నీనా జాకబ్, దిపాలి గుప్తా, మానికా శ్రీవాస్తవ్.... ఈ ముగ్గురు కళాకారులు వారి కళాత్మక ప్రయాణాలు,సృజనాత్మక ప్రక్రియల గురించి తెలుసుకోవాలంటే బెంగుళూరు ఇంటర్నేషనల్ సెంటర్ ను సందర్శించాలి. సమాజంలో కళాభిమానాన్ని మెరుగుపరచడానికి ఔత్సాహిక కళాకారులకు సలహాలనూ అందిస్తున్నారు. వీరి కళలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న సంస్కృతులు ప్రతిబింబిస్తాయి.
కళాత్మక ప్రయాణం... మానికా శ్రీవాస్తవ్
ఢిల్లీ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నప్పుడు స్నేహితులు, బంధువుల కోసం ఆర్ట్‌వర్క్‌లను ప్రారంభించింది మానికా శ్రీ వాస్తవ్. ‘పెళ్లయ్యాక కూడా ఈ కళా ప్రయాణం ఏమీ ఆగిపోలేదు. క్లబ్బులు, కాఫీ షాపుల వంటి చోట్ల నా పనితనాన్ని చూపడం మొదలుపెట్టాను. 1990 ప్రారంభంలో ఢిల్లీలో నా మొదటి పెయింటింగ్ ప్రదర్శన జరిగింది.
ఎక్కడ ఉన్నా, ప్రయాణాల్లోనూ, నా గది మూలల్లోనూ నా కళకు ఊపిరి΄ోస్తూనే ఉంటాను. ఆ ప్రయత్నం విదేశాల్లోనూ సోలో, గ్రూప్ షోలకు దారితీసింది. హ్యూస్టన్, దుబాయ్, బెంగళూరులోనూ ప్రదర్శనలు ఇచ్చాను. ఇన్నేళ్లలో ఏ రోజూ నా నుంచి సృజనాత్మక పని ఆగలేదు. 30ఏళ్లుగా ఈ పనిని కొనసాగిస్తూనే ఉన్నాను‘ అని గర్వంగా చెబుతుంది శ్రీవాస్తవ్.
ప్రత్యేకమైన శైలి.. దిపాలి గుప్తా
సింగపూర్‌లోని ప్రఖ్యాత ఇరానియన్ మాస్టర్ అలీ ఎస్మాయిల్ వద్ద శిక్షణ పొందింది దిపాలి గుప్తా 16 ఏళ్లుగా అక్కడే ఉంది. ‘చాలా ప్రయోగాల తర్వాత, నాదైన ప్రత్యేకమైన శైలిని అభివృద్ధి చేశాను. ఇది బోల్డ్, అసాధారణమైనది. చాలా వరకు సంప్రదాయ పెయింటింగ్ నియమాలను ఉల్లంఘిస్తారు. నేను కొల్లాజ్ టెక్నిక్‌ని ఇష్టపడతాను. అశాంతిగా ఉండే, చెదిరిన ప్రపంచాన్ని వివరించే వార్తాపత్రికలలోని సారాంశానికి ఒక రూ΄ాన్ని తీసుకువస్తాను. నా పనిలో ఎప్పుడూ ఒక అంతర్లీన సూక్ష్మ సందేశం ఉంటుంది’ అని వివరిస్తారు గుప్తా.
కేరళకు చెందిన నీనా జాకబ్ తనను తాను సెమీ–అబ్‌స్ట్రాక్ట్ ఫిగ్రేటివ్ ఆర్టిస్ట్‌గా అభివర్ణించుకుంటుంది. ‘నా చిత్రణలో చాలా వరకు కాంతి, నీడల దోబూచులాట ఉంటుంది. సామాజిక మార్పుకు నడిపించే కళ అత్యంత శక్తిమంతమైనదని నమ్ముతాను. డ్రాయింగ్, స్కెచింగ్, ఫోటోలు తీయడం, గమనించడం నా పరిశోధనలో ఉంటాయి. ఒక్కోసారి నా కళలో ఎంబ్రాయిడరీని వాడాలనుకుంటాను. అలాంటప్పుడు దారాన్ని ఉపయోగిస్తాను.
ప్రేక్షకులు కేవలం అందమైన చిత్రాన్ని ఆరాధించడం మాత్రమే కాదు. కళాకారుడి కథలో నిమగ్నమవ్వాలి. నా కుంచె రంగులను అద్దడానికే కాదు రాయడానికి కూడా ఉపయోగిస్తాను. ధ్యాన పదాలు, కవిత్వం కూడా నా కుంచె రాస్తుంటుంది. ఈ పని ద్వారా ఆధ్యాత్మికతకు చేరువవుతాను. నా సొంత శైలిని అభివృద్ధి చేయడానికి దారితీసే దశలు ఇవి’అని శ్రీవాస్తవ్ జతచేస్తుంది.
దేశ, విదేశాల్లో జరిగే ప్రదర్శనలలో వీరి ఆర్ట్ ఫ్రేమ్స్‌కు ధర రూ. 10,000 నుండి లక్షల రూపాయల వరకు పలుకుతాయి. ఆ మొత్తాలను స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలకూ అందజేస్తుంటారు. కళ ద్వారా తమ మహోన్నతమైన మనసునూ చాటుకుంటున్నారు.
(చదవండి: అత్యంత అందమైన రహదారి 'రోడ్ టు హెవెన్'..!)
Comments
Please login to add a commentAdd a comment