకూరే ఆరోగ్యం వంటి అనేక అంశాల గురించి ఆమె సందర్శకులకు అవగాహన కల్పించనున్నారు. ‘‘మొదట అందరికీ మంచి ఆహారంతో ఆరోగ్యాన్ని సమకూర్చడం అనే ఆలోచన నేను విదేశాల్లో ఉన్నప్పుడు వచ్చింది. తొలుత అది మా కుటుంబానికే పరిమితమైంది. కానీ ఆ ఆలోచన ఫలాలను నా మాతృదేశానికి అందించగలిగితే, అందునా అవసరమైన ఎంతో మంది రోగులకు దాని ద్వారా సాంత్వన చేకూర్చగలిగితే, ఎన్నో జీవితాలను పూర్తిగా మార్చగలిగితే! అన్న మరో యోచనతో నేను మంచి ఆహారాన్ని అవసరమున్నవారికి పరిచయం చేయడం అన్నది ఒక ఉద్యమంగా మారింది. అలా అది వంటగది నుంచి సమాజానికి చేరింది. రుచితో పాటు పోషకాలు ఉన్న ఆహారం అనేక మందికి అందేలా చేసిందా ఆలోచన’’ అంటారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి జాస్తి. పోషకాహారంపై అనేక అంశాలను ఆమె ఈ ఎక్స్‌పోలో వివరించనున్నారు. గమనిక ఈ ఉచిత బస్సులలో సైతం మొదట వచ్చిన వారిని మొదట బస్సులోకి అనుమతించడం అనే ప్రాతిపదికపైనే సందర్శకులను అనుమతిస్తారు .3 బస్సు సేవలు ఆదివారం రోజు మాత్రమే. శ్రీదేవి జాస్తి -
ఎడారి పండు.. పోషకాలు మెండు
సాక్షి, సిటీబ్యూరో: అలసిన దేహమనే యంత్రానికి ‘ఖర్జూరం’ ఓ శక్తి వనరు.. తక్షణ శక్తి ప్రదాయని. ఎన్నో పోషకాలతో నిగనిగలాడే ఈ పండు ఆరోగ్యాన్ని పరిపుష్టం చేస్తోంది. నిగనిగలాడే రంగు, మంచి రుచితో ప్రతి ఒక్కరినీ తనవైపు తిప్పుకుంటుంది. రంజాన్ మాసంలో దీనికో ప్రత్యేకత ఉంది. ‘రోజా’ దీక్షలను పాటించేవారు ఈ పండునే బాగా ఇష్టపడతారు. ఉపవాసం పూర్తయిన తర్వాత దేహానికి కావాల్సిన తక్షణ శక్తి కోసం దీన్ని తీసుకోవడం అనవాయితీ. ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం కావడంతో ఈ పండుకు మరింత డిమాండ్ పెరిగింది. ఎడారి దేశాల్లో పండే ఈ ఫలం వివిధ అరబ్ దేశాల నుంచి 15 నుంచి 20 రకాల ఖర్జూరాలు నగర మార్కెట్లను ముంచెత్తాయి. ఇరానీ (నలుపు, ఎరుపు), కిమియా ఖజూర్, కల్మీ ఖజూర్, తైబా ఖజూర్, మగ్ధీ ఖజూర్, ఆల్ మదీనా.. తదితర రకాలు లభిస్తున్నాయి. వీటి విక్రయాలకు నిలయమైన బేగంబజార్, గుల్జార్ హౌస్ తదితర ప్రాంతాల్లో హోల్‌సేల్ దుకాణాలు కొనుగోలు దారులతో కళకళలాడుతున్నాయి. ఇరాక్, ఇరాన్, సౌదీ, ఒమన్ దేశాల నుంచి ఈ పండ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు బేగం బజార్‌లోని కాశ్మీర్ హౌస్ అధినేత ధీరజ్ కుమార్ తెలిపారు. కిలో ఇరాకీ ఖజూర్ రూ.50 నుంచి రూ.60, నలుపు రకం ఇరానీవి రూ.80 నుంచి రూ.100, ఎరుపు రూ.60, కీమియా ఖజూర్కు రూ.120-130 (బాక్స్), తైబా మగ్ధీ రకాలు రూ.130-140, ఆల్ మదీనా ఖజూర్ రూ.160-180 ధర పలుకుతోంది. క్యాలరీస్ అధికం - ఖర్జూరాల్లో క్యాలరీస్ అధికమని, మన దగ్గర డ్రై డేట్స్ వినియోగం ఎక్కువని గాంధీ ప్రకృతి వైద్యశాల వైద్యులు డా. శ్యామల తెలిపారు. ఈ పండులో పోషకాలు అధికమని వివరించారు. - 100 గ్రాముల ఖర్జూరంతో 400-600 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఫ్రెష్ డేట్స్‌లో క్యాలరీలు కాస్త తక్కువ. - ఖర్జూరాల్లో ఐరన్, ఫైబర్ ఎక్కువ. క్యాల్షియం, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్స్, కాపర్ పాళ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. - 100 గ్రాముల డేట్స్‌లో 8-10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. - డేట్స్‌ను పాలతో కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే పిల్లల్లో, వృద్ధుల్లో, ఏదైనా జబ్బు నుంచి కోలుకునే వారికి ఇది మంచి ఆహారం. ఖర్జూరం తినడం వల్ల ఎల్డీఎల్ కొలస్ట్రాల్ బాగా తగ్గి గుండె పనితీరు బాగుంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. -
