![Are You Suffering From These Problems These Tips For You - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/27/four.jpg.webp?itok=w5MDwUtA)
ప్రస్తుతం మనం జీవిస్తున్న శైలిలో.. ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున‍్నాయి. ఈ క్రమంలో మన శరీరంలో కూడా మార్పులు సహజమే. ఆహారపు అలవాట్ల వలన గానీ, విరామం లేకుండా శ్రమించడం వలన గానీ.. శరీరంలో బరువు పెరగడం, చర్మ సమస‍్యలు, గుండె జబ్బులు రావడం, రక్తపోటుతో బాధపడటం లాంటి సమస్యలను ఎదుర్కుంటున్నాం. అయితే ఇలాంటి సమస్యల నుండి బయటపడటానికి ఈ చిన్న చిన్న హెల్త్ టిప్స్ పాటించడం తప్పనిసరి.
- బరువును అదుపులో ఉండాలంటే.. ప్రతిరోజూ రెండు చెంచాల మెంతులు రాత్రి నానబెట్టి.. తెల్లవారు జామున ఆ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
- గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు పొడి వేసి ఉదయం, సాయంత్రం తాగితే జలుబు త్వరగా తగ్గుతుంది.
- పసుపును నీటిలో కలిపి ముద్ద చేసి లేదా లేత వేపాకు గుజ్టుతో కానీ కలిపి చర్మంపై రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి.
- బెణికినప్పుడు నొప్పికి, గాయాలకు, కీళ్లవద్ద కొంచెం వాపు, నొప్పికి సున్నం, పసుపు కలిపి తేలికగా రుద్దితే మంచి ఉపశమనం కలుగుతుంది.
- పచ్చివెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి.
- మినపప్పు వెన్నుపూసకు బలాన్నిస్తుంది. అంతేకాదు మినపప్పులో ఉండే విటమిన్లు, ప్రోటీన్స్ శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఎముకల బలానికి ఇవి ఉపయోగపడతాయి. అందుకే వారానికి రెండుసార్లు వంటల్లో మినపప్పును చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
- ఆవాలు గుండెకు మేలు చేస్తాయి. శరీరానికి కావలసిన విటమిన్లు అందిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment