మనకు ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే వాటిని మన ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వీటిల్లో అద్భుతమైన తృణధాన్యం బార్లీని ఒకటిగా చెప్పుకోవచ్చు. బార్లీలో బి-కాంప్లెక్స్, మాంగనీస్, సెలీనియం, ఫాస్పరస్, ఇనుము, కాల్షియం, జింక్ ఖనిజాలు లభిస్తాయి. ఇంకా పీచు పదార్థం, యాంటీఆక్సిడెంట్లు ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి.
బీ విటమిన్, పీచు పదార్థం సంపూర్ణంగా మనకు అందాలంటే పొట్టుతోపాటు బార్లీ గింజలను తీసుకుంటే మంచిది. బార్లీ గింజల్ని బ్రెడ్, సూప్‌లు, ఇతర ఆహార ఉత్పత్తుల తయారీలోనూ, ఆల్కహాలిక్ పానీయాల్లో కూడా వాడతారు. ముఖ్యంగా బీర్‌మాల్ట్ మూలంగా కూడా పనిచేస్తుంది.
బార్లీలో ప్రోటీన్లు, కార్పోహైడ్రేట్స్, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. పిల్లలకు ఇచ్చే సూప్‌లలో, పాలలో బార్లీ వాడితే, వారికి ఎదుగుదలకి, శక్తికి దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు.
బరువు నియంత్రణలో
బార్లీ వాటర్‌లో కేలరీలు తక్కువ. ఫైబర్ ఎక్కువ. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. మంచి ఆహారం, వ్యాయామంతో పాటు బార్లీ నీళ్లు తాగితే వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
షుగర్ వ్యాధిగ్రస్తులకు
బార్లీ నీళ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చేస్తుంది. మధుమేహం రోగుల్లో గ్లూకోజ్ స్థాయిల నిర్వహణకు ఉపయోగపడుతుంది.
ఇంకా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. బార్లీ నీటిలో ఉండే పోషకాలు మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యానికి దోహదం చేస్తాయని కొన్ని అధ్యయనాలు నివేదించాయి. కిడ్నీలో రాళ్లు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను కూడా తొలగిస్తుంది. పేగుల్లో ఉండే మలినాలు తొలగిపోతాయి. కేన్సర్ నివారణలో సాయపడుతుంది. అంతేకాదు బార్లీ నీళ్లతో చర్మం కాంతివంతంగా మెరుస్తుంది కూడా.
Comments
Please login to add a commentAdd a comment