పండ్ల పైపొట్టు... ఆరోగ్యానికి తొలిమెట్టు
అరటిపండ్ల లాంటి తొక్క వలిచి తినే పండ్లను మినహాయిద్దాం. ఇక ద్రాక్షలాంటి పండ్లను వలిచే ప్రసక్తే ఉండదు. కానీ... మామిడి, జామ, ఆపిల్, కివీ వంటి పండ్ల మాటేమిటి? తొక్కతో పాటు అలాగే తినేసే అవకాశం ఉన్నా... చాలామంది రుచికి కాస్త అడ్డు అనే వంకతో తొక్కను వలిచే తింటారు. అయితే తొక్కతో పాటు తినగలిగే ఆ పండ్లను తొక్కతోనే తినడం మంచిదంటున్నారు నిపుణులు. పండ్ల లోపలి భాగం రక్షణ కోసం ఏర్పాటైన ఆ పొట్టే... మన ఆరోగ్యానికి కవచం అవుతుందంటున్నారు. రండి ఆ కవచాన్ని తొడుక్కుందాం మనం! పొట్టు తీయకుండా తినగలిగే పండ్లన్నింటినీ పొట్టు వొలుచుకోకుండా తినడమే మేలు. ఎందుకంటే పండ్లలో ఎన్ని పోషకాలు ఉంటాయో, వాటికి మించిన కీలకమైన పోషకాలు అనేకం ఉంటాయి. మలబద్దకాన్ని నివారించే పీచుపదార్థాలు పొట్టులోనే ఎక్కువగా ఉంటాయి. ద్రాక్షపండు పొట్టులో పోషకాలివే... ఈ పండులోని పొట్టులో ఉన్న పోషకాలు చాలా ఎక్కువ. మొత్తం పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాల్లో 20 శాతం ఈ పలుచని పొట్టులోనే ఉంటాయి. యాంటీయాక్సిడెంట్ పోషకాలు వయసు పైబడుతున్న కొద్దీ జరిగే అనర్థాలను నివారిస్తాయి. అందుకే ద్రాక్షపొట్టుతో యౌవనం చాలాకాలం నిలుస్తుంది. పొట్టులోని పెక్టిన్ అనే పోషకం సుఖవిరేచనం అయ్యేలా చేస్తుంది. తియ్యగా ఉన్నప్పటికీ ఈ పండు తాలూకు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి డయాబెటిస్ రోగులూ నిక్షేపంగా తినవచ్చు. జామపండు పొట్టు... పోషకాలు జామపొట్టులోని పిగ్మెంట్ క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుంది. అలాగే 100 గ్రాముల ఈ పండులో 5.4 గ్రాముల పీచు ఉంటుంది. ఈ పీచు సైతం ప్రధానంగా పొట్టులోనే ఎక్కువ. పండులో ఉండే విటమిన్-సితో పోలిస్తే ఈ పండు పొట్టులోని సి- విటమినే ఎక్కువ. ఇది వ్యాధినిరోధకతశక్తిని గణనీయంగా పెంచుతుంది. కాబట్టి వ్యాధులేవీ దరిచేరకుండా ఉండాలన్నా, సాఫీగా మలవిసర్జన జరగాలన్నా జామపండు మేలు. మామిడి తొక్క చేసే మేలెంతో..! మామిడిపండ్ల పొట్టులో ఉండే పోషకాల తీరు చాలా ప్రత్యేకమైనది. ఈ పండు పొట్టులో ‘రెస్వెరట్రాల్’ అనే పదార్థం ఉంటుంది. రెడ్వైన్లో ఉండేది కూడా ఇదే పదార్థం. ఇది కొవ్వులను చాలా వేగంగా కరిగిస్తుంది. అందుకే లావెక్కేవారు పొట్టుతోపాటు మామిడిపండును తింటే బరువు పెరగడం వేగంగా జరగదు. పైగా మామిడి తొక్కలో ఉండే పోషకాలు కొవ్వు కణాలు త్వరగా పెరగకుండా చేస్తాయి. కాబట్టి తొక్కతో తినేవారు చాలాకాలం పాటు చక్కగా స్లిమ్‌గా ఉంటారు. పండుకంటే పొట్టులోనే ఎక్కువ పోషకాలు ఉండే ఆపిల్ ఆపిల్‌లో లోపలున్న పండు కంటే తొక్కలోనే పోషకాలు ఎక్కువ. ఆపిల్ తొక్కలో కంటికి మేలు చేసే ‘ఏ-విటమిన్’, వ్యాధినిరోధకశక్తి పెంచే ‘సి-విటమిన్లు’ పండులో కంటే ఎక్కువని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్‌కు