![People With Apple shaped Figures Have A Higher Risk Of Brain Inflammation - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/14/senior-man.jpg.webp?itok=kIm-5gBq)
లండన్ : పొత్తికడుపులో కొవ్వుతో మెదడు సంబంధిత వ్యాధులు, శరీరంలో వాపు నెలకొనే ముప్పు అధికంగా ఉందని తాజా అథ్యయనం వెల్లడించింది. పొట్ట మినహా ఇతర శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయిన వారితో పోలిస్తే పొట్టభాగంలో కొలెస్ర్టాల్ అధికంగా ఉన్న వారికి ఈ వ్యాధుల ముప్పు అధికమని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, రివర్‌సైడ్ అథ్యయనంలో వెల్లడైంది.
మహిళలతో పోలిస్తే పొట్టభాగంలో కొవ్వు పేరుకుపోయిన పురుషుల్లోనే మెదడులో వాపు ముప్పు అధికమని పరిశోధకులు గుర్తించారు. రోజూ తీసుకునే ఆహారంపై కన్నేసి ఉంచాలని, ముఖ్యంగా పొత్తికడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవాలని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ డుడికా కాస్ సూచించారు. పొత్తికడుపులో పేరుకుపోయే కొవ్వు రక్త ప్రసరణకు అడ్డంకిగా మారుతుందని, మెదడుకు రక్తసరఫరాను కూడా ఇది ప్రభావితం చేస్తుందని పరిశోధకులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment