
పూర్వకాలంలో పౌరాణిక కథలను ఇలా తోలుబొమ్మలాటలతోనే చెప్పేవారు. అప్పట్లో టీవీలు, రేడియోలు అందుబాటులో లేని కాలంలో ఇవి ఎక్కువగా ఉండేవి. ప్రస్తుత తరానికి మన టీవీల పుణ్యమా అని పంచతంత్ర వంటి ధారావాహికల కారణంగా వాటి గురించి తెలుసుకుంటున్నారు. చెప్పాలంటే చిన్నారులు ఇష్టంగా చూసే కార్టూన్ ఛానెల్స్ మాదిరిగా ఆ రోజుల్లో తోలుబొమ్మలాటలుండేవి. ఇప్పుడు కృత్రిమ మేథాదే హవా అనుకోకండి. ఎందుకంటే ఇప్పడు పాతదిగా అనిపించినా ఒకప్పుడది కొత్తది. దీనిక ప్రస్తుతం ఆదరణ పెరుగి ట్రెండ్‌గా మారుతోంది. స్కూల్క్, కోన్ని కల్చరల్ కార్యక్రమాలు జరిగే చోట ఈ కళా ప్రదర్శనకు అవకాశం ఇస్తున్నారంటే మన పూర్వకాలంనాటి కళలకు ప్రాముఖ్యత ఉందనే కదా అంటుంటారు అనురూప రాయ్. ఆమె వలనే ఈకళ సజీవంగా ఉందని చెప్పొచ్చు. ఎవరామె..? ఆమె ఎలా ఈ రంగంలోకి వచ్చింది తదితరాల గురించి తెలుసుకుందామా..!.
ఢిల్లీకి చెందిన అనురూప రాయ్ ఆరేళ్ల వయసు నుంచే ఈ తోలుబొమ్మలాట అంటే మహాఇష్టం. ఆ ఇష్టంతోనే ఆ తోలుబొమ్మలను కొనుక్కుని మరీ జాగ్రత్తగా చూసుకునేది. ఆ ఇష్టం ఆమె వయసుతోపాటు పెరిగిందే గానీ తగ్గలేదు. ఒకప్పుడూ 80లలో బాగా ట్రెండ్‌గా ఉండే ఈ తోలుబొమ్మలాటని సజీవంగా ఉంచాలని ఆరాటపడింది. విద్యాపరంగా ఇలాంటి తోలుబొమ్మల కళారంగం ఎంచుకుంటావా అని విమర్శలు వచ్చినా ధైర్యంగా ఈ రంగంలోకి అడుగుపెట్టిందామె.
అందరూ ఫిల్మ్ స్కూల్స్‌లో జాయిన్ అయితే అనురూప తోలుబొమ్మలాటకు సంబంధించిన కళారంగ సంస్థల్లో జాయిన్ అయ్యింది. అలా ఆ రంగం గురించి కూలంకషంగా నేర్చుకుని ఆ విద్యకే కాదు ఆ కళకే ప్రాణం పోసిందామె. ఆ కళను సజీవంగా ఉంచేలా "కథక్కథ పప్పెట్ ఆర్ట్స్ ట్రస్ట్"ని స్థాపించి కళాకారులను ఒక వద్దకు తీసుకొచ్చి ప్రదర్శనలిస్తున్నారామె. ఈ ప్రదర్శనకు మొదటి విమర్శకులు పిలలేలని అంటారామె. ఎందుకంటే కథ నచ్చకపోతే మధ్యలోంచి వెళ్లిపోతారు కాబట్టి నచ్చేలా చక్కటి కథనే ఎంచుకుని ప్రదర్శనలిస్తామన్నారు.
ఈ ట్రస్ట్ ప్రదర్శనలు ఇవ్వని విరామ సమయాల్లో ప్రదర్శనకు సంబంధించిన పరిశోధనతో పాటు, ప్రేక్షకులను పెంచుకోవడం వంటి వాటిపై దృష్టిసారిస్తారు. అలాగే పండుగలు, సమావేశాలకు వెళ్లడం, సమాజం వెలుపల ఉన్న వ్యక్తులతో మాట్లాడి ప్రేక్షకాదరణ పొందేలా ప్రయత్నాలు చేయడం వంటివి చేస్తారని చెప్పారు అనురూప.
ఈ ట్రస్ట్‌కి అంతర్జాతీయ ఉత్సవాలు, గ్యాలరీలు, మ్యూజియంల ప్రదర్శనల ద్వారా నిధులు ఉత్పత్తి అవుతాయి. వారి స్టూడియో ఢిల్లీలోని బాదర్‌పూర్ సరిహద్దులో ఉంది. ఇది నగరానికి, ఒక గ్రామానికి మధ్య ఉంటుంది. అందుకే అనురూప కిటికీలు తెరిచి తమ ప్రదర్శన కోసం రిహార్సల్ చేస్తుంటారట. కనీసం అలా అయినా గ్రామంలోని పిల్లలకు అదేంటో తెలుసుకునే వీలు ఉంటుందనే చిన్న ఆశ అంటారామె.
కథలకే కాదు అలా కూడా..
ఈ తోలు బొమ్మలాట అనగానే కేవలం పంచతంత్ర వంటి కథలనే కాదు. సామాజిక అవగాహన కార్యక్రమాలు కూడా ప్రదర్శిస్తారట. అలా ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి పనులు, సామాజిక సేవ గురించి ప్రజలకు తెలియజేస్తుంది. అంతేగాదు ఇటీవల అనురూప తన బృందంతో మధ్యప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో రుతు కార్యక్రమంపై అవగాహన కల్పించే అద్భుత ప్రదర్శన ఇచ్చింది.
తోలుబొమ్మలాటతో ఇలాంటి సామాజికి అవగాహన కార్యక్రమాలు కూడా ప్రదర్శించొచ్చని చూపించింది. ఆమె కృషి పలితంగా న్యూఢిల్లీలో కొద్దోగొప్పో తోలుబొమ్మలాట కళాకారులు ఉండటం విశేషం. అంతేగాదు రాజాధానిలో ఈ తోలుబొమ్మల విద్యను నేర్చుకునే పాఠశాల కూడా ఉందట. ఇందులో జైపూర్, పూణే, మధురై, బర్ధమాన్ తదితరప్రాంతాలకు చెందని విద్యార్థులు ఉన్నారు. వాళ్లంతా ఈ కళను నేర్చుకుని సొంతంగా సంస్థను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
అంతేగాదు తన సంస్థే త్వరలో అంతర్జాతీయ తోలుబొమ్మల చిత్రోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. చలనచిత్రోత్సవంకి మించి ఎక్కువ ప్రదర్శనలిస్తారట. వాటిలో తమిళనాడుకి సంబంధించిన షాడో తోలుబొమ్మలాట ప్రధాన ఆకర్షణగా ఉంటుందట. ఇంకో విశేషం ఏంటంటే అనురూప గ్రామన్నే రాజధానికి తీసుకొచ్చేలా తన తోలుబొమ్మలాటతో గ్రామీణ దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించనుంది. ఇది సాయంత్రం నుంచి మొదలై తెల్లవారుజాము వరకు ఉంటుందని చెబుతున్నారామె.
ఆ కార్యక్రమం వచ్చేనెల ఏప్రిల్ 4 నుంచి 6 వరకు ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరుగునుందని చెప్పారు అనురూప రాయ్. కనుమరుగైపోతున్న కళను ఎంచుకోవడమే సాహసం, పైగా దానికి ఊపిరి పోసి సజీవంగా ఉండేలా చేయడం అంటే మాటలు కాదుకదా..!.
(చదవండి: