abdominal
-
వావ్..మనవళ్ల ముందే...రికార్డులు బద్దలు కొట్టింది!
ఒక బామ్మ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మహిళల స్టమక్ ప్లాంక్స్లో గిన్నిస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. కెనడాలోని అల్బెర్టాకు చెందిన ఒక బామ్మ డోనాజీన్ వైల్డ్ ఏకంగా 4.5 గంటల పాటు పొత్తికడుపు ప్లాంక్స్ చేసింది. 2019లో కెనడియన్ డానా గ్లోవాకాతో గతంలో నెలకొల్పిన రికార్డు కంటే కేవలం 10 నిమిషాలు ఎక్కువ ప్లాంక్స్ చేసిన ఈ రికార్డును అధిగమించింది. గతంలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ఉన్నత పాఠశాలలోనే డోనాజీన్ ఈ ఘనతను సాధించడం విశేషం. దీంతో స్కూలు విద్యార్థులు, తన 12 మంది మనవళ్ల కేరింతల మధ్య ఈ రికార్డు సాధించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ టీనా షి రికార్డును పరిశీలించారు. మొదటి రెండు గంటలు త్వరగానే గడిచిపోయాయని, కానీ తర్వాతి రెండు గంటలు చాలా కష్టంగా గడిచాయని, ఇక చివరి గంటలోచుక్కలు కనిపించాయంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు డోనాజీన్. పదేళ్ల కఠిన ప్రాక్టీస్ తరువాత వరల్డ్ రికార్డ్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. విశేషం ఏమిటంటే ఆమె చేతుల్లో దీర్ఘకాలిక నొప్పి, తిమ్మిరితో బాధపడేవారు. దీన్నుంచి బయటపడేందుకు ప్రతీరోజూ ఇచేయడం మొదలు పెట్టారట. డోనాజీన్ ప్రతిరోజూ మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేసేదని, ఈ రికార్డులో భాగంగా దానిని ఆరు గంటలకు పెంచిందని చెప్పుకొచ్చారు ఆమె భర్త రాండీ. -
అరుదైన కేసు: 21 రోజుల శిశువు కడుపులో ఎనిమిది పిండాలు
రాంచీ: రాంచీలో ఒక అరుదైన ఘటన జరిగింది. జార్ఖండ్‌లో రామ్‌గఢ్ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో అక్టోబర్ 10న ఒక పాప జన్మించింది. ఐతే ఆ పాప పొట్టలో గడ్డ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే పాపకు ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో ఆ పాపను పుట్టిన 21 రోజుల తర్వాత ఆస్పత్రి తీసుకు వచ్చారు తల్లిదండ్రులు. వైద్యులు తాము మొదటగా ఆ పాప పొత్తికడుపులో తిత్తి లేదా కణితి లాంటి దాన్ని గుర్తించడంతో దాన్ని ఆపరేషన్ చేసి తొలగించాలనుకున్నాం అని చెప్పారు.. ఈ మేరకు వైద్యులు ఆ పాపకు నవంబర్1న ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. అప్పుడే తాము ఆ పాపం శరీరంలో ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది పిండాలను తీశామని చెప్పారు. ఇలాంటి కేసు చాలా అరుదు అని అన్నారు. ఎప్పుడైనా ఏదైనా జన్యు లోపం తలెత్తితే కవలల్లో ఇలా జరుగుతుందని చెప్పారు. ఒక కవల శిశువు శరీరంలోకి మరో కవల పిండం ఉండటం జరుగుతుంది. కానీ ఇలా ఏకంగా ఎనిమిది పిండలు అనేది ఇదే మొట్టమొదటి కేసు అని చెప్పారు. ఈ మేరకు డాక్టర్ ఇమ్రాన్ మాట్లాడుతూ...దీనిని ఫెటస్ ఇన్ ఫీటు(ఎఫ్ఐఎఫ్) అని పిలుస్తారు. ఎఫ్ఐఎఫ్ అనేది చాలా అరుదు, పైగా ఒక పిండం మాత్రమే ఉంటుందని ఇలా ఎనిమిది పిండాలు ఉండటం ఇంతవకు ఎక్కడా జరగలేదు. పిండాల పరిమాణం కూడా మూడు నుంచి ఐదు సెంటిమీటర్లు ఉన్నాయి. ఇలా ఐదు లక్షల జనాభాలో ఒకరికి సంభవిస్తుంది. అని తెలిపారు. ప్రస్తుతం పాపను అబ్జర్వేషన్లో ఉంచామని, వారం రోజుల్లో డిశ్చార్జ్ చేసి పంపిస్తామని వైద్యులు చెప్పారు. (చదవండి: చనిపోయిన దోమలను తీసుకుని కోర్టుకు హాజరైన గ్యాంగ్‌స్టర్) -
అమ్మాయి చెప్పే మాట వినండోసారి!
