నోరూరించే నేరేడు పళ్లు: ఈ ప్రయోజనాలు తెలుసా? | Do You Know These Amazing Health Benefits Of Jamun Fruit And Its Nutritional Facts In Telugu | Sakshi
Sakshi News home page

Jamun Fruit Health Benefits: నోరూరించే నేరేడు పళ్లు, ఈ ప్రయోజనాలు తెలుసా?

Jun 26 2024 4:37 PM | Updated on Jun 26 2024 4:56 PM

Health benefits of Jamun fruit

మార్కెట్లో ఎక్కడ చూసినా  అల్ల నేరేడు పండ్లు కనిపిస్తున్నాయి. నల్లగా నిగ నిగ లాడుతూ నోరు ఊరిస్తున్నాయి. ఏ సీజన్‌లో వచ్చే పండ్లను ఆ సీజన్‌లో తినడం అలవాటు చేసు కోవాలని పెద్దలు చెబుతారు. అసలు అల్ల నేరేడు పళ్లు తింటే  లభించే ఔషధ ప్రయోజనాల గురించి తెలుసా?  తెలిస్తే మీరు తినకుండా ఉండలేరు.

ఇండియన్ బ్లాక్‌బెర్రీ, జామూన్‌,  లేదా జావా ప్లం ఈ పేరుతో పిలిచినా.. రుచి మాత్రం వగరు, తీపి కలయికతో గమ్మత్తుగా ఉంటుంది.  మార్కెట్‌నుంచి  తీసుకొచ్చిన కాయలను ఉప్పు నీళ్లలో వేసి శుభ్రంగా కడిగిన తరువాత తినాలి. 

అల్ల నేరేడు పోషకాల గని. ఆరోగ్యకరమైన కొవ్వుల సమ్మేళనం. ఆంథోసైనిన్‌లు, ఫ్లేవనాయిడ్‌లు, పాలీఫెనాల్స్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు మెండు. ఇంకా  ప్రొటీన్, కాల్షియం, కార్బొహైడ్రేట్లు, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, విటమిన్ సీ, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బీ6, విటమిన్ ఏ, పుష్కలంగా లభిస్తాయి. నేరేడు పండు మాత్రమే కాదు, ఆకులు, గింజల్ని ఔషధాలుగా వాడతారు. 

అల్ల నేరేడు బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తికి, జీర్ణక్రియకు చక్కటి ఔషధంలా పని చేస్తుంది. ఈ పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. రకాల ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా అడ్డుకుంటాయి. అలాగే దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.

అల్ల నేరేడు- లాభాలు 
అల్లనేరేడులో పొటాషియం అధిక స్థాయిలో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.  అధిక రక్తపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది.  

కాలుష్యంగా కారణంగా దెబ్బతిన్న శ్వాస నాళాలు, ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. వీటిలో ఉండే జింక్, విటమిన్ సీ ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి.

అల్ల నేరేడులో ఉండే సైనైడిన్ వంటి సమ్మేళనాలు కొలన్ కేన్సర్‌ను నిరోధించే శక్తిని కలిగి ఉంటాయి. 

డయాబెటిక్‌  రోగులకు నేరేడు పళ్లు  చాలా మేలు చేస్తాయి. అధిక మూత్ర విసర్జన,  దాహం వంటి డయాబెటిస్ లక్షణాలను తగ్గిస్తాయి. వీటిల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.  ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడానికి దోహదం చేస్తుంది. ఈ పండులో జాంబోలిన్ అనే సమ్మేళనం పిండి పదార్ధాన్ని చక్కెరగా మార్చడాన్ని నిరోధించడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.


వీటిల్లోని యాంటాక్సిడెంట్ల సమ్మేళనాలు, విటమిన్ సీ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. ఫలితంగా చర్మం మెరుస్తుంది.  అంతేకాదు చాలాకాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను  బయటకు విస్తర్జిస్తుంది. పేగుల్లో చుట్టుకు పోయిన వెంట్రుకలకు కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉందని పెద్దలు  చెబుతారు. 

పిండిపదార్థం, కొవ్వు  శాతం తక్కువగా ఉంటుంది. కనుక అధిక బరువు ఉన్నవారు కూడా తినవచ్చు. ఇందులోని అంతేకాదు ఫైబర్ కంటెంట్ సరైన జీర్ణక్రియకు దోహదపడి, అనవసరమైన కొవ్వు పెరగకుండా అడ్డుపడుతుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement