కాకరతో 10 అద్భుత ప్రయోజనాలు.. | Most Health Benefits With Bitter Gourd In telugu | Sakshi
Sakshi News home page

రుచికి చేదు.. ఆరోగ్యానికి అమృతం..

Published Sat, Jun 13 2020 3:04 PM | Last Updated on Sat, Jun 13 2020 6:18 PM

Most Health Benefits With Bitter Gourd In telugu - Sakshi

కాకరకాయను తలచుకోగానో దీని చేదు స్వభావం ముందుగా కళ్ల ముందు కదలాడుతుంది. చేదుగా ఉంటే కాకరను ఎలా తింటాంరా బాబూ అని చాలా మంది దూరం పెడుతుంటారు. అయితే కొంతమందికి మాత్రం కాకరకాయ పిచ్చిపిచ్చిగా నచ్చుతుంది. రోజువారీ ఆహారం కాకరను తప్పనిసరిగా వినియోగిస్తారు. రుచికి చేదు అయినా ఆరోగ్యానికి అమృతం లాంటింది. ఎంతో మందికి కాకర వల్ల కలిగే ప్రయోజనాలు తెలియవు. దానిలో ఉండే పోషక విలువలు తెలిస్తే ఇక వదులుకోరు. కాకర ఆస్తమా, జలుబు, దగ్గు వంటి మొదలైన శ్వాస సంబంధిత సమస్యల నివారణకు అద్భుతవమైన ఔషధంగా పనిచేస్తుంది. కాకర జ్యూస్‌ తాగితే లివర్‌ సమస్యలు తగ్గుతాయి. 

న్యూట్రిషన్‌ విలువలు
► మొత్త కాలరీలు-16
►ఆహార ఫైబర్ - 2.6 గ్రా
►కార్బోహైడ్రేట్లు - 3.4 గ్రా
►కొవ్వులు - 158 మి.గ్రా
►నీటి శాతం - 87.4 గ్రా
►ప్రోటీన్ - 930 మి.గ్రా

అసలు మనిషి ఆరోగ్యానికి కాకరకాయ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయంలో అనేక క్లినికల్ అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనాలలో దీనిని తినడం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని వెల్లడైంది. మనలో చాలా మంది కాకరను రుచి కారణంగా తినడానికి పెద్దగా ఆసక్తి చూపకపోయినా, సమృద్ధిగా ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్న తర్వాత, మీరు బహుశా మీ ఆలోచనను మార్చుకోవచ్చు. దీనితో కడుపు నొప్పి, మధుమేహం, కాన్యర్‌, గుండె జబ్బులు వంటి సర్వ రోగాలకు నివారిణిగా పనిచేస్తుంది. ఎంతో మేలు చేస్తుంది.

1.మలబద్దకం, జీర్ణాశయం వ్యాధులు నివారణ
కాకరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది మలబద్ధకం, కడుపు నొప్పి వంటి పేగు రుగ్మతలను నయం చేయడమే కాకుండా, జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించే పరాన్నజీవులను చంపడానికి సహాయపడుతుంది. అంతేకాక ఇది యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపించడానికి, జీర్ణక్రియకు ఉపకరిస్తుంది.అధిక ఫైబర్‌ ఉంన్నందు వల్ల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాకరను వైద్యులు సిఫార్సు చేస్తారు.

2. డయాబెటిస్‌ 
కాకర డయాబెటిస్ నిర్వహణకు సహాయపడుతుంది. డయాబెటిస్‌తో బాధపడుతున్న ఎవరికైనా దీనిని తరచుగా తీసుకోవాలని సూచిస్తారు. ఇందులో యాంటీ-డయాబెటిక్ లక్షణాలతో కూడిన మూడు క్రియాశీల పదార్థాలు ఉన్నాయి. అవి పాలీపెప్టైడ్-పి, వైసిన్, చరణి. ఇవి ఇన్సులిన్ లాంటి లక్షణాలు కలిగి రక్తంలో గ్లూకోజ్ విలువలను తగ్గించే ప్రభావాలను కలిగి ఉంటాయని నిర్ధారణ జరిగింది.  రక్తంలో షుగర్‌ లెవల్స్‌లను తగ్గించడంలో చురుకుగా పనిచేస్తాయి. అంతేకాక కాకరలో లెక్టిన్ ఉందని, ఇది ఆకలిని అణచివేయడం,పరిధీయ కణజాలాలపై పనిచేయడం ద్వారా శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ ఉదయం కాకర జ్యూస్‌ను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మీ డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. దీనిలో పీచు లక్షణాలు అధికంగా కలిగిఉండడం వల్ల తేలికగా అరుగుతుంది. ఈ ఆహారం అరుగుదలకు, మలబద్ధకం, అజీర్తి సమస్యల నివారణలో సహాయపడి శరీరం నుండి చెత్తను తొలగిస్తుంది.

3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 
కాకరలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. మానవ శరీరానికి యాంటీఆక్సిడెంట్లు అవసరం. ఇది రోగనిరోధక కణాలు,తెల్ల రక్త కణాలు (డబ్ల్యూసీ) పెంచడానికి సహాయపడుతుంది.  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, అలెర్జీని నివారించడంలో సహాయపడుతుంది. కాకర కాయలు, ఆకులను నీటిలో ఉడకించి తీసుకోవడం వల్ల అంటు రోగాలు దరిచేరకుండా ఉంటాయి.

4. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది 
కాకరకు గల  యాంటీమైక్రోబయల్, యాటీఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలోని చెత్తను తొలగించడంలో సహాయపడతాయి. అంతేకాక ఇది మీ కాలేయంలో స్థిరపడిన అన్ని రకాల మత్తులను తుడిచిపెట్టడానికి దోహదపడుతుంది. అందువల్ల ఇది అనేక కాలేయ సమస్యలను నయం చేస్తుంది. అలాగే మీ పేగును శుభ్రపరుస్తుంది. ఇది మూత్రాశయం సరైన పనితీరుకు సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు హ్యాంగోవర్ అయితే, చేదుకాయ రసం తీసుకోవడం వల్ల మన శరీరం నుంచి ఆల్కహాల్ మత్తును తగ్గించి చురుకుగా ఉంటారు.

5. క్యాన్సర్ నుండి రక్షింస్తుంది. 
ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం. అవి మన శరీరం పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. నిందుకు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ లేకుండా చూసుకోవాలి. ఫ్రీ రాడికల్స్..  ధూమపానం, కాలుష్యం,ఒత్తిడితో అధికంగా పెరుగుతుంది. కావున కారలో  లైకోపీన్, లిగ్నన్స్, కెరోటినాయిడ్లు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో విటమిన్ ఎ, జియా-శాంథిన్,లుటిన్ ఉన్నాయి. ఇవి ప్రాధమిక యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. దీంతో చివరకి మన శరీరంలో కణితులు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది.

6. కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
అధిక స్థాయిలో కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ధమనులలో కొవ్వు ఫలకం ఏర్పడుతుంది, ఇది గుండె రక్తాన్ని పంప్ చేయడానికి కష్టపడి పనిచేస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాకర చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. పుష్టి ఆరోగ్యానికి తోడ్పడటానికి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కాకరలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అధిక మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ గుండెపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.

7. అధిక బరువును తగ్గిస్తుంది. 
కాకరలో గొప్ప పోషకాలు ఉండటం వల్లగా బరువు తగ్గించే ఆహారంగా సహకరిస్తుంది. 100 గ్రాముల కాకరలో 16 కేలరీలు, 0.15 గ్రాముల కొవ్వు, 0.93 గ్రాముల ప్రోటీన్, 2.6 గ్రాముల ఫైబర్ మాత్రమే ఉంటాయి. అందువల్ల, మన బరువుకు అదనపు పౌండ్లను జోడించకుండా తగ్గిస్తుంది. పోషకాలు జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. జంక్, అనారోగ్యకరమైన స్నాక్స్ మీద ఆధారపడకుండా చేస్తుంది. కాకర రసం తాగడం ద్వారా ఉబకాయం తగ్గుముఖం పడుతుంది. కాకరలో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, మంచి ప్రోటీన్, ఫైబర్ ఉన్నాయి. ఇవన్నీ మిమ్మల్ని రోజంతా ఉల్లాసంగా ఉంచుతాయి.

8. జుట్టుకు మెరుపు అందిస్తుంది.
కాకర జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు మంచి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దీనిలో ప్రోటీన్, జింక్.విటమిన్ సి వంటి భాగాలు జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. జుట్టుకు కాకర జ్యూస్‌ను రాయడం వల్ల మూలాలు బలోపేతం అవుతాయి. స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు చికిత్స అందుతుంది. ఇది జుట్లును షైన్‌గా ఉండటంలో సహాయపడుతుంది. 

9. చర్మాన్ని అందంగా చేస్తుంది
మొటిమలు, మచ్చలు, చర్మ అంటు వ్యాదులను తొలగిస్తుంది. నిమ్మరసంతో కాకరను ప్రతిరోజు పరగడుపున 6 నెలలు తీసుకుంటే సరైన ఫలితాలు పొందుతారు. చర్మాన్ని ముడతలు లేకుండా ఉంచడంలో, అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మం సున్నితత్వానికి కారణమవుతుంది. ఇంకా సోరియాసిస్ , తామర చికిత్సకు సహాయపడుతుంది.సూర్యుడి నుంచి హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

10. కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది
కంటి చూపు, కంటిశుక్లం వంటి దృష్టి సంబంధిత సమస్యలను నివారించడంలో కాకర సహాయపడుతుందని వైద్యులు, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిలో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ నిండి ఉంటాయి. ఇవి కళ్ళకు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాక కళ్ల కింద నల్లడి వలయాలను తగ్గించేందుకు మంచి నివారణగా ఉపకరిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement