ఢిల్లీ : డ్రగ్స్‌కి బానిసైన ఓ 28 ఏళ్ల యువకుడు లాక్‌డౌన్ కారణంగా డ్రగ్స్ అందుబాటులో లేకపోవడంతో ఏకంగా కత్తినే మింగేసాడు. అంతేకాకుండా నెలన్నరకు పైగా పొట్టలో పదునైన కత్తి ఉన్నా చాలా సాధారణంగా గడిపాడు. వైద్యులకే ఆశ్చర్యం కలిగించిన ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండటంతో ఎక్స్‌రే తీయగా 28 సెంటీమీటర్ల పదునైన కత్తి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ అరుదైన కేసును ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం యువకుని పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు. కాగా యువకుడు వంటింట్లోని కత్తిని మింగేశాడన్నా విషయం తెలిసి కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. (కుటుంబంతో డిన్నర్.. ఫొటో షేర్ చేసిన ఎమ్మెల్యే!)
గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి చెందిన సర్జన్ డాక్టర్ ఎన్ఆర్ దాస్ పర్యవేక్షణలో యువకునికి మూడు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు. దీనికి సంబంధించి ఎయిమ్స్ వైద్యులు మాట్లాడుతూ..ఒక వ్యక్తి 20 సెంటీమీటర్ల కత్తిని మింగి ప్రాణాలతో బయటపడటం ఇదే మొదటికేసని వెల్లడించారు. ఇప్పటిదాకా సూది, పిస్ లాంటి చిన్న వస్తువులు మింగినవారిని చూశాం కానీ 20 సెంటీమీటర్ల కత్తి ఎక్స్‌రేలో చూసి షాకయ్యాం అని వివరించారు. ఏ చిన్న పొరపాటు జరిగినా రోగి ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని ఈ కేసుసు చాలా చాలెంజింగ్ తీసుకొని విజయవంతంగా శస్ర్తచికిత్స చేశామని డాక్టర్ దాస్ తెలిపారు. (పెళ్లి మండపంలో కోవిడ్ విలయం)
Comments
Please login to add a commentAdd a comment