Cholesterol
-
Yoga: కొలెస్ట్రాల్‌కు చెక్
రోజూ గంటల తరబడి డెస్క్ జాబ్ చేసేవారికి నడుం నొప్పి, పోట్ట దగ్గర కొవ్వు పేరుకు పోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటి నుంచి విముక్తికి ఈ వక్రాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని ట్విస్టెడ్ పోజ్ అని కూడా అంటారు. పది నిమిషాలు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేసిన తర్వాత యోగాసనాలను సాధన చేయాలి.వెన్నెముక బలంగా అవడానికి, మెడ నరాల పనితీరు మెరుగుదలకూ సహాయపడుతుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. శ్వాస సమస్యలు తగ్గుతాయి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. రోజూ ఈ ఆసనాన్ని సాధన చేయడం వల్ల పోట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. నిటారుగా.. నిదానంగా! విశ్రాంతిగా కూర్చొని ఒక కాలును పోట్ట దగ్గర నుంచి రెండవ కాలు మీదుగా తీసుకెళ్లి ఉంచాలి. చేతులను వ్యతిరేక దశలో ఉంచడంతో నడుము భాగం ట్విస్ట్ అవుతుంది. ఎడమచేతితో కుడికాలి పాదాన్ని పట్టుకోవాలి. వెన్నెముకను నిటారుగా ఉంచి, తలను భుజం మీదుగా సాధ్యమైనంత వెనుకకు తిప్పి, దాదాపు ఒక నిముషం పాటు ఆసనంలో ఉండాలి. అనంతరం ఇదే విధంగా ఎడమ కాలితో కూడా చేసుకోవాలి. తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఎడమ చేత్తో కుడి మోకాలిని పోట్టవైపు నెడుతూ ఎడమ మోకాలిని పట్టుకోవాలి. ఈ ఆసనంలో ఉన్నప్పుడు ఐదు దీర్ఘశ్వాసలు తీసుకోవడం, వదలడం చేయాలి. – జి.అనూషా కార్తీక్, యోగా గురు -
నిశ్శబ్దంగా మృత్యువుకు కారణమయ్యే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్!
డాక్టర్లు చెప్పిన మందులు చెప్పినట్లు వేసుకునేవారు మనదేశంలో తక్కువే ఉంటారు. అమెరికాలో కూడా ఇంతే. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వృద్ధుల్లో దాదాపు 40 శాతం మంది వైద్యులు సూచించిన మందులు వేసుకోరని ‘పాప్యులేషన్ మెడిసిన్’ జర్నల్ అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. ‘లో డెన్సిటీ లిపో ప్రోటీన్’ క్లుప్తంగా ఎల్డీఎల్ అని పిలిచే ఈ రకమైన కొవ్వు గుండె ఆరోగ్యానికి చాలా కీలకం. మందులు సక్రమంగా వేసుకోకపోతే ఈ రకమైన కొవ్వులు ఎక్కువవుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో గార పేరుకుపోవడం కూడా పెరిగి పోతుంది. ఇది కాస్తా గుండెజబ్బు లేదా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని ఎక్కువ చేస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే సమస్య మరింత జటిలమవుతుంది. మందులు సక్రమంగా వేసుకోకపోయేందుకు కారణాలు చాలానే ఉన్నాయి. వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం ఒకటైతే.. ‘‘ఆ..ఏమవుతుంది లే’’ అన్న నిర్లక్ష్యం రెండోది. మందులేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న ఆందోళన మూడోది. కానీ... ఎల్డీఎల్ మోతాదులు ఆరోగ్యకరంగా ఉండాలంటే దీర్ఘకాలిక విధానం ఒకటి అవసరమవుతుంది. మందులు నిలిపివేయడం వల్ల కొలెస్ట్రాల్ మళ్లీ పెరిగిపోతుంది. కాబట్టి లక్షణాలు ఉన్నా లేకపోయినా వైద్యులు సూచించినట్లుగా మందులు వేసుకోవడం అవసరం.ఎల్డీఎల్ మోతాదులను నియంత్రించుకోవాల్సిన అవసరం గురించి హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్ క్యాథ్ ల్యాబ్ సీనియర్ కన్సలెట్టంట్, కార్డియాలజిస్ట్ డాక్టర్ పీఎల్ఎన్ కపర్థి మాట్లాడుతూ "LDLC, లేదా "చెడు" కొలెస్ట్రాల్ నియంత్రణ జీవితాంతం కొనసాగాల్సిన ప్రయత్నం. చాలామంది మేము సురక్షితంగానే ఉన్నామని అనుకుంటారు కానీ.. అలా భావించి మందులు అశ్రద్ధ చేయడం వల్ల గుండెపోటుకు గురైన వారూ ఉన్నారు. కొలెస్ట్రాల్ నియంత్రణ అనేది రక్తనాళాల్లోపలి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. లక్షణాలు కనిపించవు కానీ నెమ్మదిగా తీవ్రమవుతుంది. అందుకే తరచుగా డాక్టర్ చెకప్‌లు చేయించుకోవడం అవసరం. దీనివల్ల ఏదైనా మార్పులు ఉంటే ముందుగానే గుర్తించి తగు చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే వైద్యులు చెప్పినట్లు మందులు కచ్చితంగా సమయానికి తీసుకోవాలి.”హెల్తియన్స్ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన ఒక పోల్ ప్రకారం భారతదేశంలో 31 శాతం మంది అధిక కొలెస్ట్రాల్ కలిగి ఉన్నారు. హైదరాబాదు జనాభాలో ఈ మోతాదు 27.4% కావడం గమనార్హం. ఇది అథెరోస్కెలరోటిక్ కార్డియో వాస్కులర్ డిసీజ్ (ASCVD) పెరుగుదలను సూచిస్తుంది. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు లక్షణాలేవీ కనిపించవని ముందుగానే చెప్పుకున్నాం. అందుకే దీన్ని నిశ్శబ్ధ కిల్లర్ అని పిలుస్తూంటారు. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే ధమనులకు హాని జరుగుతుంది. క్రమంగా మూసుకుపోతాయి. పరిస్థితి తీవ్రమయ్యే వరకూ ఎవరూ గుర్తించలేరు. ఒకసారి మందులు తీసుకోవడం ఆపివేసినా సూచించిన విధంగా తీసుకోకపోయినా ఎల్డీఎల్ స్థాయులు మళ్లీ పెరగవచ్చు.కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవడానికి జీవనశైలి మార్పులు, సూచించిన మందులు సక్రమంగా తీసుకోవడం అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం. -
కొలెస్ట్రాల్ పూర్తిగా హానికరమేనా?
శరీరంలో కాలేయం ఉత్పత్తి చేసే ఒకలాంటి కొవ్వుని కొలెస్ట్రాల్ అంటారు. మన శరీర ప్రతికణంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ అనగానే అదేదో ఆరోగ్యానికి చాలా హానికరమనీ, చెడు చేస్తుందనే అభి్రపాయం పెరిగింది. కానీ జీవక్రియలకు పరిమిత మోతాదులో కొలెస్ట్రాల్ చాలా అవసరమే కాకుండా ఉండాల్సిన మోతాదులో ఉంటే మంచి చేస్తుంది కూడా.ఏ కొలెస్ట్రాల్‌తో డేంజర్?కొలెస్ట్రాల్‌లో మంచి, చెడు రెండూ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ పాళ్లు ఉండాల్సిన పరిమితిలో ఉండి, శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ కూడా ఉండాల్సిన పాళ్లలో ఉండాలి. మంచి కొలెస్ట్రాల్‌ను ‘హై డెన్సిటీ లైపో్రపోటీన్’ (హెచ్‌డీఎల్) అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను ‘లో డెన్సిటీ లైపో్రపోటీన్’ (ఎల్డిఎల్) అంటారు. అందుకే ఎల్‌డీఎల్‌ను ‘‘చెడు కొలెస్ట్రాల్’’ (బ్యాడ్ కొలెస్ట్రాల్) అంటారు. అదే హెచ్‌డీఎల్ రక్తనాళాల్లోకి కొవ్వు చేరకుండా చేస్తుంది. అందుకే దీన్ని ‘‘వుంచి కొలెస్ట్రాల్’’ (గుడ్ కొలెస్ట్రాల్) అని అంటారు. మన శరీరంలో ఎప్పుడు హెచ్‌డీఎల్ ఎక్కువగా ఉండి ఎల్డీఎల్ తక్కువగా ఉండేలా మంచిది. ఈ ఎల్డీఎల్ ఉండాల్సిన మోతాదు కంటే మించితే అది రక్తనాళాల్లో చేరి రక్తప్రవాహాన్ని అడ్డుకుని గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌కు దారితీసే అవకాశం ఉంది. అందుకే చెడు కొలెస్ట్రాల్‌ను ఉండాల్సిన పరిమితికి మించకుండా చూసుకోవాలని జాగ్రత్త చెబుతారు.మోతాదు కనుగొనడం ఎలా? వున శరీరంలో కొలెస్ట్రాల్ మోతాదులను రక్త పరీక్ష ద్వారా కనుక్కోవచ్చు. పన్నెండు గంటలపాటు ఏమీ తినకుండా ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరీక్షలో ఎల్డీఎల్ (లో డెన్సిటీ లైపో్ర ప్రోటీన్ లెవల్), హెచ్‌డీఎల్ (హై డెన్సిటీ లైపో ప్రోటీ లెవెల్) తెలుస్తాయి. ఎల్డీఎల్ ఎక్కువగా ఉంటే ధమనుల్లో కొవ్వు చేరి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది.మంచి కొలెస్ట్రాల్ కోసం... కొలెస్ట్రాల్ ఉండే గుడ్డు వంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అయితే వాటిని పరిమితంగా తీసుకోవాలి. అందరికీ అందుబాటులో ఉండే గుడ్డులోని తెల్లసొనలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. పచ్చ సొనలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. సరైన వ్యాయామం లేకపోవడం, ఫ్యామిలీ హిస్టరీ, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. అందుకే గతంలో ఎలాంటి లక్షణాలూ లేనివారు కూడా 40 ఏళ్లు పైబడ్డాక ప్రతి ఐదేళ్లకోవూరు పరీక్ష చేయించుకోవాలి. అదే రిస్క్ఫ్యాక్టర్స్ ఉన్నవారైతే డాక్టర్ సలహా మేరకు ప్రతి ఏడాదీ, లేదా డాక్టర్ సూచించిన ప్రకారం కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి. -
ఇకపై పరగడుపున కొలెస్ట్రాల్టెస్ట్ అక్కర్లేదు!
ఇప్పటివరకూ రక్తంలో కొలెస్ట్రాల్విలువలు తెలుసుకోడానికి రాత్రి భోజనం తర్వాత కనీసం 12 గంటలపాటు ఆగాక..ఉదయమే ఏదీ తినకుండా పరగడుపున ఈ పరీక్ష చేయించాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఆంక్షలేమీ ఉండవని కార్డియాలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) పేర్కొంది. ‘లిపిడ్ ప్రొఫైల్’పరీక్ష ఇకపై పరగడుపున చేయించాల్సిన అవసరం లేదని సీఎస్ఐ తెలిపింది. రక్తంలో ఈ విలువలు నార్మల్‌గా లేకపోవడాన్ని ‘డిస్లిపిడేమియా’అని పేర్కొంటారు. ఇలా లేకపోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశముంటుంది. ఈ మేరకు సీఎస్ఐ తొలిసారిగా ‘డిస్లిపిడేమియా’కు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. నిజానికి ఇప్పటివరకూ మన దేశంతోపాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ నిర్దేశించిన మార్గదర్శకాలనే అనుసరిస్తున్నాయి. అయితే కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 22 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పడింది. ఇటీవలే అది డిస్లిపిడేమియా మార్గదర్శకాలనూ, మంచి, చెడు కొలె్రస్టాల్ల నార్మల్ తాలూకు కొత్త విలువలను వెల్లడించింది. ఈ సందర్భంగా కార్డియాలజీ సొసైటీ ఆనరరీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ధూర్జటి ప్రసాద్ సిన్హా మాట్లాడుతూ ఇకపై పరగడుపున మాత్రమే లిపిడ్ ప్రొఫైల్ అక్కర్లేదనే సూచన తొలగిపోవడం అందరికీ మంచి సౌలభ్యం కలిగించే అంశమన్నారు. దీంతో అనేకమంది ఎప్పుడంటే అప్పుడు ఈ పరీక్ష చేయించుకునే సౌకర్యం కలిగిందని చెప్పారు. ఈ మార్గదర్శకాల ప్రకారం..» లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష వీలైనంత త్వరగా (18 ఏళు దాటేనాటికే) చేయించుకోవాలి. అయితే కుటుంబంలో గుండెజబ్బులు, రక్తంలో కొలె్రస్టాల్ మోతాదులు ఎక్కువగా ఉన్న కుటుంబాల్లోని వారు (అంటే ఫెమీలియల్ హైపర్ కొలెస్టెరాలేమియా హైరిస్క్ పేషెంట్స్) అంతకంటే ముందే ఈ పరీక్ష చేయించుకోవచ్చు. » ముప్పు ఎక్కువగా (హైరిస్్క) ఉన్నవారు మినహాయించి మిగతా అందరికీ చెడు కొలె్రస్టాల్ మోతాదుల (ఎల్డీఎల్–సీ) నార్మల్ విలువ 100 ఎంజీ/డీఎల్. » ముప్పు ఎక్కువగా ఉన్నవారు మినహాయించి మిగతా అందరికీ హెచ్‌డీఎల్ కాకుండా మిగతా అన్ని కొలెస్ట్రాల్ల మోతాదుల (నాన్–హెచ్‌డీఎల్–సీ) నార్మల్ విలువ 130 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉండాలి. » డయాబెటిస్ / హైబీపీ వల్ల ముప్పు ఎక్కువగా (హైరిస్్క) ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్–సీ) విలువ 70 ఎంజీ/డీఎస్ కంటే తక్కువగా ఉండాలి. » ఈ నార్మల్ విలువల కంటే ఎక్కువగా ఉండటంతో పాటు ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వులు ఎక్కువగా ఉన్నట్టయితే అది గుండెపోటు (హార్ట్ స్ట్రోక్) లేదా గుండెజబ్బులు (పెరిఫెరల్ హార్ట్ డిసీజ్)లకు దారితీయవచ్చని తెలుసుకోవాలి. ఈ ట్రైగ్లిజరైడ్స్ కొవ్వుల నార్మల్ విలువ 150 ఎంజీ/డీఎల్‌కు లోపున ఉండాలని గుర్తుంచుకోవాలి. » మరీ ఎక్కువ ముప్పు (వెరీ హై–రిస్్క) ఉన్న పేషెంట్స్... అంటే గుండెపోటు వచ్చి ఉన్నవారు, యాంజైనా అనే చాతీనొప్పి వచ్చినవారు, దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బు (సీకేడీ) ఉన్నవారిలో చెడు కొలె్రస్టాల్ (ఎల్డీఎల్) మోతాదులు 55 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగానూ మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) కాకుండా మిగతాది (నాన్–హెచ్‌డీఎల్) కొలెస్ట్రాల్ మోతాదులు 85 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి.– సాక్షి హెల్త్‌డెస్క్ -
కొలెస్ట్రాల్ ఎంత అవసరం? ఎంతకు మించరాదు?
ఆధునిక కాలంలో మనం అనుసరించే జీవనశైలి వల్ల, తినే ఆహారం వల్ల రకరకాల జబ్బులను కొని తెచ్చుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ హెచ్చుతూనే ఉంది. హృదయ సంబంధ వ్యాధులకు ప్రధానంగా ఆహార పదార్థాలతోపాటు కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువ ఉండటమూ ఒక కారణం. ఇంతకూ కొలెస్ట్రాల్ శరీరానికి అవసరమేనా? ఇది ఎంత ఉండాలి, ఎంతకంటే ఎక్కువ ఉంటే ప్రమాదం అనే విషయాల గురించి తెలుసుకుందాం.శరీరంలో కొవ్వు పెరగడంలో ఎల్‌డిఎల్‌ది ప్రధాన బాధ్యత. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారిలో ఎల్డిఎల్ స్థాయి 70 మిల్లీ గ్రాము/డిఎల్ కంటే తక్కువ ఉండాలని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ దీనినే మంచి కొలెస్ట్రాల్ అని అంటారు. హెచ్‌డిఎల్ రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్‌ను తొలగించి, కాలేయానికి పంపిస్తుంది. ఇక్కడ కొలెస్ట్రాల్ విచ్ఛిన్నం అవుతుంది. హెచ్‌డిఎల్ స్థాయి తక్కువగా ఉందంటే, గుండె రక్తనాళాల వ్యాధి ప్రమాదం పెరుగుతున్నట్లు భావించాలి. గుండె΄ోటుకు బలమైన కారణం ఎల్డిఎల్ పెరగడం కన్నా హెచ్‌డిఎల్ తగ్గడమే. హెచ్‌డిఎల్ పురుషుల్లో 40 ఎంజి/ డిఎల్, మహిళల్లో 50 ఎంజి/డిఎల్ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని ప్రతిరోజు వంటల్లో ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే గ్రీన్ టీ రోజు తాగడం వల్ల కూడా చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో΄ాటు హెచ్‌డీఎల్ స్ధాయిని కూడా పెంచుకునే వీలుంది.ఇక ధనియాలు.. ఈ గింజల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, బీటా కెరోటిన్, విటమిన్ సి వంటివి ఉండటం వల్ల కొలెస్ట్రాల్ ప్రభావం తగ్గుతుంది. వీటిని రోజు నేరుగా తినడం అలవాటు చేసుకుంటే మంచిది. మెంతులు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని నేరుగా తినలేము. ఎందుకంటే ఇవి రుచికి చిరు చేదుగా అనిపిస్తాయి. అందువల్ల నానబెట్టుకుని తింటే మంచిది. ఇక చివరిగా ఉసిరి. ఇది కొలెస్ట్రాల్ సమస్యకు చక్కని పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏదైనా సమస్య రాకముందే ఇలాంటివి అలవాటు చేసుకుంటే మంచిదని.. చక్కని ఆరోగ్యాన్ని పోందవచ్చని కూడా చెబుతున్నారు.మాంసాహారం పూర్తిగా మానేయాలి. శాకాహారంలో వేపుడు కూరలు తినరాదు. వీటి బదులు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే కొబ్బరి, వేరుశనగలు, నువ్వులు వంటివి తీసుకోవడం వల్ల వీటిలో ఫైబర్‌తోపాటు ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది మన శరీర నిర్మాణానికి అవసరం.చెడు కొలెస్ట్రాల్ ఉంటే..?శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తపోటు, ఊబకాయం, గుండె పోటు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు, కిడ్నీ, మెదడుకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి. మరి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?అన్ని విషయాల్లో మంచి, చెడూ ఉన్నట్లే.. కొవ్వుల్లోనూ మనకు మేలు చేసేవి, చెడు చేసేవి ఉన్నాయి. చెడు కొవ్వుల్ని ఎల్డీఎల్ అని, మంచి కొవ్వుల్ని హెచ్‌డీఎల్ అని పిలుస్తారు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా/అదుపులో ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. మరి మన వంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి ఏం తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా?చెడు కొవ్వు తగ్గడానికి...ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి ∙ఎల్డీఎల్ అనే చెడు కొవ్వులు.. డెసిలీటర్కు 70 మిల్లీ గ్రాములకు మించకూడదు మధుమేహం ఉన్నవాళ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధాలు తీసుకోవడం తప్పనిసరి. అ΄ోహలను పక్కనపెట్టి వైద్యుల సూచనలను తప్పక ΄ాటించాలి ∙మంచి కొలెస్ట్రాల్ . డెసిలీటర్కు 40 మిల్లీగ్రాములు ఉండేలా చూసుకోవాలి ∙ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్త పడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ∙తిండిని అదుపులో ఉంచుకోవాలి. వరి, గోధుమ బదులు తృణ ధాన్యాలు, సిరి ధాన్యాలు తింటే కూడా చెడు కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. అలాగే పళ్ళు, పచ్చి కూరలు తురుముకొని పెరుగులో వేసుకుని తినండి. కీర దోసకాయలు, కారట్, బీట్రూట్, దోసకాయలు, బూడిద గుమ్మడి, సొరకాయ వంటివి తురుముకొని లేదా మిక్సర్ లో వేసి పెరుగులో కలిపి తీసుకుంటే మంచిది.పాలకు బదులు పెరుగు, మజ్జిగ తీసుకోండి. పంచదార పూర్తిగా మానేసి తాటి బెల్లం, బెల్లం లేదా తేనె కొద్ది మోతాదులో తీసుకోండి.రోజూ ఉదయం మొలకలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సలాడ్, పండ్లు తీసుకోండి. ఇలా 30 రోజులు చేయండి. ఉదయం రెండు కిలోమీటర్ల నడక, ్ర΄ాణాయామం చేయాలి. -
వేసవిలో బార్లీ నీళ్లు : ప్రయోజనాలెన్నో..!
బార్లీ నీరు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయపడుతుంది. గట్ బాక్టీరియాను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మన ఆరోగ్యంలో గట్ బ్యాక్టీరియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బార్లీ ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల బాక్టీరాయిడ్స్ అనే గట్ బ్యాక్టీరియా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ⇒ రక్తపోటును అదుపులో ఉంచుతాయి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు తమ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించేందుకు బార్లీ వాటర్ తాగవచ్చు. ⇒ ఎండల ప్రభావం పడకుండా ఉండాలన్న, వడదెబ్బ తగలకుండా ఉండాలన్న ఈ నీళ్లు తాగాల్సిందే ⇒ బార్లీ నీళ్లు తాగితే జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది. ⇒ పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు. ⇒ గర్భిణులు రోజూ బార్లీనీళ్లు తాగితే మరీ మంచిది. కాళ్ల వాపు సమస్య వారి దరిచేరదు. రోజులో ఉదయం, సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలసట కూడా త్వరగా రాదు ⇒ బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. ⇒ మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి. సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి. -
సరికొత్త ఔషధం..దెబ్బకు కొలస్ట్రాల్ మాయం!
మన శరీరంలో అవసరమైన కొలస్ట్రాల్ కంటే చెడు కొలస్ట్రాలే అధికంగా ఉంటుంది. దీని కారణంగానే అనారోగ్యం బారిన పడతాం. ముఖ్యంగా బీపీ, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కారణం కూడా ఈ చెడు కొలస్ట్రాలే. అధిక బరవు సమస్యకు కూడా ఇది ఒక కారణమే. దీని గురించి ఇక బాధపడాల్సిన పని లేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక డోసు ఈ సరికొత్త ఔషధం తీసుకుంటే ఏడాది వరకు నిశ్చింతగా ఉండొచ్చట. ఇంతకీ ఏంటా ఔషధం అంటే.. శాస్త్రవేత్తలు లెపోడిసిరాన్ అనే కొత్త ఔషధాన్ని కనుగొన్నారు. ఇది ఒక డోస్ ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే లిపోప్రోటీన్(ఏ) అనే చెడు కొలస్ట్రాల్‌ను దాదాపు ఒక ఏడాది పాటు గుర్తించలేనంతగా మాయం అయిపోతాయని చెబుతున్నారు. తద్వారా హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించొచ్చని అన్నారు. లిపో ప్రోటీన్(ఏ) లేదా ఎల్పీ(ఏ) అనే చెడు కొలస్ట్రాల్ శరీరంలోని ఇతర భాగాలకు రక్తప్రవాహాన్ని సాఫీగా జరగనివ్వదు. అదీగాక ఈ అధిక ఎల్పీ(ఏ) స్థాయిలు వారసత్వంగా వస్తే మాత్రం.. వాటిని వ్యాయామం, ఆహారం లేదా మందుల ద్వారా కూడా ప్రభావింతం చేయలేం. అలాగే ఈ అధిక ఎల్పీ(ఏ)కి ఇప్పటి వరకు ఎలాంటి చికిత్సలు లేవు. ఈ సమస్యలన్నింటికి చెక్‌పెట్టేలా తాము కనుగొన్న ఈ కొత్త ఔషధం క్లినికల్ ట్రయల్స్‌లో చక్కటి ఫలితాలనిచ్చిందని చెప్పారు. ప్రతి ఏడాది మూడు నుంచి ఆరు నెలలకొకసారి మాత్రమే తీసుకుంటే చాలు ఏడాది వరకు శరీరంలో ఎలాంటి చెడు కొలస్ట్రాల్ ఉండదు. పైగా అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. ఈ కొలస్ట్రాల్‌ని ఉత్పత్తి చేసే కాలేయంలోని కణాలకు సంబంధించిన ఆర్నెన్ఏ మెసెంజర్ని నిలిపేస్తుంది. తత్ఫలితంగా చెడు కొలస్ట్రాలనేది శరరీంలో ఉండదని చెబుతున్నారు. అందుకోసం అసాధారణ స్థాయిలో ఎల్పీ(ఏ) ఉన్న 48 మందిపై పరిశోధనలు చేయగా..వారిలో కొందరికి ఈ కొత్త ఔషధం మోతాదులుగా వారిగా ఇచ్చారు. ఎక్కువ మోతాదుని ఇచ్చిన వారిలో త్వరిత గతిన కొలస్ట్రాల్ స్థాయిలు తగ్గి, రక్త పోటు స్థాయిలు సమంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే మోతాదు తక్కువగా ఇచ్చిన వారిలో చెడు కొలస్ట్రాల్ తగ్గడానికి, రక్తం స్థాయిల్లో మార్పులకు కనీసం మూడు రోజుల సమయం పట్టినట్లు తెలిపారు. కానీ ఈ లెపోడిసిరాన్ ఔషధం మాత్రం క్లినిక్ పరిక్షల్లో నూటికి 94% సమర్థవంతంగా చెడు కొలస్ట్రాల్‌ని పూర్తి స్థాయిలో తగ్గించినట్లు తెలిపారు. అయితే ఈ పరిశోధనలో పాల్గొన్న వారందరికి ఎలాంటి ఇతర సమస్యలు లేవు. కానీ తాము నిర్వహించే సెకండ్ క్లినికల్ ట్రయల్స్‌లో పక్షవాతం, గుండె జబ్బులు ఉన్న పేషెంట్లపై ఈ కొత్త ఔషధం ఎలా పనిచేస్తుందనేది నిర్థారణ అవ్వాల్సి ఉందన్నారు పరిశోధకులు. ఆ అధ్యయనంలో కూడా ఫలితాలు మంచిగా ఉంటే రోగులకు ఈ సరికొత్త ఔషధం గొప్ప సంజీవని అవుతుందన్నారు. అంతేగాదు దీన్ని ఏడాదికొకసారి టీకా మాదిరిగా తీసుకునేలా అభివృద్ధి చేస్తే.. ఈ చెడు కొలస్ట్రాల్ సంబంధిత వ్యాధుల బారినపడుకుండా ప్రజలను సురక్షితంగా ఉండగలుగుతారని పరిశోధకులు నమ్మకంగా చెబుతున్నారు. ఈ మేరకు లిల్లీ రిసెర్చ్ ల్యాబరేటరీ అందుకు సంబంధించిన పరిశోధన పత్రాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కి సమర్పించింది. (చదవండి: బీపీని కరెక్ట్‌గానే చెక్ చేస్తున్నారా? రోజూ మాత్రలు వేసుకోనవసరం లేదా.?) -
కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తినడం మానేశారా? ఈ విషయాలు తెలిస్తే..