చెందిన అధ్యయనవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. ఇక పీచు విషయానికి వస్తే... మొత్తం పండులోకంటే పొట్టులోనే మూడింట రెండు వంతుల పీచు ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే క్యాల్షియమ్, పొటాషియమ్, ఫాస్పరస్, ఫోలేట్, ఐరన్ వంటి పోషకాలన్నీ పండు కంటే పొట్టులోనే ఎక్కువ. కివీ పండునూ తొక్కతోనే తినడం మేలు కివీ పండును తినదలచినవారు దీన్ని పొట్టు తీయకుండా తినడం మంచిది. ఈ పొట్టులో యౌవనాన్ని చాలాకాలం పాటు నిలిచేలా చేసే యాంటీ ఆక్సిడెంట్లు, వ్యాధినిరోధకశక్తి పెంచే విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఈ విషయం గుర్తుంచుకోండి పొట్టుతో పాటు తినే పండ్లను తప్పనిసరిగా నల్లా (కొళాయి) లాంటి జారే నీటిలో చాలాసేపు శుభ్రంగా కడిగాకే తినాలి. ఎందుకంటే ఇటీవల ద్రాక్ష వంటి పండ్లపై పిచికారీ చేసే రసాయనాలు చాలా ఎక్కువ. కాబట్టి అవన్నీ కొట్టుకుపోయేలా నల్లా నుంచి జారే నీళ్లలో (రన్నింగ్ వాటర్) చాలాసేపు కడిగాకే పండ్లు తినాలని గుర్తుంచుకోండి. సుజాతా స్టీఫెన్ న్యూట్రీషనిస్ట్, సన్‌షైన్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
రబీలో అధిక దిగుబడుల కోసం..
నేలలు.. పంటల ఎంపిక నేలలో నీటి నిల్వ శక్తి, భౌతిక, రసాయనిక స్థితిగతులు, పోషక పదార్థాల స్థాయి ఆధారంగా పంటలను ఎంపిక చేయాలి. నాణ్యమైన విత్తనం విత్తుకొద్ది పంట అనే సామెత మనందరికి తెలిసిందే. యథాబీజం తథా ఫలం. ఏ పంటలోనైనా ఆయా వంగడాల పూర్తి ఉత్పాదక సామర్థ్యాన్ని పొందాలంటే నాణ్యమైన విత్తనం ద్వారానే సాధ్యపడుతుంది. నాసికరమైన, కల్తీ విత్తనం ఎంత సారవంతమైన భూమిలో వేసినా, నీరు, ఎరువులు, కలుపు, క్రిమిసంహారక మందులు ఎన్ని వాడినా అధిక దిగుబడులు పొందడం అసాధ్యం. అందువల్ల అధిక దిగుబడులకు నాణ్యమైన విత్తనమే కీలక పెట్టుబడి. జన్యు స్వచ్ఛత, భౌతిక స్వచ్ఛత కలిగిన విత్తనం వాడి, మంచి సేద్య పద్ధతులను పాటించినప్పుడు మాత్రమే అధిక దిగుబడులు సాధించవచ్చు. సరైన విత్తన ఎంపిక, నాణ్యమైన విత్తనం రైతు ఆదాయాన్ని పెంచుతుంది. అందువల్ల ధృవీకరించిన, గుర్తింపు పొందిన సంస్థల నుంచి విత్తనాలు కొనుగోలు చే సి, మొలక శాతం పరీక్ష చేసుకొని విత్తుకోవడం శ్రేయస్కరం. విత్తన మోతాదు.. మొక్కల సాంద్రత సిఫారసు చేసిన మోతాదు కన్న విత్తనాన్ని అధికంగా లేదా తక్కువగా వాడినప్పుడు దిగుబడిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి సిఫారసు చేసిన మోతాదును వాడి వరుసలు, మొక్కల మధ్య దూరాన్ని సరిగ్గా పాటిస్తే మొక్కల సాంద్రత సరిగ్గా ఉండి.. నేల, నీరు, ఎరువుల వినియోగం సరిగ్గా జరిగి పూర్తిస్థాయి దిగుబడులను ఇస్తాయి. విత్తన శుద్ధి వివిధ పైర్లలో రైతాంగం విస్మరిస్తున్న అంశం విత్తన శుద్ధి. తక్కువ ఖర్చుతో సులువుగా పైర్లను వివిధ చీడపీడలు, తెగుళ్ల నుంచి కొంతకాలం వరకు కాపాడేందుకు విత్తన శుద్ధి తోడ్పడుతుంది. కాబట్టి రైతులు సిఫారసు చేసిన రసాయనిక మందులతో విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఎరువుల యాజమాన్యం రైతుల భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలి. సిఫారసు చేసిన మోతాదు కన్న ఎక్కువగా వాడరాదు. పోషక పదార్థాల స్థాయిలో ప్రతికూలమైన నిష్పత్తి ఏర్పడితే నేల