బార్లీతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు | Many benefits to health with barley | Sakshi
Sakshi News home page

బార్లీతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Jul 10 2018 12:07 AM | Updated on Jul 10 2018 12:07 AM

Many benefits to health with barley - Sakshi

ఎంతో ఆరోగ్యస్పృహ ఉన్నవారు మినహా ‘బార్లీ’ని ఆహారంగా తీసుకునేవారు మన  సమాజంలో కొద్దిగా తక్కువే. అయితే బార్లీ గింజల్లోని పోషకాలు ఎంతో ఆరోగ్యకరం కాబట్టే వీటిని హెల్త్‌ డ్రింక్స్‌లో విరివిగా వాడుతుంటారు. అంతేకాదు... ఆరోగ్యకరం అంటూ ఉత్పత్తి చేసే బ్రెడ్లూ, బిస్కెట్లలోనూ దీన్ని వాడుతుంటారు. బార్లీతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే. 

బార్లీలో పోటాషియమ్‌ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది.  బార్లీలో పీచు పదార్థాలు కూడా ఎక్కువ. అందువల్ల అది జీర్ణాశయపు ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతుంది. బార్లీలోని పీచుపదార్థాల వల్ల అవి రక్తంలో చక్కెరను అతి మెల్లగా విడుదలయ్యేలా చేస్తాయి. దాంతో చక్కెర అదుపునకు బాగా తోడ్పడతాయి. ఈ కారణం వల్లనే అవి డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచడంతో పాటు, డయాబెటిస్‌ లేనివారిలో నివారణకూ తోడ్పడతాయి.  

ఈ గింజలు కొలెస్ట్రాల్‌ను బాగా అదుపు చేస్తాయి. రక్తపోటుతో పాటు కొలెస్ట్రాల్‌నూ అదుపు చేసే గుణం ఉండటం వల్ల ఇవి అనే రకాల గుండెజబ్బులనూ, గుండెపోటునూ నివారిస్తాయి.  బార్లీలోని విటమిన్‌–ఏ కారణంగా ఇవి కంటిచూపును దీర్ఘకాలం పాటు పదిలంగా కాపాడతాయి.  వీటిల్లో ఐరన్‌ కూడా ఎక్కువే. అందువల్ల రక్తహీనతను నివారిస్తాయి.  బార్లీలో ఉండే క్యాల్షియమ్, ఫాస్ఫరస్‌ ఎముకలను మరింత శక్తిమంతం చేస్తాయి.  ఇందులోని మెగ్నీషియమ్, జింక్‌ వంటి ఖనిజాలు చర్మానికీ, వెంట్రుకలకూ మెరుపునిస్తాయి.  బార్లీలోని విటమిన్‌ బి–కాంప్లెక్స్‌తో పాటు విటమిన్‌–సి... మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా అనేక రకాల వ్యాధుల నుంచి మనల్ని కాపాడతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement