కొలెస్ట్రాల్ అనేది మైనంలాంటి పదార్థం. ఇది శరీరం అంతటా ఉంటుంది. కొలెస్ట్రాల్ శరీంలో తీసుకున్న ఆహారం నుండి, శరీరం లోపల నుండి తయారవుతుంది. శరీరంలో తయారయ్యే కొలెస్ట్రాల్ లివర్ నందు తయారవుతుంది. ఆహారం నుండి పొందే కొలెస్ట్రాల్ మనం తీసుకునే పాలు, పాల పదార్థాలు, మాంసాహారం, చేపలు, గుడ్డులోని పచ్చసొన నుండి అందుతుంది.
కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది 1) చెడు కొలెస్ట్రాల్ (LDL) 2) మంచి కొలెస్ట్రాల్ (HDL)
1. LDL కొలెస్ట్రాల్: ఎక్కువగా రక్తంలో ప్రయాణించటం వల్ల గుండెకు, మెదడుకు వెళ్లి ధమనులందు అవరోధం ఏర్పడుతుంది. ఈ విధమైన చెడు కొలెస్ట్రాల్ పేరుకొనటం వల్ల రక్తప్రసరణకు అంతరాయం కలిగి గుండెపోటు వస్తుంది. అదేవిధంగా మెదడుకు సరఫరా అయ్యే రక్తప్రసరణకు అడ్డంకి ఏర్పడి పక్షవాతం ముప్పు ఏర్పడుతుంది.
2. HDL కొలెస్ట్రాల్: ఇది మంచి కొలెస్ట్రాల్. దీనిని పెంచుకోవటం వల్ల అనారోగ్యాలను తప్పించుకోవచ్చు. ఇది శరీరంలో ఉన్న చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
కావున LDL కొలెస్ట్రాల్‌ను 140-150 mg/dl లోపు ఉండాలి.
అదేవిధంగా HDL కొలెస్ట్రాల్ 40-50 mg/dl ఉండేలా చూసుకోవాలి.
శరీరంలో ఉండే కొవ్వును ట్రైగ్లిసరాయిడ్స్ రూపంలో రక్తం ద్వారా శరీర కణజాలానికి చేరవేస్తుంది. ఈ ట్రైగ్లిసరాయిడ్స్ అధికంగా ఉన్న వారికి చెడు కొలెస్ట్రాల్ ... స్థాయి అధికం అవుతుంది. దీనిద్వారా కూడా గుండెపోటు ముప్పు ఏర్పడుతుంది కాబట్టి ట్రైగ్లిసరాయిడ్స్ స్థాయిని శరీరంలో అదుపులో ఉంచుకోవాలి.
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని మనం తగ్గించుకోక పోవటం వల్ల తీవ్రస్థాయి గుండెవ్యాధులు వస్తాయి. ముఖ్యంగా గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుంది. కావున కొలె స్ట్రాల్‌ను వాటి స్థాయులకన్నా తక్కువ మోతాదులో ఉండేలా చూసుకొనే జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఆహార విహారాదులను ఆరోగ్యకరంగా పాటించడం వల్ల కొలెస్ట్రాల్‌ను పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు దానితోబాటు ఆయుర్వేద ఔషధాలు వ్యాధిని తీవ్రతరం చేయకుండా కాపాడతాయి.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
1. వ్యాయామం: నడక వల్ల .... మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెంచవచ్చు.
2. ప్రాణాయామం: 15 నిమిషాల పాటు ప్రాణాయామం చేయటం వల్ల శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ శుభ్రపడుతుంది.
3. నీరు: రోజుకి సగటున 6-8 గ్లాసుల నీరు తీసుకోవాలి.
4. ఆల్కహాల్, మాంసాహార సేవన, సిగరెట్లు మానివేయాలి.
5. బరువును పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదుకల ఆహారం తీసుకోవాలి.
6. పీచు కలిగిన పండ్లు, కూరగాయలు, ఆహారం, ఓట్స్ తీసుకోవటం వల్ల కొలెస్ట్ట్రాల్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించవచ్చు.
డాక్టర్ హనుమంతరావు, ఎం.డి (ఆయుర్వేద),
స్టార్ ఆయుర్వేద
సికింద్రాబాద్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, విజయవాడ,
విశాఖపట్నం, తిరుపతి, హనుమకొండ, రాజమండ్రి, కర్ణాటక
ph: 8977 33 66 88 / www.starayurveda.com
కొలెస్ట్రాల్ కు తీసుకోవలసిన జాగ్రత్తలు
Published Sun, Nov 17 2013 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM
Advertisement
Advertisement