స్థితిగతుల్లో మార్పులు రావడమే కాకుండా పైర్ల దిగుబడులు సన్నగిల్లుతాయి. రసాయనిక ఎరువుల్లో ఉండే వివిధ పోషకాలను మొక్కలు భూముల్లో ఉండే ఎలజైములు, సూక్ష్మజీవుల సహాయంతో గ్రహిస్తాయి. కాబట్టి రసాయనిక ఎరువులను పంటలు సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా రైతులు సేంద్రియ ఎరువులను, పచ్చిరొట్ట ఎరువులను, జీవన ఎరువులను తగినంతగా వేసి భూభౌతిక స్థితిని తద్వారా పంటకు అవసరమయ్యే సూక్ష్మజీవుల వృద్ధిని పెంచాలి. వివిధ పైర్లకు సిఫారసు చేసిన పోషకాల మోతాదును 75శాతం రసాయనిక ఎరువుల ద్వారా 25శాతం సేంద్రియ ఎరువుల ద్వారా అందించాలి. పైర్లకు వేసే ఎరువులను సరైన మోతాదులో, సరైన రూపంలో, సరైన సమయంలో, సరైన చోట వేస్తేనే అధిక దిగుబడులు సాధించవచ్చు. నీటి యాజమాన్యం నీటి లభ్యత ఆధారంగా పంటను ఎంపిక చేయాలి. నీటి లభ్యత సమృద్ధిగా లేని చోట ఆరుతడి పంటలు సాగుచేయాలి. {పస్తుత పరిస్థితుల్లో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నీటి సమర్థ వినియోగం కోసం బిందు,తుంపర్ల విధానాన్ని వినియోగించాలి. సూక్ష్మనీటి సాగు పద్ధతుల వల్ల నీటి ఆదాతో పాటు, ఎరువుల సమర్థ వినియోగం, చీడ పీడల ఉధృతి తగ్గడంతో పాటు నాణ్యమైన దిగుబుడులు సాధించవచ్చు. వివిధ పైర్లలో కీలక దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. కలుపు యాజమాన్యం పంట దిగుబడులను ప్రభావితం చేసే అంశాల్లో కీలకమైనది కలుపు యాజమాన్యం. కలుపు మొక్కలు పైరు పాలు పెరిగి నీరు,ఎరువులను వినియోగించుకొని పంట దిగుబడులను తగ్గిస్తుంది. చేతితో కలుపు తీయడం వీలు కాని పక్షంలో సిఫారసు చేసిన రసాయనిక మందులతో సకాలంలో కలుపును నివారించుకున్నట్లైతే దిగుబడుల మీద ప్రభావం ఉండదు. సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం చీడపీడలను, తెగుళ్లను తొలి దశలోనే గుర్తించి అవసరం మేరకు రసాయనికి మందులను, భౌతిక, యాజమాన్య, జీవ నియంత్రణ పద్ధతులను అవలంబించి సస్యరక్షణ చర్యలను చేపట్టాలి.వాతవరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఎప్పుడు ఒకే పంటను సాగుచేయకుండా, పంట మార్పిడి, మిశ్రమ పంటల సాగు విధానాన్ని అవలంబిస్తూ అన్ని సాగు పద్ధతులు సక్రమంగా పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. సలహాలు తీసుకోవాలి సాగులో వివిధ సమస్యలపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. వ్యవసాయశాఖ అధికారులు, పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, ఏరువాక శాస్త్రవేత్తలతో పాటు వివిధ సంస్థల ఏర్పాటు ఏసిన కిసాన్ కాల్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. -
చలించి..స్పందించి
కవిత: నమస్తే అమ్మా. నాపేరు గడిపల్లి కవిత.. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ను. మీ ఊళ్లో సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను. ఏ సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారు..? శౌరి: వర్షం వస్తే.. గ్రామంలో రోడ్లు అన్నీ బురదగా మారుతున్నాయి. మురుగు కాల్వలు పొంగి ఇళ్లలోకి నీరొస్తోంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ? ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. కవిత: ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు ఈ సమస్య చెప్పారా..? శౌరి: ఎన్నో సార్లు అధికారులకు చెప్పాం. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మేము కూలీ పనులకు వెళ్లే వాళ్లం. ఎవరి వద్దకూ వెళ్లలేం. ఈ పనులన్నీ అధికారులే చేయించాలి. కవిత: ఎందుకు ఏడుస్తున్నావమ్మా..? నీ సమస్య ఏంటీ..? మంగతాయారు: మాది పేద కుటుంబం. నాకు జబ్బు చేసి పశ్చవాతం వచ్చింది. మందుల్లేవు, పట్టించుకునే వారు లేరు. నేను ఎట్లా బతకాలి. కవిత: నేను లెటర్ రాసి ఇస్తా, గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్తావా? మంగతాయారు: మందుల కోసం వెళ్తా. కవిత: మీరేం చేస్తున్నారు..? నంద: అమ్మా.. నేను రోజూ కూలీకి వెళ్లేదాన్ని. పంటలు ఎండిపోవడంతో కూలీ పని దొరకడం లేదు. కవిత: నీకు ఎంతమంది పిల్లలు. ఆడపిల్లను చదివించాలి. డ్వాక్రాలో డబ్బులు పొదుపు చేయండి. దుర్గ: నేను కూలీకి వెళ్తా. ఒక్కతే ఆడపిల్ల. 6వ తరగతి వరకు చదివించాను. ఇంకా చదవమంటే చదవనంటోంది. మీరు చెప్పినట్లు కష్టం చేసైనా చదివిస్తా. కవిత: రాంబాయీ.. నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు. వార్డు సభ్యురాలివి. వారి సమస్యలపై అవగాహన ఉండాలి. పంచాయతీ సమావేశాల్లో సమస్యలు చర్చిస్తారా? రాంబాయి: నేను చదువుకోలేదమ్మ. మీరు చెప్పినట్లు చదువు నేర్చుకుంటా. గ్రామంలో రోడ్లు, మురుగు కాలువలు సరిగా లేవు. కవిత: ఏం తాత.. ఏ పంట వేశావు. ఎలా ఉంది? వీరు: రెండు ఎకరాల్లో పత్తి వేశానమ్మా. వర్షాలు లేక పంట ఎండి పోయింది. పండిన పంటకు రేటు కూడా రానట్లుంది. ఈసారి కాలంతో నష్టమే వచ్చింది. కవిత: అవ్వా నీకు పింఛన్ వస్తుందా..? పుల్లమ్మ: నా భర్త చనిపోయి 25 ఏళ్లు అయింది. నేను ఒక్కదాన్నే ఉంటున్నా. కూలీకి పోవడానికి కూడా చేత కావడం లేదు. పింఛన్ రావట్లే.. వస్తే ఆ డబ్బుతోనే బతుకుతా. కవిత: మీరు వ్యవసాయం చేస్తున్నారా..? వీరయ్య: చేస్తున్నానమ్మా. కరెంట్ ఉండడం లేదు. పంటలు ఎండిపోతున్నాయి. వ్యవసాయానికి కరెంట్ ఇస్తే పంటలు చేతికి అందేవి. కాలంకాక ఏంచేయాలో అర్థం కావడం లేదు. కవిత: చిన్నా చదువుకుంటున్నావా. అంగన్వాడీ కేంద్రంలో ఏం పెడతారు? లక్ష్మీప్రసన్న: అ..ఆలు చదువుకుంటున్నా. అంగన్వాడీ స్కూల్‌కు వెళ్తున్నా. గుడ్డు పెడుతున్నారు. మురుకులు ఇస్తున్నారు. కవిత: అంగన్వాడీ కేంద్రంలో అన్నీ ఇస్తున్నారా.. పిల్లలు ఎంతమంది వస్తున్నారు? కవిత(అంగన్వాడీ టీచర్): మేడమ్. మా కేంద్రంలో 25 మంది పిల్లలు ఉన్నారు. గర్భిణులకు మెనూ ప్రకారం పోషక పదార్థాలు అందిస్తున్నాం. కవిత: తాత మీ ఊళ్లో ఏ సమస్యలు ఉన్నాయి? గోపాల్: ఫ్లోరైడ్ నీళ్లతో ఊళ్లో అందరికి కాళ్ల నొప్పులు, నడుంనొప్పులు వస్తున్నాయి. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. కవిత: సర్పంచ్‌గారు.. మీ ఊరి గురించి చెప్పండి? నాగేశ్వరరావు: మేడమ్. ఊళ్లో ప్లోరైడ్ సమస్య తో ఇబ్బంది పడుతున్నాం. 