
ఫ్యాట్‌ను లాగేస్తుంది..!
రోజూ టీవీల్లో, పేపర్లలో ‘మా ఆయిల్ వాడితే కొలెస్ట్రాల్ పెరగదు’ అంటూ నూనె కంపెనీల యాడ్లు హోరెత్తిస్తుంటాయి. మనం నిజమేనేమో అనుకుని వాటిని ఇష్టం వచ్చినట్టు పోసేశాం అనుకోండి... ఇక అంతే సంగతులు. ఏ వంటకంలో నూనె వేసినా, అది మనలో ఎంత కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది అనేది అంచనా వేసుకోవాలి. అది మనకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ మన కూరలో నూనె ఎక్కువయ్యిందని తెలిస్తే దాన్ని ఎలా తగ్గించ గలం? అదంతా మన ఒంట్లోకి వెళ్లకుండా ఎలా అడ్డుకోగలం? ఈ ‘ఫ్యాట్ మ్యాగ్నెట్’ ఉంటే అవన్నీ చేయగలం. ఇది మహా షార్‌ప. దీన్ని ఒక్కసారి కూరలోనో చారులోనో పెడితే చాలు... ఎక్కువైన నూనెను చప్పున లాగే స్తుంది.
దాంతో నూనె పైకి తేలు తుంది. అప్పుడు దాన్ని చెంచాతో తీసేయొచ్చు. మటన్ కరీ లాంటి వాటిలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా! దాన్ని కూడా విజయ వంతంగా తీసేస్తుందిది. కాబట్టి మన శరీరంలోకి అనవసరమైన కొవ్వు, నూనె వెళ్లవు. దీన్ని వంటకాల్లో పెట్టే ముందు ఓ అయిదు నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెడితే ఇంకా బాగా పని చేస్తుందని నిపుణులు అంటున్నారు!