ప్రతీకాత్మక చిత్రం
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు దాన్ని తగ్గించే మందులను వాడుతూ ఉంటే... డాక్టర్‌ను సంప్రదించకుండా వాటిని మానకూడదు. నిజానికి కొలెస్ట్రాల్ ప్రధానంగా రెండు రకాలు. గుండెకు హాని చేసే కొలెస్ట్రాల్‌ను ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లిపోప్రొటీన్) అనీ, మేలు చేసేదాన్ని హెచ్‌డీఎల్ (హై డెన్సీటీ లైపోప్రొటీన్) అని అంటారు. మన రక్తంలో ఎల్‌డీఎల్ 100 కంటే తక్కువగానూ, హెచ్‌డీఎల్ 40 కంటే ఎక్కువగానూ ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వులు 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరానికి రెండు రకాలుగా అందుతుంది. మొదటిది ఆహారం ద్వారా, రెండోది కాలేయం పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు శరీరంలో 70 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు, నరాల వ్యవస్థ ఇలా శిశువు పూర్తిగా ఎదగడానికి రెండేళ్ల వయసు వచ్చే వరకు కొలెస్త్రాల్ ఎక్కువ మోతాదులో అవసరమవుతుంది. రెండేళ్ల తర్వాత దీని అవసరం అంతగా ఉండదు.(చదవండి: పేల బాధ తగ్గాలంటే.. )
అయితే వ్యక్తుల్లోని జన్యుతత్వాన్ని బట్టి కూడా మంచి, చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తి ఎక్కువ / తక్కువగా అవుతుంటుంది. మనుషులు మాంసాహారం, దాంతోపాటు వేపుళ్లు, బేకరీ పదార్థాలు, నెయ్యిలాంటి వాటిని పరిమితి కంటే మించి ఎక్కువగా తీసుకుంటే ఆ ఆహారం కాస్తా కొవ్వుగా మారుతుంది. అది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. ముందుగా చెప్పినట్టు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, దాన్ని పరిమితిలో ఉంచుకోడానికి మందులు వాడుతుంటే, వాటిని మధ్యలో ఎట్టిపరిస్థితుల్లోనూ మానేయకూడదు. ఇక ఆహారంలో మాంసాహారం బాగా తగ్గించాలి. నాన్‌వెజ్‌లో కొవ్వులు తక్కువగా ఉండే చికెన్, చేపలు మంచిది. ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవడం మేలు.
Comments
Please login to add a commentAdd a comment