లావవుతామనే భయంతో చాలామంది కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాలను తినడం మానేస్తున్నారు. కొందరైతే నెయ్యి తినడం ఎప్పుడో మానేశారు. అయితే శరీరంలోని ఎ, డి, ఇ, కె విటమిన్లు కొవ్వులో మాత్రమే కరుగుతాయి. కాబట్టి తగిన పరిమాణంలో మంచి కొలెస్ట్రాల్ ఎంతో అవసరం. అలాగని అన్నిరకాల కొవ్వులూ ఆరోగ్యం కాదు. ఇంతకూ ఆరోగ్యకరమైన కొవ్వు లభించాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందామా? అవకాడో: మీరు ఆరోగ్యం పట్ల చాలా కాన్షియస్గా ఉండి..అధిక పరిమాణంలో కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉంటే తప్పకుండా ఈ అవకాడోను ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆలివ్ ఆయిల్: వేపుళ్లకు దూరంగా ఉండేవారు తప్పకుండా ఆహారాల్లో ఆలివ్ ఆయిల్‌ను తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు, మోనోశాచురేటెడ్ కొవ్వులు గుండెను ఆరోగ్యంగా చేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా శరీర బరువును నియంత్రించేందుకు కూడా సహాయపడతాయి. పెరుగు: బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకుంటే శరీరంలోని కొవ్వును సమతుల్యంగా చేస్తుంది. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా కొవ్వు పాలతో చేసిన పెరుగు తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ప్రేగును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. కొబ్బరి: కొబ్బరి లేదా కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో జీర్ణక్రియను మెరుగుపరిచే చాలా రకాల పోషకాలు దొరుకుతాయి. దీనివల్ల ట్రైగ్లిజరైడ్ ఫుడ్ సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా మలబద్ధకం, ఇతర పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. చేపలు: చేపలలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంపొందించే లక్షణాలున్నాయి. అందుకే ఇతర విధాలైన మాంసాహారాలకు దూరంగా ఉండమని హెచ్చరించే వైద్యులు సైతం పరిమితంగా అయినా చేపలు తీసుకోవచ్చునని చెబుతారు. బాదం పప్పు, జీడిపప్పు: వీటిని తీసుకోవడం వల్ల కొవ్వు పెరుగుతుందని అనుకుంటాం. అయితే వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు మాత్రమే ఉంటాయి. అందువల్ల బాదం, జీడిపప్పు తీసుకోవడం మంచిది. బాదం పప్పును నీటిలో నానబెట్టి, పైన పొట్టు తీసి తినడం మంచిది. జీడిపప్పును అయితే వేయించకుండా నేరుగా తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెంపొందుతుంది. నెయ్యి: ఇదివరకటిలో ఆహారంలో నేతిని బాగా ఉపయోగించేవారు. అరిసెలు, గారెలు వంటి వాటిని నేతితోనే చేసేవారు. అయితే రానురానూ నెయ్యి తినడం ఆరోగ్యానికి మంచిది కాదనే అభిప్రాయం స్థిరపడిపోయింది. నిజానికి నేతిలో శరీరానికి అవసరమైన పోషకాలెన్నో ఉన్నాయి. అలాగని ముద్ద ముద్దకీ నెయ్యి వేసుకోవడం, నేతితోనే చేసిన డీప్ ఫ్రైలు విపరీతంగా తీసుకోవడం మాత్రం అంత మంచిది కాదు. గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యి మంచిది. -
రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించుకోవాలంటే..!
ఆయుర్వేదం ప్రకారం, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ రెండూ మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పైగా అవి ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. ట్రైగ్లిజరైడ్ పెరుగుదల చెడు కొలెస్ట్రాల్‌కి సంబంధించిన ప్రధాన కారణాలలో ఒకటిగా ఊబకాయం, కదలిక లేకపోవడం, చెడు ఆహారాల వినియోగం, చెడు అలవాట్లు, ఇవన్నీ శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడానికి దారితీస్తాయి (బాగా). ట్రైగ్లిజరైడ్లను తగ్గించడానికి మొదటి అడుగు ఆయుర్వేదం. జీవనశైలి ఆహారంలో మార్పులతో ఈ సమస్యను సులభంగా బయటపడవచ్చు అటున్నారు నవీన్ నడిమింటి. ముందుగా సాధారణ కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని తగ్గించండి. డెజర్ట్‌లు, చక్కెర, శుద్ధి చేసిన లేదాప్రాసెస్ చేసిన ఆహారాలు వంటి సాధారణ కార్బోహైడ్రేట్ల వినియోగం ద్వారా ట్రైగ్లిజరైడ్ల పరిమాణం పెరుగుతుంది. ఈ ఆహారాలకు బదులుగా, తృణధాన్యాలు, చిక్కుళ్ళు తీసుకోవడం పెంచాలని ఆయుర్వేదం సలహా ఇస్తుంది. వ్యాయామం రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, పరుగు, యోగా లేదా శ్వాస వ్యాయామాలు చేయాలి. ఇలా చేస్తే రక్తప్రవాహంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలోని అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది బరువు తగ్గేందుకి దారితీస్తుంది. కేలరీలను తీసుకోవడం తగ్గించండి. మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, పాస్తా, సోడాలు, ఆల్కహాల్ ఇతర ఆహారాలు తోపాటు అధిక కొలెస్ట్రాల్ ఉన్న ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించండి, బరువుపై ట్రైగ్లిజరైడ్స్ ప్రభావం బరువుపై ట్రైగ్లిజరైడ్లు అధికంగా ప్రభావం చూపుతాయి. వీటి స్థాయిలు పెరిగిన వ్యక్తుల పొత్తికడుపులో కొవ్వు పేరుకుపోతుంది. తినడం, నిద్రించడం వంఇ వాటి వల్ల టాక్సిన్లు పేరుకుపోతాయి. ఇది కాస్త చెడు కొలస్ట్రాల్‌కి దారితీస్తుంది. ఆహారాన్ని తయారు చేసే విధానంలో ఉపయోగించే నూనెల విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. లేదంటే ట్రైగ్లిజరైడ్స్ పెరిగే ప్రమాదం ఉందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ట్రైగ్లిజరైడ్లను తగ్గించే ఆహారాలు, ఆయుర్వేద మూలికలు తేనె తేనె ఎలివేటెడ్ ట్రైగ్లిజరైడ్స్ చెడు కొలెస్ట్రాల్‌తో విజయవంతంగా పోరాడుతుంది. ఒక చెంచా తేనెను ఒక గ్లాసు వేడి నీటిలో కరిగించి, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను సాధారణీకరించి చెడు కొలెస్ట్రాల్ ఫామ్ కాకుండా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే నీటిలో 8 నుంచి 10 చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ లేదా ½ టీస్పూన్ నిమ్మరసాన్ని కూడా జోడించవచ్చు. వెల్లుల్లి: ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడానికి, ఆయుర్వేదం వెల్లుల్లి వినియోగాన్ని గట్టిగా సిఫార్సు చేస్తుంది. వెల్లుల్లిలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, అలిసిన్, అజోయిక్ ఇతర సల్ఫర్ సమ్మేళనాలు వంటి సేంద్రీయ సల్ఫేట్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. తురిమి లేదా ఒలిచిన, వెల్లుల్లిని వంటలలో చేర్చమని అంటున్నారు నిపుణులు. వెల్లుల్లి పాలు కూడా మంచిదే అని చెబుతున్నారు. ఇది ఎలా చేయాలంటే..వెల్లుల్లి 5 నుంచి ఆరు తీసుకుని, రెండు లవంగాలు చూర్ణం చేసి 50 మి.ల్లీ లీటర్ల దేశీయా ఆవు పాలల్లో కలిపి వేడి చేయండి. సగం అయ్యేంత వరకు మరగినిచ్చి ఫిల్టర్ చేసి వేడిగా తాగండి చక్కటి ఫలితం ఉంటుంది. ఆమ్లా ఉసిరికాయలో విటమిన్ సి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చాలా మంచి యాంటీఆక్సిడెంట్. ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల ధమనులను శుభ్రం అవ్వడమే గాక ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అర్జునుడు ఇది చాలా శక్తివంతమైన ఆయుర్వేద మూలిక, ఇది కొలెస్ట్రాల్‌ను కరిగించి ధమనులను శుభ్రంగా ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అర్జునుడిని తెల్లవారుజామునే నీటిలో కరిగించి తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. గుగ్గులు ఆయుర్వేదంతో ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడే మరొక మూలిక. గుగ్గులు. గుగ్గుల్ స్టెరోన్లను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను చురుకుగా నిరోధిస్థాయి. ఈ ఆయుర్వేద మూలికను ప్రతిసారి భోజనం తర్వాత తీసుకోవచ్చు కూడా. మీ ట్రైగ్లిజరైడ్లను సాధారణంగా ఉంచడానికి 25 మిల్లీగ్రాం సరిపోతుంది. సెలెరీ ఈ కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలతో సంబంధం ఉన్న గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సెలెరీని సలాడ్‌గా తినవచ్చు, వంటలలో చేర్చవచ్చు లేదా రసంగా త్రాగవచ్చు. రోజుకు 2 కాడల ఆకుకూరల వినియోగం చెడు కొలెస్ట్రాల్‌ను 7 పాయింట్లు తగ్గిస్తుందని ఆధారాలు ఉన్నాయి . అవకాడో అవోకాడోస్‌లో గణనీయమైన మొత్తంలో ఫైబర్, ఒలేయిక్ యాసిడ్ వంటి మంచి కొవ్వులు ఉంటాయి, ఇది అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అవోకాడో సాధారణ ట్రైగ్లిజరైడ్ స్థాయిలను నిర్వహించడానికి చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, దీనిలో కొవ్వులు అధికం అనే విషయం గుర్తుంచుకోవాలి. గ్రీన్_టీ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలవు, రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించగలవు. ఒక గ్లాసు గ్రీన్ టీలో కూరగాయలు, పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్ల కంటే చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి ఆయుర్వేదం గ్రీన్ టీని రోజుకు మూడు సార్లు తాగాలని సిఫార్సు చేస్తోంది. బ్రౌన్‌రైస్ మీరు మీ సాధారణ ట్రైగ్లిజరైడ్లను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే, బ్రౌన్‌తో కూడిన వైట్ రైస్ తీసుకోండి. బ్రౌన్ రైస్‌లో అనేక ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయి అనే వాస్తవం పక్కన పెడితే, ఇందులో ఫైబర్, సంతృప్త కొవ్వులు కూడా ఉన్నాయి. ఇది శరీరాన్ని టాక్సిన్స్ నుంచి శుద్ధి చేయడానికి, బరువును తగ్గించడానికి ముఖ్యంగా శరీరంలోని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది . యాపిల్స్ ఈ రుచికరమైన పండ్లలో పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది సహజ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. వీటిని ఫ్లేవనాయిడ్స్ అని పిలుస్తారు. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించి ఊపిరితిత్తులు, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. సగటు యాపిల్‌లో పెద్ద మొత్తంలో విటమిన్లు ఏ, సీ ఉంటాయి. సుమారు 4 గ్రాముల ఫైబర్‌లో కేలరీలు కేవలం 100 మాత్రమే. యాపిల్స్ తోపాటు, ఆయుర్వేదం బేరి, దానిమ్మ, ద్రాక్షపండ్లు, నారింజలను తీసుకోవడం ద్వారా ట్రైగ్లిజరైడ్లను తగ్గించడానికి సిఫార్సు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. . బ్రోకలీ బ్రోకలీలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అదనంగా, అవి యాంటీఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. బ్రోకలీతో కలిపి తీసుకుంటే, అందులో ఉండే ఫైబర్లు జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన పిత్త ఆమ్లాలతో బంధించి వాటిని సహజంగా శరీరం నుంచి బయటకు తీస్తాయి. బ్రోకలీ సాధారణ ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. బార్లీ బార్లీ ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడానికి రక్తంలో చక్కెరను సాధారణీకరించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. తృణధాన్యంలో బీటా -గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను 4-10% తగ్గిస్తుంది. అదనంగా, బార్లీ గోధుమలకు చాలా మంచి ప్రత్యామ్నాయం. మీరు దీన్ని బ్రెడ్‌కు ప్రత్యామ్నాయంగా క్రమం తప్పకుండా తినవచ్చు. చేప చేప నూనె, చేప ట్యూనా, మాకేరెల్, ట్రౌట్, సాల్మన్, హెర్రింగ్, సార్డినెస్ వంటి చేపలు ఒమేగా 3 యాసిడ్లతో నిండి ఉంటాయి, ఇవి ట్రైగ్లిజరైడ్లను తగ్గించి గుండె జబ్బులను నివారించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆయుర్వేదం వారానికి కనీసం రెండుసార్లు చేపలను తినాలని అలాగే ప్రతిరోజూ 1 నుంచి 4 గ్రాముల చేప నూనెను తీసుకోవాలని సిఫార్సు చేస్తోంది. దుంప దీని ఆకులలో సినారైన్ ఉంటుంది. ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది పేరుకుపోయిన టాక్సిన్ని వేగవంతంగా తొలగిస్తుంది. తత్ఫలితంగా కొలెస్ట్రాల్ తగ్గి ధమనులను శుభ్రం అవుతాయి . పాలకూర బచ్చలికూర వీటిలో ల్యూటిన్ ఉంటుంది. ఇది ట్రైగ్లిజరైడ్స్‌ని ధమనుల గోడలకు అంటుకోకుండా, మూసుకుపోకుండా నిరోధిస్తుంది. బచ్చలికూరలో ఉండే విటమిన్ ఇ, ఫలకం తొలగింపుపై శ్రద్ధ చూపుతుంది తద్వారా గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది. అలాగే బీన్స్, బఠానీలు, చిక్పీస్, కాయధాన్యాలు మరియు ఇతర ఫైబర్ అధికంగా ఉండే చిక్కుళ్ళు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫ్లాక్స్ సీడ్లో లిగ్నన్లు ఉంటాయి, ఇవి రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. గుండె సమస్యలను దూరంగా ఉంచుతాయి. ఫ్లాక్స్ సీడ్లో ఫైబర్ ఒమేగా 3 యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ఉత్పత్తి, శోషణను నియంత్రిస్తాయి. (చదవండి: ఈ పొరపాటు చేస్తే.. మీరు ఏజ్డ్ పర్సన్‌లా కనిపించడం ఖాయం!) -
