ఆ ఒక్కటీ తప్ప.. ఉల్లితో చాలా ప్రయోజనాలు | Amazing Benefits Of Consuming Raw Onion check here | Sakshi
Sakshi News home page

ఆ ఒక్కటీ తప్ప.. ఉల్లితో చాలా ప్రయోజనాలు

Published Sat, Jun 29 2024 1:34 PM | Last Updated on Sat, Jun 29 2024 7:42 PM

Amazing Benefits Of Consuming Raw Onion check here

ప్రపంచవ్యాప్తంగా  ముఖ్యంగా భారతీయ  వంటకాల్లో   కనిపించే వాటిల్లో చాలా ముఖ్యమైంది ఉల్లిపాయ. పసుపు, తెలుపు , ఎరుపు  రంగుల్లో ప్రత్యేకమైన ఘాటైన రుచి, వాసనతో లభిస్తుంది.  దాదాపు అన్ని కూరల్లో దీన్ని విరివిగా వాడతాం.  అయితే పచ్చిగా తీసుకోవడం వల్ల కూడా ఉల్లితో చాలా ఔషధ ప్రయోజనాలున్నాయి. 


‘ఉల్లి చేసిన మేలు తల్లి అయినా  చేయదు’  అన్నట్టు దీంతో  అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్‌ సమస్య , షుగర్‌ తదితర సమస్యలకు చక్కటి పరిష్కారం ఉల్లి.ఇందులో క్రోమియం షుగర్ స్థాయిలనుఅదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఉల్లిపాయను 7 రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది
పచ్చి ఉల్లిపాయల్లో  విటమిన్  సీ అధికంగా లభిస్తుంది.  ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇంకా డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. దగ్గు, జలుబు, ఫ్లూ లాంటి వాటికి సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ బయోటిక్ గుణాలతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. 

గుండె ఆరోగ్యానికి మంచిది
ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.  తద్వారా అధిక రక్తపోటు  ముప్పు కూడా తగ్గుతుంది.

జీర్ణక్రియలో 
పచ్చి ఉల్లిపాయలలో డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు ఊతమిస్తుంది.  శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తుంది. ఫైబర్ పోషకాల శోషణను పెంచుతుంది మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ , హేమోరాయిడ్స్ వంటి వివిధ వ్యాధులను నివారిస్తుంది.

వాపును తగ్గిస్తుంది
క్వెర్సెటిన్ అధికంగా ఉండే పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో మంట స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్, ఆస్తమా, బ్రాంకైటిస్‌  వ్యాధులకు ఉపశమనానికి అందిస్తుంది.

ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
ఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి దోహదపడే సల్ఫర్-రిచ్ కాంపౌండ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి కాల్షియం శోషణను ప్రోత్సహించి,  బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని  నివారిస్తుంది.

మెదడు పనితీరును పెంచుతుంది
పచ్చి ఉల్లిపాయలు సల్ఫర్ సమ్మేళనాలు మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఇది మెరుగైన జ్ఞాపకశక్తి, శ్రద్ధ , ఏకాగ్రత పెరగడానికి దోహదపడతాయి.

కేన్సర్  నివారణలో
పచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ , యాంటీఆక్సిడెంట్లు కేన్సర్‌ నివారణలో సాయపడతాయి. క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్స్ ,అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో కేన్సర్ కణాల పెరుగుదలను  అడ్డుకునే యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి.

చర్మ ఆరోగ్యానికి కూడా 
పచ్చి ఉల్లిపాయల్లోని  అధికంగా లభించే  యాంటీఆక్సిడెంట్లు ,విటమిన్ సీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయి. ముడతలు, వయసు మచ్చలు , పిగ్మెంటేషన్ స్థాయిలను తగ్గించి, ఆరోగ్యకరమైన , మెరిసే చర్మాన్ని అందిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది
పచ్చి ఉల్లిపాయల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన క్రోమియం అనే ఖనిజం ఉంటుంది. క్రోమియం ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దారితీస్తుంది, తద్వారా మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బరువు తగ్గడంలో 
తక్కువ కేలరీలు , అధిక ఫైబర్ కంటెంట్ ఎక్కువ. అతిగా తినే అవకాశాలను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి దోహదపడుతుంది.


నోట్‌: ఏదైనా మితంగా తీసుకోవడం ఉత్తమం. అధిక వినియోగం జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తుంది. ప్రధానంగా  పచ్చి  ఉల్లిపాయ తింటే నోటి దుర్వాసన వస్తుందనిది గమనించాలి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement