రాంచీ: రాంచీలో ఒక అరుదైన ఘటన జరిగింది. జార్ఖండ్‌లో రామ్‌గఢ్ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో అక్టోబర్ 10న ఒక పాప జన్మించింది. ఐతే ఆ పాప పొట్టలో గడ్డ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే పాపకు ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో ఆ పాపను పుట్టిన 21 రోజుల తర్వాత ఆస్పత్రి తీసుకు వచ్చారు తల్లిదండ్రులు. వైద్యులు తాము మొదటగా ఆ పాప పొత్తికడుపులో తిత్తి లేదా కణితి లాంటి దాన్ని గుర్తించడంతో దాన్ని ఆపరేషన్ చేసి తొలగించాలనుకున్నాం అని చెప్పారు.. ఈ మేరకు వైద్యులు ఆ పాపకు నవంబర్1న ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు.
అప్పుడే తాము ఆ పాపం శరీరంలో ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది పిండాలను తీశామని చెప్పారు. ఇలాంటి కేసు చాలా అరుదు అని అన్నారు. ఎప్పుడైనా ఏదైనా జన్యు లోపం తలెత్తితే కవలల్లో ఇలా జరుగుతుందని చెప్పారు. ఒక కవల శిశువు శరీరంలోకి మరో కవల పిండం ఉండటం జరుగుతుంది. కానీ ఇలా ఏకంగా ఎనిమిది పిండలు అనేది ఇదే మొట్టమొదటి కేసు అని చెప్పారు.
ఈ మేరకు డాక్టర్ ఇమ్రాన్ మాట్లాడుతూ...దీనిని ఫెటస్ ఇన్ ఫీటు(ఎఫ్‌ఐఎఫ్) అని పిలుస్తారు. ఎఫ్‌ఐఎఫ్ అనేది చాలా అరుదు, పైగా ఒక పిండం మాత్రమే ఉంటుందని ఇలా ఎనిమిది పిండాలు ఉండటం ఇంతవకు ఎక్కడా జరగలేదు. పిండాల పరిమాణం కూడా మూడు నుంచి ఐదు సెంటిమీటర్లు ఉన్నాయి. ఇలా ఐదు లక్షల జనాభాలో ఒకరికి సంభవిస్తుంది. అని తెలిపారు. ప్రస్తుతం పాపను అబ్జర్వేషన్‌లో ఉంచామని, వారం రోజుల్లో డిశ్చార్జ్ చేసి పంపిస్తామని వైద్యులు చెప్పారు.
(చదవండి: చనిపోయిన దోమలను తీసుకుని కోర్టుకు హాజరైన గ్యాంగ్‌స్టర్)
Comments
Please login to add a commentAdd a comment