50ఏళ్ల వయసున్న వారు 70ఏళ్ల మనుషుల్లా ఉంటున్నారు. గ్రామం లో ఉన్న మంచినీటి పైపులైన్లలో ఫ్లోరైడ్ పేరుకపోయింది. ఎక్కడ బోరు వేసినా ఫ్లోరైడే వస్తుం ది. ఈ నీటిని గ్రామస్తులు తాగలేకపోతున్నారు. కవిత: ఈ విషయం అధికారులకు చెప్పారా..? ఏం చర్యలు తీసుకున్నారు? నాగేశ్వరరావు: ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు చెప్పాం. చాలా చోట్ల బోరు వేయడానికి పరిశీలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. పాలేరు ద్వారా సాగర్ కాలువతో లకారం చెరువు నీటిని నింపి అక్కడి నుంచి పైపులైను ద్వారా గ్రామానికి మంచినీటిని అందించడానికి ప్రతిపాదన చేశారు. ఈ పనులు ముందుకు సాగడం లేదు. కవిత: ఈఓపీఆర్డీగారు.. ఈ పనులు ఎంతవరకు వచ్చాయి? ఈఓపీఆర్డీ: మేడమ్. లకారం చెరువు నుంచి మండలంలోని 15 గ్రామాలకు మంచినీటి అందించేందుకు పైపులైన్లు వేస్తున్నారు. త్వర లో ఈ గ్రామానికి కూడా మంచినీళ్లు వస్తాయి. కవిత: మీ సమస్య ఏంటీ? షేక్ జానీ: అధికారులు పాత పైపులైన్ల ద్వారానే లకారం చెరువు మంచినీటి అందించాలని చూస్తున్నారు. ఈ పైపులతో గ్రామంలోకి నీరు, మంచినీరు వస్తే మళ్లీ ఫ్లోరైడ్ వస్తుంది. జెడ్పీ చైర్పర్సన్ హామీలు.. నేను మీ గ్రామానికి విలేకరిగా వచ్చాను. ఇక్కడ అన్ని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి పాలేరు నుంచి లకారం చెరువుకు నీటిని మళ్లించి అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా అందించే పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటా. గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీలను నిర్మించేందుకు అంచనాలు రూపొందించడంతో పాటు, జెడ్పీ నిధుల నుంచి ఈ పనులు పూర్తి చేసేలా కృషి చేస్తా. గ్రామంలో ఉన్న అర్హులందరికీ పింఛన్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెపుతా. గ్రామంలో సాక్షర భారత్ కేంద్రాలను నిరంతరాయంగా కొనసాగించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తా. -
దూడ పుట్టాక ముర్రుపాలు తాపే సమయం
సమీకృత దాణా అంటే.. పశువులకు కావాల్సిన అన్ని పోషకాలను సరైన మోతాదులో సమకూర్చేలా అన్ని దాణా దినుసులను పొడి చేసి మిశ్రమంగా తయారు చేస్తే దాన్ని సంపూర్ణ సమీకృత దాణా అంటారు. ఇందుకు పత్తి క ట్టె, కంది కట్టె, మొక్కజొన్న చొప్ప, కండెలు, ఉలవ చొప్ప, వేరువనగ పొట్టు, పొద్దుతిరుగుడు మొక్కలు, పూలు, చింత గింజలు, చెరకు ఆకులు, పిప్పి మొదలైన ఎండు పంటలను, మొక్కజొన్న, జొన్న గింజలు, తవుడు, గానుగ చెక్క, ఎముకల పొడి, యూరియా లాంటి దాణా దినుసులను ఉపయోగించవచ్చు. దూడ పుట్టాక ముర్రుపాలు తాపే సమయం దూడ తల్లి గర్భంలో ఉండగానే జాగ్రత్త పాటించి తల్లికి సరైన పోషకాలు అందించాలి. తల్లికి డ్త్రె పీరియడ్(వట్టిపోయే కాలం)లో పూర్తి విశ్రాంతి ఇచ్చి సరైన మేత, పోషకాలు అందించాలి. దూడ పుట్టిన మూడు గంటల్లోపే ముర్రుపాలు తాగించాలి. దీని వల్ల దూడల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దూడ పుట్టిన 7-10 రోజులకు మొదటి సారి, నెలకు ఒక సారి చొప్పున 6 నెలల వరకు నట్టల నివారణ మందు తాగించాలి. దూడలకు శుభ్రమైన పాలు, గడ్డి పరిసరాల్లో ఏర్పాటు చేయాలి. దూడలకు ప్రత్యేక దాణా తయారు చేయించి తినిపించాలి. నిర్ణీత కాల వ్యవధిలో టీకాలను ముందు జాగ్రత్తగా వేయిస్తే ప్రమాదకర వ్యాధులను అరికట్టి, దూడల మరణాల శాతం తగ్గించవచ్చు. మొదటి ఈత వయస్సు పశువుల్లో మొదటి ఈత వయసును నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించడం కోసం.. దూడ దశ నుంచే శాస్త్రీయ పద్ధతులు పాటించి పోషించాలి. మూడు నెలల వయసు వరకు శరీర బరువులో 1/10 వ వంతు పాలు