30% మందికి బీపీ.. 9.9% మందికి షుగర్
సాక్షి, హైదరాబాద్: అధిక రక్తపోటు (హైబీపీ), మధుమేహం (డయాబెటిస్/షుగర్) తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ..తద్వారా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఇతర కారణాలతో ఎక్కువ సంఖ్యలో ప్రజలు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. 30 శాతం మంది హైబీపీతో బాధ పడుతుండగా, 9.9 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు అధ్యయనం వెల్లడించింది. దేశంలో డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్ వంటి వాటిపై భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్) అధ్యయనం చేసింది. 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 20 ఏళ్లకు పైబడిన వారిపై సర్వే జరిపింది. జనాభా, ప్రాంతాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. దేశవ్యాప్తంగా 1.13 లక్షల మందిని సర్వే చేశారు. 79,506 మంది గ్రామీణులు, 33,537 మంది పట్టణ ప్రాంత ప్రజల (మొత్తం 1.13 లక్షల మంది) ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. 2008 అక్టోబర్ 18 నుంచి 2020 డిసెంబర్ 17 వరకు ఐదు దశల్లో రాష్ట్రాల వారీగా కొనసాగిన సర్వే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ జరిగింది. ఆ వివరాలను తాజాగా లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. పట్టణాల్లోనే ఎక్కువ.. తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాల్లో 30 శాతం మందికి పైగా హైబీపీతో బాధపడుతుండగా, గ్రామాల్లో 25–30 శాతం మంది బాధపడుతున్నారు. రెండు రాష్ట్రాల్లోని పట్టణాల్లో 10 శాతం కంటే ఎక్కువగా మధుమేహ బాధితులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 7.4 శాతంగా ఉంది. ఇక 15 శాతం మంది వరకు ప్రీ డయాబెటీస్ (వ్యాధికి ముందు దశ) స్థితిలో ఉన్నారు. పట్టణాల్లో ఇది 10–15 శాతంగా ఉంది. తెలంగాణ గ్రామాల్లో ప్రీ డయాబెటీస్ 15 శాతం వరకు ఉండగా, ఏపీలోని గ్రామాల్లో 10 శాతం వరకు ఉంది. పంజాబ్‌లో 51.8 శాతం మందికి హైబీపీ దేశవ్యాప్తంగా 11.4 శాతం మంది డయాబెటిస్తో బాధపడుతున్నట్లు సర్వే నిర్ధారించింది. డయాబెటిస్ ముందు దశలో 15.3 శాతం మంది ఉన్నారు. 35.5 శాతం బీపీతో బాధపడుతుండగా, 28.6 శాతం మంది ఊబకాయంతో ఉన్నారు. పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువ ఉన్నవారు 39.5 శాతం మంది ఉన్నారు. రక్తంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నవారు 81.2 శాతం ఉన్నారు. అత్యధికంగా గోవాలో 26.4 శాతం మందికి డయాబెటిస్ ఉంది. అతి తక్కువగా యూపీలో 4.8 శాతం మందికి ఉంది. బీపీ బాధితులు అత్యధికంగా పంజాబ్‌లో 51.8 శాతం మంది ఉన్నారు. అత్యంత తక్కువగా మేఘాలయలో 24.3 శాతం మంది ఉన్నారు. దేశంలో ఊబకాయులు 28.6 శాతంగా ఉన్నారు. పాండిచ్చేరిలో ఎక్కువ (53.3 శాతం) మంది, జార్ఖండ్‌లో తక్కువ (11.6 శాతం) మంది ఊబకాయ బాధితులు ఉన్నారు. మరికొన్ని ముఖ్యాంశాలు.. ♦ ఉమ్మడి ఏపీలో ఊబకాయులు 25 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. పట్టణాల్లో 25 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ గ్రామాల్లో 20 శాతం వరకు ఉన్నారు. గ్రామీణ ఏపీలో 20–25 శాతం మధ్య ఉన్నారు. ♦ పొట్ట దగ్గర అధిక కొవ్వు పేరుకుపోయిన వారు ఉమ్మడి ఏపీలో 25 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. ♦ రక్తంలో అధిక కొలెస్ట్రాల్ ఉభయ రాష్ట్రాల్లోని 20–25 శాతం మందికి ఉంది. అర్బన్ తెలంగాణలో ఇది 20–25 శాతంగా, ఏపీలో 25 శాతం కంటే ఎక్కువగా ఉంది. గ్రామీణ తెలంగాణలో 20–25 శాతం మధ్య, గ్రామీణ ఏపీలో 15–20 శాతం మధ్య ఉంది. ♦ మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నవారు తెలంగాణలో 50–60 శాతం మంది ఉండగా, ఏపీలో 60 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 15–20 శాతం మందికి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. రెండు రాష్ట్రాల్లోని పట్టణాల్లో 20–25 శాతం మందికి చెడు కొలెస్ట్రాల్ ఉంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో డయాబెటిస్ అధికం అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో డయాబెటిస్ అధికంగా ఉంది. చాలా జబ్బులు పట్టణాల్లో ఉన్నాయి. ప్రీ డయాబెటిస్ గ్రామాల్లో ఎక్కువగా ఉంది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన రాష్ట్రాల్లో షుగర్ తక్కువగా ఉంది. దీర్ఘకాలిక జబ్బులు అధికంగా ఉన్నాయని అధ్యయనం తేల్చింది. ప్రీడయాబెటిస్ స్థితిలో ఉన్నవారిని డయాబెటిస్ వైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. అధిక షుగర్ బాధితుల్లో తదుపరి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. –ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
మీ పాప లేదా బాబు బొద్దుగా ముద్దొస్తున్నారండీ.. అంటే మురిసిపోకండి!
‘మీ పాప లేదా బాబు బొద్దుగా ముద్దొస్తున్నారండీ’ అని ఎవరైనా అంటే వారి తల్లిదండ్రులు తెగ మురిసిపోతున్నారు. బాల్యంలోనే బొద్దుగా తయారవడం వల్ల వచ్చే దుష్ప్రభావాలను అసలు గుర్తించలేకపోతున్నారు. పిల్లలు ఏం తింటున్నారు, వారు తినే ఆహారంలో పోషకాలు ఏ మాత్రం ఉంటున్నాయనే విషయంపై ఆలోచించే వారైతే చాలా అరుదే. పంజాబ్‌లోని బటిండా, ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన ఆహార పదార్థాలనే పిల్లలకు పెట్టేందుకు తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తేలింది. పిల్లలకు పెట్టే ఆహారంలో ఉండాల్సిన పోషక విలువలపై తక్కువ అవగాహన ఉంటోందని గుర్తించారు. – సాక్షి, అమరావతి 53.9 శాతం అధికంగా కొలెస్ట్రాల్ పాఠశాలల్లో చదివే 14–18 సంవత్సరాల మధ్య వయసు పిల్లలు 722 మంది, వారి తల్లిదండ్రులను ఎయిమ్స్ బృందం అధ్యయనానికి ఎంచుకుంది. ఆ పిల్లల్లో జంక్ ఫుడ్, ప్యాక్ చేసిన ఆహారం కారణంగా చిన్న వయసులోనే ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్ వ్యాధుల బారినపడేలా చేస్తున్నాయని గుర్తించారు. పిల్లలు తినే ఆహారాల (ప్యాకేజీ ఫుడ్) తయారీలో 53.9 శాతం అధికంగా కొలెస్ట్రాల్ పదార్థాలు ఉంటున్నాయని తేల్చారు. ఇది విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావంచూపుతోందని తేల్చారు. ప్రకటనలతో ప్రభావితం టీవీలు, డిజిటల్ మీడియాలలో వచ్చే ప్యాక్ చేసిన ఆహార పదార్థాల వైపు పిల్లలు ఆకర్షితులు అవుతున్నారని 273 మంది తల్లిదండ్రులు (37.8 శాతం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 184 (25.5 శాతం) మంది ప్రచారం చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో పోషకాల నాణ్యతకు సంబంధించిన సమాచార కచ్చితత్వంపై సందేహాలు వ్యక్తం చేశారు. దాదాపు 45 శాతం మంది తల్లిదండ్రులు ప్రసిద్ధ వ్యక్తులు జంక్ ఫుడ్స్‌ను ప్రమోట్ చేస్తుండటాన్ని వ్యతిరేకించారు. జంక్ ఫుడ్‌పై కంపెనీలు ఆఫర్లు ఇస్తుండటాన్ని 34 శాతం మంది తప్పుపట్టగా.. ప్రైమ్ టైమ్‌లో జంక్ ఫుడ్ ప్రకటనలు వేయకూడదని 40 శాతం మంది కోరారు. గడువు తేదీని చూడని వారే అధికం అధ్యయనంలో పాల్గొన్న విద్యార్థుల్లో 352 మంది (48.8 శాతం) విద్యార్థులు తినే ఆహార ప్యాకెట్లపై కనీసం గడువు తీరే తేదీని (ఎక్స్పైరీ డేట్)పరిశీలించడం లేదు. 526 మంది (72.9 శాతం) కేవలం ధరలను పరిశీలిస్తుండగా.. 518 మంది (71.7 శాతం) విద్యార్థులు కొనుగోలు చేసే ముందు ఆ ఆహారం వెజ్, నాన్–వెజ్ అనేది మాత్రమే చూస్తున్నారు. మార్కెట్లో లభించే ఆహార ప్యాకెట్లపై తయారీకి వినియోగించిన పదార్థాలు, వాటిలో ఉండే పోషకాలకు సంబంధించిన లేబుల్స్‌పై సమాచారాన్ని కేవలం 50 మంది విద్యార్థులు (6.9 శాతం) మాత్రమే అర్థం చేసుకుంటున్నారు. 356 మంది విద్యార్థులు (49.30 శాతం) లేబుల్ చూసి తాము ఆహార పదార్థాల వైపు ప్రభావితం అవలేదని, 424 మంది (58.7 శాతం) లేబుల్స్ కారణంగా తమ కొనుగోలు ప్రవర్తనను ఎప్పుడూ మార్చుకోలేదని నివేదించారు. ఇంట్లోనే చేసి పెట్టాలి పిల్లలకు ఇంటి ఆహారం అలవాటు చేయాలి. పూర్వం తల్లిదండ్రులు పిల్లల కోసం ఇంట్లోనే చక్రాలు, కజ్జికాయలు, అరిసెలు వంటి ఆహార పదార్థాలు చేసేవారు. ఆ తరహా పద్ధతులను ఇప్పుడు కూడా పాటించాలి. వీలైనంత వరకూ కూరగాయలు, పళ్లు తినడాన్ని చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయాలి. జంక్ ఫుడ్, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చైల్డ్ ఒబెసిటీ వస్తుంది. దీనివల్ల ఆస్తమా, ఫ్యాటీ లివర్, టైప్–2 డయాబెటిస్ వంటి సమస్యల బారినపడతారు. ఈ ఆహారంలో కలిపే పదార్థాల కారణంగా త్వరగా పిల్లల్లో కౌమార దశ మొదలవుతుంది. – డాక్టర్ నాగచక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్, విజయవాడ జీజీహెచ్ -
అధిక కొలెస్ట్రాల్ లక్షణాలని గుర్తించండి ఇలా...
ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకుంటున్నా, మీకు బీపీ పెరుగుతోందా? కాళ్లూ చేతులు తిమ్మిర్లుగా ఉంటున్నాయా? గోళ్ల రంగు మారుతోందా? ఇవన్నీ వ్యాధి లక్షణాలే. అయితే భయపడవద్దు. అది ఏమంత ప్రమాదకరమైనది కాకపోవచ్చు కానీ, తేలిగ్గా కూడా తీసుకోకూడదు. మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందనడానికి నిదర్శనం అది. కొలెస్ట్రాల్ దానంతట అది ప్రమాదకరమైనది కాదు కానీ, ఇతర వ్యాధులకు దారితీస్తుంది. అందువల్ల దానిని నిర్లక్ష్యం చేయద్దు. అసలు మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఏ లక్షణాలుంటాయో అవగాహన కోసం. సాధారణంగా కొలెస్ట్రాల్ పేరు వినగానే అది చాలా చెడ్డదని అనుకుంటారు. కానీ ఇందులో రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. మంచి కొలస్ట్రాల్ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను తయారు చేయడానికి సహాయపడుతుంది. కానీ చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయి రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది. ఇది రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. ఈ ప్రమాదాలను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మంచి జీవనశైలిని అనుసరించాలి. కొలెస్ట్రాల్ పెరిగిందనడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవి... 1. అధిక రక్తపోటు: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అది నేరుగా రక్తపోటుకు దారితీస్తుంది. రక్తంలో కొవ్వు శాతం ఎంత పెరిగితే రక్తపోటు అంతగా పెరుగుతుంది కాబట్టి కారణం తెలియకుండానే బీపీ పెరిగిపోతుంటే కొలెస్ట్రాల్ ఉందేమో అని అనుమానించాల్సి ఉంటుంది. 2. కాళ్లు, చేతులు తిమ్మిర్లు పాదాలు మొద్దుబారడం: కాళ్లు చేతులు తిమ్మిరికి గురి కావడాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇది అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతంగా గుర్తించాలి. ధమనులలో రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరాలో అవరోధం ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. ΄ాదాలలో నొప్పి, తిమ్మిరి కారణంగా రక్త సరఫరా సరిగ్గా జరగదు. 3. గోర్ల రంగులో మార్పు: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ధమనులలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది సిరల్లో రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. చేతివేళ్లు, కాలి వేళ్లకు సరైన రక్త సరఫరా లేకపోవడం వల్ల అవి లేత గులాబీ రంగులోకి లేదా పసుపు రంగులోకి మారుతాయి. ఉండవలసిన దానికన్నా అధిక కొవ్వు ఉండటం వల్ల ఇలా జరుగుతుందని గుర్తించాలి. మధుమేహం ఉంటే కొలెస్ట్రాల్ కూడా పెరుగుతూ ఉంటుంది. అందువల్ల మధుమేహం ఉన్న వాళ్లు మూడు నెలలకొకసారి రక్తంలో సరాసరి చక్కెర శాతం ఎంత ఉందో తెలుసుకునే పరీక్షతో΄ాటు కొలెస్ట్రాల్ ΄ాళ్లను తెలుసుకునే పరీక్ష కూడా చేయించుకుని దానిని అదుపు చేసేందుకు తగిన మందులు తీసుకోవాలి. -
Health Tips: ఆవిరిపై ఉడికించిన ఆహారం తరచుగా తిన్నారంటే!
దాదాపు ఒక ఇరవై ఏళ్ల కిందటి వరకు జ్వరమొచ్చి తగ్గిన వాళ్లకి పొట్లకాయ, బీరకాయ, దొండకాయ, కాకరకాయ లాంటి కూరలు పథ్యం పెట్టేవాళ్లు పెద్దవాళ్లు. అదేవిధంగా నీరసంగా ఉన్న వాళ్లకి ఆవిరి కుడుముల లాంటివి పెట్టేవాళ్లు. ఇవి తేలికగా అరగడంతోపాటు వంటికి సత్తువనిచ్చేవి. ఇది ఒకప్పటి మాట కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. ఆధునిక వైద్యులు, ఆహార నిపుణులు కూడా ఆవిరితో తయారు చేసుకున్న ఆహార పదార్థాలనే తినమని సూచిస్తున్నారు చాలామందికి. ఎందుకో ఏమిటో తెలుసుకుందాం. ఇడ్లీలు ఆవిరితోనే తయారవుతాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఆవిరితో ఇడ్లీలతోపాటు ఎన్నో రకాల వంటకాలను తయారుచేసుకోవచ్చు. ఎందుకంటే ఆవిరితో వండిన వంటలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. తొందరగా జీర్ణం అవుతుంది నూనెతో డీప్ ఫ్రై చేయడంతో పోలిస్తే ఆవిరితో వండటం వల్ల వాటిలో ఉండే పోషకాలు ఎక్కడికీ పోవు. కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. కేలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. ఇలాంటి ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమమైన ఆహారం. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే సాధారణంగా చాలా మంది ఇలాంటి ఆహార పదార్థాలను ఉడకబెట్టి వండుతారు. దీంతో వాటిలో ఉండే పోషకాలు చాలా తగ్గిపోతాయి. శక్తిని మరింత పెంచుతాయి అలా కాకుండా ఆవిరిలో ఉడికించడం వల్ల నియాసిన్, విటమిన్ బి, థయామిన్, విటమిన్ సి వంటివి మన శక్తిని మరింత పెంచుతాయి. ఇవి తిన్నవారికి ఖనిజాలు, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, జింక్ వంటిపోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఫుడ్ సాధారణంగా ప్రతి వంటకు నూనెను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. కానీ ఆవిరితో తయారుచేసే ఆహారాలకు నూనె అవసరమే లేదు. అందుకే ఆవిరి పట్టిన ఆహారాల్లో కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ ఫుడ్ అని నిపుణులు చెబుతున్నారు. ఆవిరితో వండిన ఆహార పదార్థాలలో కేలరీలు, కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి చాలా తొందరగా జీర్ణం అవుతాయి. ఈ ఆహారం బరువుతోపాటు ఎన్నోరకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. కూరగాయలు, పండ్లు తేలికగా జీర్ణం అవుతాయి. ఆవిరిలో వండిన ఆహారాలు చాలా మృదువుగా తయారవుతాయి. ఆవిరి పట్టిన ఆహారం చాలా తేలిగ్గా జీర్ణం అవుతుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది! ఆవిరిలో ఉడికించిన ఆహారం కొవ్వులను నియంత్రణలో ఉంచుతుంది. ఎందుకంటే ఈ వంటలో నూనెను ఉపయోగించకపోవడమే దీనికి కారణం. వంటల్లో నూనెవల్లే చాలా బరువు పెరుగుతారు. అందుకే ఎక్కువ కొవ్వు లేదా నూనెను తినకూడదు. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. రంగు, రుచి మారదు ఆవిరితో వండిన కూరగాయల రంగు అస్సలు మారదు. రుచి కూడా బాగుంటుంది. మరింత రుచికరంగా కొన్ని రకాల మసాలా దినుసులను ఉపయోగించవచ్చు. కాబట్టి ఆరోగ్యం బాగుండాలంటే ఆవిరి మీద తయారు చేసే ఆహార పదార్థాలేమిటో తెలుసుకుని వాటి మీద దృష్టి పెట్టాల్సిందే మరి! చదవండి: Health Tips: షుగర్ పేషెంట్లకు ఈ పండ్లు అస్సలు మంచివి కావు! వీటిని తింటే.. Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. -
Health Tips: రోజూ క్యారెట్ తినే అలవాటుందా? అయితే..
క్యారెట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. మొక్కల ఆధారిత ఆహారాలు వాస్తవానికి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, నిర్వహించడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణుల అధ్యయనాలలో తేలింది. ►క్యారెట్లో సహజంగా ఖనిజాలు, విటమిన్లు, కరిగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ►ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడంలో సహాయపడతాయి. ►నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్యారెట్‌లోని విటమిన్ ఎ, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్, దీర్ఘకాలిక గుండె జబ్బుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. ►వాస్తవానికి, యాంటీ ఆక్సిడెంట్ల ఉనికి కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ►ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. ►అందువల్ల క్యారట్ తీసుకోవడం వల్ల చెడు కొలస్ట్రాల్ స్థాయులు తగ్గిపోతాయి. క్యారెట్ సూప్ చేసుకోండిలా! కావల్సినవి: క్యారెట్లు – 3 (శుభ్రపరిచి, ముక్కలు చేయాలి) ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి) చిలగడ దుంప – 1 (తొక్క తీసి, ముక్కలు చేయాలి) వెల్లుల్లి రెబ్బలు – 2 (తరగాలి), కొత్తిమీర – పావు కప్పు నీళ్లు – తగినన్ని, కూరగాయలు ఉడికించిన నీళ్లు – కప్పు టొమాటో గుజ్జు – అర కప్పు, పండుమిర్చి ముద్ద – పావు టీ స్పూన్ ఉప్పు – తగినంత, మిరియాల పొడి – పావు టీ స్పూన్, కారం – పావు టీ స్పూన్, నూనె – టేబుల్ స్పూన్ తయారీ: క్యారెట్లు, ఉల్లిపాయలు, చిలగడదుంప, వెల్లుల్లి, కొత్తిమీర ఒక గిన్నెలో వేసి నీళ్లు పోయాలి. ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి సన్నని మంట మీద 15 నిమిషాలు ఉడికించాలి. తర్వాత చల్లారనివ్వాలి. నీళ్లు వడకట్టి కూరగాయల ముక్కలన్నీ మెత్తగా రుబ్బాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేసి కాగాక టొమాటో గుజ్జు, పండుమిర్చి ముద్ద, ఉప్పు, కారం కలిపి ఉడికించాలి. దీంట్లో కూరగాయలు వడకట్టిన నీళ్లు, రుబ్బిన మిశ్రమం కలిపి, మిరియాల పొడి వేసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి వేడి వేడిగా అందించాలి. చదవండి: C- Section Wound Infection: సిజేరియన్.. కుట్ల నుంచి చీము.. ఏమైనా ప్రమాదమా? Detoxification: నోటి దుర్వాసన, చెమట నుంచి చెడు వాసన.. శరీరంలోని విషాలు తొలగించుకోండిలా! ఇవి తింటే మాత్రం.. -
శరీరంలో కొవ్వు ఎంత అవసరం? ఎంతకు మించితే ముప్పు?
ఆధునిక కాలంలో అనుసరిస్తున్న జీవన శైలి వల్ల, తినే ఆహారం వల్ల రకరకాల జబ్బులను కొని తెచ్చుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ హెచ్చుతూనే ఉంది. హృదయ సంబంధ వ్యాధులకు ప్రధానంగా ఆహార పదార్థాలతోపాటు కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువ ఉండటం కూడా ఒక కారణమే. కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరమేనా? ఇది ఎంత ఉండాలి, ఎంతకంటే ఎక్కువ ఉంటే ప్రమాదం అనే విషయాల గురించి తెలుసుకుందాం. శరీరంలో కొవ్వు పెరగడంలో ఎల్‌డిఎల్‌ది ప్రధాన బాధ్యత. ప్రతి 1 మిల్లీ గ్రాము/డి.ఎల్ ఎల్డిఎల్ పెరిగితే గుండెపోటు పెరిగే ప్రమాదం ఒకశాతం పెరుగుతుంది. అయితే ఎల్డి ఎల్‌కు ‘సాధారణ స్థాయి’ అంటూ ఏమీ లేదు. ఎల్డిఎల్ స్థాయి 100 మిల్లీ గ్రాము/డిఎల్‌కు పెరిగినప్పుడు గుండె పోటు ప్రమాదం అధికమవుతుంది. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారిలో ఎల్డిఎల్ స్థాయి 70 మిల్లీ గ్రాము/డిఎల్ కంటే తక్కువ ఉండాలని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. హెడీఎల్ కొలెస్ట్రాల్ దీనినే మంచి కొలెస్ట్రాల్ అని అంటారు. హెచ్‌డిఎల్ రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్‌ను తొలగించి, కాలేయానికి పంపిస్తుంది. ఇక్కడ కొలెస్ట్రాల్ విచ్ఛిన్నం అవుతుంది. ‘అథిరొస్లె్కరొసిన్’ అనే సమస్య ఉత్పన్నం కాకుండా హెచ్‌డిఎల్ రక్షణగా ఉంటుంది. హెచ్‌డిఎల్ స్థాయి తక్కువ గా ఉందంటే, గుండె రక్తనాళాల వ్యాధి ప్రమాదం పెరుగుతున్నట్లు భావించాలి. గుండె పోటుకు బలమైన కారణం ఎల్డిఎల్ పెరగడం కన్నా హెచ్‌డిఎల్ తగ్గడమే. హెచ్‌డిఎల్ పురుషుల్లో 40 ఎంజి/ డిఎల్, మహిళల్లో 50 ఎంజి/డిఎల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార జాగ్రత్తలు ►అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని ప్రతిరోజు వంటల్లో ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించుకోవచ్చు. ►అలాగే గ్రీన్ టీ రోజు తాగడం వల్ల కూడా చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు హెచ్‌డీఎల్ స్థాయిని కూడా పెంచుకునే వీలుంది. ►ఇక దనియాలు.. ఈ గింజల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, బీటా కెరోటిన్, విటమిన్ సి వంటివి ఉండటం వల్ల కొలెస్ట్రాల్ ప్రభావం తగ్గుతుంది. వీటిని రోజు నేరుగా తినడం అలవాటు చేసుకుంటే మంచిది. ►మెంతులు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నేరుగా తినలేము. ఎందుకంటే ఇవి రుచికి చిరుచేదుగా అనిపిస్తాయి. అందువల్ల నానబెట్టుకుని తింటే మంచిది. ►చివరిగా ఉసిరి. ఇది కొలెస్ట్రాల్ సమస్యకు చక్కని పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏదైనా సమస్య రాకముందే ఇలాంటివి అలవాటు చేసుకుంటే మంచిదని.. చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చని కూడా చెబుతున్నారు. ►మాంసాహారం పూర్తిగా మానేయాలి. శాకాహారం లో వేపుడు కూరలు తినరాదు. వీటి బదులు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే కొబ్బరి, వేరుశనగలు, నువ్వులు వంటివి తీసుకోవడం వల్ల వీటిలో ఫైబర్‌తోపాటు ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది మన శరీర నిర్మాణానికి అవసరం. ►వరి, గోధుమ బదులు తృణ ధాన్యాలు, సిరి ధాన్యాలు తింటే కూడా చెడు కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. ►అలాగే పళ్ళు, పచ్చికూరలు తురుముకొని పెరుగులో వేసుకుని తినండి. కీర దోస, కారట్, బీట్రూట్, దోసకాయలు, బూడిద గుమ్మడి, సొరకాయ వంటివి తురుముకొని లేదా మిక్సర్‌లో వేసి పెరుగులో కలిపి తీసుకుంటే చాలా మంచిది. ►పాలకు బదులు పెరుగు, మజ్జిగ తీసుకోండి. పంచదార పూర్తిగా మానేసి తాటిబెల్లం, బెల్లం లేదా తేనె కొంచెం కొంచెం తీసుకోండి. ►ప్రతిరోజూ ఉదయం మొలకలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సలాడ్, పండ్లు తీసుకోవాలి. ఉదయం రెండు కిలోమీటర్ల నడక, ప్రాణాయామం చేయండి. చెడు కొవ్వు తగ్గడానికి... ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి.ఎల్డీఎల్ అనే చెడు కొవ్వులు.. డెసీలీటర్‌కు 70 మిల్లీగ్రాములకు మించకూడదు. ఎంత తక్కువ గా ఉంటే అంత మంచిది. ∙మధుమేహం ఉన్నవాళ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధాలు తీసుకోవడం తప్పనిసరి. ►మంచి కొలెస్ట్రాల్ డెసిలీటర్కు 40 మిల్లీగ్రాములు ఉండేలా చూసుకోవాలి. ∙ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్తపడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ►తిండిని అదుపులో ఉంచుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే.? శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తపోటు, ఊబకాయం, గుండె పోటు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పులు, కిడ్నీ, మెదడుకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి. అన్ని విషయాల్లో మంచి, చెడూ ఉన్నట్లే.. కొవ్వుల్లోనూ మనకు మేలు చేసేవి, చెడు చేసేవి ఉన్నాయి. చెడు కొవ్వుల్ని ఎల్డీఎల్(ఔఈఔ) అని, మంచి కొవ్వుల్ని హెచ్‌డీఎల్(ఏఈఔ) అని పిలుస్తారు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా/అదుపులో ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. -
Winter Heart Attacks: అందుకే శీతాకాలంలో హార్ట్ అటాక్స్ అధికంగా సంభవిస్తాయి..!