యుక్తవయసుకి వచ్చిన ప్రతి అమ్మాయికి ఉండే బాధే ఇది. అందరిదీ ఒకటే బాధ. తీవ్రతల్లోనే తేడా. ఈ బాధ ప్రపంచంలో 176 మిలియన్ల మందిని వేధిస్తోంది. ‘నాకు బాధ ఇంత తీవ్రంగా ఉంది’ అని ఏ అమ్మాయి అయినా అంటే... వెంటనే ‘మాకు మాత్రం లేదా’ అని తేలిగ్గా తీసుకుంటారు. ఆ బాధ ఎలా ఉంటుందో అమ్మకు కూడా తెలుసు. ‘ఈ వయసులో తప్పదమ్మా, భరించాల్సిందే’ అని కూతురికి సర్ది చెబుతుంది. అంతే తప్ప ఇది డాక్టర్‌కు చూపించాల్సిన సమస్య అని ఏ మాత్రం సందేహించదు. అహ్మదాబాద్‌కు చెందిన జాహ్నవి త్రివేదికి పద్నాలుగేళ్ల వయసు నుంచి మొదలైంది ఈ సమస్య. పదిహేనేళ్లపాటు కొనసాగింది. ఈ లోపు నెలకు నాలుగైదు రోజులు స్కూలుకు సెలవు పెట్టక తప్పేది కాదు. డ్రిల్ క్లాసు చేయలేనంటే ‘క్లాసులో అందరూ చేస్తుంటే నీకేంటి’ అని మాస్టర్ తిట్టేవారు. అలాగే డ్రిల్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత హోమ్‌వర్క్ చేసే ఓపిక లేక పడుకుంటే చదువు ఎగ్గొడుతోందని తల్లి చివాట్లు పెట్టేది. కాలేజ్‌కి వెళ్లిన తర్వాత కూడా దాదాపుగా అదే పరిస్థితి. హిస్టీరియా వచ్చినట్లు అరిచేది. కారణం ఏంటో తెలియక డాక్టర్లను సంప్రదిస్తూనే ఉంది. ఆమె దురదృష్టం ఏంటో కానీ జాహ్నవిని పరీక్షించిన ఏ డాక్టరూ అసలు సమస్యను గుర్తించనేలేదు. బంధువులైతే ‘ఈ పిల్ల సమస్యను భూతద్దంలో చూస్తోంది. అనవసరంగా గోల పెట్టి, పెద్దది చేస్తోంది’ అనేవాళ్లు. జాహ్నవి హయ్యర్ ఎడ్యుకేషన్‌కి విదేశాలకు వెళ్లింది. అక్కడ కూడా డాక్టర్లను సంప్రదించింది. ఫలితం మారలేదు. ఈ లోపు ముసలి వాళ్లు ‘పెళ్లయి బిడ్డ కడుపులో పడితే నొప్పి తగ్గిపోతుంది’ అని ఓ ముతక సొల్యూషన్ చెప్పేవాళ్లు. ‘ఈ నొప్పి తగ్గాలంటే నేను ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవాలా’ అని అందరి మీద గయ్‌మని లేచింది జాహ్నవి. ‘ఈ పిల్లకు పిచ్చి పట్టింది’ అని జాహ్నవి అమ్మానాన్నల కంటపడకుండా బంధువులు చెవులు కొరుక్కున్నారు. గూగుల్ చెప్పింది జాహ్నవి తన ఆరోగ్య సమస్య గురించి గూగుల్‌లో సెర్చ్ చేసింది. చేయగా చేయగా తన సమస్య ఎండోమెట్రియోసిస్ అని తెలిసింది. ఆ తర్వాత పరిజ్ఞానంతో మరో డాక్టర్ దగ్గరకు వెళ్లింది. కాకతాళీయమో ఏంటో తెలియదు. తన సమస్య, లక్షణాలు చెప్పగానే ‘ఒకసారి అబ్డామిన్ స్కాన్ చేయిద్దాం’ అన్నారా డాక్టర్. నా సమస్య ‘ఎండోమెట్రియోసిస్ డాక్టర్. దానికి ట్రీట్మెంట్ ఇవ్వండి’ అన్నది జాహ్నవి. ఆశ్చర్యంగా చూస్తున్న డాక్టర్‌తో పదిహేనేళ్లపాటు తాను అనుభవించిన కష్టాలను ఏకరువు పెట్టింది. స్కానింగ్‌లో అదే విషయం నిర్ధారణ అయింది. అమ్మ ఏడ్చింది జాహ్నవి సమస్య ఏమిటో తెలిసిన తర్వాత ఆమె తల్లి భోరున ఏడ్చింది. ఇన్నాళ్లూ పిల్ల ఎంతగా చెబుతున్నా పట్టించుకోలేదని ఆమె మనసు కదిలిపోయింది. బిడ్డ బాధను అర్థం చేసుకోవాల్సిన తల్లిని, ఇలా మొద్దుగా ఉండిపోయానెందుకో’ అని పదే పదే తలచుకుని బాధపడింది. ఇప్పుడు ఆ తల్లీ కూతుళ్లు చెప్పే మాట ఒక్కటే... ‘‘నెలసరి బాధ దాదాపుగా అందరికీ ఉంటుంది. అయితే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. తీవ్రంగా బాధ పడుతున్న వాళ్లు ప్రపంచంలో 176 మిలియన్ల మంది ఉన్నారు. కొందరికి సమస్య తీవ్రంగా ఉండదు. అలాంటి వాళ్లతో పోల్చి నొప్పి తీవ్రంగా ఉన్న పిల్లలను తప్పు పట్టవద్దు. వాళ్ల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దు అని మాత్రమే. -
20 సెం.మీ. కత్తినే మింగేశాడు..అయినా ఏం కాలేదు
ఢిల్లీ : డ్రగ్స్‌కి బానిసైన ఓ 28 ఏళ్ల యువకుడు లాక్డౌన్ కారణంగా డ్రగ్స్ అందుబాటులో లేకపోవడంతో ఏకంగా కత్తినే మింగేసాడు. అంతేకాకుండా నెలన్నరకు పైగా పొట్టలో పదునైన కత్తి ఉన్నా చాలా సాధారణంగా గడిపాడు. వైద్యులకే ఆశ్చర్యం కలిగించిన ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండటంతో ఎక్స్‌రే తీయగా 28 సెంటీమీటర్ల పదునైన కత్తి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ అరుదైన కేసును ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం యువకుని పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు. కాగా యువకుడు వంటింట్లోని కత్తిని మింగేశాడన్నా విషయం తెలిసి కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. (కుటుంబంతో డిన్నర్.. ఫొటో షేర్ చేసిన ఎమ్మెల్యే!) గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి చెందిన సర్జన్ డాక్టర్ ఎన్ఆర్ దాస్ పర్యవేక్షణలో యువకునికి మూడు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు. దీనికి సంబంధించి ఎయిమ్స్ వైద్యులు మాట్లాడుతూ..ఒక వ్యక్తి 20 సెంటీమీటర్ల కత్తిని మింగి ప్రాణాలతో బయటపడటం ఇదే మొదటికేసని వెల్లడించారు. ఇప్పటిదాకా సూది, పిస్ లాంటి చిన్న వస్తువులు మింగినవారిని చూశాం కానీ 20 సెంటీమీటర్ల కత్తి ఎక్స్‌రేలో చూసి షాకయ్యాం అని వివరించారు. ఏ చిన్న పొరపాటు జరిగినా రోగి ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని ఈ కేసుసు చాలా చాలెంజింగ్ తీసుకొని విజయవంతంగా శస్ర్తచికిత్స చేశామని డాక్టర్ దాస్ తెలిపారు. (పెళ్లి మండపంలో కోవిడ్ విలయం) -
కొలెస్ర్టాల్‌తో మెదడుకు రిస్క్..
లండన్ : పొత్తికడుపులో కొవ్వుతో మెదడు సంబంధిత వ్యాధులు, శరీరంలో వాపు నెలకొనే ముప్పు అధికంగా ఉందని తాజా అథ్యయనం వెల్లడించింది. పొట్ట మినహా ఇతర శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయిన వారితో పోలిస్తే పొట్టభాగంలో కొలెస్ర్టాల్ అధికంగా ఉన్న వారికి ఈ వ్యాధుల ముప్పు అధికమని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, రివర్సైడ్ అథ్యయనంలో వెల్లడైంది. మహిళలతో పోలిస్తే పొట్టభాగంలో కొవ్వు పేరుకుపోయిన పురుషుల్లోనే మెదడులో వాపు ముప్పు అధికమని పరిశోధకులు గుర్తించారు. రోజూ తీసుకునే ఆహారంపై కన్నేసి ఉంచాలని, ముఖ్యంగా పొత్తికడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవాలని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ డుడికా కాస్ సూచించారు. పొత్తికడుపులో పేరుకుపోయే కొవ్వు రక్త ప్రసరణకు అడ్డంకిగా మారుతుందని, మెదడుకు రక్తసరఫరాను కూడా ఇది ప్రభావితం చేస్తుందని పరిశోధకులు హెచ్చరించారు.