తాపిస్తూ, తర్యాత సమీకృత దూడల దాణా ఇస్తూ పచ్చిగడ్డి, ఎండుగడ్డి తగు మోతాదులో అందిస్తూ లవణ మిశ్రమాలు అందించాలి. దీనివల్ల త్వరగా బరువు పెరిగి, సరైన సమయంలో ఎదకు వచ్చి, తక్కువ వయసులోనే దూడకు జన్మనిస్తుంది. రెండు ఈతల మధ్య వ్యవధి పాడిపశువుల్లో ఈతకు.. ఈతకు మధ్య ఇప్పుడున్న రెండేళ్ల వ్యవధిని అత్యల్పంగా ఏడాదికి సులువుగా తగ్గించవచ్చు. సాధారణంగా పశువుల జీవనానికి, పాలు ఇవ్వడానికి మేత, దాణా ఇస్తారు. పాడిపశువు ఒకసారి ఈనిన తర్వాత 2 నెలల్లో తిరిగి కట్టి చూడి మోయాలంటే ఆ పశువు పునరుత్పత్తి కోసం అదనంగా దాణా ఇవ్వాలి. లవణ మిశ్రమాలను సకాలంలో ఇస్తే పశువు ఎదకు వచ్చి 2 నెలల్లో చూడి కడుతుంది. దూడకు జన్మనిచ్చిన ఏడాదికే మళ్లీ ఈనుతుంది. దీని కోసం ప్రతి పశువు ఈనిన 45 రోజుల నుంచి 60 రోజుల్లోపు తప్పక చూడి కట్టించే ఏర్పాటు చేయాలి. పాడి రైతులు.. పశువు ఈనిన, చూడి కట్టిన వివరాలను నమోదు చేయాలి. మూడు నెలలైనా చూడి నిలవకపోతే వెంటనే చికిత్స చే యించాలి. ఈతకు.. ఈతకు మధ్య వ్యవధిని ఏడాదికి తగ్గిస్తే ఒక పశువు నుంచి అత్యధికంగా 6 ఈతల్లో పాలను, దూడలను పొందే అవకాశం ఉంది. రోజూ పొందే పాలు ప్రతి పశువుకు చాఫ్ చేసిన(ముక్కలు చేసే గడ్డి) పచ్చి/ఎండు గడ్డిని సమపాళ్లలో ఇవ్వాలి. 2 లీటర్ల పాలు ఇచ్చే గేదెకు కిలో సమీకృత దాణా, 2.5 లీటర్ల పాలు ఇచ్చే ఆవుకు 1 కిలో దాణాతో పాటు సాధారణ జీవనానికి అదనంగా మరో కిలో సమీకృత దాణా ఇస్తే ప్రతి పశువు నుంచి దాని పూర్తి సామర్థ్యం మేర పాలను పొందవచ్చు. దాణాతో పాటు పరిశుభ్రమైన నీటిని తగినంత అందుబాటులో ఉంచి యాజమాన్య పద్ధతులు సక్రమంగా పాటి స్తే జాతి పాడి పశువు నుంచి ప్రస్తుతం రోజూ పొందుతున్న 3 లీటర్ల పాలను 8 లీటర్లకు పెంచవచ్చు. యాజమాన్య పద్ధతులు పాటిస్తూ, పాడి పశువు చూడితో ఉన్నపుడు పోషణలో జాగ్రత్తలు తీసుకుంటే ఆ పశువు ఈనిన తర్వాత ఇంకా ఎక్కువ పాలు ఇస్తుంది. పరిశుభ్రమైన పాల ఉత్పత్తిని పాటిస్తే ప్రస్తుతం ఒక ఈతకు పొందుతున్న 1,000 లీటర్ల పాలను 2,500 లీటర్లకు పెంచుకోవచ్చు. అంటే ఆరు ఈతల్లో 15,000 లీటర్ల పాలు పొందవచ్చు. -
పోషక లోపాలు నివారిస్తే అధిక దిగుబడులు
పత్తి సాగులో పోషకాలు లోపిస్తే మొక్కల పదుగుదలకు ఆటంకం సకాలంలో చర్యలు తీసుకోకుంటే దిగుబడులు పడిపోయే ప్రమాదం ముందస్తు చర్యలు మేలంటున్న జి.కొండూరు ఏవో జి.శ్రీనివాసరావు పత్తి సాగులో ఏ పోషకం లోపించినా పైరు పెరుగుదల సక్రమంగా ఉండదు. దిగుబడి తగ్గిపోతుంది. పోషకలోపాలు ఉన్నప్పుడు మొక్కలోని ఏ భాగంలోనైనా లక్షణాలు కనిపించొచ్చు, నిపించకపోవచ్చు. ముందస్తు చర్యలు పాటిస్తే పైరుకు పోషకాలు సకాలంలో అందుతాయి. మొక్కల పెరుగుదల బాగుంటుంది. అధిక దిగుబడులు కూడా పొందేందుకు అవకాశం ఉంటుందని జి.కొండూరు వ్యవసాయ శాఖాధికారి జి.శ్రీనివాసరావు సూచించారు. పత్తిలో పోషకలోపాలు గుర్తించడం, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే.... పత్తిలో పోషక లోపాలు రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు. పత్తికి కావాల్సిన ఏ పోషకం లోపించినా పంట దిగుబడి తగ్గిపోతుంది. పైరులో పోషక లోపాలున్నప్పుడు ప్రత్యేకంగా లోప లక్షణాలు మొక్కపై ఏ భాగంలోనైనా కనిపించవచ్చు, లేదా కనిపించకపోవచ్చు. ఒక్కొక్క సారి పోషక లోప చిహ్నాలు ఇతర చిహ్నాలను పోలి ఉండవచ్చు. ఉదాహరణకు పత్తిని ఎర్రనల్లి ఆశించినప్పుడు ఆకులు ఎర్రబడతాయి. మెగ్నీషియం లేదా భాస్వరం లోపాలున్నా లేదా బెట్ట ఎక్కువైనా, లేదా నీరు ఎక్కువైనా కూడా ఎర్ర ఆకులు కనిపిస్తాయి. ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గినప్పుడు కూడా ఆకులు ఎర్రబారవచ్చు. అందువల్ల చిహ్నాల ఆధారంగా లోప పోషకాన్ని గుర్తించటంలో జాగ్రత్త వహించాలి. - జి.కొండూరు ఆకులు రంగు కోల్పోతే.. నత్రజని, భాస్వరం ఎరువులు అధిక మోతాదులో వాడి పొటాషియం వేయనప్పుడు, పత్తిలో పొటాషియం లోప చిహ్నాలు కనపడతాయి. మొదట ఆకుల చివర్లు తమ సహజ ఆకు పచ్చరంగును కోల్పోతాయి. ఊదా రంగుతో కూడిన గోధుమ రంగుకు మారతాయి. క్రమంగా ఆకులు గట్టిపడి ఎండిపోతాయి. భూసార పరీక్ష ఆధారంగా సూచించిన మేరకు పొటాషియం పోషకాన్ని సల్పేట్ ఆఫ్ పొటాష్ రూపంలో విత్తిన తర్వాత 30, 60, 90 రోజుల్లో నత్రజని ఎరువుతో పాటు వేసి ఈ లోపాన్ని నివారించవచ్చు. బోరాన్ లోపిస్తే.. బోరాన్ లోపం వల్ల కొత్తగా పెరిగే చివరి మొగ్గలు దెబ్బతింటాయి. కొమ్మల చివరి మొగ్గల పెరుగుదల ఆగిపోయి పక్క మొగ్గల పెరుగుదల వచ్చి మొక్క గుబురుగా మారుతుంది. ఆకులు, కాడలు, చివరి మొగ్గలు రంగు రూపాలు మారిపోతాయి. అన్ని భాగాలు ముతకగా, దళసరిగా మారుతాయి. దీని నివారణకు లీటరు నీటికి బోరాక్స్ గ్రాము చొప్పున విత్తిన 60,90 రోజుల్లో పిచికారి చేసుకోవాలి. ఆకులు ఎర్రబారితే మెగ్నీషియం లోపం సున్నం అధికంగా ఉన్న నేలల్లో సూపర్‌పాస్పేట్, పొటాష్ ఎరువులు అధికంగా వాడినపుడు పత్తిలో మెగ్నీషియం లోపం కనిపించే అవకాశం ఉంది. ముదురు, మధ్య ఆకులు ఎర్రబారితే మెగ్నీషియం లోపస్థాయిలో ఉన్నట్లు కనిపెట్టవచ్చు. అయితే భాస్వరం లోపం వల్ల కానీ, బెట్ట నేలలు, లేక అధిక తేమ, ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గినప్పుడు కూడా ఆకులు ఎర్రబారుతాయి. ఆయా కారణాలతో కాకుండానే ఆకులు ఎర్రబారినట్లు గుర్తిస్తేనే మెగ్నీషియం లోపంగా భావిం చాలి. దీని నివారణకు మెగ్నీషియం సల్పేట్‌ను లీటరు నీటికి 10 గ్రాములు చొప్పున విత్తిన 45, 75 రోజుల్లో పైరు మొత్తం మీద పిచికారీ చేయాలి. జింకు ధాతు లోపం బంక మన్ను అధికంగా ఉండే నల్లరేగడి నేలలు, సున్నం అధికంగా ఉండే నేలల్లో ఈ పోషక లోపం వస్తుంది. జింకు లోపం చిహ్నాలు విత్తిన మూడు వారాలు తర్వాత కనిపిస్తాయి. ఆకులు ఎరుపుతో కూడిన తుప్పు రంగులో ఉంటాయి. లేత పైరులో లోప చిహ్నాలు మధ్య ఆకుల మీద కనిపిస్తాయి. ఆకులు ఆకుపచ్చ రంగు కోల్పోయి, ఈనెల మధ్య భాగం బంగారు రుంగులోకి మారుతాయి. గోధుమ రంగు మచ్చలు ఆకుల చివర్లు నుంచి మొదలకు విస్తరిస్తాయి. ఆకు చివర్లు ఎండిపోతాయి. ఆకులు పైకి కానీ కిందకు కాని ముడుచు కుంటాయి. జింకు లోపించిన మొక్క పెరుగుదల సరిగా లేక ఆకులు, కాడలు, కాండం చిన్నగా మారి గుబురుగా మారతాయి. దీని నివారణకు దుక్కిలో 20 కిలోల జింకు సల్పేట్‌ను వేసి జింకు లోపాన్ని నివారించవచ్చు. జింకు లోప చిహ్నాలు పైరు మీద కనిపించినప్పుడు జింకు సల్పేట్ లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున నాలుగైదు రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారీ చేసి నివారించుకోవచ్చు. జి.శ్రీనివాసరావు 88866 13373