Why do heart attacks become common during winters? ప్రస్తుత కాలంలో గుండెపోటు కూడా అత్యంత సాధారణ మరణాల్లో ఒకటిగా చేరిపోయింది. ఒకప్పుడు 50 యేళ్లు దాటిన వారికి వచ్చే హార్ట్ అటాక్.. ఇప్పుడు 20, 30, 40 ఏళ్ల వారికి కూడా వస్తున్నాయి. అందుకు అనేకానేక కారణాలతోపాటు కాలానుగుణ మార్పులు కూడా మీ హృదయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా శీతాకాల వాతావరణం తరచుగా గుండెపోటులు రావడానికి కారణమౌతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ కాలంలో కేవలం శ్వాసకోశ వ్యాధులు మాత్రమేకాకుండా గుండె జబ్బుల ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు హఠాత్తుగా తగ్గడం వల్ల ఆకస్మిక గుండెపోటులు సంభవిస్తాయట. కాబట్టి ఇతర సీజన్ల కంటే చలికాలం మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. చలికాలంలో గుండెపోటు సంభవించడానికి గల ప్రధాన కారణాలు శీతాకాలంలోనే ఎందుకు గుండెపోటు ప్రమాదాలు అధికంగా సంభవిస్తున్నాయనేదానికి ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. చాలా మంది నిపుణులు గుండెపోటులు పెరగడానికి శరీర ఉష్ణోగ్రత కూడా ఒక కారణమనని అంటున్నారు. ఉష్ణోగ్రతల తగ్గుదల గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అందుకే చలికాలంలో స్ట్రోకులు, ఆకస్మికంగా గుండె ఆగిపోవడం, గుండె సమస్యలు, అరిథ్మియా.. వంటి రుగ్మతలు సంభవిస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. చలికాలంలో శరీరం నాడీ వ్యవస్థ క్రియాశీలతలో మార్పులు చోటుచేసుకోవటం వల్ల, రక్త నాళాలను కుచించుకుపోతాయి. దీనిని ‘వాసోకన్స్ట్రిక్షన్’ అని పిలుస్తారు. ఇది జరిగినప్పుడు రక్తపోటు స్థాయి పెరిగడంవల్ల, శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని పంప్ చేయడంలో గుండె ఎక్కువగా కష్టపడి పని చేస్తుంది. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు, శరీరం వేడిని నియంత్రించడానికి గుండె రెట్టింపు కష్టపడాల్సి ఉంటుంది. ఇది గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది. గుండెపోటు సమస్యలున్నవారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో శరీరానికి ఆక్సిజన్ అవసరాలు కూడా పెరుగుతాయి. రక్తనాళాల సంకోచం వల్ల, తక్కువ మొత్తంలో ఆక్సిజన్ గుండెకు చేరుతుంది. ఇది గుండెపోటుకు ఆస్కారన్నిస్తుంది. ఈ జాగ్రత్తలు పాటించారంటే మీ హృదయ ఆరోగ్యం పదిలంగా.. ►ఈ కాలంలో శారీరకంగా చురుకుగా లేకపోవడం కూడా ఒక కారణమే. తేలికపాటి వ్యాయామాలు చేయడం మరచిపోకూడదు. ►కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ధమనులపై ప్రభావం పడి గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ►మధుమేహం, బీపీ ఇతర సమస్యలున్నవారు తరచూ స్థాయిలను తనిఖీ చేసుకుంటూ ఉండాలి. ►మద్యం, పొగాకు వినియోగాన్ని తగ్గించాలి. ►ఏదైనా చికాకు, ఛాతీలో భారం, చెమట, భుజం నొప్పి, దవడ నొప్పి, తల తిరగడం, వికారం వంటి వాటిని తేలికగా తీసుకోకూడదు. వెంటనే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. చదవండి: World's Largest Cemetery: ఇది నగరంలోని శ్మశానం కాదు.. శ్మశానమే ఓ మహానగరంగా! ఎక్కడుందో తెలుసా? -
కొలెస్ట్రాల్ ఒంటికి హాని చేస్తుందా?
కొలెస్ట్రాల్ అనగానే అది హానికరమనే విధంగా నే చెప్పుకుంటూ ఉంటాం. కానీ కొలెస్ట్రాల్‌లో మంచి, చెడు ఉంటాయి. అది చెడు కొలెస్ట్రాల్ అయినా, మంచి కొలెస్ట్రాల్ అయినా ఉండాల్సిన పాళ్లలో ఉండాలి. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్ అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్డిఎల్ అంటారు. వున శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులను రక్త పరీక్ష ద్వారా కనుక్కోవచ్చు. 12 గంటలపాటు ఏమీ తినకుండా ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరీక్షలో మన ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్), హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) మోతాదులు తెలుస్తాయి. ఎల్డీఎల్ ఎక్కువగా ఉంటే ధమనుల్లో కొవ్వు చేరి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎల్‌డీఎల్‌ను ‘‘చెడు కొలెస్ట్రాల్’’ అని అంటారు. కానీ హెచ్‌డీఎల్ రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. అందుకే హెడీఎల్ ను ‘‘వుంచి కొలెస్ట్రాల్’’ అని అంటారు. మన శరీరంలో ఎప్పుడు హెచ్‌డీఎల్ ఎక్కువగా, ఎల్డీఎల్ తక్కువగా ఉండాలి. గుడ్డులోని తెల్లసొన లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. పచ్చ సొనలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి తెల్లసొన తీసుకుని, పచ్చసొనను తగ్గించాల్సిందిగా డాక్టర్లు, ఆహారనిపుణులు చెబుతుంటారు. ఒకవేళ చెడు కొలెస్ట్రాల్ అంతగా లేనివారు మొత్తం గుడ్డును తినేయవచ్చు. కొలెస్ట్రాల్ కూడా ఉండాల్సిన మోతాదులో శరీరానికి అందాలి. అయితే అది తన మోతాదుకు మించకుండా చూసుకోవాలి. మంచి జీవనశైలితో మంచి ఆహార అలవాట్లతో సరైన వ్యాయామంతో చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో పెట్టుకోవచ్చు. -
కొలెస్ట్రాల్ మందులు వాడుతున్నారా?
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు దాన్ని తగ్గించే మందులను వాడుతూ ఉంటే... డాక్టర్‌ను సంప్రదించకుండా వాటిని మానకూడదు. నిజానికి కొలెస్ట్రాల్ ప్రధానంగా రెండు రకాలు. గుండెకు హాని చేసే కొలెస్ట్రాల్‌ను ఎల్డీఎల్ (లో డెన్సిటీ లిపోప్రొటీన్) అనీ, మేలు చేసేదాన్ని హెచ్‌డీఎల్ (హై డెన్సీటీ లైపోప్రొటీన్) అని అంటారు. మన రక్తంలో ఎల్డీఎల్ 100 కంటే తక్కువగానూ, హెచ్‌డీఎల్ 40 కంటే ఎక్కువగానూ ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వులు 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరానికి రెండు రకాలుగా అందుతుంది. మొదటిది ఆహారం ద్వారా, రెండోది కాలేయం పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు శరీరంలో 70 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు, నరాల వ్యవస్థ ఇలా శిశువు పూర్తిగా ఎదగడానికి రెండేళ్ల వయసు వచ్చే వరకు కొలెస్త్రాల్ ఎక్కువ మోతాదులో అవసరమవుతుంది. రెండేళ్ల తర్వాత దీని అవసరం అంతగా ఉండదు.(చదవండి: పేల బాధ తగ్గాలంటే.. ) అయితే వ్యక్తుల్లోని జన్యుతత్వాన్ని బట్టి కూడా మంచి, చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తి ఎక్కువ / తక్కువగా అవుతుంటుంది. మనుషులు మాంసాహారం, దాంతోపాటు వేపుళ్లు, బేకరీ పదార్థాలు, నెయ్యిలాంటి వాటిని పరిమితి కంటే మించి ఎక్కువగా తీసుకుంటే ఆ ఆహారం కాస్తా కొవ్వుగా మారుతుంది. అది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. ముందుగా చెప్పినట్టు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, దాన్ని పరిమితిలో ఉంచుకోడానికి మందులు వాడుతుంటే, వాటిని మధ్యలో ఎట్టిపరిస్థితుల్లోనూ మానేయకూడదు. ఇక ఆహారంలో మాంసాహారం బాగా తగ్గించాలి. నాన్‌వెజ్‌లో కొవ్వులు తక్కువగా ఉండే చికెన్, చేపలు మంచిది. ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవడం మేలు. -
కొవ్వును కరిగించే కొత్త మందు!
సాక్షి, హైదరాబాద్ : రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను ఉన్నపణంగా తగ్గించేందుకు ఓ కొత్త మందు రాబోతోంది. ఎవినాకుమాబ్ అనే మందుపై ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయి.. శరీరానికి కొలెస్ట్రాల్ అవసరమైనప్పటికీ.. అందులో హెచ్‌డీఎల్ అనే మంచి కొలెస్ట్రాల్, ఎల్డీఎల్ అనే చెడు కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. రక్తంలో ఎల్డీఎల్ ఎక్కువైతే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు మెండు. ప్రస్తుతం ఈ సమస్యను నివారించేందుకు చిన్నపేగులు శోషించుకునే కొలెస్ట్రాల్ మోతాదును నియంత్రించే స్టాటిన్లు, రెండు ఇతర మందులను ఉపయోగిస్తున్నారు. అయితే చాలామంది రోగుల్లో ఈ చికిత్సతోనూ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాము ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌ను సగం చేసే ఎవినాకుమాబ్ను అభివృద్ధి చేశామని, ఇది ఇప్పటికే రెండో దశ ప్రయోగాలను కూడా పూర్తి చేసుకుందని అమెరికాకు చెందిన డాక్టర్ రాబర్ట్ రోసెన్సన్ వెల్లడించారు. ఎవినాకుమాబ్పై తాము 272 మందిపై ప్రయోగించామని, 16 వారాల తర్వాత జరిపిన పరిశీలనల్లో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ దాదాపు 56% వరకు తగ్గినట్లు తేలిందని ఆయన వివరించారు. చర్మం అడుగు భాగం నుంచి వారానికోసారి 450 మిల్లీ గ్రాముల మందు ఇచ్చిన వారిలో ఈ తేడా కనిపించగా, వారంలో ఒకసారి రక్తం ద్వారా 300 మిల్లీగ్రాముల మందు తీసుకున్న వారిలో 52.9 శాతం తగ్గుదల నమోదైందని ప్రయోగాల్లో స్పష్టమైంది. శరీర బరువు ప్రతి కిలోకు కనిష్టంగా ఐదు మిల్లీగ్రాముల చొప్పున మందు అందించినా కొవ్వులో తగ్గుదల 24.2 శాతం వరకూ ఉందని తెలిసింది. ఎవినాకుమాబ్ తీసుకున్న వారిలో దుష్ప్రభావాలూ తక్కువేనని రోసెన్సన్ తెలిపారు. ప్రస్తుతం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ మందుకు ఆమోదం తెలపాలా? వద్దా? అన్న దానిని పరిశీలిస్తోంది. రేడియో తరంగాలతో కీళ్ల నొప్పులు మాయం! సాక్షి, హైదరాబాద్: కీళ్ల నొప్పుల బాధ వర్ణనాతీతమనే చెప్పాలి.. మందులు వాడినంత సమయం బాగానే ఉంటుంది గానీ.. మానేసిన వెంటనే మళ్లీ నొప్పి ప్రాణాలు తీసేస్తుంది. అయితే తక్కువ సామర్థ్యమున్న రేడియో తరంగాలు ఈ సమస్యను తీరుస్తాయని అంటున్నారు జపాన్‌కు చెందిన ఎమోరీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.ఫెలిక్స్ గోంజాల్వెజ్.. తాము జరిపిన పరీక్షల్లో ఈ రేడియో తరంగాలు ఎక్కువ సమయం కీళ్ల నొప్పులను తగ్గించినట్లు తేలిందని ఆయన చెబుతున్నారు. సాధారణంగా వాడే మందులు, ఇంజెక్షన్లకు శరీరం కొంతకాలం తర్వాత అలవాటు పడిపోతుందని, అందువల్ల వాటితో ఫలితం తక్కువగా ఉంటుందని ఫెలిక్స్ చెబుతున్నారు. కార్టికో స్టెరాయిడ్లతో కూడిన ఇంజెక్షన్ మొదటిసారి ఆరు నెలల వరకూ ప్రభావం చూపితే, రెండోది మూడు నెలల కంటే ఎక్కువ సమయం పనిచేయదని.. ఇక మూడోది నెల వరకే ప్రభావం చూపుతుందని వివరించారు. ఈ నేపథ్యంలోనే తాము ప్రత్యామ్నాయ చికిత్స పద్ధతుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టామని, సమస్యలున్న కీళ్ల వద్ద సూదులు చొప్పించి తక్కువ స్థాయి రేడియో తరంగాలను పంపడం ద్వారా అక్కడి నాడులను ఉత్తేజపరిస్తే మంచి ఫలితాలు ఉన్నట్లు తెలిసిందని వివరించారు. ఈ పద్ధతిలో నొప్పి తాలూకూ సంకేతాలు మెదడుకు చేరే వేగం తగ్గుతుందన్నారు. గతేడాది తాము ఈ పద్ధతిని కొంతమందిపై విజయవంతంగా పరీక్షించామని అప్పట్లో మోకాలిపై ప్రయోగాలు జరిగితే ప్రస్తుతం భుజాలు, తుంటి ప్రాంతంలోని కీళ్లపై జరుగుతున్నట్లు వెల్లడించారు. మూడు నెలల పాటు 23 మందిపై ప్రయోగాలు జరగ్గా చాలామందిలో మంచి ఫలితాలు కనిపించాయని ఫెలిక్స్ తెలిపారు. -
‘ఆ మందులతో ఎలాంటి ప్రయోజనం లేదు’
సాక్షి, న్యూఢిల్లీ: గుండెపోటు నివారణకు ‘స్టాటిన్’ ట్యాబ్లెట్లను బ్రిటన్‌లోనే కాకుండా భారత్‌లో ప్రజలు ఎక్కువగా వాడుతున్నారు. స్టాటిన్స్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ఎల్‌డీఎల్‌ను తగ్గించడం వల్ల గుండెపోటు రాకుండా అండుకోగలుగుతుందన్న విశ్వాసమే ఈ మందులను ఎక్కువగా వాడడానికి కారణం. కానీ వాస్తవానికి హృద్రోగులు స్టాటిన్స్ తీసుకోవడం వల్ల పెద్ద ప్రయోజనమేమి కనిపించడం లేదని ‘బ్రిటిష్ మెడికల్ జర్నల్’ తాజా సంచికలో పేర్కొంది. హృద్రోగులపై స్టాటిన్స్ ప్రభావానికి సంబంధించి ఇంతకుముందు నిర్వహించిన 35 అధ్యయనాలను విశ్లేషించడం ద్వారా ఓ వైద్య బృందం ఈ అభిప్రాయానికి వచ్చింది. (చదవండి: టిక్‌టాక్ విక్రయం : చైనా వార్నింగ్?) స్టాటిన్స్‌ను వాడిన వారిలో మూడొంతుల మంది గుండెపోటు వల్ల మరణించారని, సగానికి సగం మంది రోగుల్లో స్టాటిన్స్ గుండెపోటు ప్రమాదాన్ని ఏమాత్రం తగ్గించలేక పోయాయని వైద్య బృందం పేర్కొంది. స్టాటిన్స్ ప్రభావంపై తాజాగా అధ్యయనాలు జరపకుండానే, పాత అధ్యయనాలను సరిగ్గా విశ్లేషించకుండానే వైద్యులు సంప్రదాయబద్ధంగా ఇప్పటికీ స్టాటిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారని వైద్య బృందం అభిప్రాయాలను క్రోడీకరించిన డాక్టర్ రాబర్ట్ డ్యూబ్రాఫ్ తెలిపారు. ఆయన ‘యూనివర్శిటీ ఆఫ్ న్యూమెక్సికో స్కూల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. (ఫ్లూ టీకాతో ఆ రెండు జబ్బులు తగ్గుదల..) -
కాకరతో 10 అద్భుత ప్రయోజనాలు..
కాకరకాయను తలచుకోగానో దీని చేదు స్వభావం ముందుగా కళ్ల ముందు కదలాడుతుంది. చేదుగా ఉంటే కాకరను ఎలా తింటాంరా బాబూ అని చాలా మంది దూరం పెడుతుంటారు. అయితే కొంతమందికి మాత్రం కాకరకాయ పిచ్చిపిచ్చిగా నచ్చుతుంది. రోజువారీ ఆహారం కాకరను తప్పనిసరిగా వినియోగిస్తారు. రుచికి చేదు అయినా ఆరోగ్యానికి అమృతం లాంటింది. ఎంతో మందికి కాకర వల్ల కలిగే ప్రయోజనాలు తెలియవు. దానిలో ఉండే పోషక విలువలు తెలిస్తే ఇక వదులుకోరు. కాకర ఆస్తమా, జలుబు, దగ్గు వంటి మొదలైన శ్వాస సంబంధిత సమస్యల నివారణకు అద్భుతవమైన ఔషధంగా పనిచేస్తుంది. కాకర జ్యూస్ తాగితే లివర్ సమస్యలు తగ్గుతాయి. న్యూట్రిషన్ విలువలు ► మొత్త కాలరీలు-16 ►ఆహార ఫైబర్ - 2.6 గ్రా ►కార్బోహైడ్రేట్లు - 3.4 గ్రా ►కొవ్వులు - 158 మి.గ్రా ►నీటి శాతం - 87.4 గ్రా ►ప్రోటీన్ - 930 మి.గ్రా అసలు మనిషి ఆరోగ్యానికి కాకరకాయ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయంలో అనేక క్లినికల్ అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనాలలో దీనిని తినడం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని వెల్లడైంది. మనలో చాలా మంది కాకరను రుచి కారణంగా తినడానికి పెద్దగా ఆసక్తి చూపకపోయినా, సమృద్ధిగా ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్న తర్వాత, మీరు బహుశా మీ ఆలోచనను మార్చుకోవచ్చు. దీనితో కడుపు నొప్పి, మధుమేహం, కాన్యర్, గుండె జబ్బులు వంటి సర్వ రోగాలకు నివారిణిగా పనిచేస్తుంది. ఎంతో మేలు చేస్తుంది. 1.మలబద్దకం, జీర్ణాశయం వ్యాధులు నివారణ కాకరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది మలబద్ధకం, కడుపు నొప్పి వంటి పేగు రుగ్మతలను నయం చేయడమే కాకుండా, జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించే పరాన్నజీవులను చంపడానికి సహాయపడుతుంది. అంతేకాక ఇది యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించడానికి, జీర్ణక్రియకు ఉపకరిస్తుంది.అధిక ఫైబర్ ఉంన్నందు వల్ల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాకరను వైద్యులు సిఫార్సు చేస్తారు. 2. డయాబెటిస్ కాకర డయాబెటిస్ నిర్వహణకు సహాయపడుతుంది. డయాబెటిస్తో బాధపడుతున్న ఎవరికైనా దీనిని తరచుగా తీసుకోవాలని సూచిస్తారు. ఇందులో యాంటీ-డయాబెటిక్ లక్షణాలతో కూడిన మూడు క్రియాశీల పదార్థాలు ఉన్నాయి. అవి పాలీపెప్టైడ్-పి, వైసిన్, చరణి. ఇవి ఇన్సులిన్ లాంటి లక్షణాలు కలిగి రక్తంలో గ్లూకోజ్ విలువలను తగ్గించే ప్రభావాలను కలిగి ఉంటాయని నిర్ధారణ జరిగింది. రక్తంలో షుగర్ లెవల్స్‌లను తగ్గించడంలో చురుకుగా పనిచేస్తాయి. అంతేకాక కాకరలో లెక్టిన్ ఉందని, ఇది ఆకలిని అణచివేయడం,పరిధీయ కణజాలాలపై పనిచేయడం ద్వారా శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ ఉదయం కాకర జ్యూస్‌ను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మీ డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. దీనిలో పీచు లక్షణాలు అధికంగా కలిగిఉండడం వల్ల తేలికగా అరుగుతుంది. ఈ ఆహారం అరుగుదలకు, మలబద్ధకం, అజీర్తి సమస్యల నివారణలో సహాయపడి శరీరం నుండి చెత్తను తొలగిస్తుంది. 3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాకరలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. మానవ శరీరానికి యాంటీఆక్సిడెంట్లు అవసరం. ఇది రోగనిరోధక కణాలు,తెల్ల రక్త కణాలు (డబ్ల్యూసీ) పెంచడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, అలెర్జీని నివారించడంలో సహాయపడుతుంది. కాకర కాయలు, ఆకులను నీటిలో ఉడకించి తీసుకోవడం వల్ల అంటు రోగాలు దరిచేరకుండా ఉంటాయి. 4. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది కాకరకు గల యాంటీమైక్రోబయల్, యాటీఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలోని చెత్తను తొలగించడంలో సహాయపడతాయి. అంతేకాక ఇది మీ కాలేయంలో స్థిరపడిన అన్ని రకాల మత్తులను తుడిచిపెట్టడానికి దోహదపడుతుంది. అందువల్ల ఇది అనేక కాలేయ సమస్యలను నయం చేస్తుంది. అలాగే మీ పేగును శుభ్రపరుస్తుంది. ఇది మూత్రాశయం సరైన పనితీరుకు సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు హ్యాంగోవర్ అయితే, చేదుకాయ రసం తీసుకోవడం వల్ల మన శరీరం నుంచి ఆల్కహాల్ మత్తును తగ్గించి చురుకుగా ఉంటారు. 5. క్యాన్సర్ నుండి రక్షింస్తుంది. ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం. అవి మన శరీరం పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. నిందుకు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ లేకుండా చూసుకోవాలి. ఫ్రీ రాడికల్స్.. ధూమపానం, కాలుష్యం,ఒత్తిడితో అధికంగా పెరుగుతుంది. కావున కారలో లైకోపీన్, లిగ్నన్స్, కెరోటినాయిడ్లు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో విటమిన్ ఎ, జియా-శాంథిన్,లుటిన్ ఉన్నాయి. ఇవి ప్రాధమిక యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. దీంతో చివరకి మన శరీరంలో కణితులు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. 6. కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. అధిక స్థాయిలో కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ధమనులలో కొవ్వు ఫలకం ఏర్పడుతుంది, ఇది గుండె రక్తాన్ని పంప్ చేయడానికి కష్టపడి పనిచేస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాకర చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. పుష్టి ఆరోగ్యానికి తోడ్పడటానికి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కాకరలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అధిక మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ గుండెపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. 7. అధిక బరువును తగ్గిస్తుంది. కాకరలో గొప్ప పోషకాలు ఉండటం వల్లగా బరువు తగ్గించే ఆహారంగా సహకరిస్తుంది. 100 గ్రాముల కాకరలో 16 కేలరీలు, 0.15 గ్రాముల కొవ్వు, 0.93 గ్రాముల ప్రోటీన్, 2.6 గ్రాముల ఫైబర్ మాత్రమే ఉంటాయి. అందువల్ల, మన బరువుకు అదనపు పౌండ్లను జోడించకుండా తగ్గిస్తుంది. పోషకాలు జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. జంక్, అనారోగ్యకరమైన స్నాక్స్ మీద ఆధారపడకుండా చేస్తుంది. కాకర రసం తాగడం ద్వారా ఉబకాయం తగ్గుముఖం పడుతుంది. కాకరలో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, మంచి ప్రోటీన్, ఫైబర్ ఉన్నాయి. ఇవన్నీ మిమ్మల్ని రోజంతా ఉల్లాసంగా ఉంచుతాయి. 8. జుట్టుకు మెరుపు అందిస్తుంది. కాకర జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు మంచి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దీనిలో ప్రోటీన్, జింక్.విటమిన్ సి వంటి భాగాలు జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. జుట్టుకు కాకర జ్యూస్‌ను రాయడం వల్ల మూలాలు బలోపేతం అవుతాయి. స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు చికిత్స అందుతుంది. ఇది జుట్లును షైన్‌గా ఉండటంలో సహాయపడుతుంది. 9. చర్మాన్ని అందంగా చేస్తుంది మొటిమలు, మచ్చలు, చర్మ అంటు వ్యాదులను తొలగిస్తుంది. నిమ్మరసంతో కాకరను ప్రతిరోజు పరగడుపున 6 నెలలు తీసుకుంటే సరైన ఫలితాలు పొందుతారు. చర్మాన్ని ముడతలు లేకుండా ఉంచడంలో, అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మం సున్నితత్వానికి కారణమవుతుంది. ఇంకా సోరియాసిస్ , తామర చికిత్సకు సహాయపడుతుంది.సూర్యుడి నుంచి హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. 10. కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది కంటి చూపు, కంటిశుక్లం వంటి దృష్టి సంబంధిత సమస్యలను నివారించడంలో కాకర సహాయపడుతుందని వైద్యులు, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిలో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ నిండి ఉంటాయి. ఇవి కళ్ళకు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాక కళ్ల కింద నల్లడి వలయాలను తగ్గించేందుకు మంచి నివారణగా ఉపకరిస్తుంది. -
ఆఫ్టరాల్ కాదు.. ఇది కొలెస్టరాల్!
సాక్షి, హైదరాబాద్: ఆసియాలోని పలు దేశాల్లో గుండెకు హాని కలిగించే కొలెస్టరాల్ పెరుగుతున్నట్లు అంతర్జాతీయ అధ్యయనం స్పష్టం చేసింది. ఇదే సమయంలో పాశ్చాత్య దేశాల్లో రక్తంలోని కొలెస్టరాల్ తగ్గుతోందని, భారత్‌లో మాత్రం పెద్దగా మార్పులేదని ఈ అధ్యయనంలో భాగం వహించిన జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) సీనియర్ శాస్త్రవేత్త ఆవుల లక్ష్మయ్య తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో రక్తంలోని కొలెస్టరాల్పై జరిగిన అతిపెద్ద అధ్యయనం ఇదేనని, లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది పరిశోధకు లు పాల్గొన్నారన్నారు. దాదాపు 200 దేశాల్లోని సుమారు 10 కోట్ల మందిని పరిశీలించి మరీ శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారని వివరించారు. 1980 నుంచి 39 ఏళ్ల పాటు ఈ పరిశీలనలు జరిపారన్నారు. కొలెస్టరాల్ కారణంగా ఏటా సుమారు 39 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని.. ఈ నేపథ్యంలో వెల్కమ్ ట్రస్ట్, బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్లు నిధులు సమకూర్చాయని ఎన్ఐఎన్ డైరెక్టర్ ఆర్.హేమలత ఓ ప్రకటనలో తెలిపారు. చెడు కొవ్వుతోనే సమస్య.. ఒక రకమైన కొవ్వు పదార్థం ఆరోగ్యకరమైన క ణాల తయారీకి అవసరం. అయితే అవసరానికి మించి ఎక్కువైతే రక్తనాళాల్లో పేరుకుపోయి గుండెపోటుకు కారణమవుతుంది. హైడెన్సిటీ లి పోప్రొటీన్ (హెచ్‌డీఎల్) లేదా మంచి కొలెస్టరాల్ గుండెజబ్బులు, పోటు నుంచి రక్షణ కల్పిస్తుంది. అధికాదాయ దేశాల్లో హెచ్ డీఎల్ కొలెస్టరాల్ కాకుండా ఇతర రకాల కొలెస్టరాల్ మో తాదు క్రమేపీ తగ్గుతుండగా.. అల్ప, మధ్య ఆదా య దేశాల్లో ఎక్కువ అవుతోందని ఈ కొత్త అధ్యయనం చెబుతోంది. 1980 ప్రాంతం లో పాశ్చాత్య దేశాల్లో హెచ్ డీఎల్యేతర కొలెస్టరాల్ అత్యధికంగా ఉండగా, తొలిసారి ఇతర దేశాల్లో ఆ పరిస్థితి నమోదవు తోందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మాజి ద్ ఎజ్జాటి తెలిపారు. చెడు కొలెస్టరాల్ విషయంలో భారత్ ప్రపంచదే శాల జాబితాలో 128వ స్థానంలో గత 39 ఏళ్లుగా కొనసాగుతోందని లక్ష్మయ్య తెలిపా రు. అయితే మహిళల విషయంలో మాత్రం ఒక ర్యాంకు పెరిగి 140కి చేరిందన్నారు. -
ట్రైగ్లిజరైడ్స్‌తో జాగ్రత్త
మనం ఇటీవల చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి వాటి గురించి తరచూ వింటూ ఉంటాం. అవెంతో హాని చేస్తాయన్న విషయం మనలో చాలామందికి తెలిసిందే. అసలు ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏమిటి, అవి ఎందుకు హాని కలిగిస్తాయన్న విషయాలను తెలుసుకుందాం. ట్రైగ్లిజరైడ్స్ అనేవి వున శరీరంలోనూ, ఆహారపదార్థాల్లోనూ ఉండే ఒక రకం కొవ్వు వంటి జీవరసాయన పదార్థాలు. అవి కొలెస్ట్రాల్ లాగానే రక్తంలో ప్రవహిస్తుంటాయి. మనం తీసుకునే కొవ్వులు, చక్కెరల నుంచి తయారవతుంటాయి. మనం తీసుకున్న ఆహారం వెంటనే శక్తిగా వూరకపోతే అది ట్రైగ్లిజరైడ్స్‌గా వూరి కొవ్వు కణాల్లో నిల్వ అవుతుంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటే... రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్న కండిషన్‌ను ‘హైపర్ ట్రైగ్లిజరైడెమియా’ అని అంటారు. రక్తంలో వీటి పాళ్లు పెరిగితే అది గుండెజబ్బులకు దారితీయవచ్చు. ఎక్కువగా ఉండటానికి కారణాలు... 1) డయాబెటిస్, 2) థైరాయిడ్ సమస్యలు, 3) చాలా ఎక్కువ మోతాదుల్లో ఆల్కహాల్ తీసుకోవడం. రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు రోగిని పై అంశాల విషయంలోనూ పరీక్షించాలి. మోతాదులను తెలుసుకోవడమిలా... ద నేషనల్ కొలెస్ట్రాల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వూర్గదర్శకాల ప్రకారం పరగడపున చేసిన రక్తపరీక్షలో కనుగొనే ట్రైగ్లిజరైడ్ మోతాదులను కింది విధంగా వర్గీకరించారు. 150 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉంటే... అది నార్మల్. 150 – 199 ఎంజీ/డీఎల్ ఉంటే కొంతవరకు పరవాలేదు (బార్డర్‌లైన్). 200 – 499 ఎంజీ/డీఎల్ ఉంటే... ఎక్కువ. 500 ఎంజీ/డీఎల్ అంతకు మించి ఉంటే... చాలా ఎక్కువ పాటించాల్సిన ఆహార నియవూలు... ►హైపర్ ట్రైగ్లిజరైడెమియా ఉన్నప్పుడు జీవన సరళిలో వూర్పులు తెచ్చుకొని ఆహార నియమాలు పాటించాలి. ►ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా బరువు ఉంటే శరీర బరువు సాధారణస్థాయికి వచ్చేలా ఆహారంలో క్యాలరీలు తగ్గించుకోవాలి. అంటే.. కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఆల్కహాల్... ఇలా అన్ని పదార్థాల నుంచి మీ శరీరంలోకి వచ్చే క్యాలరీలను తగ్గించుకోవాలి. ►ఆహారంలో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్‌ను బాగా తగ్గించాలి. అంటే... నెయ్యి, వెన్న, వనస్పతి, వూంసాహారాలైన రొయ్యలు, వూంసం, చికెన్ స్కిన్, డీప్‌గా వేయించిన వేపుళ్లను తగ్గించాలి. ఆల్కహాల్ పూర్తిగా వూనేయాలి. ►తాజాపళ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్‌లో పీచు ఎక్కువగా ఉండి... ట్రైగ్లిజరైడ్స్ పాళ్లను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. వెజిటబుల్ సలాడ్స్, తేలిగ్గా ఉడికించిన కాయగూరలు తీసుకోవాలి. ►స్వీట్స్, బేకరీ ఐటమ్స్ లాంటి రిఫైన్డ్ ఫుడ్స్ తగ్గించాలి. పొట్టుతీయని తృణధాన్యాలు అంటే... దంపుడుబియ్యం, మెుక్కజొన్న, పొట్టుతీయని రాగులు, గోధువులు, ఓట్స్, పొట్టుతీయని పప్పుధాన్యాలు, మెులకెత్తిన గింజలు (స్ప్రౌట్స్) తీసుకోవాలి. ►ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రవు / వాకింగ్ వంటి వ్యాయావూలు చేయాలి. మీ ఎత్తుకు తగిన బరువ# ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ►కనీసం వారంలో వుూడుసార్లు చేపలు... అవి కూడా కేవలం ఉడికించిన గ్రిల్డ్ ఫిష్ వూత్రమే తీసుకోవాలి. ►పొగతాగడం పూర్తిగా వూనేయాలి. శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పాళ్లు పెరిగినప్పుడు డాక్టర్లు చెప్పిన వుందులు వాడుతున్నా ఆహార నియవూలు పాటించడం తప్పనిసరి. మీ ఫిజీషియన్/కార్డియాలజిస్ట్ / న్యూట్రిషనిస్ట్ చెప్పే సూచనలు తప్పక పాటించండి. డాక్టర్ డి. మీరాజీ రావు, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ కాంటినెంటల్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
కుశల వర్ణాలు
ఎన్నెన్నో వర్ణాలతో కూడిన మన ప్రపంచం చాలా అందమైనది. ఈ లోకం అందాలను భావుకతతో ఆస్వాదించడానికీ మన ఆరోగ్యమూ బాగుండాలి. అందుకోసమేనేమో... ఆరోగ్యం బాగుండటాన్ని ఇంగ్లిష్‌లో అందంగా ‘ఇన్ ద పింక్ ఆఫ్ .... హెల్త్’ అంటూ చెబుతుంటారు. మన ఆరోగ్యాన్ని వర్ణమయం చేసుకోడానికి ఏయే రంగుల ఆహారాలు ఉపకరిస్తాయో చూద్దాం. క్యాన్సర్నివారణకు నారింజ రంగు ఈ రంగు ఆహారపదార్థాలు గుండెకు మేలు చేస్తాయి. తమలోని విటమిన్–సి తో వ్యాధి నిరోధకతను పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లతో క్యాన్సర్లనుంచి రక్షణతో పాటు చాలాకాలం పాటు యౌవనంగా ఉండేలా చేస్తాయి. అందం మెరుగుదల పసుపుపచ్చ గుండెకు మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తాయి. మన మేనిలో మంచి నిగారింపు వచ్చేలా చూస్తాయి. కంటిచూపును కాపాడతాయి. వ్యాధి నిరోధకత తెలుపు తెల్లరంగులో ఉండే ఆహారాలు మనలో రోగనిరోధకత బలంగా ఉండేలా చూస్తాయి. పెద్ద పేగును ఆరోగ్యంగా ఉంచుతాయి. అల్సర్స్‌ను నివారిస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. చాలాకాలం యౌవనంగా... పర్పుల్ గుండెకు ఎంతో మంచివి. రక్తనాళాలను శుభ్రం చేసి, వాటిల్లో రక్తప్రవాహం సాఫీగా జరిగేలా చూస్తాయి. వయసు పెరిగే ప్రక్రియను మందగింపజేస్తాయి. మూత్రవిసర్జన వ్యవస్థను ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. విషాలను తొలగించడానికి ఆకుపచ్చ ఆకుపచ్చగా ఉండే ఆహారాలు ఎముకలను బలంగా ఉంచుతాయి. చూపును పదికాలాలపాటు పదిలంగా ఉంచుతాయి, కంటి వ్యాధులను నివారిస్తాయి. వ్యాధి నిరోధకతను పెంచుతాయి. తమలోని పీచుతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుండె ఆరోగ్యానికి ఎరుపు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. మన చర్మానికి ఎంతో మంచివి. క్యాన్సర్లను నివారిస్తాయి. కణాజాల ఆరోగ్యానికి ఎంతో తోడ్పడతాయి. సుజాతా స్టీఫెన్ చీఫ్ న్యూట్రిషనిస్ట్ యశోద హాస్పిటల్స్, మలక్‌పేట, హైదరాబాద్ -
కొవ్వులన్నీ హానికరమేనా?
చాలా మంది కొవ్వులను హాని చేసే ఆహారపదార్థంగా చూస్తారు. నూనెలతో చేసిన పదార్థాలంటేనే చాలు... ఆమడ దూరం పరిగెడుతుంటారు. నూనెను ఉపయోగించాల్సి వస్తే... కొలెస్ట్రాల్ ఫ్రీ ఆయిల్‌ను వాడుతుంటారు. నిజానికి వెజిటబుల్ కింగ్‌డమ్‌లోని మొక్కల నుంచి కొలెస్ట్రాల్ ఎంతమాత్రమూ తయారుకాదు. మనం వాడే నూనెలన్నీ మొక్కల గింజల నుంచే వస్తాయి కాబట్టి అవన్నీ కొలెస్ట్రాల్ లేనివే. కొవ్వుల గురించి తెలుసుకుందాం... మన ఆహారంలో కొవ్వులు ఎంతగానో అవసరం. ఎందుకంటే 1 గ్రాము కొవ్వు నుంచి 9 క్యాలరీల శక్తి లభిస్తుంది. కొవ్వుల్లో 1) మోనో– అన్‌శాచురేటెడ్, 2) పాలీ–అన్‌శాచ్యురేటెడ్, 3) శాచురేటెడ్, 4) ట్రాన్స్‌ఫ్యాట్... అనే నాలుగు రకాల కొవ్వులు ఉంటాయి. వీటిలో మొదటి మూడురకాల కొవ్వులు పరిమితంగా అవసరమే. మోనో–అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్... వేరుశనగ, ఆలివ్ ఆయిల్ వంటి నూనెల్లో ఉంటాయి. ఇక సఫోలా, పన్ఫ్లవర్, వేరుశనగతోపాటు, అవకాడో వంటి నూనెల్లో పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిలో మోనో–అన్‌శాచురేటెడ్, పాలీ–అన్‌శాచురేటెడ్ నూనెలను మార్చి మార్చి వాడుతూ ఉండటం వల్ల అవి గుండెకు ఒక రక్షణగా పనిచేస్తుంటాయి. నమ్మలేకపోయినా ఇది వాస్తవం. ఇక నెయ్యి, డాల్డా వంటివాటిని శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్‌గా పేర్కొంటాం. వీటిని చాలా చాలా పరిమితంగా మాత్రమే వాడాలి. ఇక చేపలు, చేపనూనె, సోయాబీన్నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనే తరహా ఆరోగ్యకరమైన పాలీ అన్శ్యాచురేటెడ్ కొవ్వులు ఎక్కువ. ఇవి ఎక్కవగా తీసుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. కొవ్వులతో ప్రయోజనాలివి... నూనెల వల్ల ఒంట్లోకి పేరుకునే కొవ్వులు బయటి వేడిమి, చల్లదనం నుంచి ఒంట్లోని అంతర్గతఅవయవాలను కాపాడతాయి. కిడ్నీలు, కాలేయం, గుండె వంటివాటికి ప్యాడింగ్గా ఉండటంతో పాటు షాక్అబ్జార్బర్స్లా కూడా పనిచేస్తాయి. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఉదరంలోని అవయవాల చుట్టూ ఉండే కొవ్వును విసరల్ ఫ్యాట్ అంటారు. ఇది అధికంగా ఉండే గుండెజబ్బులు ఎక్కువగా వస్తాయి. ఇదీ పరిమితి...ఒక థంబ్‌రూల్ నియమం ప్రకారం... ప్రతి ఒక్క వ్యక్తి నెలకు అరలీటర్ (500 ఎమ్ఎల్) నుంచి ముప్పావులీటర్ (750 ఎమ్.ఎల్)కు మించకుండా నూనె వాడటం మంచిది. అంతకంటే మించితే అది చేటు చేస్తుంది. ఆ పరిమితికి మించితే అది స్థూలకాయం, గుండెజబ్బులు, డయాబెటిస్, ఆర్థరైటిస్, అధికరక్తపోటు వంటి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంటుంది. మాంసాహారులు వారానికి కనీసం మూడుసార్లకు తగ్గకుండా చేపలు తినడం మంచిది. ఇక మనకు కనిపించకుండా వాడే కొవ్వులు (ఇన్విజిబుల్ ఫ్యాట్స్)... అంటే నట్స్, డ్రైఫ్రూట్స్, మాంసాహారాలు, పాలు వంటి వాటిల్లో ఉండే కొవ్వులను పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. కొందరు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందంటూ గుడ్ల జోలికే పోరు. కానీ మన ఒంట్లోకి ఆహారంతో వచ్చే కొలెస్ట్రాల్ కేవలం 16% మాత్రమే. మిగతాదంతా మన కాలేయంలోనే తయారవుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్ భయంతో గుడ్లకు దూరంగా ఉంటే ఆరోగ్యానికీ, ప్రోటీన్లకూ దూరంగా ఉన్నట్లే. అందుకే గుడ్లను తప్పనిసరిగా తినాలి. 1990లలో అమెరికన్ గైడ్‌లైన్స్ వల్ల కొవ్వుల వినియోగం బాగా తగ్గి... అదే సమయంలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ల వినియోగం బాగా పెరిగింది. ఈ కార్బోహైడ్రేట్ల వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. దాంతో కొవ్వుల వినియోగం మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ కొవ్వులు మళ్లీ ప్రమాదకరం కాబట్టి... అందుకు బదులుగా ఎక్కువ ప్రోటీన్‌తో పాటు ఎక్కువ పీచుపదార్థాలు ఉండే ఆహారం తీసుకోవడం మేలు. కృత్రిమ కొవ్వులు మాత్రం డేంజరే... ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేసేందుకు మార్జరిన్ వంటి కొవ్వులను ఉపయోగిస్తుంటారు. ఇవే ట్రాన్స్‌ఫ్యాట్స్ అంటూ మనం పిలిచే నాలుగో తరహా కొవ్వులు. వీటిని చాలాకాలం నిల్వ ఉండాల్సిన (షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండాల్సిన) చిప్స్, బేకరీ ఉత్పాదనల్లో వాడుతుంటారు. వాటి నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ దూరంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్, మాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ మాదాపూర్, హైదరాబాద్