How Much Cholesterol Is Good for Health, Top 10 Health Tips for Maintain Good Cholesterol - Sakshi
Sakshi News home page

Cholesterol: శరీరంలో కొవ్వు ఎంత అవసరం? ఎంతకు మించితే ముప్పు?

Published Sat, May 14 2022 8:55 AM | Last Updated on Sat, May 14 2022 11:31 AM

How Much Cholesterol Need For Body-Health Issues Bad Cholesterol - Sakshi

ఆధునిక కాలంలో అనుసరిస్తున్న జీవన శైలి వల్ల, తినే ఆహారం వల్ల రకరకాల జబ్బులను కొని తెచ్చుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ హెచ్చుతూనే ఉంది. హృదయ సంబంధ వ్యాధులకు ప్రధానంగా ఆహార పదార్థాలతోపాటు కొలెస్ట్రాల్‌ స్థాయులు ఎక్కువ ఉండటం కూడా ఒక కారణమే. కొలెస్ట్రాల్‌ అనేది శరీరానికి అవసరమేనా? ఇది ఎంత ఉండాలి, ఎంతకంటే ఎక్కువ ఉంటే ప్రమాదం అనే విషయాల గురించి తెలుసుకుందాం.

శరీరంలో కొవ్వు పెరగడంలో ఎల్‌డిఎల్‌ది ప్రధాన బాధ్యత. ప్రతి 1 మిల్లీ గ్రాము/డి.ఎల్‌ ఎల్‌డిఎల్‌ పెరిగితే గుండెపోటు పెరిగే ప్రమాదం ఒకశాతం పెరుగుతుంది. అయితే ఎల్‌డి ఎల్‌కు ‘సాధారణ స్థాయి’ అంటూ ఏమీ లేదు. ఎల్‌డిఎల్‌ స్థాయి 100 మిల్లీ గ్రాము/డిఎల్‌కు పెరిగినప్పుడు గుండె పోటు ప్రమాదం అధికమవుతుంది. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారిలో ఎల్‌డిఎల్‌ స్థాయి 70 మిల్లీ గ్రాము/డిఎల్‌ కంటే తక్కువ ఉండాలని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.

హెడీఎల్‌ కొలెస్ట్రాల్‌ దీనినే మంచి కొలెస్ట్రాల్‌ అని అంటారు. హెచ్‌డిఎల్‌ రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్‌ను తొలగించి, కాలేయానికి పంపిస్తుంది. ఇక్కడ కొలెస్ట్రాల్‌ విచ్ఛిన్నం అవుతుంది. ‘అథిరొస్లె్కరొసిన్‌’ అనే సమస్య ఉత్పన్నం కాకుండా హెచ్‌డిఎల్‌ రక్షణగా ఉంటుంది. హెచ్‌డిఎల్‌ స్థాయి తక్కువ గా ఉందంటే, గుండె రక్తనాళాల వ్యాధి ప్రమాదం పెరుగుతున్నట్లు భావించాలి. గుండె పోటుకు బలమైన కారణం ఎల్‌డిఎల్‌ పెరగడం కన్నా హెచ్‌డిఎల్‌ తగ్గడమే. హెచ్‌డిఎల్‌ పురుషుల్లో 40 ఎంజి/ డిఎల్, మహిళల్లో 50 ఎంజి/డిఎల్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి 

ఆహార జాగ్రత్తలు
►అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని ప్రతిరోజు వంటల్లో ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్‌ సమస్యను తగ్గించుకోవచ్చు.
►అలాగే గ్రీన్‌ టీ రోజు తాగడం వల్ల కూడా చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు హెచ్‌డీఎల్‌ స్థాయిని కూడా పెంచుకునే వీలుంది.
►ఇక దనియాలు.. ఈ గింజల్లో ఫోలిక్‌ యాసిడ్, విటమిన్‌ ఏ, బీటా కెరోటిన్, విటమిన్‌ సి వంటివి ఉండటం వల్ల కొలెస్ట్రాల్‌ ప్రభావం తగ్గుతుంది. వీటిని రోజు నేరుగా తినడం అలవాటు చేసుకుంటే మంచిది.
►మెంతులు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నేరుగా తినలేము. ఎందుకంటే ఇవి రుచికి చిరుచేదుగా అనిపిస్తాయి. అందువల్ల నానబెట్టుకుని తింటే మంచిది.
►చివరిగా ఉసిరి. ఇది కొలెస్ట్రాల్‌ సమస్యకు చక్కని పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏదైనా సమస్య రాకముందే ఇలాంటివి అలవాటు చేసుకుంటే మంచిదని.. చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చని కూడా చెబుతున్నారు.
►మాంసాహారం పూర్తిగా మానేయాలి. శాకాహారం లో వేపుడు కూరలు తినరాదు. వీటి బదులు ఫైబర్‌ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే కొబ్బరి, వేరుశనగలు, నువ్వులు వంటివి తీసుకోవడం వల్ల వీటిలో ఫైబర్‌తోపాటు ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది మన శరీర నిర్మాణానికి అవసరం. 
►వరి, గోధుమ బదులు తృణ ధాన్యాలు, సిరి ధాన్యాలు తింటే కూడా చెడు కొలెస్ట్రాల్‌ బాగా తగ్గుతుంది.
►అలాగే పళ్ళు, పచ్చికూరలు తురుముకొని పెరుగులో వేసుకుని తినండి. కీర దోస, కారట్, బీట్రూట్, దోసకాయలు, బూడిద గుమ్మడి, సొరకాయ వంటివి తురుముకొని లేదా మిక్సర్‌లో వేసి పెరుగులో కలిపి తీసుకుంటే చాలా మంచిది.
►పాలకు బదులు పెరుగు, మజ్జిగ తీసుకోండి. పంచదార పూర్తిగా మానేసి తాటిబెల్లం, బెల్లం లేదా తేనె కొంచెం కొంచెం తీసుకోండి.
►ప్రతిరోజూ ఉదయం మొలకలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సలాడ్, పండ్లు తీసుకోవాలి. ఉదయం రెండు కిలోమీటర్ల నడక, ప్రాణాయామం చేయండి.

చెడు కొవ్వు తగ్గడానికి...
ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి.ఎల్‌డీఎల్‌ అనే చెడు కొవ్వులు.. డెసీలీటర్‌కు 70 మిల్లీగ్రాములకు మించకూడదు. ఎంత తక్కువ గా ఉంటే అంత మంచిది. ∙మధుమేహం ఉన్నవాళ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధాలు తీసుకోవడం తప్పనిసరి. 
►మంచి కొలెస్ట్రాల్‌ డెసిలీటర్‌కు 40 మిల్లీగ్రాములు ఉండేలా చూసుకోవాలి. ∙ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్తపడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. 
►తిండిని అదుపులో ఉంచుకోవాలి.

చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువైతే.?
శరీరంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తపోటు, ఊబకాయం, గుండె పోటు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పులు, కిడ్నీ, మెదడుకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి. అన్ని విషయాల్లో మంచి, చెడూ ఉన్నట్లే.. కొవ్వుల్లోనూ మనకు మేలు చేసేవి, చెడు చేసేవి ఉన్నాయి. చెడు కొవ్వుల్ని ఎల్‌డీఎల్‌(ఔఈఔ) అని, మంచి కొవ్వుల్ని హెచ్‌డీఎల్‌(ఏఈఔ) అని పిలుస్తారు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ తక్కువగా/అదుపులో ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement